INLD
-
ఇకపై మాది ఒంటరిపోరే: మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ: అనుకున్నదొక్కటి... అయినదొక్కటిలా తయారైంది మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిస్థితి. హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో ఐఎన్ఎల్డీతో బీఎస్పీ పొత్తు చేదు అనుభవం మిగల్చడంతో, మున్ముందు జరిగే ఎన్నికల్లో ఎక్కడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోరాదని మాయావతి నిర్ణయించారు. యూపీ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లు కూటమి పార్టీకి బదలాయించినా.. వారి సంప్రదాయ ఓట్లను బీఎస్పీకి బదలాయించే సామర్థ్యం మిత్రపక్షానికి లేకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని మాయావతి పేర్కొన్నారు. ఈ కారణంగానే బీఎస్పీ కేడర్ తీవ్ర నిరాశకు గురైందని శుక్రవారం ఆమె ‘ఎక్స్’లో అభిప్రాయపడ్డారు. -
Haryana: ఐఎన్ఎల్-బీఎస్పీ దోస్తీ.. అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు
చండీగఢ్: ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. చండీగఢ్‌లో ఇరు పార్టీల ప్రతినిధులు పొత్తును అధికారికంగా ప్రకటించారు.హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఐఎన్ఎల్ 53 స్థానాల్లో, బహుజన్ సమాజ్ పార్టీ 37 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ పార్టీల మధ్య పొత్తు కుదరడం ఇది మూడోసారి. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీల మధ్య తొలి కూటమి ఏర్పడింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక లోక్‌సభ స్థానాన్ని, ఐఎన్ఎల్డీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి.2018లోనూ ఐఎన్ఎల్, బీఎస్పీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పుడు మళ్లీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇరు పార్టీలు ఒక్కటయ్యాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఐఎన్ఎల్డీ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ అభయ్ చౌతాలా మధ్య గంటసేపు చర్చలు జరిగాయి. ఈ భేటీలో హర్యానాలో కూటమి ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. హర్యానాలో బహుజన్ సమాజ్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. -
ఐఎన్ఎల్డీ హరియాణా చీఫ్ కాల్చివేత
చండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ హరియాణా విభాగం అధ్యక్షుడు నఫె సింగ్ రాథీ(70)ని గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. ఢిల్లీకి సమీపంలోని బహదూర్గఢ్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో ఒక పార్టీ కార్యకర్త చనిపోగా ఆయన ప్రైవేట్ గన్మెన్లు ముగ్గురు గాయాలపాలయ్యారు. ఝజ్జర్ జిల్లాలోని బహదూర్గఢ్ నుంచి ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన ఎస్‌యూవీలో వెళ్తున్న రాథీని కారులో వెంబడించిన దుండుగులు ఆయనపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన దాడిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. -
పర్యాటకం ఓట్లు రాల్చేనా?
కురుక్షేత్ర.. పురాతన ఆలయాలకు నిలయం. చారిత్రక ప్రాధాన్యత గల 1200 ఏళ్ల నాటి దేవాలయం కూడా ఉందిక్కడ. ఈ నేపథ్యంలో నగరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది బీజేపీ సర్కారు. ప్రైవేటు రంగ పెట్టుబడులకు అవకాశం కల్పించడం ద్వారా నగరాభివృద్ధికి బాటలు వేసింది. దీంతో కురుక్షేత్ర రూపురేఖలే మారిపోయాయి. నిత్యం ఇక్కడకొచ్చే పర్యాటకులు నాలుగేళ్లతో పోల్చుకుంటే రెట్టింపును మించిపోయారు. హరియాణాలోని 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో కురుక్షేత్ర ఒకటి. మే 12న జరిగే ఎన్నికలో ఈ నగరాభివృద్ధి బీజేపీకి ఒక అనుకూలాంశమైంది. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా వున్న నయాబ్ సింగ్ సైనీ.. ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా కుమారుడైన 26ఏళ్ల అర్జున్ చౌతాలాతో తలపడుతున్నారు. మాజీ మంత్రి నిర్మల్ సింగ్‌ను కాంగ్రెస్ పోటీకి పెట్టింది. ఈ నాలుగేళ్ళలో కురుక్షేత్ర స్వచ్ఛ నగరంగా మారింది. మల్టీప్లెక్సులు నగరానికి సరికొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి. బహుళజాతి బ్రాండెడ్ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. దీంతో నగరం పర్యాటకంగా అభివృద్ధి అవుతోంది.. అంటున్నారు యువతీయువకులు. ఈ నియోజకవర్గంలోని సోనిపట్, పానీపట్, కర్నాల్‌లో కురుక్షేత్ర తరహా మార్పులు కనిపించకపోయినా, అక్కడి యువత కూడా మోదీపైనే మొగ్గు చూపుతోంది. కురుక్షేత్రలో వెనుకబడిన కులాల ఆధిపత్యం కొనసాగుతోంది. 2016లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం జాట్లు జరిపిన ఆందోళనతో ఈ ప్రాంతం యుద్ధ క్షేత్రమైంది. -
సీఎంపై ఇంకు దాడి
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై ఇంకు దాడి జరిగింది. ఈ ఘటన హిస్సార్‌లో చోటుచేసుకుంది. గురువారం రోడ్ షోలో పాల్గొన్న ఖట్టర్‌పై ఓ యువకుడు ఇంకు పోశాడు. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి, సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డారు. తాను ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) కార్యకర్తనంటూ నినాదాలు చేస్తున్న ఆ యువకున్ని సీఎం సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే, ఘటనానంతరం ఖట్టర్ తన చేతి రుమాలుతో ముఖంపై పడిన ఇంకుని తుడుచుకొని రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం దేవీ భవన్‌లాల్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అభిమన్యుతో కలిసి పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రికే సరైన భద్రత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ‘యువకున్ని అదుపులోకి తీసుకున్నాం. అతను ఏ పార్టీకి చెందిన వాడో తెలియాల్సి ఉంది’ అని హిస్సార్ జిల్లా ఐజీ సంజయ్ కుమార్ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రికి విలేకరులు, కెమెరామెన్లు దూరంగా ఉండాలని గత సంవత్సరం సోనిపట్ జిల్లా యంత్రాంగం పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
మాజీ ఎమ్మెల్యేపై ‘బుల్లెట్’ దాడి
న్యూఢిల్లీ: నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) మాజీ ఎమ్మెల్యే భరత్‌సింగ్, ఆయన ఇద్దరు అనుచరులపై దుండగులు ఆదివారం కాల్పులు జరిపారు. ముగ్గురిని గుర్గావ్లోని మేదాంతా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ పోలీస్ అధికారి తెలిపిన వివరాలు.. దక్షిణ ఢిల్లీలోని రఘునందన్ వాటికలో ఒక ప్రైవేటు ఫంక్షన్‌కు భరత్‌సింగ్ తన ఇద్దరు వ్యక్తిగత రక్షకులతో హాజరయ్యారు. ఆ సమయంలో దుండగులు వారిపై కాల్పులు జరపగా భరత్‌సింగ్ తలలో బుల్లెట్ దిగింది. 2012లోనూ ఆయనపై కాల్పులు జరగగా ప్రస్తుతం బుల్లెట్ గాయమైనచోటే అప్పుడు కూడా గాయమైంది. ఆనాటి కేసులో నలుగురిని ఆరెస్టు చేశారు. -
హర్యానాలో జేడీయూ-ఐఎన్ఎల్డీ ఉమ్మడి పోటీ
న్యూఢిల్లీ: హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, ఒకప్పటి జనతా పార్టీకి చెందిన వర్గాలు మరింత సన్నిహితమయ్యాయి. ఆసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేయాలని జనతాదళ్ యునెటైడ్ (జేడీయూ), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) సోమవారం నిర్ణయించుకున్నాయి. మాజీ ఉపప్రధాని చౌధరీ దేవీలాల్ కాలంనుంచీ, తమ రెండు పార్టీలకూ సత్సంబంధాలున్నాయని, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తిరిగి ఏకంకావాలన్నదే తమ ప్రయత్నమని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ చెప్పారు. దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులకు ఇదొక హెచ్చరికలాంటిదని యాదవ్ తెలిపారు.