భక్తులతో మర్యాదగా మెలగాలి
భక్తులతో మర్యాదగా మెలగాలి
Published Wed, Aug 3 2016 8:14 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
పురోహితులకు దేవదాయ డైరెక్టర్ ఆదేశం
దేవాదాయ డైరెక్టర్ రాఘవచార్యలు
ఈడేపల్లి :
పుష్కరాలలో పురోహితులు మైత్రీభావంతో మెలగాలని పురోహితుల శిక్షణవేత్త, రాష్ట్ర దేవదాయ దర్మదాయ శాఖ పరిపాలన డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవచార్యులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బచ్చుపేటలోని శ్రీవెంకటేశ్వ దేవాలయం ప్రాంగణంలోని కల్యాణమండపంలో బందరు, గుడివాడ డివిజన్ పరిధిలోని పురోహితుల అవగాహన సదస్సు నిర్వహించారు. రాఘవ చార్యులు మాట్లాడుతూ ఒక్కసారి పుణ్యస్నానాలను ఆచరిస్తే 12 నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని, మోక్షప్రాప్తి లభిస్తుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుందన్నారు. వచ్చే భక్తులతో పురోహితులు ప్రేమగా మెలగాలని, అమర్యాదగా ప్రవర్తిస్తే ^è ట్టరీత్యా పలు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. భక్తుల నుంచి ప్రభుత్వం నిరే్ధశించిన విధంగానే సంభావన తీసుకొవాలని, అధికంగా వసూళ్లు చేయరాదన్నారు. దేవాదాయ డిప్యూటీ కమిషనర్ చందు హనుమంతురావు మాట్లాడుతూ జిల్లాలో 73 పుష్కరఘాట్లను గుర్తించామని, వీటిల్లో విఐపిలకు 4, ప్రధాన ఘాట్‌లుగా 4 గా నిర్ణయించామన్నారు. అనంతరం 400 మంది పురొహితులకు గుర్తింపు కార్డులను అందజేశారు. రాష్ట్ర అర్చకుల సంఘం ఉపాధ్యక్షుడు ఘంటశాల పద్మనాభ శర్మ, బందరు డివిజన్ దేవదాయ «ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, పలు ఆలయాల ఈవోలు అడబాల శ్రీనివాసరావు, తిక్కిశెట్టి రాంమోహనరావు, అలయ మేనేజరు జక్కా ధర్మారాయుడు, అర్చకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement