tenth class student
-
నాన్నా.. నన్ను కాపాడు
కౌటాల: ‘నాన్నా.. నన్ను కాపాడు’.. తీవ్ర జ్వరంబారిన పడిన ఓ టెన్త్ విద్యార్థిని తన తండ్రితో పలికిన చివరి మాటలు ఇవి. దీంతో ఆ తండ్రి మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. కుమా ర్తె మృతిని తట్టుకోలేకపోతున్న తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గుండాయిపేటకు చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ (16) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ టెన్త్ చదువుతోంది. జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా జ్వరమొచి్చంది.. చేతనైతలేదు.. కాళ్లు చేతులు గుంజుతున్నయ్.. ఇంటికి తీసుకుపో’అని చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని తనను కాపాడాలని కోరింది. దీంతో తండ్రి ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. కాగా, గుండాయిపేట గ్రామంలో కొద్ది రోజులుగా విష జ్వరా లు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
‘హాయ్ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడి తట్టుకోలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన రాయుడు శ్రీ వెంకటేశ్వర్లు కుటుంబం కేవీఆర్ టవర్స్‌లో నివాసముంటోంది. కుమార్తె సంజన(14) పటాన్చెరు బీరంగూడలోని అకడమిక్ పబ్లీక్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. శుక్రవారం సంజన పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. అనంతరం తన బెడ్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. చాలా సేపటి వరకు సంజన బయటికి రాకపోవడంతో తల్లి శిరీష, సోదరుడు మోహిత్‌లు తలుపులు తట్టగా ఎలాంటి ఉలుకు, పలుకు లేదు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా సీలింగ్ ప్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఓ పేపర్‌పై హాయ్ అమ్మా... నాన్న.. మోహిత్ నేను అసలు ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి... ఐ లవ్ యూ అని రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తించారు. చదువులో ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక అంచనలో తేలింది. -
టెన్త్ విద్యార్థినిపై తోటి విద్యార్థుల.. గ్యాంగ్‌రేప్
సాక్షి, హైదరాబాద్: బడికెళ్లి చదువుకోవాల్సిన వయసులో అత్యంత దారుణానికి ఒడిగట్టారు. తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్ఫోన్లో వీడియోలు తీసి, బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ అకృత్యానికి పాల్పడింది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు. రాజధాని శివారులోని హయత్‌నగర్‌లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్లను హయత్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని తట్టి అన్నారంలోని ఓ పాఠశాలలో ఐదుగురు బాలురు పదో తరగతి చదువుతున్నారు. అశ్లీల వీడియోలకు బానిసలుగా మారిన వీరు.. తోటి విద్యార్థిని (17)పై కన్నేశారు. ఒకే తరగతి కావడంతో ఆ విద్యార్థిని వారితో సన్నిహితంగా ఉండేది. ఇదే అదనుగా ఆమెపై లైంగిక దాడి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాధితురాలి ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోవడం.. ఆమె ఒంటరిగా ఉండటం చూసి.. ఈ ఐదుగురు బాలురు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని నిందితుల్లో ఒకడు సెల్ఫోన్లో రికార్డ్ కూడా చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన బాధితురాలు జరిగిన ఘాతుకాన్ని ఎవరికీ చెప్పకుండా మిన్నుకుండిపోయింది. బెదిరించి మళ్లీ.. మళ్లీ.. పది రోజుల తర్వాత నిందితుల్లో ఒకడు.. ఆ వీడియోను బాధితురాలికి చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. మరోసారి అత్యాచారం చేసి, దీన్ని కూడా సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియోను మిగిలిన నలుగురికి వాట్సాప్ ద్వారా షేర్ కూడా చేశాడు. ఇలా నిందితులు పలుమార్లు బెదిరింపులకు పాల్పడుతూ.. అత్యాచారం చేస్తుండటంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు గత ఆదివారం హయత్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురు నిందితులపై పోక్సో చట్టంతోపాటు అసభ్యకర వీడియోను చిత్రీకరించి, ఫార్వర్డ్ చేసినందుకు ఐటీ చట్టం సెక్షన్ 67ఏ, 67బీ కింద కూడా కేసులు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు 24 గంటల్లోనే ఐదుగురు మైనర్ నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. అనంతరం జువెనైల్ హోంకు తరలించారు. వీడియోలు ప్రచారం చేయొద్దు ఈ కేసుకు సంబంధించి మైనర్ల అత్యాచార వీడియోను ఎవరూ కూడా ఫార్వర్డ్ చేయొద్దని రాచకొండ పోలీసులు చెప్పారు. ఎవరైనా ఈ వీడియోలు చూసినట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేస్తే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: (Hyderabad: పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం) -
పదో తరగతి విద్యార్థిని మృతి.. ఆస్పత్రి ముట్టడి
సాక్షి, చెన్నై(అన్నానగర్): మన్నడి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన పదో తరగతి విద్యార్థిని చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందినట్టు ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై తండయార్ పేట ఎంపీటీ కాలనీకి చెందిన రమేష్ చెన్నై పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య వసంతి, కుమార్తె నందిని (15) ఉన్నారు. కుమార్తె నందిని తండయార్ పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రమేష్, వసంతి దంపతులకు నందిని ఏకైక సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. ఈ స్థితిలో నందినికి కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం చెన్నైలోని మన్నడి ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నందిని బుధవారం సాయంత్రం చికిత్స ఫలించక మృతి చెందింది. ఈ వార్త విని దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు కూతురి మృత దేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందంటూ నందిని తల్లిదండ్రులు, బంధువులు ప్రైవేట్ ఆస్పత్రిని ముట్టడించి డాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. -
డాడీ వెరీ బ్యాడ్.. నరకం చూపిస్తున్నాడు!
నందిగామ: పదో తరగతి పరీక్షలు రాయాల్సిన ఆ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. సోమవారం నుంచి పరీక్షలకు హాజరు కావాల్సిన ఆమె తన తండ్రి వేధింపులకు తాళలేక తనువు చాలించింది. ‘‘మా డాడీ వెరీ బ్యాడ్. అతడిని నాన్న అని పిలవాలంటేనే అసహ్యం వేస్తోంది. నరకం చూపి స్తున్నాడు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా’ అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. నందిగామ మండలం బుగ్గోనిగూడకు చెందిన మొగిలిగిద్ద నర్సింహ భార్య గతేడాది చనిపోవడం తో కొడుకు శ్రవణ్ కుమార్, కూతురు మనీషా అలి యాస్ అనుషా (16)తో కలసి ఉంటున్నాడు. మనీషా చేగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో పదో తరగతి చదువుతుండగా, శ్రవణ్ సమీపంలోని కాన్హా శాంతి వనంలో ఎలక్ట్రికల్ స్టోర్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. నర్సింహ నిత్యం తాగొచ్చి కొడుకు, కూతురుతో గొడవ పడేవాడు. దీంతో శ్రవణ్ తాను పనిచేస్తున్నచోటనే నివాసం ఉంటు న్నాడు. ఇదే అదనుగా భావించిన నర్సింహ తన కూతురును మరింత వేధింపులకు గురిచేసేవాడు. తండ్రి వేధింపుల గురించి ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపో యిన మనీషా ఆదివారం ఇంట్లో ఉరేసుకుంది. రోజుమాదిరిగా తాగి రాత్రి ఇంటికి వచ్చేసరికి కూతురు విగతజీవిగా పడి ఉండటంతో కొడుక్కి ఫోన్ చేశాడు. శ్రవణ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి వేధింపులు భరించలేక, అవమానాలను తట్టుకోలేకనే చెల్లి ఆత్మహత్య చేసుకుందని శ్రవణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు. ఆత్మహత్య లేఖలో ఏముందంటే.. ఘటనాస్థలంలో లభించిన నోటుపుస్తకంలో ఆత్మ హత్యకు గల కారణాలను మనీషా స్పష్టంగా పేర్కొంది. ‘ఐ హేట్ మై డాడ్’అని నాలుగుసార్లు, మా నాన్న మంచివాడు కాదు, దరిద్రుడు, గలీజో డు. నాన్న అని పిలవడానికి కూడా చాలా అస హ్యం వేస్తోంది. నాన్నను చంపాలని ఉంది. లేదా నేనన్నా చావాలని ఉంది. ఐ యాం వెయింటింగ్ ఫర్ డెత్’ అని రాసి ఉన్న లేఖ అక్కడ లభించింది. కాగా, నిందితుడు నర్సింహను పోలీసులు అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
Viral Video: ఓరిని తెలివి సల్లగుండా.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా!
చండీగఢ్: కొందరు విద్యార్థులు చదవడంలో చూపించని శ్రద్ధ.. పరీక్షలో కాపీ కొట్టే సమయంలో బాగా ప్రదర్శిస్తారు. చీటింగ్ చేసేందుకు ఉన్న అన్ని రకాల పద్దతులను ప్రయత్నిస్తుంటారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీని సైతం కాపీ కొట్టడంలో తెగ వాడేస్తుంటారు. చిట్టిలు పట్టుకెళ్తే దొరికిపోతామని భావించి.. స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, మొబైల్స్ ద్వారా కూడా మాస్ కాపింగ్‌కు పాల్పడే అపర మేధావులున్నారు. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థి హై లెవల్లో కాపింగ్‌కు పాల్పడి అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు.. హార్యానాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫతేహాబాద్లో ఓ విద్యార్థి చీటింగ్ పాల్పడ్డాడు. ఇంగ్లీష్ పరీక్ష రోజున గ్లాస్ క్లిప్‌బోర్డును ఉపయోగించాడు. అందులో రహస్యంగా అమర్చిన మొబైలోని కొన్ని యాప్స్, వాట్సాప్ ఉంది. వీటిలో సబ్జెక్టుకు సంబంధించిన కంటెంట్‌ను భద్రపరుచుకున్నాడు. దీని ద్వారా పరీక్షల్లో చూసి రాస్తున్నాడు. అయితే పాపం విద్యార్థి తెలివి తేటలు అధికారులకు తెలిసిపోయాయి. గమనించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి విద్యార్థిని పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. One of the examinees got a smartphone fitted in the clipboard for cheating in exam at an examination centre in Fatehabad district of #Haryana in the Board examination being conducted by the Board of School Education. The flying squad detected use of unfair means. @thetribunechd pic.twitter.com/aCXejWV1Sa — Deepender Deswal (@deependerdeswal) April 5, 2022 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని జర్నలిస్ట్ దీపేందర్ దేశ్వాల్ షేర్ చేశారు. ‘బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న పరీక్షలో ఫతేబాద్ హార్యానాలోని జిల్లాలో ఒక పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థి క్లిప్‌బోర్డ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను అమర్చి కాపియింగ్ పాల్పడ్డాడు. దీనిని ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తించారు’. అని పేర్కొన్నారు. కాగా ఇంగ్లీష్ పరీక్ష రోజు సుమారు 457 మంది విద్యార్థులు మోసాలకు పాల్పడ్డారు. భువా పరీక్షా కేంద్రంలో పదో తరగతి విద్యార్థి కార్పెట్ కింద దాచిన మొబైల్ ఫోన్‌ను స్కాడ్ సిబ్బంది గుర్తించారు. అలాగే బిర్దానా పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి ప్యాంట్లో, మరో విద్యార్థిని షర్ట్‌లో ఉన్న చీటీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్ విద్యార్థి..
సాక్షి, నిజామబాద్: జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండ లంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి తొర్లికొండలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. అయితే మంగళవారం ఉదయం హాస్టల్ నుంచి పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో రెండో పీరియడ్ జరుగుతున్న సమయంలో సదరు విద్యార్థి వచ్చినట్లు తెలిపారు. తరగతులు జరుగుతున్న సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడని తెలిపారు. గట్టిగా శబ్ధం రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి చూశారు. విద్యార్థికి తీవ్రగాయాలవడంతో 108 అంబులెన్స్‌లో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే కిరణ్ ఓ బాలికను ఏడో తరగతి నుంచే ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వివరాలు అడగగా తాను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు. పాఠశాల ఆవరణలో కింద ఓ అమ్మాయితో కాసేపు మాట్లాడానని పేర్కొన్నాడు. అదే సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని చెప్పాడు. ఇద్దరి మధ్య ప్రేమ విఫలం కావడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి ఎంఈవో శ్రీనివాస్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపి వచ్చి సదరు విద్యార్థితో మాట్లాడారు. -
Hyderabad: కృష్ణానగర్‌లో దారుణం.. బౌలింగ్ సరిగా వేయలేదని..
సాక్షి, హైదరాబాద్: కృష్ణానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. స్థానిక సాయికృప పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థుల మధ్య వివాదం జరిగి ఘర్షణ పడ్డారు. తరగతి గదిలో క్రికెట్ ఆడుతూ బౌలింగ్ సరిగా వేయడం లేదంటూ నలుగురు విద్యార్థులు ఘర్షణ పడి ఒకిరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (గుడ్‌న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం) -
రాజేంద్రనగర్‌లో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఓ యువకుడు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్‌పై హిమాయత్‌సాగర్ వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అత్యాచారం అనంతరం తిరిగి బాధిత యువతిని నిందితుడు ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. అయితే తనపై జరిగిన అత్యాచార ఘటన గూర్చి ఇంట్లో ఉన్న తల్లితో బాధితురాలు చెప్పుకుంది. దీంతో వెంటనే తల్లి, బాధితురాలుతో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకునిపై అత్యాచార కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఏడాది పాటు కాపురం.. మోజు తీరాక..) -
తండ్రి గేమ్ ఆడొద్దన్నాడని ఇంటర్ విద్యార్థిని దారుణం..
సాక్షి, రంగారెడ్డి : సెల్ఫోన్లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఇంటర్ విద్యారి్థని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాపూర్‌కు చెందిన వెల్దుర్తి మనోహరాచారి, లావణ్య దంపతులు. పదేళ్లుగా మీర్‌పేట సర్వోదయనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి కుమార్తెలు కౌశికి (17), అనుశ్రీ, కుమారుడు రేవంత్ ఉన్నారు. పెద్ద కుమార్తె కౌశికి ఐఎస్‌సదన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తరచూ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండడాన్ని గమనించిన తండ్రి ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గేమ్స్ ఆడడం ఆపేసి పడుకోవాలని మందలించి బయటకు వెళ్లాడు. చదవండి: ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది! మనస్తాపానికి గురైన కౌశికి క్షణికావేశంలో బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకుని చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గదిలో నుంచి అరుపులు వినపడడంతో గమనించిన తల్లి కిటికీలోంచి చూడగా కౌశికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అదే గదిలో పడుకున్న చిన్న కుమార్తె అరుపులకు లేచి గడియ తీసింది. వెంటనే తల్లి స్థానికుల సాయంతో కౌశికిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. చదవండి: చెరువులో మునిగి నలుగురు హైదరాబాద్ యువకులు మృతి -
విద్యార్థి ముఖం పగలకొడతానన్న ఎమ్మెల్యే.. ఆడియో క్లిప్ వైరల్
తిరువనంతపురం: సాయం చేయాల్సిందిగా కోరుతూ ఓ పదవ తరగతి విద్యార్థి తన నియోజకర్గ ఎమ్మెల్యేకు కాల్ చేశాడు. సాయం సంగతి దేవుడేరుగు.. కనీసం మర్యాదగా కూడా మాట్లాడలేదు. ‘‘నా నంబర్ ఎవరు ఇచ్చారు.. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉండుంటే నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ ఎమ్మెల్యే. వీరి సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు.. కేరళ, కొల్లాం సీపీఐ (ఎం) ఎమ్మెల్యే, నటుడు ఎం. ముఖేష్‌కు రెండు రోజుల క్రితం అతడి నియోజకవర్గానికి చెందిన ఓ పదవి తరగతి విద్యార్థి కాల్ చేశాడు. తను ఎదుర్కొంటున్న ఓ సమస్య గురించి చెప్పి.. ఎమ్మెల్యేను సాయం చేయాల్సిందిగా కోరాడు. ఆగ్రహించిన ఎమ్మెల్యే నా నంబర్ నీకు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. దానికి ఆ విద్యార్థి స్నేహితుడి వద్ద నుంచి తీసుకున్నానని చెప్పగా.. ముఖేష్ ఆగ్రహంతో ‘‘నీ స్నేహితుడి ముఖం పగలకొట్టాలి.. ఈ సమయంలో నీవు నా ఎదురుగా ఉంటే.. క్యాన్ తీసుకుని నీ ముఖం పగలకొట్టేవాడిని’’ అంటూ దురుసుగా మాట్లాడాడు. విద్యార్థి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.. చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్యే ప్రవర్తనకు భయపడిన సదరు విద్యార్థి తప్పయ్యింది సార్.. క్షమించండి అని కోరాడు. కానీ ముఖేష్ విద్యార్థి మాటలు వినకుండా.. అతడిపై మండి పడ్డాడు. ఎమ్మెల్యే-విద్యార్థి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే ముఖేష్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ముఖేష్ దీనిపై వివరణ ఇస్తూ.. ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనిలో ముఖేష్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నాకు అవిరామంగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. గంటలో నా ఫోన్ చార్జింగ్ అయిపోతుంది. ఎవరేవరో నాకు కాల్ చేసి.. మా ఏరియాలో కరెంట్ లేదు.. రైళ్లు ఎందుకు సక్రమంగా తిరగడంలేదని.. ఏవేవో ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారు.. ప్లాన్ ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టడానికే ఇలా కాల్ చేస్తున్నారు.. కానీ ఇప్పటి వరకు వారికి ఆ అవకాశం లభించలేదు. ఇక ఆ రోజు కూడా నేను జూమ్ మీటింగ్‌లో ఉండగా ఓ విద్యార్థి నాకు కాల్ చేసి ఇలానే మాట్లాడాడు. నేను ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నాను. ఆ విద్యార్థి నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు. సమావేశం డిస్టర్బ్ అయ్యింది. ఆ కోపం, విసుగులోనే నేను సదరు విద్యార్థిని కోడతాను అన్నాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదని’’ ఎమ్మెల్యే ముఖేష్ తెలిపారు. -
‘దయచేసి ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయండి’
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వరప్రసాద్ అనే యువకుడు వేధించడంతో టెన్త్ క్లాస్ విదార్థిని సౌమ్య పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. వరప్రసాద్ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు చేసుకున్నట్టు సౌమ్య వెల్లడించింది. వరప్రసాద్ వల్లే తాను చనిపోతున్నానని బాధితురాలు వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. అతన్ని కఠినంగా శిక్షించాలని కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా.. తాడికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాధిత కుంటుంబాన్ని పరామర్శించారు. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు. -
కరోనా పోరులో ఇదేం కక్కుర్తి ‘నారాయణ’!
కందుకూరు రూరల్: కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రం లాక్ డౌన్లో ఉంది. 144 సెక్షన్ అమలులో ఉంది. విద్యా సంస్థలన్నీ మూతబడ్డాయి. ఇవేమీ పట్టని నారాయణ స్కూల్ యాజమాన్యం పదో తరగతి విద్యార్థినులకు తరగతులు నడుపుతున్నారు. అధిక ర్యాంకుల సాధించాలనే ఉద్దేశంతో ఇలాంటి కక్కుర్తిని ప్రదర్శించింది. పట్టణంలోని తూర్పు వడ్డెపాలెంలో అదే పాఠశాలలో పదో తరగతి చదివే ఓ విద్యార్థినీ ఇంటిని తీసుకొని రహస్యంగా పదో తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచి ఇలా జరుగుతుందని తెలుసుకున్న వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కందుకూరు పట్టణ ఎస్సైకు సమాచారం ఇచ్చారు. ఎస్సై తిరుపతిరావు తనిఖీ చేయగా ఒక చిన్న గదిలో సుమారు 25 మంది బాలికలకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో టీచింగ్ స్టాఫ్ ఐదుగురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ చేపడతామని ఎస్సై తెలిపారు. దీనిపై నారాయణ పాఠశాలకు ఎంఈఓ జి.పెద్దిరాజు మెమో జారీ చేశారు. -
చదువుతుండగా...
లక్కవరపుకోట: భవిష్యత్‌లో ప్రయోజకుడై ఆదుకుంటాడనుకుని ఆ తల్లి బిడ్డను కళ్లల్లో పెట్టి చూసుకుంది. నాలుగు సంవత్సరాల కిందట తండ్రి చనిపోతే ఆ లోటు తెలియకుండా పెంచుతూ వచ్చింది. మంచి చదువులు చదివి ఉన్నత స్థానానికి చేరుకుంటాడని ఆశ పడిన ఆ తల్లికి పుత్రశోకం మిగిలింది. మరో పది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఆ విద్యార్థి పిడుగు పాటుకు బలైపోయాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలో గురువారం మధ్యాహ్నం పిడిగులతో కూడిన వర్షం పడింది. భూమిరెడ్డిపాలెంలో గ్రామానికి చెందిన భూమిరెడ్డి అప్పలనాయుడు (16) తోటి విద్యార్థులతో కలసి గురువారం మధ్యాహ్నం మంచంపై చదువుకుంటుండగా... ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో అప్పలనాయుడు కుప్పకూలిపోవడంతో వెంటనే సమీపంలో ఉన్నవారు స్పందించి 108 వాహనంలో ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే అప్పలనాయుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే విద్యార్థి చందులూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో తోటి పిల్లలతో కలిసి చదువుకుంటున్నాడు. ఇంతలో పిడుగు పడడంతో అప్పలనాయుడు మృతి చెందాడు. నాలుగు సంవత్సరాల కిందటే విద్యార్థి తండ్రి మృతి చెందడంతో తల్లి పద్మ కష్టపడి కుమారుడ్ని పెంచింది. నన్నెవరు పెంచుతారురా... కన్నా...అంటూ తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. పాడి గేదె, రెండు మేకలు మండలంలోని రేగ గ్రామానికి చెందిన రావాడ శ్రీరామ్మూర్తికి చెందిన పాడి గేదె మృతి చెందింది. పశువుల పాక వద్ద ఒక్కసారిగా పిడుగు పడడంతో గేదె అక్కడికి అక్కడే మృతి చెందినట్లు రైతు శ్రీరామ్మూర్తి తెలిపారు. గేదె విలువ సుమారు రూ. 45 వేలు ఉంటుందని అంచనా. అలాగే కళ్లేపల్లి గ్రామానికి చెందిన కడియాల మంగయ్య, కోరాడ శ్రీనులకు చెందిన రెండు మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. గ్రామానికి సమీపంలో గల పొలంలో మేకల మంద కాస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు పెంపకందారులు తెలిపారు. సరయ్యవలసలో 18 మేకలు.. దత్తిరాజేరు: మండలంలోని సరయ్యవలసలో గురువారం సాయంత్రం పిడుగు పడడంతో 18 మేకలు మృతి చెందినట్లు వైఎస్సార్సీపీ నాయకుడు సారికి రామునాయుడు తెలిపారు. తట్టబోను లకు‡్ష్మ అప్పారావు, అప్పలస్వామి, తదితరులు గ్రామ సమీపంలో మేకల మంద కాస్తుండగా.. పిడుగు పడడంతో ఒక్కసారి 18 మేకలు మృతి చెందాయి. బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ నాయకులు మంత్రి అప్పలనాయుడు, మండల శ్రీనువాసాసరావు, సారికి అప్పలనాయుడు, సాలాపు పాపారావు, టీడీపీ నాయకులు చప్ప చంద్రశేఖర్, బెజవాడ బంగారునాయుడు పరామర్శించారు. పిడుగు పడి గొర్రెల కాపరి .. జామి: మండలంలోని అలమండ పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పిడుగు పడడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వియ్యపు రమణ (46) అనే వ్యక్తి, బోగ రాములమ్మ, తదితరులు పద్మనాభం మండలం గంధవరం కోమటి చెరువు వద్ద గొర్రెలు కాస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా పిడుగు పడడంతో రమణ అక్కడికక్కడే మృతి చెందగా.. రాములమ్మ అస్వస్థతకు గురైంది. ఆమెను అలమండ పీహెచ్‌సీకి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు రమణకు భార్య రమణమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
పదో తరగతిలోనే పాఠశాల హెచ్ఎంగా..
చెన్నై ,వేలూరు(తిరువణ్ణామలై): పదో తరగతి అర్ధ సంవత్సరపు పరీక్షల్లో పాఠశాలలోనే మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని ఒక్క రోజు ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా పుదుపట్టు గ్రామానికి చెందిన సౌందర్‌రాజన్ కుమార్తె మధుమిత(14) నెచ్చల్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. హెచ్ఎం వెంకటేశన్, 8 మంది టీచర్లు, ఇద్దరు కార్యాలయ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు 10వ తరగతి అర్థ సంవత్సర పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించే వారిని ఒక్క రోజు హెచ్ఎంగా పనిచేయవచ్చని హెచ్ఎం వెంకటేశన్ తెలిపాడు. ఈ నేపథ్యంలో మధుమిత 447 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఒక రోజు హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించిన మధుమితతో హెచ్ఎం, టీచర్లు దీంతో సోమవారం హెచ్ఎం వెంకటేశన్, ఉపాధ్యాయులు మధుమితను విద్యార్థుల సమక్షంలో ప్రధానోపాధ్యాయుడి సీటులో కూర్చో పెట్టారు. ఈ సందర్భంగా మధుమిత రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి గదికి వెళ్లి సహ విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలకు సంబంధించి ప్రశ్నలను అడిగారు. అనంతరం హెచ్ఎంగా ఒక రోజు పనిచేసిన వేతనాన్ని పాఠశాల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా మధుమిత మాట్లాడుతూ.. ఒక రోజు హెచ్ఎంగా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వీటిని జీవితంలో మరవలేనంది. తనను ఉత్సాహ పరిచి మొదటి ర్యాంకులు సాధించేందుకు కారణమైన హెచ్ఎం వెంకటేశన్, టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
పదిలోనే బరితెగింపు.. అసభ్యకర సందేశాలు
సాక్షి, సిటీబ్యూరో: మైనర్ల చేతికి తమ స్మార్ట్ఫోన్లు అందేలా చేస్తున్న తల్లిదండ్రులు వారి వ్యవహారాలను, కార్యకలాపాలను అసలు పట్టించుకోవట్లేదు. ఫలితంగా అనేక సోషల్‌మీడియా యాప్స్‌ను విరివిగా వినియోగిస్తున్న బాలబాలికలు ఒక్కోసారి బరితెగిస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో అభ్యంతరకరమైన పనులు చేస్తూ సైబర్ క్రైమ్ ఠాణాల వరకు వస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఈ తరహా ఉదంతం ఒకటి సోమవారం వెలుగు చూసింది. తన క్లాస్మేట్ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, తమ సహ విద్యార్థినికి అసభ్య సందేశాలు పంపిస్తూ ఓ టెన్త్‌క్లాస్ విద్యార్థి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ విషయం సైబర్ క్రైమ్ పోలీసుల వరకు చేరడంతో అధికారులు నిందితుడికి, అతడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, నోటీసులు జారీ చేసి పంపారు. నగరంలోని రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. నిత్యం తన తల్లిదండ్రులకు చెందిన స్మార్ట్ఫోన్లు ఇతడికి అందుబాటులో ఉండేవి. దీంతో తన క్లాస్మేట్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లి ఫోన్, తండ్రి ఫోన్లలో వేర్వేరుగా నకిలీ ఖాతాలు తెరిచాడు. అంతటితో ఆగకుండా వీటి ద్వారానే తన సహ విద్యార్థిని ఇన్‌స్ట్రాగామ్ ఖాతాకు అభ్యంతరకర సందేశాలు పంపడం మొదలెట్టాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు తొలుత ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఎవరి పేరున ఉన్నాయో ఆ విద్యార్థిని నిలదీశారు. అతడి తల్లిదండ్రులకూ విషయం చెప్పారు. తాను ఆ పని చేయలేదని, తన పేరుతో తెరిచిన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలు వినియోగించి ఎవరో ఇలా చేస్తున్నారని చెప్పాడు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు రెండు ఫోన్నంబర్ల ఆధారంగా పని చేస్తున్నట్లు తేలింది. అవి ఎవరివని ఆరా తీయగా దంపతులకు చెందినవిగా వెలుగులోకి వచ్చింది. వారి కుమారుడు ఈ బాలికతోనే విద్యనభ్యసిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులతో సహా సదరు మైనర్‌నూ సోమవారం ఠాణాకు పిలిచిపించారు. పోలీసుల సమక్షంతో అతడి తల్లిదండ్రులు మందలించడంతో అది తన పనేనంటూ అంగీకరించాడు. ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులకూ సైబర్ క్రైమ్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపై సదరు మైనర్‌కు నోటీసులు జారీ చేసిన అధికారులు ఇలాంటివి పునరావృతం కానీయొద్దంటూ అవగాహన కల్పించి పంపారు. స్మార్ట్ఫోన్లు చిన్నారులకు అందేలా ఉంచడం లేదా వారికోసమే ప్రత్యేకంగా ఖరీదు చేసి ఇవ్వడం ఇటీవల కాలంలో పెరిగిందని, ఆ ఫోన్ల ద్వారా పిల్లల కార్యకలాపాలను తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని పోలీసులు చెబుతున్నారు. వీరంతా తమ పిల్లలు ఆ ఫోన్లలో గేమ్స్ ఆడుకుంటున్నట్లు భావిస్తున్నారని, అయితే కొందరు దీన్నే అలుసుగా తీసుకుని పెడదారి పడుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
విద్యార్థినిపై లైంగిక దాడి
కుత్బుల్లాపూర్: పదో తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కాప్రా ప్రాంతానికి చెందిన ప్రణయ్ కుమార్ డిప్లమో చదువుతున్నాడు. బుధవారం అతను దూలపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అదే గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి విద్యార్థిని(15)తో పరిచయం చేసుకున్న ప్రణయ్ కుమార్ ఆమెను జోగిపేటలోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో గురువారం వారు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అంధ విద్యార్థికి అండగా హరీశ్
సిద్దిపేటజోన్: పదవ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన అంధ విద్యార్థి లక్కీమీరానీకి ఎమ్మెల్యే హరీశ్‌రావు అండగా నిలిచారు. ఉన్నత విద్య కోసం తన వంతు సహాయంగా రూ.లక్ష నగదును అందిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్‌కు చెందిన లక్కీమీరానీ 2వ తరగతి నుండే అంధుడు. తన లక్ష్యానికి అంధత్వం అడ్డుగా మారింది. ఈ క్రమంలో కరీంనగర్‌లోని పారమిత గ్రూప్స్ ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ డా. ప్రసాద్ అంధ విద్యార్థి లక్కీమీరానీ ప్రతిభను గుర్తించి ఆర్థిక స్తోమత, స్థితిగతులను పరిశీలించి అక్కున చేర్చుకున్నాడు. రెండో తరగతి నుంచి 10 వ తరగతి వరకు అంధ విద్యార్థికి ఉచిత విద్యను అందించారు. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో లక్కీమీరానీ 10/10 జీపీఏ సాధించి ఆసియా ఖండంలోనే మొదటి అంధ విద్యార్థిగా నిలిచాడు. ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని తెలుసుకున్న హరీశ్‌రావు సోమవారం సిద్దిపేటలో అంధ విద్యార్థిని ఘనంగా సన్మానించారు. -
పుట్టిన రోజే అనంత లోకాలకు..
చిత్తూరు, బుచ్చినాయుడుకండ్రిగ: ఇటీవల పదో తరగతి ఫలితాల్లో శిరీష ప్రతిభ చాటింది. ఆదివారం ఆ విద్యార్థిని పుట్టిన రోజు. దీంతో ఇల్లంతా సందడి, సందడిగా ఉంది. పైగా తెల్లారితే నూతన గృహ ప్రవేశ కార్యక్రమం కూడా ఉంది. అందరూ సంతోషంగా, సందడితో ఉంటున్న ఆ ఇంటిలో ఉన్నట్లుండి విషాదం అలుముకుంది. పుట్టినరోజే విద్యుత్ షాక్ రూపంలో విద్యార్థిని మృత్యువు కబళించింది. ఈ సంఘటన నెరిణికండ్రిగలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు నెరిణికండ్రిగ ఎస్సీ కాలనీకి చెందిన అంకయ్య, సుమలతల కుమార్తె శిరీష నెలవాయి పాఠశాల్లో 10 వ తరగతి చదివింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 9.2 పాయింట్లతో పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. సోమవారం ఉదయం నూతన గృహాప్రవేశం కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఇంట్లో విద్యుత్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శిరీష నీటి కోసం మోటరు వేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయింది. గమనించిన కుటుంబ సభ్యులు శిరీషను శ్రీకాళహస్తిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శిరీష పుట్టినరోజే చనిపోవడంతో కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. శిరీష మృతిపై ఎంఈఓ రవీంద్రనాథ్, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, తెలుగుపండిట్ పురుషోత్తమ్ విచారం వ్యక్తం చేశారు. -
అదృశ్యమైన విద్యార్థిని హత్య?
చెన్నై ,పళ్లిపట్టు: ఐదు నెలల క్రితం అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి శరీర భాగాలు ఆదివారం గుర్తించారు. పళ్లిపట్టు సమీపంలోని కీచలం గ్రామ పంచాయతీ కొత్త వెంకటాపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కూలీ. అతని కుమార్తె సరిత (15). కీచలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే. ఈమె గత ఏడాది సెప్టెంబర్ 7, 2018న ఇంటి నుంచి పాఠశాలకు అని బయలుదేరింది. అయితే రాత్రికి ఎంత పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా, ఆ రోజు పాఠశాలకు సరిత రాలేదని తెలిసింది దీంతో పొదట్టూరు పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తూ వచ్చారు. ఐదు నెలలుగా సరిత గురించి ఎలాంటి సమాచారం తెలియని పరిస్థితిలో ఆదివారం సాయంత్రం కీచలం గ్రామానికి సమీపంలో సురేష్‌నాయుడు అనే రైతుకు సంబంధించి చెరకు తోట సమీపంలోని బందకాలువ వద్ద సరిత దుస్తులు, చెప్పులు, తల వెంట్రుకలు, శరీర భాగాల ఎముకలను కూలీలు గుర్తించారు. సురేష్‌నాయుడు ఇచ్చిన సమాచారంతో పొదటూరు పేట ఎస్ఐ రవి, సీఐ రమేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పుడు ఐదు నెలల క్రితం అదృశ్యమైన సరితగా ఉండవచ్చని అనుమానంతో ఆమె తల్లిదండ్రులను రప్పించారు. అక్కడ ఉన్న దుస్తులు తదితరాలను చూసి ఆ శరీర భాగాలు తమ కుమార్తె సరితవేనని గుర్తించి బోరున విలపించారు. ఐదు నెలల క్రితం అదృశ్యమైన విద్యార్థిని మృతదేహం లభ్యమైన విషయం తెలియడంతో తిరువళ్లూరు జిల్లా ఎస్పీ పొన్ని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, పాఠశాలలో విద్యార్థినిని ఎవరైనా అగంతకులు అత్యాచారం చేసి, చంపి ఉండవచ్చా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
ఆ సూసైడ్ నోట్ అర్థమెంటీ..?
సాక్షి, జగిత్యాల: అసలేం జరిగింది..? ఈనెల ఒకటో తేదిన జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ పదో తరగతి విద్యార్థి రుద్రారపు దినేశ్ (15) ఆత్మహత్యా చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకునేంత పెద్ద తప్పు దినేశ్ ఏం చేశాడూ..? అసలు అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి..? ఎందుకొచ్చింది..? ఇప్పుడీ చర్చ జిల్లా కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీవాల్మీకి ఆవాసంలో ఉంటూ చదువుకుంటున్న తమ బిడ్డది ముమ్మాటికీ హత్యే అని.. హత్యా కేసు నమోదు చేయాలని దినేశ్ కుటుంబ సభ్యులు చెబుతుంటే.. ఆవాసం నిర్వాహకులు మాత్రం దినేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేస్తున్నారు. ఇటు మృతదేహానికి పోస్టుమార్టం చేసిన జగిత్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు ముందు దినేశ్‌ది హత్యే అని చెప్పి తర్వాత ఆత్మహత్య అని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో కేసును ఎలా నమోదు చేయాలో తెలియక పోలీసులు చివరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. దినేశ్ చనిపోవడానికి ఓరోజు ముందు పాఠశాలకు ఓ మహిళా వచ్చిందని, ఆమెను చూసి భయపడే మరుసటి రోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆవాసం నిర్వాహకులు చెప్పారు. పాఠశాలకు వచ్చిన ఆ మహిళా ఎవరు..? ఎందుకొచ్చింది..? దినేశ్‌తో ఏమైనా మాట్లాడిందా..? ఆ మాటలకు భయపడే దినేశ్ ఉరి వేసుకున్నాడా..? అసలు దినేశ్ ఉరి వేసుకునేంత పెద్ద తప్పు ఏం చేశాడనేది సదరు మహిళే సమాధానం చెప్పాల్సి ఉంది. సూసైడ్ నోట్ అర్థమెంటీ..? దినేశ్ చావడానికి ముందు సూసైడ్‌నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆ నోట్లో ‘ఆచార్యా నేను అలా చేయలేదు.. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను తప్పు చేయనిదానికి తప్పు చేసిన అంటే బాగా అనిపియలేదు. అందుకే ఇలా చేస్తున్నాను..’ అని ఉంది. ఇందులో దినేశ్‌తో ఆచార్య ఏ తప్పు గురించి ప్రస్తావించాడు..? దినేశ్ ఏ తప్పు చేశాడని ఆచార్య చెప్పాడు..? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. అయితే.. సదరు ఆవాసం నిర్వాహకుడు (ఆచార్య) మాత్రం దినేశ్ తనతో ఏ తప్పు గురించి ప్రస్తావించలేదని చెప్పడం గమనార్హం. మరోపక్క.. తరగతి గదిలో ఉరి వేసుకున్న తీరుపైనా కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దినేశ్ చనిపోతే ఉరికి వేలాడి ఉండాలి కానీ ఉరి వేసుకున్న వైరు తెగి.. దినేశ్ కింద పడి ఉండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై జగిత్యాల పట్టణ సిఐ రత్నపురం ప్రకాశ్ వివరణ ఇస్తూ.. ‘తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని, స్కూలుకు వచ్చిన ఆ మహిళ, ఆచార్య, సహచర విద్యార్థులు, పలువురు సార్లను విచారించాలని దినేశ్ తండ్రి రుద్రారపు రాజనర్సయ్య మాకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు విచారణ చేపడుతున్నాం’ అన్నారు. -
పదోతరగతి విద్యార్థినిపై బ్లేడ్ బ్యాచ్ దాడి
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాట్రేనికోడ మండలంలోని చెయ్యేరుకి చెందిన పదోతరగతి విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగులు బ్లేడుతో దాడి చేశారు. విద్యార్థిని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు విద్యార్థినిపై బ్లేడుతో దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకొని విద్యార్థిని పాఠశాలలోకి పరుగెత్తింది. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. విద్యార్థిని చేతికి స్వల్ప గాయాలయ్యాయని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
మీ సేవలకు ధన్యవాదాలు
సాక్షి, సిటీబ్యూరో: రోటీన్‌కు భిన్నంగా నగర పోలీసు వార్షిక విలేకరుల సమావేశాన్ని పాతబస్తీలోని చౌ మొహల్లా ప్యాలెస్‌లో ఏర్పాటు చేయాలని కొత్వాల్ అంజనీకుమార్ నిర్ణయించారు. ఈ బాధ్యతల్ని ఇన్చార్జ్ డీసీపీగా ఉన్న ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేష్‌కు అప్పగించారు. బుధవారం ఈ కార్యక్రమం జరుగనుండటంతో ఆయన మంగళవారం ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ఓ చిన్నారి ఆయన వద్దకు వచ్చింది. షేక్ హ్యాండ్ ఇస్తూ ‘«థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్’ అంటూ చెప్పింది. అది విన్న ఆయన ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ పాప వెంటే వచ్చిన ఆమె కుటుంబీకులు అసలు విషయం డీసీపీ రమేష్‌కు వివరించారు. బెంగళూరుకు చెందిన ఐదేళ్ల ఆ చిన్నారి పేరు శివాని. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న ఆమెకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పోలీసులను గౌరవించడం నేర్పారు. సమాజం కోసం వారు చేస్తున్న సేవల్ని వివరించారు. దీంతో శివానీకి పోలీసులంటే వల్లమానిన గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. యూనిఫాంలో ఉన్న అధికారులు, సిబ్బంది ఎక్కడ కనిపించినా వారి వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ‘థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్’ అని చిరునవ్వుతో చెప్తుంది. మంగళవారం చౌమొహల్లా ప్యాలెస్‌లో ఉన్న డీసీపీ రమేష్‌ను ఈ అనుభవం ఎదురైంది. నగరంలో నివసిస్తున్న తాత–నానమ్మల దగ్గరకు శివానీ తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. వారంతా కలిసి ప్యాలెస్ చూడటానికి అక్కడకు వచ్చారు. ఈ చిన్నారికి తల్లిదండ్రులు నేర్పిన విషయాన్ని గమనించిన డీసీపీ రమేష్ వారి కుటుంబంలో ఎవరైనా పోలీసులు ఉండి ఉంటారని, అందుకే ఇలా నేర్పించి ఉంటారని భావించారు. ఈ విషయంపై ఆరా తీయగా శివాని తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు సైతం ప్రొఫెసర్లు, టీచర్లుగా పని చేసిన, చేస్తున్న వారే. అయినప్పటికీ పోలీసుల విధులు అంటే వారికి అత్యంత గౌరవం. దీన్నే శివానీకి ఆ తల్లిదండ్రులు నేర్పారు. -
బాలుడు కిడ్నాప్.. హిజ్రాగా ప్రత్యక్షం
వేసవి సెలవులు ముగించుకుని బస్సులో వస్తుండగా హిజ్రాలు బాలునికి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లారు. అతనికి లింగమార్పిడి చేసి తమలాగే మార్చి భిక్షాటన ప్రారంభించారు. తమ కొడుకు ఏమయ్యాడోననిఅప్పటినుంచి నిరీక్షించిన తల్లిదండ్రులకు పిడుగులాంటి నిజం తెలిసిదిగ్భ్రాంతికి గురయ్యారు. మైసూరు జిల్లాలో షాక్‌కు గురిచేసే సంఘటన బయటపడింది. ఇలా ఇంకెంతమంది బాలలు ఇటువంటి ముఠాల చెరలో మగ్గిపోతున్నారోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక, యశవంతపుర: ఐదారు నెలల క్రితం అదృశ్యమైన 10వ తరగతి బాలుడు.. ఇప్పుడు హిజ్రాగా కనిపించడంతో కన్నవారు తీవ్రంగా విలపిస్తున్నారు. మైసూరు జిల్లా క్రిష్ణరాజపేట తాలూకా హక్కిమంచనహళ్లికి చెందిన చందన్‌కుమార్ (16) లింగమార్పిడితో ఇప్పుడు చందన్‌కుమారిగా మారిపోయాడు. వివరాలు.. చందన్‌కుమార్ బెంగళూరులోని పిన్నమ్మ ఇంట్లో ఉంటూ బీబీఎంపీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివేవాడు. ఈ ఏడాది మేలో వేసవి సెలల్లో సొంతూరికి వెళ్లాడు. సెలవు ముగియటంతో తల్లిదండ్రులుఅతడిని బస్ ఎక్కించి బెంగళూరుకు పంపించారు. బెంగళూరుకు వస్తూ మిస్సింగ్ అయితే చందన్ బెంగళూరుకు వెళ్లలేదు. అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు కేఆర్‌పేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు, కన్నవారు బాలుని కోసం గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇద్దరు హిజ్రాల జతలో బాలుడు కేఆర్ పేజీ పట్టణంలోని టీబీ రోడ్డులో ఉన్నాడు. ఆ సమయంలో మంజు అనే యాచకుడు చందన్‌ను చూసి గుర్తుపట్టాడు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని బాలున్ని ప్రశ్నిస్తుండగా ఇతర హిజ్రాలతో కలిసి ఆటోలో పారిపోవటానికి ప్రయత్నించగా మంజు ఆటోను వెంబడించి పట్టుకుని కేఆర్‌పేట పట్టణ పోలీసులకు అప్పగించాడు. తన కొడుకు హిజ్రాగా కనిపించాడని తెలిసిన తల్లిదండ్రులు బంధువులతో కలిసి స్టేషన్‌కు చేరుకున్నారు. తన కొడుకును హిజ్రాలే అపహరించి ఇలా మార్చారని తల్లిదండ్రులు పోలీసుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి లింగ మార్పిడి చేసిన ఆరోపణలపై ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. చందన్‌ను మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించిన్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. -
ఆన్సర్షీట్.. ఆ అమ్మాయి వేదనకు వాంగ్మూలం
యూనిట్ టెస్ట్ కోసం పరీక్ష హాల్లో కూర్చున్న పదవ తరగతి విద్యార్థినికి ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసు. కానీ గత చాలాకాలంగా ప్రశ్నార్థకంగా మారిన తన జీవితానికి సమాధానం ఏమిటో అంతుచిక్కలేదు. సొంత ఇంట్లోనే సొంత రక్తసంబంధీకుల వల్లే తను ఎదుర్కొంటోన్న అకృత్యాలకు పరిష్కారం ఏమిటో అ అమ్మాయికి అర్థం కాలేదు. అందుకే అన్సర్ షీట్లో అసలు ప్రశ్నలకు సమాధానాలకు బదులుగా, గత చాలాకాలంగా తనలో తానే కుమిలిపోతోన్న విషయాన్నంతా రాసేసి గుండెలనిండా ఊపిరిపీల్చుకుంది. అక్టోబరు 1వ తేదీన ఈ ఘటన జరిగింది. పరీక్షా పత్రాలను దిద్దే సందర్భంలో ఈ దారుణం టీచర్ దృష్టిలో పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని గురుగావ్ జిల్లా బాద్షాపూర్లో పదవ తరగతి చదువుతోన్న ఈ విద్యార్థినిపై వారి పక్కింట్లోనే ఉండే ఆమె మామయ్య, ఇంటర్మీడియట్ చదువుతోన్న ఆమె పిన్ని కొడుకు ఇద్దరూ కలిసి లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంతో విసిగివేసారిన ఈ బాలికకు ఎవరికి చెప్పుకోవాలో, ఈ నరకం నుంచి ఎలా బయటపడాలో పాలుపోలేదు. దీంతో యూనిట్ టెస్ట్‌లో ఇచ్చిన ఆన్సర్ షీట్లో గత కొంతకాలంగా తనుపడుతోన్న వేదననంతా రాసింది. ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలన్నింటినీ ఆన్సర్‌షీట్‌లో పేర్కొంది. స్కూల్ టీచర్ ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తేవడంతో ఆ అమ్మాయి మామయ్య (23)నీ, ఆమె కజిన్‌ను అరెస్టు చేసిన పోలీసులు పోస్కోకేసు నమోదు చేసారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శకుంతలా యాదవ్ మాట్లాడుతూ.. ఆ బాలిక మామయ్య వాళ్ళ పక్కింట్లోనే ఉంటాడనీ, ఆమె కజిన్ వారి ఇంట్లోనే ఉంటున్నట్టు వెల్లడించారు. -
10/10 వచ్చినా.. ట్రిపుల్ ఐటీ సీటు రాలేదని..!
సాక్షి, కృష్ణా : కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినా ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రమైన చాట్రాయిలో చోటుచేసుకుంది. వివరాలు.. టెన్త్ క్లాస్‌లో 10/10 జీపీఏ సాధించినా ట్రిపుల్ ఐటీలో సీటు రాకపోవండంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంజు మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ట్రిపుల్ ఐటీ సీటు విషయమైన నిన్న రాత్రి మంజు తీవ్ర ఆవేదనతో మాట్లాడిందని ఆమె తల్లి భోరున విలపించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమలేఖ ఎంతపని చేసింది..!
పశ్చిమగోదావరి, తణుకు: తణుకు పట్టణంలోని మాంటిస్సోరి స్కూలులో పదో తరగతి చదువుతూ సోమవారం అనుమానాస్పద స్థితిలో విద్యార్థి చనిపోయిన ఘటనకు సంబంధించి మిస్టరీ వీడలేదు. యాజమాన్యం వేధింపుల కారణంగానే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన అన్నాబత్తుల వెంకటేశ్వరరావు కుమారుడు అన్నాబత్తుల నాగవెంకట సాయిప్రసాద్ సోమవారం సాయంత్రం మాంటిస్సోరి స్కూలు ఆవరణలో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు స్కూలు యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అర్ధరాత్రి వరకు మృతదేహంతో హాస్టల్ ఆవరణలోనే ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు స్కూలు ఫర్నీచర్‌తో పాటు స్కూలు బస్సులను ధ్వంసం చేశారు. దీంతో సోమవారం అర్ధరాత్రి వరకు స్కూలు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలు రాజకీయ పార్టీల నాయకులు స్కూలు యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలితంగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రిలోని శవాగారానికి తరలించారు. మంగళవారం బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే బంధువుల డిమాండ్ మేరకు ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం మొత్తం వీడియో కెమెరా ద్వారా తీయించారు. ప్రేమ వ్యవహారం...? స్కూలు ఆవరణలోని హాస్టల్ భవనంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి సాయిప్రసాద్ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రేమలేఖ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. స్కూలులో చదువుతున్న ఒక బాలికకు సాయిప్రసాద్ రాసిన ప్రేమలేఖ ఇప్పుడు కీలకంగా మారినట్టు సమాచారం. ప్రేమలేఖ ఉపాధ్యాయురాలి ద్వారా సాయిప్రసాద్ తరగతి ఉపాధ్యాయుడు, లెక్కల టీచర్ బాలాజీకి చేరినట్టు తెలిసింది. దీంతో నాలుగు రోజులుగా పనిష్మెంట్ పేరుతో సాయిప్రసాద్‌ను బయట నిలబెడుతూ తీవ్రంగా కొడుతున్నట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం విద్యార్థి తండ్రికి కబురు పంపిన యాజమాన్యం విషయం తెలియజేశారు. అయితే ఇదే సమయంలో స్కూల్ డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు విద్యార్థిని చితకబాదగా కోపంతో తండ్రి కూడా చేయి చేసుకున్నట్టు సమాచారం. సాయంత్రం వచ్చి తన కుమారుణ్ని తీసుకెళ్లిపోతానని చెప్పిన తండ్రి సాయంత్రం స్కూలుకు వచ్చే సరికి ఉరి వేసుకున్న సాయిప్రసాద్‌ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహంతో హాస్టల్‌కు వచ్చి బైఠాయించారు. అజ్ఞాతంలోకి బాలాజీ...? సాయి ప్రసాద్‌ను చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యకు కారణమైన క్లాస్ టీచర్ బాలాజీతో పాటు స్కూలు డైరెక్టర్ ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అతని ఫేస్బుక్ ఖాతాను సైతం క్లోజ్ చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు సీఐ కె.ఎ.స్వామి తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్‌రేప్
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో 16 ఏళ్ల అమ్మాయిపై ఆమె సీనియర్లు నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక రోజు ముందు( ఆగష్టు 14) జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసి కూడా ఫిర్యాదు చేయకపోగా,అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడం గమనార్హం. డెహ్రడూన్ హాస్టల్ ఉంటూ పదోతరగతి చదువుతున్న విద్యార్థిని(16) గత నెల 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగే ఈవెంట్లో పాల్గొనాలంటూ సీనియర్లు ఫోన్ చేశారు. పాఠశాలకు వెళ్లిన ఆమెను ఒక స్టోర్‌రూంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేయగా పట్టించుకోలేదు. పైగా ఈ విషయాన్నిఇంట్లో చెప్పొందని హెచ్చరించారు. అబార్షన్ చేయిండానికి ఆస్పత్రికి సైతం తీసుకెళ్లారు. దీంతో ఆ అమ్మాయి తన అక్కకు అసలు విషయాన్ని చెప్పింది. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిపై అత్యాచారం చేసిన నలుగురు విద్యార్థులకు 17 ఏళ్ల వయసుంటుందని వారందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయట పడకుండా రుజువులను ధ్వంసం చేసినందుకు గాను... పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఆయన భార్య, హాస్టల్ వార్డన్లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
టెడ్డీబేర్‌తో అత్తను హతమార్చిన మేనల్లుడు
టీ.నగర్: తన కుమార్తెతో మాట్లాడకూడదని మందలించడంతో అత్తను గొంతునులిమి హత మార్చినట్లు పదో తరగతి విద్యార్థి ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపింది. చెన్నై అమింజికరై వల్లలార్‌వీధికి చెందిన శంకర్ సుబ్బు (45) అదే ప్రాంతంలో కిరాణ దుకాణం నడుపుతున్నాడు. ఇతని భార్య తమిళ్‌సెల్వి (40). ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె సమీపంలోని పాఠశాల్లో 8వ తరగతి చదువుతోంది. ఈ స్థితిలో గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న తమిళ్‌సెల్వి చేతికి గాయంతో రక్తపు మడగులో పడి ఉంది. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన శంకర్‌సుబ్బు భార్య స్పృహతప్పి ఉండ డం చూసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెంది నట్లు తెలిపారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అమింజికరై పోలీసులు కేసు విచారణ జరిపారు. ఈ లోపు కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పో స్టుమార్టం రిపోర్టు అం దింది. అందులో తమిళ్ సెల్వి ఆత్మహత్య చేసుకోలేదని గొంతు నులమడంతో ఊపిరాడక మరణించినట్లు తెలిపారు. మృతి చెందిన తరువాత చేతి మణికట్టుపై గాయం ఏర్పడినట్లు తెలిపారు. పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా పరిశీలనలు జరిపారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న శంకర్‌సుబ్బు సోదరి కుమారుడు పదో తరగతి చదువుతున్న బాలుడు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆ విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. ఆ సమయంలో విద్యార్థి తన అత్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన మామ శంకరసుబ్బు కుమార్తెపై తనకు ప్రేమ అని తాను ఆమెతో మాట్లాడడం అత్తకు నచ్చలేదన్నారు. ఆమె తనను ఇంటికి రావద్దని ఖండించడంతో ఆగ్రహంతో ఆమెను టెడ్డీబేర్‌తో హత్య చేసినట్లు తెలిపారు. ఆ తరువాత మణికట్టుపై కత్తితో కోసినట్లు తెలిపాడు. -
‘పది’లో ఫెయిలయ్యానని ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థిని
ఇంద్రవెల్లి(ఖానాపూర్) మంచిర్యాల : పదో తరగతిలో పెయిల్ అయినందుకు మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం లక్ష్మణ్, రత్నాబాయి దంపతులకు చెందిన గంగామణి(15) కేస్లాపూర్ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదివింది. మార్చిలో పరీక్ష రాసింది. ఇందులో ఫెయిల్ కావడంతో రోజు బాధపడుతూ ఉండేది. మనస్థాపంతో మంగళవారం బహిర్భూమికి వెళ్లివస్తానని చెప్పి కనిపించకుండాపోయింది. పలు చోట్ల ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు బుధవారం ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరికిల్ల గంగారాం తెలిపారు. -
మిత్రమా... ఇక రావా!
సాక్షి, కవిటి/శ్రీకాకుళం : ఉత్సాహంగా పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తమ సహచరుడు అర్ధంతరంగా మృతి చెందడాన్ని ఆ స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. తమతో ఆడుతూ పాడుతూ కలివిడిగా తిరిగిన బాల్యమిత్రుడు ఇక లేడన్న చేదు నిజం వారిని శోకసాగరంలో ముంచింది. మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన బలగ జగదీష్(16) శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించాడు. ఇతడు సికిల్‌సెల్ ఎనీమియా అనే వ్యాధితో బాధపడుతూ గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నాడు. ఇతడిని ఎంతో ఆప్యాయతా అనురాగాలతో చూసుకునే జగదీష్ తాతయ్య ఇటీవల ఆకస్మికంగా మృతిచెందాడు. దీంతో ఆ రోజు నుంచే తీవ్రంగా కుంగిపోయిన జగదీష్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. తన తండ్రికి తలకొరివి పెట్టిన కారణంగా జగదీష్‌ను వైద్యానికి తీసుకువెళ్లలేకపోయిన బలగ నారాయణ, అతని భార్య తన కన్నకొడుకు కళ్లేదుటే మృతిచెందడంతో తీవ్రంగా రోదిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జగదీష్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఉద్దానం ఫౌండేషన్ అంబులెన్స్‌ను రప్పించారు. ఎందుకైనా మంచిదని స్థానిక ఆర్ఎంపీ బాలుడిని పరీక్షించారు. అప్పటికే అతని గుండె ఆగిపోయి మృతిచెందినట్టు నిర్ధారించడంతో వారంతా హతాశులయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పదో తరగతి విద్యార్థినికి ప్రేమలేఖ
నిజామాబాదు,మద్నూర్(జుక్కల్): విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించాడు. ప్రేమలేఖలు రాశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. మద్నూర్ మండలంలోని పెద్దఎక్లార గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు తుమ్‌వార్ విజయ్‌పై గురువారం గ్రామస్తులు దాడి చేశారు. పాఠశాలలోని పదో తరగతికి చెందిన విద్యార్థినికి ఉపాధ్యాయుడు ప్రేమలేఖ రాయడం, విషయం పెద్దవాళ్లకు తెలియడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయుడు విజయ్‌పై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. అమ్మాయిలకు విద్యాబుద్ధులు నేర్పిస్తావని పాఠశాలకు పంపిస్తే లైంగిక వేధింపులకు గురిచేస్తావా.. అంటూ గ్రామస్తులు ఆగ్రహంతో పాఠశాల ఆవరణలోనే విజయ్ను చితకబాదారు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయుడు అతికష్టం మీద గ్రామస్తుల నుంచి విజయ్ను విడిపించి పాఠశాల కార్యాలయంలో కుర్చోబెట్టారు. అనంతరం గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై మహమ్మద్ సాజిద్, ఇన్చార్జి ఎంఈవో రాములు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడు విజయ్ గతంలో చాలాసార్లు ప్రేమ పేరుతో విద్యార్థినులను వేధించాడని, పలుమార్లు మందలించినా వినిపించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిని విధుల్లోంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ విషయమై ఎంఈవో డీఈవోతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించడంతో ఉపాధ్యాయుడు విజయ్ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో వెల్లడించారు. విజయ్ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు పోలీసు వాహనం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని చితకబాదుతున్న గ్రామస్తులు, నిందితుడిని తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. కాగా ఉపాధ్యాయుడు విజయ్ను గతంలో చాలాసార్లు సముదాయించినా వినిపించుకోలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుషాల్ తెలిపారు. గతంలో ఇదే పాఠశాలలో మరో విద్యార్థినికి ప్రేమలేఖ రాశాడని గ్రామస్తులు తెలిపారు. విద్యార్థినులను బిచ్కుందలో సినిమాకు కూడా తీసుకెళ్లాడని వారు ఆరోపించారు. గతంలో మేనూర్ ఉన్నత పాఠశాలలో పనిచేసిన విజయ్ అక్కడా విద్యార్థినులను వేధించాడని తెలిసింది. అలాగే మద్నూర్‌కు చెందిన విజయ్ అతని ఇంటివద్ద గల ఓ మహిళను లైంగికంగా వేధించడంతో గ్రామపెద్దలు పంచాయతీ పెట్టి లోలోపల సమస్యను పరిష్కరించినట్లు కాలనీవాసులు తెలిపారు. కాగా విజయ్ పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండటం గమనార్హం. -
ఆఖరి పరీక్ష రాయలేక పోయాడు
పెద్దాపురం: పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళుతున్న విద్యార్థి ప్రమాదబారినపడి ఆఖరి పరీక్ష రాయలేకపోయాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం పట్టణంలోని కట్టమూరు పుంతకు చెందిన బొంగు శ్రీరామ్ (16) స్థానిక సాగర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పబ్లిక్ పరీక్షల నేపధ్యంలో పద్మనాభ కాలనీ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్నాడు. ఆఖరి పరీక్ష సోషల్ ఎగ్జామ్ రాసేందుకు మంగళవారం ఇంటి వద్ద నుంచి బైక్‌పై బయల్దేరి పెట్రోలు కొట్టించుకునేందుకు వచ్చి తిరిగి ఎగ్జామ్ సెంటర్ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక లలితా థియేటర్ కాంప్లెక్స్ వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఏపీ05టీడీ 3373 బస్సు బలంగా ఢీ కొట్టి వేగంగా వెళ్లిపోయింది. దీనిని గమనించిన స్థానికులు బస్సు నంబరును నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అప్పటికే శ్రీరామ్ తీవ్ర గాయాలపాలై స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రి మరణం...40 గంటల నిరీక్షణం
‘పది’లమైన జీవితానికి అడుగులు వేస్తూ.. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు ఆ విద్యార్థులు..అయితే విధి ఆడిన వింతనాటకంలో కన్నవారిని కోల్పోయారు. ఆ బాధను దిగమింగుకుని పరీక్షలు రాస్తున్నారు. ఐ.పోలవరం (ముమ్మిడివరం): పది రోజులుగా పదో తరగతి పరీక్షలు రాస్తూ.. తన జీవిత లక్ష్యాలకు పునాదులు వేసుకుంటున్నాడు ఆ బాలుడు. ఇంతలో పరాయి రాష్ట్రంలో అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం స్వగ్రామంలోని ఇంటికి చేరేదాకా మధ్యలో ఆ కుర్రాడు పడిన మనోవేదన వర్ణనాతీతం. ఒడిశా రాష్ట్రం రాయగడలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల్లో ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి నూలు శ్రీనివాసరావు(44) ఒకరు. ఆయన కుమారుడు కౌశిక్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అమలాపురానికి చెందిన శ్రీనివాసరావు బావ హోమ ద్రవ్యాల హోల్ సేల్ వ్యాపారి శ్రీకాకోళపు సుబ్రహ్మణ్యంతో పాటు మరో బంధువైన అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామ వాసి సూర్యనారాయణ ఈ ప్రమాదంలో ముగ్గురు రక్త సంబంధీకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం పరాయి రాష్ట్రంలో జరగడం వల్ల మృతదేహాలు 40 గంటల తర్వాత అంటే సోమవారం తెల్లవారు జామున స్వగ్రామాలకు చేరాయి. పిల్లలను బాగా చదివించాలని.. శ్రీనివాసరావు తనకు ఉన్నంతలో కిరాణా వ్యాపారం చేసుకుంటూ తన పిల్లలను బాగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలన్న తపనతో ఉండేవాడని మురమళ్ల గ్రామస్తులు అంటున్నారు. భార్య, ఇద్దరు కవల ఆడపిల్లలు, ఒక కుమారుడితో సాగిపోతున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.ఇద్దరు కవల ఆడపిల్లలు బీటెక్‌లు పూర్తి చేశారని, వారికి పెళ్లిళ్లు చేయకుండానే శ్రీనివాసరా>వు వారికి దూరమయ్యాడని స్థానికులు వాపోతున్నారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న కౌశిక్ తండ్రి మృతదేహం కోసం రోజున్నర పాటు ఎదురు చూసి వేదనతో గడిపాడు. కడసారి కన్నతండ్రిని చూసి పరీక్ష హాలుకు.. సోమవారం తెల్లవారు జామున ఇంటికి తరలించిన తండ్రి మృతదేహంపై పడి తల్లి, అక్కలతో కలసి ఏడ్చిన కొడుకు కౌశిక ఉదయం ఎనిమిదయ్యాక దుఃఖాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్ష రాసేందుకు పయనమయ్యాడు. బంధువులు కూడా పదో తరగతి పరీక్షలకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయడంతో కౌశిక్ మురమళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం పదో తరగతి సోషల్ పేపర్–1 పరీక్ష రాశాడు. శ్రీనివాసరావు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ పరామర్శించి నివాళులు అర్పించారు. -
రాలిపోయిన విద్యాకుసుమం
పార్వతీపురంటౌన్/గరుగుబిల్లి: ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైంది. దీనికి సంబంధించి జియ్యమ్మవలస ఎస్సై లక్ష్మణరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గరుగుబిల్లి మండలం ఖడ్గవలసకు చెందిన మరిశర్ల తిరుమలసాయి (15) నాగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కాగా, రావివలస ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. శుక్రవారం జరిగిన పరీక్షకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లడానికి తోటి విద్యార్థులతో కలిసి ఆటో ఎక్కాడు. జియ్యమ్మవలస మండలం తురకనాయుడువలస గ్రామ సమీపంలోని మలుపువద్దకు వచ్చేసరికి ఆటో తిరగబడింది. ఈ సంఘటనలో తిరుమల సాయి అక్కడికక్కడే మృతి చెందగా, నాగూరుకు చెందిన మిరియాల ప్రకాష్ , దాసరి మధు, చింతాడ మణికంఠ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అదే ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఖడ్గవలసలో విషాద ఛాయలు చదువులో రాణిస్తున్న తిరుమల సాయి ప్రమాదంలో మృతి చెందడంతో ఖడ్గవలసలో విషాదఛాయలు అలముకున్నాయి. తిరుమలసాయి తల్లిదండ్రులు అప్పలనాయుడు (తాతబాబు), గౌరమ్మలు కూలి పనులు చేసుకుంటూ కుమారుడ్ని చదివిస్తున్నారు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడి తమను ఆదుకుంటాడనుకున్న కుమారుడు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు, సోదరి లావణ్య లబోదిబోమంటున్నారు. ఇక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు సాయి.. అని రోదిస్తున్న వారిని చూసి చూపరుల కళ్లు చెమర్చాయి. సాయి మృతి వార్త తెలుసుకున్న నాగూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎస్. చంద్రశేఖరరావు, ఎంఈఓ ఎన్. నాగభూషణరావు ఖడ్గవలస చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాఠశాలకు పేరు తీసుకువస్తాడనుకున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు. -
విద్యార్థినికి కన్నీటి పరీక్ష
నిజాంసాగర్(జుక్కల్): ఏడాది నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టిన కస్తూర్బా విద్యార్థినికి పదో తరగతి పరీక్ష కన్నీటి పరీక్ష అయ్యింది. పరీక్షకు సన్నద్ధం అయిన కూతురికి ధైర్యం చెప్పి, పరీక్ష సెంటర్లోకి సాగనంపిన తండ్రి శాశ్వతంగా దూరమయ్యాడు. ఇంట్లో తండ్రి శవం.. పుట్టెడు దుఖంతో కన్నీళ్లను దిగమింగుతూ విషాదవదనంతో పదో తరగతి పరీక్ష రాసింది మౌనిక. వివరాలు.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన మైలారం కృష్ణ (44)కు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కృష్ణ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. రెండో కూతురు మౌనిక నిజాంసాగర్లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతుంది. గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో కృష్ణ తన కూతురి పరీక్ష కోసం నిజాంసాగర్ మండల కేంద్రానికి వచ్చాడు. కస్తూర్బా నుంచి తోటి విద్యార్థినులతో కలిసి వచ్చిన మౌనిక పరీక్ష కేంద్రం వద్ద తండ్రితో కొద్దిసేపు గడిపింది. అనంతరం కృష్ణ తన కూతురికి ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపాడు. కూతురి కోసం నిజాంసాగర్ మండల కేంద్రంలోనే ఉన్న కృష్ణకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. అదే సమయంలో మౌనిక పరీక్ష పూర్తవడంతో బయటకు వచ్చింది. తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించి స్థానికుల సహాయంతో కృష్ణను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అయితే అస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందాడు. తండ్రి మృతితో రాత్రంతా రోదించిన మౌనికకు బంధువులు ధైర్యం చెప్పారు. తండ్రి మరణాన్ని తట్టుకొలేని మౌనికకు కుటుంబీకులు ధైర్యం చెప్పడంతో శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి వచ్చింది. బంధువుల సహకారంతో తెలుగు పరీక్ష –2 రాసిన అనంతరం మౌనిక తండ్రి అంత్యక్రియలకు వెళ్లింది. మృతుడికి ఐదుగురు కూతుళ్లు ఉండగా మౌనిక రెండో కూతురు. -
టెన్త్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి, బెంగళూరు (విజయపుర): విజయపుర జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని (15)పై కొందరు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడి, ఆ ఘోరం బయటపడకుండా హత్య చేయబోయారు. బాలిక రోజూ మాదిరి స్కూల్ ముగించుకుని సాయంత్రం 4:30 సమయంలో ఇంటికి బయలుదేరగా, నలుగురు దుండగులు బాలికను బలవంతంగా అరటి తోటలోకి ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. కుమార్తె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి వెతుకుతూ అరటి తోట వద్దకు చేరుకున్నాడు. అక్కడ కుమార్తె హాహాకారాలు విని పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఆయన వెళ్లేటప్పటికే బాలికను అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి దుండగులను తరిమికొట్టడంతో పాటు వీరేశ్ అనే నిందితున్ని పట్టుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయలేదని..
చైతన్యపురి: ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయలేదని మనస్థాపంతో ఓ ఎస్ఎస్సీ విద్యార్థి బ్లేడుతో చేయికోసుకున్న సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక గౌతంమోడల్ స్కూల్లో శివమణి అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. కొన్నిరోజులుగా ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయాలని ఇన్చార్జి టీచర్ మెహర్మణిని కోరుతుండగా, హెడ్ఆఫీస్ అనుమతి వచ్చిన తరువాత ఫేర్వెల్ పార్టీ డేట్ ప్రకటిస్తామని ఆమె తెలిపింది. ప్రీఫైనల్ పరీక్ష చివరిరోజు కావటంతో బుధవారం విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ విషయమై అడిగినా టీచర్ స్పందించక పోవటంతో మనస్థాపానిలోనైన శివమణి తరగతిగదిలో బ్లేడుతో చేయి కోసుకున్నాడు. దీనిని గుర్తించిన సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఎంఈఓ వెంకటేశ్వర్లు పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ప్రిన్సిపల్ రేణుకను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
తండ్రి కళ్లెదుటే కొడుకు మృతి
మంచాల: రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని ఆగాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక పో లీసుల కథనం ప్రకారం.. మాల్ గ్రామానికి చెందిన పల్లేటి చంద్రయ్య వృత్తి రీ త్యా ఆర్టీసీ డ్రైవర్. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలోని ఎన్టీఆర్ నగర్లో ఉం టున్నాడు. చంద్రయ్య కుమారుడు పల్లే టి ప్రవీణ్ కుమార్(21). కాగా ప్రవీణ్‌కుమార్ పదో తరగతి పరీక్ష ఫీజు కట్టడానికి తండ్రి చంద్రయ్యతో కలిసి హీరో హోం డా స్లె్పండర్పై మాల్ వైపు వెళ్తున్నారు. ఆగాపల్లి వద్దకు రాగానే మాల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రయ్యను చికిత్స నిమిత్తం నగరంలోని కామినేని వైద్యశాలకు తరలించారు. మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు. కళ్లముందే కొడుకు మరణించడంతో చంద్రయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మరో ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు... నగరంలోని బా లాపూర్‌కు చెందిన నారాయణ, అతని కు మారుడు వినయ్‌కుమార్ గురువారం మధ్యాహ్నం మాడ్గుల్ మండలం ఇర్విన్ గ్రామానికి వెళ్లి తిరిగి నగరానికి బైకుపై బయలుదేరారు. సాగర్‌రోడ్డు బాలగ్రా మ్ వద్దకు రాగానే యాచారం నుంచి మా ల్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న నారాయణ, అతని కుమారుడు వినయ్‌కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటయ్య తెలిపారు. బైకు ఢీకొని వృద్ధుడికి తీవ్రగాయాలు పరిగి: ప్రమాదవశాత్తు చేయి విరిగిన మనవడికి కట్టు కట్టించేందుకు వస్తే తాతకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పరిగి సమీపంలోని మల్లెమోనిగూడ దారిలో గురు వారం చోటు చేసుకుంది. వివరాలు.. దోమ మండల పరిధిలోని దిర్సంపల్లికి చెందిన బాలుడు మొగులయ్య(13)కు ఇటీవల ప్రమాదంలో గాయమై చేయి విరిగింది. కాగా అతని చేయికి కట్టుకట్టించేందుకు గురువారం తాత మాణయ్య(70) పరిగి మండలం మల్లెమోనిగూడ సమీపంలోని ఓ నాటు వైద్యుడిని అశ్రయించారు. అక్కడ కట్టు కట్టించుకుని తిరిగి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన పల్సర్ బైక్ ఢీకొంది. దీంతో మాణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంకా కేసు నమోదు కాలేదు. -
రాలిన విద్యాసుమం
రోజూలాగే పాఠశాలకు సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరిన ఆ చిన్నారిని మృత్యువు ట్రాన్స్‌కో వ్యాను రూపంలో బలిగొంది. పాఠశాలకు సహచర విద్యార్థినిలతో బయలుదేరిన ఆ చిన్నారి అంతలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కొల్పోయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుపై ఆసక్తితో కన్నతల్లిని వీడి పెద్దమ్మ ఇంటి వద్ద ఉన్న ఆ చిన్నారిని మృత్యువు కబళించడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చదువు కోసం పెద్దమ్మ దగ్గర ఉంచితే ఇలా చేశావా! దేవుడా!!అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... బాడంగి: మండల కేంద్రంలోని ఎత్తుఖానా సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగిరెడ్డి పార్వతి(15) అనే పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మండలంలోని పిన్నవలసకు చెందిన పార్వతి చదువు నిమిత్తం డొంకినవలసలోని పెద్దమ్మ గంటి శకుంతల ఇంటి వద్ద ఉంటోంది. ఇక్కడ నుంచే సైకిల్‌పై స్థానిక హైస్కూల్‌కు తోటి విద్యార్థినులతో కలసి రోజూ వెళ్లి వస్తోంది. రోజూలాగే గురువారం కూడా పాఠశాలకు సహచర వి ద్యార్థినులతో వెళ్తుండగా అడ్డురోడ్డు గుండా వస్తూ మలుపు వద్ద మెయిన్ రో డ్డు ఎక్కుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాన్స్‌కో వ్యాన్ బలంగా ఢీకొంది. పా ర్వతి రోడ్డుపైకి తుళ్లి పడిపోగా తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెం దింది. విద్యార్థి తల్లి శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ డి.రవికుమా ర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృత్యువై వచ్చి... రోజూలాగే పాఠశాలకు బయలుదేరిన పార్వతిని ట్రాన్స్‌కో వ్యాన్ మృత్యు రూపంలో దూసుకొచ్చి కాటేసింది. మలుపు వద్ద నెమ్మదిగా వస్తున్న పార్వతి సైకిల్‌ను అతి వేగంతో వస్తున్న ట్రాన్స్‌కో వ్యాను ఢీకొట్టి ఆమె కాలి పైనుంచి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణం విడిచిన పార్వతిని కళ్లారా చూసిన సహచర విద్యార్థినులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. పార్వతి మృతితో కన్నవారి గ్రామం పిన్నవలసతో పాటు పెద్దమ్మ గ్రామమైన డొంకినవలసలో విషాదం అలముకొంది. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. పరామర్శించిన డీఈఓ విద్యార్థిని పార్వతి దుర్మరణం చెందిన విషయం తెలుసుకొన్ని జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి, ఉప విద్యాశాఖాధికారిణి రమణమ్మ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థిని మృతదేహాన్ని సందర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. విద్యా శాఖ తరఫున రూ.పది వేలు ఆర్థిక సాయం తల్లిదండ్రులకు అందజేశారు. బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీనాయన సంతాపం తెలిపి రూ.5వేలు సాయం అందజేశారు. పాఠశాల హెచ్ఎం దాస్, సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని తమ సంతాపం తెలిపారు. -
మహిళా సర్పంచ్ కుమారుడి నిర్వాకం..
టేకులపల్లి: మహిళా సర్పంచ్ కుమారుడు ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే ముఖం చాటేస్తున్న ప్రియుడి ఇంటి ముందు బాధితురాలు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో బుధవారం వెలుగుచూసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ముత్యాలంపాడు పంచాయతీ కొత్తతండాకు చెందిన గ్రామ సర్పంచ్ బూక్య శాంతి కుమారుడు డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పరీక్షల అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేస్తున్నాడు. దీంతో బాధిత యువతి సర్పంచ్ ఇంటి ముందు బైఠాయించింది. ఆమె ఆవేదనను ఎవరు పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
టెన్త్ విద్యార్థిని అదృశ్యం
నంబులపూలకుంట : మండలంలోని పెడబల్లికి చెందిన చిన్నరెడ్డమ్మ(15) అనే విద్యార్థిని అదృశ్యమైనట్లు సమాచారం. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండగా, చివరి రోజైన గురువారం ఉదయం 9 గంటలకు ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. అయితే పరీక్ష కేంద్రానికి రాకపోవడంతో ఉపాధ్యాయులు వెంటనే ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపారు. కాగా విద్యార్థిని అదృశ్యంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రమేశ్‌బాబు తెలిపారు. -
టెన్త్ విద్యార్థి దారుణ హత్య
బెంగళూరులో ఇంటర్ విద్యార్థుల ఘాతుకం యలహంక (కర్ణాటక): బెంగళూరులో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య గొడవ హత్యకు దారితీసింది. యలహంకలో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. యలహంకలో ప్రభుత్వ పాఠశాల, కళాశాలలు ఒకే ఆవరణలో ఉన్నాయి. టెన్త్ విద్యార్థి హర్షరాజ్ (15), అతని ఇద్దరు మిత్రుల్ని ఇంటర్ (పీయూసీ) విద్యార్థి స్వస్తిక్, అతని బృందం మాట్లాడాలంటూ.. దగ్గర్లోని బార్ సందు లోకి తీసుకెళ్లారు. అక్కడ వారి మధ్య గొడవ చెలరేగడంతో ఇంటర్ విద్యార్థులు హర్షరాజ్ గుండెల్లో కత్తితో పొడిచారు. దీంతో విద్యార్థి అక్క డే ప్రాణాలొదిలాడు. మరో ఇద్దరు విద్యా ర్థులకు కూడా కత్తి గా యాలయ్యాయి. దీన్ని కొందరు స్థానికులు గమనించి ఇంటర్ విద్యార్థుల పైకి రాళ్లు విసరడంతో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకు ని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పలువురు చెబుతున్నారు. -
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
కదిరి టౌన్ : కదిరి మున్సిపల్ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన రాజు కుమార్తె రజిత(15) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ రాజేశ్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే ఆమె, తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఎలుకల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిందన్నారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లారన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అమ్మ లేదు.. నాన్న ఉన్నా లేనట్టే
* పదో తరగతి విద్యార్థిని దుస్థితి * అనారోగ్యంతో అవస్థ పాలకొల్లు అర్బన్ : ఈమె పేరు చిట్టాల స్రవంతి. యలమంచిలి మండలం ఇలపకుర్రు గ్రామానికి చెందిన స్రవంతి దొడ్డిపట్ల జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి రాంబాబు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. తల్లి పద్మ అనారోగ్యంతో 10 నెలల క్రితం మరణించింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ బాలిక రోగ పీడితురాలైంది. వృద్ధాప్యానికి చేరిన తాతయ్య సుబ్బారావు, నాయనమ్మ అనంతలక్ష్మి చెంతకు చేరిన ఆ బాలిక చదువు కొనసాగించలేక.. ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతోంది. దయార్ధ్ర హృదయులు స్పందించి ఆర్థిక సహాయం అందించాలని కోరుతోంది. ఆపరేషన్ చేయాలంటున్నారు స్రవంతి తాతయ్య సుబ్బారావు, నాయనమ్మ అనంతలక్ష్మి మాట్లాడుతూ.. ‘పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే ఆశతో ఎన్నో పూజలు చేసి.. ఎందరో దేవుళ్లకు మొక్కితే మాకు అబ్బాయి పుట్టాడు. రాంబాబు అని పేరు పెట్టుకున్నాం. వాడికి పెళ్లి చేశాం. కూతురు పుట్టిన కొన్నిరోజులకు ఇల్లు విడిచిపోయాడు. ఎప్పటికైనా తిరిగొస్తాడని చూస్తుండగా.. ఈ మధ్యనే మా కోడలు కాలం చేసింది. ఆ దుఃఖం నుంచి తేరుకోకముందే గోరుచుట్టుపై రోకటి పోటులా మా మనుమరాలు స్రవంతి అనారోగ్యం పాలైంది. ఆమె మెడపై కణుతులు వచ్చాయి. పెద్దాసుపత్రులకు తీసుకువెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అయినా ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి వైద్యుల సూచన మేరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చూపించాం. మెడ వాపులు తగ్గితే ఆపరేషన్ చేయవచ్చంటున్నారు. మేం బతకడమే కష్టంగా ఉంది. మా మనుమరాలు స్రవంతికి ఎలా వైద్యం చేయించాలో అర్థం కావడం లేదు. బిడ్డ కోలుకుంటే చదువుకునే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దయార్ధ్ర హృదయులు స్పందించి ఆర్థిక సహాయం అందిస్తే పాపకు వైద్యం చేయిస్తాం. సాయం చేయదలచిన వారు 78425 62505 సంప్రదించాలి’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. -
విద్యార్థినికి తండ్రి మరణం తెలియనీయలేదు...
పదో తరగతి పరీక్ష రాసే ఓ విద్యార్థిని తండ్రి ప్రమాదవశాత్తూ మృతి చెందగా... ఆ విషయం తెలిస్తే అతడి కుమార్తె పరీక్షపై ప్రభావం పడుతుందని తెలియనీయలేదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గుడికందుల దేవేందర్ (41) కట్రియాల పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులకు వెళ్లగా... అక్కడ కింద పడి తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు. దేవేందర్ కుమార్తె కావ్యశివాని సోమవారం పదో తరగతి పరీక్ష రాయాల్సి ఉంది. తండ్రి మరణం విషయాన్ని ఆమెకు తెలియకుండా ఉంచడంతో... కావ్య యథావిధిగా పరీక్ష రాయడానికి వెళ్లింది. ఆమె పరీక్ష నుంచి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
తాతా నాన్నమ్మలే స్ఫూర్తి
పక్కవాడేమైపోతే నాకెందుకు..అనుకునే వారు ఉన్న ఈ రోజుల్లో ఒక బాలుడు తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నలుగురిని కాపాడి అందరి చేత భేష్ అనిపించుకున్నాడు. పదోతరగతి విద్యార్థి అయిన కొయ్యాన రాకేష్ మండలంలోని కనుగులవానిపేటలో మంగళవారం ఊటబావిలో మునిగిపోతున్న నలుగురు చిన్నారులను క్షేమంగా బయటకు తీసి ఆ కుటుంబాలకు మరచిపోలేని సంతోషాన్ని అందించాడు. మండలంలోని కనుగులవానిపేటలో ముగ్గురు చిన్నారులు ఊటగెడ్డలో మునిగి చనిపోయిన విషాదాంతం విదితమే.. అయితే ఈ దారుణ ఘటనలో మరో నలుగురు చిన్నారులు మృతువు అంచులదాకా వెళ్లి క్షేమంహా బయటపడ్డారు. దీనికి కారణం కొయ్యాన రాకేష్ అనే సాహస బాలుడు. అతడు సాహసం చేసి పది అడుగుల లోతు ఉన్న ఊట గెడ్డలోకి దూకి కొన ఊపిరితో ఉన్న కనుగుల ఇందు, కనుగులు హారిక, టి. ధరణి, పి. కల్పనలను కాపాడాడు. మిగిలిన వారిని కాపాడుదామని ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఎంతశ్రమించినా వారి ఆచూకీ లేకపోయింది. ఇంకా ఎవరైనా దొరుకుతారేమోనన్న ఆత్రుతతో వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. గ్రామస్తులు ఊటగెడ్డ ఒడ్డుకు చేరుకుని గాలించారు. అయినా ఆ ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మూడేళ్లకే తల్లిని కోల్పోయినా.. సాహస బాలుడు కొయ్యాన రాకేష్ ఇప్పలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. రాకేష్‌కు మూడేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి రాకేష్ సంరక్షణ బాధ్యత అంతా నాన్నమ్మ, తాతయ్యలు రమణమ్మ, మల్లేసులపై పడింది. వృద్ధాప్యంలో ఉన్నా వారు పొలం పనులు చేసుకుంటూ రాకేష్‌ను పెంచుతున్నారు. వారి మాటలే రాకేష్‌కు స్ఫూర్తి గా నిలిచాయి. రాకేష్‌కి తల్లి తండ్రీ, దైవం అన్ని ఆ తాతా నాన్నమ్మలే. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినప్పటికీ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా చదువుల్లోనూ రాణిస్తూ.. పనుల్లో నాన్నమ్మ, తాతయ్యలకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులను కోల్పోతే కలిగే కష్టం తనకు తెలుసునని, అందుకే అటువంటి కష్టం ఇంకెవరికీ రాకూడదనే ఉద్దేశంతో చిన్నారులను కాపాడాలనే ఆత్రుతతో ప్రమాదకమని తెలిసినా మరో ఆలోచనే లేకుండా ఊటగెడ్డలోకి దూకానని చెప్పాడు. ముగ్గురు పిల్లలను కాపాడానని, అయితే నాలుగేళ్ల పాప అప్పటికీ పూర్తిగా మునిగిపోయిందని, జుత్తు మాత్రమే కనిపించగానే ఊపిరి బిగపట్టి ప్రయత్నించగా ఆ పాపను కూడా కాపాడగలిగానని అన్నాడు. సాహస బాలునికి జిల్లా కలెక్టర్ అభినందన శ్రీకాకుళం టౌన్ : శ్రీకాకుళం మండలం కనుగులవానిపేట గ్రామం సమీపంలోని ఉప్పుగెడ్డలో మునిగిపోతున్న ముగ్గరు చిన్నారులను రక్షించడంతోపాటు మృతుల సమాచారాన్ని గ్రామస్తులకు వేగంగా అందించిన సాహసబాలుడు కొయ్యాన రాకేష్ (16)ను గురువారం కలెక్టరు పి. లక్ష్మీనృసింహం అభినందించారు. మృత్యుంజ యులుగా మిగిలిన చిన్నారులు కల్పన, ఇందు, ధరణిల కుటుంబ సభ్యులను కడుపుకోత నుంచి రక్షించిన ఘనత రాకేష్‌కు దక్కిందని ప్రశంసించారు. గ్రామస్తులతో కలిసి రాకేష్ కలెక్టర్‌ను కలిశారు. నిరుపేదలైన కుటుంబాలను విషాదం నుంచి తప్పించిన రాకేష్ సాహసాన్ని మెచ్చి రాష్ర్టపతి పురస్కారానికి సిఫార్సు చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కలెక్టర్‌ను కలసిన వారిలో శ్రీకాకుళం డీఎస్పీ కె. భార్గవరావు నాయుడు, కళ్లేపల్లి నీటిసంఘం అధ్యక్షుడు కలగ శివప్రసాద్ హాజరయ్యారు. -
సిగరెట్లు తీసుకురాలేదని....
-
పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య
మెదక్ : ప్రవర్తన మార్చుకోమని ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ... గ్రామానికి చెందిన భాగ్యశ్రీ (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఈ క్రమంలో తోటి విద్యార్థులతో చనువుగా ఉండటాన్ని గమనించిన ఉపాధ్యాయులు ప్రవర్తన మార్చుకోమని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి భాగ్యశ్రీని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో దారుణం చోటు చేసుకుంది. మామిడి కాయ ఇస్తానని చెప్పి ఓ ఐదేళ్ల చిన్నారిపై పదోతరగతి విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వెంకటాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెలుగు చూసింది. వివరాలు..గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పదోతరగతి విద్యార్థి తన పక్కింటిలో ఉండే బాలికకు మామిడి కాయ ఇస్తానని చెప్పి ఆదివారం సాయంత్రం తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసిన బాలుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం బాలికకు అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. -
పదో తరగతి విద్యార్థి దారుణ హత్య
పండగ వేళ ఆ ఇంటిని విషాదం ఆవరించింది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదామని సెలవులకు ఇంటికి వచ్చిన ఆ విద్యార్థి పినతండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో చెలరేగిన బాబాయి బాణాలతో విచక్షణా రహితంగా పొడవడంతో ఈ ఘటన జరిగింది. ఫలితంగా గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. చింతకర్రపాలెం(వై.రామవరం) : వై.రామవరం మండలం చింతకర్రపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి పదో తరగతి విద్యార్థి పల్లాల సంజీవరెడ్డి (15) దారుణ హత్యకు గురయ్యాడు. సొంత పిన తండ్రి పల్లాల అబ్బా యిరెడ్డి అలుగులు(బాణాలు)తో ఛాతీపై పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. ఫలితంగా పండగ వేళ ఆ కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో షల్లాల అబ్బయిరెడ్డి తప్ప తాగి అతని భార్య సరస్వతిని చితక బాదుతున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న అన్నకొడుకు సంజీవరెడ్డి, మరికొంత మంది కుటుంబ సభ్యులు అడ్డు వెళ్లారు. ఆమెను కొట్టవద్దని నచ్చజెప్పారు. దీంతో మద్యం మత్తులో ఆగ్రహోద్రోగుడైన అబ్బాయిరెడ్డి రెచ్చిపోయాడు. తన ఇంటిలోంచి అలుగులు(బాణాలు) తీసుకొచ్చి సంజీవరెడ్డి ఛాతీపై విచక్షణా రహితంగా రెండు పోట్లు పొడిచాడు. దీంతో అతను కుప్పకూలి మృతిచెందాడు. మృతుడు వై.రామవరం మండలం పనసలపాలెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఘటనపై శనివారం ఉదయం గ్రామస్తులు వై.రామవరం పోలీసు లకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎసై్సలు లక్ష్మణరావు, అప్పన్న సిబ్భందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీఆర్వో బత్తుల ముణీంద్రం సమక్షంలో వాంగ్మూలాలు రికార్డుచేశారు. నిందితునిపై కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ సాక్షితో మాట్లాడుతూ నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు. గతంలో మండలంలోని మడుగు కోట గ్రామానికి చెందిన కిలో ఆనందరావును రాళ్లతో కొట్టి, హత్యా యత్నానికి పాల్పడిన మరో కేసులోనూ నిందితుడు సెంట్రల్ జైలులో రిమాండ్‌కు వెళ్లివచ్చాడని వివరించారు. ఇదిలా ఉండగా, అలాంటి వ్యక్తిని వదలవద్దని గ్రాముస్తలు సీఐకి విన్నవించారు. ఎదిగొచ్చిన కొడుకును దారుణంగా హతమార్చాడని సంజీవరెడ్డి తల్లిదండ్రులు సోమిరెడ్డి, బంగారమ్మ కన్నీరుమున్నీరయ్యారు. నిందితుని కఠినంగా శిక్షించాలని కోరారు. వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉంటాడనుకున్న కొడుకును కడతేర్చాడని రోదిస్తున్నారు. -
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
పాఠశాల కరస్పాండెంట్ వేధింపుల వల్లేనని తండ్రి ఫిర్యాదు కారేపల్లి : పదోతరగతి విద్యార్థిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి, పోలీసులు తెలిపిన ప్రకారం... ఖమ్మం జిల్లా మాదారం గ్రామ పంచాయతీలోని కొత్తతండా గ్రామానికి చె ందిన బాణోతు నాగమణి(15) స్థానిక ప్రగతి విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 7న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లిన నాగమణిని పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డి స్కూల్ ఫీజు అడిగాడు. ఫీజు చెల్లించలేకపోతే తన గదికి రావాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీంతో, ఆమె రెండు రోజుల నుంచి పాఠశాలక వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని తండ్రి శంకర్ గురువారం ఉదయం ప్రశ్నించడంతో.. ఆమె అసలు విషయం బయటపెట్టింది. పాఠశాలకు వెళ్లవద్దని చెప్పి, ఆయన పొలం పనులకు వెళ్లాడు. ఆ తరువాత ఆమె ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని సింగరేణి తహసీల్దారు ఎం.మంగీలాల్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కారేపల్లి పోలీసులు పంచనామా నిర్వహించారు. నాగమణి తండ్రి ఫిర్యాదుతో పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డిపై ఎస్ఐ బి.మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, నాగమణి ఆత్మహత్యపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
మరో కీచక టీచర్
పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం పోలీసులకు ఫిర్యాదు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా టీచర్‌ను సస్పెండ్ చేసిన డీఈవో చౌడేపల్లె: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో కీచ క టీచర్ వెలుగులోకి వచ్చాడు. పదో తరగతి విద్యార్థినిపై అత్యాచార య త్నానికి పాల్పడ్డాడు. న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధిత విద్యార్థి, సహ విద్యార్థినుల కథనం మేరకు.. మండలంలోని గోసలకురప్పల్లెకు చెందిన విద్యార్థిని (15) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోం ది. ఆదివారం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తామని గణితం ఉపాధ్యాయుడు రమేష్‌కుమార్‌రెడ్డి చెప్పడంతో వెళ్లారు. చాలామంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో క్లాసు లు నిర్వహించకుండా విద్యార్థులతో క్లాసులకు సున్నం కొట్టించే పని మొదలుపెట్టాడు. అదే సమయంలో గేమ్స్ రూమ్ తాళాలు తెప్పించాడు. ఒక బాలిక దాహం వేస్తుందని చెప్పడంతో ఆమెకు గేమ్స్ రూమ్ తాళాలిచ్చి నీరు తాగి రమ్మని చెప్పాడు. ఆ బాలిక నీరు తాగుతుండగా వెనుకనే వచ్చిన ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు వి షయం చెప్పింది. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పోలీసులు అత న్ని అదుపులోకి తీసుకున్నారు. సహచర ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కీచక ఉపాధ్యాయుడిపై నిర్భయ కేసు నమోదు చేయాలంటూ ధర్నా చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు డిమాండు చేశా రు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కీచక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నిం చిన కేసులో రమేష్‌కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి ఆదివారం ఫోన్ ద్వా రా ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ జరిపి, పునరావృతం కాకుం డా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
పదో తరగతి విద్యార్థినిపై ఢిల్లీలో గ్యాంగ్‌రేప్
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణ అత్యాచారం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 19న జరిగిన ఈ దారుణంపై కుటుంబ సభ్యులతో కలసి బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 19న స్కూల్‌కి వెళుతున్న విద్యార్థినిని నలుగురు వ్యక్తులు బలవంతంగా ఉత్తమ్ నగర్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఆ నలుగురితోపాటు మరొకరు కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు బాలురు కూడా ఉన్నారు. అత్యాచారం చేయడంతోపాటు దాన్ని మొబైల్లో చిత్రీకరించిన నిందితులు ఎవరికైనా చెబితే ఇంటర్నెట్లో పెడతామని బెదిరిం చినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది. కాగా, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని వారు బాధితురాలికి తెలిసినవారేనని పోలీ సులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా, బెంగళూరులోని ఓ స్కూల్లో ఒకటో తరగతి బాలిక(6)పై అత్యాచారం కేసులో పోలీసులు స్కూల్ జిమ్ ఇన్స్ట్రక్టర్లు లాల్‌గిరి (21), వాసిం పాషా (28)లను అరెస్ట్ చేశారు. -
జీవితమే ముగిసింది!
ఈరోజే చివరి పరీక్ష.. దాంతో పరీక్షలు ముగిసిపోతాయి.. ఇక అంతా ఆటవిడుపే..అన్న ఆనందంతో వెళ్లిన ఆ విద్యార్థి జీవితమే ముగిసిపోయింది. కారు రూపంలో మృత్యువు అతన్ని కబళించింది. పరీక్షలు అయిపోతాయి.. అటునుంచి అటే సినిమా చూసి వస్తానని వెళ్లిన కొడుకు ఇక తిరిగిరాడని తెలుసుకున్న ఆ పేద తల్లిదండ్రుల గండెలవిసిపోయాయి. కూలీనాలీ చేసి రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తున్న కొడుకు ప్రయోజకుడవుతాడన్న వారి ఆశలను విధి అర్ధంతరంగా తుంచేసింది. తీరని విషాదంలో ముంచేసింది. సంఘటన స్థలంలో మృతదేహం తప్ప ప్రమాదానికి కారణమైన కారు లేదు.. ప్రమాదానికి కారకులైన వారితో పోలీసులు కుమ్మక్కై పంపించేశారన్న భావన.. విషాదంలో ఉన్న మృతుడి బంధువులు, గ్రామాస్తుల్లో ఆవేశాన్ని ఎగదోసింది. ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. ఇంకేముంది.. సీఎస్పీ ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా మృతదేహంతో బాధితులు బైఠాయించారు. ఆవేశాగ్నితో జ్వలించిపోయారు. నచ్చజెప్పబోయిన పోలీసులపై తిరగబడ్డారు. కొందరు చేయి కూడా చేసుకున్నారు. అయినా పోలీసులు ఏమాత్రం సంయమనం కోల్పోలేదు. గంటల తరబడి బాధితులతో చర్చలు జరిపారు. తమ తప్పేమీ లేదని నచ్చజెప్పారు. చివరికి వారిని శాంతింపజేశారు. అప్పటికే ఐదు గంటలపాటు సుమారు 10 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సంఘటనతో వీరఘట్టం మండలం చిట్టిపుడివలస జంక్షన్ అట్టుడికిపోయింది. చిట్టపుడివలస (వీరఘట్టం), న్యూస్‌లైన్ :రోడ్డు ప్రమాదంలో పదో తరగతి పరీక్షకు వెళుతున్న విద్యార్థి మృతి చెందాడు. సమాచారం అందుకుని వచ్చిన మృతుడి బంధువులకు సంఘటన స్థలంలో ప్రమాదానికి కారణమైన వాహనం కనిపించలేదు. దీంతో వారు తీవ్ర ఆవేదనకు గురై ఆందోళన చేపట్టారు. ఒక దశలో పోలీసులపై చేయి చేసుకున్నారు. ఆవేదన, ఆగ్రహంతో ఉన్న మృతుడి బంధువులకు సరైన సమాచారం అందకపోవడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల సంయమనం, ఆందోళనకారులతో జరిపిన చర్చలతో సుమారు ఐదు గంటల ఆందోళన విరమించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... వంగర మండలం పెదరాజుల గుమ్మడకు చెందిన కెంగువ గోవింద (15) కోదులగుమ్మడ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతనికి వీరఘట్టం జెడ్పీ హైస్కూల్‌ను పదో తరగతి పరీక్ష కేంద్రంగా కేటాయించారు. రోజూ నాగావళి నది దాటి విక్రమురం మీదుగా వీరఘట్టం వచ్చి పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల ఆఖరు రోజైన మంగళవారం తన తల్లి రూపావతి (సూర్యుడమ్మ)తో కలిసి చిట్టపుడివలసలోని పిన్నిగారింటికి చేరుకున్నాడు. వారాలున్నాయని తల్లి ఉండిపోవడంతో ఉదయం 8 గంటలకు చిట్టపుడివలస నుంచి తోటి విద్యార్థులతో కలిసి సైకిళ్లపై వీరఘట్టం బయలుదేరాడు. చిట్టపుడివలస జంక్షన్లో సైకిల్‌ను శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో పడిపోయిన గోవింద తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న నాగరాజుకు కుడికాలు విరిగిపోయింది. కారు లేకపోవడంతో... సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుంటుండగా, గోవింద తల్లిదండ్రులు రూపావతి, సత్యనారాయణ, ఆ గ్రామ సర్పంచ్ వావిలపల్లి వర్దన్రావు తదితరులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి విలపించారు. ప్రమాదానికి కారణమైన కారు ఘటన స్థలంలో లేకపోవడంతో వారిని ఆగ్రహానికి గురి చేసింది. కారు యజమానితో పోలీసులు కుమ్మక్కయ్యారని విరుచుకుపడ్డారు. ఏఎస్సై, ఇతర సిబ్బందిపై పె దాడి చేశారు. పోలీసులు చెప్పే మాటలు వినే పరిస్థితి లేదు. ఆందోళనకారులు ప్రధాన రహదారిపై అడ్డంగా రెండు టెంట్లు వేసి మృతదేహంతో బైఠాయించారు. స్తంభించిన ట్రాఫిక్ విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెదరాజుల గుమ్మడ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాకుళం-పార్వతీపురం సీఎస్పీ రహదారి దిగ్బంధంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాలకొండ సీఐ మజ్జి చంద్రశేఖర్, పాలకొండ ఎస్సై ఎల్.చంద్రశేఖర్, రేగిడి ఎస్సై ఎన్.కామేశ్వరరావు తదితరులు వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. తాము ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆందోళన విరమించారు. ఏఎస్సై బి.రామారావు కేసు నమోదు చేశారు. వీఆర్వో నగేష్ ఆధ్వర్యంలో పంచనామా జరిపి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సమాచార లోపంతో... ప్రమాదానికి కారణమైన వాహనం సంఘటన స్థలంలో ఉంటే ట్రాఫిక్‌కు ఇబ్బందని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ విషయం పోలీసులు చెప్పినా ఆగ్రహంలో ఉన్న మృతుడి బంధువులు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన సందర్భంగా వాహనాలు నిలిచిపోవడంతో మండుటెండలో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమీప కేంద్రం కేటాయిస్తే... పదో తరగతి పరీక్ష కేంద్రాల కేటాయింపులో విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం గోవింద ప్రాణా న్ని బలిగొందని పలువురు విమర్శిస్తున్నారు. వంగర మండల విద్యార్థులు వీరఘట్టం రావాలంటే నాగావళి నది దాటి రావాలి. రవాణా సౌకర్యం లేక సైకిళ్లపై రావాలి. వంగర మండలంలో ఆయా గ్రామాల సమీప పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించాలని సూచిస్తున్నారు. ఈ ఘటనతోనైనా విద్యాశాఖాధికారులు ఆ దిశగా యోచన చేయాలని కోరుతున్నారు. పెదరాజులగుమ్మడలో విషాదం వంగర : పదో తరగతి విద్యార్థి కెంగవ గోవింద మృతితో మండలంలోని పెదరాజులగుమ్మడలో విషాదం అలముకుంది. పరీక్ష రాసి వచ్చి సాయంత్రం వీరఘట్టంలో సినిమాకు వెళతానని చెప్పాడని గోవింద తల్లిదండ్రులు రోదించారు. మరో వారంలో కుమార్తె వివాహం జరగాల్సి ఉందని, ఈలోగా ఇలాగైందని రోదించారు. రోజూ విక్రమపురం మీదుగా వచ్చే వాడు ఆఖరి రోజున చిట్టపుడివలస మీదుగా వచ్చి ప్రాణాలు కోల్పోయాడని బావురుమన్నారు. గోవింద మృతికి జేకేగుమ్మడ జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం తెలిపారు. -
విద్యార్ధిని పై ప్రిన్సిపాల్ అత్యాచారం
-
మధ్యాహ్న భోజనం వికటించి...
చెన్నూరు, న్యూస్‌లైన్: మధ్యాహ్న భోజనం విషాహారమైంది. అన్నంలో బల్లి పడటాన్ని గమనించకుండా విద్యార్థులకు వడ్డించడంతో వాటిని తిన్న 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరుగా విద్యార్థులు వాంతులు చేసుకోవడాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. విద్యార్థులందరినీ సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. సంఘటన జరిగిందెలాగంటే... చెన్నూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉంటున్నారు. రోజులాగే శనివారం మధ్యాహ్నం కూడా ఏజెన్సీ నిర్వాహకులు పిల్లలకు భోజనం వడ్డించారు. వాటిని తిన్న వారిలో తొలుత భరత్ అనే పదో తరగతి విద్యార్థి తన పళ్లెంలో బల్లి ఉందంటూ ఉపాధ్యాయులతో పాటు వంట చేసేవారికి చూపించాడు. అంతలోనే మరో ఇద్దరు విద్యార్థులు వచ్చి తమకు కడపులో వికారంగా ఉందని చెప్పారు. దీంతో ఇన్చార్జ్ ఎంఈఓ, హెడ్మాస్టర్ వెంకటలక్షుమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయు లు కలసి విద్యార్థులను వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఇబ్రహీం, వైద్యాధికా రి రాఘవ వెంటనే విద్యార్థులను పరీ క్షించారు. పిల్లలకు ఎటువంటి ప్రమా దం లేదని నిర్ధరించారు. అయితే భరత్ అనే విద్యార్థి ఎక్కువగా భయపడటంతో అతనికి ప్లూయిడ్స్ ఎక్కించారు. మిగిలిన 16 మందికి మందులు, ఓఆర్ఎస్ ద్రావణం, బ్రెడ్ ఇచ్చారు. పాఠశాలకు చేరుకున్న అధికారులు సమాచారం అందిన వెంటనే స్థానిక తహశీల్దారు శాంతమ్మ, డీటీ వెంకటసుబ్బయ్య సహా చెన్నూరు సర్పంచ్ రాజేశ్వరి పాఠశాలకు చేరుకున్నారు. ఆ తరువాత పీహెచ్‌సీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అప్పటికే విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులతో ఆస్పత్రికి చేరుకున్నారు. తమ పిల్లకేమైందంటూ డాక్టర్లు, అధికారులను పదేపదే అడిగారు. పిల్లలకు ఏం కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సంఘటన ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ, తహ శీల్దార్ తెలిపారు. -
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
వడ్లమూడి(చేబ్రోలు), న్యూస్‌లైన్ : పదో తరగతి విద్యార్థి రైలు కిందపడి మరణించిన సంఘటన చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వడ్లమూడి గ్రామానికి చెందిన పఠాన్ మస్తాన్, మోతీల ఏకైక కుమారుడు షారుక్ ఖాన్ అడ్డరోడ్డులోని చాణక్య పబ్లిక్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి. స్కూల్లో ఆదివారం స్టడీ అవర్స్ నిర్వహిస్తుండటంతో పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు షారుక్ ఖాన్, మరో ఇద్దరు విద్యార్థులు బహిర్భూమికి ఉపాధ్యాయుల అనుమతితో వెళ్లారు. కొద్ది సేపటికి ఇద్దరు తిరిగి వచ్చేశారు. షారుక్‌ఖాన్ మాత్రం తిరిగి రాలేదు. గుంటూరు-రేపల్లె ప్యాసింజర్ రైలు సంగం జాగర్లమూడి దాటి తెనాలి వైపు వెళ్తున్న సమయంలో చెట్లు పొదల నుంచి ఓ విద్యార్థి అకస్మాత్తుగా వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే అధికారులకు ట్రైన్ డ్రైవర్ సమాచారం అందించినట్లు తెలిసింది. విద్యార్థి యూనిఫాం ఆధారంగా పోలీసులు చాణక్య పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి విషయాన్ని తెలియజేయడంతో వారు వచ్చి పరిశీలించి షారుక్ఖాన్గా గుర్తించారు. ప్రిన్సిపాల్ శివరామకృష్ణ విషయాన్ని షారుక్‌ఖాన్ తల్లిదండ్రులకు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని పాఠశాలలో ఒత్తిడే ఆత్మహత్యకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఘోరావ్ చేశారు. స్కూల్ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ తెనాలి రహదారిపై బైఠాయించడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చేబ్రోలు ఎస్ఐ డి.వినోద్‌కుమార్ ఆందోళనకారులతో మాట్లాడి శాంత పరిచారు. ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిన్నంటిన రోదనలు..ఒక్కగానొక్క కుమారుడు మరణించటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలియగానే మృతుడి తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. తల్లిదండ్రులు తాపీ పని చేస్తూ షారుక్‌ఖాన్‌ను చదివించేవారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.