సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం ప్రథమ మహాసభలను బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ నెల 7,8 తేదీల్లో(శని, ఆదివారం) జరుగనున్నాయి. ప్రజాఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ఆదివాసులపై అధర్మ యుద్ధాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు అనే అంశాలపై ఈ సభలో చర్చించనున్నారు. దేశంలో మతోన్మాదం, మతతత్వం, దళితులపై దాడులు, ఆదివాసులను అడవినుంచి తరిమివేయడం, ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, ఉద్యమాలను అణచివేయడం, ప్రపంచ బ్యాంక్ ఎజెండాను ఇక్కడ అమలు పరచడం, జైళ్లలో ఉండే ఖైదీల హక్కులు లాంటి సమస్యలపై అతిథులు ప్రసంగించనున్నారు. ఈ సభకు అరుంధతి రాయ్, సోని సోరి, ప్రొఫెసర్ నందిని సుందర్, ఫ్రొఫెసర్ కాత్యాయనీ, ఫ్రొఫెసర్. హరగోపాల్, ఫ్రొఫెసర్. శేషయ్య పాల్గొననున్నట్లు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఫ్రొఫెసర్. గడ్డం లక్ష్మణ్, నారయణ రావులు ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment