
సాక్షి, న్యూఢిల్లీ: అనుకున్నదొక్కటి... అయినదొక్కటిలా తయారైంది మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిస్థితి. హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో ఐఎన్‌ఎల్‌డీతో బీఎస్పీ పొత్తు చేదు అనుభవం మిగల్చడంతో, మున్ముందు జరిగే ఎన్నికల్లో ఎక్కడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోరాదని మాయావతి నిర్ణయించారు.
యూపీ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లు కూటమి పార్టీకి బదలాయించినా.. వారి సంప్రదాయ ఓట్లను బీఎస్పీకి బదలాయించే సామర్థ్యం మిత్రపక్షానికి లేకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని మాయావతి పేర్కొన్నారు. ఈ కారణంగానే బీఎస్పీ కేడర్ తీవ్ర నిరాశకు గురైందని శుక్రవారం ఆమె ‘ఎక్స్’లో అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment