విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్‌రేప్‌ | Tenth Class Student Molested By Seniors In Dehradun | Sakshi
Sakshi News home page

పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Published Tue, Sep 18 2018 4:48 PM | Last Updated on Tue, Sep 18 2018 6:07 PM

Tenth Class Student Molested By Seniors In Dehradun - Sakshi

డెహ్రడూన్‌ హాస్టల్‌ ఉంటూ పదోతరగతి చదువుతున్న విద్యార్థిని(16)పై సీనియర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

డెహ్రడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో 16 ఏళ్ల అమ్మాయిపై ఆమె సీనియర్లు నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక రోజు ముందు( ఆగష్టు 14) జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసి కూడా ఫిర్యాదు చేయకపోగా,అబార్షన్‌ చేయించడానికి ప్రయత్నించడం గమనార్హం.

డెహ్రడూన్‌ హాస్టల్‌ ఉంటూ పదోతరగతి చదువుతున్న విద్యార్థిని(16) గత నెల 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగే ఈవెంట్‌లో పాల్గొనాలంటూ సీనియర్లు ఫోన్‌ చేశారు. పాఠశాలకు వెళ్లిన ఆమెను ఒక స్టోర్‌రూంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేయగా పట్టించుకోలేదు. పైగా ఈ విషయాన్నిఇంట్లో చెప్పొందని హెచ్చరించారు. అబార్షన్‌ చేయిండానికి ఆస్పత్రికి సైతం తీసుకెళ్లారు. దీంతో ఆ అమ్మాయి తన అక్కకు అసలు విషయాన్ని చెప్పింది. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిపై అత్యాచారం చేసిన నలుగురు విద్యార్థులకు 17 ఏళ్ల వయసుంటుందని వారందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయట పడకుండా రుజువులను ధ్వంసం చేసినందుకు గాను... పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఆయన భార్య, హాస్టల్ వార్డన్‌లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement