krishna puskaralu
-
రూ. 2.50 కోట్లకు ‘టెండర్’
మచిలీపట్నం (ఈడేపల్లి) : పుష్కరాల నిధుల నుంచి రూ. 2.50 కోట్లతో నిర్మిస్తున్న ఫుట్‌పాత్ నిర్మాణంలో నాణ్యత భూతద్దం పెట్టి వెదికినా కనిపించడం లేదు. నిర్మించిన కొద్ది రోజు లకే పగుళ్లు బీటలు షరా మామూలే. విలువైన ప్రజాధనం అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల వల్ల ఎలా దుర్వినియోగం అవుతోందో ఇక్కడే తేటతెల్లమవుతుంది. పట్టణంలోని నాగపోతురావు సెంటరు నుంచి బస్టాండు వరకు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీపై ఫుట్‌పాత్‌లను నిర్మించేందుకు పనులను చేపట్టారు. దాదాపు మూడు కిలోమీటర్లు పొడవునా నిర్మిస్తున్న ఈ కాలిబాట పనుల్లో ఆదితోనే నాణ్యత లోపించింది. వంద మీటర్ల దూరం కూడా నిర్మించని గోడకు అప్పుడే పగుళ్ళు వస్తుంటే దాదాపు మూడు కిలోమీటర్ల చేయాల్సిన పనిలో ఎంత వరకు నాణ్యత ఎంత, ఇది ఎంతకాలం మనగలుగుతుంది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అడుగడుగునా ప్రమాణాలకు పాతర డ్రైనేజీపై ఆరు అడుగులు వెడల్పున సిమెంటు బిళ్ళలను ఏర్పాటు చేసి వాటిపై కాలిబాటను నిర్మించాలి. ఇందుకు ఉపయోగిస్తున్న పరికరాలు, మెటీరియల్ నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు ముందుగా తనిఖీచేసి అన్నీ నిర్ధరించాకే పనులు చేయాలి. కానీ పనులు అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయి. దీనివల్లే నిర్మాణ దశలోనే పగుళ్ళు వస్తున్నట్లు తెలుస్తొంది. డ్రైనేజీపై నిర్మించాల్సిన ఆరు అడుగుల సిమెంటు బిళ్ళలను కొత్తవి నిర్మించకుండా పాత వాటినే ఉపయోగిస్తున్నారు. వాటిలో కొన్ని పగిలిపోయి ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. శి«థిలావస్థకు చేరిన బిళ్ళలపై నిర్మాణాలు చేస్తే అవి ఎంత వరకు ఉపయోగకరం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే బస్టాండ్ సెంటరు నుంచి జిల్లా పరిషత్ ఆఫీసు వరకు చేపట్టిన డివైడర్ పనులకు టెండర్లు వేయకుండానే పనులు చేపట్టడం, తాజాగా ఫుట్‌పాత్‌కు అనుమతులు లేకుండానే పనులు చేపట్టడం వెనుక మతలబేమిటో అధికారులే చెప్పాలి. కాంట్రాక్టర్ల వద్ద నుంచి మున్సిపాలిటీలో కొందరు అధికారులు పెద్దమొత్తంలో మామూళ్ళను దండుకున్నట్లు తెలుస్తోంది. అందువలనే ఈ బాగోతాన్ని చూసీచూడనట్లు వదిలేశారన్న ఆరోపణలు ప్రజల్నుంచి వినిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ^è ర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు లేని మాట వాస్తవమే క్వాలిటి కంట్రోల్ విభాగం నుంచి అనుమతులు లేని మాట వాస్తవమేనని మున్సిపల్ ఇంజనీర్ కామేశ్వరావు అన్నారు. ఇంటర్నెల్ ల్యాబ్‌లో పరిశీలించిన తర్వాతే పనులు చేపట్టాం, విరిగిన గోడలను మళ్ళీ కట్టిస్తాం అని చెప్పారు. : కామేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ -
జనం సొమ్ముతో జల్సాలు.. పాలన గాలికి
– చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత ఉదయభాను ధ్వజం – పుష్కరాల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ వత్సవాయి : గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి చంద్రబాబు జల్సాలు చేస్తూ పాలనను గాలికి వదిలేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆరోపించారు. శనివారం వత్సవాయిలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు చేస్తున్న దుబారా ఖర్చులకు అంతం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని చెబుతూనే పుష్కర ముగింపునకు విదేశాల నుంచి బాణాసంచా తెచ్చి కాల్పడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారన్నారు. మొత్తం మీద పుష్కరాలకు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెబుతున్న ప్రభుత్వం కేవలం రూ. 500 నుంచి 600 కోట్ల మేరకే ఖర్చు పెట్టినట్లు నిపుణులు చెబుతున్నారని మిగతా నిధులు నాయకుల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. చంద్రబాబు ప్రచారపిచ్చిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రానున్న కాలంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో పేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇంజం కేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
బాబు గారి పుష్కర ప్రచారం
-
రైల్వేకు రూ.47 కోట్ల ఆదాయం
విజయవాడ (రైల్వేస్టేషన్) : కృష్ణా పుష్కర యాత్రికుల ద్వారా రైల్వే శాఖకు రూ.47 కోట్ల ఆదాయం లభించిందని విజయవాడ డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆదాయం సాధారణ, రిజర్వేషన్ టికెట్ల ద్వారా లభించినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 42 లక్షల మంది యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో కృష్ణా పుష్కరాలకు విచ్చేశారని, వారందరిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. పుష్కరాలకు సాధారణ రైళ్లతోపాటు 625 ప్రత్యేక రైళ్లను నడిపామని వివరించారు. పలు రైళ్లకు 4,871 అదనపు బోగీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్పీఎఫ్ సిబ్బంది 1,250 మంది, జీఆర్పీ సిబ్బంది 1,400 మంది బందోబస్తు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. యాత్రికులకు కమర్షియల్ సహా అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు విశేష సేవలందించారని తెలిపారు. -
పుష్కర జ్ఞాపకం
-
పుష్కరం పరిపూర్ణం
-
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాల 12 రోజులలో 18.04 లక్షల మంది యాత్రికులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న యాత్రికులు 22 లక్షల లడ్డూలను ప్రసాదంగా అందుకున్నారు. అమ్మవారి అన్న ప్రసాదాన్ని రెండు లక్షల మందికి పంపిణీ చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. చివరి రోజైన మంగళవారం అమ్మవారి సన్నిధికి యాత్రికుల తాకిడి అధికంగానే ఉంది. మంగళవారం 1.75 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ యాత్రికులతోపాటు పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వీఐపీలకు ఆలయ ఈవో సూర్యకుమారి సాదరంగా స్వాగతం పలికారు. పుష్కర యాత్రికులకు దుర్గమ్మ కుంకుమ ప్రసాదం నగరంలోని వేర్వేరు స్నానఘాట్లలో పుష్కర స్నానమాచరించిన యాత్రికులకు చివరి రోజున దుర్గమ్మ కుంకుమ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బస్టాండ్‌లోని నమూనా ఆలయంతోపాటు పున్నమి, భవానీ, సంగమం స్నాన ఘాట్లలో యాత్రికులకు అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం కాకపోయినా కుంకుమ ప్రసాదాన్ని నేరుగా యాత్రికులకు అందచేయడం సంతోషదాయకమని యాత్రికులు పేర్కొన్నారు. 12వ రోజున 1.75 లక్షల మంది.. పుష్కరాలలో 12వ రోజున 1.75 లక్షల మంది యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగింది. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన యాత్రికులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. మంగళవారం 2.25 లక్షల లడ్డూలను దేవస్థానం విక్రయించింది. అమ్మవారి అన్న ప్రసాదాన్ని 21,600 మందికి అందచేశారు. -
కృష్ణమ్మ పులకరించింది
-
భక్తులు పరవశించిన వేళ
-
జలజాతర చివరి అంకం
-
పుష్కర సేవలు భేష్
– 18 రోజుల పాటు శ్రమించిన టీటీడీ – 11.27 లక్షల మందికి అన్నప్రసాదాల పంపిణీ – నమూనా ఆలయంలో 5 లక్షల మందికి దర్శనం – ఫల, పుష్ప, ఫోటో ఎగ్జిబిషన్లకు విశేష ఆదరణ – ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపిన ఈవో, ఛైర్మన్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి : కృష్ణా పుష్కరాల్లో యాత్రికులకు టీటీడీ ఉద్యోగులు అందిస్తోన్న వివిధ రకాల సేవలు మంగళవారంతో ముగిశాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 9 ఘాట్లలో ఈ నెల 6న మొదలైన టీటీడీ సేవలు 23న జరిగిన చక్రస్నానంతో ముగిశాయి. 650 మంది టీటీడీ ఉద్యోగులు, 1500 మంది శ్రీవారి సేవకులు 18 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఈవో సాంబశివరావు ఉద్యోగులందరినీ కలిసి పుష్కర సేవలు బాగున్నాయనీ, ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసేందుకు ఈ నెల మొదటి వారం నుంచే టీటీడీ సిద్ధమైంది. రూ.2 కోట్లతో విజయవాడ స్వరాజ్ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించింది. ఇక్కడే ఉన్న టీటీడీ ఆవరణలో పెద్ద ఎత్తున ఫల, పుష్ఫ, ఫోటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసింది. తిరుపతి అన్నమాచార్య, దాససాహిత్య, ధార్మిక పరిషత్ కళా బృందాలను పంపి తిరుమల వేంకటేశుని వైభవ ప్రాశస్త్యాన్ని తెలియజేసే సాంస్కృతిక, అధ్యాత్మిక కార్యక్రమాలను రోజూ నిర్వహించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని విజయవాడ, అమరావతి, శ్రీకాకుళం, హంసలదీవి, సీతానగరం ఘాట్లలో ప్రత్యేక వేదికలను నిర్మించి నిత్యం యాత్రికులను అన్నప్రసాదాన్ని పంపిణీ చేసింది. మొత్తం 11.27 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదాన్ని పంపిణీ చేసింది. ఇకపోతే శ్రీవారి నమూనా ఆలయంలో 5 లక్షల మంది యాత్రికులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించింది. ఇదిలా ఉండగా, టీటీడీ ఏర్పాటు చేసిన ఫల,పుష్ప, ఫోటో ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. పురాణాల్లోని వివిధ ఘట్టాలను వివరిస్తూ టీటీడీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ యాత్రికులను కట్టిపడేసింది. సుమారు 4 లక్షల మంది యాత్రికులు వీటిని సందర్శించారు. సేవకుల సేవలు ప్రశంసనీయం... శ్రీవారి సేవకులు పుష్కర యాత్రికులకు విశేషమైన సేవలందించారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాలకు చెందిన 1500 మంది శ్రీవారి సేవకులు ప్రధాన ఘాట్లలో నిత్యం సేవలందించారు. భరించలేని ఎండలోనూ వీరు యాత్రికులకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, పిండప్రదానం, వైద్య సేవా కేంద్రాలు, వృద్ధులను ట్రైసైకిళ్లపై ఘాట్ల వరకూ చేర్చడం, వారికి రాత్రిళ్లు వసతులు కల్పించడం వంటి సేవా కార్యక్రమాల్లో సేవకులు విశేషంగా శ్రమించారు. టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులు చంద్రశేఖర్‌రెడ్డిలతో పాటు అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, టీటీడీ పీఆర్వో రవికుమార్, టీటీడీ వేదపండితులు డాలర్ శేషాద్రి ప్రభృతులు సేవల్లో పాల్గొన్నారు. -
కృష్ణమ్మ కృప కోసం
-
దత్తపీఠంలో పూర్ణాహుతి
విజయవాడ(ఆటోనగర్) : కృష్ణా పుష్కరాల సందర్భంగా పటమటలోని దత్తపీఠంలో గణపతి సచ్చిదానంద స్వామి విశేష పూజలు నిర్వహించారు. తొలుత గోపూజ నిర్వహించారు. అనంతరం ^è క్రార్చన చేసి పది రోజులుగా దత్తపీఠంలో నిర్వహిస్తున్న రుద్రహోమానికి పూర్ణాహుతి చేశారు. భక్తులను ఉద్దేశించి స్వామి అనుగ్రహ భాష్యం చేస్తూ యజుర్వేద జఠాపారాయణ మహిమను వర్ణిస్తూ ఈ పారాయణ వేద మంత్రాలు విన్నంతనే సకల పాపములు నశిస్తాయని, ప్రతిఒక్కరూ సాత్విక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. మధ్యాహ్నం స్వామి కృష్ణా తీరాన ఉన్న ముక్త్యాల కోటిలింగ క్షేత్రం వద్ద నూతనంగా నిర్మించిన గణపతి సచ్చిదానంద ఘాట్‌ను సందర్శించారు. అనంతరం స్వామి పుష్కర స్నానమాచరించి అక్కడ ప్రతిష్టించిన దత్తపాదుకలకు విశేష పూజలు చేశారు. భక్తులందరికీ పుష్కర జలాన్ని సంప్రోక్షణ చేశారు. సాయంత్రం కృష్ణానదికి హారతులిచ్చారు. ఈ సందర్భంగా ముక్త్యాల నదీ తీర స్థల పురాణాన్ని గురించి ప్రస్తావిస్తూ ఈ తీరం ప్రాచీన కాలంలో దత్త ఉపాసకులైన వాసుదేవానంద సరస్వతీ స్వామి సంచరించిన మహిమ గల ప్రదేశమని అన్నారు. -
వైద్యో నారాయణో హరి
4 లక్షల మంది భక్తులకు వెద్య సేవలు పక్కా ప్రణాళిక అమలు జిల్లాలో 165 వైద్య శిబిరాలు 300 మంది స్పెషాలిటీ వైద్యులు ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ విజయవాడ (లబ్బీపేట) : వేలాదిమంది భక్తుల రాకపోకలు, వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువ. ఎప్పడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. అయినా పక్కా ప్రణాళికతో వైద్య ఆరోగ్యశాఖ సేవలందించింది. ఇందుకు మూడంచెల విధానాన్ని అమలు చేసి అనారోగ్యానికి గురైన యాత్రికులకు తక్షణ వైద్య సహాయం అందించి క్రిటికల్ కేసులను సకాలంలో ప్రత్యేక పుష్కర వార్డులకు తరలించి ప్రాణనష్టం జరగకుండా చూసింది. పుష్కరాల్లో ఇప్పటివరకు 4 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. మూడంచెల వ్యవస్థ అమలు జిల్లాలో 165 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా వాటిలో 300ల మంది స్పెషాలిటీæ వైద్యులు (ఆరో్ధపెడిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా)లతో పాటు మరో 300 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వహించారు. వైద్య శిబిరంతో పాటు ఫస్ట్ లెవల్ రిఫరల్ సెంటర్, ప్రత్యేక వార్డులు ఇలా మూడంచెల వ్యవస్థను అమలు చేశారు. తొలుత వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి అనంతరం సమీపంలోని ఫస్ట్‌లెవల్ రిఫరల్ సెంటర్‌కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం అవసరమైతే ప్రభుత్వాస్పత్రిలోని ప్రత్యేక వార్డులకు తరలించారు. వందకు పైగా అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచడంతో పాటు రోగులను సకాలంలో ఆస్పత్రులకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. ఉన్నత స్థాయి పర్యవేక్షణ జిల్లాకు నోడల్ ఆఫీసర్‌గా డీఎంహెచ్ఓ డాక్టర్ ఆర్. నాగమల్లేశ్వరి వ్యవహరించగా పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి ఉన్నత స్థాయి అధికారులందరూ నగరంలోనే మోహరించి సేవలను పర్యవేక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌లతో పాటు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి, స్పెషలాఫీసర్‌గా నియమితులైన పారా మెడికల్ బోర్డు కార్యదర్శి డాక్టర్ టి. వేణుగోపాలరావు, ఇతర అడిషినల్ డైరెక్టర్స్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. సమన్వయంతో సేవలు జిల్లాలోని వైద్యులు, సిబ్బందితో పాటు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది సిబ్బందికి విధులు కేటాయించి వారందరినీ సమన్వయ పరుస్తూ సేవలందించడంలో డీఎంహెచ్‌వో విజయం సాధించారు. ఒకవైపు సిబ్బందికి సకాలంలో భోజనాలు అందకున్నా అరటిపండ్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తూ వారు సేవలు అందించేలా కృషి చేశారు. -
రెండు వేల కోట్లతో పుష్కర ఏర్పాట్లు
ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు విజయవాడ(భవానీపురం) ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలతో భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కర ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సోమవారం ఆయన పున్నమి(వీఐపీ) ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత గోదావరి, కృష్ణా పుష్కరాలు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అమరావతి రాజధానిలో తొలి కృష్ణా పుష్కరాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పుష్కరాలలో చేసిన సేవలు అభినందనీయమని అన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ నదులను గౌరవించాలని, పితృదేవతలు దీవించే విధంగా పిండ ప్రదానాలు చేయాలని అన్నారు. -
నేత్రపర్వంగా కూచిపూడి నృత్యాలు
విజయవాడ కల్చరల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. కార్యక్రమ ప్రారంభంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు అన్నవరపు రామస్వామి వయోలిన్ కచేరీ నిర్వహించారు. గురువందనంతో ప్రారంభించి వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. మరో సంగీత విద్వాంసురాలు విశాఖకు చెందిన మండా సుధారాణి నిర్వహిచిన గాత్ర సంగీత సభ ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా కె.వీ.సత్యనారాయణ బృందం, టి.శ్రావణి, శివసుధీర్‌కుమార్(భక్తిరంజని) న్యూఢిల్లీకి చెందిన సంగీతశర్మ ప్యూజన్ డాన్స్‌తో అలరించారు. మహాబృందనాట్య వేదిక మార్పు ప్రభుత్వం మహా బృంద నాట్యం వేదిక ఇందిరాగాంధీ స్టేడియంగా ప్రకటించింది. కళాకారులకు అలానే సమాచారం అందించారు. ప్రేక్షకుల సంఖ్య పలుచగా ఉండడంతో దానిని సంగమ ప్రాంతానికి మార్చారు. సమాచారం లేక కళాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే కళాకారులు పుష్కర కృష్ణ గీతానికి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చని రెండురోజుల కిందట ప్రకటించారు. చివరి నిమిషంలో స్టేడియంలో ప్రభుత్వం మరో కార్యక్రమం నిర్వహించటంతో వేదికను మరోచోటుకు మార్చారు. కళాకారులు వ్యయప్రయాసల కోర్చి సంగమం ప్రాంతానికి చేరుకోవాల్సి వచ్చింది. -
సరిహద్దుల్లేని సేవ
వన్‌టౌన్ : సేవకు సరిహద్దులుండవు. వారికి కూడా కృష్ణా పుష్కరాలున్నా.. ఇక్కడ బందోబస్తు కోసం వచ్చారు. çకృష్ణా పుష్కరాలకు కర్ణాటక పోలీసులు బందోబస్తు సేవలందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కర్ణాటక సర్కారు వారిని పంపించింది. సుమారు 41 మంది పోలీసుల బృందం పది రోజులుగా నగరంలో పుష్కరాలకు వస్తున్న భక్తులకు సేవలందిస్తున్నారు. ఒక డీసీపీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐ స్థాయి అధికారులతో పాటుగా 32 మంది పోలీసులు నగరానికి వచ్చారు. వారిలో కొంతమంది దుర్గాఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అలాగే మరికొంతమంది కనకదుర్గా నగర్ సమీపంలోని దుర్గగుడి అన్నదాన వితరణ కేంద్రం వద్ద సేవలందిస్తున్నారు. వారు సాక్షితో మాట్లాడుతూ పుష్కరాలకు సేవలందించటం ఆనందంగా ఉందన్నారు. -
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రికి కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు యాత్రికులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి యాత్రికులు బారులు తీరారు. ఆదివారం సుమారు 2.20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. ఇక భవానీపురం వైపు నుంచి వచ్చే యాత్రికులను ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి అనుమతించి ఓం టర్నింగ్ వద్ద క్యూలైన్లో కలిపారు. అమ్మవారికి దర్శించుకున్న మంత్రి, ఎంపీ దుర్గమ్మను కార్మికశాఖ మంత్రి కె.అచ్చన్నాయుడు దంపతులు, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో సూర్యకుమారి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానానికి రూ. 26.05 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. -
పుష్కర స్నానంతో సకల శుభాలు
గణపతి సచ్చిదానంద స్వామి విజయవాడ (ఆటోనగర్) : ముక్కోటి దేవతల ఆధ్యాత్మిక తరంగాలు పుష్కర సమయంలో నదిలో ఉంటాయని, ఈ సమయంలో పుష్కరస్నానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం పటమట ఆశ్రమానికి ఆయన విచ్చేశారు. ఆశ్రమ అర్చకులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఆశ్రమంలోని క్షిప్ర గణపతికి, మరకత రాజరాజేశ్వరి, దత్తస్వామి, గంగాధరేశ్వరాలయాలను సందర్శించి హారతులిచ్చి మాట్లాడారు. రాజధాని ఏర్పడిన వెంటనే వచ్చిన మొదటి పుష్కరమని, ఇది శుభమని, రాష్ట్రాభివృద్ధిని సాధించాలని జగన్మాతను కోరుకుంటున్నానని స్వామీజీ అన్నారు. -
ఎటు చూసినా జనమే
కిక్కిరిసిన రైల్వే స్టేషన్ సాక్షి, విజయవాడ : జనం.. జనం.. ఎటు చూసినా జనమే.. ఏ ప్లాట్‌ఫాం చూసినా కిక్కిరిసిన యాత్రికులు.. అసలైన పుష్కర శోభ ఆదివారం కనిపించింది. తెల్లవారు జాము నుంచి రాత్రి పొద్దు పోయే వరకు ఇసుకవేస్తే రాలనంతంగా పుష్కర యాత్రికులు వచ్చారు. దీంతో స్టేషన్ పరిసర ప్రాంతాలు యాత్రికులతో నిండిపోయాయి. సాధారణంగా రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు విజయవాడ రైల్వేస్టేçÙన్కు వస్తారని అంచనా. అయితే ఒక్క ఆదివారమే నాలుగైదు లక్షల మంది వచ్చారని భావిస్తున్నారు. తనిఖీ అనంతరమే స్టేషన్లోకి.. రైల్వే స్టేషన్‌లోని వెళ్లాలంటే జాగా లేదు. స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరి పోవడంతో స్టేషన్లోకి వచ్చే వారిని పోలీసులు తనిఖీలు చేసి లోపలకు పంపారు. రిజర్వేషన్లు టిక్కెట్లు లేకుండా, కుటుంబ సభ్యులు లేకుండా అనుమానంగా వున్న వారిని స్టేషన్లోకి అనుమతించకపోవడం గమన్హారం. ఇక వచ్చివెళ్లే ప్రయాణికుల వద్ద రోప్‌లకు బదులుగా పోలీసులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నిలబడి తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త వహించారు. రైళ్ల సమాచారం ముందుగానే.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏ ప్లాట్‌ఫాం పైకి ఏ రైలు వస్తుంది. ఒకే ప్లాట్ ఫాం పైకి ఒక రైలు తరువాత మరొక రైలు, దాని తరువాత వచ్చే రైళ్ల సమాచారం ముందుగానే ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు తేలికగా రైళ్ల రాకపోకల సమాచారం చేరువైంది. టిక్కెట్ బుకింగ్ కౌంటర్ వద్ద టిక్కెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చీఫ్ ట్రాఫిక్ Sమేనేజర్ స్థాయి అధికారులు నిలబడి మానిటరింగ్ చేశారు. రద్దీని బట్టి ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులకు టిక్కెట్ల జారీలో బిజీబిజీగా గడిపారు. అర్ధరాత్రి వరకు.. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన రద్దీ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగింది. ఏ వైపు వెళ్లే రైలైనా భక్తులు వేళ్లాడుతూ వెళాల్సిన పరిస్థితి కనిపించింది. ప్రత్యేక రైళ్లు ఉన్నా ఏ మాత్రం సరిపోలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలన రైల్వే స్టేడియంలోని పుష్కర్ నగర్‌ను కృష్ణా పుష్కరాల ఫుడ్ ఇన్చార్జ్ బి.రామారావు ఆదివారం సదర్శించారు. యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు 70 లక్షల మంది యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు ఆహార పదార్థాలు అందించాయని వివరించారు. ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం పైన మొదటి అంతస్తులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ కార్యాలయాన్ని)స్పెషల్ రూంగా ఏర్పాటు చేశారు. అక్కడే అన్ని ప్లాట్‌ఫాంలకు సంబంధించి తెరలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, రైల్వే, పోలీసు అధికారులు అక్కడి నుంచే మానిటరింగ్ చేశారు. రైల్వే ఉన్నతాధికారులు ప్రతి ఐదారు నిముషాలకు అక్కడికి వచ్చి ట్రాఫిక్ ఏవిధంగా ఉందో వీడియో స్కీన్స్పై చూసుకుంటూ ఆయా ప్లాట్‌ఫాంలపై ఉన్న సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చారు. -
సత్వరమే సేవలు
బస్‌స్టేషన్ : పండిట్ నెహ్రూ బస్టాండ్‌ను ఆర్టీసీ ఎం.డీ, డీజీపీ నండూరి సాంబశివరావు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండ్‌లో పుష్కర యాత్రికులతో విపరీతమైన రద్దీ నెలకొనడం, రైల్వే డీఆర్ఏం నుంచి రైళ్లు ఖాళీలేవని, అటువైపు సిటీ బస్సులు పంపవద్దని కోరిన నేపథ్యంలో ఆయన బస్టాండ్‌ను సందర్శించి బస్సుల రాకపోకలను పరిశీలించారు. పలువురు ప్రయాణికులతో మాట్లాడి వారి గమ్మస్థానాల్ని తెలుసుకుని కొందరిని ఆర్టీసీ జీపుల్లో రైల్వేస్టేషన్‌కు పంపించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ పెద్దసంఖ్యలో ప్రయాణికులు బస్టాండ్‌కు వచ్చారని, వారందర్ని వేగంగా పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం కూడా ఎక్కువమంది యాత్రికులు రావచ్చని, ఇబ్బంది లేకుండా గమ్మస్థానాలకు పంపించాలని అధికారులకు సూచించారు. జిల్లాలలోని అన్ని డిపోల నుంచి బస్సుల్ని ఇందుకు రప్పించాలని చెప్పారు. ముందు శాటిలైట్ బస్‌స్టేçÙన్లకు యాత్రికుల్ని పంపిస్తే అక్కడనుంచి ఇతరత్రా ప్రాంతాల బస్సుల్లో వెళ్లిపోతారని అన్నారు. ఆర్టీసీ బస్సులపై పుష్కరాలు ఆధారపడి ఉన్నాయని, శక్తివంచన లేకుండా మరో రెండు రోజులు ‘ఆపరేషన్’ పూర్తి చేయాలన్నారు. -
సంతోషంగా కృష్ణమ్మ చెంత
-
పుష్కర కృష్ణ
-
గోవర్ధనగిరి అలంకారంలో శ్రీవారు
విజయవాడ(గుణదల): పవిత్ర కృష్ణా పుష్కరాల్లో భాగంగా శనివారం గోవర్థనగిరి అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన శ్రీవారి ఆలయ నమూనా నుంచి సమ్మోహితమైన మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి పద్మావతి ఘాట్ లో పుష్కర హారతి అందుకున్నారు. శ్రీవారి ఉత్సవ ఊరేగింపు జరుగుతున్న ప్రాంతాల్లో టీటీడీకి చెందిన చెక్కభజన, కోలాట కళాకారులు సమ్మోహనేతంగా ప్రదర్శించారు. అనంతరం కృష్ణమ్మ సాక్షిగా స్వామివారికి కుంభ హారతి, నక్షత్ర హారతి, కర్పూరహారతి సమర్పించారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన హారతిని టీటీyీ రిటైర్డ్ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హారతి సమర్పించారు. టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు దేవాలయాన్ని దర్శించుకున్నారు. -
కృష్ణా పుష్కర వైభవం మనోహరం
విజయవాడ కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చాటుతున్నాయి. శనివారం ప్రారంభ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఉషాబాల, వాణిబాల వాగ్గేయకార కీర్తనలు ఆలపించారు. ఆంధ్రనాట్యం ప్రాభవాన్ని ప్రచారం చేస్తున్న నాట్యాకళాకారిణి శారద రామకృష్ణ పుష్కర చరిత్రను నృత్యాంశంగా ప్రదర్శించారు. గుడిసేన విష్ణుప్రసాద్ కథను, కుమార సూర్యానారాయణ సంగీతాన్ని అందించారు. ప్రధాన పాత్రలో శారదా రామకృష్ణ, భరత్, సత్యప్రసాద్,దేవ వర్షిణి తదితరులు నృత్యాన్ని అభినయించారు. కార్యక్రమంలో భాగంగా జ్యోస్యుల రామచంద్రమూర్తి అన్నమయ్య, త్యాగరాజు తదితర వాగ్గేయకారుల కీర్తనలకు నృత్యాన్ని అభినయించారు. కృష్ణనది ప్రారంభంనుంచి హంసలదీవిలో సంగమించే దాకా నదీ పరివాహక ప్రాంతంలోని దేవాలయాలు, చారిత్రక వైభవం, పుష్కర చరిత్ర అంశాలుగా నృత్యరూపం సాగుతుంది. -
దొంగలకు బ్రేక్
పుష్కరాల్లో తగ్గిన చోరుల బెడద సీపీ సవాంగ్ పక్కా వ్యూహం సీసీ కెమెరాలు, నిఘాతో క్రిమినల్స్‌కు చెక్ విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో క్రిమినల్ గ్యాంగులపై పోలీసులు పంజా విసిరారు. పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ నాయకత్వంలో పోలీసుల దాడులకు ప్రముఖ క్రిమినల్గ్యాంగులు హ్యాండ్సప్ అనక తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే వేలాది మంది హాజరయ్యే పుష్కరాల్లో దోపిడీల పర్వానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో 12 రాష్ట్రాల నుంచి 20కిపైగా దొంగల ముఠాలు విజయవాడపైకి దండెత్తాయి. పుష్కరాల ప్రారంభం నుంచే సిటీలోని ఘాట్లు, రద్దీ ప్రదేశాల్లో సంచరిస్తూ భక్తుల సొమ్మును దోచుకోవడంతో కలకలం రేగింది. సవాల్‌గా తీసుకున్న సీపీ సవాంగ్ పక్కా ప్రణాళికతో క్రిమినల్స్‌కు చెక్ పెట్టారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా సీసీ కెమెరాల వ్యవస్థతో పోలీసుల పని సులువైంది. కెమెరాల ద్వారా కదలికలను పసిగడుతూ గత 9రోజుల్లో నగరంలో సీసీఎస్ బలగాలు వివిద రాష్ట్రాలకు చెందిన 115 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 49 మంది మహిళలు ఉన్నారు. తమిళనాడు 2, , ఢిల్లీకి చెందిన 1, తెలంగాణ 2 రాష్ట్రానికి చెందిన 3, , ఒడిశా 3, పశ్చిమ బెంగాల్ నుంచి 4, ఉత్తరప్రదేశ్ నుంచి 1, మహారాష్ట్ర నుంచి 3, మధ్యప్రదేశ్ నుంచి 1 గ్యాంగు పట్టుబడ్డాయి. వీరిలో కొందరు నేరం చేస్తూ దొరికిపోగా,మరికొందరు అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడ్డారు. వీరందరూ ఆయా రాష్ట్రాల్లో క్రిమినల్స్‌గా గుర్తింపు ఉన్నట్లు సీపీ సవాంగ్ వివరించారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం 13 కేసులు పెట్టి 11 మంది అంతరాష్ట్ర నేరస్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఒకరు పూజారి వేషధారణలో ఉండగా, మరొకరు హోంగార్డు వేషంలో దొంగతనం చేయటానికి రావడం గమనార్హం. నగలు దోచుకునేందుకు ఉపయోగించే కట్టర్లను దొంగల వద్ద పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. వందలాది మంది మఫ్టీ పోలీసులు దొంగల జాడకోసం నిరంతరం గాలిస్తూనే ఉన్నారు. దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడటం, రసాయనాలు జల్లి, మత్తుమందులు జల్లి చోరీలకు పాల్పడేందుకు వివిధ రాష్ట్రాల దొంగలు పుష్కరాలకు తరలి వచ్చారు. ముందస్తు వ్యూహంతో : సీపీ సవాంగ్ నేరాలు జరగకుండా పకడ్బందీ వ్యూహంతో దొంగతనాలను కట్టడి చేయగలిగామని సీపీ గౌతం సవాంగ్ ‘సాక్షి’కి చెప్పారు. రైల్వేస్టేషన్ బస్టాండ్, స్నానఘట్టాల వద్ద ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల ఆధారంగా క్రిమినల్స్‌ను ముందస్తుగా అదుపులోకి తీసకున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 49 కేసుల్లో రు. 16 లక్షల విలువైన సొత్తు చోరీ అయిందని తెలిపారు. కాగా పోలీసులు రెండు దఫాలుగా 19 మంది నేరగాళ్లను అరెస్టు చేసి రూ. 8.80 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దొరికిన గ్యాంగులను పూర్తి స్థాయిలో విచారించి వారు నేరాలకు పాల్పడితే కేసులు పెడతామన్నారు. -
పురోహితులంటే అంత చులకనా!
ప్రతి విషయానికీ చికాకు పడుతున్న పోలీసులు పిండాలను నదిలో కలపకుండా అడ్డగింత గోదావరి పుష్కరాలకంటే దయనీయం సాక్షి, విజయవాడ : పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నా... పిండప్రదానం చేసే భక్తులు, పురోహితులు నానా అవస్థలు పడుతున్నారు. పోలీసుల నుంచి చీదరింపులు, చీత్కారాలు ఎదురవుతున్నాయని పురోహితులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో పనిచేశామని, అక్కడ కూడా ఇంతగా వేధింపులు లేవని పేర్కొంటున్నారు. పురోహితుల ఆరోపణలు ఇవీ.. ఒకవైపు పిండ ప్రదానం పూజ జరుగుతూనే ఉండంగా శుభ్రత పేరుతో పారిశుధ్య సిబ్బంది నీరు వదులుతున్నారని, దీంతో వారి దుస్తులు తడిసిపోతున్నాయి. తడిదుస్తులతోనే మధ్యాహ్నం వరకూ కూర్చోవాల్సి వస్తోంది. – పావుగంట కంటే ఎక్కువ సేపు పూజ చేయిస్తుంటే త్వరగా ముగించాలంటూ డ్యూటీలో ఉన్న పోలీసులు హుకుం జారీ చేస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – ఎక్కువ మంది పురోహితులు ఒకే ఘాట్‌లో కనిపిస్తే బయటకు వెళ్లాలంటూ వేధిస్తున్నారు. పద్మావతి, కృష్ణవేణి ఘాట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సంగమం వద్దకు వెళ్లమని పోలీసులు సూచిస్తున్నారు. – పిండాలను పట్టుకుని నది వద్దకు రావడంలోనే వలంటీర్లు అడ్డుకుని ఘాట్ చివరకు వెళ్లి వేయాలంటూ ఆక్షలు పెడుతున్నారు. -
భక్తజనంతో కోలాహలం
-
పుష్కర శోభ
-
తొమ్మిదో రోజు కృష్ణమ్మ పుష్కర శోభ
-
కృష్ణా తీరం.. జన సందోహం
-
8 రోజుల్లో రూ.8 కోట్ల ఆదాయం
సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు రైల్వేశాఖ అన్ని సౌకర్యాకల్పిస్తోందని డివిజినల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం రైల్వేస్టేçÙన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే... 8 రోజుల్లో 6,90,510 మంది ప్రయాణికులు విజయవాడ నుంచి ప్రయాణిం చగా రూ.8. 32 కోట్ల ఆదాయం వచ్చింది. షెడ్యూల్డ్ రైళు ్లకాకుండా 626 అదనపు రైళ్లు వేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న విశాఖపట్నం వైపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. 97శాతం రైళ్లు నిర్ణీత సమయంలో నడుస్తున్నాయి. భక్తుల సౌకర్యం కోసం పున్నమి ఘాట్, సంగమం ఘాట్, బస్టాండ్ల వద్ద మిషన్లు పెట్టి రైలు టికెట్లను విక్రయిస్తున్నారు. పార్శిల్ ఆఫీసు వైపు, తారాపేట వైపు, స్టేడియంలోనూ ఏర్పాటు చేసిన పుష్కర నగర్‌లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ∙అవసరం లేకపోవడంతో డబుల్ డెక్కర్ రైలును నడపడం లేదు. పుష్కరాల్లో ఇప్పటి వరకు ఒకే ఒక్క పిక్పాకిటింగ్ జరిగితే నిందితుడ్ని వెంటనే పట్టుకున్నామరు. పోలీసులు పూర్తి అప్రమత్తతో ఉండి నేరాలు జరగకుండా చూస్తున్నారు. విలేకరుల సమావేశంలో చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ గాంధీ, ఏసీఎం రాజశేఖర్ పాల్గొన్నారు. -
పుష్కరాలపై ఎన్జీసీ డాక్యుమెంటరీ
విజయవాడ(గుణదల) : కృష్ణా పుష్కరాలు–2016పై నేషనల్ జాగ్రఫీ చానల్ డాక్యుమెంటరీ తీస్తోంది. జిల్లాలోని వివిధ ఘాట్‌ల్లో యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరించే విధానం, పిండ ప్రదానం చేసే పద్ధతి, దానాలు ఇచ్చే అంశాలపై గంట నిడివి ఉండే డాక్కుమెంటరీ తీయనుంది. ఈ చానల్లో ప్రసారమయ్యే ఇన్సైడ్ ఇండియా అనే కార్యక్రమంలో కృష్ణాపుష్కరాల ప్రాశస్త్యాన్ని, నదీ పరీవాహక ప్రాంతాల విశిష్టతలను, పుణ్యక్షేత్రాలను, ఇక్కడి ఆచార వ్యవహారాలను ఈ కార్యక్రమంలో ప్రసారం చేయనున్నారు. అందుకోసం చానల్ బృదం పద్మావతి ఘాట్‌లో శుక్రవారం ఉదయం గంటపాటు వీడియో షూటింగ్ తీశారని అధికారులు తెలిపారు. -
పన్నెండేళ్ల వేడుక
-
సమతా స్నానం కరిష్యే..
-
కృష్ణా పుష్కరోత్సవం
-
కృష్ణమ్మ చెంత కేరింతలు
-
కృష్ణమ్మ చెంత కేరింతలు
-
కృష్ణమ్మ రైతుల వెలుగు రేఖ
-
పుష్కర సంబరం
-
పుష్కరాల్లో కనిపించని మంత్రులు
-
మునకలు లేకుండానే మమ..!
సాక్షి, అమరావతి : నది ప్రవాహ సమయంలో గతంలో భక్తులు పుణ్యస్నానాలు చేసే వారు. మూడు మునకలు వేస్తే పుష్కర స్నానం అని భక్తులు భావిస్తారు. ప్రస్తు తం కృష్ణానది నీటిలో నిండా తడిసే అవకాశం లేక జల్లు స్నానాలతో పుణ్యస్నానాన్ని ము గించు కోవాల్సిన పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ దిగువన సాగర సంగమం వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 54కు పైగా ఘాట్లలో నీళ్లు లేవు. దీంతో అధికారులు ప్రతామ్నాయాలు ఏర్పాటుచేశారు. కృష్ణా జిల్లా కేంద్రం బందరుకు ప్రధాన కాలువ ద్వారా కృష్ణానది నీరు వచ్చే అవకాశం లేదు. కాలేఖాన్‌పేట సమీపం నాగులేరులో మున్సిపల్ అధికారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోశారు. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గం కావడంతో అత్యుత్సాహంతో నది లో పుష్కర స్నానాన్ని కాలువలో చేయిం చాలని భావించారు. దాదాపు 20 నీటి ట్యాంకర్లు పోసినా నాగులేరు కాలువలో స్నానాలకు నీరు సరిపడేలా లేదు. అధికార యంత్రాంగం రెండు రోజుల వృథాప్రయాసకు తెరదించారు. ప్రకాశం బ్యారేజీ ఎగువున దుర్గాఘాట్, పున్నమిఘాట్‌లలో నీరు సమృద్ధిగానే ఉంది. దిగువన కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్‌లో నీరు తగినంత లేదు. దాదాపు 2.1 కిలోమీటర్లు చిన్న పిల్ల కాలువలా కాంక్రీట్ ఫ్లోరింగ్ చేసి ఇసుక బస్తాలతో గట్టు వేసి నీరు వదులుతున్నా మునకలకు వీలులేకపోవడంతో భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. దీంతో కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలలో జల్లు (షవర్) స్నానాలు ఏర్పాటు చేశారు. విజయవాడకు దిగువన యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు ఘాట్లలోను విచిత్ర పరిస్థితి నెలకొంది. నదిలో గతంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో నిలిచిన నీ టితో పుష్కరస్నానం అయ్యిందనిపిస్తున్నారు. మురికినీటిలో వ్యాధుల బారిన పడతామనే జల్లు స్నానాలు చేస్తున్నారు. అవనిగడ్డ ప్రాంతం కొత్తపేటలో జల్లు స్నానాలు ఏర్పాటుచేశారు. తీర ప్రాం తంలోని కృష్ణానది పాయలో సముద్రపు పోటుకు వచ్చే నీటిని గజఈతగాళ్లు డబ్బాలతో తెచ్చి ఇస్తే భక్తులు నెత్తిన పో సుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో బోరువేసి మోటారు ద్వారా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువున గుంటూరు జిల్లాలో చాలా ఘా ట్లలో కనీసం జల్లు స్నానాలు కూడా లేని పరి స్థితి నెలకొనడం కొసమెరుపు. -
లోపలను సరిదిద్దుతున్నాం
పుష్కర శిబిరాల్లో 2.20 లక్షల మందికి పరీక్షలు ‘సాక్షి’తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు అరుణకుమారి విజయవాడ(లబ్బీపేట) : కృష్ణా, గుంటూరు జిల్లాలో పుష్కరఘాట్లు, వార్డుల్లో 2.20 లక్షల మంది యాత్రికులకు వైద్య సేవలందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) డాక్టర్ అరుణకుమారి చెప్పారు. వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో 215 మందిని చేర్చి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 3 వేల మందికిపైగా వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నట్లు వివరించారు. పాత ప్రభుత్వాస్పత్రిలోని వైద్య ఆరోగ్యశాఖ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో పుష్కరాల్లో అందిస్తున్న వైద్య సేవలను ఆమె సాక్షికి వివరించారు. లోపాలను సరిదిద్దుకుంటున్నాం.. తొలుత వైద్య శిబిరాలు ఏర్పాటులో కొన్ని లోపాలు గుర్తించాం, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రథమ చికిత్స, ఫస్ట్‌లెవల్ రిఫరల్ సెంటర్, ప్రత్యేక వార్డులు అనే మూడంచెల వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. మందులు సిద్ధంగా ఉంచాం.. అన్ని వైద్య శిబిరాల్లో మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం. కుక్క, పాము కాటుకు కూడా మందులు సిద్ధం ఉంచినట్లు పేర్కొన్నారు. ఆయాసంతో వచ్చిన వారికోసం నెబిలేజర్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సిలిండర్స్ అవసరం లేకుండా గాలిలోని ఆక్సిజన్‌ను సేకరించి రోగులకు అందించే‘ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్’ పరికరాలు ఫస్ట్‌లెవల్ రిఫరల్ సెంటర్లో అందుబాటులోఉంచినట్లు ఆమె తెలిపారు. శిబిరాలకు ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరంతో ఎక్కువ మంది వస్తున్నారని వివరించారు. సేవలను పుష్కరాల ముగిసే వరకు పూర్తి స్థాయిలో అందిస్తామని డాక్టర్ అరుణకుమారి వివరించారు. -
కర్షకబాంధవి కృష్ణమ్మ
-
ఆరో రోజు పుష్కర శోభ
-
ఆరో రోజు కృష్ణమ్మ పుష్కర శోభ
-
సీతానగరం ఘాట్ వద్ద బారికేడ్లు తొలగింపు
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా సీతానగరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగిస్తున్నారు. భారీ అంచనాలతో కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చుచేస్తోంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేసింది. అందులో భాగంగా దుర్గా, కృష్ణవేణి, పున్నమి, సీతానగరం, పద్మావతి, తాళ్లాయపాలెం, అమరావతి, పవిత్రసంగమం ఘాట్లు ముఖ్యమైనవి. ఒక్కో ఘాట్‌కు సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసింది. ఘాట్ వద్ద రూ.15 లక్షలతో ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లలలో సీతానగరం ఘాట్‌కు ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారని భావించిన అధికారయంత్రాంగం ఉండవల్లి సెంటర్ నుంచి మూడులైన్ల బారికేడ్లను ఏర్పాటు చేసింది. కాని ఆ మేరకు యాత్రికులు రాకపోవడంతో ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నారు. -
కృష్ణవేణీ నమోస్తుతే..!
-
పుష్కరస్నానంలో హై‘టెక్’లు..
సాక్షి, అమరావతి : నది ప్రవాహ సమయంలో భకు ్తలు చెంబులతో తడుపుకొని పుణ్యస్నానం అయ్యిందనేపించేవారు గతం లో. మరి ఇప్పుడో.. పరిస్థితి తారుమారు. కృష్ణా నది నీటిలో నిండా తడిసే అవకాశం లేదు. జల్లు స్నానాలతో పుణ్యస్నానాన్నిముగించుకోవాల్సిన పరిస్థితి. 2003 పుష్కరాల్లో గోదావరికి నీటి కొరత ఏర్పడింది. నరసాపురంలో తొలి సారి షవర్లతో స్నానాలకు తెరతీశారు. ఇప్పుడు కృష్ణా పుష్కరాల్లో ప్రకాశం బ్యా రేజి దిగువన అమలుకు సిద్దం చేశారు. పుష్కల జలసిరిలో మూడు మునకలు వేస్తే పుష్కర స్నానం అని భక్తులు భావిస్తారు. 12 ఏళ్లకు ఒకమారు పుణ్యస్నానం చేసేందుకు ప్రజల సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. అటువంటిది తల తడుపుకొనే అవకాశం లేకపోతే వారి మనోవేదన వర్ణనాతీతం. ప్రకాశం బ్యా రేజి దిగువన సాగర సంగమం వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సు మారు 54కి పైగా ఘాట్లలో జలం లేదు. పుణ్యఫలం దక్కదని భక్తుల ఆం దోళన దృష్టిలో పెట్టుకుని ప్రతామ్నాయ మార్గాలతో ఆకట్టుకునే ప్రయత్నాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లా కేంద్రం బందరుకు ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నది నీరు వచ్చే అవకాశం లేదు. కాలేఖాన్‌పేట సమీప నాగులేరులో మున్సిపల్ అధికారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోశారు. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గం కావడంతో అత్యుత్సాహంతో నదిలో పుష్కర స్నానాన్ని కాలువలో చేయించాలని భావించారు. దాదా పు 20 నీటి ట్యాంకర్లు పోసినా నాగులేరు కాలువలో స్నానాలకు నీరు సరిపడేలా లేదు. అధికార యంత్రాంగం రెం డు రోజుల వృధాప్రయాసకు తెరదించారు. ప్రకాశం బ్యాకేజి ఎగువన దుర్గాఘాట్, పున్నమిఘాట్‌లలో నీరు సమృద్ధిగానే ఉంది. దిగువన కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్‌లో నీరు తగి నంత లేదు. దాదాపు 2.1 కిలోమీటర్లు చిన్న పిల్ల కాలువలో కాంక్రీట్ ఫ్లోరింగ్ చేసి ఇసుక బస్తాలతో గట్టు వేసి నీరు వదులుతున్నా అవి మొదటి రోజు మోకాలి లో తు రావడమే గగనమైంది. రెండో రోజు నడుం వరకు వచ్చేలా విడుదల చేశారు. భక్తులు అసంతృప్తికి లోనవుతుండటంతో కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలలో జల్లు(షవర్)స్నానాలు ఏర్పాటు చేశారు. విజయవాడకు దిగువన యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు ఘాట్లలోను విచిత్ర పరిస్థితి నెలకొంది. నదిలో గతంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో నిలిచిన నీటితో పుష్కరస్నానం అయ్యిందనిపిస్తున్నారు. మురికినీటిలో రోగాల బారిన పడతామనే జల్లు స్నానాలు చేస్తున్నారు. అవనిగడ్డ(దివిసీమ) ప్రాంతంలో కొత్తపేటలో జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతంలోని కృష్ణా నది పాయలో సముద్రపు పోటుకు వచ్చే నీటిని గజ ఈతగాళ్లు డబ్బాలతో తెచ్చి ఇస్తే భక్తులు నెత్తిన పోసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో బోరువేసి మోటారు ద్వారా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యాకేజీ దిగువన గుంటూరు జిల్లాలో చాలా ఘాట్లలో కనీసం జల్లు స్నానాలు కూడా లేని పరిస్థితి నెలకొనడం కొసమెరుపు. -
ఎంతంత దూరం..
యాత్రికుల తికమక బస్సుల కోసం కిలో మీటర్ల దూరం నడక సక్రమంగా రూటు చెప్పని పోలీసులు సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల యాత్రికులు అడుగడుగునా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రయాణానికి సంబంధించిన వివరాలు అందించడంలో విఫలమవుతున్నారు. పుణ్యం కోసం పుష్కరాలకు వస్తే పోలీసుల ఆంక్షలతో కిలో మీటర్ల కొద్ది దూరం నడవాల్సి వస్తోంది. బస్సు కోసం నడవాల్సిందే.. 50 అడుగుల దూరం వెళ్లితే గమ్యం చేర్చే బస్సులను ఎక్కాల్సి ఉన్నా స్థానిక పోలీసుల తికమక సమా«ధానం, ఆంక్షలతో రెండు కిలో మీటర్లు నడవాల్సి వస్తోంది. మంగళవారం పున్నమి ఘాట్, భవానీఘాట్లలో భక్తుల అవస్థలు పడ్డారు. భవానీ ఘాట్‌లో స్నానం చేసి దుర్గమ్మ గుడికి లే దా మరో చోటకీ వెళ్లాలంటే స్వాతి సెంటర్లో బస్సు ఎక్కాలి , కానీ అక్కడ వెళ్లి తాము వెళ్లాల్సిన బస్సు అడ్రస్ అడిగితే పోలీసులు పున్నమి ఘాట్ జంక్షన్లోకి వెళ్లి ఎక్కాలని సమాధానం ఇస్తున్నారు. కానీ అక్కడ వెళ్లాలంటే పోలీసుల ఆంక్షలు వల్ల రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ జంక్షన్‌కు వెళ్లినా అక్కడ కూడా సరైన సమాధానం రావటం లేదు. బస్సుల అడ్రస్ తెలియక సామాన్య భక్తులు తికమక పడి అవస్థలు పడుతున్నారు. భవానీ ఘాట్ నుంచి పున్నమి ఘాట్‌కు వెళ్లాలంటే 50 అడుగుల దూరం ఉన్నా ట్రాఫిక్ మళ్లించడంతో సొరంగమార్గం గుండా రెండు కిలో మీటర్ల వరకు భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. దీంతో యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఐదో రోజు కనిపించని భక్తుల సందడి
-
చిన్నారుల చిద్విలాసం
-
ఐదో రోజు కృష్ణమ్మ పుష్కర శోభ
-
చల్లని కృష్ణమ్మ చెంత
-
కృష్ణమ్మ మన అన్నపూర్ణమ్మ
-
రైల్వే అంచనాలు తప్పాయ్!
పలుచగా పుష్కర యాత్రికులు దాదాపు రైళ్లన్నీ ఖాళీయే మూడోరోజే లక్ష దాటిన ప్రయాణికులు సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఈసారి అంతే రద్దీ ఉంటుందని భావించిన రైల్వేశాఖ భారీగా ఏర్పాట్లు చేసినా ఆ స్థాయిలో స్పందన లేకపోవడంతో పునరాలోచనలో పడింది. కృష్ణా పుష్కరాలకు తొలి మూడు రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది వచ్చారని అంచనా వేస్తున్నారు. తొలిరోజు 47 వేల మంది రెండురోజు 77 వేల మంది, మూడవరోజు 1.5 లక్షమంది ప్రయాణికులు వచ్చారని ఆ శాఖ అంచనా. ప్రతి రోజు మూడు లక్షల మంది భక్తులు వస్తారని భావించిన రైల్వేశాఖ ఒకేరోజు ఐదు లక్షల మంది భక్తులు వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అయితే లక్షన్నర లోపే వచ్చారని స్పష్టమైంది. శాటిలైట్ స్టేషన్లలో రద్దీ తక్కువే ! పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయడంతో మధురానగర్, గుణదల, రాయనపాడు, కృష్ణాకెనాల్ స్టేషన్లను శాటిలైట్ స్టేషన్‌గా ప్రకటించి కొన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రైళ్లలో వచ్చి ఆయా స్టేషన్లలో దిగేభక్తుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. ఒక్క గుణదల స్టేషన్లోనే రోజు వెయ్యి, పదిహేను వందల మంది భక్తులు దిగుతున్నారు. మిగిలిన మూడు స్టేషన్లలో రెండు, మూడు వందల మంది కంటే ఎక్కువ రావడం లేదని రైల్వే కమర్షియల్ కంట్రోల్ అధికారుల కథనం. ఇక ప్రత్యేకరైళ్లలోనూ రద్దీ ఏ మాత్రం ఉండటం లేదు. అనేక బోగీలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. రాతమారిన రాయనపాడు రాయనపాడు (విజయవాడరూరల్): కృష్ణాపుష్కరాల సందర్భంగా రాయనపాడులో ఏర్పాటు చేసిన శాటిలైటు రైల్వేస్టేషన్లో వివిధ ప్రాంతాలనుంచి వెడుతున్న రైళ్ళు ఆగుతున్నాయి. రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాలనుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకోసం రైల్వేశాఖ ఏర్పాటు చేసిన రైళ్ళు రాయనపాడు రైల్వేస్టేషన్ వచ్చి వెళుతున్నాయి. హైదరాబాదు ఆపై ప్రాంతాలనుంచి వచ్చే రైళ్ళకు కొండపల్లి రైల్వేస్టేషన్లో స్టాపు వుండటంతో భక్తులు అక్కడదిగి పవిత్రసంగమం వైపు వెడుతున్నారు. కాగా, శాటిలైటు రైల్వేస్టేషన్ ఏర్పాటు వల్ల రాయనపాడులో 17 ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగివెడుతున్నాయి. ఆదివారం హూరా–హైదరాబాదు, తిరువంతపురం–ఢిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్, కృష్ణా ఎక్ష్ప్రెస్ దూరప్రయాణం చేసే రైళ్ళు ఆగాయి. 200 కిలోమీటర్ల పైబడి దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణకులకు మూడు రోజుల ముందుగా రిజర్వేషన్ టిక్కెట్లబుక్కింగ్ సదుపాయాలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. -
కిటకిటలాడిన రైల్వే స్టేషన్
విజయవాడ (రైల్వేస్టేషన్) : విజయవాడ రైల్వేస్టేషన్ ఆదివారం కిటకిటలాడింది. రైళ్లన్నీ కిక్కిరిసి ప్రయాణించాయి. సెలవు కావడంతో కృష్ణా పుష్కరాలకు యాత్రికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫారాలు ప్రయాణికులతో కిక్కిరిశాయి. విశాఖపట్నం, చెన్నై, తిరుపతి, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చిన రైళ్లు కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్యాసింజెర్ రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ నెలకొంది. శాటిలైట్ స్టేషన్లయిన మధురానగర్, గుణదల, రాయనపాడు, కృష్ణాకెనాల్ జంక్షన్లలోనూ రద్దీ నెలకొంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డీఆర్ఎం అశోక్‌కుమార్, ఏడీఆర్ఎం కె.వేణుగోపాలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. -
పుష్కర పులకరింత
-
మూడో రోజు కృష్ణమ్మ పుష్కర శోభ
-
వరుస సెలవులతో పెరిగిన రద్దీ
-
నీటిలో క్లోరిన్ ఎంతుంది?
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గాఘాట్, వీఐపీ ఘాట్‌లోని నీటిలో ప్రతి గంటకు ఒకసారి క్లోరిన్ శాతాన్ని వాటర్ బోర్డు సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. సీతానగరంలోని కృష్ణానది జలాలలో ప్రమాదకరమైన ఈ–కొలి బ్యాక్టీరియా ఉందనే కథనాలతో అప్రమత్తమైన వాటర్ బోర్డు సిబ్బంది ప్రతి గంటకు ఘాట్‌లోని నీటిని తనిఖీ చేస్తున్నారు. క్లోరిన్ కలపడం వల్ల నీటిలో వ్యాధికారకాలు నశిస్తాయి. సాధారణ స్థాయిలో క్లోరిన్ 0.5 పీపీ ఉండాల్సి ఉండగా, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో 1 పీపీ క్లోరిన్ ఉండేలా చూస్తున్నట్లు విశాఖపట్నం రీజనల్ పబ్లిక్ హెల్త్ వాటర్ ఎనలిస్టు పీ. వెంకటరమణ పేర్కొన్నారు. నీటిలో ఏ మాత్రం క్లోరిన్ శాతం తగ్గుముఖం పట్టినా వెంటనే పెంచుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం స్నాన ఘాట్లలో క్లోరిన్ బస్తాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గంట..గంటకు నీటి తనిఖీలు: మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ (వన్‌టౌన్) : కృష్ణానదిలో నీటిని గంటగంటకు పరీక్షలు చేసి చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం దుర్గాఘాట్‌ను పరిశీలించారు. నీటిపారుదల శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో నీటి నమూనాలను పరిశీలించారు. నీటి ప్రవాహం నిల్వ ఉంటేనే సమస్యలు ఉంటాయని, దుర్గాఘాట్‌లో నీటి ప్రవాహం 90శాతం ముందు కు వెళ్లిపోతూ ఉంటుందని ఎటువంటి ఇబ్బందులు ఉండవని సిబ్బంది వివరించారు. భక్తులకు వైద్య సౌకర్యాల గురించి, డ్వాక్రా స్టాల్స్‌ను పరిశీలించారు. అలాగే భక్తులను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. -
భక్తులకు భానుడి సెగ
సాక్షి, అమరావతి : ఆగస్టు నెల వేసవి మాసాన్ని తలపిస్తోంది. వాస్తవంగా అయితే ఇప్పటికే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉంది. అయితే వరుణుడు కరుణించకపోగా.. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆగస్టులో ఆశించినస్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అయితే అనూహ్యంగా ఈశాన్య రుతుపవనాలు తీరాన్ని దాటి వెళ్లిపోవటంతో ప్రస్తుతం వేసవి వాతావరణాన్ని తలపిస్తోంది. గతకొద్దిరోజులుగా ఓ మోస్తరు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ శనివారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 34 డిగ్రీలు నమోదైంది. ఉదయం నుంచే ఎండలు ఉదయం 7.30గంటల నుంచే సూర్యడు తన ప్రతాపాన్ని ప్రదర్శించటం ప్రారంభించారు. ఉదయం 10గంటల నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చాయి. మిట్టమధ్యాహ్నం అయితే బయటకు వెల్లేందుకు జనం వెనకడుగేశారు. ఎండ తీవ్రత సాయంత్రం 5.30గంటల వరకు కొనసాగింది. కృష్ణాపుష్కరాల సందర్భంగా భక్తులు ఘాట్ల వద్దకు చేరుకున్నా.. ఎక్కువ సమయం ఉండలేక ఇంటిముఖం పట్టటం కనిపించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో స్నానానికి దిగిన వారు బయటకు రావటానికి ఇష్టపడలేదు. కొందరు ఎండలకు భయపడి గంటల కొద్దీ నీటిలోనే గడిపారు. దాహం దాహం.. పుష్కర డ్యూటీలో ఉన్న ఉద్యోగులు, వాలంటీర్లు మంచినీరు దొరక్క అల్లాడిపోయారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో అనేక ఘాట్లలో మంచినీరు ఏర్పాటు చేయకపోవటంతో ఘాట్ల సమీపంలో ఉన్న దుకాణాల్లో వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్ కొనుగోలు చేసి గొంతు తడుపుకోవడం కనిపించింది. కొంతమంది సిబ్బంది నదిలో జేసీబీలతో ఇసుకన తోడి ఉన్న గుంటలో ఉన్న నీటితో దాహం తీర్చుకోవటం కనిపించింది. అదే విధంగా విధుల్లో ఉన్న ఉద్యోగులు ఘాట్లలో ఉండలేక చెట్లు, పిండప్రదానం చేసే షెడ్ల వద్దకు చేరుకున్నారు. కొన్నిచోట్ల టెంట్ల ఏర్పాటు ఎండ తీవ్రతను గమనించిన అధికారులు కొన్ని ఘాట్లలో టెంట్లు ఏర్పాటు చేశారు. వేసవితాపాన్ని గమనించిన ఎస్ వెంకటేశ్వర్లు దంపతులు సీతానగరం ఘాట్‌కు వెళ్లే మార్గంలో పుచ్చకాయలు కొనుగోలుచేసి వచ్చి వెళ్లే పుష్కర భక్తులకు పండును కోసి ఇవ్వటం కనిపించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 50పుచ్చకాయలను కోసి ఒకటి, రెండు దబ్బలు ఇచ్చి భక్తుల తాపాన్ని తీర్చటం గమనార్హం. -
కృష్ణమ్మ.. చల్లంగా చూడమ్మ
-
వైభవంగా సాగితున్న కృష్ణా పుష్కరాలు
-
కృష్ణా పుష్కరాలలో అపశ్రుతి
-
ఇలాగైతే.. పిండ ప్రదానం కష్టమే
విజయవాడ(గాంధీనగర్) : పుష్కరాల్లో పుణ్యనదీస్నానం, పెద్దలకు పిండ ప్రదానం చేయడమే అతి ముఖ్యమైన కార్యక్రమం. రెండు నెలలుగా ఉరుకులు, పరుగులు పెట్టి పనులు చేయించిన అధికారులు ప్రారంభం నాటికి పనులు నూరు శాతం పూర్తి చేయలేకపోయారు. ముఖ్యంగా పవిత్ర సంగమం ఘాట్ వద్ద పిండ ప్రదానం చేసేందుకు వీలుగా నిర్మించిన షెడ్డు చిన్నదిగా ఉంది. చాలా కొద్దిమంది మాత్రమే పిండ ప్రదానాలు చేసుకునేందుకు వీలుగా షెడ్డు నిర్మించారు. ప్రభుత్వం పిండప్రధానం కార్యక్రమానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదని పురోహితులు ఆరోపిస్తున్నారు. సంగమం వద్ద సీఎం నది హారతి ఇవ్వడంతో ఘాట్‌కు ప్రాధాన్యం∙పెరిగిందని, భక్తులు అధికంగా తరలివచ్చే అవకాశం ఉందని పురోహితులు అంటున్నారు. మహిళలకు ఇక్కట్లు.. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఘాట్‌లో కేవలం ఆరు మాత్రమే క్యాబిన్లు ఏర్పాటు చేశారు, క్యాబి¯Œæలో రెండేసి గదులున్నాయి. వాటిల్లో ఏకకాలంలో కేవలం 12 మంది మాత్రమే దుస్తులు మార్చుకునేందుకు వీలుంది. దీంతో పాటు మీడియాపాయింట్‌కు సమీపంలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలికంగా టెంట్ వేశారు. పై భాగంలో ఓపెన్‌గా వదిలేశారు. దీంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దుస్తులు మార్చుకునేందుకు వీలుగా మరిన్ని గదులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
పుష్కరాలకు సిటీ సర్వీసులు
పెనమలూరు : ఆర్టీసీ అధికారుల నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు కష్టాలు మిగిల్చింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా యాత్రికుల సౌకర్యార్థం ఘాట్లకు ఉచితంగా బస్సులను నడపాలని నిర్ణయించారు. కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన శాటిలైట్ స్టేషన్‌కు బస్సులను పెద్దసంఖ్యలో తరలించారు. ఉదయాన్నే వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు సిటీ బస్సులు గ్రామాల్లోకి రాక పోవటంతో బస్సులు వస్తాయో రావో తెలియక గందరగోళానికి గురయ్యారు. బందరు రోడ్డుపై సిటీ బస్సులు కొన్ని సర్వీసులే తిరగటంతో చాలా సమయం ప్రజలు బస్టాపుల వద్ద సిటీ బస్సుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. గ్రామాలకు రావాల్సిన సిటీ బస్సులు తిరిగి వెంటనే తిప్పాలని ప్రజలు కోరుతున్నారు. పెనమలూరు గ్రామం వరకైనా సిటీ బస్సులు ఎక్కువగా తిప్పాలని ప్రజలు తెలిపారు. ఖాళీగా తిరిగిన బస్సులు పుష్కరాలకు తొలిరోజు యాత్రికులు తక్కువగా హాజరయ్యారు. ఉచిత బస్సులు యాత్రికులు లేక ఖాళీగా తిరిగాయి. కొన్ని బస్సులను శాటిలైట్ బస్‌స్టేçÙన్లోనే ఉంచారు. గ్రామాలకు వెళ్లాల్సిన సిటీ బస్సులు ఇలా నిరుపయోగంగా శాటిలైట్ బస్‌స్టేçÙన్లో ఉంచటం వలన అందరికి ఇబ్బందులు తలెత్తాయి. యాత్రికులు లేని సర్వీసులు ఉయ్యూరు : పుష్కరాల తొలి రోజు యాత్రికుల రద్దీ కనిపించలేదు. ఉయ్యూరు ఆర్టీసీ డిపో నుంచి తోట్లవల్లూరు మండలంలోని తోట్లవల్లూరు, ఐలూరు పుష్కర ఘాట్లకు ప్రత్యేకంగా ఉచిత సర్వీసులను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సర్వీసులు నడిపారు. ఏ సర్వీసులోనూ పట్టుమని పది మంది కూడా కనిపించలేదు. వరలక్ష్మీ శుక్రవారం కావటం, ఆయా ఘాట్లలో నీరు లేకపోవడంతో యాత్రికులు ఆసక్తి కనబర్చలేదు. -
దేవాదాయశాఖ విఫలం !
సాక్షి, విజయవాడ : పుష్కరాలంటే తొలుత పుణ్యస్నానం.. తరువాత పితృదేవతలకు పిండ ప్రదానం గుర్తుకు వస్తాయి. అటువంటి పిండ ప్రదానాలు చేయడానికి కనీస ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పురోహితులకు సకాలంలో గుర్తింపు కార్డులు జారీ చేయడంలోనూ దేవాదాయశాఖ పూర్తిగా అట్టర్ ప్లాప్ అయిందని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురోహితులకు నరకం.. 1992, 2004 పుష్కరాల సందర్భంగా దేవాదాయశాఖ రెండు నెలలు ముందుగా పురోహిత పెద్దలు, పురోహితlసంఘాల నేతలతోనూ సమావేశం ఏర్పాట్లు చేసి చర్చించింది. ఈసారి అందుకు భిన్నంగా పత్రికల్లో నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది. మే నెలలో పురోహితులు పుష్కరాల్లో పిండ ప్రదానాలకు దరఖాస్తులు చేసుకున్నారు. పుష్కరాలకు పక్షం రోజు ముందు గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఈ కార్డులలో ఏమాత్రం స్థానికత పాటించలేదు. గట్టు వెనక కామకోటి నగర్‌లోని బ్రాహ్మణులకు కృష్ణలంక ఘాట్లలోనూ, కృష్ణలంక, సత్యనారాయణపురం పురోహితులకు ఫెర్రి, భవానీ, పున్నమి ఘాట్లలోనూ విధులు వేశారు. అనేక వందల మంది స్థానిక బ్రాహ్మణులకు కార్డులు ఇవ్వలేదు. బ్రాహ్మణ ఫెడరేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లడంతో ఘాట్లు ఆంక్షలు పెట్టవద్దని, అడిగిన వారికి గుర్తింపు కార్డులు ఇవ్వమని మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. ఈనెల తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నవారికి పదో తేదిన కార్డులు ఇస్తామని చెప్పారు. తరువాత 11వ తేదీ ఉదయం కౌతావారి సత్రంలో ఇస్తామని చెప్పారు. అక్కడ నుంచి రైల్వేస్టేడియానికి మార్చారు. చివరకు 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత కార్డులు జారీ చేశారు. అనేక మంది పురోహితులు తొలిఘాట్లకు వెళ్లలేకపోయారు. ఘాట్లలో సౌకర్యాలు నిల్.. ఘాట్‌లో పిండ ప్రదానాలకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఇక్కడ కేవలం రెండు చిన్న షెడ్లు వేశారు. ఇక పిండాలు ఘాట్‌లో కాకుండా నదిలో వేసేందుకు ఏ విధమైన ప్రత్యేక ఏర్పాట్లు లేవు. వృద్ధులు, వికలాంగుల మాటేమిటి.? పిండ ప్రదానం చేసేవారిలో ఎక్కువ మంది 50 ఏళ్లు దాటిన వారే ఉంటారు. ఇక 70 ఏళ్లు దాటిన వారు కూడా ఆసక్తి చూపుతారు. వీరంతా క్రింద కూర్చోలేకపోవచ్చు. క్రింద కూర్చుని చేయలేని అనేకమంది వృద్ధులు ఏర్పాట్లపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఘాట్లలో పిండ ప్రదాన కేంద్రాలు పెంచాలని, వృద్ధులకు బల్లలు, కుర్చీలు ఏర్పాటుపై దేవాదాయశాఖ దృష్టి సారించాలని పురోహిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భక్తుల అగచాట్లు! కృష్ణా పుష్కరాలు తొలి రోజున స్నాన ఘాట్టాల్లో భక్తులు నామమాత్రంగా దర్శనం ఇచ్చారు. ఒకవైపు శ్రావణ శుక్రవారం.. పోలీసు ఆంక్షలతోడు పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులకు చేదు అనుభవమే మిగిలింది. పుష్కర స్నానం తరువాత మంచినీళ్లు తాగేందుకు వాటర్ బాటిల్స్ కాదు కదా.. ప్యాకెట్లు లభించలేదు. ఎండలో మంచినీళ్లు లేక వృద్ధులు, పిల్లలు నానా అగచాట్లు పడ్డారు. స్థానికులకు ప్రత్యక్ష నరకం.. వన్‌టౌన్‌లో నివాసితులు ప్రత్యక్ష నరకం చూశారు. కాళేశ్వరరావు మార్కెట్ దాటì ద్విచక్ర వాహనాలను లోపలకు అనుమతించలేదు. తమ ఇళ్లు బ్రాహ్మణవీధి, మార్వాడీ వీధి, శివాలయం వీధుల్లో ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు. స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కృష్ణలంకలోనూ ఇదే పరిస్థితి. తెలుగు తమ్ముళ్లు గుర్రు.. కారు బయటకు తీయాలంటేవీఐపీ పాస్ తప్పనిసరి. నగరంలో కేవలం ఐదు వందల వీఐపీ పాస్‌లు మంజూరు చేశారు. ఇవన్నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులకే సరిపోయాయి. -
సందడి... అంతంతే
విజయవాడ (భవానీపురం) : తొలి రోజు లెక్కకుమిక్కిలి భక్తులు వస్తారన్న కారణంగానో, లేదంటే శ్రావణ శుక్రవారం కావడం వలనో తెలియదుగానీ ఊహించినంతగా భక్తులు రాలేదు. భవానీఘాట్‌లో ఒక్కచోటే ఎక్కువ మంది స్నానాలు చేయటంతో మిగతా భాగంలో భక్తులు అక్కడక్కడా పలుచగా కనిపించారు. భవానీఘాట్ కంటేS పున్నమిఘాట్లో మరీ తక్కువ మంది కనిపించారు. ఇది వీఐపీ ఘాట్‌గా అధికారులు ప్రకటించడంతో భక్తులు ఇటువైపుగా పెద్దగా రాలేదు. అయితే భవానీఘాట్ నుంచి నడుచుకుంటూ వచ్చినవారిందరినీ స్నానాలు చేసేందుకు అనుమతించారు. మొత్తంమీద ఈ రెండు ఘాట్లలో భక్తులు పలుచగా ఉన్నా వందలాది మంది పారిశుద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సందడిగా కనిపించాయి. కాగా వేకువ జామునే పున్నమిఘాట్లో పలువురు న్యాయమూర్తులు, స్వామీజీలు స్నానాలు ఆచరించారు. ఆకర్షించిన డ్రోన్ కెమెరా భవానీ, పున్నమిఘాట్‌లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినప్పటికీ డ్రోన్ కెమేరాతో కూడా నిఘా ఏర్పాటు చేశారు. నదిపై చక్కర్లు కొడుతుంటే భక్తులు ఆసక్తిగా తిలకించారు. కొంచం కిందకు దిగినప్పుడు చిన్నపిల్ల లు కేరింతలు కొడుతూ దానిని చేతితో అందుకునేందుకు ప్రయత్నించారు. -
ఎయిర్‌పోర్టులో పుష్కర ప్రత్యేక అలంకరణ
విమానాశ్రయం(గన్నవరం) : కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా గన్నవరం విమానాశ్రయాన్ని అందంగా ముస్తాబు చేశారు. దేశవిదేశాల నుంచి వచ్చే పుష్కర యాత్రికులను ఆకట్టుకునే విధంగా టెర్మినల్ భవనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. టెర్మినల్ ప్రాంగణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయలు ఉట్టిపడే విధంగా పూలతో అలంకరించిన రంగవల్లికలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తొలుత పుష్కర మహోత్సవాలను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు, ఏసీపీ రాజీవ్‌కుమార్, పలువురు ఉద్యోగులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అదే విధంగా పుష్కర యాత్రికులకు తెలుగు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేశారు. -
మద్యం అమ్మకాలపై కఠిన ఆంక్షలు
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పుష్కర ఘాట్లకు 500 మీటర్ల దూరంలో మద్యం అమ్మకాలు నిషేధించినట్లు చెప్పారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ఘాట్ల వద్ద మద్యం అమ్మకాలు ఉండవని, పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపుల వారు కచ్చితంగా సమయం పాటించాలన్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరుగుతాయని, ఎన్ఫోర్స్మెంట్ వారు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారని చెప్పారు. కృష్ణా జిల్లాలో విజయ బార్ అండ్ రెస్టారెంట్, కృష్ణా బార్ అండ్ రెస్టారెంట్, విజయదుర్గ బార్ అండ్ రెస్టారెంట్, పున్నమి టూరిజం బార్, గుంటూరు జిల్లాలో లోటస్ బార్ అండ్ రెస్టారెంట్స్ మూసివేసినట్లు తెలిపారు. అదే విధంగా కృష్ణా జిల్లాలోని భవానీపురంలో లలితా వైన్స్, ఉయ్యూరులో స్నేహ వైన్స్, కేఎస్ఆర్ వైన్స్, గుంటూరు జిల్లాలోని పెదకూరపాడులో ధరణి ఎంకే వైన్స్, రేపల్లెలో శ్రీచైతన్య వైన్స్, దుగ్గిరాలలో ఎస్ఎస్ వైన్స్‌లు మూసి వేశారు. సిబ్బందిని సమస్యలుంటే ఎకైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ టోల్‌ఫ్రీ నెంబరు: 18004254868కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. -
పుష్కరాలకు ఆహ్వానం ఏదీ!
పామర్రు : సినీ రంగానికి చెందినవారందరినీ పుష్కరాలకు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు ఏవిధమైన ఆహ్వానపత్రాలు ఇవ్వకుండా అవమానించిందని శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గురువారం ఆమె స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆహ్వానపత్రాల గురించి సంబంధిత అధికారులను అడిగితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడం శోచనీయమని, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వానికి ఏపాటి శ్రద్ధ ఉన్నదో అర్ధమవుతోందన్నారు. నియోజకవర్గంలోని తొమ్మిది ఘాట్లపై స్థానిక ఎమ్మెల్యేతో సమీక్షలు, సమావేశాలు లేకుండా స్థానిక ప్రజాప్రతినిధులను దిష్టిబొమ్మల్లా, ఉత్సవ విగ్రహాలుగా చేసిన ఘనత చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. అసలు ముఖ్యమంత్రే స్వయంగా ఎమ్మెల్యేలకు ఆహ్వాన పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
7 గదులు..300 ఉద్యోగులు
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాలకు పక్కా ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు ఊదరగొడుతున్నప్పటికీ పుష్కర విధుల కోసం వచ్చిన ఉద్యోగులకు వసతి కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు సరైన వసతి లేక అవస్థలుపడుతున్నారు. పుష్కర విధుల్లో భాగంగా నెల్లూరు,ప్రకాశం,అద్దంకి, మార్కాపురం డిపోల నుంచి 300 వందల మందికి పైగా ఆర్టీసి డ్రైవర్లు వచ్చారు. వారికి గుంటూరుజిల్లా మంగళగిరిలోని చింతక్రింది కనకయ్య ప్రవేటు హైస్కూల్ లో వసతి ఏర్పాట్లు చేశారు. కానీ అక్కడకు వెళ్లిన ఆర్టీసీ సిబ్బంది అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఏడు గదులు ఇచ్చి, అందులో మూడు వందలమంది సర్ధుకుపోవాలని చెప్పారు. అంతేకాదు నీళ్ల సదుపాయం లేదు. బాత్రూమ్లో నీరు లేక స్నానాలు చేయలేకపోయారు. తాగునీరు వసతికూడా అంతంత మాత్రమే.ఇరవై మందికి ఒక బకెట్ ఇచ్చి దాంతోనే సర్ధుకుపోవాలని చెప్పడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం రాత్రికి విద్యుత్ సౌకర్యం కల్పించలేకపోయారు దీంతో ఫ్యాన్లు లేక దోమల బెడదతో నరకయాతన అనుభవించారు. పడుకునేందుకు చాపలు లేవు ,గదుల్లో స్కూల్ బల్లలు అలానే ఉంచడంతో అక్కడ పడుకునేందుకు వీలులేక ఇబ్బందిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది.ఉద్యోగులు రాక ముందే రెండు ముందే వసతి కల్పించే గృహసముదాయాన్ని స్వాధీనం చేసుకుని వసతులు కల్పించాల్సి ఉండగా అలాంటిదేమీ చేయలేదు. ఇలాంటి దుస్థితి ఏవరికి రాకూడదనీ, విధులు నిర్వహంచి కాసేపు సేదతీరదామనుకొనే వాతావరణం ఇక్కడ లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. -
పుష్కరాలకు మంచి ఆతిథ్యాన్నిద్దాం
విజయవాడ(వన్‌టౌన్) : కృష్ణా పుష్కరాలకు మంచి ఆతిథ్యాన్నిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆధునికీకరించిన తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. సుమారు ఎనిమిది కోట్లతో కళాక్షేత్రం ప్రాంగణాన్ని ప్రభుత్వం ఆధునికీకరించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ పన్నెండు రోజులూ పుష్కరాలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. పుష్కర స్నానం చేసేందుకు నగరానికి వచ్చే భక్తులకు ప్రజలందరూ ఆత్మీయ స్వాగతం పలకాలన్నారు. ఇటువంటి వేదికలు మరిన్ని రావాల్సి ఉందన్నారు. నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించేందుకు ఒక మంచి వేదిక అన్నారు. శుక్రవారం నుంచి పన్నెండు రోజుల పాటు రాష్ట్రానికి దశ, దిశ నిరే్ధశం చేసే 12 అంశాలపై చర్చా గోషు్ఠలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ధరలు పెంచితే చర్యలు పుష్కరాలు అవకాశంగా తీసుకొని కొంత మంది వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హుదూద్ తుఫాన్ సందర్భంగా విశాఖ నగరంలో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించగా దానిని అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు. విజయవాడ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పీ నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని నాని, నగర మేయర్ కోనేరు శ్రీధర్ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియాన్ పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
తాడేపల్లి రూరల్: పుష్కరాల్లో విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి భక్తులను క్షేమంగా ఇంటికి పంపిచాలని గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. బుధవారం ఘాట్లు పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రితో పాటు పోలీసు ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచి పుష్కర ఘాట్లు వీక్షించేలా ఏర్పాటు చేసిన వై–ఫై కెమెరాలను, గాలిలో ఎగురుతూ చుట్టు పక్కల ప్రాంతాలను చిత్రీకరించే డ్రోన్ కెమెరాలను స్వయంగా పరిశీలించారు. నిరంతరం అంతా అప్రమత్తంగా ఉండాలని, విజయవాడ కంట్రోల్ రూమ్ నుంచి ఏ అధికారి ఫోన్ చేసి ఏ ఘాట్‌ను చూపించమంటే ఆ ఘాట్‌ను చూపించగలగాలని ఆయన సూచించారు. ఆయన పరిశీలిస్తున్న సమయంలో పెద్ద గాలి వచ్చి భక్తులు దుస్తులు మార్చుకునే గదులు పైకి కిందకు ఊగుతుండడంతో ఆయన దగ్గరుండి, బోల్టు ఫిట్టింగ్ చేయించి కదలకుండా ఏర్పాట్లు చేయించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో క్రైమ్ ఎస్పీ డి. కోటేశ్వరరావు, మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు, సీఐ హరికృష్ణ తదితరులు ఉన్నారు. -
పుష్కర పనుల్లో అవినీతి
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శ కంకిపాడు/తోట్లవల్లూరు : పుష్కర పనుల్లో అవినీతి చోటుచేసుకుంటుదని, అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. పుష్కర నిధులు రూ.60 లక్షలతో చేపట్టిన కంకిపాడు–రొయ్యూరు జెడ్పీ రోడ్డును బుధవారం ఆమె పరిశీలించారు. పుష్కరాల ప్రారంభానికి 24 గంటల సమయం కూడా లేదని, పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యాన్ని లెక్కచేయకుండా తూతూమంత్రంగా పనులు కానివ్వటం సరైందేనా? రోడ్డు అభివృద్ధి చేయమంటే కొండలు, గుట్టలుగా నిర్మించటం నిధులు దుర్వినియోగం చేయటం కాదా? అని పంచాయతీరాజ్ అధికారులను ప్రశ్నించారు. 50 శాతం కూడా పూర్తికాకపోవడం శోచనీయం రూ 60 లక్షలతో చేపట్టిన రోడ్డు పనులు 50 శాతం కూడా పూర్తికాకపోవటం శోచనీయమని కల్పన అన్నారు. రోడ్డు పరిశీలన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. హడావిడిగా చేస్తున్న పనుల్లో నాణ్యత లేకపోవటంతో పుష్కరాలు పూర్తికాగానే రోడ్డు కూడా ధ్వంసమవుతుందని అన్నారు. పుష్కరాల్లో భక్తుల ప్రయోజనాలను పక్కనపెట్టి నామినేషన్లతో పనులు కట్టబెట్టి కోట్లు దోచి పెడుతున్నారని ఆరోపించారు. పనుల్లో నా ణ్యత ఉండటం లేదని నిధులు దుర్విని యోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. నిధుల కేటాయింపులో వివక్ష నిధులు కేటాయింపుల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. రొయ్యూరు ఇసుక క్వారీ నుంచి ప్రభుత్వ అవసరాలకు ఇసుకను తోడుకుంటున్నారని, రొయ్యూరు ప్రధానరహదారి అభివృద్ధికి కనీసం రూ.1.20 కోట్లు కూడా కేటాయించకపోవటం శోచనీయమన్నారు. నిధుల కేటాయింపుల్లో కలెక్టరు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. జేడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడారు. తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, రొయ్యూరు సర్పంచ్ లుక్కా సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యుడు మూడే శివశంకర్‌రావు, వైఎస్సార్ సీపీ జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యద ర్శి బొడ్డు సుగుణాకర్‌రావు, జిల్లా కార్యదర్శి చింతలపూడి గవాస్కర్‌రాజు, పార్టీ గ్రామ అధ్యక్షుడు మోర్ల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ డీఈ రఘురామ్ పాల్గొన్నారు. -
22 గంటలు దుర్గమ్మ దర్శనం
– అంతరాలయ దర్శనం రద్దు – వీఐపీలకు ప్రత్యేక సమయంలోనే ముఖమండప దర్శనం – భక్తులకే ప్రథమ ప్రాధాన్యం – పర్మినెంట్‌గా టోల్ ఫ్రీ నంబర్ – ఈవో సూర్యకుమారి విజయవాడ (ఇంద్రకీలాద్రి) : పుష్కర యాత్రికుల కోసం దుర్గగుడిని రోజుకు 22 గంటలు తెరిచి ఉంచుతామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. పుష్కరాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై చేసిన ఏర్పాట్ల గురించి బ్రాహ్మణవీధిలోని దుర్గగుడి పరిపాలన భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ వైవీ అనూరాధ, దుర్గగుడి ఈవో సూర్యకుమారి వివరించారు. పుష్కరాలు జరిగే సమయంలో అమ్మవారి దర్శనానికి రోజూ రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మరుసటిరోజు రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను ఐదు క్యూలైన్లలో అనుమతిస్తామని చెప్పారు. రద్దీలో 90 శాతం ఉచిత దర్శనం ద్వారానే అమ్మవారిని దర్శించుకుంటారని భావిస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నంబర్ ఇక శాశ్వత ప్రాతిపదకన ఉంటుందని చెప్పారు. అంతరాయల దర్శనం రద్దు చేస్తున్నామని, అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు శఠగోపం(పాదుకలు) పెట్టేది, పండితుల ఆశీర్వాదాలు, ప్రసాదాలు అందజేయడాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా ముఖమండప దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. రూ.500 టికెట్ కొనుగోలు చేసిన వారికి శీఘ్రదర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే వీఐపీలను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులకు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. వీఐపీలకు పున్నమి ఘాట్‌తోపాటు ఘాట్‌రోడ్డు నుంచి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటుచేస్తున్నామని, వాటిలోనే కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. వినాయకుడి గుడి నుంచే క్యూలైన్.. వినాయకుడి గుడి నుంచి ఇంద్రకీలాద్రి పైకి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కుమ్మరిపాలెం వైపు నుంచి మరో క్యూలైన్ ఏర్పాటుచేసి టోల్గేట్ వద్ద కలుపుతారు. దర్శనానంతరం మహామండపం, మల్లేశ్వరాలయం మీదుగా కొండ కిందకు దిగేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మూడు ప్రాంతాల్లో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశామని, భక్తుల రద్దీని బట్టీ రేషన్ విధిస్తామన్నారు. పుష్కరాల్లో రోజుకు 25వేల మందికి అమ్మవారి అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. భక్తులు బఫే తరహాలో అన్నప్రసాదం స్వీకరించాల్సి ఉంటుందన్నారు. తలనీలాలు సమర్పించుకునేందుకు ప్రస్తుతం ఉన్న అరండల్ సత్రాన్ని మూసివేసి, పున్నమి, భవానీ, దుర్గాఘాట్‌లో కేశఖండనశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. దుర్గగుడిపై విధుల నిర్వహణ కోసం రాష్ట్రంలోని ఇతర దేవాలయాల నుంచి 600మంది సిబ్బంది వచ్చారని, మరో వెయ్యిమంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను నియమించామని వివరించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో అమ్మవారి దర్శనం పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్లో కూడా అమ్మవారి మూర్తులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అక్కడ అమ్మవారికి ఏక హారతి ఇవ్వడంతో పాటు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. -
కృష్ణమ్మ ఒడిలో..
-
పుష్కరాల కోసం ట్రాఫిక్ మళ్లింపు
మండవల్లి : కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ ఏవీఎస్ రామకృష్ణ తెలిపారు. పుష్కరాల సందర్భంగా విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు ఏలూరు వైపునకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కైకలూరు, భీమవరం తదితర ప్రదేశాలకు కైకలూరు–భీమవరం రూట్లో వెళ్లరాదని సూచించారు. గుడివాడ నుంచి ఉప్పుటేరు వరకు ఈ విధమైన ఆంక్షలు విధించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏవిధమైన అంతరాయం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. -
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని గుంతకల్లు జంక్షన్ నుంచి గుంతకల్లు–కృష్ణా–గుంతకల్లు, గుంతకల్లు–కృష్ణా కెనాల్–గుంతకల్లుకు నాలుగు ప్రత్యేక ప్యాసింజర్ రెళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. కర్నూలు జిల్లాలోని కృష్ణాకు 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో గుంతకల్లు నుంచి (రైలు నం.07944›) మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణాకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణపు రైలు (07945) ఆయా తేదీల్లో సాయంత్రం 5 గంటలకు కృష్ణా నుంచి బయలుదేరి గుంతకల్లుకు రాత్రి 8.15 గంటలకు చేరుతుంది. ఈ రైలు ఆదోని, మంత్రాలయం, రాయచూరు మీదుగా వెళ్తాయి. అదేవిధంగా గుంతకల్లు–కృష్ణాకెనాల్ సేష్టన్‌కు (రైలునం–07946) ప్రత్యేక ప్యాసింజర్ రైలు 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో గుంతకల్లుల్లో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.30 గంటలకు కృష్ణాకెనాల్‌కు చేరుతాయి. తిరుగు ప్రయాణపు రైలు (07947) 14, 16, 18, 20, 22, 24 తేదీల్లో కృష్ణాకెనాల్ సేష్టన్‌లో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 10 గంటలకు గుంతకల్లు చేరుతుంది. ఈ రైలు డోన్, నంద్యాల, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్డు, దోనకొండ, వినుకొండ, నరసరావుపేట, ఫిరంగిపురం, గుంటూరు, మంగళగిరి మీదగా కృష్ణాకెనాల్‌కు నడుపుతున్నారు. మొత్తం 8 జనరల్ బోగీలుంటాయని, ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. -
పుష్కర భక్తులకు సేవ చేయండి
విజయవాడ (ఆటోనగర్): పుష్కర భక్తులకు అసౌకర్యం కలుగకుండా పుష్కర సేవక్‌లుగా(వాలంటీర్లు) ప్రైవేటు స్కూళ్ళ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తమ వంతు సేవలందించాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ డి.గౌతం సవాంగ్ కోరారు. ఆదివారం ఎన్ఏసీ కళ్యాణ మండపంలో విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యూటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లాలోని 350 స్కూళ్ల నుంచి 1500మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన సవాంగ్ ప్రసంగిస్తూ పుష్కరాలు చాలా కాలానికి వచ్చే ముఖ్యమైన పవిత్ర రోజులని, పోటెత్తే భక్తులకు సహకారం అందించటం మన ప్రధానమైన కార్యచరణ అని అన్నారు. క్లాక్ రూమ్స్, క్యూలైన్లు, సమాచార కేంద్రంలో స్వచ్ఛంద సేవలు అందించాలని సూచించారు. ఈ సేవకు గుర్తుగా వాలంటీర్లకు సర్టిఫికేట్లను జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఛైర్మన్ సాయికృష్ణ, మోహన్‌రెడ్డి, అధ్యక్షులు సరళ, కార్యదర్శి సుధాకర్‌లు మాట్లాడుతూ తాము పుష్కరాల 12 రోజుల్లో తాము 4 రోజులపాటు వాలంటీర్లుగా సహకారాన్ని అందిస్తామని తెలిపారు. వాలంటీర్లకు క్యాప్, పుష్కర ఐడీ కార్డు, ఫ్లోర్‌సెంట్ జాకెట్ ఇస్తామని డీసీపీ ప్రవీణ్ కుమార్ అన్నారు. -
9 నుంచి మాంసం, చేపల విక్రయాలు నిషేధం
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రజారోగ్యం దృష్ట్యా ఈనెల 9నుంచి 25వ తేదీ వరకు నగరంలో మాంసాహారం, చేపల అమ్మకాలు, జంతువథను నిషేధిస్తున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. 16 రోజులపాటు కబేళాను కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. మాంసాహార విక్రయదారులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించినట్లైతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
పుష్కరాలకు ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం
విజయవాడ : పుష్కరాల సందర్భంలో అన్ని టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాబు ఏ కోరారు. శనివారం తన చాంబర్లో బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్, టాటా డొకోమో తదితర కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ బాబు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు జిల్లాలో గుర్తించిన 91 ఘాట్ల సెక్టార్ల పరిధిలో 3.50 కోట్లకు పైగా పుష్కర యాత్రికులు రానున్నారని తెలిపారు. ఈ రద్దీని గుర్తించి ఆరు ముఖ్య రోజుల్లో 40 లక్షల మంది వరకు రాగలరనే అంచనాతో ఉన్నామని తెలిపారు. యాత్రికులకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సేవలందించాలని కోరారు. ఇంట్రా సర్కిల్ రోమింగ్‌లో సదుపాయాన్ని అందించాలని సూచించారు. ఈ నెల 10 తేదీ సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని నెట్ వర్క్ ప్రతినిధులను కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ డాక్టర్ జి.సృజన పాల్గొన్నారు. -
అవనిగడ్డ పేరు చిరస్థాయిగా...
అవనిగడ్డ, చిరస్థాయి, పుష్కరఘాట్, కృష్ణా పుష్కరాలు కొత్తపేట(అవనిగడ్డ): స్థానిక కొత్తపేటలో ఏర్పాటు చేసిన అవనిగడ్డ పుష్కరఘాట్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. నియోజకవర్గంలోనే అతి పెద్ద ఘాట్‌గా పేరొందిన ఈ ఘాట్‌ని రూ.65 లక్షలతో అభివృద్ధి చేశారు. రూ.27 లక్షలతో పాతఘాట్ని ఆనుకుని 40 అడుగుల పొడవుతో కొత్తపుష్కరఘాట్ని నిర్మించగా, రూ.25 లక్షలతో ఫ్లాట్‌ఫాంని ఏర్పాటుచేశారు. రూ.11 లక్షలతో ఘాట్ మొత్తం టైల్స్‌ని ఏర్పాటు చేశారు. ఘాట్ పైభాగంలో ఇంగ్లీష్‌లో అవనిగడ్డ అక్షరాలతో చేసిన డిజైన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. మరో రెం డు లక్షలతో మెయింటెన్స్ పనులు చేశారు. మోపిదేవి మండలం నాగాయతిప్ప నుంచి 1929లో కృష్ణానదిని మహాత్మాగాంధీ దాటుకుని కొత్తపేట మీదుగా వచ్చి దివి సీమలో పలు ప్రాంతాల్లో పర్యటించారు.అందుకు గుర్తుగా ఈ ఘాట్ వద్ద ఎడమవైపున గాంధీజీ విగ్రహం కుడివైపున కృష్ణవేణి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
పుష్కరాలకు కార్యాచరణ సిద్ధం
విజయవాడ : కృష్ణా పుష్కరాల సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశారు. కలెక్టర్ బాబు.ఎ బుధవారం ఇరిగేషన్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశమై పుష్కరాల విధులకు సంబంధించిన ప్రణాళికపై కసరత్తు చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా సీఎం సమక్షంలో ఈ నెల 6వ తేదీన ఏ–కన్వెన్షన్ సెంటర్లో సమావేశం నిర్వహిస్తారు. సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందు కు శిక్షణ ఇస్తారు. పుష్కర విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు బస చేసే ప్రాంతంలోనే ఆహారం తదితర ఏర్పాట్లు చేయటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 1,095 విడిది ప్రాంతాలను గుర్తించారు. సిబ్బందికి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు మూడు షిఫ్టులుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పుష్కరాల్లో సదస్సులు : కలెక్టర్ పుష్కరాల సందర్భంగా పలు అంశాలపై సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జల సంరక్షణ, అమరావతి, వనం–మనం, వ్యవసాయం, విద్య, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం తదితర అంశాలపై సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పుష్కరనగర్లు, ఘాట్లు, పుష్కర విడిది కేంద్రాల సమీపంలో, రహదారులపై మద్యం విక్రయాలపై నిషేధ ఆజ్ఞలు అమల్లోకి వస్తాయన్నారు. ‘స్వచ్ఛపుష్కరాలు’ అనే విధానంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో పారిశుద్ధ్య, మున్సిపల్, పంచాయతీ అధికారులు, సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులను అతిథులుగా ఆదరించాలని, వసతి, భోజన , సదుపాయాలపై వ్యక్తిగత పర్యవేక్షణ అవసరమన్నారు. అధికారులు, సిబ్బందిని సమన్వం చేసుకుంటూ యాత్రికులకు మెరుగైన సేవలు అందించేందుకు 400 వైర్లెస్ సెట్లను ముఖ్య అధికారులకు అందిస్తామని తెలిపారు. ఘాట్ల వద్ద 30 లైఫ్‌బోట్ సర్వీసులు అందుబాటులో ఉంచుతామన్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆధార్ ఆధారంగా ఐడీ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో రైల్వే డీజీఎం అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ డాక్టర్ జి.సృ జన, ఎన్డీఆర్ఎఫ్ డెప్యూటీ కమాండెంట్ మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణాలు సరే.. నీరొచ్చేనా?
ఘాట్లు ఉన్నా.. నీరు లేదాయె – కుడి కాలువకు నీటి విడుదల సరే, డెల్టాకు ఎప్పుడు? – చర్యలు తీసుకోకపోతే అవస్థలే.. అమరావతి (మాచర్ల ): పుష్కరాలను పురస్కరించుకుని పుష్కర ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో మంచినీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేశారు. పుష్కర ఘాట్ల నిర్మాణం జరుగుతున్న డెల్టా ప్రాంతంలో మాత్రం నీటి విడుదలకు సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఆదేశాల జారీ చేయలేదు. దీంతో పుష్కర ఘాట్లకు నీటì æవిడుదల ఎప్పుడని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. విజయపురి సౌత్‌లోని కృష్ణా పరీవాహక డెల్టా ప్రాంతం నుంచి అమరావతి, విజయవాడ వరకూ పలు పుష్కర ఘాట్లు నిర్మిస్తున్నారు. కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేస్తారనే అంచనాలతోనే వీటి నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వంతో అధికారుల చర్చలు మరో 8 రోజుల్లో పుష్కరాలు ప్రారంభమయ్యే సమయంలో నీరు విడుదల చేయకపోవడం, డెల్టా ప్రాంతంలోని అన్ని పుష్కర ఘాట్లకు కృష్ణా పరీవాహక ప్రాంతంలో రెండు వైపులా నీరు అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణాడెల్టాకు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయకపోతే పుష్కర ఘాట్లకు సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రెండు రోజులుగా అధికారులతో చర్చలు జరుపుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా డెల్టాకు సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు. అంతా అనుమానమే.. డెల్టా ద్వారా నీరు విడుదల చేయించేందుకు కృష్ణాబోర్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పుష్కరాలకు నీరు విడుదల చేయడం అనివార్యమని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 10వ తేదీలోపు సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని విడుదలచేసి పుష్కరఘాట్ల వద్ద నీరు నిల్వ ఉండేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పుష్కరాలలోపు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం పరిధిలోని పుష్కర ఘాట్లకు నీటిని విడుదల చేస్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే. -
భక్తులతో మర్యాదగా మెలగాలి
పురోహితులకు దేవదాయ డైరెక్టర్ ఆదేశం దేవాదాయ డైరెక్టర్ రాఘవచార్యలు ఈడేపల్లి : పుష్కరాలలో పురోహితులు మైత్రీభావంతో మెలగాలని పురోహితుల శిక్షణవేత్త, రాష్ట్ర దేవదాయ దర్మదాయ శాఖ పరిపాలన డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవచార్యులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బచ్చుపేటలోని శ్రీవెంకటేశ్వ దేవాలయం ప్రాంగణంలోని కల్యాణమండపంలో బందరు, గుడివాడ డివిజన్ పరిధిలోని పురోహితుల అవగాహన సదస్సు నిర్వహించారు. రాఘవ చార్యులు మాట్లాడుతూ ఒక్కసారి పుణ్యస్నానాలను ఆచరిస్తే 12 నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని, మోక్షప్రాప్తి లభిస్తుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుందన్నారు. వచ్చే భక్తులతో పురోహితులు ప్రేమగా మెలగాలని, అమర్యాదగా ప్రవర్తిస్తే ^è ట్టరీత్యా పలు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. భక్తుల నుంచి ప్రభుత్వం నిరే్ధశించిన విధంగానే సంభావన తీసుకొవాలని, అధికంగా వసూళ్లు చేయరాదన్నారు. దేవాదాయ డిప్యూటీ కమిషనర్ చందు హనుమంతురావు మాట్లాడుతూ జిల్లాలో 73 పుష్కరఘాట్లను గుర్తించామని, వీటిల్లో విఐపిలకు 4, ప్రధాన ఘాట్లుగా 4 గా నిర్ణయించామన్నారు. అనంతరం 400 మంది పురొహితులకు గుర్తింపు కార్డులను అందజేశారు. రాష్ట్ర అర్చకుల సంఘం ఉపాధ్యక్షుడు ఘంటశాల పద్మనాభ శర్మ, బందరు డివిజన్ దేవదాయ «ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధాకర్, పలు ఆలయాల ఈవోలు అడబాల శ్రీనివాసరావు, తిక్కిశెట్టి రాంమోహనరావు, అలయ మేనేజరు జక్కా ధర్మారాయుడు, అర్చకులు పాల్గొన్నారు. -
మూడోసారి
సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాల కోసం నిర్మిస్తున్న ఘాట్ల పనులను పూర్తిచేయడానికి ముచ్చటగా మూడోసారి గడువు ఇచ్చారు. తొలుత జూలై 25 తేదీ లోపు పనులు పూర్తిచేయాలని కలెక్టర్ బాబు.ఏ ఆదేశిం చారు. ఆ తరువాత నెలాఖరు లోపు పూర్తిచేయాలని గడువు ఇచ్చారు. ఈ రెండు గడువుల్లోనూ పనులు పూర్తికాలేదు. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో ముఖ్యమైన ఘాట్ ఒక్కటి కూడా సిద్ధం కాలేదు. దీంతో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఈ నెల 5వ తేదీలోగా ఘాట్ల నిర్మాణం పూర్తవ్వాలంటూ కాంట్రాక్టర్లకు, ఇంజినీర్లకు అల్టిమేటం ఇచ్చారు. అయితే 10వ తేదీ నాటికి ఘాట్ల నిర్మాణం పూర్తవడం కూడా కష్టమేనని ఇంజినీర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ముంచుకొస్తున్న ముహూర్తం ఈ నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. బుధవారాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే పుష్కరాల ప్రారంభానికి 9 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్క ఘాట్ కూడా పూర్తి కాలేదు. కలెక్టర్ ఒత్తిడి భరించలేక కృష్ణవేణి ఘాట్‌లో మెట్ల నిర్మాణం పూర్తి చేసి టైల్స్ అంటించిన కాంట్రాక్టర్, ఇంజినీర్లు మభ్యపెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న పద్మావతి ఘాట్ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. ఈ ఘాట్‌లో మరో రెండు లక్షల అడుగుల మేర టైల్స్ అంటించాల్సి ఉందని ఇంజినీర్లే చెబుతున్నారు. ఈ రెండు ఘాట్లలోనూ నదిలో సిమెంట్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఘాట్లకు వెళ్లేందుకు రహదారులు నిర్మించాల్సి ఉంది. విద్యుదీకరణ పనులు కూడా జరగాలి. ఘాట్లలో రెయిలింగ్‌లు ఏర్పాటు చేయలేదు. పోలవరం కాలువ చందమేనా.. పోలవరం కుడికాలువకు రామిలేరు అండర్ టెన్నల్ వద్ద పడిన గండి ఇరిగేషన్ వర్గాల్లో చర్చనీ యాశంగా మారింది. ఒకవైపు రాత్రిపూట గండి పెట్టారని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. పనులు హడావుడిగా చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇంజినీరింగ్ వర్గాలు నమ్ముతున్నాయి. ప్రస్తుతం పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను.. కుడికాల్వ వద్ద జరిగిన పనులతో పోల్చుకుంటున్నారు. ఇక్కడ నాణ్యత ఎంత మేరకు ఉందో చెప్పడం కష్టమని వ్యాఖానిస్తున్నారు. ఏౖ§ð నా పొరపాటు జరిగితే తాము ఇబ్బంది పడతామని ఇంజినీర్లు భయపడుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న ఘాట్లలో పనులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రాత్రీ పగలు చేసినా పుష్కరాల నాటికి పూర్తయ్యే పరిస్థితులు కనపడటం లేదని, పదో తేదీ వరకూ చేసి పనులు ఆపేస్తామని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. మట్టిదిబ్బలు... ఇసుక కుప్పలు.... ఒక్క ఘాట్ కూడా చూడముచ్చటగా లేదు. ప్రతి ఘాట్ ముందు, పక్కన మట్టి దిబ్బలు, ఇసుక కప్పలు దర్శనమిస్తున్నాయి. పొక్లెయినర్లతో ఇప్పటికీ తవ్వకాలు సాగుతున్నాయి. రెడిమిక్స్ మిషన్‌న్లు పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాయి. జరుగుతున్న పని జరుగుతూనే ఉన్నా చేయాల్సిన పని చాంతా ండంత కనపడుతోందని పలువురు వ్యాఖానిస్తున్నారు. కీలకమైన పవిత్ర సంగమం, దుర్గాఘాట్ వంటి ఘాట్లలో పనులు ఇంకా సగానికి పైగా ఉన్నట్లు కనపడుతున్నాయి. ఎప్పటికీ పూర్తవుతాయనేది ఇంజినీర్ల నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు. -
పుష్కరాలకు అదనపు బోగీలు
గుంటూరు(నగరంపాలెం) : పుష్కరాల దృష్ట్యా గుంటూరు డివిజను మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజను అసిస్టెంట్ కమర్షియల్ మేనేజరు ఎండీ ఆలీఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12705/12706గుంటూరు–సికింద్రాబాద్–గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, 17221/17222 కాకినాడ–లోక్‌మాన్యతిలక్ టెర్మినల్స్–కాకినాడ ఎక్స్‌ప్రెస్, 17211/17212 మచిలీపట్నం–యశ్వంత్‌పూర్–మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్, 57327/57328 గుంటూరు–డోన్–గుంటూరు ప్యాసింజర్ రైళ్లకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా రెండు జనరల్æబోగీలు ఏర్పాటు చేయనున్నారు. 57317/57324 గుంటూరు–మాచర్ల–గుంటూరు ప్యాసింజరు, 57381/57382 గుంటూరు– నర్సాపూర్–గుంటూరు ప్యాసింజరు రైళ్లకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా మూడు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 17225/17226 విజయవాడ–హుబ్లీ–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 10 నుంచి 25 తేదీ వరకు అదనంగా నాలుగు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 57620/57619 కాచిగూడ–రేపల్లె–కాచిగూడ ప్యాసింజర్ రైలుకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా ఒక జనరల్ బోగీని ఏర్పాటు చేయనున్నారు. 08405/08406 పూరీ–గుంటూరు–పూరీ ప్రత్యేక రైలుకు ఆగస్టు 11,12,16,17,19,20,22,23 తేదీల్లో రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ఒక ఏసీ త్రీటైర్‌కోచ్, రెండు స్లీపర్ కోచ్‌లు, 12705/12706 సికింద్రాబాద్–గుంటూరు–సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు 9వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 12747/12748 గుంటూరు–వికారాబాద్–గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్, 12796/12795 సికింద్రాబాద్–విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నాలుగు సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 08507/08508 గుంటూరు–విశాఖపట్నం–గుంటూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 11 నుంచి 23వ తేదీ వరకు రెండు స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దసరా సెలవుల రద్దీకి.. దసరా సెలవుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–తిరుపతి–విశాఖపట్నంకు న్యూగుంటూరు రైల్వేస్టేçÙన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 82851 విశాఖపట్నం – తిరుపతి ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3,10,17,24,31, నవంబరు 7,14 తేదీలు, 82852 తిరుపతి–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4,11,18,25, నవంబరు 1,8,15 తేదీల్లో నడపనున్నారు. ఈ రైళ్లలో ఒక ఏసీ టూటైర్, మూడు ఏసీ త్రీటైర్, తొమ్మిది స్లీపర్ కోచ్‌లు, ఆరు జనరల్ బోగీలు, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. -
24 గంటల వైద్యసేవలు
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య అమరావతి : పుష్కరాలను పురస్కరించుకుని అమరావతిలో వైద్య ఆరోగ్యశాఖ అందించే సేవల ఏర్పాట్లను మంగళవారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ఘాట్ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలను 24 గంటలపాటు మూడు షిప్్టలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కరాలు జరిగే మూడు జిల్లాల్లో సుమారు 13 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. స్పెషలిస్టు వైద్యులతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొబైల్ పార్టీలు , ఘాట్లలో అంబులెన్స్‌ను సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. తొలుత అమె అమరేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. ధ్యానబుద్ధ ఘాట్ వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట అరోగ్యశాఖ డైరెక్టర్ అరుణకుమారి, పుష్కరాల ప్రత్యేకాధికారి కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్‌వో పద్మజారాణి, సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీ సాయిబాబు, అత్తలూరు పీహెచ్సీ వైద్యాధికారులు స్వప్న, కిరణ్‌కుమార్, డీడీ నాయక్ ఉన్నారు. -
బాబోయ్.. లీడింగ్ చానల్
సీతానగరం (తాడేపల్లి రూరల్) : సీతానగరం పుష్కర ఘాట్లపై ప్రభుత్వం సవతిప్రేమ చూపిస్తోంది. రాజధాని ప్రాంతమైన సీతానగరం పుష్కరఘాట్ల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పనుల్లో బెజవాడకు, తాడేపల్లికి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ అలా.. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీళ్లు వస్తాయా? లేదా? అనే అనుమానంతో విజయవాడ పుష్కర ఘాట్లలో ప్రకాశం బ్యారేజీ నుంచి రెండున్నర కిలోమీటర్ల మేర రూ.5 కోట్లతో లీడింగ్ చానల్ ఏర్పాటుచేశారు. ఈ చానల్ అడుగు భాగం కాంక్రీట్ ఫ్లాట్‌ఫాం నిర్మించి, ఘాట్ల నుంచి లీడింగ్ చానల్ వరకూ మరో ప్లాట్‌ఫాం ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి స్నానాలు ఆచరించేందుకు, కాలువలోకి దిగేందుకు ప్రత్యేక మెట్లు సిద్ధం చేశారు. కృష్ణానది వైపు ఇసుక బస్తాలు ఏర్పాటుచేసి కట్టలు నిర్మించారు. ఇక్కడ ఇలా.. సీతానగరంలో.. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఘాట్ల వద్ద ఏర్పాటుచేసే లీడింగ్ చానల్ పరిస్థితి దారుణంగా మారింది. ఘాట్లలో విధులు నిర్వహించే ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేసి పంపినప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం భక్తులు పుణ్యస్నానం చేసేందుకు గానూ ఘాట్ల వద్దకు నీరు ఎలా తెప్పిస్తారని అధికారులను ప్రశ్నించారు. విజయవాడలో మాదిరిగానే లీడింగ్ చానల్ ఏర్పాటుచేయాలని సూచించారు. అయినా ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. దీంతో స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్ సిబ్బంది కాంట్రాక్టర్‌కు నచ్చజెప్పి లీడింగ్ చానల్ ఏర్పాటు చేయనున్నారు. ఇసుక బస్తాలతో చానల్..! సీతానగరంలోని లీడింగ్ చానల్‌ను పూర్తిగా ఇసుక బస్తాలతో నిర్మిస్తున్నారు. పుష్కర ఘాట్లకు, కృష్ణానదిలో ఉన్న నీటి మట్టానికి 14 అడుగుల వ్యత్యాసం ఉండడంతో.. ఆంజనేయస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న ఘాట్ వద్ద చానల్ కలుపుతూ కాంక్రీట్‌తో పది అడుగుల తొట్టి ఏర్పాటుచేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి అర కిలోమీటరు పొడవున పైపులైను వేసి, లీడింగ్ చానల్లోకి నీరు పంపనున్నారు. రైల్వే బ్రిడ్జి దాటిన తరువాత 8 అడుగుల ఎత్తులో మరో తొట్టి ఏర్పాటుచేసి దానిపై నుంచి నీరు బయటకు వెళ్లేలా ప్లాన్ చేశారు. -
పుష్కర ప్రణాళికను రూపొందించండి
విజయవాడ : పుష్కర ఘాట్లను 150 నుంచి 200 మీటర్ల వరకూ ఒక సెక్టార్‌గా విభజించి, ప్రతి సెక్టార్లో ఉంచాల్సిన పరికరాలు, అధికారులకు సంబంధించిన మైక్రో లెవల్ ప్లానింగ్‌ను ప్రతి శాఖ రూపొందించాలని పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతి సెక్టార్‌కు ఒక సబ్ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు చెప్పారు. పోలీస్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్.. తమ శాఖ అధికారులను ఆయా సెక్టార్లలో నియమించాలని సూచించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకూ రెండో షిఫ్టు, రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకూ మూడో షిఫ్టు నిర్వహించాలని సూచించారు. మూడు షిప్టులకు నియమించే ఉద్యోగుల పేర్లు, ఆధార్, మొబైల్ నంబర్ల నివేదిక జిల్లా యంత్రాంగానికి ఆదివారంలోపు అందించాలని ప్రత్యేక అధికారి రాజశేఖర్ సూచించారు. మహిళా సంఘాల స్టాల్స్ కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ప్రతి ఘాట్లోనూ పిండప్రదానం ప్లాట్‌ఫాంను ఆనుకుని, పూజా ద్రవ్యాలు అమ్మే మహిళా సంఘాల స్టాళ్లు ఏర్పాటుచేయాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ తరఫున మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకాల స్టాళ్లను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 150, పవిత్రసంగమం వద్ద 50, ప్రకాశం బ్యారేజీ దిగువన అప్రాన్ వద్ద 50 ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మహిళా సంఘాలకూ చోటు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ జి.సృజన, డీఆర్వో సీహెచ్ రంగయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ శేషుకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మర్యాదగా పలుకరించండి
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు విజయవాడ ఆతిథ్యం ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నగరవాసులకు పిలుపునిచ్చారు. నగరంలోని ఏ 1 కన్వెన్షన్ సమావేశ మందిరంలో ‘మారుతున్న విజయవాడ’ అనే అంశంపై నగరపాలకసంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం పాల్గొన్నారు. సదస్సుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, వైష్ణవి ఆర్కిటెక్, నలంద, మేరీస్టెల్లా, పీబీ సిద్ధార్థ, వీఆర్ సిద్ధార్థ, కేబీన్ కళాశాలల విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్స్, ఉపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులు సుమారు 8వేల మీటర్లు పెయింటింగ్స్ వేసి విజయవాడను అందంగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకోసం నగరంలోని ప్రతి వ్యక్తి వారికి తోచిన సాయం చేయాలని కోరారు. విద్యార్థులు పుష్కరాలకు ఇచ్చిన సెలవులను వృధా చేయకుండా భక్తుల కోసం వినియోగించాలని కోరారు. విద్యార్థులు వలెంటీర్లుగా పనిచేసేందుకు ముందుకు రావాలన్నారు. విజయవాడ రాజకీయ చైతన్యం కలిగిన నగరని చెన్నై తరువాత అంతటి పేరున్న నగరం విజయవాడేనని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో తొలుత విద్యార్థినులు నృత్యాలతో అలరించారు. చెట్ల పెంపకంతో కలిగే ప్రయోజనా లు.. పరిశుభ్రత.. పుష్కర స్నానం చేసే విధానంపై విన్నూత్న ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కలుషితమవుతున్న నీరు, పెరుగుతున్న మంచినీళ్ల ధరలుపై విన్నూత్న ప్రదర్శన నిర్వహించారు. వివిధ ¯ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులను సీఎం అభినందించారు. అదే విధంగా విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో మంత్రి మోపిదేవి ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, విజయవాడ నగర మేయర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ బాబు.ఏ, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మా శవాలపై రోడ్డు వేయండి
నున్న(విజయవాడరూరల్)ః ‘పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో చట్టబద్ధంగా ఈస్థలాలుకొని ఇళ్లు, ప్లాట్లు వేసుకున్నాం. రోడ్డు కోసమని ఇళ్లను కూలగొట్టి మమ్మల్ని రోడ్డున పడేస్తారా?, నమ్మి ఓటేసినందుకు చేసే ఉపకారం ఇదా?‘అని ప్రభుత్వ అరాచక చర్యలను నిరసిస్తూ మహిళలు దుమ్మెత్తి పోశారు. శనివారం నున్న లోకల్ బైపాస్ రోడ్డు నిర్మాణం పనుల కోసమని ఆర్అండ్బీ అధికారులు పోలీసును వెంటేసుకుని ఎలాంటి ముందస్తు సమాచారంలేకుండా ఇళ్ల తొలగింపు చేపట్టడంతో బాధితులు భగ్గుమన్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో నున్న రూరల్ పోలీసులు, అజిత్సింగ్నగర పోలీసులు రంగప్రవేశం చేశారు. గత 20 సంవత్సరాలుగా ఇళ్ళు నిర్మించుకొని జీవిస్తున్న సాతులూరి వెంకటేశ్వరమ్మ,అతని కుమారులు నలుగురిని ఇళ్ళు వదిలివెళ్ళాలని పోలీసులు భయపెట్టారు. 2008 లో హైకోర్టు స్టేటస్కో ఇచ్చిందని రోడ్డు నిర్మాణానికి మా ఇళ్ళను తొలగించబోమని చెప్పిన అధికారులు ఇప్పుడు ఖాళీచేయమని చెప్పడం ఏమిటని వెంకటేశ్వరమ్మ కుమారులు అధికారులను కలిసి కోర్టు ఉత్తర్వులను అందచేశారు. ఆ కుటుంబసభ్యులతో పాటు సమీపంలో ఫ్లాట్లుకొన్నవారు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవిన్యూఅధికారులు, సర్వేయర్ సుబ్బారావులు రోడ్డు ఎలైన్మెంటు ప్రకారం ఆర్అండ్బి అధికారులకు మార్కింగ్ చేసి అప్పగించడంతో వారు రోడ్డు పనులను జేసిబి మిషనుతో ప్రారంభించారు. ఆ సందర్భంలో స్ధలాలున్న మహిళలు మిషనుకు అడ్డుగా కూర్చువడంతో పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వ్యానులోకి ఎక్కించారు. లక్షలాది రూపాయలను అప్పుచేసి స్థలాలను కొనుగోలు చేశామని, ఇంకా అప్పుతీరలేదని మహిళలు బోరున విలపించారు. నష్టపరిహారం చెల్లించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మమ్మల్ని చంపి శవాలపై రోడ్డు నిర్మించుకోండని మహిళలు శాపనార్థాలు పెట్టారు. నిరసన తెలిపిన నిమ్మగడ్డ కుమారి, సునీత, లలితకుమారి, సాంబశివరావు, షేక్ ఖాశీంబి, శంకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుతలను పోలీసుస్టేçÙన్కు తరలించాక ఆర్అండ్బి అధికారులు రోడ్డు పనులను మార్కింగ్ చేసి ప్రారంభించారు. నున్న రూరల్ సీఐ సాహేరాబేగం, అజిత్ సింగ్‌నగర్ సీఐ ప్రసాదరావుల ఆధ్వర్యంలో భారీబందోబస్తు ఏర్పాౖటెంది. రోడ్డుౖ అలెన్మెంటులో సర్వే నెంబర్ 751/2 లో రెండెకరాల 36 సెంట్లు, 751/1బిలో 90 సెంట్ల భూమి అర్బన్‌ల్యాండ్ సీలింగ్ భూమని సర్వేయర్ సుబ్బారావు చెప్పారు. ఆర్అండ్బి రోడ్డు నుంచి 430 మీటర్ల ను మార్కింగ్ చేసి భూమిని అప్పగించినట్టు ఆయన చెప్పారు. పుష్కరాలకు రోడ్డు పూర్తి చేస్తాం నున్న లోకల్ బైపాస్‌రోడ్డు నిర్మాణం పనులను పుష్కరాలకు పూర్తిచేస్తామని ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సత్యనారాయణ చెప్పారు. వంద అడుగుల వెడల్పు,430 మీటర్ల పొడవునా రోడ్డును నిర్మించాల్సివుందన్నారు. – ఆర్అండ్బి ఇఈ -
గంట గంటకు అద్దె
సాక్షి, అమరావతి : పుష్కరాలకు వచ్చే భక్తులకు సాధ్యమైనంత వరకూ వసతి సౌకర్యాలు కల్పించడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 24 గంటల చెక్ అవుట్ స్థానంలో గంటల రూపంలో అద్దె వసూలు చేయడానికి హోటల్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. గోదావరి పుష్కరాల సమయంలో 12 గంటల చెక్ అవుట్‌కు జీవో ఇచ్చినట్టుగానే కృష్ణా పుష్కరాలకు కూడా కల్పించాలని హోటల్స్ అసోసియేషన్స్ ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ఎటువంటి జీవో జారీ చేయకుండానే అమలు చేయడానికి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా 20 శాతం మించి గదులు తీసుకోమని చెప్పడంతో సామాన్యులకు సాధ్యమైనన్ని గదులు అందుబాటులో ఉంటాయంటున్నారు. కేవలం 12 గంటల చెక్ అవుటే కాకుండా అవసరమైతే గంటల ప్రకారం అద్దె వసూలుచేసే ఆలోచన చేస్తున్నట్లు ప్రముఖ స్టార్ హోటల్ అధినేత చెప్పడం విశేషం. ఉన్న సమయాన్ని బట్టీ రోజువారీ టారీఫ్‌లో 20 నుంచి 40 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తక్కువ సమయం ఉన్న వారికి గరిష్టంగా డిస్కౌంట్ అందిస్తామని, దీనివల్ల గదులు తొందరగా ఖాళీ అయ్యి మరొకరికి అవకాశం ఉంటుందని తెలిపారు. వచ్చే భక్తుల్లో చాలామంది పవిత్ర స్నానంచేసి వెళ్లిపోవడానికే చూస్తారని, అందుకే గంటల ప్రకారం అద్దె వసూలు చేయడం ద్వారా ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. విజయవాడలో సుమారు 1,700 గదులు ఉండగా, ఇందులో 20 శాతం ప్రభుత్వానికి కేటాయిస్తున్నారు. ఈ గదులకు అద్దెలను వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం విశేషం. -
పుష్కరఘాట్లకు ప్రభుత్వం తూట్లు
భవానీపురం : కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో చేపట్టిన పుష్కర ఘాట్ల నిర్మాణంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. పుష్కరాలకు ముందే ఘాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని అర్భాటపు ప్రకటనలు చేసిన జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భక్తులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన భవానీఘాట్, పున్నమిఘాట్లను సందర్శించారు. అక్కడ ఇంకా 50 శాతం పనులుకూడా పూర్తికాకపోవడంతో ప్రభుత్వ అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీఘాట్‌లో ఇంకా మెట్లు నిర్మాణ పనులు జరగుతుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాట్లాడుతూ అరకొర పనులతో ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను చూస్తే రోజుకు 24 గంటలు కాదుగదా 30 గంటలపాటు చేసినా ఘాట్లు పుష్కరాల నాటికి పూర్తి అయ్యే పరిస్థితి లేదన్నారు. పైగా నిర్మాణంలో నాణ్యత ప్రశ్నార్థకమేనన్నారు. దండుకోవడానికే హడావుడి పనులు కనీసం ఆరు నెలలముందు ప్రారంభించాల్సిన పుష్కర పనులను ఆలస్యంగా చేపట్టడంలో అంతరార్ధం టీడీపీ నాయకుల స్వప్రయోజనాలేనని ఉదయభాను ఆరోపించారు. ముందుగా పనులు ప్రారంభిస్తే టెండర్లు పిలవాల్సి వస్తుందని, అందుకే ఆలస్యంగా మొదలుపెట్టి టీడీపీ నాయకుల బినామీలకు నామినేషన్ పద్ధతిపై అడ్డగోలుగా అప్పగించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పుష్కర ఘాట్ల పనులను పూర్తి చేసి యాత్రీకులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్ అక్బర్, చలమలశెట్టి సత్యనారాయణ, మారం వెంగళరెడ్డి ఉన్నారు. -
అందరూ ఆతిథ్యం ఇవ్వాలి
రామవరప్పాడు : రాబోయే కృష్ణా పుష్కరాల్లో నగరంలోని ప్రతి ఒక్కరూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డును బుధవారం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను సందరంగా తీర్చిదిద్దామన్నారు. కృష్ణా, గోదావరి నధుల అనుసంధానం ద్వారా పవిత్ర సంగమం ఏర్పాటు చేసుకోగలిగామని పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పరిశీలన ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం చంద్రబాబు ఆ రోడ్డుపై కాన్వాయ్‌లో ప్రయాణించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముస్లింల సంక్షేమానికి కృషి : మంత్రి పల్లె విజయవాడ (వన్‌టౌన్) : ముస్లింల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వించిపేటలోని ముసాఫిర్ఖానా ప్రాంగణంలో నూతనంగా చేపట్టిన షాదీఖానా భవన శంకుస్థాపన కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. తొలుగ జరిగిన సభలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు చేస్తోందని చెప్పారు. రంజాన్ తోఫా పేరుతో ప్రతి పేద ముస్లిం ఇంట పండుగ వాతావరణం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని రూ.200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు 12 శాతం మంది ఉన్నారని, ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో పలువురు శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. సభకు ముస్లిం మహిళలు అంతగా హాజరుకాకపోవడంతో డ్వాక్రా మహిళలను తరలించారు. -
పుష్కరాల్లో డ్రోన్ ఎంతో కీలకం
గుంటూరు: కృష్ణా పుష్కరాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం డ్రోన్ పనితీరును ఆయన పరిశీలించారు. పుష్కరాల సమయంలో వీటిని వినియోగించనున్న బృందానికి నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. డ్రోన్ ద్వారా సమాచారం అందుకున్న సిబ్బంది తక్షణమే ఆ సమాచారాన్ని అధికారులు అందజేస్తారన్నారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచవచ్చని పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా వచ్చే సమాచారం కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు జె.భాస్కరరావు, సుబ్బారాయుడు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
పుణ్యకాలంలో పాపకార్యం
పుష్కరాల భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు నాసిరకంగా మరుగుదొడ్లు నిర్మించిన కాంట్రాక్టర్ పెనమలూరు : మండలంలో పుష్కరాల పనులు ఫార్సుగా మారాయి. తాజాగా మరుగుదొడ్ల అద్దె బాగోతం వెలుగులోకి వచ్చింది. పచ్చనేతల అండదండటతో మరుగుదొడ్లనూ వదలకుండా కాసులు దండుకునే పనిలో పడ్డారు కాంట్రాక్టర్లు. పుష్కరాలకు అద్దె మరుగుదొడ్లు ఏర్పాటు చేసి రూ.11 లక్షలు స్వాహాకు చేసేందుకు ముందస్తు ప్రణాళిక వేశారు. పెనమలూరు మండలంలో యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, కాసరనేనివారిపాలెం గ్రామాల్లో ఘాట్లు ఉన్నాయి. పుష్కరాల యాత్రికుల కోసం ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను ఆర్డబ్ల్యూఎస్ శాఖ తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టింది. అద్దె డబ్బుతో శాశ్వతంగా నిర్మించొచ్చు పుష్కర ఘాట్ల వద్ద కాంట్రాక్టర్ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మరుగుదొడ్డికి రోజుకు అద్దె రూ 2200. పెనమలూరు మండలంలో యనమలకుదురులో 20 మరుగుదొడ్లు, పెదపులిపాకలో 10, చోడవరంలో 10, కాసరనేనివారిపాలెంలో నాలుగు కలిపి మొత్తం 44 మరుగుదొడ్లు నిర్మించారు. ఈ మరుగుదొడ్లకు 44 రోజులకుగాను అద్దె రూ.11,61,600. ఈ లెక్కన ఒక్కో మరుగుదొడ్డికి రూ 26,400 ప్రభుత్వం చెల్లించాలి. విజయవాడ నగరంలో ఏసీ గది రోజుకు రూ.1500 ఉంటుంది. కానీ తాత్కాలిక మరుగుదొడ్డి అద్దె మాత్రం దీనికంటే ఎక్కువ. దీన్ని చూసిన వారు పుష్కరాల పనులనూ అక్రమార్కులు వదలడం లేదని విమర్శిస్తున్నారు. వాస్తవంగా అద్దె బదులుగా ఈ సొమ్ముతో ఇక్కడ సామూహిక మరుగుదొడ్లు నిర్మించవచ్చు. గాలి వస్తే పడడం ఖాయం కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ఇరుకుగా చిన్నపాటి గాలి వస్తే పడిపోయేలా ఉన్నాయి. కేవలం రేకులతో సన్నని ఇనుక కమ్మెలతో వీటిని నిర్మించారు. భారీ ఖాయంగల వ్యక్తులు ఈ మరుగుదొడ్డిలోకి వెళ్లడం కష్టమే. తాత్కాలిక మరుగుదొడ్లకు పైకప్పు లేదు. వర్షం కురిస్తే భక్తుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఇలాంటి వారికి లక్షల రూపాలయ అద్దె చెల్లించడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వమే చెప్పాలి. -
చరిత్రకు సమాధి
సాక్షి, విజయవాడ : పుష్కరాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావుడి 150 ఏళ్ల చరిత్ర ఉన్న కృష్ణా డెల్టాలో నీటిపారుదల వ్యవస్థను దెబ్బతీస్తోంది. బ్రిటిష్ హయాంలో ముందుచూపుతో నిర్మించిన సాగునీటి కాలువలను ధ్వంసం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న లాకులను తొలగించి అక్కడ పుష్కర ఘాట్ నిర్మించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి ఘాట్లు నిర్మించినా పుష్కరాల అనంతరం జలరవాణా కోసం వాటిని తొలగించాల్సిందేనని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. కేవలం 12 రోజులు కోసం కోట్ల రూపాయలను వృథా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీఐపీ ఘాట్‌లో మోడల్ గెస్ట్ హౌస్‌కు ఎడమ వైపు, ప్రకాశం బ్యారేజీ సమీపంలో బ్రిటిష్ పాలన కాలంలో నిర్మించిన లాక్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జలరవాణాకు ఉపయోగించుకునేవారు. అప్పట్లో చిన్నచిన్న బోట్లు మాత్రమే వెళ్లేవి. అందువల్ల కేవలం ఆరు మీటర్ల మేర లాకులు నిర్మించారు. దీన్ని 14 మీటర్లకు విస్తరించాలని ఇరిగేషన్ అధికారులు భావిస్తుండగా, ప్రభుత్వం ప్రస్తుతం ఈ లాకులను పూర్తిగా తొలగించి ఇక్కడ ఘాట్ నిర్మాణం చేసింది. నదిలోని లాకుల్ని తొలగించడమే కాకుండా దానిపై కాంక్రీట్‌తో పూడ్చేశారు. లాకులు దాటిన తరువాత బోట్లు కృష్ణాకెనాల్లోకి వెళ్లేందుకు నదిలో ఉన్న జలరవాణా మార్గాన్ని పూర్తిగా మూసివేసి కాంక్రీట్ ఫ్లోరింగ్ చేశారు. కృష్ణాకెనాల్‌లో జలరవాణా కోసం నిర్మించిన గోడ ఆధారంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ఘాట్‌ను 30 మీటర్ల మేర తొలగించాల్సిందే.. ప్రకాశం బ్యారేజీ నుంచి ముక్త్యాల వరకు జలరవాణా చేయాలని భావిస్తున్నారు. దీనికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఆ తరువాత జలరవాణాను కృష్ణాకెనాల్ ద్వారా ఏలూరు కాలువ నుంచి కాకినాడ వరకు విస్తరించనున్నారు. ముక్త్యాల నుంచి వచ్చే పెద్ద పెద్ద బోట్లు కృష్ణాకెనాల్లోకి వెళ్లాలంటే ప్రస్తుతం బ్యారేజీ నుంచి దుర్గాఘాట్ వరకు నూతనంగా నిర్మిస్తున్న ఘాట్‌ను తొలగించాల్సిందేనని ఇంజినీర్లు చెబుతున్నారు. బ్యారేజీ నుంచి సుమారు 30 మీటర్లు తొలగిస్తేనే బోట్లు రాకపోకలు సాగిస్తాయని చెబుతున్నారు. జలరవాణా పనులు ప్రారంభించగానే ఇక్కడ నిర్మించిన నూతన ఘాట్ తొలగించే అవకాశం ఉంది. బ్యారేజీ వద్ద నీటి నిల్వను కొలిచేందుకు ఏర్పాటుచేసిన పరికరాలను ఘాట్ల నిర్మాణం కోసం తొలగించారు. ప్రస్తుతం నీటినిల్వలను అంచనాలతో లెక్కిస్తున్నారు తప్ప వాస్తవంగా ఎంత ఉందనేది కొలవలేకపోతున్నారు. జలభవన్ కూల్చివేత.. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలోని జలభవన్ను ఇటీవల అధికారులు పుష్కరాల సందర్భంగా రోడ్డు విస్తరణ కోసం కూల్చివేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయం చిన్న గదిలో మగ్గుతోంది. దీంతో కృష్ణానది వద్ద నీటి నిల్వలను లెక్కించడం కష్టంగా ఉందని కేంద్ర జలవనరుల శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. ఏమైనా పుష్కరాల పేరుతో నది వద్ద చేపట్టిన అభివృద్ధి పనులు నీటిపారుదల వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. -
లంకలో కృష్ణమ్మ విగ్రహం
నాగాయలంక: పుష్కరాల నేపథ్యంలో నాగాయలంక పుష్కర ఘాట్ వద్ద నది బ్యాక్‌డ్రాప్ అనుసంధానంగా కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. కృష్ణానది లాంచీలరేవు వద్ద ఘాట్ తుదిదశ నిర్మాణ పనులను కృష్ణాడెల్టా చీఫ్ ఇంజినీర్ వైఎస్ సుధాకర్, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.సుగుణాకరరావుతో కలిసి శనివారం ఆయన పర్యవేక్షించారు. ఘాట్ నిర్మాణం, శ్రీరామపాదక్షేత్రం ఆలయాల పునర్నిర్మాణ పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, సర్పంచ్ శీలి రాము, తహశీల్దార్ ఎస్.నరసింహారావు, ఎంపీటీసీ తలశిల స్వర్ణలత, డీఈ ఎం.మారుతీప్రసాద్ పాల్గొన్నారు. వైభవంగా దివ్యహారతి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల భక్తులు స్థానిక ప్రధాన పుష్కరఘాట్‌లో శనివారం రాత్రి 7.30 గంటలకు కృష్ణమ్మకు దివ్యహారతి ఇచ్చారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. తొలుత కృష్ణానదికి దీవి మురళీ ఆచార్యులు, ప్రభాకరశర్మ, తుర్లపాటి రామ్మోహనరావు ప్రత్యేక పూజలు చేశారు. చీర, పసుపు కుంకుమతో సారె సమర్పించారు. మహిళలు, భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. బందరు ఆర్డీవో పి.సాయిబాబు, తహశీల్దార్ ఎస్.నరసింహారావు, ఎంపీడీవో వి.ఆనందరావు, ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, ఎంపీపీలు సజ్జా గోపాలకృష్ణ, బండే కనకదుర్గ, ఎంపీటీసీ తలశిల స్వర్ణలత, అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ ఎస్ఎస్వీ మూర్తి పాల్గొన్నారు. అంతకు ముందు స్థానిక నాగసాధువు బాలాజీ ఆధ్వర్యంలో కృష్ణానదికి పూజలు చేసి హారతులిచ్చారు. -
గోడ ప్రమాద జాడ
సాక్షి, విజయవాడ : పుష్కర పనుల పుణ్యమా అని అధికారులు ఇతర ముఖ్యమైన పనులకు తిలోదకాలు ఇస్తున్నారు. పుష్కరాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల కోసం రెవెన్యూ అధికారులు తీసుకున్న ఒక నిర్ణయం జలరవాణా కోసం ఇప్పటికే చేపట్టిన పనులకు ఎసరు పెట్టగా, ఆ పక్కనే నిర్మించిన గోడ ప్రమాదకరంగా మారింది. కృష్ణానదిలో నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన ఉన్న రైవస్, ఏలూరు, బందరు కాలువలకు నీరు వదిలేందుకు కృష్ణా మెయిన్ కెనాల్ ఉంది. గతంలో కెనాల్ రోడ్డులో ఈ మెయిన్ కాలువ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ తరువాత దానికి మరమ్మతులు చేసి వినియోగిస్తున్నారు. ఈ కాలువనే బ్రిటీష్ కాలంలో జల రవాణా కోసం ఉపయోగించేవారు. దీనికోసం కెనాల్‌రోడ్డు నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్లే మార్గంలో ఒక వంతెన నిర్మించి దాని కింద రెగ్యులేటర్లను ఏర్పాటు చేశారు. ఈ వంతెన, లాకులు పాడవడంతో ఇరిగేషన్ అధికారులు కాలువలో దిగువకు 110 మీటర్ల తరువాత మరో వంతెనను నిర్మించి రెగ్యులేటర్లు ఏర్పాటుచేశారు. జలరవాణా వాల్ క్లోజ్ ఈ ఏడాది చివరి నాటికి ప్రకాశం బ్యారేజీ నుంచి జల రవాణా చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా కెనాల్‌లోనూ జలరవాణా మార్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే 1000 టన్నుల బోట్లు ఈ కాలువ ద్వారానే ఏలూరు కాలువలోకి వెళ్తాయి. ఈ నేపథ్యంలో కృష్ణా కెనాల్లో ఒక గోడను ఇరిగేషన్ అధికారులు నిర్మించారు. సుమారు 90 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పులో ఈ గోడ నిర్మించారు. ఒకవైపు కెనాల్ రోడ్డు, మరోవైపు ఈ గోడ ఉండటంతో దీని మధ్యలో జలరవాణాకు కావాల్సిన నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు. కాలువను పూడ్చేస్తున్న రెవెన్యూ కేవలం జలరవాణా కోసం నిర్మించుకున్న గోడను ఇప్పుడు రోడ్డుకు రిటైనింగ్ వాల్‌గా మారుస్తున్నారు. పాత వంతెన, కొత్తవంతెన మధ్య కెనాల్‌రోడ్డు వెడల్పు చాలా తక్కువగా ఉండటం వల్ల పుష్కరాలకు వచ్చే భక్తుల తొక్కిసలాట జరుగుతుందని రెవెన్యూ అధికారులు భావించారు. దీంతో అక్కడ రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జలరవాణా కోసం నిర్మించిన గోడను ఖరారు చేసుకుని రోడ్డును విస్తరిస్తున్నారు. 90 మీటర్ల పొడవు, 15 మీటర్ల ఎత్తులో ఉన్న గోడ నిండే వరకూ మట్టితో ఫిల్లింగ్ చేస్తున్నారు. వారం రోజుల్లో ఫిల్లింగ్ పూర్తిచేసి తారురోడ్డు వేయాలని భావిస్తున్నారు. దీనివల్ల రోడ్డు వెడల్పు అవుతుందని నిర్ణయించారు. మట్టిలోడు గోడ భరిస్తుందా? కేవలం జలరవాణా కోసం నిర్మించుకున్న గోడను రిటైటింగ్ వాల్‌గా వినియోగించడంపై ఇంజినీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 15 మీటర్ల ఎత్తులో ఉన్న గోడ వద్ద టన్నుల కొద్దీ మట్టిని నింపుతున్నారని, ఇక్కడ భక్తుల రద్దీ పెరిగినపుడు మట్టి ఒత్తిడి పెరిగి గోడ కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే, పుష్కరాలు ముగిశాక తిరిగి ఆ మట్టిని తీసేసి జలరవాణాకు సిద్ధం చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. పుష్కరాల పనులను హడావుడిగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఇవేమీ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడేకంటే ఆ ప్రదేశంలో బందోబస్తు ఏర్పాటు చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. l -
కృష్ణమ్మకు హారతి
నాగాయలంక : ప్రధాన పుష్కరఘాట్‌లో గురువారం రాత్రి సమరసతసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు కృష్ణమ్మకు హారతి ఇచ్చారు. ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులతో దీవి మురళీఆచార్యులు, ప్రభాకరశర్మ, తుర్లపాటి రామ్మోహనరావులు కృష్ణానదికి ప్రత్యేకపూజలు చేయించారు. కృష్ణమ్మకు చీర, పసుపు కుంకుమలతో సారె సమర్పించారు. నాగాయలంక, మర్రిపాలెం, బర్రంకుల టీ.కొత్తపాలెం, రేమాలవారిపాలెం, వక్కపట్లవారిపాలెం తదితర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. హారతుల్లో పాలుపంచుకోవడంతో కృష్ణాతీరం తీరం కిటకిటలాడింది. కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్.నరసింహారావు, ఎంపీటీసీ సభ్యురాలు తలశిల స్వర్ణలత, అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ ఎస్ఎస్వీ మూర్తి, బోయపాటి రాము ఫౌండేషన్ మండల శాఖ ధర్మప్రచారక్ పిరాటి శ్రీనివాసరావు, సంస్థ ఘాట్ కన్వీనర్లు ఎస్‌బీబీవీప్రసాద్, కేఎంఎస్ శేషుబాబు, రేమాల శ్రీనివాసరావు, ఆకురాతి బాబూరావు, శ్రీరామపాదక్షేత్రం కమిటీ, ఆర్యవైశ్య సంఘాల సభ్యులు, పలు స్వచ్ఛంద సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎన్డీఆర్ఎఫ్ విన్యాసాలు
-
గది..గగనమే !
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు విడిది చేయడానికి హోటల్ గదులు దొరికే అవకాశాలు కనిపించడం లేదు. విజయవాడలో ఉన్న హోటల్ గదుల్లో అధిక శాతం ప్రభుత్వమే బుక్ చేసుకోనుండడంతో సామాన్యులకు గదులు దొరకని పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడికి తరలి రావడంతో చాలా గదులలో ఇప్పటికే అధికారులు, మంత్రులు ఉంటున్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం 60 వేల మంది ఉద్యోగులకు బాధ్యతలను అప్పచెప్పింది. ఇవి కాకుండా ప్రొటోకాల్ అధికారులు, జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు అదనపు గదులను కేటాయించాల్సి వస్తోంది. నగరంలో ఉన్న ఫోర్ స్టార్ హోటళ్లలో అత్యధిక శాతం ప్రభుత్వమే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్రీస్టార్తో పాటు మిగిలిన లాడ్జీల్లో 30 నుంచి 40 శాతం గదులను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని హోటల్ ఓనర్స్ అంచనా వేస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో 30 శాతం గదులు... గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని హోటళ్లలో 30 శాతం గదులను ప్రభుత్వం తీసుకుందని, ఇప్పుడు కూడా అదే స్థాయిలో తీసుకునే అవకాశాలున్నాయని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐలాపురం రాజా అన్నారు. నగరంలో మొత్తం 200 హోటళ్లు ఉండగా అందులో మూడు ఫోర్ స్టార్, 8 త్రీస్టార్ హోటళ్లు ఉన్నాయి. అన్ని హోటళ్లలో కలిపి సుమారు 1,700 గదులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం తీసుకోగా కనీసం వెయ్యి గదులు కూడా మిగలని పరిస్థితి కనిపిస్తోంది. పుష్కర విధుల్లో ఉన్న ఉద్యోగస్తుల్లో చాలామందికి కళాశాలలు, కళ్యాణ మండపాల్లో వసతి ఏర్పాట్లు చేస్తున్నా, ఉన్నతాధికారులు, వచ్చే ముఖ్య అతిథుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గదులను కావాలని కోరుతోంది. గదుల కొరతను తీర్చడానికి 12 గంటల చెక్ ఔట్ సదుపాయం కల్పించాలని హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. గోదావరి పుష్కరాలకు ఇదే విధంగా 12 గంటల చెక్ ఔట్ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేశారని, అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని కోరుతున్నట్లు రాజా తెలిపారు. ఈ సూచనపై ప్రభుత్వం సాను కూలంగా స్పందించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. దీని వల్ల తక్కువగా ఉన్న గదులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునే వెసులుబాటుతో పాటు భక్తులకు ఆర్థికంగా కలిసొస్తుందన్నారు. ధరలు పెంచం.. డిమాండ్ ఉందని గదుల అద్దెలు పెంచే ఆలోచన లేదని ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఇవ్వగా మిగిలిన వాటిని సాధారణ రేట్లకే ఇస్తామని ఫార్చున్ మురళీ హోటల్ అధినేత ఎం.మురళీ కృష్ణ తెలిపారు. ఎవరూ అద్దెలు పెంచే ఆలోచనలో లేరని స్పష్టం చేశారు. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. తాము తీసుకునే గదులపై సాధ్యమైనంత డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఇలా ప్రభుత్వానికి ఇచ్చిన డిస్కౌంట్‌ను అద్దెలు పెంచడం ద్వారా సాధారణ భక్తులను నుంచి వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వ విధానం స్పష్టం కాకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టలేదని హోటల్ ప్రతినిధులు పేర్కొన్నారు. విజయవాడలో మొత్తం హోటళ్లు, లాడ్జీల సంఖ్య – 200 ఫోర్స్టార్ హోటళ్లు–3 (తాజ్ గేట్‌వే, డీవీ మానర్, ఫార్చూన్ మురళీ) త్రీస్టార్ హోటళ్ల సంఖ్య 8 అందుబాటులో ఉన్న మొత్తం గదులు 1,700 ఫోర్ స్టార్ హోటల్లో అద్దె రూ. 4,000 – 6,000 (24 గంటలు) త్రీ స్టార్ హోటల్లోæ అద్దె రూ. 2,000 3,000 లాడ్జీలు రూ. 500 1,500 -
నవ్వు‘తారు’
– పుష్కరాలు రాకముందే రహదారులు శిథిలం – నెల రోజులకే పగుళ్లు, ఆపై ప్యాచింగ్ పనులు – బాగున్న తారురోడ్డుపై మళ్లీ నిర్మాణం ఆత్మకూరు: కృష్ణా పుష్కరాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన రహదారి పనులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన టీడీపీ నాయకులకు వరంగా మారాయి. బీటీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. పుష్కరాలు కూడా రాక ముందే రహదారులు శిథిలమవుతున్నాయి. కోట్లాది రూపాయాలు స్వాహాకు గురవుతున్నా అడిగేవారే కరువయ్యారు. పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాల్సిన రహదారులు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఆత్మకూరు మండలంలో చేపట్టిన పనుల్లో అడుగడుగునా అక్రమాలే దర్శనమిస్తున్నాయి. నిబంధనల మేరకు పాత బీటీ రోడ్డును పూర్తిగా తొలగించి 40 ఎంఎం కంకకర వేసి రోలర్ తిప్పాలి. ఉదయం, సాయంత్రం క్యూరింVŠ చేస్తూ మళ్లీ రోలర్‌తో తిప్పి అనంతరం తారు వేయాలి. ఇదంతా తమకు వర్థించదంటూ పాత బీటీ రోడ్డుపైనే తారు మిక్సింగ్ వేసి నిధులు కాజేశారు. కొన్ని చోట్ల బీటీ రహదారికి ఇరువైపుల నాసిరకం కంకర వినియోగించారు. నాణ్యత..కష్ణమ్మకెరుక ఐదు కి.మీ. దూరం ఉన్న ఆత్మకూరు– కురుకుంద రహదారి నిర్మాణానికి పుష్కర నిధుల్లో రూ. 1.90 కోట్లు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పాత బీటీ రోడ్డుపైనే కొత్తగా మళ్లీ బీటీ రోడ్లు వేశారు. చకచక రోడ్డు వేసి తమ పని అయిపోయిందని కాంట్రాక్టర్ బిల్లు పొందాడు. అయితే 10 రోజులకే రహదారి పగుళ్లు ఇచ్చింది. అక్కడక్కడా గుంతలు కూడా పడ్డాయి. రహదారి నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు గుంతలు పడిన చోట ప్యాచింగ్ పనులు చేయించి చేతులు దులుపుకున్నారు. ప్యాచింగ్ పనులు కూడా తూతూమంత్రంగా చేయడంతో మూన్నాళ్లకే మళ్లీ గుంతలు పడ్డాయి. రూ. కోట్లాది రూపాయలతో చేపట్టిన రహదారి నాణ్యతను చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. అప్పుడు రూ. 1.28 కోట్లు.. ఇప్పుడు 1.30 కోట్లు మండలంలో రహదారులు లేని గ్రామాలెన్నో ఉన్నా బాగున్న రహదారికి నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం నిర్మించినది, ప్రస్తుతం బాగున్న బీటీ రోడ్డుకు మళ్లీ ప్రతిపాదనలు పంపడం, నిధులు కేటాయించడం.. రోడ్డేయడం అన్ని జరిగిపోయాయి. ఐదేళ్ల క్రితం రూ. 1.28 కోట్లతో కరివేన నుంచి నల్లకాల్వ వరకు బీటీ రోడ్డు నిర్మించారు. కష్ణా పుష్కరాల సందర్భంగా ఇదే రహదారికి రూ. 1.30 కోట్లు కేటాయించారు. నిబంధనల మేరకు పాత బీటీ రోడ్డు కూడా తొలగించలేదు. అదే రహదారిపై తారు రోడ్డు వేశారు. నిధులు కాజేయాలనో.. పనులు తర్వగా పూర్తి చేయాలనే తెలియదు కానీ.. వర్షం పడుతున్నా పనులు అలాగే చేసూకుంటూ వెళ్లారు. కరివేన గ్రామంలో సర్పంచ్ పనులు అడ్డుకోవడంతో కొంత పనులు నిలిచిపోయాయి. దాదాపు 4 కి.మీ దూరం ఉన్న బీటీ రోడ్డుపై దాదాపు 3 కి.మీ వరకు రోడ్డేసి నిధులు కాజేశారు. నాణ్యతలో తేడా లేదు: రమణ, పీఆర్ ఏఈ పుష్కర నిధులతో చేపట్టిన రహదారు పనులను నాణ్యతతో నిర్మిస్తున్నాం. ప్రతి రోజూ పనులను స్వయంగా పరిశీలిస్తున్నాం. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అక్కడక్కడ దెబ్బతినడంతో ప్యాచింగ్ వేస్తున్నాం. -
పుష్కరాలకు ఆర్టీసీ రిజర్వేషన్ నిల్
విజయవాడ : కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ రిజర్వేషన్ సౌకర్యాన్ని అధికారులు నిలిపివేశారు. పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ ఎక్కడికక్కడ టెర్మినల్స్‌ను ఏర్పాటుచేసి నగరమంతా సిటీ బస్సుల హవా నడిపిస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఉన్న ఆర్టీసీ సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం లేకుండా చేసింది. ఆగస్టు 11వ తేదీ అర్థరాత్రి ఆయా గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సు రిజర్వేషన్ మాత్రమే ఏర్పాటుచేశారు. మరుసటి రోజు 12 గంటల సమయం నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో రిజర్వేషన్ నిలిపివేశారు. ఎందుకంటే.. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో రిజర్వేషన్ ప్రయాణికులు పడిగాపులు పడ్డారు. దీంతో బస్సులు సమయానుకూలంగా నడవక, ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక.. రిజర్వేషన్ నగదును కోల్పోయారు. కొందరికి డబ్బు వాపస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమస్య పునరావృత్తం కాకుండా ఉండేందుకు రిజర్వేషన్ సౌకర్యం ఎత్తివేసినట్లు అధికారులు చెబుతున్నారు. కరెంట్ రిజర్వేషన్ ఉంది ఆర్టీసీ షెడ్యూల్ ప్రకారం సర్వీసుల్ని రద్దు చేయట్లేదు. రిజర్వేషన్ రద్దు చేయడంతో షెడ్యూల్ ప్రకారం ఉన్న సర్వీసులకు కరెంట్ రిజర్వేషన్ అవకాశం కల్పించారు. అలాగే, స్పెషల్ సర్వీసులు నడపడానికీ ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాన ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు
రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ కోడూరు : పుష్కరాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుష్కర ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ విజయభాస్కర్ తెలిపారు. హంసలదీవి, పవిత్ర కృష్ణాసాగర సంగమ ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించారు. దుర్గాఘాట్, పవిత్ర సంగమం, కృష్ణా సాగర సంగమం వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వేదాద్రి, ముక్త్యాల, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి తదితర ఘాట్ల వద్ద కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో పౌరాణిక, కూచిపూడి, భారతనాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వీటి నిర్వహణకు స్థలాలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్యదర్శి వై.సుబ్రహ్మణ్యం వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ వికాస సమితి మండల అధ్యక్షుడు మండలి వెంకట్రామ్, సర్పంచి కె.సముద్రాలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.