ముగిసిన కోటి బిల్వార్చన మహాయాగం
కొత్తపేట :
కొత్తపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయ ప్రాంగణం వేదికగా వందరోజులు సాగిన కోటి బిల్వార్చన మహాయాగం ఆదివారం ముగిసింది. వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసుల రామచంద్రశర్మ (రాంబాబు), వేదపండితుడు మైలవరపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ వంద రోజులూ సుమారు 150 మంది దంపతులు వివిధ పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. ఆఖరిరోజు ఆదివారం జిల్లాలో పలువురు ప్రఖ్యాత వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, పూజలు చేశారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. సుతాపల్లి లక్ష్మీనారాయణరావు, సత్యవరపు గంగాధరరావు, శ్రీఘాకోళ్లపు సూరిబాబు, నంభూరి రెడ్డియ్య, సత్యవరపు జమీందార్, తమ్మన సాయిప్రసాద్, పచ్చిపులుసు కృష్ణారావు పాల్గొన్నారు.