టెడ్డీబేర్‌తో అత్తను హతమార్చిన మేనల్లుడు | Tenth Student Killed His Aunty In Tamil Nadu | Sakshi
Sakshi News home page

అత్తను హతమార్చిన మేనల్లుడు

Published Mon, Aug 6 2018 9:05 AM | Last Updated on Mon, Aug 6 2018 9:05 AM

Tenth Student Killed His Aunty In Tamil Nadu - Sakshi

తమిళ్‌సెల్వి

టీ.నగర్‌: తన కుమార్తెతో మాట్లాడకూడదని మందలించడంతో అత్తను గొంతునులిమి హత మార్చినట్లు పదో తరగతి విద్యార్థి ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపింది. చెన్నై అమింజికరై వల్లలార్‌వీధికి చెందిన శంకర్‌ సుబ్బు (45) అదే ప్రాంతంలో కిరాణ దుకాణం నడుపుతున్నాడు. ఇతని భార్య తమిళ్‌సెల్వి (40). ఈ దంపతులకు  కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె సమీపంలోని పాఠశాల్లో 8వ తరగతి చదువుతోంది. ఈ స్థితిలో గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న తమిళ్‌సెల్వి చేతికి గాయంతో రక్తపు మడగులో పడి ఉంది. మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన శంకర్‌సుబ్బు భార్య స్పృహతప్పి ఉండ డం చూసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెంది నట్లు తెలిపారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అమింజికరై పోలీసులు కేసు విచారణ జరిపారు. ఈ లోపు కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పో స్టుమార్టం రిపోర్టు అం దింది. అందులో తమిళ్‌ సెల్వి ఆత్మహత్య చేసుకోలేదని గొంతు నులమడంతో ఊపిరాడక మరణించినట్లు తెలిపారు. మృతి చెందిన తరువాత చేతి మణికట్టుపై గాయం ఏర్పడినట్లు తెలిపారు. పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా పరిశీలనలు జరిపారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న శంకర్‌సుబ్బు సోదరి కుమారుడు పదో తరగతి చదువుతున్న బాలుడు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆ విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. ఆ సమయంలో విద్యార్థి తన అత్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన మామ శంకరసుబ్బు కుమార్తెపై తనకు ప్రేమ అని తాను ఆమెతో మాట్లాడడం అత్తకు నచ్చలేదన్నారు. ఆమె తనను ఇంటికి రావద్దని ఖండించడంతో ఆగ్రహంతో ఆమెను టెడ్డీబేర్‌తో హత్య చేసినట్లు తెలిపారు. ఆ తరువాత మణికట్టుపై కత్తితో కోసినట్లు తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement