Jagganna Thota
-
కోనసీమ: జగ్గన్నతోట ప్రభల తీర్థంలో అపశ్రుతి
సాక్షి, కోనసీమ జిల్లా: జగ్గన్నతోట ప్రభల తీర్థం(Jagganna Thota Prabhala Theertham)లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండ్లు(Bullock carts) జనంలోకి దూసుకెళ్లడంతో బాలుడు సహా ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కూటమి నేతల కుటుంబ సభ్యుల కోసం ఎడ్ల బండ్లు ఏర్పాటు చేశారు. జనం నడవటానికే ఖాళీ లేని చోట ఎడ్ల బండ్లను ఏర్పాటు చేయడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, కోనసీమలో సంక్రాంతి నుంచి మక్కనుమ తరువాత రోజు వరకూ అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుగుతాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 84 వరకూ ప్రభల తీర్థాలు నిర్వహిస్తారని అంచనా. సంక్రాంతి రోజున జరిగే తొలి ప్రభల తీర్థం కొత్తపేటదే. కనుమ రోజున నిర్వహించే.. మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ప్రత్యేకత ఉంది. కనుమ రోజున జరిగే తీర్థంలో 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థానికి తరలివస్తాయి.మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఇదీ చదవండి: నెమలి ‘పుంజు’ తడాఖా.. పందెంలో ‘కోటి’ గెలిచిన కోడిగంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే ఎగువ కౌశికను దాటుకుని వచ్చే తీరు నయనానందకరంగా ఉంటుంది. తీర్థానికి చాలా మంది ఇప్పటికీ గూడు బండ్లపై రావడం సంప్రదాయమే. ఈ తీర్థానికి 50 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. వాకలగరువు సోమేశ్వరస్వామి, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, గున్నేపల్లి రామలింగేశ్వరస్వామి ప్రభలు 45 అడుగులు, 43 అడుగుల ఎత్తున నిర్మిస్తారు.మామిడికుదురు శివారు కొర్లగుంటలో జరిగిన ఈ తీర్థానికి సైతం అరుదైన గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రభలు పంట కాలువలు, పచ్చని పొలాల మధ్య నుంచి తరలి వస్తుంటాయి. తీర్థానికి మామిడికుదురు, నగరం, పాశర్లపూడి, ఈదరాడ, పెదపట్నం గ్రామాల నుంచి 17 ప్రభలు వస్తాయి. పెదపట్నం నుంచి 12 ప్రభలు కొర్లగుంట తీర్థానికి రావడం గమనార్హం. వీటితోపాటు అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలుచోట్ల ప్రభల తీర్థాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. -
కోనసీమలో విశిష్టమైన జగ్గన్న తోటలో కోలాహలంగా ప్రభల తీర్థం
-
Prabhala Teertham 2024 Photos: కోనసీమ జిల్లాలో కన్నుల పండువగా ప్రభల తీర్థం (ఫొటోలు)
-
జగ్గన్నతోట ప్రభల తీర్థానికి పెద్దసంఖ్యలో తరలివస్తోన్న భక్తులు
-
కోనసీమ తేజం.. జగ్గన్నతోటలో పరమ శివుడి ప్రభల ఉత్సవం (ఫొటోలు)
-
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో కోనసీమ ‘ప్రభల శకటం’
సాక్షి, న్యూఢిల్లీ, అంబాజీపేట: దేశ రాజధానిలో ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాదశ రుద్రుల ప్రభల శకటం ఎంపికైంది. సంక్రాంతి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే వేడుకలు, పంటలు చేతికి అందే సమయంలో రైతన్నల ఆనందోత్సాహాలను ప్రతిబింబించేలా శకటం ముస్తాబవుతోంది. కోనసీమలో కనుమ రోజు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను వివరిస్తూ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు రాష్ట్రపతికి లేఖ పంపారు. ప్రభల ఉత్సవంపై వారు రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందిస్తూ నాలుగు శతాబ్దాలుగా ప్రభల వేడుక నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో గ్రామీణ ప్రాంతాలు పట్టుగొమ్మలుగా నిలుస్తున్నాయని అభినందించారు. ఇదీ విశిష్టత ఏకాదశ రుద్రులను కనుమ రోజు దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఏటా సంక్రాంతి మర్నాడు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థానికి 410 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లోకకళ్యాణం కోసం పెద్దాపురం సంస్ధానాధీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో 17వ శతాబ్ధంలో తొలిసారిగా ఇక్కడ నిర్వహించారు. ప్రభల ఉత్సవానికి మరో స్థల పురాణం కూడా ఉంది. 17వ శతాబ్ధంలో శివభక్తుడైన జగ్గన్న ఇక్కడున్న పెద్ద మర్రిచెట్టు కింద నిత్యం ధ్యానం చేసుకునేవాడట. పూజలపై పెద్దాపురం సంస్ధానాధీశులు అభ్యంతరం తెలపడంతో జగ్గన్న నేరుగా హైదరాబాద్‌లో ఉండే నవాబును కలిసి ఆయన మెప్పు పొందారట. నవాబు 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా ఇచ్చి అక్కడే శివ పూజ చేసుకునేందుకు జగ్గన్నకు అనుమతి ఇచ్చారు. కాలక్రమేణ ఆ ప్రాంతం జగ్గన్నతోటగా ప్రసిద్ధికెక్కినట్లు స్థల పురాణం చెబుతోంది. జగన్నాధ మహారాజుకు పరమేశ్వరుడు కలలో కనిపించి ప్రభల తీర్థం నిర్వహించమని, ఆదేశించడంతో జగ్గన్నతోట ప్రభల తీర్ధంగా పేరు వచ్చినట్లు ప్రచారం కూడా ఉంది. -
నేడు జగ్గన్నతోట ప్రభల తీర్థం
అమలాపురం/ అంబాజీపేట: సంక్రాంతంటే.. భోగి మంటలు.. కొత్తవస్త్రాలు.. ధాన్యం కుచ్చులు.. పిండివంటలు.. కోడి పందేలు మాత్రమే కాదు. అబ్బురపరిచే ప్రభల తీర్థాలు కూడా. ఈ తీర్థాలకు పైరు పచ్చని సీమ కోనసీమ వేదికవుతోంది. సంక్రాంతి సమయంలో కోనసీమ వీధుల్లో నడయాడుతున్న ఇంద్రధస్సులా తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదేమో. సీమలో జరిగే ప్రభల తీర్థాలకు వందల ఏళ్ల పురాణ చరిత్ర ఉంది. పెద్ద పండగ నాడు మొదలై... ముక్కనుమ, ఆ తరువాత రోజు వరకు కోనసీమ నలుమూలల సుమారు 90 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. వీటిని చూసేందుకు స్థానికులు.. జిల్లా వాసులే కాదు.. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తుల తరలివస్తారు. ఇక్కడ జరిగే ప్రభల తీర్థాలు రాజులు.. బ్రిటిష్ పాలనల్లో సైతం నిరాటంకంగా కొనసాగాయి. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కారణంగా ఈసారి ఆంక్షల నడుమ ప్రభల తీర్థాలు జరగనున్నాయి. చదవండి: పలకరింపే పులకరింపైతే.. ప్రతిరోజూ పండగే ఏకాదశ రుద్రుల కొలువు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ఐదు శతాబ్ధాల చరిత్ర ఉంది. నాలుగు గ్రామాల శివారులోని ఒక కొబ్బరితోటలో సాగుతుంది. కనుమపండగ నాడు జరిగే తీర్థంలో మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా జరిగే సమావేశానికి వ్యాఘ్రేశ్వరస్వామి అధ్యక్షతవహిస్తారు. స్వామివారి ప్రభ తీర్థానికి వచ్చే సమయంలో మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి దింపుతారు. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే పెద్ద కౌశికను దాటుకు వచ్చేతీరు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. ఇదే మండలం వాకలగరువు, తొండవరం గ్రామంలో ఏటా ఒకరికొకరు పోటీ పడుతూ 42 అడుగులకు పైబడి ఎత్తులో ప్రభలు నిర్మిస్తారు. -
జగ్గన్నతోటలో కొలువు దీరనున్న ఏకరుద్రులు
సాక్షి, కాకినాడ: కోనసీమలో ప్రభల తీర్థం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కనుమ పండగను పురస్కరించుకుని అంబాజీపేట మండలం మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో గురువారం ఏకాదశరుద్రులు కొలువుదీరనున్నారు. ఈ మేరకు పదకొండు గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్న తోటకు ఊరేగింపుగా బయలు దేరాయి. ఏకాదశ రుద్రులను చూసేందుకు జనం వేలాదిగా తరలి వస్తున్నారు. కాగా ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా కోనసీమలోని జగ్గన్నతోట తదితర ప్రాంతాల్లో ఈ ప్రభల తీర్థాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కనుమ నాడు జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం కోసం చర్చిస్తారని ప్రతీతి. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. చదవండి: ప్రభల తీర్థాన్ని తిలకించేందుకు పోటెత్తిన జనం జగ్గన్నతోట ప్రభల తీర్థంపై స్పెషల్ స్టోరీ -
జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని కనుమా!
మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, పవిత్రమైన ప్రభల తీర్థం. జగ్గన్నతోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు, అంతా కొబ్బరితోటలే. ఏకాదశ రుద్రులు కొలువు తీరడం వలన జగ్గన్నతోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను, చారిత్రాత్మక విశిష్టతను సంతరించుకున్నది. ఏకాదశ రుద్రుల కొలువు లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు (జగ్గన్న) గారు ప్రభల తీర్థానికి విచ్చేసి, ఏకాదశ రుద్రులను దర్శించి, ప్రభల తీర్ధం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషి సల్పినారనీ, నాటి జగ్గన్న పూజల ఫలితంగానే ప్రభల తీర్థం జరిగే ప్రదేశం ‘జగ్గన్న’ తోటగా ప్రసిద్ధికెక్కిందని చారిత్రాత్మక కథనం. ప్రభల తీర్థం రోజున ఏకాదశ రుద్ర గ్రామాలలో కొలువున్న స్వామి వార్లు గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు– చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం–వ్యాఘ్రేశ్వరస్వామి, పెదపూడి– మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక–కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు–చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల–రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి–చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు–అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్లను ప్రభలపై మేళతాళాలతో, భాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో జగ్గన్నతోటకు ఊరేగింపుగా తీసుకొని రావడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రభల తీర్థానికి ఆతిథ్యమిచ్చు మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి అన్ని ప్రభలకన్నా ముందుగా జగ్గన్న తోటకు చేరుకొని, ప్రభలు అన్నింటికీ ఆహ్వానం పలికి తిరిగి వెళ్ళేవరకూ ఉండటం సాంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభల తీర్ధం లోనికి ప్రవేశించినపుడు మిగిలిన రుద్ర ప్రభలను ఒకసారి పైకి లేపడం సంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ప్రత్యేకవిశిష్టతను సంతరించుకున్న గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు–చెన్నమల్లేశ్వరస్వామి వార్ల ప్రభావాహనాలను కౌశికలో నుండి అవతలి ఒడ్డుకు చేర్చడం వంటి రమణీయ దృశ్యాలు చూడటానికి రెండు కన్నులూ చాలవు. ముఖ్యంగా జగ్గన్న తోట ప్రభల తీర్థంలో ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండి, అన్ని ప్రభల కన్నా ఆఖరుగా వచ్చే గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వరస్వామి ప్రభావాహనం తీర్ధంలోనికి వచ్చేవరకూ మిగిలిన ప్రభలు కూడా వేచి ఉండటం విశేషం. నిండు ప్రవాహంలో విశ్వేశ్వరస్వామి వారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కన్నులారా తిలకించే భక్త జన సందోహ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. అలా ఏక కాలంలో ఏకాదశ రుద్రులను ఒకే వేదికపై దర్శించి, తరించే భాగ్యం మరి ఏ ఉత్సవాలలోనూ కలగదు. నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -

జగ్గన్నతోటలో వైభవంగా ప్రభలతీర్ధం
అంబాజీ పేట (తూర్పు గోదావరి జిల్లా) : అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ప్రభలతీర్ధం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. తోటలో కొలువుదీరిన ఏకదశ రుద్రులను దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.