ఒంటరి పోరుకు సిద్ధం
పీఎంకే తిరస్కృతి
234 మంది అభ్యర్థులతో ఢిల్లీలో జాబితా
ఒంటరి పయనం సాగించేందుకు కమలం సిద్ధమైంది. పీఎంకే సైతం తమ ఆహ్వానాన్ని తిరస్కరించడంతో తదుపరి కసరత్తుల్లో కమలనాథులు మునిగారు. 234 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు.
చెన్నై : కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వారి పాచికలు తమిళనాట పారడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో తమ చుట్టూ తిరిగిన పార్టీల కోసం, ప్రస్తుతం బీజేపీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. వారి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం శూన్యం. ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ బీజేపీని తిరస్కరించడంతో ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడ్డారని చెప్పవచ్చు. చివరి ప్రయత్నంగా డీఎండీకే అధినేత గాలం వేసినా ఫలితం శూన్యం. ఇక, పీఎంకేను దారిలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగానే కలవని కమలం
కుస్తీలు పట్టారు. ఓ దశలో బీజేపీ వైపుగా తలొగ్గినట్టు కన్పించిన పీఎంకే అధినేత రాందాసు ఓ మీడియాతో మాట్లాడుతూ ఎవరితోనూ పొత్తు లేదని స్పష్టం చేశారు. ఇక అన్నాడీఎంకే, డీఎంకేలతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమంటూనే, బీజేపీ మీద సానుకూలత వ్యక్తం చేసే వ్యాఖ్యలు సంధించినా, వారితో కలసి ముందుకు సాగడం ఇష్టం లేదని స్పష్టం చేయడం కమలనాథులకు షాక్ ఇచ్చినట్టు అయింది. పీఎంకే కలిసి వస్తుందనుకుంటే, వాళ్లు తమకు ఇష్టం లేదని స్పష్టం చేయడంతో ఇక, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ ప్రయత్నాల్ని కమలం పెద్దలు వేగవంతం చేశారు.
ఇప్పటికే 234 స్థానాలకు గాను అభ్యర్థుల్ని సిద్ధం చేసి ఢిల్లీకి పంపించిన పార్టీ వర్గాలు, ఇక జా బితాకు ఆమోద ముద్ర పడగానే, ఎన్నికల పనుల్ని వేగవంతం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ సమావేశాల్లో తమిళనాడు ఎన్నికల వ్యవహారాలపై నాయకులతో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమాలోచించి ఉన్నారు. పార్టీలు కలిసి రాని పక్షంలో మద్దతు ఇచ్చిన సంఘాలు, చిన్న చితక పార్టీలతో కలసి ఒంటరిగానే ఎన్నికల్ని ఎదుర్కొందామన్న సంకేతాన్ని అమిత్ షా ఇచ్చి ఉండటంతో పార్టీ వర్గాలు అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు.
అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలబెడదామని కలసి వచ్చే వారికి బీజేపీ చిహ్నం మీదే పోటీకి సీట్లు ఇస్తామన్న సూచనను చిన్న చితక పార్టీలు, సంఘాలకు అమిత్ షా సంకేతాన్ని పంపుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా కమలనాథులు పేర్కొంటుండడం గమనార్హం. చెన్నైకు రెండు మూడు రోజుల్లో రానున్న పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్ ఒంటరి నినాదంతో పాటుగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని చెబుతున్నారు.
కలవని కమలం
Published Sun, Mar 20 2016 9:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement