announcement released
-
కజకిస్తాన్ విమాన ప్రమాదం..రష్యా కీలక ప్రకటన
మాస్కో:కజకిస్తాన్‌లో జరిగిన విమానప్రమాదానికి తామే కారణమని జరుగుతున్న ఊహాజనిత ప్రచారాన్ని రష్యా ఖండించింది. విమాన ప్రమాదంపై ఊహాగానాలు ఆపాలని కోరింది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై విచారణ పూర్తయ్యేదాకా ప్రమాదానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలడానికి రష్యా ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థే కారణమన అజర్బైజాన్ మీడియాలో కథనాలు ప్రచురితమవడంపై రష్యా స్పందించింది. బుధవారం(డిసెంబర్ 25) అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయలుదేరిన విమానాన్ని పొగమంచు కారణంగా తొలుత కజకిస్తాన్‌లోని అక్తౌకు మళ్లించారు. ఇక్కడే విమానం కుప్పకూలింది. ప్రమాదానికి ముందు విమానం కాస్పియన్ సముద్రంపై కాసేపు ఎగిరింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 67 మందిలో 29 మంది మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. -
‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని నాలుగు కార్పొరేషన్లుగా విభజించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. ఈ విషయమై శనివారం(అక్టోబర్ 5) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ మహా నగరంలో జనాభా కోటిన్నరకు చేరింది.జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా చేసిన తర్వాత నలుగురు మేయర్లు ఉంటారు.రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఈ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచేందుకు రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను నిర్మిస్తాం.అమెరికా తర్వాత అత్యధికంగా ఎంఎన్సీ కంపెనీల హెడ్‌క్వార్టర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్నాయి’అని కోమటిరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: హోం మంత్రి పదవి ఇవ్వాలని.. -
Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్
లక్నో: యూపీలోని యోగి సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దీపావళికి ముందుగానే ఉద్యోగులకు డీఏ, బోనస్‌లను అందించనున్నట్లు తెలిపింది.రాష్ట్రంలోని దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు దీపావళి బోనస్‌తో ప్రయోజనం పొందనున్నారు. అలాగే 15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు పరిధిలోకి రానున్నారు. డీఏను 50 శాతం నుంచి 54 శాతానికి పెంచనున్నారు. దీని ప్రయోజనాలు జూలై నెల నుంచి లెక్కించనున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బోనస్‌గా రూ.7 వేలు వరకూ అందుకున్నారు.మరోవైపు డియర్నెస్ అలవెన్స్ పెంచుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచుతున్నప్పుడల్లా రాష్ట్ర సర్కారు కూడా ఈ పెంపుదలని అమలు చేస్తూవస్తోంది. ఈ పెంపుపై త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇది కూడా చదవండి: డబ్బు కట్టలేదని కుట్లు విప్పేశారు -
మాస్ కా దాస్ జెట్ స్పీడ్.. ఫుల్ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. అంతే కాకుండా ఇటీవలే లైలా అనేపేరుతో కొత్త మూవీని కూడా ప్రకటించాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ మరో మూవీని అనౌన్స్ చేశాడు. దీంతో వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీగా మారిపోయాడు.తాజాగా వర్కింగ్ టైటిల్ వీఎస్13 పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు శ్రీధర్ గంట దర్శకత్వం వహిస్తున్నారు. కాంతార మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సంగీంతమందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. A High Voltage Action Film 🧨🧨🪓🪓Written and directed by #SreedharGanta@sudhakarcheruk5 @innamuri8888 @AJANEESHB @kishorkumardop @SLVCinemasOffl pic.twitter.com/lZbwFPlWH2— VishwakSen (@VishwakSenActor) August 6, 2024 -
2033కల్లా రష్యా సొంత స్పేస్ స్టేషన్
మాస్కో: ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్(ఐఎస్ఎస్) నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమైన రష్యా 2033నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోనుంది. ఈ విషయాన్ని రష్యాస్టేట్స్పేస్కార్పొరేషన్ (రోస్కోస్మోస్) మంగళవారం(జులై 23)ప్రకటించింది. రష్యా ఆర్బిటల్ స్టేషన్(రోస్) ఏర్పాటు షెడ్యూల్‌ను సంస్థ చీఫ్ యూరి బొరిసోవ్ ఆమోదించినట్లు తెలిపింది. రోస్‌ను నిర్మించాలని 2021లోనే నిర్ణయించినట్లు తెలిపింది. 2027లో తొలి రీసెర్చ్ ఇంధన మాడ్యూల్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించింది. దీని తర్వాత 2030లో యూనివర్సల్ నోడల్, గేట్‌వే, బేస్‌లైన్ మాడ్యూల్స్‌ను నింగిలోకి పంపుతామని తెలిపింది. అనంతరం కీలకమైన స్పెషల్ పర్పస్ మాడ్యూళ్లు టీఎస్ఎమ్1, టీఎస్ఎమ్2లను 2033కల్లా స్టేషన్‌కు అనుసంధానిస్తామని రోస్కోస్మోస్ వెల్లడించింది. స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ కోసం సుమారు 7 బిలియన్ డాలర్ల వ్యయం చేస్తామని రోస్కోస్మోస్ తెలిపింది. 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా, యూరప్‌లు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేస్తామని అప్పట్లో రష్యా హెచ్చరించింది. ఈ హెచ్చరికకు అమెరికా స్పందించకపోవడంతో ఐఎస్ఎస్ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకుంది. స్పేస్స్టేషన్లు వ్యోమగాములకు నింగిలో ఆశ్రయమిస్తూ అంతరిక్ష పరిశోధనలకు దోహదపడతాయి. -
Haryana: ఐఎన్ఎల్-బీఎస్పీ దోస్తీ.. అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు
చండీగఢ్: ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. చండీగఢ్‌లో ఇరు పార్టీల ప్రతినిధులు పొత్తును అధికారికంగా ప్రకటించారు.హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఐఎన్ఎల్ 53 స్థానాల్లో, బహుజన్ సమాజ్ పార్టీ 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తు కుదరడం ఇది మూడోసారి. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య తొలి కూటమి ఏర్పడింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక లోక్‌సభ స్థానాన్ని, ఐఎన్ఎల్డీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి.2018లోనూ ఐఎన్ఎల్, బీఎస్పీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పుడు మళ్లీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇరు పార్టీలు ఒక్కటయ్యాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఐఎన్ఎల్డీ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ అభయ్ చౌతాలా మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. ఈ భేటీలో హర్యానాలో కూటమి ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. హర్యానాలో బహుజన్ సమాజ్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. -
టాలీవుడ్ క్రేజీ మూవీ.. అనౌన్స్మెంట్తోనే అదరగొడుతోంది!
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర-2. గతేడాది రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. పొలిమేర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అయితే ఇప్పటికే పార్ట్-3 కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పొలిమేర-3ని అధికారికంగా ప్రకటించారు. అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో నందిపాటి వంశీ నిర్మిస్తున్నారు. దీంతో పాటు పొలిమేర-3 గ్లింప్స్ రిలీజ్ చేశారు. పొలిమేర-3 అనౌన్స్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ట్విటర్లో ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని పొలిమేర-3 లోడింగ్ అంటూ మేకర్స్ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. The Much Awaited #Polimera3 Announcement Crosses Borders💥"#Polimera3Loading.." Trending at the Top in India on @X ❤️🔥Journey begins!🤩A @DrAnilViswanath FilmProduced by @connect2vamsi - #VamsiNandipatiCo-Produced by #BhogendraGupta⭐️ing @Satyamrajesh2… pic.twitter.com/MAUaItl2tF— GSK Media (@GskMedia_PR) July 10, 2024Let's BEGIN the SHOW❤️🔥Get Ready for the Spine-Chilling #Polimera3, next part of #Polimera Franchise🤩#Polimera3Loading..A @DrAnilViswanath FilmProduced by @connect2vamsi - #VamsiNandipatiCo-Produced by #BhogendraGupta⭐️ing @Satyamrajesh2 #DrKamakshiBhaskarla… pic.twitter.com/iLCJE0tYkZ— GSK Media (@GskMedia_PR) July 10, 2024 -
ఆగస్టులో జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రకటన?
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలకు పరిపాలనా యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆగస్టులో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ప్రతిపాదిత అసెంబ్లీ ఎన్నికలను ఐదు దశల్లో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.జేకేలో ఎన్నికల నిర్వహణ విషయమై జూన్ 24 నుంచి న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు సంబంధిత అధికారులకు శిక్షణ అందించనున్నారు. 2014 నవంబర్-డిసెంబర్లో జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనంతరం 2015లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 2018 జూన్‌లో ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో అధికారిక ప్రభుత్వం లేదు. -
Switzerland Peace Summit: ఉక్రెయిన్‌లో శాంతికి ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక
బెర్న్: ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఎలాంటి శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక అవుతుందని 80 దేశాలు తేలి్చచెప్పాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం స్విట్జర్లాండ్‌లో రెండు రోజులపాటు జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. దాదాపు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం 80 దేశాల ప్రతినిధులు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ సహా కొన్ని దేశాలు ఈ ప్రకటనలో పాలుపంచుకోలేదు. తుది డాక్యుమెంట్‌పై సంతకం చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత స్వా«దీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలని పలుదేశాలు రష్యాకు సూచించాయి. స్విట్జర్లాండ్ సదస్సు పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో శాంతికి ఇదొక తొలి అడుగు అని అభివరి్ణంచారు. అయితే, ఈ సదస్సుకు రష్యా మిత్రదేశం చైనా హాజరుకాలేదు. రష్యాను ఆహ్వా నించలేదు. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి(పశి్చమ) పవన్ కపూర్ హాజరయ్యారు. -
ఇరాన్ దాడులు: నష్టంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన
జెరూసలెం: తమ దేశంపై శనివారం(ఏప్రిల్13) అర్ధరాత్రి ఇరాన్ జరిపిన డ్రోన్, మిసైల్ దాడుల్లో ఒకే ఒక్కరు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిసైల్ దాడుల్లో తలకు తీవ్ర గాయం కావడం వల్ల ఏడేళ్ల బాలిక విషమపరిస్థితిలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. నెగెవ్ ఎడారిలోని అరద్ ప్రాంతంలో బాలిక నివసిస్తోంది. బాలిక తలకు ఇరాన్ నుంచి దూసుకు వచ్చిన మిసైళ్లలోని ఇనుప గుండు తగిలిందా లేక ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ వల్ల బాలిక గాయపడిందా అన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. సర్జరీ చేసిన తర్వాత కూడా బాలిక పరిస్థితి కుదటపడలేదు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. దీంతో మిసైళ్లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాగా, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ హెచ్చరిక నోటీసు ఇవ్వలేదు: అమెరికా -
ఇజ్రాయెల్‌తో యుద్ధం: ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోయినట్లేనా..ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్లేనా..ఇజ్రాయెల్‌పై డ్రోన్లు,మిసైళ్లతో దాడులు జరిపిన తర్వాత ఇరాన్ మెత్తబడిందా.. అంటే ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చేసిన ప్రకటన అవుననే చెబుతోంది. ‘ఇజ్రాయెల్‌పై మేం జరిపిన దాడుల గురించి అమెరికాకు సమాచారమిచ్చాం. ఈ దాడులు పరిమితమైనవి. కేవలం మా ఆత్మరక్షణ కోసం చేసినవేనని తెలిపాం. మిడిల్ ఈస్ట్ ప్రాంత, ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశమేమీ మాకు లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం మా ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడం’అని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ చెప్పారు. ఆదివారం(ఏప్రిల్14) ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్దుల్లాహియాన్ మాట్లాడారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన డ్రోన్,మిసైల్ దాడులను అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ ఖండించిన నేపథ్యంలో దాడులు కొనసాగించే ఉద్దేశం లేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. కాగా, శనివారం(ఏప్రిల్ 13) అర్ధరాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ అడ్డుకుని కూల్చివేసింది. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ అధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ మిసైల్ దాడులు.. తొలిసారి స్పందించిన నెతన్యాహు -
Q4: కార్పొరేట్ ఫలితాల సీజన్
న్యూఢిల్లీ: ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుడుతోంది. నేడు (శుక్రవారం) క్యూ4తోపాటు.. మార్చితో ముగిసిన గత పూర్తిఏడాది(2023–24)కి సైతం పనితీరు వెల్లడించనుంది. అయితే క్యూ4సహా.. గతేడాదికి ఐటీ కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి సాఫ్ట్వేర్ రంగ కంపెనీల క్యూ4, పూర్తి ఏడాది పనితీరు వెల్లడికానుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) ఆదాయ అంచనాలు(గైడెన్స్) సైతం ప్రకటించనున్నాయి. అయితే పలు కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలనే ప్రకటించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఐటీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంటున్నాయి. ఆర్థిక అనిశి్చతుల కారణంగా టెక్నాలజీ సేవలకు డిమాండ్ మందగించడం, ఐటీపై క్లయింట్ల వ్యయాలు తగ్గడం ఈ ఏడాది అంచనాలను సైతం దెబ్బతీసే వీలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వెరసి ఐటీ కంపెనీలు అప్రమత్తతతో కూడిన గైడెన్స్‌ను ప్రకటించనున్నట్లు తెలియజేశాయి. బ్రోకింగ్ వర్గాల అంచనాలు నేడు(12న) ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీసీఎస్ క్యూ4సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ 18న, విప్రో 19న, టెక్ మహీంద్రా 25న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఎమ్కే ఇటీవల అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో మాత్రమే రికవరీ ఆశలనుపెట్టుకోవచ్చునంటూ పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన నిరాశామయ పనితీరుతో పోలిస్తే క్యూ4లో త్రైమాసికవారీగా కాస్తమెరుగైన ఫలితాలు సాధించవచ్చని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల రీత్యా ఐటీ సరీ్వసులకు డిమాండ్ మందగించినట్లు పేర్కొంది. వెరసి కరోనా మహమ్మారి తలెత్తిన 2019–20ను మినహాయిస్తే వార్షికంగా 2008–09 తదుపరి బలహీన ఫలితాలు విడుదలయ్యే వీలున్నట్లు తెలియజేసింది. వ్యయాలు తగ్గడం ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఐచి్చక వ్యయాలు తగ్గడంతో ఐటీ పరిశ్రమలో ప్రస్తావించదగ్గ మార్పులకు అవకాశంతక్కువేనని అభిప్రాయపడింది. కాగా.. యూఎస్ ఫెడ్ సానుకూల ధృక్పథం, పూర్తి చేయవలసిన భారీ ఆర్డర్లు వంటి అంశాలు ఈ ఏడాది(2024–25)లో ప్రోత్సాహక ఫలితాలకు దారిచూపవచ్చని అంచనా వేసింది. క్యూ4లో డీల్స్ ద్వారా సాధించే మొత్తం కాంట్రాక్టుల విలువ(టీసీవీ) సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ ఆదాయంపై స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒత్తిడి కనిపించవచ్చని వివరించింది. ఐటీ సేవలకు ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు, రిటైల్, హైటెక్, కమ్యూనికేషన్స్ విభాగాలతోపాటు.. ప్రాంతాలవారీగా కూడా బలహీనతలు కనిపిస్తున్నట్లు ఐటీ విశ్లేషకులు పేర్కొన్నారు. గ్లోబల్ దిగ్గజాలు సైతం గ్లోబల్ దిగ్గజాలు యాక్సెంచర్, కాగి్నజెంట్ టెక్నాలజీ, క్యాప్‌జెమిని సైతం ఈ క్యాలండర్ ఏడాది(2024) ఓమాదిరి పనితీరును ఊహిస్తున్నాయి. ఫలితంగా తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేశాయి. అయితే ద్వితీయార్ధం(జూలై–డిసెంబర్)లో రికవరీకి వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. కాగా.. దేశీ ఐటీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రక్షణాత్మక బిజినెస్ మిక్స్ ద్వారా లబ్ది పొందే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఇక డిజిటల్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ విభాగాల కారణంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ కీలక పురోగతిని సాధించవచ్చని అభిప్రాయపడింది. -
అల్‌ఖైదా నేత ఖలిద్ అల్ బతర్ఫీ మృతి
యెమెన్ అల్-ఖైదా శాఖ నేత ఖలిద్ అల్ బతర్ఫీ మృతి చెందాడు. ఆదివారం అర్థరాత్రి ఉగ్రవాదులు ఈ సమాచారాన్ని అందించారు. అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) గ్రూపులో అల్-ఖైదాకు నాయకత్వం వహిస్తున్న ఖలిద్ అల్ బతర్ఫీపై యూఎస్ఏ ప్రభుత్వం ఐదు మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హత్య అనంతరం ఈ తీవ్రవాద గ్రూపును అత్యంత ప్రమాదకరశాఖగా పరిగణిస్తున్నారు. అల్-ఖైదా తాజాగా దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. దానిలో ఖలిద్ అల్ బతర్ఫీ శరీరానికి అల్‌ఖైదా జెండాను చుట్టినట్లు కనిపిస్తోంది. ఖలిద్ అల్ బతర్ఫీ కి 40 ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ‘సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ రంజాన్ మాసం సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలు తెలియజేసింది. యెమెన్‌లో సోమవారం నుంచి ముస్లింల పవిత్ర మాసం ప్రారంభం కానుంది. -
టీడీపీకి ‘తూర్పు’ సెగ
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం సీట్ల పంచాయితీ శనివారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఆ రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్య నేతలను నిలదీశారు. రాజోలు టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో చంద్రబాబు లేకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారితో మాట్లాడారు. రాజానగరం నేతలు అచ్చెన్నకు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు త్వరలో రాజానగరం, రాజోలు నాయకులతో మాట్లాడతారని అచ్చెన్న సర్దిచెప్పారు. కార్యకర్తలు వినకపోవడంతో తర్జనభర్జన తర్వాత అధిష్టానం నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఆ రెండు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు నిరసన తెలిపారు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెగేసి చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అచ్చెన్న వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా కొద్దిసేపు ఉండి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. రాజాన‘గరం’ రాజానగరం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలి ఆది నుంచీ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై గతంలో బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశా వ్. అధికారంలో ఉండగా అనుభవించి, ఇప్పుడు గాలికి వదిలేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారు. బాబు వ్యవహార శైలితో విసుగు చెందిన పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన తర్వాత నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ దుకాణం కొన్నాళ్లు బంద్ అయింది. పెందుర్తి కి అప్రధాన పదవి అప్పగించారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతరం బొడ్డు వెంకట రమణ చౌదరిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. రాజానగరం టికెట్ తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ చౌదరి ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలో పవన్ ప్రకటనతో చౌదరి వర్గంలో ఆగ్రహం పెల్లుబికింది. రాజానగరం టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడికి ఇచ్చిన వినతిపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫేక్ అని ప్రచారం చేసేందుకు టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
యూపీఏ- 2 హయాంలో హోం మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే రిటైర్మెంట్ ప్రకటించారు. తన బదులు తన కుమార్తె ప్రణితి షిండే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షోలాపూర్ నుండి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. సుశీల్ కుమార్ శంభాజీ షిండే 1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించారు. షిండే కాంగ్రెస్ పార్టీ నేతగా పలు కీలక పదవులు చేపట్టారు. 2003లో తొలిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2004 వరకు ఈ పదవిలో ఉన్నారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2006 వరకు ఈ పదవిలో కొనసాగారు. సుశీల్ కుమార్ షిండే 2006 నుండి 2012 వరకు కేంద్ర ఇంధనశాఖ మంత్రిగా పనిచేశారు. 2012లో హోం మంత్రిగా నియమితులయ్యారు. 2014 వరకు ఈ పదవిలో ఉన్నారు. 1971లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవడంతో క్రియాశీల రాజకీయాల్లో షిండే కెరీర్ ప్రారంభమైంది. 1974 నుండి 1992 వరకు మహారాష్ట్ర శాసనసభలో సభ్యునిగా ఉన్నారు. 1992 నుండి మార్చి 1998 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1999లో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రచార నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వహించారు. షిండే రిటైర్మెంట్ ప్రకటనతో ఆయన కుమార్తె ప్రణితి షిండే(42) తన తండ్రి సంప్రదాయ సీటు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె షోలాపూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానిత సభ్యురాలుగా ఉన్నారు. ఈసారి షోలాపూర్ ఎంపీ స్థానం కాంగ్రెస్‌కే దక్కుతుందని ప్రణితి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: డబుల్ ఇంజిన్ సర్కారులో డబుల్ అనారోగ్యం: ఖర్గే -
హామీలను నెరవేర్చిన.. పార్టీలకే ఓటేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీలకు, మంచి చేస్తారనే అభ్యర్థులకే ఓటేయాలి. అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అవి అమలయ్యే హామీలా? కాదా? అనేది చూడాలి. అలాగే ఇంతకుముందు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో చూడాలి. పార్టీలిచ్చే హామీలు రాష్ట్ర బడ్జెట్‌ను మించిపోతున్నాయి. కొన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉత్తుత్తవిగా ఉంటున్నాయి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) ‘ప్రజల మేనిఫెస్టో–2023’ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా ఉంది. పార్టీలు చట్టాల పరిధిలో లేక తామే ఒక చట్టంగా వ్యవహరిస్తున్నాయి. గెలిచిన పార్టీలు అంతా తమదే అనుకుంటున్నాయి. మార్పు కోసం రాజ్యాంగ సంస్కరణలు రావాలి’ అని చెప్పారు. ఎఫ్‌జీజీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి మాట్లాడుతూ ‘మా ఓటు అమ్మకానికి లేదు. మద్యం, డబ్బు సంచులతో రావద్దు’ అని ఓటర్లు నినదించాలన్నారు. జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీలు రకరకాల తాయిలాలతో విడుదల చేసే మేనిఫెస్టులు చిత్తు కాగితాలతో సమానమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సోమా శ్రీనివాస్‌రెడ్డి తదిరులు పాల్గొన్నారు. ఎఫ్‌జీజీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. రాష్ట్ర బడ్జెట్లో విద్య, ఆరోగ్యానికి 25 శాతం నిధులు కేటాయించాలి. సంక్షేమ పథకాలకు బడ్జెట్లో 30 శాతానికి మించకుండా కేటాయించాలి. పెట్రోలు, డీజిల్‌పై ట్యాక్స్ తగ్గించాలి. రైతుబంధు పది ఎకరాల్లోపు రైతులకే ఇవ్వాలి. కౌలు రైతులకూ రైతుబంధు ఇవ్వాలి. పంటల బీమా అమలు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మూడు బోర్ల వరకు పరిమితి విధించాలి. నీటి పారుదల ప్రాజెక్టులపై ఒక ఉన్నత కమిటీ ఉండాలి. ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి. అవినీతికి అడ్డుకట్ట వేయాలి. లోకాయుక్త చట్టాన్ని కర్ణాటకలో మాదిరిగా సవరించాలి. కేంద్రంతో రాష్ట్రం మంచి సంబంధాలు కలిగి ఉండాలి. పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేయాలి. మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలి. పార్టీలు తమ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలకయ్యే వ్యయం వివరిస్తూ, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో కూడా తెలపాలి. ఆహార కల్తీపై గట్టి నిఘా ఉండాలి. నైపుణ్యం, ఉపాధి పెంచాలి. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ ఆస్తి వివరాలు వెల్లడించాలి. మహిళలకు 25శాతం టికెట్లు కేటాయించాలి. నేర చరిత్రులకు టికెట్ ఇవ్వొద్దు. ప్రభుత్వ భూముల అమ్మకంపై నిషేధం విధించాలి. ధరలపై నియంత్రణ ఉండాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలి. -
మేనిఫెస్టో... మా ఇష్టమంటే కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోల ప్రకటనలో రాజకీయపార్టీల ఇష్టారాజ్యం ఉండదు. ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు ఇవ్వడం...గెలిచాక అమలు చేయకపోవడం..లేకపోతే ఆచరణ సాధ్యంకాని హామీలతో ఓట్లు కొల్లగొడదామంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అంగీకరించదు. ఎందుకంటే..ఎన్నికల ప్రవర్తన నియమావళిలో 8వ భాగంగా మేనిఫెస్టో చేర్చుతూ 2015 ఏప్రిల్ 24న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎన్నికల మేనిఫెస్టోల్లో హామీలు ఎలా ఉండాలి? ఎలా ఉండరాదు? అన్న అంశాలు ఉన్నాయి. దీంతో మేనిఫెస్టోల విషయంలో రాజకీయపార్టీ లు, అభ్యర్థులు పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనం కలిగించే ఉచిత హామీలిచ్చేందుకు ఈ నిబంధనలు అంగీకరించవు. ‘హామీలు’ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, విలువలకు భంగం కలిగించే అంశాలేమీ మేనిఫెస్టోలో ఉండరాదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఉండాలి. పౌరులకు వివిధ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయాలని.. ప్రభుత్వ విధానాలపై రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మేనిఫెస్టోల్లో వాగ్దానాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఆ హామీలు ఉండరాదు. ఓటు వినియోగించే విషయంలో ఓటర్లను అనుచిత ప్రలోభాలకు గురి చేయకూడదు. మేనిఫెస్టోలో ప్రకటించే హామీలు హేతుబద్ధంగా ఉండాలి. వీటి అమలుకు అనుసరించే మార్గాలు, అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ సైతం సవివరంగా ఓటర్లకు తెలియజేయాలి. నెరవేర్చగలిగే వాగ్దానాల ద్వారానే ఓటర్ల నమ్మకాన్ని కోరాలి. నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తే... ప్రజాప్రాతినిధ్య చట్టం–195లోని సెక్షన్ 126లో నిర్దేశించిన నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పుడు మేనిఫెస్టోలు విడుదల చేయొద్దు. ఒకేవిడత ఎన్నికల విషయంలో పోలింగ్‌కు ముందు అమలుచేసే నిషేధాజ్ఞల కాలవ్యవధిలో మేనిఫెస్టోలు ప్రకటించరాదు. ఒకటికంటే ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరిగితే..ప్రతి విడత పోలింగ్‌కు ముందు ప్రకటించే నిషేధాజ్ఞల వ్యవధిలో మేనిఫెస్టోలు విడుదల చేయొద్దు. సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి గతంలో రాజకీయపార్టీలు ప్రజలకు మీడియా ద్వారా మాత్రమే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేవి. కానీ ఇప్పుడు మేనిఫెస్టో ఎన్నికల సంఘానికి తప్పనిసరిగా సమర్పించాల్సిందే. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మూడు రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)కి రాజకీయ పార్టీ లు, అభ్యర్థులు తప్పనిసరిగా ఆంగ్ల/హిందీ భాషల్లో మూడు ప్రతులు సమర్పించాలని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 8వ భాగంలో పేర్కొన్న విధివిధానాలకు అనుగుణంగానే మేనిఫెస్టోలో హామీలు, కార్యక్రమాలు, విధానాలు పొందుపర్చినట్టు స్వీయ ధ్రువీకరణ పత్రం(డిక్లరేషన్) సైతం మేనిఫెస్టోతో పాటు సీఈఓకు సమర్పించాలి. 2016 డిసెంబర్ 27న ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఉత్తర్వుల కారణంగా రాజకీయపార్టీ ల ఎన్నికల మేనిఫెస్టోలను భవిష్యత్ అవసరాల కోసం ఎన్నికల సంఘం భద్రపరుస్తుంది. ‘సుప్రీం’ చొరవతో మేనిఫెస్టోకు పారదర్శకత ఎన్నికల మేనిఫెస్టోలో ఉండాల్సిన హామీల విషయంలో రాజకీయ పార్టీ లతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలను నిర్దేశించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 జూలై 5న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్.సుబ్రమణ్యం బాలాజీ వేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తన తీర్పులో చేసిన సూచనల ఆధారంగా మేనిఫెస్టోలపై మార్గదర్శకాలను ఈసీఐ రూపకల్పన చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలు ఇవే... మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం అవినీతి చర్యలుగా పరిగణించడానికి ఆస్కారం లేదు. అయినప్పటికీ, ఏ విధమైన ఉచిత హామీలైనా ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయనడంలో అనుమానం లేదు. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలకు ఇలాంటి హామీలతో తీవ్రస్థాయిలో కుదుపునకు గురవుతాయి. ఎన్నికల్లో పోటీపడే పార్టీ లు/అభ్యర్థుల సమాన అవకాశాలను పరిరక్షించడానికి, స్వచ్ఛమైన ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఎన్నికలసంఘం గతంలో సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి ఇలాంటి అధికారాలు లభించాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే రాజకీయ పార్టీ లు మేనిఫెస్టోలు ప్రకటిస్తాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందటి చర్యలను నియంత్రించే అధికారం ఎన్నికల సంఘానికి ఏ మాత్రం లేదు. అయితే, మేనిఫెస్టోలు ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి వీటి విషయంలో ఎన్నికల సంఘం మినహాయింపు కలిగి ఉంటుంది. ప్రధాన దేశాల్లో పార్టీ ల విధానాలే హామీలు అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, స్వీడన్, కెనడా, నెదర్లాండ్, ఆ్రస్టియా, ఇతర పశ్చిమ ఐరోపా దేశాల్లొ వ్యక్తిగత లబ్ధి కలిగించే ఉచిత హామీలు మేనిఫెస్టోల్లో ప్రకటించరు. రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆర్థిక విధానాలు, విదేశీ వ్యవహారాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనాసంస్కరణలు, పర్యావరణ అంశాలు, వలసలు వంటి అంశాలపై తమ విధానాలను మాత్రమే ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. భూటాన్, మెక్సికో వంటి దేశాల్లో రాజకీయ పార్టీలు/అభ్యర్థుల ఎన్నికల మేనిఫెస్టోలను ఆయా దేశాల ఎన్నికల యంత్రాంగానికి తొలుత సమర్పి స్తాయి. ఎన్నికల యంత్రాంగం పరిశీలించి అవసరమైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హామీలను తొలగించాలని ఆదేశిస్తుంది. యూకేలో సైతం మేనిఫెస్టోలపై మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. మన దగ్గరా మేనిఫెస్టోలు ఈసీ పరిశీలించాలనే డిమాండ్ మన దేశంలో సైతం రాజకీయపార్టీ లు మేనిఫెస్టోలను తొలుత ఎన్నికల సంఘానికి సమర్పించాలని, ఎన్నికల సంఘం పరిశీలించి ఆమోదించిన తర్వాతే ప్రజలకు ప్రకటించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం పరిశీలించి ఆచరణకు సాధ్యం కాని, ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఉన్న హామీలను తొలగింపునకు ఆదేశించాలని స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మేనిఫెస్టోలను తాము పరిశీలించడం ఆచరణలో సాధ్యం కాదని ఎన్నికల సంఘం అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ మేనిఫెస్టోల్లో మార్పులు సూచిస్తే రాజకీయ పార్టీలు న్యాయస్థానాలకు వెళ్లే అవకాశముందని, దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం కష్టమవుతుందంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తే ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
Five states Assembly elections 2023: ఫైనల్‌కు ముందు..అగ్ని పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల మహా సంగ్రామానికి ముందు సెమీస్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు అధికార కాషాయ దళానికి, విపక్ష కాంగ్రెస్ పార్టీకి అగి్నపరీక్షగా మారాయి. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో తన అధికార పీఠాన్ని సుస్థిర పరుచుకోవాలంటే ప్రస్తుత ఎన్నికల్లో మెజార్టీ రాష్ట్రాలను దక్కించుకునేలా బీజేపీ ఇప్పటికే కదనరంగంలోకి దిగింది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాపాడుకుంటూనే మరో రెండు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కాలుదువ్వుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార మార్పిడి జరుగుతుందని బీజేపీ నమ్మకంగా ఉంటే.. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌ను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో రెండు పార్టీల పట్టు నిలుపుకునేందుకు, మిజోరంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు పోరాడుతుండటంతో ఈ ఎన్నికలకు రసవత్తరంగా ఉండనున్నాయి. పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో... త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పెద్దదైన మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గానూ 2018 ఎన్నికల్లో 114 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ జ్యోతిరాదిత్య సింధియా 2020లో సొంతపార్టీలోని 21 మంది ఎమ్మెల్యేలతో కాషాయ కండువా కప్పుకోవడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది దీనిపై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న కాంగ్రెస్ అక్కడ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు చెమటోడ్చుతోంది. వరుసగా తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన కమల్‌నాథ్ ప్రస్తుతం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను బలంగా వాడుతున్నారు. బీజేపీ కూడా కేంద్ర మంత్రులు, లోక్‌సభ ఎంపీలను అసెంబ్లీ బరిలో నిలిపింది. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న డిసెంబర్ 2018 నుంచి మార్చి 2020 మినహా దాదాపు రెండు దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్తాన్ కీలకం రాజస్తాన్‌లో ఏ ప్రభుత్వమూ వరుసగా రెండోసారి ఎన్నికకాని చరిత్ర ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ప్రత్యర్థి పార్టీకి అవకాశం కలి్పస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతుల ఓట్లే కీలకంగా ఉండటంతో వాటిపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. అదే సమయంలో, కాంగ్రెస్‌కు చెందిన సీఎం గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య విరోధం నివురు గప్పిన నిప్పులా ఉంది. రాజస్తాన్‌లో కాషాయ జెండా రెపరెపలాడాలని చూస్తున్న బీజేపీ అక్కడ ‘ఆప్నో రాజస్తాన్’పేరిట ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ నాలుగుసార్లు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరుమార్లు పర్యటించారు. ఛత్తీస్‌గఢ్ ఎవరిదో? పదిహేనేళ్ల పాలన తర్వాత 2018లో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ఎలాగైనా ఛత్తీస్‌గఢ్‌ను తిరిగి నిలబెట్టుకునే కృతనిశ్చయంతో ఉండగా ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. 90 స్థానాలున్న రాష్ట్రంలో 68 సీట్లతో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఉన్న ఇమేజ్‌కు తోడు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తమను తిరిగి అధికారంలోకి తేవొ చ్చని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తోంది. రాష్ట్రంలోని కీలక రంగాల్లో జరిగిన అవినీతి తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మూడుసార్లు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఇటీవలి ఇండియా టుడే–సీవోటర్ ఒపీనియన్ పోల్‌లో 90 సీట్లలో 46 శాతం ఓట్లతో 51 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న అంచనాలు బీజేపీకి మింగుడుపడటం లేదు. తెలంగాణలో త్రిముఖం.. తెలంగాణ ఇచి్చన కాంగ్రెస్, తెలంగాణ తెచి్చన బీఆర్ఎస్ల మధ్య ప్రధాని పోటీ ఉందనుకుంటున్న 119 సీట్లున్న తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీ సైతం పోటీలోకి వచి్చంది. త్రిముఖ పోటీ ఉండే అవకాశాలతో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్ముతుంటే, అతిపెద్ద పార్టీగా తామే అవతరిస్తామన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు, పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్‌లతో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ఎన్నికల బరిలో నిలపనుంది. గడిచిన 15 రోజుల్లోనే రెండుసార్లు తెలంగాణలో మోదీ పర్యటించారు. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందిన మాదిరే ఇక్కడా 6 గ్యారెంటీ కార్డు హామీలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. మిజోరంలో స్థానిక పార్టీలదే హవా క్రైస్తవులు మెజారిటీగా ఉన్న మిజోరంలో స్థానిక పార్టీలైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) పార్టీలదే హవా నడుస్తోంది. 40 స్థానాలున్న మిజోరంలో ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం 28 సీట్లతో అధికారంలో ఉండగా, జెడ్పీఎం 9 సీట్లు, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక్క సీటు సాధించుకున్నాయి. రెండు పర్యాయాలకు ఒకమారు అధికారం మారే మిజోరంలో ఈ ఏడాది ఎంఎన్ఎఫ్దే విజయమని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. మయన్మార్ శరణార్థులే ప్రధాన అంశంగా ప్రస్తుత ఎన్నికలు జరుగనున్నాయి. Follow the Sakshi Telugu News channel on WhatsApp -
తెలంగాణసహా 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇవే
ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశమైంది. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే..? తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్, రాజస్థాన్‌లో నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 7న మొదటి విడత, నవంబర్ 17న రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న పోలింగ్ జరగగా.. మిజోరాంలో నవంబర్ 7న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాలకు డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రం పోలింగ్ కౌంటింగ్ సీట్లు తెలంగాణ నవంబర్ 30 డిసెంబర్ 3 119 రాజస్థాన్ నవంబర్ 23 డిసెంబర్ 3 200 మధ్యప్రదేశ్ నవంబర్ 17 డిసెంబర్ 3 230 మిజోరం నవంబర్ 7 డిసెంబర్ 3 40 ఛత్తీస్‌గఢ్ నవంబర్ 7, నవంబర్ 17 డిసెంబర్ 3 90 ఐదు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 5 States Assembly polls | Chhattisgarh to vote on 7th Nov & 17th Nov; Madhya Pradesh on 17th Nov; Mizoram on 7th Nov, Rajasthan on 23rd Nov and Telangana on 30th Nov; Results on 3rd December pic.twitter.com/jV7TJJ9W4A — ANI (@ANI) October 9, 2023 5 రాష్ట్రాల్లో 679 నియాజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 40 రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి వివిధ రాజకీయ పార్టీలతో చర్చించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 5 రాష్ట్రాల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగా 60 లక్షల మంది ఓటర్లు చేరారు. 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతీ 879 మందికి ఒక పోలీంగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. Total voters in Mizoram are 8.52 lakh, 2.03 crore in Chhattisgarh, 5.6 cr in Madhya Pradesh, 5.25 crore in Rajasthan and 3.17 crore in Telangana: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/Q1ChyPQudf — ANI (@ANI) October 9, 2023 తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. మిజోరాంలో 8.52 లక్షల మంది ఓటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఓటర్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల ఓటర్లు, రాజస్థాన్‌లో 5.25 కోట్లు, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. There are 679 ACs in 5 states which is around 1/6th of total LACs in the country and have 16 cr electors which is almost 1/6th of total electors in the country#ECI #AssemblyElections2023 pic.twitter.com/uxN95tUs9u — Election Commission of India #SVEEP (@ECISVEEP) October 9, 2023 ఇదీ చదవండి: నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ ప్రెస్‌మీట్.. షెడ్యూల్ విడుదల.. ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్ ఫాలో అవ్వండి -
బీజేపీ ఇన్చార్జీ కమిటీల నియామకం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీ వివిధ కమిటీల నియామకాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే కొన్ని కమిటీలను ఏర్పాటు చేయగా తాజాగా 17 లోక్‌సభ స్థానాలకు ‘పార్లమెంట్ ప్రభారీలు’ (ఇన్చార్జీలు), 33 జిల్లాలకు ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆయా కమిటీల సభ్యలను నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ప్రభారీలు వీరే... ఆదిలాబాద్–అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి–విశ్వవర్ధన్రెడ్డి, కరీంనగర్–పి.గంగారెడ్డి, నిజామాబాద్–వెంకటరమణి, జహీరాబాద్–బద్దం మహిపాల్‌రెడ్డి, మెదక్–ఎం.జయశ్రీ, మల్కాజిగిరి–ఎ.పాపారావు, సికింద్రాబాద్–దేవకి వాసుదేవరావు, హైదరాబాద్–గోలి మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల–పి,సుగుణాకరరావు, మహబూబ్‌నగర్–వి.చంద్రశేఖర్, నాగర్‌కర్నూల్– ఎడ్ల ఆశోక్‌రెడ్డి, నల్లగడొండ–చాడ శ్రీనివాసరెడ్డి, భువనగిరి–అట్లూరి రామకృష్ణ, వరంగల్–వి.మురళీథర్గౌడ్, మహబూబాబాద్–ఎన్.వెంకటనారాయణరెడ్డి, ఖమ్మం–కడగంచి రమేశ్. జిల్లా ఇన్చార్జీలు వీరే... ఆదిలాబాద్–బద్దం లింగారెడ్డి, నిర్మల్–ఎం. మల్లారెడ్డి, కొమురం భీమ్–ఎం.మహేశ్‌బాబు, నిజామాబాద్–కళ్లెం బాల్‌రెడ్డి, కామారెడ్డి–ఎర్ర మహేశ్, కరీంనగర్– మీసాల చంద్రయ్య, జగిత్యాల– చంద్రశేఖర్, పెద్దపల్ల–రావుల రాంనాథ్, రాజన్న సిరిసిల్ల–జి.మనోహర్‌రెడ్డి, సంగారెడ్డి–జె.రంగారెడ్డి, మెదక్–డా.ఎస్.మల్లారెడ్డి, రంగారెడ్డి రూరల్–పి.అరుణ్ కుమార్, వికారాబాద్–వి.రాజవర్ధన్‌రెడ్డి, మేడ్చల్ అర్బన్–గిరిమోహనశ్రీనివాస్, మేడ్చల్ రూరల్– వి.నరేందర్‌రావు, నల్లగొండ–ఆర్.ప్రదీప్‌కుమార్, యాదాద్రి– జె.శ్రీకాంత్, మహబూబ్‌నగర్ కేవీఎల్ఎన్ రెడ్డి, వనపర్తి–బోసుపల్లి ప్రతాప్, నాగర్‌కర్నూల్–టి.రవికుమార్, గద్వాల–బి.వెంకటరెడ్డి, నారాయణపేట–కె.జంగయ్య యాదవ్, హనుమకొండ–అడ్లూరి శ్రీనివాస్, వరంగల్– కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, భూపాలపల్లి–ఎస్.ఉదయ్ ప్రతాప్, జనగామ–యాప సీతయ్య, మహబూబాబాద్–బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగు– ఎ.వెంకటరమణ, ఖమ్మం–ఎస్.విద్యాసాగర్‌రెడ్డి, కొత్తగూడెం–ఆర్.రుక్మరాజు, గోల్కొండ–గోషామహల్–ఎస్.నందకుమార్‌యాదవ్, మహంకాళి–సికింద్రాబాద్–నాగూరావు నామాజీ, హైదరాబాద్ సెంట్రల్– టి.అంజన్‌కుమార్‌గౌడ్. -
ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే..
ఢిల్లీ: ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవడం G20 కుటుంబానికి ఒక మైలురాయి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన రెండు రోజుల G20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సెషన్లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ను కూటమిలో కొత్త సభ్యుడిగా స్వాగతించారు. గ్లోబల్ సౌత్‌కు కొత్త ఆశలను కల్పిస్తున్న ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజలీ అసోమానీకి స్వాగతం తెలిపారు. Advancing a more inclusive G20 that echoes the aspirations of the Global South! PM @narendramodi extends a heartfelt welcome to President @_AfricanUnion and the President of Comoros Azali Assoumani. Thrilled to have the African Union as a permanent member. A milestone for the… pic.twitter.com/SqwziRCwiT — PMO India (@PMOIndia) September 9, 2023 'G20లో పూర్తి సభ్యునిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను. ఈ సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాము. ఆఫ్రికా ఖండానికి ప్రపంచ సేవలు అందడమే కాకుండా సవాళ్లపై ఆఫ్రికా దేశాలు పోరాడేలా పరస్పర సహకారాలు అందుతాయి.' అని ట్విట్టర్ వేదికగా ఆఫ్రికన్ యూనియన్ కమీషన్ హెడ్ మౌసా ఫకీ మహమత్ అన్నారు. గత కొన్నాళ్లుగా గ్లోబల్ సౌత్ ప్రాతినిధ్యంపై భారత్ వాయిస్ వినిపిస్తోంది. జీ20 కేవలం 20 దేశాలకు సంబంధించిన విషయం కాదని, వెనకబడిన గ్లోబల్ సౌత్ కోసం పాటుపడేలా ఉండాలని ప్రధాని మోదీ గత డిసెంబర్లోనే అన్నారు. ప్రపంచ వేదికలపై విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు. I welcome the @_AfricanUnion's entry into the #G20 as full member. This membership, for which we have long been advocating, will provide a propitious framework for amplifying advocacy in favor of the Continent and its effective contribution to meeting global challenges. — Moussa Faki Mahamat (@AUC_MoussaFaki) September 9, 2023 ఢిల్లీ వేదికగా నేడు జీ20 సమావేశం ప్రారంభమైంది. ప్రపంచ దేశాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ సెషన్లో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20 కూటమిలో భాగస్వామిగా చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆఫ్రికా కూటమికి ఆహ్వానం పలికారు. ఇదీ చదవండి: కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జర్మనీ ఛాన్సలర్.. ఎందుకంటే! -
యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు..
ఓ యూట్యూబర్ కారణంగా న్యూయార్క్ వీధులు శుక్రవారం సాయంత్రం రణరంగంగా మారాయి. లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్‌లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం భారీగా గుమిగూడిన యువతతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో యూట్యూబర్‌తో సహా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 21 ఏళ్ల కాయ్ సీనట్ ప్రముఖ యూట్యూబర్. యూట్యూబ్‌తో సహా ఇన్స్టాగ్రామ్, ట్వీచ్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షల కొలది ఫాలోవర్లు ఉన్నారు. తనను కలవాలంటే మ్యాన్ హట్టన్‌కు రావాలని, అక్కడే లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్‌లో ప్లే స్టేషన్ కన్సోల్‌తో సహా ఉచితంగా కానుకలు ఇస్తానని సీనట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. భారీగా ప్రజాదరణ ఉన్న సీనట్ పోస్టుకు స్పందించిన యువత శుక్రవారం సాయంత్రం దాదాపు 2000 మంది ఆ ప్రాంతానికి వచ్చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన యువతతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఒకరినొకరు తోసుకున్నారు. కాలనీల్లో కార్లను ధ్వంసం చేశారు. భవంతుల పైకి ఎక్కి నినాదాలు చేయడం, బాటిళ్లను విసరడం వంటి చేష్టలకు పాల్పడ్డారు. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించిన పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రత దృష్ట్యా యూట్యూబర్ సీనట్‌ను కూడా నిర్భందించి దర్యాప్తు చేపడుతున్నారు. ఇదీ చదవండి: 3 Years Jail For Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు.. ఆ వెంటనే అరెస్ట్ -
ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు..
ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకోగా.. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మోదీ సెయిన్ మ్యూజికల్ కళాప్రాంగణంలో ప్రవాస భారతీయ సమాజంతో మాట్లాడారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని భారతీయులకు భారీ ప్రకటనలను చేశారు. అవి.. ► ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు వినియోగించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈఫిల్ టవర్ నుంచే దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీంతో ఫ్రాన్స్‌కు వెళ్లే పర్యటకులు రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. ► ఫ్రెంచ్ ప్రభుత్వం సహకారంతో మార్సెల్లీలో కొత్త కాన్సులెట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ► ఫ్రాన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రధాని మోదీ తీపి కబురు చెప్పారు. ఇకపై ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థులకు పోస్టు స్టడీ వీసాను ఐదేళ్లకు పొడిగించే విధంగా ఒప్పందం కుదిరినట్లు మోదీ చెప్పారు. ► తమిళ తత్వవేత్త తిరువళ్లువార్ విగ్రహాన్ని ఫ్రాన్స్‌లో ప్రతిష్టించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని వారాల్లోనే ఆ పని పూర్తి కానున్నట్లు చెప్పారు. ► భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలు రేటింగ్ సంస్థలు చెప్పాయని మోదీ అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఇండియా సరైన ప్రదేశం.. అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని సంస్థలను ప్రధాని మోదీ కోరారు. ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్ -
ICC వరల్డ్ కప్ షెడ్యూల్
-
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ఖాజీపేట–కొండపల్లి సెక్షన్ మధ్యలోని చింతల్‌పల్లి–నెక్కొండ స్టేషన్ మధ్యలో జరుగుతున్న మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు పూర్తిగానూ, మరికొన్ని పాక్షికంగానూ రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్లు: ఖాజిపేట–డోర్నకల్లు (07753/07754), విజయవాడ–డోర్నకల్లు (07755/07756), విజయవాడ–గుంటూరు (07464/07465), భద్రాచలంరోడ్డు–సికింద్రాబాద్ (17660/17659), విజయవాడ–సికింద్రాబాద్(12713/12714) ఎక్స్‌ప్రెస్ రైళ్లును ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు పూర్తిగా రద్దు చేశారు. అదే విధంగా ఖాజిపేట–తిరుపతి (17091/17092) రైళ్లు ఈ నెల 23, 30, జూన్ 6 తేదీలలో, మచిలీపట్నం–సికింద్రాబాద్ (07185/07186) రైళ్లు ఈ నెల 21, 28, జూన్ 4 తేదీలలో రద్దు చేశారు. పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు: సిర్పూర్ టౌన్–భద్రాచలం (17034) ఈ నెల 20 నుంచి జూన్ 6 వరకు వరంగల్లు–భద్రాచలం మధ్య, భద్రాచలం–సిర్పూర్ (17033) ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు భద్రాచలం–వరంగల్లు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లింపు: విశాఖపట్నం–ముంబై ఎల్టీటీ (18519) ఈ నెల 21 నుంచి జూన్ 7 వరకు వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది. షాలిమార్–సికింద్రాబాద్ (22849) ఈ నెల 24, 28, జూన్ 4 తేదీలలో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. యశ్వంత్‌పూర్–టాటానగర్ (18112) ఈ నెల 21, 28, జూన్ 4 తేదీలలో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. హైదరాబాద్–షాలిమార్ (18046) ఈ నెల 28, జూన్ 7 తేదీలలో వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది.