diversion
-
‘హైడ్రా’తో డైవర్షన్ పాలిటిక్స్: డీకే అరుణ
సాక్షి,హైదరాబాద్:డబ్బు సంచులను కాంగ్రెస్ అధిష్టానానికి సమకూర్చడానికి,ఆరు గ్యారెంటీలపై నుంచి ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఈ విషయమై డీకే అరుణ శుక్రవారం(సెప్టెంబర్27)మీడియాతో మాట్లాడారు.‘సామాన్యులను ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయం.హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజలను బెంబేలెత్తిస్తోంది.హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది.హైదరాబాద్ రావాలంటే పెట్టుబడిదారులు భయపడాల్సిన పరిస్థితి.కేసీఆర్‌కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ ప్రజలు గమనిస్తున్నారు.అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా ? నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి.కొందరికి ఒకలా మరికొందరికి ఇంకోలా నిబంధనలు పెడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేశారు.వక్ఫ్ యాక్ట్ 2024 సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రేపు హైదరాబాద్‌కు రానుంది.వివిధ రాష్ట్రాల్లో కమిటీ ఇప్పటికే పర్యటించింది. ఈక్రమంలోనే రేపు హైదరాబాద్‌లో కమిటీ పర్యటిస్తుంది.తాజ్ కృష్ణ హోటల్లో రేపు కమిటీని కలిసి వినతిపత్రాలు ఇవ్వవచ్చు.వక్ప్ సవరణ బిల్లుపై దుష్ప్రచారాలను ఎవరు నమ్మొద్దు.వక్ప్ బోర్డులు కొందరి చేతుల్లోనే ఉన్నాయి.పేద ముస్లీంలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది’అని డీకే అరుణ పేర్కొన్నారు. ఇదీచదవండి: నిజాంకన్నా దుర్గార్ముడు సీఎం రేవంత్‌రెడ్డి: ఎంపీ ఈటల -
రుణమాఫీ చేయలేకే.. విగ్రహాల లొల్లి: బండి సంజయ్
సాక్షి,కరీంనగర్ జిల్లా: రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల హామీలపై చర్చను మళ్లించడానికే కాంగ్రెస్,బీఆర్ఎస్ విగ్రహాల లొల్లి ముందుకు తీసుకు వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాల్ ప్రతి సవాల్ ప్రజల దృష్టిని మళ్ళించడానికే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కేటిఆర్ కూల్చుతామంటే ఎలా కూల్చుతారో చూస్తామని కాంగ్రెస్ అనడం ఆ రెండు పార్టీలు కూడబలుక్కుని మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.అసలు విగ్రహాలు సమస్యనా?...రైతులు రుణమాఫీ కాక, రైతుబంధు అందక సమస్యలతో సతమతం అవుతున్నారు. దానిపై చర్చించకుండా విగ్రహాలపై మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ బోగస్. ఆరు గ్యారంటీ స్కీమ్‌ల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలి’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతున్న నాన్–ఇంటర్ లాక్ పనుల కారణంగా డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన రైళ్లు: తెనాలి–విజయవాడ (7630), విజయవాడ–గూడూరు (7500), నర్సాపూర్–విజయవాడ (17270), విజయవాడ–బిట్రగుంట (7978) ఆగస్టు 3 నుంచి 10 వరకు, నర్సాపూర్–గుంటూరు (7281), హుబ్లి–విజయవాడ (17329) ఆగస్టు 4 నుంచి 10 వరకు, గూడూరు–విజయవాడ (7458), విజయవాడ–మాచర్ల (7781), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఆగస్టు 4 నుంచి 11 వరకు, విజయవాడ–భద్రచలం రోడ్డు (7979), భద్రచలం రోడ్డు–విజయవాడ (7278), విజయవాడ–తెనాలి (7295), తెనాలి–విజయవాడ (7575), విజయవాడ–గుంటూరు (7464/7465), విజయవాడ–డోర్నకల్ (7756/7755), విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202), విశాఖపట్నం–కడప (17488), విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712) ఆగస్టు 5 నుంచి 10 వరకు, గుంటూరు–రేపల్లె (7784/7785), గుంటూరు–విజయవాడ (7976), విజయవాడ–నర్సాపూర్ (17269), విజయవాడ–హుబ్లి (17330) ఆగస్టు 5 నుంచి 11 వరకు, మాచర్ల–విజయవాడ (7782), విజయవాడ–తెనాలి (7629), బిట్రగుంట–విజయవాడ (7977), విజయవాడ–నర్సాపూర్ (7862) ఆగస్టు 8 నుంచి 12 వరకు, కడప–విశాఖపట్నం (17487) ఆగస్టు 6 నుంచి 11 వరకు, చెన్నై సెంట్రల్–విజయవాడ (12077/12078) ఆగస్టు 5, 7, 8, 9, 10 తేదీలలో పూర్తిగా రద్దు చేశారు. దారి మళ్లింపు: సికింద్రాబాద్–విశాఖపట్నం (12740) ఆగస్టు 2 నుంచి 10 వరకు, గాం«దీనగర్–విశాఖపట్నం (20804) ఆగస్టు 4న, నిజాముద్దిన్–విశాఖపట్నం (12804) ఆగస్టు 4, 7వ తేదీలలో, ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019) ఆగస్టు 2 నుంచి 10 వరకు, యశ్వంత్‌పూర్–టాటా (18112) ఆగస్టు 4న, హైదరాబాద్–షాలీమార్ (18046) ఆగస్టు 3 నుంచి 11 వరకు, షిర్డీ సాయినగర్–కాకినాడ పోర్టు (17205) ఆగస్టు 4, 6, 8 తేదీలలో, షిర్డీ సాయినగర్–విశాఖపట్నం (18504) ఆగస్టు 2, 9 తేదీలలో, న్యూ ఢిల్లీ–విశాఖపట్నం (20806) ఆగస్టు 2 నుంచి 10 వరకు, హైదరాబాద్–విశాఖపట్నం (12728) ఆగస్టు 3 నుంచి 11 వరకు, విశాఖపట్నం–సికింద్రాబాద్ (12739) ఆగస్టు 2 నుంచి 10 వరకు, విశాఖపట్నం–న్యూఢిల్లీ (20805) ఆగస్టు 2 నుంచి 10 వరకు, భువనేశ్వర్–ఛత్రపతి శివాజీ టెర్మినస్ (11020) ఆగస్టు 2 నుంచి 10 వరకు, కాకినాడ పోర్టు–íÙర్డీ సాయినగర్ (17206) ఆగస్టు 3, 5, 7, 10 తేదీలలో, షాలీమార్–హైదరాబాద్ (18045) ఆగస్టు 2 నుంచి 10 వరకు, విశాఖపట్నం–నిజాముద్దిన్ (12803) ఆగస్టు 5, 9 తేదీలలో, విశాఖపట్నం–సాయినగర్ షిర్డీ (18503), టాటా–యశ్వంత్‌పూర్ (18111) ఆగస్టు 8న, విశాఖపట్నం–హైదరాబాద్ (12727) ఆగస్టు 3, 11 తేదీలలో, విశాఖపట్నం–గాందీనగర్ (20803) ఆగస్టు 8న, మచిలీపట్నం–íÙర్డీ సాయినగర్ (17208), నర్సాపూర్–నాగర్సోల్ (12787) ఆగస్టు 3, 5, 6, 7, 8, 10 తేదీలలో, మచిలీపట్నం–బీదర్ (12749) ఆగస్టు 3 నుంచి 11 వరకు, లోకమన్య తిలక్ టెర్మినస్–విశాఖపట్నం (18520) ఆగస్టు 2 నుంచి 10 వరకు, షిర్డీ సాయినగర్–మచిలీపట్నం (17207) ఆగస్టు 7న, నాగర్సోల్–నర్సాపూర్ (12788) ఆగస్టు 2, 4, 6, 7, 8, 9 తేదీలలో, బీదర్–మచిలీపట్నం (12750) ఆగస్టు 8 నుంచి 10 వరకు వయా రాయనపాడు, గుణదల, విజయవాడ బైపాస్ మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219), గుంటూరు–విశాఖపట్నం (22701/22702), ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం – విజయవాడ (07896), విజయవాడ – మచిలీపట్నం (07769), నర్సాపూర్ – విజయవాడ (07863), విజయవాడ – నర్సాపూర్ (07866), మచిలీపట్న – విజయవాడ (07770), విజయవాడ – భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం – విజయవాడ (07870), విజయవాడ – నర్సాపూర్ (07861) రైళ్లు విజయవాడ – రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి. దారి మళ్లింపు.. ఏప్రిల్ 1, 8, 15, 22 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (22643), ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో భావ్‌నగర్ – కాకినాడ పోర్టు (12756), ఏప్రిల్ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఏప్రిల్ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (11019), ఏప్రిల్ 1 నుంచి 28 వరకు ధనాబాద్ – అలప్పుజ (13351), ఏప్రిల్ 4, 11, 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111), ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో జసిదిహ్ – తాంబరం (12376), ఏప్రిల్ 1, 8, 15, 22 తేదీల్లో హతియ – ఎర్నాకుళం (22837), ఏప్రిల్ 6, 13, 20, 27 తేదీల్లో హతియ – బెంగళూరు (18637), ఏప్రిల్ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో హతియ – బెంగళూరు (12835), ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో టాటా – బెంగళూరు (12889) రైళ్లు వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం
విన్నీపెగ్: ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్ ప్రయరీస్కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్ కెనడా తెలిపింది. -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లా కేంద్రం సూర్యా పేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చినందున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నా రు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 గంటలకు సీఎం కేసీఆర్ సూర్యాపేట పట్టణ కేంద్రానికి చేరుకొని, సాయంత్రం 4:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జాతీయ రహదారిపై నేడు వాహనాల మళ్లింపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ వైపు మళ్లిస్తారు. ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబా ద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, మి ర్యాలగూడ మీదుగా నార్కట్‌పల్లి వైపు మళ్లిస్తారు. -
ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లోని మనుబోలు–గూడూరు సెక్షన్లో నాన్–ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఈ నెల 10 నుంచి 15 వరకు ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగా, పాక్షికంగా రద్దు చేసి మరి కొన్నింటిని దారి మళ్లించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రద్దయిన రైళ్లు: విజయవాడ–గూడూరు (07500/ 07458), సూళ్లురుపేట–నెల్లూరు (06745/06746, 06747/06748, 06750/06751), గూడూరు–రేణిగుంట (07667), మచిలీపట్నం–ధర్మవరం (07095/07096), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–గూడూరు (17260), చెన్నై సెంట్రల్–విజయవాడ (12077/12078), విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712), ధర్మవరం–నర్సాపూర్ (17248), తిరుపతి–కాకినాడ టౌన్(17249/17250) రైళ్లను ఈ నెల 10 నుంచి 15 వరకు, బెంగళూరు–హటియా (18637) ఈ నెల 12న, హటియా–ఒంగోలు (18238) ఈ నెల 15న, గయా–చెన్నై ఎగ్మూర్ (12389/12390), ఈ నెల 13,15న, తిరుపతి–విశాఖ (22708/22707) ఈ నెల 9, 10, 11, 12 తేదీలలోను, చెన్నై సెంట్రల్–విశాఖ (22869/22870) ఈ నెల 14, 15 తేదీల్లో పూర్తిగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దు: సికింద్రాబాద్–గూడూరు (12710/12709) రైలును ఈ నెల 9 నుంచి 14 వరకు వేదాయపాలెం–గూడూరు మధ్య, విజయవాడ–గూడూరు (12744/12743) రైలును ఈ నెల 11 నుంచి 15 వరకు నెల్లూరు–గూడూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్ళింపు: కాచీగూడ–మధురై (07191) ఈ నెల 14న డోన్, గుత్తి, రేణిగుంట మీదుగా, యర్నాకులం–హౌరా (22878) ఈ నెల 14న, మధురై–నిజాముద్దిన్ (12651) ఈ నెల 15న, బెంగళూరు–గౌహతి ఈ నెల 10, 11 తేదీల్లో కాటా్పడి, రేణిగుంట, నంద్యాల, గుంటూరు మీదుగా దారి మళ్ళించారు. -
డైవర్షన్ పాలిటిక్స్‌లో దిట్ట చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గాంభీర్య ప్రదర్శన ఎంత ఆసక్తికరంగా ఉంటుందో గమనించండి. ఒక చిన్న అవకాశం వచ్చినా, మొత్తం కథ అంతా తనవైపే తిప్పుకోవడానికి ఆయన చేసే విన్యాసాలు చూడండి. ఒకవైపు అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.370 కోట్ల స్కిల్ స్కామ్, మరో వైపు దానిని కప్పిపుచ్చుతూ చంద్రబాబు చేసే ప్రయత్నాలు. ఇలాంటి వ్యూహాలలో దిట్టే. అందులో సందేహం లేదు. ఇంతకీ ఏమిటి ఆయన చెప్పింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ గెలిచింది కాబట్టి ఇక వైఎస్సార్సీపీ పని, ముఖ్యమంత్రి జగన్ పని అయిపోయిందని ఆయన అంటారు. ఇక రెగ్యులర్ గా చేసే దూషణలను మరోసారి వినిపిస్తారు. అదే టైమ్ లో జగన్ విసిరే సవాల్‌కు సమాధానం చెప్పరు. పోని తన టైమ్‌లో జరిగిన స్కిల్ స్కామ్‌లో తన పాత్రపై వచ్చిన అభియోగాల గురించి మాట్లాడుతారా అంటే అది చేయరు. కాకపోతే టీడీపీ మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతి ,టీవీ 5 వంటివి ఉన్నాయి కనుక ఊదరగొడతారు. వాటిని వారు బ్రహ్మాండంగా మొదటి పేజీలలో అచ్చేసి ప్రచారం చేస్తారు. వారి టీవీలలో గంటల కొద్ది ప్రసారం చేస్తారు. ఈ రకమైన ప్రచారంతోనే వారు ఏపీ ప్రజలను ప్రభావితం చేయాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నట్లు అర్థం అవుతూనే ఉంది. జగన్ చేపట్టిన స్కీములు, తీసుకువచ్చిన సంస్కరణలు, పేద ప్రజలకు జరిగిన మేలు, ఎన్నికల హామీలను జగన్ అమలు చేసిన వైనం వంటివాటి జోలికి వెళితే తమ డొల్లతనం బయటపడుతుందని వారికి తెలుసు. అందుకే వాటిని జనం మర్చిపోయేలా చేయాలన్న ధ్యేయంతో చంద్రబాబుకానీ, ఈనాడు తదితర టీడీపీ మీడియా సంస్థలు కానీ నిత్యం పనిచేస్తుంటాయి. చంద్రబాబు తన మీడియా సమావేశంలో చేసిన ప్రకటన చూస్తే అసలు ఏపీలో ఇప్పటికే ఆయన ప్రభుత్వం వచ్చేసిందేమో అన్న సంశయం కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో వచ్చిన తిరుగుబాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అని ఆయన వర్ణించారు. ఈనాడు పట్టభద్రుల తిరుగుబాటు అని హెడింగ్ పెడితే, దానిని అనుసరిస్తూ కొద్దిగా మార్పుతో ప్రజల తిరుగుబాటు అని చంద్రబాబు అన్నారు. అలాగే ఈనాడు రాసిన వార్తలను బట్టి చంద్రబాబు పలు అంశాలను మాట్లాడారని ఇట్టే తెలిసిపోతుంది. కాకపోతే మధ్యలో అంబేద్కర్ కొటేషన్ వంటివి చెప్పి, తమది చాలా స్వచ్చమైన రాజకీయం అన్నట్లు, వైఎస్సార్సీపీది అంతా అరాచకం అన్నట్లు చిత్రించడానికి చంద్రబాబు చేయని కృషి లేదు. మూడు ఎమ్మెల్సీ స్థానాలలో ఓడిపోతేనే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా? మరి రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలలో వైఎస్సార్సీపీ గెలిచింది కదా అన్నదానికి ఆయన సమాధానం ఇవ్వరు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం వైఎస్సార్సీపీ గెలిచింది కదా అంటే అది పెద్ద విషయం కాదన్నట్లు ప్రస్తావించరు. వైసీపీ ఓటమి ప్రజల తిరుగుబాటు అయితే కుప్పంలో మొత్తం మున్సిపాల్టీతో సహా స్థానిక ఎన్నికలన్నిటిలో వైసీపీ స్వీప్ చేసింది కదా.. దానిని చంద్రబాబు కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు ఒప్పుకుంటారా? అంటే అబ్బే అవేమీ లెక్కలో వేయరు. గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతుందని మరో వ్యాఖ్య చేశారు. గతంలో కేసీఆర్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే మఘలో పుట్టి పుభలో పోతుందని వ్యాఖ్యానించారు. కానీ అది ఇంతితై, వటుడింతై అన్నట్లుగా రాజ్యాధికారాన్ని చేపట్టి , తెలంగాణ నుంచి చంద్రబాబును తరిమేసినంత పనిచేసిందన్న సంగతి గుర్తుంచుకోవాలి. అంతేకాదు. టీడీపీని తనదారిలోకి తెచ్చుకుని చంద్రబాబు మెడలు వంచి తెలంగాణకు అనుకూలంగా తీర్మానాన్ని కేసీఆర్ చేయించుకోగలిగారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ ను జగన్ స్థాపించినప్పుడు దానిని ఎలాగొలా అణచివేయాలని కాంగ్రెస్ తో కలిసి చేయని కుట్ర లేదు. అయినా జగన్ మొండిగా ధైర్యంగా ముందుకు వెళ్లి అధికారం చేపట్టారు. ఇప్పుడు ఆయనను ఎదుర్కోవడమే టీడీపీకి ఛాలెంజ్‌గా మారింది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేస్తుండడంతో ప్రజల మనసులను డైవర్ట్ చేయడానికి టీడీపీ కానీ, ఈనాడు వంటి మీడియా కానీ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్ని కబుర్లు చెప్పిన పెద్దమనిషి చంద్రబాబు ఇంతకీ తాను ఒంటరిగా పోటీచేసి అధికారంలోకి వస్తానని చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉండడమే హైలైట్ అని చెప్పాలి. టీడీపీ అధికారంలోకి రాబోతోందని బీరాలు పలకడం బాగానే ఉన్నా,అది ఎలా అన్నదానికి బదులు ఇవ్వరు. అదే ముఖ్యమంత్రి జగన్ అయితే తిరువూరు సభలో చాలా స్పష్టంగా ఏమన్నారో పరిశీలించండి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడం లేదని అంటున్న తెలుగుదేశం తాను ఒంటరిగా అన్ని సీట్లకు పోటీచేసి గెలుస్తానని చెప్పలేకపోతోందని ఎద్దేవా చేశారు. ఎన్ని తోడేళ్లు ఒకటైనా తాను మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళతానని జగన్ ధైర్యంగా చెబుతున్నారు. దుష్టచతుష్టయం, దత్తపుత్రుడి గురించి ప్రస్తావించి ఎవరెన్ని కుట్రలు చేసినా తాను ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానని ఆయన ధీమాగా అంటున్నారు. ఆ సాహసం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారంటే , జనంలో తనను నమ్మడం లేదన్న భయం ఉండడం వల్లే అని తెలుసుకోవచ్చు. ఈ గ్రాడ్యుయేట్ల ఎన్నికలలో కూడా టీడీపీకి వామపక్షాలు మద్దతు ఇవ్వడం బహిరంగ రహస్యం. పేదలకు అండగా ఉంటున్న జగన్ ను కాదని, పెట్టుబడిదారీ వ్యవస్థలకు ప్రతీకగా మారిన టీడీపీకి సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు జైగొట్టే దుస్థితిలో పడ్డాయి. అది వేరే సంగతి అయినా ఈ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరగలేదు. కాకపోతే వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్ధులను ప్రకటించడంతో అవి రాజకీయం రంగు పులుముకున్నట్లయింది. నాలుగేళ్లుగా ఒక్క ఎన్నికలో గెలవలేకపోయిన టీడీపీకి ఈ గ్రాడ్యుయేట్ల ఎన్నికలు కాస్త ఊరట ఇచ్చి ఉండవచ్చు. అంతమాత్రాన అధికారంలోకి వచ్చేశామని హోరెత్తిస్తే జనం అంతా మారిపోతారన్నది వారి వ్యూహం. అదే టైమ్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రను మంత్రి బుగ్గన డిటైల్డ్‌గా వివరించారు. దానిని కప్పిపుచ్చడానికి చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి ఎన్నికల ఫలితాల గురించి ప్రసంగించారు. ఆయనకు తోడుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఆ స్కామ్ అప్రాధాన్య అంశం అన్నట్లుగా నటిస్తున్నాయి. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో జరిగిన అక్రమాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేకపోయింది. కానీ చంద్రబాబు పరోక్షంగా మాట్లాడుతూ ,కొందరు ఆరేడు దశాబ్దాలుగా తమ బ్రాండ్ ను రుజువుచేసుకున్నారని, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారని, గౌరవంగా బతికేవారిని రోడ్డుమీదకు జగన్ తెచ్చారంటూ వ్యాఖ్యానించారు. అంతే తప్ప ధైర్యంగా మార్గదర్శిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన ఎందుకు చెప్పలేకపోయారు? తన హయాంలో పత్రికా స్వేచ్చ బ్రహ్మాండంగా ఉన్నట్లు అసత్యాలు చెబుతున్నారు. ఆ రోజుల్లో సాక్షి టీవీని కనిపించకుండా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారో, సాక్షి పత్రికను ఎన్ని రకాలుగా వేధించారో ప్రజలకు తెలియదని ఆయన అనుకుంటున్నారు. సాక్షి తో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై చంద్రబాబు టైమ్ లో బ్యాన్ కూడా అనధికారికంగా విధించారు. ఇప్పుడేమో ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్చ అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. అదే చంద్రబాబు గొప్పతనం అని ఒప్పుకోవాలి. నిజంగానే చంద్రబాబుకు తన పార్టీ విజయంపై అంత నమ్మకం కుదిరితే, జగన్ సవాల్ కు స్పందించి టీడీపీ ఒంటరిగా పోటీచేస్తుందని చెప్పగలరా? -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ చదవండి: రెండు సీట్లకు ఎగిరి గంతేయడమే టీడీపీ స్టైల్! -
గన్ షాట్ : సేనాని సిల్లీ ప్లాన్స్
-
పలు రైళ్ల దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఈస్ట్రన్ రైల్వే పరిధి హౌరా–బర్ధమాన్ సెక్షన్లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా వాల్తేర్ డివిజన్ నుంచి నడిచే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. మార్పులను గమనించి, వీటికనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ►బెంగళూరులో శుక్రవారం బయలుదేరిన బెంగళూరు–గౌహతి(02509) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ వయా ఖరగ్‌పూర్, హౌరా, బందేల్, బర్ధమాన్ మీదుగా ప్రయాణించి హౌరా స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. ►యశ్వంత్‌పూర్‌లో శుక్రవారం బయలుదేరిన యశ్వంత్‌పూర్–గౌహతి(06577) సమ్మర్ స్పెషల్ వయా ఖరగ్‌పూర్, హౌరా, బందేల్, బర్ధమాన్ మీదుగా ప్రయాణించి హౌరా స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. త్రివేండ్రం– మాల్డా మధ్య స్పెషల్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా త్రివేండ్రం–మాల్డా –త్రివేండ్రం మధ్య స్పెషల్ సర్వీసు నడుపుతున్నట్లు డీసీఎం త్రిపాఠి తెలిపారు. త్రివేండ్రం–మాల్డా టౌన్ (06185) సమ్మర్ స్పెషల్ త్రివేండ్రంలో ఈ నెల 15వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి మూడవ రోజు(ప్రయాణ రోజు నుంచి) రాత్రి 8.10 గంటలకు మాల్డా టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మాల్డా టౌన్–త్రివేండ్రం సమ్మర్ స్పెషల్ మాల్డా టౌన్లో ఈ నెల 18వ తేదీ మంగళవారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 3.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 3.55 గంటలకు బయలుదేరి మూడవ రోజు (ప్రయాణ రోజు నుంచి) రాత్రి 11.10 గంటలకు త్రివేండ్రం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, కటక్, భద్రక్ స్టేషన్లలో ఆగుతుంది. 13–స్లీపర్ క్లాస్, 4–జనరల్ సెకండ్ క్లాస్, 2–లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది. చదవండి: పల్లెకు దూరమై.. చేనుకు చేరువై! ప్రైవేట్ ఆస్పత్రుల్లో అక్రమాలపై విజిలెన్స్ కొరడా -
విశాఖను వెలివేశారా!
గాజువాకకు చెందిన ఓ ప్రయాణికుడు బైపాస్‌లో వెళ్తున్న సికింద్రాబాద్–భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి ప్రయాణించి అర్ధరాత్రి 2.30 గంటలకు దువ్వాడ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆయన నివసిస్తున్న గాజువాక వెళ్లడానికి ఆ సమయంలో ఒక్క బస్సూ లేదు. ఉన్న ఒక్క ఆటోవాలను అడిగితే రూ.500 డిమాండ్ చేశాడు. బేరమాడి చివరికి రూ.400 సమర్పించుకొని గాజువాక చేరుకున్నాడు...ఇది ఏ ఒక్క ప్రయాణికుడి ఇబ్బందో కాదు.. బైపాస్ రైళ్లతో విశాఖవాసులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.విశాఖ రైల్వేస్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఏ రైలు ఖాళీగా వచ్చినా విశాఖలో మాత్రం నిండిపోతుంది. అంత డిమాండ్ ఉన్నప్పటికీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 రైళ్లు విశాఖ రైల్వేస్టేషన్‌కు రాకుండానే దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయి. ప్లాట్‌పారాలు ఖాళీ లేవన్న కారణంతో రైళ్లను బైపాస్ మార్గంలో దువ్వాడ మీదుగా మళ్లించేస్తున్నారు. దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లను సైతం విశాఖను వెలివేశామన్నట్లు వ్యవహరిస్తూ దువ్వాడ మీదుగానే నడుపుతున్నారు. రైల్వే అధికారుల తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: తూర్పు కోస్తా రైల్వే జోన్‌కే కాదు.. దేశ రైల్వే వ్యవస్థకూ కీలకమైన స్టేషన్‌గా విశాఖపట్నం గుర్తింపు పొందింది. కానీ.. ఆ గుర్తింపునకు మచ్చతెచ్చేలా వివిధ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైళ్ల రాకపోకల విషయంలో విశాఖకు తీరని అన్యాయం జరుగుతోంది. ప్రధాన నగరాలకు వెళ్తున్న కీలక ట్రైన్లన్నీ విశాఖ మొహం చూడకుండానే జారుకుంటున్నాయి. వాల్తేరు అధికారుల నిర్లక్ష్యం.. రెండు జోన్ల కక్షసాధింపు చర్యలతో విశాఖను వెలివేసినట్లుగా వ్యవహారం మారుతోంది. ట్రాఫిక్ బూచీ.. రైళ్లు బైపాస్‌కి.. విశాఖ రైల్వే స్టేషన్లో 8 ప్లాట్‌ఫారాలున్నాయి. ప్రతి ప్లాట్‌ఫామ్.. 24 బోగీలకంటే ఎక్కువ సామర్ధ్యమున్న ట్రైన్ అయినా హాల్ట్ చేసుకునేలా రూపొందించారు. విశాఖకు వచ్చే ప్రతి రైలూ తమ ప్రయాణ దిశను మార్చుకొని తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది. ఈ కారణంగా స్టేషన్లో ట్రైన్లు ఎక్కువ సేపు ఆపుతుంటారు. దీంతో రాబోయే రైళ్ల రాకపోకలు సాగించేందుకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ కారణంగా విశాఖ వచ్చే రైళ్లని ఎక్కువగా ఔటర్లో నిలబెడతారు. ఇదే సాకుని చూపిస్తూ.. చాలా రైళ్లని విశాఖ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాస్తవంగా విశాఖ రైల్వే స్టేషన్ మీదుగా.. ఏ ట్రైన్ వెళ్లినా ఆక్యుపెన్సీ విపరీతంగా ఉంటుంది. ఇదంతా రైల్వే అధికారులకు తెలిసినా.. బైపాస్ మీదుగా రైళ్లని పంపించేస్తున్నారు. పదమూడేళ్లుగా వివక్షే... 2006లో తొలిసారిగా బైపాస్ మీదుగా రైళ్ల మళ్లింపు ప్రారంభించారు. రిలే రూట్ ఇంటర్ లాకింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ మళ్లింపులు చేశారు. అప్పట్లోనే 12 ట్రైన్లు బైపాస్ మీదుగా వెళ్లిపోయాయి. అయితే అప్పటి వాల్తేరు డీఆర్ఎం ఇంద్రకుమార్ ఘోష్ స్టేషన్ రద్దీ దృష్ట్యా జ్ఞానాపురం వైపు మరో 4 ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేసేందుకు నివేదిక సిద్ధం చేసి ఈస్ట్‌కోస్ట్ ఉన్నతాధికారులకు పంపించారు. ఆ నివేదికను తుంగలో తొక్కేశారు. దారి మళ్లింపు విషయంలో అప్పటి ఎంపీలు పోరాటం చేయడంతో మళ్లీ విశాఖ నుంచి 7 ట్రైన్లు రాకపోకలు ప్రారంభించాయి. 5 మాత్రం అలాగే ఉన్నాయి. దసరా పేరుతో మరికొన్ని... ఆది నుంచి 5 రైళ్లు దువ్వాడ బైపాస్ మీదుగా వెళ్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో 5 రైళ్లను విశాఖ నుంచి పంపించేస్తున్నారు. దసరా సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించిన అధికారులు.. అందులో కొన్ని ట్రైన్లని విశాఖకు రానివ్వకుండా దువ్వాడ, కొత్తవలస మీదుగా దారి మళ్లించేశారు. పనిలో పనిగా నిత్యం విశాఖ మీదుగా వెళ్లే మరో 5 రెళ్లని కూడా బైపాస్ మీదుగా పంపించేస్తున్నారు. పండగ సమయంలో ఇలా చేస్తే ఎలా..? దసరా రద్దీ దృష్ట్యా రైళ్లను బైపాస్ మీదుగా పంపిస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు. కానీ పండగ సమయంలో విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చే వారి సంఖ్య విపరీతంగా ఉంటుంది. వారందరికీ ఈ రైళ్లు ఏవీ ఉపయోగపడని పరిస్థితి దాపురించింది. రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. వాల్తేరు డివిజన్ అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు. రాత్రి పూట ఖాళీ ఉన్నా..పట్టించుకోవట్లేదు.. ముఖ్యంగా ప్రత్యేక రైళ్ల విషయంలో ఈ వివక్ష చూపిస్తున్నారు. దువ్వాడ మీదుగా బైపాస్ చేస్తున్న ప్రత్యేక రైళ్లలో ఐదు ట్రైన్లు అర్ధరాత్రి 12 గంటలు నుంచి వేకువజామున 5 గంటలలోపు వెళ్తున్నాయి. ఆ సమంలో విశాఖ స్టేషన్లో ప్లాట్‌ఫారాలు ఖాళీగానే ఉంటున్నాయి. అయినా వాటికి మార్గం లేదంటూ అధికారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలిది బైపాస్ కాదు.. కానీ... వాస్తవంగా దువ్వాడ బైపాస్ని ఎంచుకోవడం అతి పెద్ద తప్పుగానే పరిగణించవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ బైపాస్ ఉంది. ప్రధాన స్టేషన్‌కు బైపాస్ స్టేషన్‌కు ప్రతి చోటా 7 కి.మీ లోపే ఉంటుంది. ఉదాహరణకు చెన్నైకి పెరంబుదూర్ బైపాస్ 4 కిమీ దూరంలో ఉంది. ఖరగ్‌పూర్‌కి హిజ్లీ బైపాస్ 7 కి.మీ, నిజాముద్దీన్‌కి ఢిల్లీ బైపాస్ 7 కి.మీ, విజయవాడకు రాయనపాడు బైపాస్ 7 కి.మీ దూరంలో మాత్రమే ఉన్నాయి. ఆయా బైపాస్‌ల నుంచి 24 గంటల పాటు కొన్ని చోట్ల లోకల్ ట్రైన్లు, మరి కొన్ని చోట్ల బస్సు సౌకర్యం ఉంది. కానీ.. విశాఖ నుంచి దువ్వాడ బైపాస్కు 17 కి.మీ, కొత్తవలస బైపాస్కు 20 కిమీ దూరం ఉంది. ఆ స్టేషన్ల నుంచి రాత్రి 8 గంటలు దాటితే బస్సు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. కక్షపూరిత వ్యవహారంగా..? విశాఖపట్నం రాకుండా ట్రైన్లని బైపాస్ మీదుగా పంపిచేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. స్థానిక ప్రయాణికులతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా రైల్వే మంత్రి, బోర్డు అధికారులకు ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. ఇదంతా విశాఖపట్నం జోన్‌గా ఏర్పడుతుందన్న అక్కసుతో దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆడుతున్న మోసపూరిత నాటకమని విమర్శిస్తున్నారు. విశాఖ స్టేషన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పోగొట్టేందుకు ఈ రైళ్లని రానివ్వకుండా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. విశాఖ జోన్ ఏర్పడితే ఆయా జోన్ల ఆదాయం తగ్గుముఖం పడుతుందనే కారణంతో ఈ విధమైన నిరంకుశ వ్యవహారాలకు తెరతీస్తున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. బైపాస్‌తో ఇబ్బందులు పడుతున్నాం.. బైపాస్ రైళ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అర్ధరాత్రి దువ్వాడ స్టేషన్లో దిగిన తర్వాత ఇంటికి చేరుకోవాలంటే ఉదయం వరకు పడిగాపులు కాస్తున్నాం. ఆటోలో వెళ్దామంటే ఆస్తులడుగుతున్నారు. బైపాస్ మార్గమంటూ ప్రయాణికుల్ని అర్ధరాత్రి అడవిపాలు చేస్తున్నారు ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. విశాఖ మీదుగా ప్రతి రైలూ వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. – ఎస్.అజిత్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి, విశాఖపట్నం విశాఖ అంటే ఎందుకంత చులకన విశాఖ అంటే రైల్వే అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. జోన్ అక్కసుతో చాలా రైళ్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు రాకుండా చేస్తున్నారు. ఫలి తంగా.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జోన్ వచ్చేంత వరకూ విశాఖకు ఈ కష్టాలు తప్పవేమోననే ఆందోళన అందరిలోనూ కలుగుతోంది. – అనిల్‌కుమార్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఎంవీపీకాలనీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తా.. బైపాస్ మార్గంలో ప్రధాన రైళ్లని నడపుతుండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా సందర్భంగా వేసిన రైళ్లు కూడా బైపాస్‌లోనే వేయడంతో విశా>ఖ ప్రజలు ఆ ట్రైన్ల సేవలు అందుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాను. – ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ -
అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈస్ట్ జోన్లో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని.. వారి నుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో అబిద్ మోహినుద్దీన్, షేక్ అబ్దుల్ బాసిత్, సంబరం రాజేష్‌లను అరెస్ట్ చేశామన్నారు. రాజేష్ కుమార్ బగడియా అనే వ్యక్తిని ఈ ముఠా మోసం చేసిందని పేర్కొన్నారు. పాత నోట్లను మార్పిడి చేస్తామంటూ.. రాజేష్‌ను నమ్మించారని చెప్పారు. రెండు రోజుల్లో ఈస్ట్ జోన్ పోలీసులు ఈ కేసును చేధించారని సీపీ పేర్కొన్నారు. -
రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు
వీఐపీలు, సాధారణ ప్రజలకు వేర్వేరు రూట్లు సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలోని రాయపూడి– లింగాయపాలెం గ్రామాల మధ్య శుక్రవారం జరగనున్న ప్రభుత్వ కార్యాలయ భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు వీవీఐపీలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణనాయక్ తెలిపారు. విజయవాడ నుంచి వచ్చే వీఐపీల వాహనాలు మొదటి రూట్లో కరకట్ట మీదుగా ఉద్దండరాయునిపాలెం బొడ్రాయి అక్కడ నుంచి లింగాయపాలెం నుంచి వీఐపీ పార్కింగ్‌కు వెళ్లాలని సూచించారు. రెండో రూట్లో కరకట్ట మీదుగా వెంకటపాలెం– మందడం– వెలగపూడి– ఉద్దండరాయునిపాలెం బొడ్డురాయి– లింగాయపాలెం– వీఐపీ పార్కింగ్‌కు చేరుకోవాలని చెప్పారు. గుంటూరు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు తాడికొండ మీదుగా తుళ్లూరు– రాయపూడి నుంచి కరకట్ట వైపు వచ్చి లింగాయపాలెం వెనుకవైపు ఉన్న వీఐపీ పార్కింగ్‌కు చేరుకోవాలి. విజయవాడ వైపు నుంచి సామాన్య ప్రజలు ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక– కృష్ణాయపాలెం– వెలగపూడి– రాయపూడి నర్సరీ– లింగాయపాలెం ఎన్సీసీ కాంక్రీట్ లిక్కర్ పార్కింగ్ ప్లేస్‌లో ఆర్టీసీ, సిటీ బస్సులకు పార్కింగ్ ఉంది. దాని వెనుక కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. మంగళగిరి నుంచి వచ్చే వాహనాలు ఎర్రబాలెం– కృష్ణాయపాలెం– వెలగపూడి– రాయపూడి నర్సరీ– లింగయపాలెం ఎన్సీసీ కాంక్రీట్ లిక్కర్ పార్క్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి వచ్చే సాధారణ వాహనాలు తాడికొండ మీదుగా తుళ్లూరు– రాయపూడి నర్సరీ– లింగాయపాలెం ఎన్సీసీ కాంక్రీట్ లిక్కర్ పార్క్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. వీఐపీలు, ప్రజలు ట్రాఫిక్ మళ్ళింపులను గుర్తించి పోలీసులకు సహకరించాలని నాయక్ కోరారు. -
29 వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
గుంటూరు (నగరంపాలెం): సత్తెనపల్లి, పిడుగురాళ్ళ మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున డివిజను పరిధిలో గురువారం (29.09.2016)వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్టు గుంటూరు రైల్వే డివిజను సీనియర్ డివిజనల్ మేనేజరు కె. ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 28, 29 తేదీలలో ట్రైన్ నం: 77676/77677 మిర్యాలగూడ– పిడుగురాళ్ళ– పిడుగురాళ్ళ ప్యాసింజరు, ట్రైన్ నం : l12747/12748 గుంటూరు– వికారాబాద్– గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నం : 57319/57320 గుంటూరు– మాచర్ల– గుంటూరు ప్యాసింజరు, ట్రైన్ నం : 57317 గుంటూరు– మాచర్ల ప్యాసింజరు, ట్రైన్ నం : 57323/57324 నడికుడి– మాచర్ల– నడికుడి ప్యాసింజరును, ట్రైన్ నం 12795/12796 విజయవాడ– సికింద్రాబాద్– విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. 28, 29 తేదీలలో ట్రైన్ నం: 57620 కాచిగూడ– రేపల్లె డెల్టా ప్యాసింజరు కాచిగూడ –గుంటూరు మధ్యలో, ట్రైన్ నం : 57619 రేపల్లె– సికింద్రాబాద్, ట్రైన్ నం: 57651/127652 సికింద్రాబాద్– రేపల్లె– సికింద్రాబాద్ ప్యాసింజరును గుంటూరు,సికింద్రాబాద్ మధ్యలో, ట్రైన్‌నెం 57318 మాచర్ల– బీమవరం ప్యాసింజరు గుంటూరు– మాచర్ల మధ్యలో పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్ళించిన రైళ్లు.. 27, 28, 29 తేదీలలో ట్రైన్‌నెం 12603 చెన్నై–హైద్రాబాద్, 28,29 తేదీలలో ట్రైన్‌నెం 12604 హైద్రాబాద్–చెన్నై చెన్నై ఎక్స్‌ప్రెస్, 28, 29 తేదీలలోట్రైన్నెం 12734/12733 సికింద్రాబాద్– తిరుపతి– సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఖాజీపేట, విజయవాడ, న్యూగుంటూరు స్టేషను మీదుగా తెనాలి వైపునకు దారిమళ్ళించారు. 27,28 తేదిలలో ట్రైన్‌నెం 17229 తివేండ్రమ్–హైద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్, 28, 29 తేదీలలో ట్రైన్ నెం 17230 హైద్రాబాద్– తివేండ్రమ్ శబరి ఎక్స్‌ప్రెస్, 28, 29 తేదీలలో ట్రైన్‌నెం 17016 భువనేశ్వర్– సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, 27,28 తేదీలలో ట్రైన్‌నెం 17015 సికింద్రాబాద్– భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ , 28,29 తేదిలలో ట్రైన్‌నెం 12704 సికింద్రాబాద్– హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 27,28 తేదిలలో ట్రైన్‌నెం 12703 హౌరా– సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 28,29 తేదీలలో ట్రైన్‌నెం 12805/12806 విశాఖపట్నం– సికింద్రాబాద్– విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ,28,29 తేదిలలోట్రైన్నెం 17255/17256 నర్సాపూర్–ౖ హెద్రాబాద్– నర్సాపూర్, నర్సపూర్ ఎక్స్‌ప్రెస్, 28వతేది ట్రైన్‌నెం 17221 కాకినాడపోర్టు– లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీ కాకినాడ పోర్టు– భావనగర్ ఎక్స్‌ప్రెస్, 27వ తేదీ ట్రైన్‌నెం 07439 టాటా– కాచీగూడ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను ఖాజీపేట మీదుగా విజయవాడ వైపు దారి మళ్లించారు. -
డ్రైవర్ బాబూ.. ఈ బోర్డులు గమనిస్తూ సాగిపో...!!
చల్లపల్లి : వైజాగ్ – చెన్నై జాతీయ రహదారిలో విజయవాడకు ప్రత్నామ్యాయంగా మారిన చల్లపల్లిలో పోలీసులు రూట్ సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. కృష్ణా పుష్కరాలకు విజయవాడలో వాహనాల రద్దీ నియంత్రించేందుకు వైజాగ్ – చెన్నై జాతీయ ర హదారిలో విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు మచిలీపట్నం – చల్లపల్లి – పులిగడ్డ – రేపల్లె – ఒంగోలు మీదుగా మళ్లించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు దృష్ట్యా ఈ రూట్లోకి కొత్తగా వచ్చే డ్రైవర్ల అవగాహన కోసం బోర్డులు ఏర్పాటు చేశారు. చల్లపల్లి నుంచి ఒంగోలు 137 కిలోమీటర్లు, చీరాల 84 కిలోమీటర్లు దూరం. ఈ మేరకు బందరురోడ్డులో ప్రధాన కూడలికి చేరువలో రూట్ బోర్డు పెట్టారు. విజయవాడ, మచిలీపట్నం వైపుల నుంచి వచ్చే వాహనాలకు డైవర్షన్ బోర్డులను ప్రధానకూడలిలో ఏర్పాటు చే శారు. -
పుష్కరాల కోసం ట్రాఫిక్ మళ్లింపు
మండవల్లి : కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ ఏవీఎస్ రామకృష్ణ తెలిపారు. పుష్కరాల సందర్భంగా విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు ఏలూరు వైపునకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కైకలూరు, భీమవరం తదితర ప్రదేశాలకు కైకలూరు–భీమవరం రూట్లో వెళ్లరాదని సూచించారు. గుడివాడ నుంచి ఉప్పుటేరు వరకు ఈ విధమైన ఆంక్షలు విధించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏవిధమైన అంతరాయం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. -
వెయ్యి టీఎంసీల గోదావరి నీరు మళ్లింపు
చిత్తూరు జిల్లా అంగళ్లు రైతు సదస్సులో సీఎం చంద్రబాబు బి.కొత్తకోట: వృధాగా సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీల గోదావరి జలాల్లో 1,000 టీఎంసీల నీటిని మళ్లించి కరు వు ప్రాంతాలను ససశ్యామలం చేస్తామని సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు ప్రకటిం చారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లులో గురువారం రాత్రి రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ తుంగభద్ర, గోదావరి నదుల ఎగువభాగంలో ప్రాజెక్టుల నిర్మాణాల కారణంగా రాష్ట్రంలోకి రావాల్సిన నీటికి అడ్డంకులు కలుగుతున్నాయని, పెన్నానది ఎండిపోయి నీటి ఇబ్బందులు అధికమయ్యాయని చెప్పారు. ఇందులో భాగంగానే వృధా జలాల్లో 1,000 టీఎంసీల నీటిని కృష్ణా, పెన్నా నదులతోపాటు రాష్ట్రంలోని అన్ని నదులకు అనుసంధానం చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి జీఎన్ఎస్ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లకు, 1,500 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న చెరువులకు మళ్లిస్తామని చెప్పారు. తద్వారా రెండే ళ్లపాటుకరువు దరికిచేరదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మరో నాలుగైదు సంవత్సరాలు పడుతుందని, ఈలోగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి నీటిమట్టం 14మీటర్లు ఉంటేనే ఎత్తిపోతలకు నీటిని మళ్లిస్తామని, 14 మీటర్లకు తగ్గితే కాలువల ద్వారా రైతులకు నీటిని అందిస్తామన్నారు. గాలేరు-నగిరి, సోమశిల-స్వర్ణముఖి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు. కాగా తెట్టు అనే గ్రామం పులగూరవాండ్లపల్లె హంద్రీ-నీవా ప్రాజెక్టు పుంగనూరు బ్రాంచి కెనాల్ గట్టుమీద బస్సులో నిద్రించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అర్ధరాత్రి వరకు ఇంకా అక్కడికి చేరుకోలేదు. శిశు మరణాలను తగ్గించండి తిరుపతి: శిశు, గర్భిణుల మరణాలు తగ్గించడాన్ని సవాలుగా తీసుకుని పని చేయాలని ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలోని ఆడిటోరియంలో పెంటావాలెంట్ టీకాను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.