బంగారు కూర్చను అర్చకులకు అందజేస్తున్న జేఈఓ శ్రీనివాసరాజు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం నిత్య ఉదయోత్సవాల అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకులు, జీయంగార్లు, రుత్వికులు యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 6 గంటలకు హోమగుండాలను వెలిగిం చారు. నూతనంగా యాగశాల నిర్మాణం జరిగినం దున రుత్వికులు ముందుగా పుణ్యాహవచనం కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం వాస్తుహోమం నిర్వహించి పంచద్రవ్య ప్రసన్న హోమాదులు నిర్వ హించారు. దేహశుద్ధికోసం ఆకల్మష హోమం అనంతరం ప్రాతఃకాలంలో ప్రత్యేక హోమాలు, పూజలు కొనసాగించారు. ఈ కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేశారు. 12 గంటల నుంచి శ్రీవారి ఆలయంలోకి భక్తులను విడతల వారీగా అనుమతించారు. సాయంత్రం 6 గంటలకు దాదాపు 15వేల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాత్రి 7 గంటల నుంచి మరోమారు వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 9 గంటలకు ప్రథమ ఘట్టం మొదలైంది. వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం ముందుగా కలకర్షణ కార్యక్రమం చేశారు. అందులో భాగంగా మూలవర్ల బింబంలోని స్వామి వారి దివ్యశక్తిని, అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేశారు. ఈ కుంభాలతో పాటు భోగశ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మల యప్పస్వామివారు, ఉగ్ర శ్రీనివాసమూర్తి, చక్రత్తా ళ్వార్, సీతా లక్ష్మణ సమేత శ్రీరాములవారు, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూ ర్తులను యాగశాలలోకి వేంచేపు చేశారు. అలాగే ఉప ఆలయాల్లోని జయవిజయులు, ధ్వజ స్తంభం, విష్వ క్సేనుడు, గరుడాళ్వార్, ప్రసాదం పోటులోని అమ్మ వారు, లడ్డూపోటులోని అమ్మవారు, భాష్యకారులు, యోగ నరసింహస్వామి, వేణుగోపాలస్వామివారు, బేడి ఆంజనేయస్వామివారి శక్తిని కూడా కుంభంలోకి ఆవాహన చేసి యాగశాలకు తీసుకెళ్లి వేంచేపు చేశా రు. దీంతో మొదటి రోజు కార్యక్రమం పూర్తయింది.
ఆలయ ముఖద్వారం వద్ద ప్రత్యేక అలంకరణ
వెలవెలబోయిన తిరుమల క్షేత్రం..
మహా సంప్రోక్షణ కారణంగా నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రం లేక బోసిపోయింది. శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తామని టీటీడీ అధికారులు ప్రచారం చేయడంతో భక్తులు రావడం మానుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. అన్నప్రసా దాల క్యూల్లోనూ భక్తులు కనిపించలేదు.
బంగారు కూర్చ సిద్ధం
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారుకూర్చను 300 గ్రాముల బంగారంతో టీటీడీ తయారు చేయించింది. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతో పాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్టిస్తామని తిరుమల జేఈఓ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment