చండీగఢ్: ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. చండీగఢ్‌లో ఇరు పార్టీల ప్రతినిధులు పొత్తును అధికారికంగా ప్రకటించారు.
హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఐఎన్‌ఎల్ 53 స్థానాల్లో, బహుజన్ సమాజ్ పార్టీ 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తు కుదరడం ఇది మూడోసారి. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య తొలి కూటమి ఏర్పడింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్‌పీ ఒక లోక్‌సభ స్థానాన్ని, ఐఎన్‌ఎల్‌డీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి.
2018లోనూ ఐఎన్‌ఎల్, బీఎస్పీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పుడు మళ్లీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇరు పార్టీలు ఒక్కటయ్యాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఐఎన్‌ఎల్‌డీ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ అభయ్ చౌతాలా మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. ఈ భేటీలో హర్యానాలో కూటమి ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. హర్యానాలో బహుజన్ సమాజ్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment