
కుత్బుల్లాపూర్: పదో తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కాప్రా ప్రాంతానికి చెందిన ప్రణయ్ కుమార్ డిప్లమో చదువుతున్నాడు. బుధవారం అతను దూలపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అదే గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి విద్యార్థిని(15)తో పరిచయం చేసుకున్న ప్రణయ్ కుమార్ ఆమెను జోగిపేటలోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో గురువారం వారు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment