పుష్కరాల కోసం ట్రాఫిక్ మళ్లింపు
మండవల్లి :
కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు గుడివాడ ట్రాఫిక్ ఎస్‌ఐ ఏవీఎస్ రామకృష్ణ తెలిపారు. పుష్కరాల సందర్భంగా విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు ఏలూరు వైపునకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కైకలూరు, భీమవరం తదితర ప్రదేశాలకు కైకలూరు–భీమవరం రూట్‌లో వెళ్లరాదని సూచించారు. గుడివాడ నుంచి ఉప్పుటేరు వరకు ఈ విధమైన ఆంక్షలు విధించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏవిధమైన అంతరాయం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.