రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న నాన్–ఇంటర్ లాక్ పనుల కారణంగా డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
రద్దయిన రైళ్లు: తెనాలి–విజయవాడ (7630), విజయవాడ–గూడూరు (7500), నర్సాపూర్–విజయవాడ (17270), విజయవాడ–బిట్రగుంట (7978) ఆగస్టు 3 నుంచి 10 వరకు, నర్సాపూర్–గుంటూరు (7281), హుబ్లి–విజయవాడ (17329) ఆగస్టు 4 నుంచి 10 వరకు, గూడూరు–విజయవాడ (7458), విజయవాడ–మాచర్ల (7781), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఆగస్టు 4 నుంచి 11 వరకు, విజయవాడ–భద్రచలం రోడ్డు (7979), భద్రచలం రోడ్డు–విజయవాడ (7278), విజయవాడ–తెనాలి (7295), తెనాలి–విజయవాడ (7575), విజయవాడ–గుంటూరు (7464/7465), విజయవాడ–డోర్నకల్ (7756/7755), విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202), విశాఖపట్నం–కడప (17488), విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712) ఆగస్టు 5 నుంచి 10 వరకు, గుంటూరు–రేపల్లె (7784/7785), గుంటూరు–విజయవాడ (7976), విజయవాడ–నర్సాపూర్ (17269), విజయవాడ–హుబ్లి (17330) ఆగస్టు 5 నుంచి 11 వరకు, మాచర్ల–విజయవాడ (7782), విజయవాడ–తెనాలి (7629), బిట్రగుంట–విజయవాడ (7977), విజయవాడ–నర్సాపూర్ (7862) ఆగస్టు 8 నుంచి 12 వరకు, కడప–విశాఖపట్నం (17487) ఆగస్టు 6 నుంచి 11 వరకు, చెన్నై సెంట్రల్–విజయవాడ (12077/12078) ఆగస్టు 5, 7, 8, 9, 10 తేదీలలో పూర్తిగా రద్దు చేశారు.
దారి మళ్లింపు: సికింద్రాబాద్–విశాఖపట్నం (12740) ఆగస్టు 2 నుంచి 10 వరకు, గాం«దీనగర్–విశాఖపట్నం (20804) ఆగస్టు 4న, నిజాముద్దిన్–విశాఖపట్నం (12804) ఆగస్టు 4, 7వ తేదీలలో, ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019) ఆగస్టు 2 నుంచి 10 వరకు, యశ్వంత్‌పూర్–టాటా (18112) ఆగస్టు 4న, హైదరాబాద్–షాలీమార్ (18046) ఆగస్టు 3 నుంచి 11 వరకు, షిర్డీ సాయినగర్–కాకినాడ పోర్టు (17205) ఆగస్టు 4, 6, 8 తేదీలలో, షిర్డీ సాయినగర్–విశాఖపట్నం (18504) ఆగస్టు 2, 9 తేదీలలో, న్యూ ఢిల్లీ–విశాఖపట్నం (20806) ఆగస్టు 2 నుంచి 10 వరకు, హైదరాబాద్–విశాఖపట్నం (12728) ఆగస్టు 3 నుంచి 11 వరకు, విశాఖపట్నం–సికింద్రాబాద్ (12739) ఆగస్టు 2 నుంచి 10 వరకు, విశాఖపట్నం–న్యూఢిల్లీ (20805) ఆగస్టు 2 నుంచి 10 వరకు, భువనేశ్వర్–ఛత్రపతి శివాజీ టెర్మినస్ (11020) ఆగస్టు 2 నుంచి 10 వరకు, కాకినాడ పోర్టు–íÙర్డీ సాయినగర్ (17206) ఆగస్టు 3, 5, 7, 10 తేదీలలో, షాలీమార్–హైదరాబాద్ (18045) ఆగస్టు 2 నుంచి 10 వరకు, విశాఖపట్నం–నిజాముద్దిన్ (12803) ఆగస్టు 5, 9 తేదీలలో, విశాఖపట్నం–సాయినగర్ షిర్డీ (18503), టాటా–యశ్వంత్‌పూర్ (18111) ఆగస్టు 8న, విశాఖపట్నం–హైదరాబాద్ (12727) ఆగస్టు 3, 11 తేదీలలో, విశాఖపట్నం–గాందీనగర్ (20803) ఆగస్టు 8న, మచిలీపట్నం–íÙర్డీ సాయినగర్ (17208), నర్సాపూర్–నాగర్‌సోల్ (12787) ఆగస్టు 3, 5, 6, 7, 8, 10 తేదీలలో, మచిలీపట్నం–బీదర్ (12749) ఆగస్టు 3 నుంచి 11 వరకు, లోకమన్య తిలక్ టెర్మినస్–విశాఖపట్నం (18520) ఆగస్టు 2 నుంచి 10 వరకు, షిర్డీ సాయినగర్–మచిలీపట్నం (17207) ఆగస్టు 7న, నాగర్‌సోల్–నర్సాపూర్ (12788) ఆగస్టు 2, 4, 6, 7, 8, 9 తేదీలలో, బీదర్–మచిలీపట్నం (12750) ఆగస్టు 8 నుంచి 10 వరకు వయా రాయనపాడు, గుణదల, విజయవాడ బైపాస్ మీదుగా దారి మళ్లించి నడపనున్నారు.
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
Published Thu, Jul 4 2024 6:06 AM | Last Updated on Thu, Jul 4 2024 6:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment