Devender
-
పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేతలు!
సిరిసిల్ల: సీపీఐ (ఎంఎల్) జనశక్తి పార్టీ అగ్రనేతలు కూర రాజన్న అలియాస్ రాజేందర్, కూర దేవేందర్ అలియాస్ అమర్, వెంకటేశ్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు విమలక్క, కొమురన్న, సంతోష్ గురువారం ప్రకటించారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తున్న రాజన్న, అతనితోపాటు ఉన్న వెంకటేశ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అమర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 12 రకాల అనారోగ్య సమస్యలతో ఉన్న కూర రాజన్నతోపాటు అతని సహాయకుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురికి సంబంధించిన ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. పోలీసులు వెంటనే వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి, ఏమైనా కేసులుంటే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. కాగా, కూర రాజన్న, అమర్, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం సమీపంలోని ఒక తోటలో విచారిస్తున్నట్లు తెలిసింది. -
ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి
వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కేశబోయిన దేవేందర్(34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాత్రి ప్యాసింజర్‌ను దించి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆటో బోల్తా కొట్టడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
సచివాలయం నిర్మాణ పనుల్లో ప్రమాదం
-
తాత్కాలిక సచివాలయంలో కూలిన గోడ
సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయంలోని మొదటి భవనం మొదటి అంతస్తులో సైడ్ గోడ కూలి జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు కూలీలు గాయపడ్డారు. మొదటి అంతస్తు చివరి భాగం కుడి వైపున అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం సిమెంట్ ఇటుకలతో గోడ నిర్మిస్తుండగా ఉన్నట్లుండి కూలింది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న దేవేందర్‌పై ఇటుకలు పడటంతో వెన్నెముక, కాలు విరిగింది. రామచంద్ర ఓకై కాలు, చెయ్యి విరగడంతో పాటు తలకు తీవ్రగాయమైంది. ధర్మేంద్ర, జాయరాం, కిషోర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. కాగా, తాత్కాలిక సచివాలయం నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిర్మాణ పనుల కోసం పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. మే నెలలో ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందడంతో పని ఒత్తిడి పెరిగిందని, భద్రత లేదని కూలీలంతా ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మరో కూలీ మృతి చెందాడు. ఈ ప్రాంతం లూజ్ సాయిల్ కావడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే మందడం గ్రామంలో నిర్మాణంలో ఉన్న గోపిరెడ్డి భవనం కుంగిపోవడం కలకలం రేపింది. ఆ తర్వాత తాత్కాలిక సచివాలయం రెండవ భవనం గ్రౌండ్‌ఫ్లోర్ కింది భాగం కుంగింది. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి మరమ్మతులు చేశారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. వరంగల్ జిల్లా శాయంపేట మండలం పెద్దకొండెపాక గ్రామానికి చెందిన గట్టు దేవేందర్, నజియా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి నుంచి వీరు అదృశ్యమయ్యారు. కాగా, బుధవారం ఉదయం గ్రామ శివారులో పొలాల్లో పురుగుల ముందు సేవించగా స్థానికులు గమనించి పరకాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. -
విద్యార్థినికి తండ్రి మరణం తెలియనీయలేదు...
పదో తరగతి పరీక్ష రాసే ఓ విద్యార్థిని తండ్రి ప్రమాదవశాత్తూ మృతి చెందగా... ఆ విషయం తెలిస్తే అతడి కుమార్తె పరీక్షపై ప్రభావం పడుతుందని తెలియనీయలేదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గుడికందుల దేవేందర్ (41) కట్రియాల పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులకు వెళ్లగా... అక్కడ కింద పడి తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు. దేవేందర్ కుమార్తె కావ్యశివాని సోమవారం పదో తరగతి పరీక్ష రాయాల్సి ఉంది. తండ్రి మరణం విషయాన్ని ఆమెకు తెలియకుండా ఉంచడంతో... కావ్య యథావిధిగా పరీక్ష రాయడానికి వెళ్లింది. ఆమె పరీక్ష నుంచి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
యువకుడి ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన దేవేందర్(16) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే: దేవేందర్
రామాయంపేట: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా కార్యదర్శి పోలీస్ దేవేందర్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, భద్రాచలంపై సీమాంధ్రులకు ఎలాంటి హక్కులు ఉండవని తెలిపారు. సోదర భావంతో విభజనకు సహకరించాలని కోరారు. ఆయనతో టీఎంవీఎస్ జిల్లా కన్వీనర్ కర్రె రమేశ్ ఉన్నారు.