Many Trains Are Cancelled And Diverted Between Manubolu-Guduru Route, Check Trains Details Inside - Sakshi
Sakshi News home page

Today Trains Cancel Updates: ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Published Thu, Aug 10 2023 4:36 AM | Last Updated on Thu, Aug 10 2023 8:01 AM

Many trains are canceled and diverted - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్‌లోని మనుబోలు–గూడూరు సెక్షన్‌లో నాన్‌–ఇంటర్‌లాక్‌ పనుల కారణంగా ఈ నెల 10 నుంచి 15 వరకు ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగా, పాక్షికంగా రద్దు చేసి మరి కొన్నింటిని దారి మళ్లించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. 

రద్దయిన రైళ్లు: విజయవాడ–గూడూరు (07500/ 07458), సూళ్లురుపేట–నెల్లూరు (06745/06746, 06747/06748, 06750/06751), గూడూరు–రేణిగుంట (07667), మచిలీపట్నం–ధర్మవరం (07095/­07096), బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/17238), విజయవాడ–గూడూరు (17260), చెన్నై సెంట్రల్‌–విజయవాడ (12077/12078), విజయవాడ–చెన్నై సెంట్రల్‌ (12711/12712), ధర్మవరం–నర్సాపూర్‌ (17248), తిరుపతి–కాకినాడ టౌన్‌(17249/17250) రైళ్లను ఈ నెల 10 నుంచి 15 వరకు, బెంగళూరు–హటియా (18637) ఈ నెల 12న, హటియా–ఒంగోలు (18238) ఈ నెల 15న, గయా–చెన్నై ఎగ్మూర్‌ (12389/12390), ఈ నెల 13,15న, తిరుపతి–విశాఖ (22708/22707) ఈ నెల 9, 10, 11, 12 తేదీలలోను, చెన్నై సెంట్రల్‌–విశాఖ (22869/­22870) ఈ నెల 14, 15 తేదీల్లో పూర్తిగా రద్దు చేశారు.  

పాక్షికంగా రద్దు: సికింద్రాబాద్‌–గూడూరు (12710/12709) రైలును ఈ నెల 9 నుంచి 14 వరకు వేదాయపాలెం–గూడూరు మధ్య, విజయవాడ–గూడూరు (12744/12743) రైలును ఈ నెల 11 నుంచి 15 వరకు నెల్లూరు–గూడూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు.  

దారి మళ్ళింపు: కాచీగూడ–మధురై (07191) ఈ నెల 14న డోన్, గుత్తి, రేణిగుంట మీదుగా, యర్నాకులం–హౌరా (22878) ఈ నెల 14న, మధురై–నిజాముద్దిన్‌ (12651) ఈ నెల 15న, బెంగళూరు–గౌహతి ఈ నెల 10, 11 తేదీల్లో కాటా్పడి, రేణిగుంట, నంద్యాల, గుంటూరు మీదుగా దారి మళ్ళించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement