ఢిల్లీలో ఒంటరి పోరే..! | No alliance in Delhi Assembly elections says Delhi Congress chief | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఒంటరి పోరే..!

Published Sun, Dec 1 2024 6:13 AM | Last Updated on Sun, Dec 1 2024 6:13 AM

No alliance in Delhi Assembly elections says Delhi Congress chief

ఆప్‌తో పొత్తు లేకుండానే బరిలో దిగాలని కాంగ్రెస్‌ నిర్ణయం 

70 స్థానాల్లో పోటీకి కాంగ్రెస్‌ సిద్ధం 

ప్రకటించిన ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవేందర్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీతో రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలనే నిశ్చయానికి వచ్చింది. బీజేపీతో ప్రత్యక్షపోరు కొనసాగిస్తున్న మాదిరే ఆప్‌తోనూ అదే వైఖరిని అవలించాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఢిల్లీ నేతలకు సూచనలు చేసింది. 

ఢిల్లీలో షీలాదీక్షిత్‌ హయాంలో వరుసగా 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గడిచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేదు. మొన్నటి లోక్‌సభలో ఆప్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా రెండు పార్టీలు ఒక్క సీటును గెలువలేకపోయాయి. అనంతరం జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల పొత్తు ఉంటుందని భావించినా, సీట్ల పంపకాలలో విభేదాలతో పొత్తు కుదరలేదు. 

దీంతో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాయి. 6 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఓటమికి ఆప్‌ ప్రత్యక్ష కారణమైంది. హరియాణా ఓటమి నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవాల న్నా, ఓట్ల చీలికను ఆపాలన్నా రెండు పార్టీలు కలిసి పోటీ చేయడమే ఉత్తమమనే భావనను కొంతమంది నేతలు వ్యక్తం చేశారు. అయితే ఆప్‌ పార్టీలోని సోమ్‌నా«థ్‌ భారతి వంటి కీలక నేతలు పొత్తును వ్యతిరేకిస్తున్నారు. 

కాంగ్రెస్‌తో పొత్తుతో ఆప్‌కు ఒనగూరే ప్రయోజనం ఏమీలేదని, పైగా బీజేపీకి విమర్శల దాడిని అ్రస్తాన్ని అందించినట్లు అవుతుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇటీవల జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గే లు హాజరయ్యారు. కార్యక్రమంలో కేజ్రీవాల్, రాహుల్, ఖర్గేలు చాలాసేపు ముచ్చటించుకోవడం సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఈ నేపథ్యంలో ఆప్‌తో పొత్తు ఖాయమైందని చా లా మంది భావించారు. శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ స మావేశం సందర్భంగా పొత్తు అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తు ఉంటుందని ఎక్కువ మంది భావిస్తున్న వేళ కాంగ్రెస్‌ అనూహ్య నిర్ణ యం తీసుకుంది. ఎలాంటి పొత్తులు ఉండవ ని ఒంటరి పోరుకు సిద్ధం కావాలని అధిష్టాన పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. 

దీనిపై పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేందర్‌ యాదవ్‌ శనివారం ఒక ప్రకటన చేశారు. ‘ఢిల్లీ రాష్ట్రంలో ఆప్‌ పరిపాలనలో వృద్ధులకు పింఛన్లు అందడం లేదు. పేదలకు రేషన్‌కార్డు అందడం లేదు. రోడ్లు పాడైపోయాయి. కాలుష్యం అదు పు తప్పింది. యువత నిరుద్యోగులయ్యారు.

 ద్రవ్యోల్బణంతో మహిళలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కేవలం ప్రదర్శన కోసమే ఆమ్‌ ఆద్మీ పార్టీ మొహల్లా క్లినిక్‌లను తెరిచింది. ఇదీ కేజ్రీవాల్‌ మోడల్‌’అంటూ విమర్శలు గుప్పించారు. అటు బీజేపీ, ఇటు ఆప్‌ రెండూ ఢిల్లీ సర్వనాశనం చేశాయన్నారు. రెండు పార్టీలను ఒంటరిగా ఎదుర్కొంటామని, ముఖ్యమంత్రి ఎవరనేది ఫలితాల అనంతరం నిర్ణయిస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ చేసే ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement