No Alliance
-
ఢిల్లీలో ఒంటరి పోరే..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ నిర్ణయించింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలనే నిశ్చయానికి వచ్చింది. బీజేపీతో ప్రత్యక్షపోరు కొనసాగిస్తున్న మాదిరే ఆప్‌తోనూ అదే వైఖరిని అవలించాలని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నేతలకు సూచనలు చేసింది. ఢిల్లీలో షీలాదీక్షిత్ హయాంలో వరుసగా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గడిచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేదు. మొన్నటి లోక్‌సభలో ఆప్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా రెండు పార్టీలు ఒక్క సీటును గెలువలేకపోయాయి. అనంతరం జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తు ఉంటుందని భావించినా, సీట్ల పంపకాలలో విభేదాలతో పొత్తు కుదరలేదు. దీంతో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాయి. 6 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ఆప్ ప్రత్యక్ష కారణమైంది. హరియాణా ఓటమి నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవాల న్నా, ఓట్ల చీలికను ఆపాలన్నా రెండు పార్టీలు కలిసి పోటీ చేయడమే ఉత్తమమనే భావనను కొంతమంది నేతలు వ్యక్తం చేశారు. అయితే ఆప్ పార్టీలోని సోమ్నా«థ్ భారతి వంటి కీలక నేతలు పొత్తును వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుతో ఆప్‌కు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదని, పైగా బీజేపీకి విమర్శల దాడిని అ్రస్తాన్ని అందించినట్లు అవుతుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే లు హాజరయ్యారు. కార్యక్రమంలో కేజ్రీవాల్, రాహుల్, ఖర్గేలు చాలాసేపు ముచ్చటించుకోవడం సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఆప్‌తో పొత్తు ఖాయమైందని చా లా మంది భావించారు. శుక్రవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స మావేశం సందర్భంగా పొత్తు అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తు ఉంటుందని ఎక్కువ మంది భావిస్తున్న వేళ కాంగ్రెస్ అనూహ్య నిర్ణ యం తీసుకుంది. ఎలాంటి పొత్తులు ఉండవ ని ఒంటరి పోరుకు సిద్ధం కావాలని అధిష్టాన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ శనివారం ఒక ప్రకటన చేశారు. ‘ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ పరిపాలనలో వృద్ధులకు పింఛన్లు అందడం లేదు. పేదలకు రేషన్‌కార్డు అందడం లేదు. రోడ్లు పాడైపోయాయి. కాలుష్యం అదు పు తప్పింది. యువత నిరుద్యోగులయ్యారు. ద్రవ్యోల్బణంతో మహిళలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కేవలం ప్రదర్శన కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ మొహల్లా క్లినిక్‌లను తెరిచింది. ఇదీ కేజ్రీవాల్ మోడల్’అంటూ విమర్శలు గుప్పించారు. అటు బీజేపీ, ఇటు ఆప్ రెండూ ఢిల్లీ సర్వనాశనం చేశాయన్నారు. రెండు పార్టీలను ఒంటరిగా ఎదుర్కొంటామని, ముఖ్యమంత్రి ఎవరనేది ఫలితాల అనంతరం నిర్ణయిస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు. -
ఇకపై మాది ఒంటరిపోరే: మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ: అనుకున్నదొక్కటి... అయినదొక్కటిలా తయారైంది మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిస్థితి. హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో ఐఎన్ఎల్డీతో బీఎస్పీ పొత్తు చేదు అనుభవం మిగల్చడంతో, మున్ముందు జరిగే ఎన్నికల్లో ఎక్కడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోరాదని మాయావతి నిర్ణయించారు. యూపీ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లు కూటమి పార్టీకి బదలాయించినా.. వారి సంప్రదాయ ఓట్లను బీఎస్పీకి బదలాయించే సామర్థ్యం మిత్రపక్షానికి లేకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని మాయావతి పేర్కొన్నారు. ఈ కారణంగానే బీఎస్పీ కేడర్ తీవ్ర నిరాశకు గురైందని శుక్రవారం ఆమె ‘ఎక్స్’లో అభిప్రాయపడ్డారు. -
Jairam Ramesh: హరియాణా, ఢిల్లీలో ఆప్‌తో పొత్తు లేనట్టే!
న్యూఢిల్లీ: హరియాణా, ఢిల్లీలో మరో ఏడాదిలోగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) మధ్య పొత్తు కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. కానీ, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పారీ్టలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి పారీ్టలు తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవాలన్న నిబంధన ఏదీ లేదని స్పష్టంచేశారు. అవగాహన కుదిరిన చోట కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. -
ఒడిశాలో బీజేపీ ఒంటరి పోరు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో జరగబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ శుక్రవారం ప్రకటించారు. ‘‘డబుల్ ఇంజన్ ప్రభుత్వాలుంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలెత్తుతుందని ఆశించాం. కానీ బీజేడీ అధికారంలో ఉన్న ఒడిశాలో కేంద్ర పథకాలు చివరి లబ్ధిదారు దాకా చేరడం లేదు’’ అని ఆరోపించారు. రాష్ట్రంలో పొత్తుపై అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ), బీజేపీ మధ్య కొద్దిరోజుల క్రితం చర్చలు జరగడం తెలిసిందే. బీజేడీతో పొత్తుపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని గత వారమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతలో ఇలా ఒంటరిపోరు ప్రకటన వెలువడింది. తాము కూడా అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు బీజేడీ శుక్రవారం ప్రకటించింది. 1998–2009 మధ్య రెండు పార్టీలు 11 ఏళ్లు కూటమిగా ఉన్నాయి. మూడుసార్లు లోక్‌సభ, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి. -
'బీజేపీతో, అన్నాడీఎంకే పొత్తు ఉండదు'
చెన్నై: తమిళనాట బీజేపీ, అన్నాడీఎంకే మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎన్నికల సమయంలోనే చూసుకుంటామని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డీ జయకుమార్ సోమవారం చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురైపై ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఏఐడీఎంకే తీవ్రంగా స్పందించింది. దివంగత నేత జయలలితతో సహా అన్నాడీఎంకే నేతలపై అన్నామలై ఇటీవల విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని అన్నారు. అన్నామలైపై విమర్శలు గుప్పిస్తూ.. అన్నాదురైని అవమానిస్తే పార్టీ కార్యకర్తలు సహించరని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి జయకుమార్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నప్పటికీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి అన్నామలైకి ఇష్టం లేనట్లుంది. మా నేతలపై చేస్తున్న ఈ విమర్శలన్నీ మేం సహించాలా? బీజేపీ ఇక్కడ ఖాతా ఓపెన్ చేయలేదు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు తెలుసు.” అని అన్నాడీఎంకే నేత జయకుమార్ మండిపడ్డారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని జయకుమార్‌ను ప్రశ్నించగా.. వ్యక్తిగతంగా తాను మీడియాతో ఇలా మాట్లాడనని, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మాత్రమే మాట్లాడతానన్నారు. ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ.. -
యూపీలో ఒంటరిగానే పోటీ
లక్నో: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుండదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి ప్రకటించారు. అదేవిధంగా, యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతోనూ ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె పలు ట్వీట్లు చేశారు. ‘రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, అసదుద్దీన్‌కు చెందిన ఏఐఎంఐఎం పార్టీతో కలిసి పోటీ చేస్తుందంటూ ఓ టీవీ చానెల్లో నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఎంత మాత్రం నిజం కాదు. వాస్తవాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. ఇందులో ఇసుమంత కూడా నిజం లేదు. బీఎస్పీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది’అని పేర్కొన్నారు. పంజాబ్‌ను మినహాయిస్తే, యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోము’అని మాయావతి స్పష్టం చేశారు. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌తో ఇటీవల బీఎస్పీ జత్తు కట్టిన విషయం తెలిసిందే. యూపీలో 100 స్థానాల్లో పోటీ: ఎంఐఎం వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆలిండియా మజ్లిస్–ఇ– ఇత్తెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సారథ్యంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ), చిన్న పార్టీల కూటమి అయిన భాగీదారీ సంకల్ప్ మోర్చాతో కలిసి బరిలోకి దిగుతామన్నారు. ఎన్నికలకు సంబంధించి మరే ఇతర పార్టీలతోనూ తాము చర్చలు జరపలేదన్నారు. -
‘ఢిల్లీ’లో ఆప్‌తో పొత్తు ఉండదు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో తమ పార్టీ ఎలాంటి పొత్తు పెట్టుకోబోదని కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు సుభాశ్ చోప్రా శుక్రవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ సొంతంగానే మెజారిటీ స్థానాలు సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదంటూ ఆప్ ఇప్పటికే స్పష్టం చేసింది. మరి కొన్ని రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడనుంది. -
క్రేజీ కేజ్రీవాల్
లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైఖరి ఆయన చెప్పే మాటలకు అనుగుణంగా లేదు. బీజేపీని ఓడించడమే నిజంగా ఆయన లక్ష్యమైతే కాంగ్రెస్‌తో ఏదో ఒక రకంగా సీట్ల సర్దుబాటుకు ఆప్ అంగీకరించాలి. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుకు హరియాణా, చండీగఢ్‌లో సీట్ల సర్దుబాటుకు ఆయన ముడి పెడతున్నారు. ఈ రెండుచోట్లా తమకు కాంగ్రెస్ సీట్లు వదలకపోతే ఢిల్లీలో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని ముందే కేజ్రీవాల్ చెప్పేశారు. పొత్తులు పలు విధాలు.. పార్టీల మధ్య పొత్తులు రాష్ట్రాల వారీగా ఉంటాయనేది ఇప్పటికీ వర్తించే సూత్రం. ఈ లెక్కన బీజేపీని బలహీనం చేయాలన్న తన వైఖరికి అనుగుణంగా ఆయన వ్యవహరించడం లేదని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి. హరియాణాలో కాంగ్రెస్, జన నాయక్ జనతా పార్టీ (జేపీపీ), ఆప్ చేతులు కలిపి పోటీ చేస్తే బీజేపీని సునాయాసంగా ఓడించవచ్చన్న కేజ్రీవాల్ మాట నిజమే. అయితే, ఎన్నికల్లో పొత్తులు గరిష్ట స్థాయిలో కుదరవు. పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య చర్చలు జరిగినా సీట్ల సర్దుబాటు జరగలేదు. బీజేపీ ఉమ్మడి శత్రువు అయినా కేరళలో అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఇంత జరిగినా ఈ పార్టీలు తమిళనాడులో డీఎంకే నాయకత్వంలోని కూటమిలో చక్కగా భాగస్వాములయ్యాయి. బిహార్, ఝార్ఖండ్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిరింది. కాని, ఝార్ఖండ్‌లోని ఒక్క చాత్రా సీటు విషయంలో పేచీ వచ్చి రెండు పార్టీలూ అభ్యర్థులను నిలిపాయి. యూపీలో మహాగఠ్ బంధన్‌తో కాంగ్రెస్ ‘అవగాహన’ ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ తమ మహాగఠ్ బంధన్‌లో కాంగ్రెస్‌కు స్థానం కల్పించలేదు. అయితే, కాంగ్రెస్‌పై ఈ కూటమి రెండు సీట్లలో పోటీ పెట్టలేదు. కూటమికి చెందిన బడా నేతలు పోటీ చేస్తున్న ఏడు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపలేదు. ఈ రకంగా కాంగ్రెస్‌తో మహాగఠ్ బంధన్‌కు అవగాహన కుదిరింది. అంటే వివిధ రాజకీయ పక్షాల మధ్య పొత్తులు ఎప్పుడు, ఎక్కడ కుదురుతాయన్న విషయం ఆ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. ఒకచోట కుదిరిన సీట్ల సర్దుబాటు మరోచోట సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు అవసరంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నచ్చచెప్పగలిగారు. కాని, హరియాణాలో ఆప్ మిత్రపక్షమైన చౌటాలాల పార్టీ జేపీపీకి మూడు సీట్లు ఇప్పించడం ఆయనకు అంత తేలిక కాదు. కాంగ్రెస్‌తో పొత్తు కోరుకుంటున్నామంటూనే ఆప్ ఎందుకు రోజుకో రకంగా షరతులు పెడుతోంది? అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాంటప్పుడు కాంగ్రెస్ కేజ్రీవాల్ కోరినట్టే సీట్లు ఇవ్వాలని ఎందుకు అనుకుంటుంది? వాస్తవానికి ఈ ఏడాది ఆఖరులో లేదా 2020 జనవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల్లో మరోసారి విజయం సాధించడానికి ఏం చేయాలో ఆప్ అదే చేస్తోంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్ల కన్నా మళ్లీ రాజధాని ప్రాంతంలో గద్దెనెక్కడానికే ఆప్ ప్రా«ధాన్యం ఇస్తోంది. ఢిల్లీలో తమ మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడానికి కాంగ్రెసే కారణం కానీ, తాను కాదని ఇతరులను నమ్మించడానికి ఆప్ గట్టి కృషే చేస్తోంది. దేశ రాజధానిలోని ఏడు సీట్లనూ వీలైతే గెలుచుకోవడం ద్వారా బీజేపీని కొంత వరకైనా నిలువరించడమే కాంగ్రెస్ ఉద్దేశం. అందుకే చివరి క్షణం వరకూ ఆప్‌తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. -
ఢిల్లీలో త్రిముఖ పోరు
న్యూఢిల్లీ: ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పొత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్‌ల మధ్య నెలలుగా సాగుతున్న చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకూ ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్ కూడా సోమవారం ఆరు స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ ఆసక్తి చూపినా, పంజాబ్, హరియాణ, చండీగఢ్ల్లోనూ పొత్తు ఉండాల్సిందేనంటూ ఆప్ పట్టుబట్టింది. ఇది కాంగ్రెస్‌కు నచ్చలేదు. పొత్తు కుదుర్చుకునేందుకు ఎన్నోసార్లు చర్చలు జరిపినా విషయం కొలిక్కిరాలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. గతంలో ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఈశాన్య ఢిల్లీ నుంచి, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్‌ను న్యూఢిల్లీ నుంచి, తూర్పు ఢిల్లీ నుంచి అర్వీందర్ సింగ్ లవ్లీని కాంగ్రెస్ బరిలోకి దింపింది. దక్షిణ ఢిల్లీలో బరిలో దింపిన బాక్సర్ విజేందర్ 2008 బీజింగ్ ఒలంపిక్స్‌లో కాంస్య పతక విజేత. బీజేపీ కూడా తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను తాజాగా ప్రకటించింది. గతంలోనే ఆ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా తూర్పు ఢిల్లీ నుంచి క్రికెటర్ గౌతం గంభీర్‌ను, న్యూఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖిని బీజేపీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో మోదీ గాలి వీచిన కారణంగా ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లనూ బీజేపీ గెలుచుకుంది. నామినేషన్ వేసిన ఆప్ అభ్యర్థులు.. ఆప్ అభ్యర్థుల్లో ఆరుగురు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న బల్వీర్ సింగ్ జఖర్ గత గురువారమే నామినేషన్ దాఖలు చేయగా, పత్రాలను అసంపూర్తిగా నింపడంతో మరోసారి నామినేషన్ వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆయనను కోరింది. బల్వీర్ సింగ్ మినహా మిగిలిన ఆప్ అభ్యర్థులందరూ సోమవారం నామినేషన్లు వేశారు. వీరందరూ వేర్వేరు చోట్ల నామినేషన్లు వేయగా, ఆప్ కీలక నేతలు వారి వెంట వచ్చారు. అంతకుముందు అభ్యర్థులందరూ రోడ్ షోలు నిర్వహించారు. మా ప్రభుత్వ విజయాలను వివరిస్తాం: షీలా ఢిల్లీలో, కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తామని ఈశాన్య ఢిల్లీ అభ్యర్థిని, మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ చెప్పారు. ఢిల్లీలో జరగనున్న త్రిముఖ పోరుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీలో, 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. -
కలిస్తే గెలుస్తారు!
రాజధాని ఢిల్లీలో పొత్తుల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్.. అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్ మధ్య నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో మాత్రమే ఆప్‌తో చేతులు కలపడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉంటే, హరియాణా, చండీగఢ్‌లో కూడా పొత్తు ఉండాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. ఆరో దశలో భాగంగా మే 12న ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నామినేషన్లకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్లకు తుది గడువు ఉంది. ఇరు పార్టీల్లో పొత్తుల విషయమై ట్విట్టర్ మాధ్యమంగా యుద్ధం నడుస్తోందే తప్ప కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆప్‌కి స్నేహ హస్తం అందించడమే కాదు, ఏడు సీట్లలో నాలుగు ఇవ్వడానికి అంగీకరించారు. కానీ ఢిల్లీతో పాటుగా హరియాణా, చండీగఢ్‌లో పొత్తు ఉంటేనే తాము చేయి కలుపుతామని ఆప్ పట్టు పడుతోంది. ఢిల్లీలో పొత్తు వరకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని రాహుల్ అంటోంటే, ‘హరియాణలో 10 సీట్లు, చండీగఢ్‌లో ఒక ఎంపీ సీటు ఉన్నాయి. వాటిలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్‌కి ఫర్వాలేదా’ అంటూ ఆప్ నేత గోపాల్ రాయ్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. హరియాణాలో ‘ఊడ్చే’ సీన్ లేదు ఆప్–కాంగ్రెస్ ఢిల్లీలో కలిసి పోటీ చేస్తే బీజేపీని ఓడించే అవకాశాలు మెండుగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ హరియాణా, చండీగఢ్‌లో ఆ పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్ ఢిల్లీలో పొత్తుకి ప్రతిఫలంగా హరియాణా, చండీగఢ్‌లో అరవింద్ కేజ్రీవాల్‌తో చేతులు కలపడానికి సిద్ధంగా లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో మూడు పార్టీలూ విడివిడిగానే పోటీ చేశాయి. ఏడు నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కంటే ఆప్, కాంగ్రెస్‌లకు పడిన ఓట్లు ఎక్కువ. గత ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసింది. అదే హరియాణా రాష్ట్రాన్ని తీసుకుంటే ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా గొప్ప ఫలితాలేవీ దక్కలేదు. ఎన్డీయే కూటమి కంటే రోహ్తక్, సిర్సా స్థానాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు రాబట్టింది. రోహ్తక్ నియోజకవర్గం కాంగ్రెస్ పరమైతే, సిర్సా స్థానంలో నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) గెలుపొందింది. ఆప్ ఒక్కటంటే ఒక్క సీటూ సాధించలేక చతికిలబడింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కంటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కి వచ్చిన ఓట్లు చాలా తక్కువ. ఆప్ లోక్‌సభ ఎన్నికల పరాభవం నుంచి తేరుకోలేక పోటీకే దూరంగా ఉంది. ఎన్డీయే, కాంగ్రెస్, ఆప్ బలాబలాలను చూస్తే హరియాణా, చండీగఢ్ కంటే ఢిల్లీలో ఈ రెండు పార్టీలు కలిస్తేనే కమలనాథులకు చెక్ పెట్టవచ్చుననే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ, పంజాబ్‌లో బలం పెంచుకున్నట్టుగా హరియాణాలో ఆప్ పుంజుకోలేదు. వాస్తవానికి ఢిల్లీలో ఆప్‌కున్న ఓట్ల బలమంతా ఒకప్పుడు కాంగ్రెస్‌దే. బీజేపీకి తన ఓటు బ్యాంకు ఉండనే ఉంది. అందుకే ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కలిస్తే బీజేపీ హవాను అడ్డుకోవచ్చు. ఇక హరియాణాలో కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా ఒరిగేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సమయం కూడా మించిపోతుండటంతో ఈ రెండు పార్టీలు ఏ దిశగా అడుగులు వేస్తాయో చూడాలి. -
కాంగ్రెస్‌తో పొత్తు లేదు: ఆప్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తేల్చి చెప్పింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, హరియాణాల్లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరని కారణంగానే పొత్తు కుదరలేదని స్పష్టం చేసింది. ‘బీజేపీకి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే ఆప్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలనుకుంది. కానీ అందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదు. పొత్తులో భాగంగా మేం 18 సీట్లు అడిగాం. కానీ కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదు. ఇరు పార్టీలు కలిస్తే బీజేపీని ఓడించేవాళ్లం’అని ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విలేకరులతో వెల్లడించారు. -
వేడెక్కిన పొత్తు రాజకీయాలు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో ఎలాంటి పొత్తు ఉండదని, ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు ఒంటరిగానే పోటీచేస్తామని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ షీలా దీక్షిత్ తెలిపారు. ‘మేం ఒంటరిగానే పోటీచేయాలని సమష్టిగా నిర్ణయం తీసుకున్నాం. ఆప్‌తో ఎలాంటి పొత్తూ ఉండదు’ అని మంగళవారం పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఢిల్లీ పార్టీ నేతల సమావేశం అనంతరం షీలాదీక్షిత్ మీడియాతో చెప్పారు. ‘ఆప్‌తో పొత్తును రాహుల్ కూడా వ్యతిరేకించారు, ఇక మేం ఒంటరిగానే ప్రణాళిక రూపొందించుకుంటాం’ అని ఆమె మరోసారి స్పష్టం చేశారు. పార్టీ నాయకులతో కాంగ్రెస్ అధ్యక్షుడు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. మెజారిటీ నేతల అభిప్రాయంతోనే వెళ్ళాలని, పార్టీని బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకోవాలని ఆయన నేతలను కోరారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థులను నిర్ణయిస్తుందని షీలాదీక్షిత్ తెలిపారు. మూడు సీట్లు కాంగ్రెస్‌కి, మూడు ఆప్‌కి, ఒక సీటు స్వతంత్ర అభ్యర్థికి కేటాయించేలా ఆప్ కాంగ్రెస్‌కు ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా, ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకుగాను ఆప్ ఆరు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ఒంటరిగానే పోటీ చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుందని, వారిది అసహజ పొత్తుగా అభివర్ణించారు. కూటమిలో కాంగ్రెస్ భాగమే: అఖిలేశ్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తమ కూటమిలో కాంగ్రెస్ కూడా భాగమేనని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ కోసం తమ కూటమిలో రెండు సీట్లు కేటాయించామని వెల్లడించారు. మూడు నియోజకవర్గాలను కూటమిలో భాగంగా రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)కి అప్పగించేందుకు ఎస్పీ–బీఎస్పీలు అంగీకరించాయి. మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా, 37 చోట్ల ఎస్పీ, 38 చోట్ల బీఎస్పీ పోటీ చేస్తాయని గతంలోనే పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఆయన తల్లి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోమని ప్రకటించాయి. కాగా, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. -
రానున్న ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేస్తాం
-
పొత్తుల సమస్యే లేదు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్‌బబ్బర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయగల సత్తా తమకుందని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని ఆయన అన్నారు. రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే భారీ మెజారిటీ ఖాయమని ఇంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ యూపీ చీఫ్ మాట్లాడటం గమనార్హం. ఇక పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని రాజ్‌బబ్బర్ తీవ్రంగా విమర్శించారు. కేవలం కొద్దమంది తన స్నేహితులకు మేలు చేయడానికే ఆయనిలా చేశారని అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడుతోందని, దేశంలో స్వైపింగ్ సామ్రాజ్యం నడుపుతున్న కొద్దిమందికి దీనివల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికీ పెద్దనోట్ల రద్దు వల్ల సమస్యలు ఎదురయ్యాయన్నారు. -
కలవని కమలం
ఒంటరి పోరుకు సిద్ధం పీఎంకే తిరస్కృతి 234 మంది అభ్యర్థులతో ఢిల్లీలో జాబితా ఒంటరి పయనం సాగించేందుకు కమలం సిద్ధమైంది. పీఎంకే సైతం తమ ఆహ్వానాన్ని తిరస్కరించడంతో తదుపరి కసరత్తుల్లో కమలనాథులు మునిగారు. 234 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు. చెన్నై : కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వారి పాచికలు తమిళనాట పారడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో తమ చుట్టూ తిరిగిన పార్టీల కోసం, ప్రస్తుతం బీజేపీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. వారి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం శూన్యం. ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ బీజేపీని తిరస్కరించడంతో ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడ్డారని చెప్పవచ్చు. చివరి ప్రయత్నంగా డీఎండీకే అధినేత గాలం వేసినా ఫలితం శూన్యం. ఇక, పీఎంకేను దారిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగానే కలవని కమలం కుస్తీలు పట్టారు. ఓ దశలో బీజేపీ వైపుగా తలొగ్గినట్టు కన్పించిన పీఎంకే అధినేత రాందాసు ఓ మీడియాతో మాట్లాడుతూ ఎవరితోనూ పొత్తు లేదని స్పష్టం చేశారు. ఇక అన్నాడీఎంకే, డీఎంకేలతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమంటూనే, బీజేపీ మీద సానుకూలత వ్యక్తం చేసే వ్యాఖ్యలు సంధించినా, వారితో కలసి ముందుకు సాగడం ఇష్టం లేదని స్పష్టం చేయడం కమలనాథులకు షాక్ ఇచ్చినట్టు అయింది. పీఎంకే కలిసి వస్తుందనుకుంటే, వాళ్లు తమకు ఇష్టం లేదని స్పష్టం చేయడంతో ఇక, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ ప్రయత్నాల్ని కమలం పెద్దలు వేగవంతం చేశారు. ఇప్పటికే 234 స్థానాలకు గాను అభ్యర్థుల్ని సిద్ధం చేసి ఢిల్లీకి పంపించిన పార్టీ వర్గాలు, ఇక జా బితాకు ఆమోద ముద్ర పడగానే, ఎన్నికల పనుల్ని వేగవంతం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ సమావేశాల్లో తమిళనాడు ఎన్నికల వ్యవహారాలపై నాయకులతో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమాలోచించి ఉన్నారు. పార్టీలు కలిసి రాని పక్షంలో మద్దతు ఇచ్చిన సంఘాలు, చిన్న చితక పార్టీలతో కలసి ఒంటరిగానే ఎన్నికల్ని ఎదుర్కొందామన్న సంకేతాన్ని అమిత్ షా ఇచ్చి ఉండటంతో పార్టీ వర్గాలు అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలబెడదామని కలసి వచ్చే వారికి బీజేపీ చిహ్నం మీదే పోటీకి సీట్లు ఇస్తామన్న సూచనను చిన్న చితక పార్టీలు, సంఘాలకు అమిత్ షా సంకేతాన్ని పంపుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా కమలనాథులు పేర్కొంటుండడం గమనార్హం. చెన్నైకు రెండు మూడు రోజుల్లో రానున్న పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ ఒంటరి నినాదంతో పాటుగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని చెబుతున్నారు. -
కిష్టారెడ్డి తనయుడికే పార్టీ టికెట్: ఉత్తమ్
న్యూఢిల్లీ: వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు తమకు బాధ కలిగించాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఓటమి, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. ఇతర పార్టీల సహకారం తీసుకుని శాసన మండలి ఎన్నికల్లో ముందుకు వెళతామన్నారు. సమన్వయ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికలో దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడే పార్టీ అభ్యర్థి అని ఆయన వెల్లడించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. -
'వైఎస్ఆర్ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు'
ఒంగోలు : రాష్ట్ర విభజన ప్రక్రియలో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ముసుగులో క్రియాశీలక పాత్ర పోషించారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఆదివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆఖరి ఘట్టం వరకూ పదవిలో ఉండి ఆ తర్వాత కిరణ్ రాజీనామా చేశారని మండిపడ్డారు. విభజనకు సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులకు ప్రజల మధ్యకు వచ్చే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని బాలినేని తెలిపారు. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తలకు జగన్ న్యాయం చేస్తారని ఆయన తెలిపారు. -
రాష్త్రంలో ఒంటరిపోరుకు సిద్ధమౌతున్న బిజెపి
-
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదు