priesthood
-
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత
సాక్షి, విజయవాడ : ఏపీలో వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట నిలుపుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అర్చకుల కుటుంబాల్లో వెలుగు నింపినట్లుయిందని వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఈ చర్య ఎంతో ఉపకరిస్తుందని ఆయన వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు హయాంలో నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని నిర్ణయించడం సంతోషదాయకమని రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. -
అర్చకత్వం కోసం దాయాది హత్య
సాక్షి, అనంతపురం సెంట్రల్: వీరనారాయణస్వామి గుడి అర్చకత్వం విషయంలో సొంత దాయాదిని హతమార్చారు. నార్పల మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ఈనెల 20న జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. నిందితుల వివరాలను సోమవారం డీఎస్పీ వీరరాఘవరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నల్లపరెడ్డిపల్లి గ్రామంలో కుంటాల వీరనారప్ప ఈనెల 20న దారుణహత్యకు గురయ్యాడు. సదరు గ్రామంలో వీరనారాయణస్వామి గుడి అర్చకత్వం విషయంలో మృతుడు వీరనారప్పకు వరుసకు పెదనాన్న అయిన పెద్దవీరనారప్ప మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అడుగడుగునా అడ్డు తగులుతుండడంతో పాటు గ్రామంలో మంచి పేరును పెద్ద వీరనారప్ప జీర్ణించుకోలేకపోయాడు. వంశపారపర్యంగా వచ్చిన గుడి అర్చకత్వం విషయంలో అడ్డుపడుతున్నాడు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ప్రతి శివరాత్రి నుంచి మరుసటి శివరాత్రి వరకూ పూజారిగా ఉండాలని నిర్ణయించారు. దీన్ని పెద్ద వీరనారప్ప కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు ఇప్పటికిప్పుడే అర్చకత్వం కావాలని పట్టుపట్టారు. దీంతో ఎలాగైనా పూజారిగా ఉన్న వీరనారప్ప హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 20న ఉదయం 9 గంటల సమయంలో వీరనారప్పను అతని పెద్దనాన్న పెద్ద వీరనారప్ప, అతని కుమారులు నాగార్జున, నాగేంద్రలు కలిసి కట్టెలు కొట్టి, కొడవలితో నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి భార్య ఉజ్జనేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్పల పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు. పెద్ద మనుషులతో పరిష్కారం అయ్యే సమస్యను కూడా హత్య వరకూ వెళ్లారని, క్షణికావేశాలకు లోను కాకుడదని ప్రజలకు డీఎస్పీ వీరరాఘవరెడ్డి సూచించారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్గౌడ్, నార్పల ఎస్ఐ ఫణీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. -
రవిచంద్ర దీక్షితులును 15 రోజులపాటు తప్పించిన టీటీడీ
సాక్షి, తిరుమల : వంశపారంపర్య అర్చకత్వం చేస్తున్న రవిచంద్ర దీక్షితులను టీటీడీ విధుల నుంచి తప్పించింది. వంశపారపర్యంగా అర్చకత్వ విధులు నిర్వర్తిస్తోన్నా.. తమను విధుల నుంచి తప్పించడంపై రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో విధులకు హాజరుకాకపోవడంతో నోటీసులు జారీ చేసినట్టు టీటీడీ పేర్కొంది. మహా సంప్రోక్షనకు హాజరు కాకపోవడానికి గల కారణాలను రవిచంద్ర వివరించినప్పటికి.. కారణాలు సంతృప్తికరంగా లేవంటూ రవిచంద్రను అర్చకత్వ విధుల నుంచి తప్పించినట్టు టీటీడీ తెలిపింది. రవిచంద్ర దీక్షితుల నుంచి 15రోజుల పాటు అర్చకత్వం విధులనుంచి తప్పించింది. -
భక్తులతో మర్యాదగా మెలగాలి
పురోహితులకు దేవదాయ డైరెక్టర్ ఆదేశం దేవాదాయ డైరెక్టర్ రాఘవచార్యలు ఈడేపల్లి : పుష్కరాలలో పురోహితులు మైత్రీభావంతో మెలగాలని పురోహితుల శిక్షణవేత్త, రాష్ట్ర దేవదాయ దర్మదాయ శాఖ పరిపాలన డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవచార్యులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బచ్చుపేటలోని శ్రీవెంకటేశ్వ దేవాలయం ప్రాంగణంలోని కల్యాణమండపంలో బందరు, గుడివాడ డివిజన్ పరిధిలోని పురోహితుల అవగాహన సదస్సు నిర్వహించారు. రాఘవ చార్యులు మాట్లాడుతూ ఒక్కసారి పుణ్యస్నానాలను ఆచరిస్తే 12 నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని, మోక్షప్రాప్తి లభిస్తుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుందన్నారు. వచ్చే భక్తులతో పురోహితులు ప్రేమగా మెలగాలని, అమర్యాదగా ప్రవర్తిస్తే ^è ట్టరీత్యా పలు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. భక్తుల నుంచి ప్రభుత్వం నిరే్ధశించిన విధంగానే సంభావన తీసుకొవాలని, అధికంగా వసూళ్లు చేయరాదన్నారు. దేవాదాయ డిప్యూటీ కమిషనర్ చందు హనుమంతురావు మాట్లాడుతూ జిల్లాలో 73 పుష్కరఘాట్లను గుర్తించామని, వీటిల్లో విఐపిలకు 4, ప్రధాన ఘాట్లుగా 4 గా నిర్ణయించామన్నారు. అనంతరం 400 మంది పురొహితులకు గుర్తింపు కార్డులను అందజేశారు. రాష్ట్ర అర్చకుల సంఘం ఉపాధ్యక్షుడు ఘంటశాల పద్మనాభ శర్మ, బందరు డివిజన్ దేవదాయ «ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధాకర్, పలు ఆలయాల ఈవోలు అడబాల శ్రీనివాసరావు, తిక్కిశెట్టి రాంమోహనరావు, అలయ మేనేజరు జక్కా ధర్మారాయుడు, అర్చకులు పాల్గొన్నారు.