
ఎస్సార్‌ఎస్పీ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఓ కుమారుడు మృతి చెందగా, తండ్రి కూతురు గల్లంతయ్యారు. తల్లిని స్థానిక రైతులు కాపాడారు.
సాక్షి, వరంగల్ జిల్లా: ఎస్సార్‌ఎస్పీ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో కుమారుడు మృతి చెందగా, తండ్రి కూతురు గల్లంతయ్యారు. తల్లిని స్థానిక రైతులు కాపాడారు. సంగెం మండలం తీగరాజు పల్లి వద్ద ఘటన జరిగింది. మేత రాజు పల్లి నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.
పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె సాయి చరిత, కుమారుడు హర్షవర్ధన్‌తో కలిసి హన్మకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యలో కారు డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్‌కు గుండెపోటు రాగా, చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నించారు.
గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానిక రైతుల సాయంతో కృష్ణవేణి బయటపడ్డగా.. కుమారుడు మృతి చెందాడు. కారుతో సహా ప్రవీణ్, సాయి చరిత నీటిలో గల్లంతయ్యారు. ప్రవీణ్, చైత్రసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.