
సాక్షి, తిరుమల : వంశపారంపర్య అర్చకత్వం చేస్తున్న రవిచంద్ర దీక్షితులను టీటీడీ విధుల నుంచి తప్పించింది. వంశపారపర్యంగా అర్చకత్వ విధులు నిర్వర్తిస్తోన్నా.. తమను విధుల నుంచి తప్పించడంపై రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో విధులకు హాజరుకాకపోవడంతో నోటీసులు జారీ చేసినట్టు టీటీడీ పేర్కొంది.
మహా సంప్రోక్షనకు హాజరు కాకపోవడానికి గల కారణాలను రవిచంద్ర వివరించినప్పటికి.. కారణాలు సంతృప్తికరంగా లేవంటూ రవిచంద్రను అర్చకత్వ విధుల నుంచి తప్పించినట్టు టీటీడీ తెలిపింది. రవిచంద్ర దీక్షితుల నుంచి 15రోజుల పాటు అర్చకత్వం విధులనుంచి తప్పించింది.