Maha Sankalpam
-
బొమ్మగాని ధర్మభిక్షం నేటితరానికి ఆదర్శం
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞానకేంద్రం: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. ధర్మభిక్షం మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించడంలో ఆదర్శప్రాయులని కొనియాడారు. ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాల్లో భాగంగా.. నిర్వహణ కమిటీ, తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆధ్వర్యంలో ‘మహాసంకల్పం’పుస్తకావిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థ ఏర్పడని సమయంలోనే ధర్మభిక్షం విద్యార్థులకు వసతి గృహాలను ఏర్పాటు చేశారని, వాటిలో ఉంటూ ఎందరో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అలంకరించారని గుర్తుచేశారు. ఎమ్మె ల్యేగా, ఎంపీగా ఐదుసార్లు చట్టసభలకు వెళ్లిన ధర్మభిక్షం, సాధారణ జీవితాన్ని గడిపారన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ధర్మభిక్షం స్వస్థలం సూర్యాపేటలో మహా సంకల్పం పుస్తక చర్చను నిర్వహిస్తామని తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15న రవీంద్రభారతిలో నిర్వహించనున్న ధర్మభిక్షం శతజయంతి సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ప్రొఫె సర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ, ధర్మభిక్షం అచ్చమైన ప్రజల మనిషి అని కొనియాడారు. ధర్మభిక్షం అంటేనే పోరాటం.. శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ, మహాసంకల్పం పుస్తకం చదివితే ధర్మభిక్షం గురించి నేటి తరానికి తెలుస్తుందన్నారు. ప్రజా గాయకురాలు విమలక్క మాట్లాడుతూ, ధర్మభిక్షం, బండ్రు నరసింహులు గురించి మాట్లాడడం అంటేనే ప్రజా పోరాటాల గురించి మాట్లాడడమన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ, ధర్మభిక్షం మానవతా ఉద్యమతార అని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహంలాగా ‘మహా సంకల్పం’పుస్తకం ఒక రూపాన్ని నిర్మించిందన్నారు. కార్యక్రమంలో పుస్తక సంకలనకర్త, అరసం రాష్ట్ర కార్యదర్శి కేవీఎల్, అరసం కార్యనిర్వహక కార్యదర్శి పల్లేరు వీరస్వామి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ, సినీ దర్శకుడు బాబ్జి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘మహాసంకల్పం’పుస్తక ముద్రణకు సహకరించిన బూర మల్సూర్ గౌడ్‌ను జ్ఞాపికతో సత్కరించారు. -
రవిచంద్ర దీక్షితులును 15 రోజులపాటు తప్పించిన టీటీడీ
సాక్షి, తిరుమల : వంశపారంపర్య అర్చకత్వం చేస్తున్న రవిచంద్ర దీక్షితులను టీటీడీ విధుల నుంచి తప్పించింది. వంశపారపర్యంగా అర్చకత్వ విధులు నిర్వర్తిస్తోన్నా.. తమను విధుల నుంచి తప్పించడంపై రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో విధులకు హాజరుకాకపోవడంతో నోటీసులు జారీ చేసినట్టు టీటీడీ పేర్కొంది. మహా సంప్రోక్షనకు హాజరు కాకపోవడానికి గల కారణాలను రవిచంద్ర వివరించినప్పటికి.. కారణాలు సంతృప్తికరంగా లేవంటూ రవిచంద్రను అర్చకత్వ విధుల నుంచి తప్పించినట్టు టీటీడీ తెలిపింది. రవిచంద్ర దీక్షితుల నుంచి 15రోజుల పాటు అర్చకత్వం విధులనుంచి తప్పించింది. -
ముగిసిన మహాసంప్రోక్షణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకో సారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలా లయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ముగిసింది. తమ విజ్ఞప్తి మేరకు సహ కరించిన భక్తులందరికీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధా కర్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రుత్వికులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్ర మాన్ని దిగ్విజయంగా నిర్వహించారని వారు కొని యాడారు. టీటీడీ నిర్ణయించిన సమయాల్లో యాగ శాల కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తులు ఎంతో క్రమశిక్షణతో స్వామివారిని దర్శించు కున్నారన్నారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఆగమ సలహా మండలి సూచనల మేరకు పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ సమక్షం లో, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో వైభవంగా మహాసంప్రోక్షణ కార్య క్రమాన్ని నిర్వహించామన్నారు. 44 మంది రుత్వి కులు, 100 మంది వేద పండితులు ఈ క్రతువులో పాల్గొన్నారని తెలిపారు. ఆగస్టు 11–15 వరకు మొత్తం 1.35 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారన్నారు. మహాసంప్రోక్షణ క్రతువు పూర్తయినందున 17వ తేదీ శుక్రవారం నుండి స్వామివారి సేవలు ప్రారంభమవుతాయని భక్తులు శ్రీవారి దర్శించుకోవచ్చన్నారు. -
టీటీడీ అధికారులపై తిరుపతి ఎమ్మెల్యే ఆగ్రహం
తిరుమల: మహా సంప్రోక్షణ సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రశ్నించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళితే ఆలయం ముందు ఉన్న బయోమెట్రిక్ ఎంట్రెన్స్ దగ్గర వెళ్లి కనుక్కోవాలని చెప్పారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సన్నిథిలోని ల్యాండ్ లైన్‌కు కాల్ చేస్తే ఈ రోజు అనుమతి లేదని, రేపు రమ్మన్నారని అధికారులు తెలపడంతో ఆమె ఆగ్రహం చెందారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఆలయ ప్రవేశానికి అనుమతి ఉందా లేదా..? స్వామి వారి మహా శాంతి తిరుమంజనానికి ఆలయంలో ఉన్న మహా భక్తులు ఎవరో తమకు చూపించాలని ఆమె మండిపడ్డారు. ఈ సంఘటనపై టీటీడీ చైర్మన్, ఈఓ ఇతర మహా భక్తులకు ఎలా ఆహ్వానం ఇచ్చరో తనకు తెలియాలని నిలదీశారు. తనకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. 2006లో జరిగిన సంప్రోక్షణను తాము అప్పటి ఎమ్మెల్యే వెంకటరమణతో కలిసి చూశామన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ ఆలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు నచ్చజెప్పారు. బోర్డు సభ్యులను కూడా ఎవరూ పిలవలేదని పేర్కొన్నారు. దీనిపై ఆవేదన చెందాల్సిన పనిలేదని గురువారం ఉదయం స్వామివారి దర్శనానికి తీసుకెళుతామని తెలిపారు. -
నేటితో ముగియనున్న మహా సంప్రోక్షణ
-
నేటితో ముగియనున్న మహా సంప్రోక్షణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ గురువారంతో ముగియనుంది. నేడు ఉదయం 10 : 16 గంటల నుంచి 12 గంటల లోపు తులాలగ్నం శుభముహూర్తంలో స్వామివారి మూలమూర్తిలో 48 జీవకళలను మళ్లీ ప్రవేశపెట్టి మహాసంప్రోక్షణ క్రతువును ముగిస్తారు. మహాసంప్రోక్షణకు ఈనెల 11వతేదీ రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. 12వ తేదీన ఆలయంలో వైదిక కార్యక్రమాలను వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 45 మంది రుత్వికులు, 20 మంది యాగ పారాయణదారులు, 50 మంది పురాణ పఠనదారులు, 40 మంది దివ్య ప్రబంధనదారులు వైదిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి సేవలందించారు. శాస్త్రోక్తంగా తిరుమంజనం మహాసంప్రోక్షణంలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం శ్రీవారి మూలమూర్తికి ఇతర పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోపురాల కలశాలను అద్దంలో తిలకించి వాటి ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, శ్రీ గరుడాళ్వార్, శ్రీవరదరాజస్వామి, శ్రీభాష్యకారులు, శ్రీ యోగనరసింహస్వామివారికి, ధ్వజస్తం భం, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి గోపురాల కలశాలకు పవిత్ర జలం, పాలతో అభిషేకం చేశారు. వాస్తు హోమం.. మహాసంప్రోక్షణ మొదటి ఘట్టంలో ఉదయం స్వామివారికి నిర్వహించే సేవల అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలు వెలిగించారు. పుణ్యాహవచనం అనంతరం వాస్తుహోమం చేశారు. దేహ శుద్ధి కోసం ఆకల్మషా హోమాన్ని అర్చకులు నిర్వహించారు. ప్రాతఃకాలంలో ప్రత్యేక హోమాలు, పూజలు జరిగాయి. ఈ కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేశారు. 12 గంటల నుంచి శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించారు. రాత్రి 7 గంటలకు వైదిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. రాత్రి 9 గంటలకు వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం ముందుగా కలకర్షణ కార్యక్రమం చేశారు. అష్టదిక్కుల్లో సంధి బంధనం వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారు చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. శ్రీవారి మూలమూర్తితోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు. 8 రకాల ద్రవ్యాలతో.. ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారు చేస్తారు. వీటిలో శంఖచూర్ణం 25.5 తులాలు, మధుజ (తేనెమైనం) 3.5 తులాలు, లాక్షా(లక్క) 3.75 తులాలు, గుగ్గులు(వక్షపు బంక) 9 తులాలు, కార్పాసం(ఎర్ర పత్తి) 1 తులం, త్రిఫలం(ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ) 7.5 తులాలు, రక్తశిలాచూర్ణం (గైరికము) 7.5 తులాలు, మాహిష నవనీతం (గేదె వెన్న) 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలుంటాయి. ఆగమోక్తంగా అష్టబంధనం సమర్పణ గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన గరుడాళ్వార్, పోటు తాయార్లు, వరదరాజస్వామి, యోగ నరసింహస్వామి, విష్వక్సేన, భాష్యకార్లు, వేణుగోపాలస్వామి, బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు. అధివాసం... విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేసేందుకు అధివాసం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయి. విగ్రహరూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరిన కోరికలు తీరడంతోపాటు మానసిక శాంతి చేకూరుతుంది. అధివాసం రకాలు శాస్త్రాల ప్రకారం ఆలయాల ప్రాణప్రతిష్ఠ సమయంలో క్షీరాధివాసం, జలాధివాసం, ఫలాధివాసం, ఛాయాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయనాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. క్షీరాధివాసం... శ్రీవారి మూలమూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకం చేయడాన్నే క్షీరాధివాసం అంటారు. ’క్షీరసాగర తరంగ శిఖర సార తరకిత చారుమూర్తే’ అంటూ ముకుందమాల స్తోత్రంలో శ్రీకులశేఖరాళ్వార్ క్షీరాధివాసం వైశిష్ట్యాన్ని తెలియజేశారు. -
తిరుపతి ప్రయాణం వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయే తిరుపతి రైళ్లు, బస్సుల్లో రద్దీ తగ్గిపోయింది. మహా సంప్రోక్షణ ప్రభావంతో నగరవాసులు తిరుపతి ప్రయాణం వాయిదా వేసుకోగా.. చాలామంది రద్దు చేసుకున్నారు. తిరుపతి సమీప ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారు, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం, ఇతర పనులపై తిరుపతి వైపు వెళ్లే వారు మినహా భక్తుల రద్దీ మాత్రం తగ్గిపోయింది. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి తిరుపతికి తిరిగే రైళ్లలో వెయిటింగ్ లిస్టు గణనీయంగా తగ్గింది. ప్రతిరోజు 150 నుంచి 180 వరకు వెయిటింగ్ లిస్టుతో దర్శనమిచ్చే నారాయణాద్రి, వెంకటాద్రి వంటి రైళ్లలో రెండు రోజుల క్రితం ప్రయాణికులు అప్పటికప్పుడు స్లీపర్ క్లాస్ బెర్తులు (కరెంట్ బుకింగ్) బుక్ చేసుకొని మరీ వెళ్లడం తగ్గిన రద్దీకి అద్దం పడుతోంది. మహా సంప్రోక్షణ పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆ తరువాత ఒక్కసారిగా రద్దీ పెరిగే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే ఈ నెల 16వ తేదీ మహా సంప్రోక్షణ అనంతరం బయలుదేరే రైళ్లలో మాత్రం వెయిటింగ్ లిస్టు వందల్లోనే కనిపించడంగమనార్హం. రెగ్యులర్ రైళ్లకూ తగ్గిన డిమాండ్ తిరుపతికి వెళ్లే అన్ని రైళ్లలోనూ సాధారణంగా ఒక బెర్తుకు 10 మంది ప్రయాణికులు ఎదురు చూస్తారు. కానీ మహా సంప్రోక్షణ నేపథ్యంలో ఒక సీటుకు ఒకరు మాత్రమే ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. దీంతో పలు రైళ్లలో వెయిటింగ్ లిస్టు బాగా తగ్గిపోయింది. నగరం నుంచి ప్రతి రోజు ఆరు రైళ్లు రెగ్యులర్‌గా తిరుపతి వెళ్తాయి. మరో నాలుగు హైదరాబాద్ నుంచి తిరుపతి మీదుగా ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి. నాగర్సోల్–మద్రాస్, కాచిగూడ–మంగళూరు, శబరి ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–చెంగల్పట్టు రైళ్లతో పాటు క్రిష్ణా, రాయలసీమ, సెవెన్‌హిల్స్, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రైల్లో సుమారు 1500 మంది రిజర్వేషన్ ప్రయాణికులు, మరో 300 మందికి పైగా జనరల్ ప్రయాణికులు ఉంటారు. సిటీ నుంచి బయలుదేరే రైళ్లలోనే ప్రతి రోజు సుమారు 18,000 మంది ఉంటారు. మరో 50 వేల మంది వెయిటింగ్ జాబితాలో ఉంటారు. ప్రస్తుతంసంప్రోక్షణ దృష్ట్యా వెయిటింగ్ జాబితా అన్ని రైళ్లలో కలిపి 10 వేల వరకు ఉంది. కొన్ని రైళ్లలో కరెంట్ బుకింగ్‌కు కూడా అవకాశం ఉండడం గమనార్హం. తిరుపతికి తిరిగే రైళ్లలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం చాలా అరుదని రైల్వే అధికారులు చెబుతున్నారు. బస్సుల్లోనూ అదే పరిస్థితి.. తెలంగాణ ఆర్టీసీతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ప్రతి రోజు 40 బస్సులు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, కూకట్పల్లి, అమీర్‌పేట్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల నుంచి తిరుపతికి వెళుతుంటాయి. ఇంచుమించు ప్రైవేట్ బస్సులు కూడా ఇదే స్థాయిలో ఉంటాయి. సంప్రోక్షణతో ఈ రెండు సర్వీసుల్లోనూ ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో సాధారణంగా ప్రతిరోజు 3000 నుంచి 5000 మంది తిరుపతికి వెళుతుంటారు. ప్రస్తుతం ఈ సంఖ్య 1500 దాటలేదు. వీరిలోనూ తిరుపతి మీదుగా వెళ్లే వారు, చుట్టుపక్కల ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ముందస్తు బుకింగ్‌లు 30 శాతానికి పడిపోయినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న మొదలైన మహా సంప్రోక్షణ 16వ తేదీ వరకు కొనసాగుతుంది. అప్పటికి ఆర్టీసీ సుమారు రూ.30 లక్షల మేర ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
తిరుమలలో ఆగమోక్తంగా అష్టబంధన సమర్పణ
-
ఆగమోక్తంగా అష్టబంధన సమర్పణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణలో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా అష్టబంధన సమర్పణ జరిగింది. ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన గరుడాళ్వార్, పోటు తాయార్లు, వరదరాజస్వామి, యోగ నరసింహస్వామి, విష్వక్సేన, భాష్యకార్లు, వేణుగోపాలస్వామి, బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు. ఆనందనిలయ విమానం, ధ్వజస్తంభం శుద్ధి పనులను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు పరిశీలించారు. ధ్వజస్తంభ శిఖరానికి అలంకరించేందుకు రూ.1.5 లక్షల విలువైన 11 నూతన బంగారు రావి ఆకులను, పీఠానికి, స్తంభానికి మధ్య ఉంచేందుకు రూ.4 లక్షల విలువైన బంగారు చట్రాన్ని, విమాన వేంకటేశ్వర స్వామికి అలంకరించేందుకు రూ.1.75 లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని టీటీడీ సిద్ధం చేసింది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి, తరువాత శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు మహాశాంతి తిరుమంజనం చేపడతారు. రాత్రి యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
అష్టబంధన ద్రవ్యాల సేకరణ
సాక్షి, తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పన్నెండేళ్లకో సారి గర్భాలయంలోని మూలమూర్తి పటిష్టత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా దృఢంగా ఉండేందుకు నిర్వహించే మహాసంప్రోక్షణలో భాగంగా సోమవారం రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. ఉ.6 నుంచి మ.12 వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 10 వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారుచేస్తారు. మంగళవారం ఉదయం శ్రీవారి మూలమూర్తితోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనానికి ద్రవ్యాల మోతాదు ఇలా.. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. వీటిలో శంఖచూర్ణం 25.5 తులాలు, మధుజ (తేనె మైనం) 3.5 తులాలు, లాక్షా(లక్క) 3.75 తులాలు, గుగ్గులు(వృక్షపు బంక) 9 తులాలు, కార్పాసం(ఎర్ర పత్తి) 1 తులం, త్రిఫలం(ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ) 7.5 తులాలు, రక్తశిలా చూర్ణము(గైరికము)7.5 తులాలు, మాహిష నవనీతము(గేదె వెన్న) 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత.. శంఖ చూర్ణంతో చంద్రుడిని, తేనె మైనంతో రోహిణీ, లక్కతో అగ్ని, గుగ్గులుతో చండ, ఎర్ర పత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిని, గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని ఆరాధిస్తారు. ముందుగా ఈ ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి 30 నిమిషాలపాటు బాగా దంచుతారు. అది పాకంగా మారుతుంది. ఇది చల్లబడిన తరువాత ముద్దగా చేసుకోవాలి. దీనిని గంటకు ఒకసారి చొప్పున 8 సార్లు కావలసినంత వెన్నను చేరుస్తూ దంచాలి. ఈ విధంగా వచ్చిన పాకాన్ని ముద్దలుగా తయారుచేస్తారు. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కల తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం క్యూలైన్లో ఉన్న భక్తులతో జేఈవో శ్రీనివాసరాజు ముచ్చటించారు. దర్శనానికి పడుతున్న సమయం, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, మంగళవారం సుమారు 20వేల మందికి స్వామివారి దర్శనం లభించే అవకాశం ఉంది. నేటి కార్యక్రమాలు.. కుంభంలో వున్న శ్రీవారికి యాగశాలలో ఉదయోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి విశేష హోమాలు నిర్వహిస్తారు. హోమాలు నిర్వహించే సమయంలోనే ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధన ద్రవ్యం తయారుచేస్తారు. అనంతరం పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కల అష్టబంధనాన్ని సమర్పిస్తారు. -
ఘనంగా ప్రారంభమైన మహా సంప్రోక్షణ
-
ఘనంగా మహా సంప్రోక్షణ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం నిత్య ఉదయోత్సవాల అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకులు, జీయంగార్లు, రుత్వికులు యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 6 గంటలకు హోమగుండాలను వెలిగిం చారు. నూతనంగా యాగశాల నిర్మాణం జరిగినం దున రుత్వికులు ముందుగా పుణ్యాహవచనం కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం వాస్తుహోమం నిర్వహించి పంచద్రవ్య ప్రసన్న హోమాదులు నిర్వ హించారు. దేహశుద్ధికోసం ఆకల్మష హోమం అనంతరం ప్రాతఃకాలంలో ప్రత్యేక హోమాలు, పూజలు కొనసాగించారు. ఈ కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేశారు. 12 గంటల నుంచి శ్రీవారి ఆలయంలోకి భక్తులను విడతల వారీగా అనుమతించారు. సాయంత్రం 6 గంటలకు దాదాపు 15వేల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి మరోమారు వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 9 గంటలకు ప్రథమ ఘట్టం మొదలైంది. వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం ముందుగా కలకర్షణ కార్యక్రమం చేశారు. అందులో భాగంగా మూలవర్ల బింబంలోని స్వామి వారి దివ్యశక్తిని, అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేశారు. ఈ కుంభాలతో పాటు భోగశ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మల యప్పస్వామివారు, ఉగ్ర శ్రీనివాసమూర్తి, చక్రత్తా ళ్వార్, సీతా లక్ష్మణ సమేత శ్రీరాములవారు, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూ ర్తులను యాగశాలలోకి వేంచేపు చేశారు. అలాగే ఉప ఆలయాల్లోని జయవిజయులు, ధ్వజ స్తంభం, విష్వ క్సేనుడు, గరుడాళ్వార్, ప్రసాదం పోటులోని అమ్మ వారు, లడ్డూపోటులోని అమ్మవారు, భాష్యకారులు, యోగ నరసింహస్వామి, వేణుగోపాలస్వామివారు, బేడి ఆంజనేయస్వామివారి శక్తిని కూడా కుంభంలోకి ఆవాహన చేసి యాగశాలకు తీసుకెళ్లి వేంచేపు చేశా రు. దీంతో మొదటి రోజు కార్యక్రమం పూర్తయింది. ఆలయ ముఖద్వారం వద్ద ప్రత్యేక అలంకరణ వెలవెలబోయిన తిరుమల క్షేత్రం.. మహా సంప్రోక్షణ కారణంగా నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రం లేక బోసిపోయింది. శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తామని టీటీడీ అధికారులు ప్రచారం చేయడంతో భక్తులు రావడం మానుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. అన్నప్రసా దాల క్యూల్లోనూ భక్తులు కనిపించలేదు. బంగారు కూర్చ సిద్ధం శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారుకూర్చను 300 గ్రాముల బంగారంతో టీటీడీ తయారు చేయించింది. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతో పాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్టిస్తామని తిరుమల జేఈఓ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. -
‘మహా’ క్రతువుకు అంకురార్పణ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆదివారం నుండి 16వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని అదనపు పరకామణి ప్రాంతంలో సంప్రోక్షణ కోసం యాగశాలలను సిద్ధం చేశారు. శ్రీవారి మూలవర్లకు 5, ద్వారపాలకులకు 1, విమాన వేంకటేశ్వర స్వామికి 1, శ్రీగరుడాళ్వార్‌కు, ఆలయ గోపురానికి కలిపి 2, శ్రీ వరదరాజస్వామి, ఆలయ గోపురానికి కలిపి 2, అన్నప్రసాద పోటు తాయారీకి 1, పడిపోటు తయారీకి 1, శ్రీ విష్వక్సేనుల వారికి 1, భాష్యకార్లకు 1, శ్రీ యోగనరసింహస్వామి వారికి, ఆలయ గోపురానికి కలిపి 2, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వారికి 1, శ్రీ బేడి ఆంజనేయస్వామి వారు, ఆలయ గోపురానికి కలిపి 2, ఇతర వాస్తు హోమగుండాలు కలిపి మొత్తం 28 హోమగుండాలను ఏర్పాటుచేశారు. ఘనంగా సేనాపతుల ఉత్సవం ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆలయంలోని శ్రీ విష్వక్సేనుల వారికి హారతి ఇచ్చి ఆలయ ప్రదక్షిణగా వసంత మండపానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల నుండి ప్రారంభమైన సేనా«పతుల ఉత్సవం 9 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వసంత మండపం వద్ద మేదిని పూజ నిర్వహించారు. అక్కడ పుట్ట మన్ను సేకరించి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలోని పాలికల్లో నవధాన్యా లు పోసి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. రుత్విక్ వరణం ఆలయంలో శనివారం ఉదయం రుత్విక్ వరణం జరిగింది. 44 మంది రుత్వికులు, 16 మంది సహాయకులు, ఇతర వేదపారాయణ దారులు శ్రీవారి ఆజ్ఞ తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు రుత్వికులకు యాగగుండాల వద్ద స్థానాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా స్వామివారు ఆశీర్వదించిన దీక్షా వస్త్రాలను రుత్వికులకు అందజేశారు. ఐదు రోజుల పాటు జరిగే యాగశాల కార్యక్రమాల్లో ఈ దీక్షా వస్త్రాలను రుత్వికులు ధరించనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, ఓఎస్డీ పాల శేషాద్రి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, బొక్కసం సూపరింటెండెంట్ గురురాజారావు తదితరులు పాల్గొన్నారు. -
దేశ నలుమూలల నుండి తిరుమల చేరుకున్న వేద పండితులు
-
మహాసంప్రోక్షణతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకోసారి నిర్వహించే బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి ఈరోజు (శనివారం) సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. అనంతరం 12 నుంచి 16వ తేదీ వరకు బాలాలయ మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ సందర్భంగా వైకుంఠ నాథుడైన శ్రీవారి ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ వరకు అన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తారు. మహాసంప్రోక్షణ కార్యక్రమం నేపథ్యంలో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. నేటి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దర్శన వేళలు.. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు.. తిరిగి ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు.. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు. మొత్తం 14 గంటల్లో సుమారు 50 వేల మంది దర్శనం చేసుకుంటారని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 17 నుంచి శ్రీవారి సేవలు యథావిధిగా మొదలౌతాయని పేర్కొన్నారు. మహాసంప్రోక్షణ కారణంగా భక్తుల రద్దీ తగ్గిందని అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు. కాగా, తిరుమలలో వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. -
గోవింద విరామం!
-
నేటి నుంచి తిరుమలలో మహాసంప్రోక్షణ
-
మహాసంప్రోక్షణకు అంకురార్పణ నేడే
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు వైభవంగా ప్రారంభం కానుంది. వైఖానస ఆగమాన్ని పాటించే అన్ని వైష్ణవాలయాల్లో లోక సంక్షేమం కోసం ప్రతి 12 ఏళ్లకోసారి ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలోని యాగశాలలో 28 హోమగుండాలు ఏర్పాటుచేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో 44 మంది రుత్వికులు, వంద మంది వేద పండితులు, ధర్మగిరి వేద పాఠశాల నుంచి 20 మంది వేద విద్యార్థులు పాల్గొంటారు. వేద పండితులు చతుర్వేద పారాయణం, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత పారాయణం చేస్తారు. 1958, ఆగస్టు నెలలో విళంబినామ సంవత్సరంలో శ్రీవారి ఆలయ విమాన సంప్రోక్షణ, స్వర్ణకవచ తాపడం జరిగింది. సరిగ్గా 60 ఏళ్ల తర్వాత అదే విళంబినామ సంవత్సరంలో మహాసంప్రోక్షణ జరుగుతుండడం విశేషం. అన్ని ఆర్జిత సేవలు రద్దు మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16 వరకు రూ.300.. సర్వదర్శనం.. దివ్యదర్శనం టోకెన్ల పంపిణీని నిలిపివేయనున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు (వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు) రద్దయ్యాయి. సంప్రోక్షణకు 8 టన్నుల పూలు ఇదిలా ఉంటే.. మహాసంప్రోక్షణకు ఎనిమిది టన్నుల పూలను ఉపయోగించనున్నారు. సంప్రోక్షణ ప్రారంభం నుంచి ముగింపు వరకు సర్వాంగసుందరంగా పుష్పాలంకరణ చేయనున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కర్నూలు, సేలంకు చెందిన పలువురు భక్తులు కట్ ఫ్లవర్స్‌ను దేవునికి విరాళంగా సమర్పించనున్నారు. బోసిపోయిన తిరుమల మహాసంప్రోక్షణ పురస్కరించుకుని స్వామి వారికి పూజా కైంకర్యాలు, వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉన్నందున దర్శన సమయాన్ని టీటీడీ కుదించింది. అలాగే, మహాసంప్రోక్షణపై విస్తృత ప్రచారం చేయడంతో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. టైంస్లాట్, కాలినడక కౌంటర్ల క్యూ నిర్మానుష్యంగా మారింది. ఐదు కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ బోసిపోయింది. మహా సంప్రోక్షణ వివరాలు.. శనివారం ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం జరుగుతుంది. దీన్నే ఆచార్యవరణం లేదా రుత్విక్ వరణం అంటారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వసంత మండపం వద్ద పుట్టమన్ను సేకరించి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం చేపడతారు. - 12వ తేదీ ఉదయం 6 గంటల తరువాత ఒక హోమ గుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తు హోమం, రక్షాబంధనం చేస్తారు. రాత్రి 9 గంటల తరువాత కళాకర్షణలో భాగంగా గర్భాలయంతోపాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతోపాటు అందరు దేవతల ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో రోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉ. 6 గంటల నుంచి హోమాలు నిర్వహిస్తారు. - 13న విశేష హోమాలతోపాటు అష్టబంధన ద్రవ్యం తయారుచేస్తారు. ఆగస్టు 13, 14వ తేదీల్లో గర్భాలయంతోపాటు ఉప ఆలయాల్లో అష్టబంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనం గురించి భగుప్రకీర్ణాధికారం, విమానార్చన ప్రకల్పం గ్రంథాల్లో వివరించి ఉంది. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా అష్టబంధనాన్ని సమర్పిస్తారు. - 15న ఉదయం కైంకర్యాల అనంతరం మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట తరువాత గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేపడతారు. ఉత్సవమూర్తులకు యాగశాలలోనే అభిషేకం చేస్తారు. -16 ఉ.10.16 నుండి 12 గంటలలోపు కళావాహన చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి మూలమూర్తికి, విమాన గోపురానికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు, గోపురాలకు తిరిగి కుంభంలోని శక్తిని ఆవాహన చేస్తారు.ఆ తరువాత ఆరాధన, నైవేద్యం, అక్షతారోపణం, బ్రహ్మఘోష, అర్చక బహుమానం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంతో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగుస్తుంది. సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు పెద్దశేష వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. గరుడ పంచమి సందర్భంగా అదేరోజు రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది. -
తిరుమలలో మహాసంప్రోక్షణకు రేపే అంకురార్పణ
-
తిరుమలలో 11 నుంచి మహాసంప్రోక్షణ
తిరుమల: శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16 వరకు జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మంగళవారం తనిఖీ చేశారు. ఆలయంలో జరుగుతున్న యాగ గుండాల ఏర్పాటు పనులను పరిశీలించారు. యాగశాల వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ కోసం జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ ఆరు రోజుల్లో భక్తులకు కల్పించాల్సిన దర్శనం, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించినట్టు చెప్పారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల నిర్వహణ వల్ల దర్శన సమయం తక్కువగా ఉంటుందని, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామ న్నారు. ఆగస్టు 17 నుంచి యథావిధిగా భక్తులు పూర్తి సమయం స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. ఇక్కడి అన్నమయ్య భవనంలో ఆలయ ప్రధానార్చ కులు, పలు విభాగాల అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం జేఈవో మాట్లాడుతూ ఆగస్టు 11న అంకురార్పణతో అష్టబంధన బాలాల య మహాసంప్రోక్షణ ప్రారంభమవుతుందన్నారు. ఈ ఆరు రోజుల్లో ఎలాంటి సేవా టికెట్లు, ప్రత్యేక దర్శన టోకెన్లు జారీ చేయడం లేదన్నారు. భక్తులను ఆయా రోజుల్లో సామర్థ్యానికి అనుగుణంగా క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలోకి అనుమతిస్తామన్నా రు. ఆగస్టు 11న మొదటిరోజు దర్శనానికి సంబంధించి ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటలకు భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలిపారు. తర్వాత రోజుల్లో నిర్దేశించిన సమయానికి మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. -
మహాసంప్రోక్షణ సమయంలో లక్షా 92వేల మందికి దర్శనం
-
టీటీడీ మహాసంప్రోక్షణపై హైకోర్టులో విచారణ
-
టీడీపీ మాహాసంప్రోక్షణనుపై హైకోర్టులో విచారణ
-
నల్లకుంటలో శతారుద్ర మహాయాగం
-
సీపీఎం జాతీయ మహాసభలకు ఏర్పాట్లు పూర్తి
-
పౌరహక్కుల సంఘం ప్రథమ మహాసభలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం ప్రథమ మహాసభలను బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ నెల 7,8 తేదీల్లో(శని, ఆదివారం) జరుగనున్నాయి. ప్రజాఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ఆదివాసులపై అధర్మ యుద్ధాలు, బూటకపు ఎన్కౌంటర్లు అనే అంశాలపై ఈ సభలో చర్చించనున్నారు. దేశంలో మతోన్మాదం, మతతత్వం, దళితులపై దాడులు, ఆదివాసులను అడవినుంచి తరిమివేయడం, ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, ఉద్యమాలను అణచివేయడం, ప్రపంచ బ్యాంక్ ఎజెండాను ఇక్కడ అమలు పరచడం, జైళ్లలో ఉండే ఖైదీల హక్కులు లాంటి సమస్యలపై అతిథులు ప్రసంగించనున్నారు. ఈ సభకు అరుంధతి రాయ్, సోని సోరి, ప్రొఫెసర్ నందిని సుందర్, ఫ్రొఫెసర్ కాత్యాయనీ, ఫ్రొఫెసర్. హరగోపాల్, ఫ్రొఫెసర్. శేషయ్య పాల్గొననున్నట్లు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఫ్రొఫెసర్. గడ్డం లక్ష్మణ్, నారయణ రావులు ఓ ప్రకటనలో తెలిపారు. -
పోరాటాలకు సిద్ధంకండి
నల్లగొండ: దేశంలో జరుగుతున్న ఆర్థిక దోపిడీ, సామాజిక దౌర్జన్యం, కుల ద్వేషాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆ దిశగా మహాసభల్లో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం నల్లగొండలో సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఏర్పాటైన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) దేశానికి దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. సామాజిక, కుల, వర్గ పోరాటాలను బీఎల్ఎఫ్ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఎరుపు–నీలం రంగులు కలిసొచ్చి పోరాడటం అభినందనీయమన్నారు. ‘నల్లగొండ అంటే ఎర్రకొండ’అని.. ఈ ప్రాంతం నుంచి ఆరంభమైన వర్గ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ‘కార్పొరేట్’కు కేంద్రం దాసోహం కార్పొరేట్ శక్తులు, ధనికులకు మేలు జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందని, పేదలపై మరింత పన్నుల భారం పడనుందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. రుణ భారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. ఆ దిశగా నిర్ణయాలు తీసుకోకపోగా కార్పొరేట్‌కు సంబంధించి రూ.2 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని విమర్శించారు. ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకే ప్రధాని మోదీ అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే కొత్త ఎత్తుగడ వేస్తున్నారని, ఈ విధానాన్ని సీపీఎం వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం ఆకాంక్ష నెరవేరాలంటే బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని అన్నారు. మైనార్టీలు, దళితులు, బీసీలపై బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు దాడులు చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయమే బీఎల్ఎఫ్ ఎజెండా: తమ్మినేని సామాజిక న్యాయమే ఎజెండాగా బీఎల్ఎఫ్ కార్యాచరణ ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా దోపిడీకి గురవుతున్న వారిలో 98 శాతం మంది బహుజనులేనని.. వారు ఉమ్మేస్తే ఆ సునామీలో ఇతర పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. బంగారు తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని.. అయితే ‘బహుజన తెలంగాణ’బీఎల్ఎఫ్ అంతిమ లక్ష్య మని స్పష్టం చేశారు. అంతకుముందు మేకల అభినవ్ స్టేడియం నుంచి సభాప్రాంగణం వరకు రెడ్‌షర్ట్ వలంటీర్ల ర్యాలీ నిర్వహించారు. -
యాగప్రసాదం అందుకున్న వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ముందుకు సాగుతున్న వేళ.. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. ఆరిమండ వరప్రసాద్ రెడ్డి యాగం నిర్వహిస్తున్నారు. ఎన్నికల దాకా ఈ మహారుద్ర సహిత సహస్ర చండి యాగ మహోత్సవం కొనసాగుతుంది. ఈ మహోత్సవంలో భాగంగా 28-01-2018 తేదీన ద్విశత రుద్రహోమం, త్రిశత చండీహోమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించిన జగన్‌ను వరప్రసాద్‌రెడ్డి కలిసి ప్రసాదం అందజేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. -
సడలని సంకల్పం మనది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలోనే ఇన్ని వేల కిలోమీటర్లు, ఇన్ని నెలల పాటు జరగబోయే పాదయాత్ర ‘ప్రజా సంకల్పం’ కాబోతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తన పాదయాత్రకు అవరోధాలు సృష్టించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు శాడిస్టిక్‌గా సీబీఐ, ఈడీని వాడుకోవడం కూడా చూస్తున్నామన్నారు. గురువారం పార్టీ నేతల విçస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను కోర్టుకు వెళ్లినప్పుడల్లా చూస్తూ ఉంటాను... అక్కడ చాలా మంది కోర్టుకు హాజరు కానే కారు. హాజరు నుంచి మినహాయింపు పొంది రాకుండా ఉంటారు. కానీ నా విషయంలో ఇంకా ట్రయల్ కూడా మొదలు కాలేదు. ఇంకా డిశ్చార్జి స్థాయిలోనే ఉంది. అయినా కూడా నా ఒక్కడి విషయంలోనే కఠినంగా వ్యవహరిస్తున్నారు. నా విషయం వచ్చేటప్పటికి సీబీఐ లేచి నిలబడుతోంది... ఈడీ లేచి నిలబడుతోంది. కఠినంగా వ్యవహరిస్తోంది... నేనేదో పరుగెత్తి పోతున్నట్లు... దేశమే విడిచి పోతున్నట్లు... వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు.. సీబీఐ, ఈడీల ద్వారా ఒత్తిడి తెచ్చి అడ్డుకుంటున్నారు. యాత్ర జరగకూడదనే కుయుక్తులు పన్నుతున్నారు. కానీ మన సంకల్పం చాలా గట్టిది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడైతే యాత్ర ఆగుతుందో... అక్కడి నుంచి వచ్చి కోర్టుకు హాజరై ఆ తరువాత మళ్లీ ఆగిన చోట నుంచే మొదలు పెడదాం. సడలని సంకల్పంతో యాత్రను పూర్తి చేస్తాం. ప్రజలు ఆశీర్వదిస్తారు... పై నుంచి దేవుడు చూస్తున్నాడు..’ అని జగన్ పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై నాపై వేసిన కేసులవి.... ‘నా మీద కేసులు ఎపుడొచ్చాయి...? దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ నాపై కేసులు లేనే లేవు. ఆయన చనిపోయిన తరువాత నేను సోనియాగాంధీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాతనే కక్ష సాధింపుతో కేసులు వేశారు. కాంగ్రెస్–టీడీపీ రెండూ కలసి కుమ్మక్కై నాపై వేసిన కేసులవి. చంద్రబాబు ఏకంగా అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎలా విప్ జారీ చేసి అవిశ్వాసం నెగ్గకుండా కాపాడారో ప్రజలంతా చూశారు. తెలంగాణలో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో టేపుల సాక్షిగా అడ్డంగా దొరికి పోయినా కేసుల్లేకుండా దేశంలో కొనసాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు’ అని జగన్ తెలిపారు. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది: మాజీ జడ్జి క్రిష్టప్ప ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేత, జనంలోకి వెళ్లి సమస్యలను తెలుసుకోవాల్సిన వ్యక్తికి కోర్టు హాజరు నుంచి మినహాయింపు రాక పోవడం ప్రజాస్వామ్యంలో తలదించుకోవాల్సిన విషయమని జిల్లా కోర్టు మాజీ జడ్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి మారక్కగారి క్రిష్టప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతటి కరుడుగట్టిన నేరస్థుడికైనా, డెకాయిట్కైనా సీఆర్పీసీ 205 ప్రకారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు లభిస్తుందని, అలాంటి ఒక ప్రజాదరణ గల నేతకు అనుమతి లభించక పోవడం పట్ల ప్రజలంతా చర్చించుకుంటున్నారన్నారు. న్యాయవర్గాల్లో, మేధావి వర్గంలో జగన్‌కు మినహాయింపు లభించని విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కేసులు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరు కాకుండా 205 సీఆర్పీసీ కింద మినహాయింపు పొందిన టీడీపీ నేతల వివరాలను జిల్లాల వారీగా సేకరించాలని సూచించారు. చంద్రబాబునాయుడుపై అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టులో ఒక కేసుందని చెప్పారు. జగన్‌పై అన్యాయంగా కక్ష సాధిస్తున్న తీరును చూసి తట్టుకోలేకే తాను పదవీ విరమణ చేశాక వైఎస్సార్ సీపీలో చేరానని వివరించారు. జగన్‌ను తొక్కాలని చూస్తున్నారని, అయితే ఆయన్ను ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడని వ్యాఖ్యానించారు. -
వైరల్.. పోర్న్ స్టార్‌తో నటుడి కొడుకు
సాక్షి, సినిమా : బాలీవుడ్ లెజెండరీ నటుడు, డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో సినిమాలకు, రాజకీయాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన మహాక్షయ్ చక్రవర్తి .. హీరోగా మాత్రం విఫలం అయ్యాడు. 2015 లో ఇష్కేదార్రియాన్ చిత్రంతో పలకరించినప్పటికీ అది డిజాస్టరే అయ్యింది. దీంతో తర్వాత అతనికి అసలు అవకాశాలే రాలేదు. అయితే బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్న మహాక్షయ అక్కడ ఓ మహిళతో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ పోర్న్ స్టార్ కైడెన్ క్రాస్. అందం మరియు నిజాయితీ ఆమె సొంతం అంటూ అడల్ట్ స్టార్‌తో దిగిన ఫోటోను సంతోషంగా షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోపై కొందరు కాస్త తేడా కామెంట్లు చేశారనుకోండి. ఇదిలా ఉంటే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మాతగా మారి తొలిసారి బుల్లితెరపై నిర్మిస్తున్న ఓ షోలో మహాక్షయ్ నటించబోతున్నాడు. ప్రముఖ మల్లయోధుడు ది గ్రేట్ గామా(గులాం మహ్మద్ భక్ష్) బయోపిక్ ఆధారంగా అది తెరకెక్కుతోంది. -
లోకకల్యాణార్థం మహాయజ్ఞం
సలకంచెరువు (శింగనమల) : లోక కళ్యాణార్థం ఇక్కడ మహాయజ్ఞం, కలశ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పర్మ సమస్థానమ్ పీఠాధిపతి యోగి మునేశ్వరి ఉద్బోధించారు. మండలంలోని సలకంచెరువు గ్రామ శివాలయంలో బుధవారం పర్మపిత శ్రీవెంకటరమణాచారి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పర్మపిత గురుదేవులు ఐదో ఆరాధన పురస్కరించుకుని 109 మంది జంటలతో కలశ పూజ, హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పర్మ పీఠాధిపతి యోగి మునేశ్వరి సమక్షంలో హోమాలు, కలశ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 109 మంది జంటలతో కలశపూజ, హోమం చేయించారు. వీటివల్ల సకల శుభకార్యాలు, ఈప్రాంతం సుభిక్షంగా కావడం కోసం పూజలు చేపట్టినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ట్రస్టు వైస్ చైర్మన్ ఆశోక్‌కుమార్, కార్యదర్శి రామాంజనేయాచారి, మల్లికార్జున, నాగభూషణం, మణిజ్ఞానశ్రీ దేవాలయం పూజారి శ్వర్థనారాయణ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి
భీమవరం టౌ¯ŒS : విచిత్ర జాతిని విద్యావ్యవస్థ సృష్టిస్తుంటే విద్యార్థి సంఘాలు చూçస్తూ ఊరుకోవంటూ హా¯Œ్స ఇండియా చీఫ్ ఎ డిటర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. భీమవరం ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 21వ మహాసభల్లో భాగంగా శుక్రవారం ముఖ్య అతిథిగా నాగేశ్వర్ మాట్లాడారు. విద్యాసంస్థలు సమాజం గురించి ఆలోచించే మెదళ్లను తయారు చేయలేనప్పుడు విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విద్యారంగంలో వెనుకబడ్డాయన్నారు. బలమైన ప్రజా ఉద్యమా లు, సామాజికాభివృద్ధి ద్వారానే విద్యారంగం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చే ప్రతి చర్యనూ సమర్థిస్తామని, ఇందుకు విరుద్ధమైన ప్రతి చర్యనూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చా రు. పాలకులు విద్యాహక్కు చట్టాన్ని కూ డా నీరుగార్చుతున్నారని ఆందోళన వ్యక్త ం చేశారు. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు విద్యావ్యాప్తికి దోహదపడదన్నారు. దాడులను ప్రశ్నించకూడదా..! సింగపూర్, చైనా, జపాన్, అమెరికాలను చూసి నేర్చుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని నాగేశ్వర్ అన్నారు. యూనివర్సిటీలు ఎలా ఉన్నాయనడానికి వేముల రోహిత్, కన్హయ్య సంఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. దాడులను విద్యార్థులు ప్రశ్నించకూడదనే భావనలో పాలకులు ఉన్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు జనం బారులు తీరి ఉంటుండగా ఈ విషయంపై ఉస్మానియా వర్సిటీలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. విద్యావిధానంలో, విద్యా సమాజంలో మార్పునకు విద్యార్థి సంఘాలు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేధావులను తయారు చేసే కేంద్రంగా విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆకాంక్షించారు. పేదలకు ఉన్నత విద్య దూరం ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు మ తోన్మాదులకు నిలయాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ పోరాటాలు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌సింగ్, జాతీయ మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఉపాధ్యక్షుడు పి.రవికుమార్, మంతెన సీతారాం, కె.హరికిశోర్, బి.సాంబశివ, పి.తులసి, ఎల్.చిన్నారి, కె.మహేష్, రాజు, పి.కిరణ్, ఎంవీ రమ ణ, ఎ.అశోక్, కె.ఆంజనేయులు, కె.క్రాం తి తదితరులు పాల్గొన్నారు. -
జయ కోసం ప్రత్యేక యాగం చేసిన వైద్యులు
-
హక్కుల సాధనకు ఐక్య ఉద్యమం
కంకిపాడు : హక్కుల సాధనకు రజక వృత్తిదారులు ఐక్యంగా ఉద్యమించాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య పిలుపునిచ్చారు. రజకవృత్తిదారుల సంఘం తూర్పు కృష్ణా జిల్లా 3వ మహాసభలు కంకిపాడులోని కోదండ రామ కల్యాణ మండపంలో ఆదివారం జరిగాయి. చిక్కవరపు వెంకట రెడ్డియ్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో భాస్కరయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించారని విమర్శించారు. రజక ఫెడరేషన్‌కు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు పైబడిన వృత్తిదారులకు నెలకు రూ.2,500 పింఛను ఇవ్వాలన్నారు. ఆర్థిక వివక్ష, రాజకీయ, సామాజిక వెనుకబాటులో రజకులు ఉన్నారన్నారు. రజకుల సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోకపోతే బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని ఆందోళనలు చేపట్టాలని సూచించారు. మహాసభలో రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నమరివేడు గురుశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాటూరి నాగభూషణం, బాపట్ల సుబ్బారావు, విజయవాడ నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యురాలు కాకర్ల బుజ్జి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహారావు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక రజక వృత్తిదారుల సంఘం తూర్పు కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిక్కవరపు వెంకట రెడ్డియ్య (మచిటీపట్నం), ప్రధాన కార్యదర్శిగా కాటూరి నాగభూషణం (మచిలీపట్నం), ఉపాధ్యక్షులుగా బాపట్ల సుబ్బారావు(ఉయ్యూరు), బోగిరెడ్డి వెంకట శ్యామ్ (మచిలీపట్నం), వెంట్రప్రగడ వెంకటేశ్వరరావు(అవనిగడ్డ)ను ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శిగా పెడసనగంటి పాండురంగారావు (తాడిగడప), సత్యకోలు శ్రీనివాసరావు (ముదినేపల్లి), పి.రాంబాబు (గుడ్లవల్లేరు), కోశాధికారిగా కోడూరు పరశురామయ్య (ఉయ్యూరు), మరో 39 మందితో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు వెంకట రెడ్డియ్య తెలిపారు. -
బౌద్ధ మహా సమ్మేళనం ప్రారంభం
అమరావతి: ప్రసిద్ధ బౌద్ధారామమైన అమరావతిలో శనివారం బుద్ధిస్ట్ సొసైటీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర బౌద్ధ మహా సమ్మేళనం శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. తొలుత స్థానిక సత్తెనపల్లిరోడ్డు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దమ్మజ్యోతిర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ పురవీధుల గుండా సాగిన ర్యాలీ పాత మ్యూజియంలోని మహాస్థూపం వద్దకు చేరుకుంది. అక్కడ శ్రీ చంద్రబోధిపాటిల్ ఆధ్వర్యంలో శ్రామణేర భిక్షువులు, సికింద్రాబాద్‌కు చెందిన మహాబోధి సొసైటీ భిక్షువులు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్ సభ్యులతో కలిసి దమ్మప్రవచన కార్యక్రమాన్ని నిర్వహంచారు. అనంతరం శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్æవరకు ర్యాలీ సాగింది. పాఠశాల ఆడిటోరియంలో సుమారు 20 మందికిపైగా బౌద్ధమతం స్వీకరించారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులకు టీ సురేష్ ఆధ్వర్యంలో చీవరదానం నిర్వహిచారు. అనంతరం చంద్రబోధిపాటిల్, అంజనేయరెడ్డి, ఎస్ఎస్అర్ భూపతి, ఆర్.సుబ్బారావు తదితరులు బౌద్ధమత విశిష్టత గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏపీ బుద్ధిస్ట్ సొసైటీ అఫ్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరి పిల్లి రాంబాబు మాట్లాడుతూ అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులతో ఏడో రాష్ట్ర బౌద్ధ మహా సమ్మేళనం గురించి చెప్పారు. సభలో బొర్రా గోవర్దన్, వై కొండలరావు, సీహెచ్ స్వరూపరాణి, మట్లా ఝాన్సీరాణి, డాక్టర్ రత్నాకర్ తదితరులు ప్రసంగించారు. -
8న బతుకమ్మ మహా ప్రదర్శన
హన్మకొండఅర్బ¯ŒS : బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో ఈనెల 8వ తేదీన బతుకమ్మ మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కలెకక్టర్ వాకాటి కరుణ అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం గిరిజన సంక్షేమశాఖ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నిర్వహణలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. నగరంలో ఎంపిక చేసిన 19 కేంద్రాల్లో మహిళలు బతుకమ్మ ఆడుకుంటారన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో బతుకమ్మ సంబురాల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బతుకమ్మ ఆడుకునే స్థలాలను చదును చేయడంతోపాటు చెట్లు, ముళ్ల పొదలను తొలగించినట్లు చెప్పారు. జేసీ ప్రశాంత్జీవ¯ŒSపాటిల్, డీఆర్వో శోభ, డీడీ జగ¯ŒS, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన కోటి బిల్వార్చన మహాయాగం
కొత్తపేట : కొత్తపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయ ప్రాంగణం వేదికగా వందరోజులు సాగిన కోటి బిల్వార్చన మహాయాగం ఆదివారం ముగిసింది. వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసుల రామచంద్రశర్మ (రాంబాబు), వేదపండితుడు మైలవరపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ వంద రోజులూ సుమారు 150 మంది దంపతులు వివిధ పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. ఆఖరిరోజు ఆదివారం జిల్లాలో పలువురు ప్రఖ్యాత వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, పూజలు చేశారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. సుతాపల్లి లక్ష్మీనారాయణరావు, సత్యవరపు గంగాధరరావు, శ్రీఘాకోళ్లపు సూరిబాబు, నంభూరి రెడ్డియ్య, సత్యవరపు జమీందార్, తమ్మన సాయిప్రసాద్, పచ్చిపులుసు కృష్ణారావు పాల్గొన్నారు. -
ప్రధాని సభకు 8 వేల మంది కార్యకర్తలు
రాష్ట్రంలో బీజేపీ యే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరిస్తోంది బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి డిచ్పల్లి : హైదరాబాద్‌లో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్న బీజేపీ మహా సమ్మేళన్ సభకు జిల్లా నుంచి సుమారు 8 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళుతున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తెలిపారు. శనివారం డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని హోదాలో మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని, ఒక వైపు అభివృద్ధి శంకుస్థాపనలు మరో వైపు పార్టీ బలోపేతం కోసం బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. సభకు జిల్లా నుంచి బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నారని తెలిపారు. ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారని, ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూ. లక్ష కోట్లు నిధులు ఇచ్చారన్నారు. తెలంగాణలో బీజేపీ యే భవిష్యత్ ప్రత్యామ్నాయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. మల్లన్న సాగర్ కోసం తెచ్చిన జీవో నెంబరు 123ను హైకోర్టు కొట్టి వేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని, ఇప్పటికైనా రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి లింగం, జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె భూమన్న, నాయకులు మేక బాగారెడ్డి, కేపీరెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ తొలి పర్యటనపై బీజేపీ ఆశలు
-
మోదీ తొలి పర్యటనపై బీజేపీ ఆశలు
* 7న 80 వేల మంది కార్యకర్తలతో మహాసమ్మేళన్ * ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ ముఖ్యనేతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 7న తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాలతోపాటు బీజేపీ సభలోనూ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనను పార్టీ బలోపేతానికి వినియోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న పార్టీ కార్యకర్తల మహాసమ్మేళన్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ భారీ ఆశలు పెట్టుకుంది. మోదీ ప్రసంగాన్ని, కేంద్ర పథకాలను బూత్స్థాయిలోకి తీసుకుపోవడానికి అనుగుణంగా వ్యూహం రచించుకుంది. రాష్ట్రంలోని 15 వేల పోలింగ్‌బూత్‌ల పరిధినుంచి ఈ మహాసమ్మేళన్‌కు పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడానికి ఏర్పాట్లు చేసింది. మొత్తం 75 వేల మంది కార్యకర్తలు, వివిధ స్థాయిల్లోని 5 వేల మంది ముఖ్యనేతలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర పథకాలను కార్యకర్తలతో గ్రామస్థాయిలో ప్రచారం చేయించి, కింది స్థాయినుంచి పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ భావి స్తోంది. ఈ సమ్మేళన్‌కు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. 2019లో ప్రత్యామ్నాయం మేమే: లక్ష్మణ్, దత్తాత్రేయ రాష్ట్రంలో 2019లో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్రమంత్రి దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీస్టేడియంలో జరిగే మహాసమ్మేళన్ ఏర్పాట్లు పర్యవేక్షించిన సందర్భంగా శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇం టింటికీ ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. 2019 ఎన్నికలు లక్ష్యంగా, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తామని, దీనికి ప్రధాని పర్యటనను వినియోగించుకుంటామన్నారు. -
ఏకాదశి ఉత్సవాల్లో సీఎం దంపతులు
ముంబైః ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు మహరాష్ట్రలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్పవాల సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అయన భార్య అమృతా లు పండరపుర విఠల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన మహా పూజకు భక్తులు లక్షల్లో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన భార్య అమృతాలు పండరపుర విఠల్ దేవాలయాన్ని దర్శించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఉత్సవాల్లో తెల్లవారుజామున మహాపూజ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి దంపతులు విఠలేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో కొలువైన పండరపుర విఠలుని ఏకాదశి దర్శనానికి లక్షల్లో భక్తులు క్యూ కట్టారు. ఆ విఠలేశ్వరుడు భక్తులందరినీ చల్లగా కాపాడాలని, ఆయన ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరపుర ఆలయంలో నిర్వహించే 'వారి' ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుంచీ భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఏకాదశి సందర్భంగా ముంబై 'వడాలా' లోని విఠల్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా స్వామిని దర్శించేందుకు వేలల్లో భక్తులు తరలివస్తారన్నఉద్దేశ్యంతో ముందుగానే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్ళించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
సెల్‌ఫోన్ ద్వారా పంపుసెట్ల మానిటరింగ్
సెల్ఫోన్ల ద్వారా పంపుసెట్లను మానిటరింగ్ చేసే విధానాన్ని త్వరలో అమలుచేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో నిర్వహించిన మహాసంకల్పసభలో పాల్గొని, అందరితో ప్రతిజ్ఞ చేయించిన తర్వాత ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ అందజేస్తామని, 10 లక్షల మంది రైతులకు ఒక్కొక్కటీ రూ. 50 వేల విలువైన పంపుసెట్లు ఉచితంగా ఇస్తామని అన్నారు. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని చెప్పారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని, విభజన హామీల అమలు బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తే అన్నీ జరిగిపోవని.. విరివిగా నిధులు రావాలని చంద్రబాబు మరోసారి అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 149కే ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
భద్రతా వలయంలో కడప : జనం ఇక్కట్లు
కడప : టీడీపీ చేపట్టిన నవనిర్మాణ దీక్ష ముగింపు సభను మహాసంకల్పయాత్ర పేరిట బుధవారం సాయంత్రం కడప నగరంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కడప నగరాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరంలో 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. ఐదు వేల మంది పోలీసులు మోహరించారు. నగరంలో అడుగడుగునా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే నగరంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ మైదానంలో జరగనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు నారా లోకేశ్ హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి కడపలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేసి గురువారం ఉదయం విజయవాడ వెళతారు. -
ఇంతకీ ఆ గొంతు బాబుదా.. కాదా?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) తన పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన 'మహాసంకల్ప' సభలో చంద్రబాబు ప్రసంగం ఆసాంతం విన్న తర్వాత సామాన్యులకు అనేకానేక సందేహాలు తలెత్తుతున్నాయి. ''ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం. ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి. ఈరోజు నేను ఒక వ్యక్తిని కాను.. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారని అడుగుతున్నాను'' అని ఆయన అన్నారు. అంటే, తన ఫోన్ ట్యాప్ అయ్యిందని ఆయన అంగీకరించినట్లే అవుతుంది కదా. ఆడియో టేపుల్లో ఉన్న సంభాషణలలో గొంతు తనదేనని ఆయన చెప్పక చెప్పినట్లే కదా. ఇక మరొక్క సెకను దాటగానే.. ''నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారు. అవి టీ-ఛానల్లో ప్రసారం చేశారు. ఇది నీ జాగీరా.. కాదు. నామీద కుట్ర చేస్తున్నారు'' అన్నారు. అంటే, తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, అది తన గొంతు కాదని చంద్రబాబు చెప్పినట్లవుతుంది. ఇలా రెండు విభిన్న రకాల ప్రకటనలను వెంటవెంటనే చేసేయడం ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి వాస్తవం అయినా.. రెండోది కచ్చితంగా అవాస్తవమే అవుతుంది. రాష్ట్రాల మధ్య చిచ్చు ఓటుకు నోటు వ్యవహారంలో తన మనిషి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వైనాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ఈ వ్యవహారాన్ని రాజకీయ అవినీతి అన్నట్లు కాకుండా, అదేదో రెండు రాష్ట్రాల మధ్య వివాదం అన్న కలరిచ్చారు. ఈ విషయంలో ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఏం చెప్పారో.. సరిగ్గా అవే మాటలను మరికొంత రంగులద్ది చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌లో మీకు పోలీసులుంటే మాకూ ఉన్నారు, మీకు ఏసీబీ ఉంటే మాకూ ఉందంటూ.. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను రేకెత్తించేలా మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల ఇళ్లను కూల్చేస్తున్నారని, ప్రతిరోజూ ఆంధ్రావాళ్లను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. వాస్తవానికి కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ఈ ఏడాది కాలంలో అలా జరిగిన దాఖలాలు లేవు. చంద్రబాబు మాత్రం.. తన ఫోన్ ట్యాప్ చేయడం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలకు అవమానమంటూ దీన్ని తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఖబడ్దార్ అంటూ హెచ్చరించి, అక్కడ ఉన్నవాళ్లను రెచ్చగొట్టేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. మధ్యలో 'ఏయ్.. మైకు సౌండు పెంచు' అంటూ, తన గొంతును మరింత పెంచారు. ఈ విషయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాలను ఒక్కసారి తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిందే. ''చంద్రబాబు అత్యంత నీతిబాహ్యమైన, అత్యంత జుగుప్సాపరమైన రాజకీయాలకు తెరతీస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసింది తప్పని గానీ, ఒప్పని గానీ ఆయన ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ప్రభుత్వం నీ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టు, అంతేతప్ప శిఖండి రాజకీయాలు చేయకు. దొంగపనులు చేయడానికి ముఖ్యమంత్రి పదవి లైసెన్సు కాదు. దొంగపనులు చేస్తే మంత్రులనైనా, ముఖ్యమంత్రులనైనా శిక్షించే అధికారం చట్టానికి ఉంటుంది'' అని కేటీఆర్ అన్నారు. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకైనా చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పినట్లు ఎవరికైనా అనిపిస్తే.. వాళ్లకు హ్యాట్సాఫ్!! -
విశ్వనగరంగా అమరావతి
-
విశ్వనగరంగా అమరావతి
మహాసంకల్పం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ♦ ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలను ఇక్కడ కల్పిస్తా ♦ 2050 నాటికి ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా ఏపీ ♦ రాష్ట్రాభివృద్ధి కట్టుబడి ఉన్నానని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన బాబు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలను ఇక్కడ కల్పిస్తానని, హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరు నగరాలకంటె అత్యుత్తమంగా ఈ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సంవత్సరం క్రితం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఖాళీ స్థలంలోనే సోమవారం సాయంత్రం ఆయన మహాసంకల్పం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి నుంచి 13 జిల్లాలకు రోడ్డు, రైలు, విమాన మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. సంవత్సరం నుంచి రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక తయారుచేసుకున్నానని చెప్పారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తాను తీసుకుంటానని, తనను ఆశీర్వదించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ స్పూర్తితో సంకల్పం చేసి బుల్లెట్లా దూసుకుపోతానని వెనక్కుతిరిగి చూడనని చెప్పారు. 2022 నాటికి దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో మొదటి రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. చివర్లో సభకు హాజరైన వారితో మహాసంకల్పాన్ని చేయించారు. ప్రతి సంవత్సరం ఎక్కడున్నా ఇదేరోజున ఈ సంకల్పాన్ని గుర్తుచేసుకోవాలని కోరారు. ఈ సంకల్పాన్ని బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించాలన్నారు. అగ్రగామిగా ఏపీ: గవర్నర్ ఘన చరిత్ర కలిగిన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేశారని, ఇదే స్ఫూర్తితో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేయడానికి ప్రజలు భాగస్వాములు కావాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. మహా సంకల్పం సభలో ‘స్వర్ణాంద్ర కోసం మహాసంకల్పం’ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, కేంద్రమంత్రి ఆశోక్ గజపతి రాజు, రాష్ట్రమంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల, కామినేని శ్రీనివాస్, హిందూ పురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ఎన్జీవో సంఘ నేత అశోక్ బాబు తదితరులు ప్రసంగించారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పలువురు ఎమ్మెల్యేలు , 13 జిల్లాలకు చెందిన వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం క్యాంప్‌ఆఫీస్ ప్రారంభం సాక్షి, విజయవాడ: నగరంలోని జలవనరుల శాఖ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తన క్యాంపు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం 8.41 గంటలకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం, పూర్తి పచ్చదనంతో రాజధాని ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. పూజా కార్యక్రమాలను కె.కె.రావు సిద్ధాంతి, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్ నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటల వరకు చంద్రబాబు క్యాంపు కార్యాలయంలోనే గడిపి, ఆ తరువాత గుంటూరు జిల్లాలో జరిగే మహాసంకల్ప సభకు బయలుదేరారు. చంద్రబాబు కుమారుడు లోకేష్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
'మహా సంకల్పం' బస్సు ఢీకొని ఇద్దరి మృతి
మచిలీపట్నం (కృష్ణా జిల్లా): మహాసంకల్పం సభకు వెళుతున్న బస్సు సోమవారం రెండు నిండుప్రాణాల్ని బలితీసుకుంది. బాధితుల బంధువుల కథనం మేరకు... కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం పల్లెపాలెంకు చెందిన అనిరాజు వీరాంజనేయులు(29), వెంకటనారాయణపురానికి చెందిన తమ్ము ఏడుకొండలు (29) స్నేహితులు. వీరు బైక్‌పై విజయవాడ వెళ్లి తిరిగివస్తున్నారు. అదే సమయంలో మచిలీపట్నం నుంచి టీడీపీ కార్యకర్తలతో గుంటూరు జిల్లాలో జరుగుతున్న మహాసంకల్పం బహిరంగ సభకు వెళుతున్న బస్సు పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరాంజనేయులు, ఏడుకొండలను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. -
నేనేమైనా ఈ కేసీఆర్‌కు సర్వెంటునా: చంద్రబాబు
-
విభజన ఒక పీడకల.. అయినా మనం బుల్లెట్టే
-
నేనేమైనా ఈ కేసీఆర్‌కు సర్వెంటునా: చంద్రబాబు
ఉమ్మడి రాజధానిలో తన ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్‌కు ఎక్కడిదని, తానేమైనా కేసీఆర్‌కు సర్వెంటునా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన 'మహాసంకల్ప సభ'లో ఆయన మాట్లాడారు. తాను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు పెట్టారని, దాన్ని టీ ఛానల్లో ప్రసారం చేశారని అన్నారు. ''మన ఫోన్లు ట్యాప్ చేస్తే ఎంత కడుపు మండిపోతుంది.. చెప్పండి'' అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రాల మధ్య తగాదా వద్దు. టీఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారు. ఇది నీ జాగీరా.. కాదు. నామీద కుట్ర చేస్తున్నారు. నీతి, నిజాయితీగా బతికాను. ప్రజా సేవ కోసం బతికాను. కేసీఆర్ అసమర్థుడు ఏమీ చేయలేకుండా నామీద కుట్ర పన్నుతున్నాడు. అవునా కాదా తమ్ముళ్లూ అని అడుగుతున్నా. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కుందో, నాకూ అంతే హక్కుంది. ఖబడ్దార్, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐదో అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ నిలబెట్టిందంటే అది నీతిమాలిన చర్య కాదా అని అడుగుతున్నాను. ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం. ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి. ఈరోజు నేను ఒక వ్యక్తిని కాను.. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారని అడుగుతున్నాను. నేనేమైనా ఈ కేసీఆర్‌కి సర్వెంట్నా అని అడుగుతున్నా. మీరు మామీద ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో నన్ను బెదిరించాలంటే మీ తరం కాదు. మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నా ఏసీబీ కూడా హైదరాబాద్ లోనే ఉంది. మీకు పోలీసులున్నారు, మాకు కూడా పో్లీసులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మా ఎమ్మెల్యేని ఎన్నికలకు ముందు మీ ఫాం హౌస్ కు తీసుకెళ్లి, సిగ్గులేకుండా పోలీసు ప్రొటెక్షన్‌తో పంపినప్పుడు మీకు సిగ్గులేదా శ్రీనివాసయాదవ్ అనే ఎమ్మెల్యేకి మంత్రిపదవి ఇచ్చినప్పుడు యాంటీ డీఫెక్షన్ మీకు గుర్తులేదా? 22 మంది ఎమ్మెల్యేలు నాకున్నారు. ఎమ్మెల్సీ నాకో లెక్క కాదు. నాకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదు.. నీతి ముఖ్యం, సిద్దాంతం ముఖ్యం. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను తిడుతూ ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్లు ఆంధ్రావాళ్ల ఇళ్లు కూల్చేయడానికి వెళ్తున్నారు. మా ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు సెక్షన్ 8 ఉంటే, గవర్నర్‌కు అధికారం ఉంటే మామీద పెత్తనం చేయడానికి మీరెవరని అడుగుతున్నా పదేళ్లు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా అని అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, గౌరవం లేని మాటలంటారా, అగౌరవ పరుస్తారా? నన్ను కాదు మీరు అగౌరవ పరిచేది.. ఐదుకోట్ల ప్రజలను. మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీకు బుద్ధి లేదా? సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతా. టీఆర్ఎస్ పార్టీ పెత్తనంపై నేను ఆధారపడలేదు, వీళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదు. -
విభజన ఒక పీడకల.. అయినా మనం బుల్లెట్టే
మంగళగిరి: విభజన వల్ల వచ్చిన ఇబ్బంది, ఆ సమయంలో జరిగిన అన్యాయం, కాంగ్రెస్ తీరు, అవమానించిన విధానం ఎప్పుడూ మర్చిపోలేమని ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మంగళగిరిలో జరిగిన మహాసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ విభజన ఒక పీడకల అని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని చెప్పారు. సోనియాగాంధీ తెలుగు ప్రజల పొట్టను కొట్టిందని ఆరోపించారు. ఇటలీ స్వాతంత్ర్యం రోజే తెలుగు రాష్ట్రాన్ని విభజించారని చెప్పారు. అయినా బుల్లెట్ లా దూసుకెళతాం తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్యే లేదని అన్నారు. ఈ సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృశిచేద్దామని సంకల్పించాలని కోరారు. జూన్ 2 వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన రోజుగా గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటానని, వాటికి మీ ఆశీస్సులు కావాలని సభకొచ్చిన ప్రజలనుద్దేశించి అన్నారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడని ఆయన వద్ద శిక్షణ పొందిన తాను తెలుగు అమరావతి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడి ప్రజానీకం చాలా తెలివైన వారని వివరించారు. అన్ని చోట్ల రాణిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో కరువు పోవాలంటే గోదావరి నీళ్లు కావాలని, పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తనకు విజన్ ఉందని గుర్తించే ఓటు వేశారని, ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని అన్నారు. ప్రపంచం మనవద్దకు వచ్చేలా తయారు చేస్తా అని చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చినవారిని మర్చిపోలేమని అన్నారు. -
'మహా సంకల్పం'తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
-
'మహా సంకల్పం'తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్: నవ్యాంధ్ర ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన 'మహా సంకల్పం' సభ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోల్‌కతా నుంచి చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు వందల కొద్దీ నిలిచిపోయాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. విజయవాడ - గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు గంటల కొద్దీ ట్రాఫిక్‌లోనే ఇరుక్కు పోవాల్సి వచ్చింది. అధికారులు, టీడీపీ నేతల తీరును ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. మీడియా సంస్థలకు వందలకొద్దీ ఫోన్లు చేశారు. మహా సంకల్పం సభతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవించారు. -
'ఏపీ అగ్రభాగాన ఉండాలని కోరుకుంటున్నా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేలా కోరుకుంటున్నట్టు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. నవ్యాంధ్ర ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మహాసంకల్పం సభలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తెలుగులో ప్రసంగించారు. ఈ ప్రాంతానికి ఘనమైన చరిత్ర, వారసత్వం ఉందని ఆయన తెలిపారు. రెండు రోజుల క్రితం రాజధాని అమరావతి కోసం సీఎం పునాది వేశారన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సిద్ధించాలని ప్రార్థిస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. -
మహాసంకల్ప సభలో.. బాబు ఏం చెబుతారో?
గుంటూరు: మంగళగిరి నాగార్జునసాగర్‌లో సోమవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాసంకల్పదినోత్సవ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మహాసంకల్ప సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారన్న విషయమై రాజకీయ, మీడియా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉందని వార్తలు వెలువబడిన నేపథ్యంలో వీటిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారని అటు ప్రజల్లోనూ ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఈ సభలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన సూటిగా స్పందిస్తారా? ఆడియో టేపుల అంశంపై బాబు మాట్లాడుతారా? ఈ వ్యవహారంలో తనకు సంబంధం ఉందని చెబుతారా? సంబంధం లేదని చెబుతారా? లేక ఆడియోలో మాటలు తనవి కావని చెబుతారా? లై డిటెక్టర్ టెస్టుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? అనే ప్రశ్నలకు మహాసంకల్ప సభలో సమాధానం వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కస్డడీ పిటిషన్‌పై బుధవారం కోర్టు నిర్ణయం వెలువబడనుంది. అయితే రేవంత్ కస్టడి బుధవారం ముగియనుండటంతో రేవంత్ కస్టడీ విషయంలో మరో రెండు రోజులు పొడిగింపునకు ఏసీబీ కోర్టును కోరనున్నట్టు సమాచారం. కోర్టు నిర్ణయం తర్వాతే చంద్రబాబుకు నోటీసులు అందుతాయనే విశ్వసనీయ వర్గాల సమాచారం. -
మహాసంకల్పం..సర్వం సిద్ధం
సాక్షి, గుంటూరు : తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ‘మహాసంకల్పం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సభను నిర్వహించనుంది. ఈ సభకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన ప్రాంతంలోనే ఈ సభ నిర్వహించనుండటం విశేషం. మహా సంకల్పం సభను సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి మించి అధిక ఖర్చుతో అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 40 ఎకరాల సువిశాల స్థలంలో భారీ ప్రాంగణాన్ని నిర్మించారు. సుమారు 2 లక్షల మంది కూర్చొనేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేదికపై ఆశీనులయ్యేందుకు వీలుగా 76/58 సైజులో 250 మంది సామర్థ్యంతో భారీ వేదిక నిర్మించారు. ఎక్కడికక్కడ మెష్ బారికేడ్లు ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 250 వీఐపీ పాస్‌లు.. మంత్రులకు ఏఏ పాస్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏ1, ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఏ2 పాస్‌లను ఇస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాయకులకు ఇచ్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 250 వీఐపీ పాస్‌ల చొప్పున అందించారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో తెలిపేలా ముందుగానే వారికి కేటాయించిన సీట్లను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. సభాస్థలిలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం... సభ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుండటంతో ప్రాంగణం మొత్తం ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకొనేలా 15 పీటీజడ్ కెమెరాలతో పాటు 35 ఫిక్స్డ్ కెమెరాలను అమర్చి రెండు కిలోమీటర్లు పరిధిలో విజువల్స్ రికార్డు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. హెలిప్యాడ్ నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు సీఎంకు ప్రత్యేక కాన్వాయ్‌ను ఏర్పాటు చేసి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సభ ముగిసే వరకు సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ప్రత్యేక పార్కింగ్ స్థలాలు... సభకు హాజరయ్యే ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసుకొనేందుకు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను టోల్‌ఫ్లాజా వద్ద, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను డాంగే నగర్, ఐజేఎంల వద్ద పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ స్థలం నుంచి సభావేదిక వద్దకు ప్రజలను చేరవేసేందుకు షటిల్ సర్వీస్పేరుతో 40 తుఫాన్ వాహనాలను సమకూరుస్తున్నారు. పోలీసు, రెవె న్యూ, ఇతర అధికారుల సమన్వయం కోసం 250 వాకీటాకీలను అందజేశారు. ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సభ ముగిసిన తరువాత తిరిగి వెళ్లే సమయంలో భోజన ప్యాకెట్లను అందజేయనున్నారు. 15 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మించారు. సాంస్కృతిక కార్యక్రమాలు... సభాస్థలిలో రిమోట్‌తో బాణాసంచా పేల్చేలా చర్యలు తీసుకుంటున్నారు. సభకు హాజరయ్యే ప్రజలను అలరించేందుకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాలను తెలిపేలా బుర్ర కథలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను వారం రోజులుగా అడిషనల్ డీజీ సురేంద్రబాబు,గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, నగరపాలక సంస్థ కమిషనర్ కె. కన్నబాబు, రేంజి ఐజీ ఎన్. సంజయ్, అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠత్రిపాఠి, నారాయణనాయక్‌లు పర్యవేక్షిస్తున్నారు. -
మహా సంకల్పానికి జనం బాధ్యత కలెక్టర్లకే
మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపడుతున్న మహా సంకల్పం సభను ప్రమాణ స్వీకారోత్సవ సభ ఖర్చుకంటే రెట్టింపు ఖర్చుతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సభకు జన సమీకరణ బాధ్యతలు ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ మౌఖికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. గుంటూరు నాగార్జున వర్సిటీ వద్ద జరిగే సభకు నాలుగు లక్షల మంది వచ్చేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో సీఎస్ కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహా సంకల్పం సభకు సర్వం సిద్ధం సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మహా సంకల్పం సభకు గుంటూరు జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణానికి సమీపంలో ప్రత్యేకంగా మూడు హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. కోల్‌కతా, చెన్నై నుంచి కళాబృందాలను రప్పించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. -
అంతా అక్కడికేనా! పాలన గాలికేనా?
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అధికార పార్టీ సంకల్పిస్తే సభలను సక్సెస్ చేయడం ఓ లెక్కా! గుంటూరు జిల్లాలో సోమవారం జరిగే మహా సంకల్పం సభకు భారీగా తరలిరండని బాబుగారు పిలుపివ్వడంతో అటు తమ్ముళ్లు ఇటు అధికారులు నిబంధనలకు నీళ్లొదిలేశారు. దర్జాగా స్కూలు బస్సుల్లో జనాన్ని తరలించేశారు. అధికారులేమో ఏర్పాట్లలో తలమునకలై పాలన సంగతి మరచిపోయారు. పోలీసులైతే జిల్లాలో శాంతిభద్రలను గాలికొదిలేసి బందోబస్తు పేరుతో తండోపతండాలు తరలిపోయారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు :రాష్ట్ర ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట మహాసంకల్పం పేరిట తలపెట్టిన బహిరంగసభకు జిల్లా నుంచి పెద్దఎత్తున అధికార పార్టీ శ్రేణులు తరలివెళుతున్నాయి. ఇందులో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు గానీ ప్రజలు, పార్టీ శ్రేణుల తరలింపునకు టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడటమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇటీవల జరిగిన మహానాడుకు కూడా జిల్లా నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హైదరాబాద్‌కు తరలివెళ్లాయి. అప్పుడు ఎక్కడా ఎటువంటి విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు మహాసంకల్పం పేరిట చేపట్టే అధికారిక కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు అధికార లాంఛనాలతో తరలివెళ్లడమే వివాదాస్పదంగా మారుతోంది. మహాసంకల్ప సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశించిన నేపథ్యంలో జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోటాపోటీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను పెద్దసంఖ్యలో తరలిస్తున్నారు. ఇందుకు మళ్లీ స్కూలు బస్సులను వినియోగిస్తున్నారు. బహిరంగ సభలకు జనాలను స్కూలు బస్సుల్లో తరలించొద్దంటూ ఇటీవలే రవాణాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ విషయమై చాలా కఠినంగా ఉంటున్నారు. రెండు నెలల కిందట సీఎం చంద్రబాబు పట్టిసీమ శంకుస్థాపన సభకు వచ్చినప్పుడు కూడా స్కూలు బస్సులు కాకుండా ఆర్టీసీ బస్సులనే వినియోగించారు. అయితే ఈ మహాసంకల్ప సభకు మళ్లీ స్కూలు బస్సులనే వినియోగిస్తున్నారు. ఒక్కో ఆర్టీసీ బస్సుకు సుమారు రూ.13వేల చొప్పున రూ.లక్షల్లో అవుతున్న ఖర్చును భరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీ నేతలు కార్పొరేట్ స్కూలు బస్సులను ఎంచుకున్నారు. ప్రైవేటు యాజమాన్యాలతో ఉన్న పరిచయాల నేపథ్యంలో కేవలం డీజిల్ ఖర్చులు భరించేలా మాట్లాడుకుని ఆ బస్సులను వినియోగిస్తున్నారు. ఈ మేరకు జిల్లా నుంచి సుమారు వెయ్యి స్కూలు బస్సులు సోమవారం గుంటూరుకు తరలివెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఏలూరు నుంచే ఇంజినీరింగ్ కాలేజీల బస్సులతో సహా 150 స్కూలు బస్సులు తరలివెళుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 629 మంది పోలీసుల తరలింపు ఇక మునుపెన్నడూ లేని విధంగా జిల్లా నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు గుంటూరుకు తరలివెళ్లారు. రెండురోజుల ముందుగానే పోలీసులు అక్కడికి వెళ్లిపోవడంతో జిల్లాలో చాలా పోలీస్స్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నలుగురు డీఎస్పీలు, 17మంది సీఐలు, 48 మంది ఎస్సై, 100 మంది ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు 330 మంది, హోంగార్డులు 130 మంది కలిపి మొత్తం 629 మంది ఈ నెల ఐదవ తేదీనే గుంటూరు వెళ్లారు. తిరిగి వీరంతా ఈ నెల 9న జిల్లాకు చేరుకుంటారు. జిల్లా వ్యాప్తంగా స్టేషన్లలో రెండురోజులుగా పోలీస్ సిబ్బంది లేకపోవడంతో శాంతిభద్రతల పరంగా, వ్యక్తిగత, ఇతర సమస్యలతో వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, పోలీస్స్టేషన్లు ఖాళీ అయిన పరిస్థితుల్లో ఈలోగా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే పరిస్థితేమిటన్న ఆందోళన పోలీసు శాఖ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. మీ కోసం కూడా అంతేనా ప్రతి సోమవారం కలెక్టరేట్, ఆర్టీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే మీ కోసం కార్యక్రమం కూడా ఈ 8వ తేదీన నామమాత్రంగానే జరగనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు మహా సంకల్ప బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లలో తలకమునకలయ్యేందుకు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. దీంతో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించే వేదికైన మీకోసం కార్యక్రమం ఈ సోమవారం తూతూ మంత్రంగానే జరగనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
'నాన్న ఆరోగ్యం భాగానే ఉంది'
ముంబై: బాలీవుడ్ హీరో, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తి రొటీన్ చెక్ అప్‌లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లాడని ఆయన కుమారుడు మహాక్షయ్ చెప్పారు. వాంతులు, జ్వరంతో ఆదివారం ఆస్పత్రిలో చేరినట్టు వచ్చిన వార్తలని ఖండిస్తూ అవన్ని అవాస్తవాలని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదురుగానే ఉండి ఇంట్లోనే ఉన్నాడని మహాక్షయ్ తెలిపారు. కోట్లాది శారదా చిట్‌ఫండ్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల కోల్‌కతాలో మిథున్ చక్రవర్తిని ప్రశ్నించారు. శారదా గ్రూపునకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. వీటికి సంబంధించిన డీవీడీలు, సీడీలు, రికార్డులను ఈడీ అధికారులకు అందజేశారు. శారదా గ్రూపు నుంచి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానని మిథున్ చక్రవర్తి ఇదివరకే చెప్పారు. వృత్తిపరంగానే శారదా గ్రూపుతో పనిచేశానని, ఎవర్నీ మోసం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని మిథున్ చక్రవర్తి చెప్పిన విషయం తెలిసిందే. -
భువనగిరిలో బీజేపీ వర్క్‌షాప్
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరిలో బీజేపీ జిల్లా వ్యాప్త మహసంపర్క్ అభియాన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపై కిషన్‌రెడ్డి... జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లాలో పార్టీని పటిష్ట పరిచే విధి విధానాలపై వారు చర్చించారు. -
రామనామం.. మహాయోగం
భద్రాద్రి మిథిలాస్టేడియంలోని మహాయజ్ఞ వేదిక రామనామస్మరణతో మార్మోగుతోంది. కొండకొప్పాక శ్రీ అష్టలక్ష్మీ పీఠం వ్యవస్థాపకులు రఘునాథాచార్యులు నిర్వహిస్తున్న ఈ యాగంలో భాగంగా శనివారం శ్రీ రామ దివ్యమంత్రాన్ని 108 సార్లు జపించారు. ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యమ్ రామనామ వరాననే’ అని వేదపండితులు మంత్రోచ్ఛారణ గావిస్తూ హోమగుండం వద్ద పూజలు నిర్వహించారు. - భద్రాచలం -
మరో మహా యజ్ఞానికి కేసీఆర్ శ్రీకారం!
-
నరేంద్ర దబోల్కర్ హత్య
పింప్రి, న్యూస్‌లైన్: మూఢనమ్మకాలు, దురాచారాల నిర్మూలనకు రాజీలేని పోరాటం చేసిన ప్రముఖ హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు నరేంద్ర దబోల్కర్(69)ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. అంధశ్రద్ధ నిర్మూలన సమితి సంస్థాపక కార్యాధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయనను మంగళవారం ఉదయం కాల్చిచంపారు. పుణేలోని ఓంకారేశ్వర్ దేవాలయ సమీపాన ఉన్న వంతెనపై ఉదయం 7.30 గంటలకు మార్నింగ్‌వాక్ చేసి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి నరేంద్ర తలపై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తాము దబోల్కర్‌ను ససూన్ ఆస్పత్రికి తరలించామని, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని సాక్ష్యాధారాలు లభించాయని పుణే కమిషనర్ గులాబ్‌రావు పోల్ తెలిపారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక పోలీసుల బృందాన్ని నియమించారు. మూడు సంవత్సరాల క్రితం దబోల్కర్ అంధశ్రద్ధ నిర్మూలన్ సమితిలోని కీలక పదవులకు రాజీనామా చేసి సమితికి మార్గదర్శనం చేస్తున్నారు. ఆయన 16 సంవత్సరాలుగా ‘సాధన’ మాస పత్రికకు సంపాదకుడిగా పని చేస్తున్నారు. హేతువాదంపై పలు పుస్తకాలు కూడా రాశారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ దబోల్కర్ హత్యను తీవ్రంగా ఖండించారు. రాజకీయ పార్టీలు బుధవారం పుణే నగర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆటోలు కూడా నడపకూడదని ఆటోవాలాలు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు.. సాక్షి, ముంబై: దబోల్కర్ హత్యను నిరసిస్తూ ముంబైలోని అంబేద్కర్, వామపక్షవాద సంస్థలతోపాటు తెలంగాణ సంఘీభావ వేదిక, శ్రమజీవి సంఘాలు మంగళవారం ర్యాలీ నిర్వహించాయి. దాదర్‌లోని ప్లాజా నుంచి శివాజీ నాట్యమందిర్ మీదుగా చైత్య భూమి వరకు ర్యాలీ కొనసాగింది. మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా జీవితాంతం విరామం లేకుండా పోరాడిన మహావ్యక్తంటూ నాయకులు కొనియాడారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాజుకదమ్, గ్యార శేఖర్, శ్యామ్ సోనార్, అశోక్ జాదవ్‌తోపాటు ప్రముఖ రచయితలు పుష్పాభావే, ఆశాలత కాంబ్లే, దినపత్రికల సంపాదకులు (లోక్‌సత్తా) లాల్ నిషాస్, విజయ కులకర్ణి, శ్రమజీవి నాయకులు గొండ్యాల రమేష్, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. భారిఫ్ బహుజన్ మహాసంఘ్ ఆధ్వర్యంలో భారిఫ్ బహుజన్ మహాసంఘ్ నాయకులు దాదర్‌లోని శివాజీ మందిరం నుంచి చైత్యభూమి దాకా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తర్వాత చైత్యభూమి వద్ద భారీసభను ఏర్పాటు చేశారు. మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు ప్రకాష్ అంబేద్కర్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దుర్మార్గపు వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని హత మార్చడం పరిపాయిందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాలని హెచ్చరించారు. హంతకులను తక్షణమే పట్టుకొని కఠిన శిక్ష విధించాలన్నారు. దబోల్కర్ ప్రతిపాధించిన అంధశ్రద్ధ నిర్మూలన చట్టాన్ని అసెంబ్లీలో వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహాసంఘ్ నాయకులు అశోక్ పద్మశాలి, జి.శంకర్ మాల, నాగ్‌సేన్ మాల తదితరులు పాల్గొన్నారు.