Cancellation of trains
-
వర్షాలతో నేడు, రేపు పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఎడతెరిపి లేని వర్షాల కారణంగా విజయవాడ డివిజన్లోని పలు సెక్షన్లలో ట్రాక్‌లపై వర్షం నీరు చేరడంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా శనివారం, ఆదివారం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–గూడూరు (07500/07458), విజయవాడ–కాకినాడ పోర్టు (17257), తెనాలి–రేపల్లె (07874/07875), గుడివాడ–మచిలీపట్నం (07868/07869), భీమవరం జంక్షన్–నిడదవోలు (07885/07886), నర్సాపూర్–గుంటూరు (07281), గుంటూరు–రేపల్లె (07784/07785), గుంటూరు–విజయవాడ (07976), విజయవాడ–నర్సాపూర్ (17269), ఒంగోలు–విజయవాడ (07576), విజయవాడ–మచిలీపట్నం (07898/07899), విజయవాడ–ఒంగోలు (07461), నర్సాపూర్–గుంటూరు (07281), గుంటూరు–రేపల్లె (07784/07785), గుంటూరు–విజయవాడ (07976), విజయవాడ–నర్సాపూర్ (17269) రద్దు చేశారు. అదే విధంగా గుంటూరు–రేపల్లె (07784/07785), గుంటూరు–విజయవాడ (07976), విజయవాడ–నర్సాపూర్ (17269) రైళ్లను సోమవారం కూడ రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైల్వేశాఖ అనేక రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతోంది. దీంతో ప్రయాణికులకు ఆయా రైళ్ల సమాచారం తెలియజేసేందుకు అధికారులు ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.హెల్ప్‌లైన్ నంబర్లు విజయవాడ–7569305697, రాజమండ్రి–08832420541 తెనాలి–08644227600, తుని–7815909479 నెల్లూరు–7815909469, గూడూరు–08624250795 ఒంగోలు–7815909489, గుడివాడ–7815909462 భీమవరం టౌన్–7815909402 -
పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగాను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. పూర్తిగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219/17220), విజయవాడ–విశాఖపట్నం (22702/22701), గుంటూరు–విశాఖపట్నం (17239/17240), బిట్రగుంట–విజయవాడ (07977/07978), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07576/07500), విజయవాడ–గూడూరు (12744/12743) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), విజయవాడ–భీమవరం టౌన్ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు రామవరప్పాడు–విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి. దారి మళ్లించిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 25 వరకు యర్నాకుళం–పాట్నా (22643), ఈ నెల 23 నుంచి 30 వరకు భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756), ఈ నెల 20, 22, 27, 29 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఈ నెల 18, 20, 22, 23, 25, 27, 29, 30 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019), ఈ నెల 18 నుంచి 31 వరకు ధన్‌బాద్–అలెప్పి (13351), ఈ నెల 23, 30 తేదీల్లో హతియా–బెంగళూరు (18637), ఈ నెల 19, 24, 26, 31 తేదీల్లో హతియా–బెంగళూరు (12835), ఈ నెల 22, 29 తేదీల్లో టాటా–బెంగళూరు (12889), ఈ నెల 21, 28 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111), ఈ నెల 18, 25 తేదీల్లో హతియా–యర్నాకులం (22837) రైళ్లు రెండు మార్గాల్లో వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్
మిచాంగ్ తుపాను కారణంగా భారీగా రైళ్లను రద్దు చేసిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఈ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్: 040–2778666, 040–27801112 నాంపల్లి: 9676904334 కాచిగూడ: 040–27784453 సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. దక్షిణమధ్య రైల్వే నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 150 రైళ్లను అధికారులు ఇప్పటికే రద్దు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నై వెళ్లే రైళ్లకు కూడా బ్రేక్ పడింది. కాచిగూడ–చెంగల్పట్టు, హైదరాబాద్–తాంబరం, సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. అటు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రెండు, మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగనుందని అధికారులు తెలిపారు. పలుచోట్ల ఇప్పటికే వరదలు మొదలు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురిసి, వరదలు పారుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ ప్రాంతాల్లో రైల్వేలైన్ల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వరదలు, నీటి ప్రవాహం కారణంగా పట్టాలపై నీరు నిలిచి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటికే పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టడంతోపాటు ఎప్పటికప్పుడు వరద నీటిని తొలగించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రయాణాలను వాయిదా వేసుకోండి హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో కొన్నింటిని ప్రధాన స్టేషన్లకే పరిమితం చేశారు. అత్యవసరమైతే తప్ప తుపాను ప్రభావిత ప్రాంతాల దిశగా ప్రయాణాలు వద్దని, ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నవారు వాయిదా వేసుకోవడం మంచిదని ప్రయాణికులకు సూచిస్తున్నారు. తుఫాన్ కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకొనే వారికి పూర్తిస్థాయిలో చార్జీలను తిరిగి చెల్లించనున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలోని బుకింగ్ కేంద్రాల్లో టికెట్లను రద్దు చేసుకోవచ్చు. అయ్యప్ప భక్తులకు ఇబ్బందులు తుపాను కారణంగా హైదరాబాద్ నుంచి కొల్లాం వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి శబరిమలకు రైళ్లు తక్కువగా ఉన్నాయని, రద్దు కారణంగా వేరే రైళ్లలో టికెట్లు దొరికే పరిస్థితి లేదని చెప్తున్నారు. వాహనాల్లో అంతదూరం ప్రయాణించడం ఇబ్బందికరమేనని అంటున్నారు. రైల్ నిలయం నుంచి పర్యవేక్షణ తుపాను ప్రభావం ఉండే ప్రాంతాలకు వెళ్లే రైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ రైళ్లను నడపాలని పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు రైల్‌నిలయం నుంచి తుపాను పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వారు డివిజనల్ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. తుపాను పరిణామాలను ఎదుర్కొనేందుకు అవసరమైన సామాగ్రిని, యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. వంతెనలు, వరద పోటెత్తే ప్రదేశాల్లో వాచ్మన్లను ఏర్పాటు చేశారు. పట్టాలపై నిలిచే వరదనీటిని తొలగించేందుకు డీజిల్ పంపులను సిద్ధం చేశారు. -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతోన్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు కాకినాడ పోర్టు–విశాఖ(17267/17268), రాజమండ్రి–విశాఖ (07466/07467), మచిలీపట్నం–విశాఖ (17220/17219), గుంటూరు–రాయగడ (17243/17244), గుంటూరు–విశాఖ (17239/17240), బిట్రగుంట–విజయవాడ (07977/07978), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/07576), విజయవాడ–గూడూరు (07500/07458) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దైనవి: ఈ నెల 20 నుంచి 26 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896), విజయవాడ–మచిలీపట్నం (07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లను విజయవాడ–రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు: ఈ నెల 25న భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756), ఈ నెల 22, 24 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఈ నెల 22, 24, 25 తేదీల్లో ఛత్రపతి శివాజీ టర్మి నల్–భువనేశ్వర్ (11019), ఈ నెల 21 నుంచి 26 వరకు ధన్‌బాద్–అలిప్పి (13351), ఈ నెల 25న హతియా–బెంగళూరు (18637) 26న హతియా–బెంగళూరు (12835), 24న టాటా–బెంగళూరు (12889), ఈ నెల 23న టాటా–యశ్వంత్‌పూర్ (18111) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం జంక్షన్, నిడదవోలు స్టేషన్ల మీదుగా దారి మళ్లించారు. శబరిమలకు ప్రత్యేక రైళ్లు: శబరిమలకు ఈ నెల 26, డిసెంబర్ 3న సికింద్రాబాద్–కొల్లం (07129), ఈ నెల 28, డిసెంబర్ 5న కొల్లం–సికింద్రాబాద్ (07130), ఈ నెల 26, డిసెంబర్ 3న నర్సాపూర్–కొట్టాయం (07119), ఈ నెల 27, డిసెంబర్ 4న కొట్టాయం–నర్సాపూర్ (07120), ఈ నెల 22, 29, డిసెంబర్ 6న కాచిగూడ–కొల్లం (07123), ఈ నెల 24, డిసెంబర్ 1, 8 తేదీల్లో కొల్లం–కాచిగూడ (07124), ఈ నెల 23, 30న కాకినాడ టౌన్–కొట్టాయం (07125), ఈ నెల 25, డిసెంబర్ 2న కొట్టాయం–కాకినాడ టౌన్ (07126), ఈ నెల 24, డిసెంబర్ 1న సికింద్రాబాద్–కొల్లం (07127), ఈ నెల 25, డిసెంబర్ 2న కొల్లం–సికింద్రాబాద్ (07128) రైళ్లను నడపనున్నారు. -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో జరుగుతోన్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగాను రద్దు చేసి కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుపక్కర్ గురువారం తెలిపారు. రద్దైన రైళ్లు: ఈ నెల 13–19 వరకు కాకినాడ టౌన్–విశాఖ (17267/17268), గుంటూరు–రాయగడ (17243), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/07576), విజయవాడ–గూడూరు (07500/07458), బిట్రగుంట–విజయవాడ (07977/07978), రాజమండ్రి–విశాఖ (07466/07467), మచిలీపట్నం–విశాఖ (17219),గుంటూరు–విశాఖ (17239), 14–20 వరకు విశాఖ–మచిలీపట్నం (17220), రాయగడ–గుంటూరు (17244), 13, 14, 15, 17, 18 తేదీల్లో విజయవాడ–విశాఖ (22702/22701), విశాఖ–గుంటూరు (17240), ఈ నెల 13–17 వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238). పాక్షికంగా రద్దైన రైళ్లు: ఈ నెల 13–19 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), విజయవాడ–భీమవరం (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు విజయవాడ–రాయనపాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లింపు: ఈ నెల 13న యర్నాకులం–పాట్నా (22643), 18న భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756),15న బెంగళూరు–గౌహతి (12509), 13, 15, 17, 18 తేదీలలో ఛత్రపతి శివాజీ టర్మినల్–భువనేశ్వర్ (11019) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
ఎక్కడి రైళ్లు అక్కడే
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)/విశాఖపట్నం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంకటాపల్లి–ఆలమండ మధ్య ఆదివారం రాత్రి విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక పాసింజర్ రైలును విశాఖ–రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదం కారణంగా వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు మాత్రం యథాతథంగా నడుస్తున్నాయి. ప్రమాద వివరాలను తెలియజేసేందుకు ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ నంబర్ల 0891–2746330/0891–2744619ను ఏర్పాటు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్, అధికారులు, సిబ్బంది ప్రత్యేక రైలులో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 120 టన్నుల, 140 టన్నుల సామర్థ్యం గల క్రేన్లతో జీఆర్పీ, రైల్వే అధికారులు, సిబ్బందితో మరో రెండు ప్రత్యేక రైళ్లు బయల్దేరాయి. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు ఈ ఘటనతో విజయనగరం వైపు వెళ్లాల్సిన, విజయనగరం వైపు నుంచి రావలసిన పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ రైళ్లలో కొన్నింటిని దారి మళ్లించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో చెన్నై సెంట్రల్–హౌరా (12842) కోరమాండల్, యశ్వంత్‌పూర్–పూరీ (22842) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించే వరకు నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో నిలిపివేశారు. రద్దయిన రైళ్లు సోమవారం రాయ్‌పూర్–విశాఖపట్నం–రాయ్‌పూర్ (08527/08528) పాసింజర్ స్పెషల్ రద్దు చేశారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–కోర్బా ఎక్స్‌ప్రెస్ కూడా రద్దయింది. దారి మళ్లించిన రైళ్లు ఈ దిగువ రైళ్లను ఆదివారం రెగ్యులర్ మార్గం విశాఖపట్నం–విజయవాడ మీదుగా కాకుండా టిట్లాఘడ్–రాయ్‌పూర్–నాగ్‌పూర్–బల్హార్షా–విజయవాడ మీదుగా దారి మళ్లించారు. 28వ తేదీన బారునిలో బయల్దేరిన బారుని–కోయంబత్తూర్ (03357) స్పెషల్ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన టాటాలో బయల్దేరిన టాటా–ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 29వ తేదీన భువనేశ్వర్‌లో బయల్దేరిన భువనేశ్వర్–ముంబయ్ (11020) కోణార్క్ ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 29వ తేదీన హౌరాలో బయల్దేరిన హౌరా–బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. గమ్యం కుదించిన రైళ్లు ఇవీ ► 29న సంబల్పూర్లో బయల్దేరిన సంబల్పూర్–నాందేడ్(20809)ఎక్స్‌ప్రెస్ విజయనగరం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి సంబల్పూర్ చేరుకుంది. ► నెల 29న పూరీలో బయల్దేరిన పూరీ–తిరుపతి (17479) ఎక్స్‌ప్రెస్ బలుగాం వరకు నడిచింది. అక్కడ నుండి తిరిగి పూరీ చేరుకుంది. ► 29న విశాఖపట్నంలో బయల్దేరిన విశాఖపట్నం–విజయనగరం (07468) పెందుర్తి నుండి విశాఖకు చేరుకుంది. ► 28వ తేదీన ముంబైలో బయల్దేరిన ముంబై–భువనేశ్వర్ (11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం వరకు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు విశాఖపట్నం నుండి భువనేశ్వర్–ముంబై (11020) రైలుగా ముంబై బయల్దేరుతుంది. ఆర్టీసీ అప్రమత్తం రైళ్ల ప్రమాద ఘటనతో ఆర్టీసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి విజయనగరం నుంచి 10, సింహాచలం నుంచి 5, గాజువాక నుంచి 3, ఎస్.కోట నుంచి 2 బస్సులను పంపించారు. క్షతగాత్రులను ఈ బస్సుల్లో వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరో 5 బస్సులను విజయనగరంలో సిద్ధం చేశారు. పార్వతీపురం, పలాస వైపు వెళ్లే ప్రయాణికులకు, ప్రమాదం వల్ల వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో సరిపడినన్ని బస్సులను అందుబాటులో ఉంచామని ఆర్టీసీ జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్లో కూడా బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు. విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో ఇద్దరు అధికారులను నియమించామని, ఘటనా స్థలానికి మరికొందరు అధికారులను పంపించామని తెలిపారు. -
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): సికింద్రాబాద్ డివిజన్లోని మాకుడి–సీర్పూర్ టౌన్ సెక్షన్ మధ్యలో నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయంతో పాటు, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ధనాపూర్–సికింద్రాబాద్ (03225), 22న హైదరాబాద్–గోరఖ్‌పూర్ (02575), 23న హైదరాబాద్–రక్షౌ ల్ (07051), 24న సికింద్రాబాద్–ధనాపూర్ (03226), గోరఖ్‌పూర్–హైదరాబాద్ (02576), 26న రక్షౌ ల్–హైదరాబాద్ (07052) రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును పెద్దపల్లి, నిజామాబాద్, పూర్ణా, అకోలా మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా ఈ నెల 22 నుంచి 25 వరకు యశ్వంత్‌పూర్– హజరత్ నిజాముద్దిన్ (12649) రైలును, అలాగే ఈ నెల 18, 19, 21, 23, 24, 25 తేదీల్లో హజరత్ నిజాముద్దిన్–యశ్వంత్‌పూర్ (12650) రైలును బళ్లారి, గుంతకల్లు, వాడి, మన్మడ్, ఖాండ్వా, ఇటార్సీ స్టేషన్ల మీదుగా దారి మళ్లించారు. -
సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లోని మనుబోలు–గూడూరు సెక్షన్లో నాన్–ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఈ నెల 10 నుంచి 15 వరకు ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగా, పాక్షికంగా రద్దు చేసి మరి కొన్నింటిని దారి మళ్లించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రద్దయిన రైళ్లు: విజయవాడ–గూడూరు (07500/ 07458), సూళ్లురుపేట–నెల్లూరు (06745/06746, 06747/06748, 06750/06751), గూడూరు–రేణిగుంట (07667), మచిలీపట్నం–ధర్మవరం (07095/07096), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–గూడూరు (17260), చెన్నై సెంట్రల్–విజయవాడ (12077/12078), విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712), ధర్మవరం–నర్సాపూర్ (17248), తిరుపతి–కాకినాడ టౌన్(17249/17250) రైళ్లను ఈ నెల 10 నుంచి 15 వరకు, బెంగళూరు–హటియా (18637) ఈ నెల 12న, హటియా–ఒంగోలు (18238) ఈ నెల 15న, గయా–చెన్నై ఎగ్మూర్ (12389/12390), ఈ నెల 13,15న, తిరుపతి–విశాఖ (22708/22707) ఈ నెల 9, 10, 11, 12 తేదీలలోను, చెన్నై సెంట్రల్–విశాఖ (22869/22870) ఈ నెల 14, 15 తేదీల్లో పూర్తిగా రద్దు చేశారు. పాక్షికంగా రద్దు: సికింద్రాబాద్–గూడూరు (12710/12709) రైలును ఈ నెల 9 నుంచి 14 వరకు వేదాయపాలెం–గూడూరు మధ్య, విజయవాడ–గూడూరు (12744/12743) రైలును ఈ నెల 11 నుంచి 15 వరకు నెల్లూరు–గూడూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్ళింపు: కాచీగూడ–మధురై (07191) ఈ నెల 14న డోన్, గుత్తి, రేణిగుంట మీదుగా, యర్నాకులం–హౌరా (22878) ఈ నెల 14న, మధురై–నిజాముద్దిన్ (12651) ఈ నెల 15న, బెంగళూరు–గౌహతి ఈ నెల 10, 11 తేదీల్లో కాటా్పడి, రేణిగుంట, నంద్యాల, గుంటూరు మీదుగా దారి మళ్ళించారు. -
రైలు పట్టాలపై జారిపడిన కొండ చరియలు
అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని కొత్తవలస–కిరండూల్ రైల్వేలైన్‌లో బొర్రా, కరకవలస మధ్య (82వ కిలోమీటర్ వద్ద) కొండ చరియలు జారిపడటంతో ఓహెచ్సీ విద్యుత్ స్తంభం, రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. కేకే లైన్లో రెండోలైన్‌కు సంబంధించిన పనులు జరుగుతుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 82వ కిలోమీటర్ వద్ద ఒక్కసారిగా కొండచరియలు జారిపడ్డాయి. దీంతో ఓహెచ్సీ విద్యుత్‌లైన్ స్తంభం విరిగిపడింది. పట్టాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సాంకేతిక సమస్య కారణంగా విశాఖపట్నం వెళుతున్న కిరండూల్ పాసింజర్ రైలును కొంతసేపు బొర్రా రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సాంకేతిక సమస్య పరిష్కరించిన అనంతరం కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం బయలుదేరింది. ఈ కారణంగా సోమవారం రాత్రి విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు. మంగళవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్, అదే రోజు విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే పాసింజర్, బుధవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే పాసింజర్ రైళ్ల రద్దు చేశారు. సోమవారం రాత్రి కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు కోరాపుట్, దమంజోడి, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు. -
నేడు, రేపు విశాఖ మార్గంలో పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లోని తాడి–అనకాపల్లి రైల్వేస్టేషన్ మధ్యలో గూడ్స్‌రైలు పట్టలు తప్పడం ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నింటిని నేడు (16న), కొన్నింటిని నేడు, రేపు (16, 17 తేదీల్లో) రద్దుచేసినట్లు ప్రకటించారు. నేడు రద్దయిన రైళ్లు విజయవాడ–విశాఖపట్న(12718/12717), విశాఖపట్నం–కడప (17488), హైదరాబాద్–విశాఖపట్నం (12728), విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (12861), సికింద్రాబాద్–విశాఖపట్నం (12740), విశాఖపట్నం–తిరుపతి (22708), గుంటూరు–రాయగడ (17243). నేడు, రేపు రద్దయిన రైళ్లు కడప–విశాఖపట్నం (17487), విశాఖపట్నం–హైదరాబాద్ (12727), మహబూబ్‌నగర్–విశాఖపట్నం (12862), విశాఖపట్నం–సికింద్రాబాద్ (12739), రాయగడ– గుంటూరు (17244). -
9, 11న పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఖరగ్‌పూర్ డివిజన్లోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద జరుగుతోన్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. హౌరా–మైసూర్ (22817), షాలీమార్–హైదరాబాద్(18045/18046), సత్రగచ్చి–చెన్నై సెంట్రల్ (22807), హౌరా–చెన్నై సెంట్రల్ (12839), ఆగర్తలా–సికింద్రాబాద్ (07029), సిల్ఘాట్ టౌన్–తంబరం (15630), చెన్నై సెంట్రల్–షాలీమార్ (12842), పురులియా–విల్లుపురం (22605) రైళ్లను ఈ నెల 9న రద్దు చేశారు. మైసూర్–హౌరా (22818) రైలును ఈ నెల 11న రద్దు చేశారు. -
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ఖాజీపేట–కొండపల్లి సెక్షన్ మధ్యలోని చింతల్‌పల్లి–నెక్కొండ స్టేషన్ మధ్యలో జరుగుతున్న మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు పూర్తిగానూ, మరికొన్ని పాక్షికంగానూ రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్లు: ఖాజిపేట–డోర్నకల్లు (07753/07754), విజయవాడ–డోర్నకల్లు (07755/07756), విజయవాడ–గుంటూరు (07464/07465), భద్రాచలంరోడ్డు–సికింద్రాబాద్ (17660/17659), విజయవాడ–సికింద్రాబాద్(12713/12714) ఎక్స్‌ప్రెస్ రైళ్లును ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు పూర్తిగా రద్దు చేశారు. అదే విధంగా ఖాజిపేట–తిరుపతి (17091/17092) రైళ్లు ఈ నెల 23, 30, జూన్ 6 తేదీలలో, మచిలీపట్నం–సికింద్రాబాద్ (07185/07186) రైళ్లు ఈ నెల 21, 28, జూన్ 4 తేదీలలో రద్దు చేశారు. పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు: సిర్పూర్ టౌన్–భద్రాచలం (17034) ఈ నెల 20 నుంచి జూన్ 6 వరకు వరంగల్లు–భద్రాచలం మధ్య, భద్రాచలం–సిర్పూర్ (17033) ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు భద్రాచలం–వరంగల్లు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లింపు: విశాఖపట్నం–ముంబై ఎల్టీటీ (18519) ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది. షాలిమార్–సికింద్రాబాద్ (22849) ఈ నెల 24, 28, జూన్ 4 తేదీలలో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. యశ్వంత్‌పూర్–టాటానగర్ (18112) ఈ నెల 21, 28, జూన్ 4 తేదీలలో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. హైదరాబాద్–షాలిమార్ (18046) ఈ నెల 28, జూన్ 7 తేదీలలో వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది. -
పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆదివారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇక్కడి రైల్వే అధికారులు శనివారం ప్రకటించారు. రద్దు చేసిన రైళ్లలో విజయవాడ–గుంటూరు(17783), గుంటూరు–మాచర్ల (07779), మాచర్ల–నడికుడి (07580/07579), మాచర్ల–విజయవాడ (07782), డోర్నకల్లు–విజయవాడ (07755), భద్రాచలం రోడ్డు–విజయవాడ (07278/07979) ఉన్నాయి. -
Agnipath Scheme: ఆరని అగ్గి
న్యూఢిల్లీ: సైన్యంలో నియామకాల కోసం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశమంతటా నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, హరియాణా, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో శనివారం సైతం ఆందోళనలు కొనసాగాయి. పలుచోట్ల హింసాకాండ చోటుచేసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో యువత రోడ్లు, రైలు పట్టాలపై బైఠాయించారు. పుషప్‌లు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 369 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నరకం చూశారు. బిహార్‌లో రైల్వేస్టేషన్‌కు నిప్పు బిహార్‌లో యువకులు బంద్‌కు పిలుపునిచ్చారు. తారేగానా రైల్వే స్టేషన్‌కు నిప్పుపెట్టారు. రైల్వే పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. దానాపూర్‌లో అంబులెన్స్‌పై దాడికి దిగారు. అందులోని ముగ్గురిని తీవ్రంగా కొట్టారు. రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జెహానాబాద్ జిల్లాలో ఔట్‌పోస్టుపై దాడిలో పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నిలిపివేత కొనసాగుతోంది. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిచ్చాయి. కర్ణాటకలోని ధార్వాడలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బెంగాల్లో రైలు పట్టాల దిగ్బంధం పశ్చిమ బెంగాల్లో శనివారం కూడా నిరసనకారులు పట్టాలపై బైఠాయించడంతో ఉత్తర 24 పరగణాల జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అగ్నిపథ్ వద్దంటూ యువకులు పట్టాలపైనే పుషప్స్ చేశారు. తమ భవిష్యత్తుతో ఆటలాడొద్దంటూ నినదించారు. ఆర్మీలో చేరేందుకు కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. కేరళలో భారీ నిరసన ర్యాలీలు కేరళలో నిరసనలు హోరెత్తాయి. ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ పూర్తి చేసుకొని ఫలితాల కోసం చూస్తున్న యువకులు తిరువనంతపురం, కోజికోడ్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అగ్నిపథ్‌తో తమ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పుషప్స్ చేశారు. పథనంథిట్టలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసులు గాయపడ్డారు. యూపీలో 400 మందిపై కేసులు యూపీలో మీరట్, జాన్పూర్, కన్నౌజ్‌లో యువకులు నిరసన కొనసాగించారు. బస్సులు తగలబెట్టారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బైఠాయించారు. బలియా, అలీగఢ్, గౌతమ్‌బుద్ధ నగర్, వారణాసి తదితర 17 ప్రాంతాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 400 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు ప్రకటించారు. అరెస్టు చేసిన 109 మందిని కోర్టులో హాజరు పరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. లూథియానా రైల్వేస్టేషన్లో బీభత్సం హరియాణాలోని మహేందర్‌గఢ్‌లో ఆందోళనకారులు ఓ వాహనాన్ని తగలబెట్టారు. సోనిపట్, కైతాల్, ఫతేబాద్, జింద్‌లో భారీ నిరసనలకు దిగారు. రోహ్తక్–పానిపట్ హైవేను దిగ్బంధించారు. పంజాబ్‌లోని లూథియానా రైల్వే స్టేషన్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. కిటికీల అద్దాలను, టికెట్ కౌంటర్లను ధ్వంసం చేశారు. రాజస్తాన్‌లోని జైపూర్, జోద్పూర్లోనూ వందలాదిగా రోడ్లపైకి వచ్చారు. అల్వార్‌లో జైపూర్–ఢిల్లీ హైవేను దిగ్బంధించారు. ఓ బస్సును ధ్వంసం చేశారు. చిదావాలో పట్టాలపై బైఠాయించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. -
రద్దయిన రైళ్ల పునరుద్ధరణ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–విశాఖపట్నం సెక్షన్ల మధ్య ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నస్రత్ మండ్రూప్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలికంగా రద్దు చేసిన విశాఖపట్నం–విజయవాడ (02717/02718), విశాఖపట్నం–గుంటూరు (07240/07239), విశాఖప్నటం–లింగంపల్లి (02831/02832), విశాఖపట్నం–కడప (07488/07487) రైళ్లను యథావిధిగా నడపనున్నట్టు తెలిపారు. -
ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కొవిడ్ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే.. విశాఖపట్నం–కాచిగూడ (08561) జూన్ 1 నుంచి 10 వరకు కాచిగూడ–విశాఖపట్నం (08562) జూన్ 2 నుంచి 11 వరకు భువనేశ్వర్–పుణే (02882) జూన్ 1 నుంచి 8 వరకు పుణే–భువనేశ్వర్ (02881) జూన్ 3 నుంచి 10 వరకు కడప–విశాఖపట్నం (07488) జూన్ 1 నుంచి 10 వరకు విశాఖపట్నం–కడప (07487) జూన్ 2 నుంచి 11 వరకు విశాఖపట్నం–లింగంపల్లి (02831) జూన్ 1 నుంచి 10 వరకు లింగంపల్లి–విశాఖపట్నం (02832) జూన్ 2 నుంచి 11 వరకు -
‘యాస్’ తుపాన్ కారణంగా మరికొన్ని రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘యాస్’ తుపాన్ కారణంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ తాజాగా విజయవాడ మీదుగా నడిచే మరికొన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన రైళ్ల వివరాలివీ.. ఈ నెల 23వ తేదీ: భువనేశ్వర్–బెంగళూరు ప్రత్యేక రైలు (02845) 24వ తేదీ: హౌరా–వాస్కోడిగామ (08047/08048) 27వ తేదీ: తిరువనంతపురం–షాలీమార్ (02641), హౌరా–తిరుచిరాపల్లి (02663), చెన్నై సెంట్రల్–సంత్రగచ్చి (02808), యశ్వంత్‌పూర్–హౌరా (06597) 28వ తేదీ: పురులియా–విల్లుపురం (06169), హౌరా–మైసూర్ (08117) 29వ తేదీ: తాంబరం–జసిది జంక్షన్ (02375), కన్యాకుమారి–హౌరా (02666), హౌరా–యర్నాకులం (02877), 30వ తేదీ: హౌరా–పుదిచ్చేరి (02867) -
ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రెగ్యు లర్ రైళ్లతోపాటు సబర్బన్ రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. గతంలో ఈ రైళ్లను జూన్ 30 వరకు రద్దు చేసింది. తాజా నిర్ణయంతో ఆగస్టు 12 వరకు పొడిగించినట్లయింది. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. మే 12వ తేదీ నుంచి రాజధాని మార్గాల్లో నడిచే 15 జతల ప్రత్యేక రైళ్లు, జూన్ ఒకటో తేదీ నుంచి నడుపుతున్న 100 జతల రైళ్లు మాత్రం కొనసాగుతాయని వివరించింది. రద్దయిన రైళ్లకు జూలై 1 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు చేసిన టికెట్ రిజర్వేషన్లకు రద్దు చేసి, ఆ సొమ్మును వాపసు చేయనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. రైల్వే స్టాళ్లలో కరోనా నిత్యావసరాలు కరోనా నిత్యావసరాలైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు ఇకపై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండే స్టాళ్లలో లభించనున్నాయని రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ప్రస్తుతం అమ్ముతున్న పుస్తకాలు, తినుబండారాలు, మందులతో పాటు వీటిని అమ్మవచ్చని, అయితే అవి ఎమ్మార్పీ ధరను మించరాదని స్పష్టంచేశారు. ఇంటి నుంచి వచ్చేటపుడు మాస్కు, శానిటైజర్ మర్చిపోయేవారు వీటిలో కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. రైళ్లలో ఇచ్చే బెడ్‌రోల్ కిట్స్ ఇకపై ఉండవని, ప్రయాణికులు వాటిని స్టాల్స్‌లో కొనుక్కోవాలని తెలిపారు. -
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొగమంచు కారణంగా రద్దు కానున్న రైళ్ల వివరాలకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటించింది. వివిధ మార్గాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు ముందస్తు సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2016 జనవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకు రద్దు కానున్న రైళ్ల వివరాలను సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు సికింద్రాబాద్-పట్నా(12791/12792) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి జనవరి 10, 14, 17, 21, 24, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరి 4, 7, 11, 14, 18, 21, 28 తేదీల్లో రద్దవుతుంది. పట్నా నుంచి జనవరి 9, 12, 16, 19, 23, 26, 30, ఫిబ్రవరి 2, 6, 9, 13, 16, 20, 23, 27 తేదీల్లో రద్దు కానుంది. హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723/12724) హైదరాబాద్ నుంచి జనవరి 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో, ఢిల్లీ నుంచి జనవరి 14, 21, 28 తేదీల్లో, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రద్దు కానుంది. హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్(12721/12722) ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 18, 25, ఫిబ్రవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో జనవరి 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో రద్దు కానుంది. విశాఖపట్నం-కాజీపేట్ (12861/12862) ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 18, 25 ఫిబ్రవరి 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో జనవరి 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో రద్దు కానుంది. పలు రైళ్లకు అదనపు హాల్టింగ్ సికింద్రాబాద్-డానాపూర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 10వ తేదీ నుంచి బిహార్‌లోని ఆరా రైల్వేస్టేషన్లో 2 నిమిషాలపాటు హాల్టింగ్ కల్పించనున్నారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు సాయంత్రం 5.32 గంటలకు, తిరిగి వచ్చేటప్పుడు మధ్యాహ్నం 12.57 గంటలకు ఆరా స్టేషన్లో ఆగనుంది.