విద్యార్థినికి తండ్రి మరణం తెలియనీయలేదు... | The Family kept Secret about father's death with a tenth student 's | Sakshi
Sakshi News home page

విద్యార్థినికి తండ్రి మరణం తెలియనీయలేదు...

Published Mon, Mar 21 2016 11:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM

The Family kept Secret about father's death with a tenth student 's

పదో తరగతి పరీక్ష రాసే ఓ విద్యార్థిని తండ్రి ప్రమాదవశాత్తూ మృతి చెందగా... ఆ విషయం తెలిస్తే అతడి కుమార్తె పరీక్షపై ప్రభావం పడుతుందని తెలియనీయలేదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గుడికందుల దేవేందర్ (41) కట్రియాల పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులకు వెళ్లగా... అక్కడ కింద పడి తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు.

దేవేందర్ కుమార్తె కావ్యశివాని సోమవారం పదో తరగతి పరీక్ష రాయాల్సి ఉంది. తండ్రి మరణం విషయాన్ని ఆమెకు తెలియకుండా ఉంచడంతో... కావ్య యథావిధిగా పరీక్ష రాయడానికి వెళ్లింది. ఆమె పరీక్ష నుంచి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement