రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ఖాజీపేట–కొండపల్లి సెక్షన్ మధ్యలోని చింతల్‌పల్లి–నెక్కొండ స్టేషన్ మధ్యలో జరుగుతున్న మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు పూర్తిగానూ, మరికొన్ని పాక్షికంగానూ రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పూర్తిగా రద్దు చేసిన రైళ్లు: ఖాజిపేట–డోర్నకల్లు (07753/07754), విజయవాడ–డోర్నకల్లు (07755/07756), విజయవాడ–గుంటూరు (07464/07465), భద్రాచలంరోడ్డు–సికింద్రాబాద్ (17660/17659), విజయవాడ–సికింద్రాబాద్(12713/12714) ఎక్స్‌ప్రెస్ రైళ్లును ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు పూర్తిగా రద్దు చేశారు. అదే విధంగా ఖాజిపేట–తిరుపతి (17091/17092) రైళ్లు ఈ నెల 23, 30, జూన్ 6 తేదీలలో, మచిలీపట్నం–సికింద్రాబాద్ (07185/07186) రైళ్లు ఈ నెల 21, 28, జూన్ 4 తేదీలలో రద్దు చేశారు.
పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు: సిర్పూర్ టౌన్–భద్రాచలం (17034) ఈ నెల 20 నుంచి జూన్ 6 వరకు వరంగల్లు–భద్రాచలం మధ్య, భద్రాచలం–సిర్పూర్ (17033) ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు భద్రాచలం–వరంగల్లు మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
దారి మళ్లింపు: విశాఖపట్నం–ముంబై ఎల్టీటీ (18519) ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది. షాలిమార్–సికింద్రాబాద్ (22849) ఈ నెల 24, 28, జూన్ 4 తేదీలలో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. యశ్వంత్‌పూర్–టాటానగర్ (18112) ఈ నెల 21, 28, జూన్ 4 తేదీలలో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. హైదరాబాద్–షాలిమార్ (18046) ఈ నెల 28, జూన్ 7 తేదీలలో వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది.
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
Published Sat, May 20 2023 3:44 AM | Last Updated on Sat, May 20 2023 8:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment