Boarding school
-
తండ్రి ఆశయాలతో..పేద పిల్లల కోసం ఫ్రీ బోర్డింగ్ స్కూల్
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే పిల్లల్లో ఒకరిగా మారి ఆనందించేవాడు.పేదపిల్లల కోసం ఏదైనా చేయాలనేది ఆయన కల. ఆ కల సాకారం కాకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.తండ్రి కలను నెరవేర్చడానికి సేవాపథంలోకి వచ్చింది పోర్షియా పుటతుండ... ఝార్ఖండ్‌లోని రాంచీలో పుట్టిన పోర్షియా పుటతుండ కోల్‌కతా, దిల్లీ, నోయిడా, ముంబైలలో పెరిగింది. పోర్షియా తండ్రికి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లలతో కలిసి నర్సరీ రైమ్స్ పాడడం ఇష్టం. ఆటలు ఆడుతూ పాఠాలు చెప్పడం ఇష్టం. గ్రామీణ ప్రాంతాలలోని పేదపిల్లలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంచేవాడు.పేద పిల్లల కోసం తనవంతుగా ఏదైనా చేయాలని నిరంతరం తపించేవాడు. తన కలలు సాకారం కాకుండానే ఆయన చనిపోయారు. తండ్రి జ్ఞాపకాల స్ఫూర్తితో ఆయన ఆశయాలను నెరవేర్చే క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కోమిక్ అనే గ్రామంలో అక్కడి అట్టడుగు వర్గాల పిల్లల కోసం ఫ్రీబోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది పోర్షియా. ‘హైయెస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా’గా పేరున్న కోమిక్లోని ఎంతోమంది పేద పిల్లలకు పోర్షియా ఇప్పుడు తల్లి, గురువు, సంరక్షకురాలు. జర్నలిజంలో డిగ్రీ చేసిన పోర్షియా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో పనిచేసింది. ఆ తరువాత ‘సీఎన్ఎన్’లో న్యూస్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహించింది. కొంతకాలం తరువాత జర్నలిజాన్ని వదులుకొని సేవాదారిలోకి వచ్చింది. పోర్షియా ఈ గ్రామాన్ని ఎంచుకోవడానికి కారణం? ఆమెకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. తొలిసారిగా హిమాచల్‌ద్రేశ్‌లోని స్పితి లోయకు వచ్చినప్పుడు తనకు ఎంతో మనశ్శాంతిగా అనుభూతి చెందింది. ఆ ప్రాంతంతో ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపించింది. తండ్రి చనిపోయిన తరువాత పోర్షియాపై కుంగుబాటు నీడలు కమ్ముకున్నాయి. చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి తనకు ఇష్టమైన ప్రదేశం గురించి పోర్షియా ఆలోచిస్తున్నప్పుడు స్పితి గుర్తుకు వచ్చింది. అక్కడి పేదపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు స్వయంగా తండ్రితో మాట్లాడినట్లే అనిపించింది. వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. స్కూల్ ప్రారంభానికి ముందు కజా ప్రాంతంలోని ఒక స్థానిక కుటుంబంతో నెలరోజులు గడిపింది. ఆ కుటుంబంలోని పిల్లలకు పాఠాలు చెప్పింది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించడం కోసం ఊళ్ల వెంట తిరుగుతున్నప్పుడు చదువుకు దూరమైన, సరైన చదువు లేని ఎంతోమంది పేదపిల్లలు కనిపించారు. వారిని విద్యావంతులను చేయాల్సిన అవసరం కనిపించింది. ‘ఉద్యోగాన్ని, ముంబైని విడిచి ఇక్కడకు రావడం అనేది సాహసంతో కూడుకున్న పని. కాని నేను ఇష్టంతో ఇక్కడకు వచ్చాను. ముంబైని విడిచి రావాలనే ఆలోచన నా స్నేహితులు, సన్నిహితులు ఎవరికీ నచ్చలేదు. తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నావు అని ముఖం మీదే చెప్పారు. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తావు అని కూడా అన్నారు. అయితే అవేమీ నా నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఇక్కడికి వచ్చిన తరువాత నా జీవితానికి ఒక పరమార్థం దొరికినట్లు అనిపించింది’ అంటుంది పోర్షియా. తొలి అడుగులో భాగంగా.... పిల్లలు ఆడుకునే చోటుకు వెళ్లేది. ‘మీకు బొమ్మలు ఎలా వేయాలో నేర్పిస్తాను’ ‘కొత్త ఆటలు నేర్పిస్తాను’ ‘ఇంగ్లీష్‌లో మాట్లాడడం నేర్పిస్తాను’ అంటూ వారితో స్నేహం చేసేది. చెట్టు కింద కూర్చొని బొమ్మలు గీయడం, రైమ్స్ పాడడం నేర్పేది. ఒక్కరొక్కరుగా నలభై మంది పిల్లల వరకు ఆమెకు దగ్గరయ్యారు. ఆ సమయంలో తనకు ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ఆలోచన వచ్చింది. కోమిక్‌లో ఒక ప్రదేశాన్ని అద్దెకు తీసుకొని ఫ్రీ బోర్డింగ్ స్కూల్ ప్రారంభించింది. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు పెద్ద సమస్య వచ్చింది. ‘ఇప్పుడు మా పిల్లలు చదువుకొని ఏం చేయాలి? చిన్నాచితకా పనులు చేసుకుంటే ఏదో విధంగా బతుకుతారు’ అంటూ పిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించేవారు. వారి ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడానికి పోర్షియా చాలా కష్టపడాల్సి వచ్చింది.పాఠాలతో పాటు తోటపని నుంచి నృత్యం వరకు పిల్లలకు ఎన్నో నేర్పుతోంది పోర్షియా. ‘నా కల సాకారం అవుతుందా, లేదా అనుకునేదాన్ని. స్కూల్ ప్రారంభించిన తరువాత నా మీద నాకు, నా పై పిల్లల పేరెంట్స్‌కు నమ్మకం వచ్చింది. ఇది తొలి అడుగు మాత్రమే’ అంటుంది పోర్షియా పుటతుండ. -
ఇంగ్లాండ్ బోర్డింగ్ స్కూల్‌కు తైమూర్!
ముంబై : బాలీవుడ్ స్టార్ కపూల్ కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ పుట్టినప్పటి నుంచి తరుచూ వార్తాల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే బోలెడంతా అభిమానులను కూడా సంపాదించుకున్నాడు ఈ స్టార్ కిడ్. ఈ పిల్లోడికి ఎంత క్రేజ్ ఉందంటే చిన్నప్పుడే సెలబ్రిటీగా మారిపోయాడు. తాజాగా మరోసారి తైమూర్ వార్తల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. తైమూర్ త్వరలో బోర్డింగ్ స్కూల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిన్నారి ముంబైలోని ఓ పాఠశాలకు వెళ్తున్నాడు. అయితే ఇంగ్లాండులోని బోర్డింగ్ స్కూల్‌కు పంపించడం పటౌడీ కుటుంబంలో ఓ సంప్రదాయమని, తమ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి తైమూర్‌ను విదేశాల్లోని ఓ బోర్డింగ్ స్కూల్‌కు పంపనున్నట్లు సమాచారం. (అమ్మో!.. ఆమె బ్యాగు అంత ఖరీదా!) కాగా సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ ఇంగ్లాండ్‌లోని బోర్డింగ్ స్కూల్లోనే చదివారు. అలాగే అతని పిల్లు సైఫ్, సోహా, సబా సైతం అక్కడే విద్యను అభ్యాసించారు. ఇక సైఫ్ అలీఖాన్, అమ్రితా సింగ్ పిల్లలు సారా, ఇబ్రహీం అలీఖాన్‌ను కూడా అక్కడే చదివించారు. దీంతో ఇప్పుడు తైమూర్ కూడా ఇంగ్లాండులోనే చదువుకుంటాడని అందరూ భావిస్తున్నారు. మరోవైపు తైమూర్‌ను ఇప్పుడే విదేశాలకు పంపించేందుకు సైఫ్, కరీనా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమ గారాల పట్టిని ఇంత చిన్న వయస్సులో అంత దూరం పంపించడానికి వీరు సిద్ధంగా లేరు. తైమూర్ చైల్డ్ హుడ్ అంతా కుటుంబంతో గడపాలని సైఫ్, కరీనా కోరుకుంటున్నట్లు, ఒక నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాతే విదేశాలకు పంపించాలని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.(అవునా.. కేర్‌టేకర్‌కు అంత జీతమా?!) చదవండి : చిట్టి తమ్ముడికి హీరోయిన్ విషెస్ -
విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్‌రేప్
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో 16 ఏళ్ల అమ్మాయిపై ఆమె సీనియర్లు నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన స్వాతంత్ర్యదినోత్సవానికి ఒక రోజు ముందు( ఆగష్టు 14) జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం పాఠశాల యాజమాన్యానికి తెలిసి కూడా ఫిర్యాదు చేయకపోగా,అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడం గమనార్హం. డెహ్రడూన్ హాస్టల్ ఉంటూ పదోతరగతి చదువుతున్న విద్యార్థిని(16) గత నెల 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగే ఈవెంట్లో పాల్గొనాలంటూ సీనియర్లు ఫోన్ చేశారు. పాఠశాలకు వెళ్లిన ఆమెను ఒక స్టోర్‌రూంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేయగా పట్టించుకోలేదు. పైగా ఈ విషయాన్నిఇంట్లో చెప్పొందని హెచ్చరించారు. అబార్షన్ చేయిండానికి ఆస్పత్రికి సైతం తీసుకెళ్లారు. దీంతో ఆ అమ్మాయి తన అక్కకు అసలు విషయాన్ని చెప్పింది. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిపై అత్యాచారం చేసిన నలుగురు విద్యార్థులకు 17 ఏళ్ల వయసుంటుందని వారందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయట పడకుండా రుజువులను ధ్వంసం చేసినందుకు గాను... పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, ఆయన భార్య, హాస్టల్ వార్డన్లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భోజనంలో పురుగులు.. ఎలుక
మునిపల్లి (అందోల్): గురుకుల పాఠశాల విద్యార్థులకు వడ్డించిన భోజనంలో పురుగులు, చనిపోయిన ఎలుక ప్రత్యక్షమయ్యాయి. ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని గురుకుల పాఠశాల హాస్టల్లో ఉదయం బగారా అన్నం పెట్టారు. ఏడో తరగతికి చెందిన అరుణ్ కొంచెం తినగానే తెల్లటి పురుగులు, మృతి చెందిన ఎలుక పిల్ల కనిపించాయి. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ విద్యార్థులకు చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. మధ్యాహ్నానికి వండుతున్న భోజనంలోనూ పురుగులు కనిపించడంతో తహసీల్దార్ పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అంటూ వార్డెన్ అశోక్, సిబ్బందిపై మండిపడ్డారు. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్: డబ్బులు పోయాయని.. తీసుకున్నవారు ఇచ్చేయాలని.. అడగటంతో అవమానభారానికి గురైన సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని పత్తిపాక కాలనీకి చెందిన కాగితపు శ్రీను, రాధికల పెద్ద కూతురు స్రవంతి(13) గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా, పార్ట్‌టైమ్ పీఈటీ సంధ్యారాణికి చెందిన రూ.350 చోరీకి గురయ్యాయి. దీంతో సోమవారం రాత్రి ఆమె విద్యార్థినులందరినీ పిలిచి డబ్బులు తీసిన వారు తెల్లవారే సరికి అక్కడే పెట్టాలని.. లేదంటే బాగుండదని హెచ్చరించింది. మంగళవారం ఉదయం స్రవంతి వాంతులు చేసుకొని పడిపోయింది. వెంటనే జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కొద్దిసేపటికే స్రవంతి మృతిచెందింది. కాగా, ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
టెన్త్ ప్రశ్నపత్రం తారుమారు
తొర్రూరు(పాలకుర్తి): పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రం తారుమారు చేసి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది. టెన్త్ పరీక్షల్లో శుక్రవారం గణితశాస్త్రం రెండో పేపర్ జరిగిం ది. రోజు స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలను సంబంధిత పరీక్షా కేంద్రానికి అరగంట ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడి అధికారులు గణితం ప్రశ్నపత్రానికి బదులుగా.. సాంఘికశాస్త్ర పేపర్‌ను తీసుకెళ్లారు. పాఠశాలలో ప్రశ్నపత్రం కట్టలను పరిశీలిస్తూ సంతకాలు చేస్తున్న సమయంలో జరిగిన తప్పు గుర్తించారు. వెంటనే ఆ ప్రశ్నపత్రాలను స్థానిక జెడ్పీ హైస్కూల్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన జిల్లా ఇన్చార్జి డీఈవో శ్రీనివాసాచారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే జెడ్పీ హైస్కూల్లో అదనంగా ఉన్న గణితం ప్రశ్న పత్రాన్ని ఇచ్చి పంపించారు. అప్పటికే 10 నిమిషాలు ఆలస్యం కాగా, పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూశారు. కాగా, ప్రశ్నప్రతం తారుమారయ్యేందుకు నెల్లికుదురు మండలం మేతరాజుపల్లి జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమేష్‌బాబు, మరిపెడ మండలం సీతారాంపూర్ స్కూల్ అసిస్టెంట్ రామ్మోహన్, తొర్రూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం వేణుమాధవరెడ్డి, నర్సింహులపేట మండలం పెద్దనాగారం జిల్లా పరిషత్ హెచ్ఎం కె.రమేశ్‌లను బాధ్యులను చేస్తూ.. వారిని సస్పెండ్ చేశారు. -
బీసీల అర్హత మార్కుల్లో మార్పు లేనట్లే!
త్వరలో గురుకుల టీచర్ల సవరణ నోటిఫికేషన్ హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో టీచర్ల పోస్టుల భర్తీకి త్వరలో విడుదలయ్యే సవరణ నోటిఫికేషన్లో బీసీ అభ్యర్థులకు నిరాశే మిగలనుంది. డిగ్రీ అర్హతలో ఓసీలతో సమానంగా పోటీ పడాల్సిందేనని తెలుస్తోంది. టీఎస్పీ ఎస్సీ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో డిగ్రీలో అర్హత 60% తప్పనిసరని పేర్కొంది. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఆందోళనలు వ్యక్తం కావడం, జాతీయ ఉపాధ్యా య విద్యామండలి(ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. డిగ్రీలో 50% మార్కులున్న వారికి అవకాశం కల్పిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన ఆదేశించడంతో అధి కారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ లకు డిగ్రీలో 45% మార్కులుంటే అర్హులుగా ప్రకటించే అవకాశముంది. బీసీల అర్హత మార్కుల్లో సడలింపు లేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారుల తో సమావేశమై నిబంధనలపై సమీక్షించారు. దీని ప్రకా రం ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు మాత్రమే సడలింపు ఇవ్వను న్నట్లు్ల తెలిసింది. వయోపరిమితిలో మాత్రం ఓసీలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. క్రాఫ్ట్ టీచర్ల అర్హతను ఇంటర్‌కు బదులుగా పదోతరగతి పరిమితం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వికలాంగుల రిజర్వే షన్లపైనా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చైనా పర్యటనలో ఉన్నారు. ఈ నెల 21న హైదరాబాద్ వచ్చేలోపు సవరణ నోటిఫికేషన్ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. -
50 శాతం చాలు
గురుకుల’ నియామకాల అర్హతలను సవరించిన సర్కారు సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ నియామకాల నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సవరిం చింది. డిగ్రీ, పీజీల్లో 50 శాతం మార్కులు ఉంటే చాలని స్పష్టం చేసింది. పీజీటీ అభ్యర్థులకు మూడేళ్ల బోధన అనుభవం లేకున్నా అవకాశమివ్వాలని నిర్ణ యించింది. మొత్తంగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలను అమలు చేస్తామని ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షను మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని గురుకులాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ట్రెయినీ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టు లకు డిగ్రీలో 60 శాతం మార్కులు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులతోపాటు మూడేళ్ల బోధన అనుభవం ఉండాలంటూ సంక్షేమ శాఖలు నిబంధనలు విధించాయి. దీనిపై ఉపాధ్యాయ అభ్యర్థులు, నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డిగ్రీ, పీజీల్లో 50 శాతం మార్కులుంటే చాలన్న ఎన్సీటీఈ నిబంధనలను ఉటంకిస్తూ ‘సాక్షి’ గురువారం ప్రత్యేక కథనాన్ని కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. ఎక్కువమంది నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు వెంటనే కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనలను, గతంలో అనుసరించిన విధా నాలు, న్యాయస్థానాల తీర్పులను పాటించా లని సూచించారు. గురుకుల విద్యా సంస్థల్లో అత్యుత్తమ బోధన జరగడంతో పాటు నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు రావడమే లక్ష్యంగా నియామకాలు ఉండాలని స్పష్టం చేశారు. ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు వచ్చిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిం చాలని, 60 శాతం మార్కులుండాలనే నిబం ధన తొలగించాలని ఆదేశించారు. మూడేళ్ల బోధన అనుభవం ఉండాలనే నిబంధన కూడా తొలగించాలని సూచించారు. డిగ్రీ, బీఎడ్, టెట్ అర్హత ఉన్న వారందరికీ ఎలాంటి బోధన అనుభవం లేకపోయినా అవకాశం ఇవ్వాలన్నారు. ఇక తెలుగు మీడియంలో పరీక్ష నిర్వహించాలనే విజ్ఞప్తినీ సీఎం పరిగణన లోకి తీసుకున్నారు. ఇందుకోసం ఎన్సీటీఈ మార్గదర్శకాలు, గతంలో న్యాయస్థానాల తీర్పులను పరిశీలించారు. అయితే ఏ మీడియం విద్యార్థులకు, ఏ మీడియంలో బోధించేందుకు నియామకాలు జరుగు తున్నాయో అదే భాషలో పరీక్ష నిర్వహిం చాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో గురుకుల నియామకాలకు తెలుగు మీడియంలో పరీక్ష రాసే అవకాశం లేనందున.. అభ్యర్థులు ఇంగిష్ మీడియం లోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వీటికి అనుగుణంగా తాజా మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మరో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేస్తాం
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ టౌన్: రాష్ట్రంలో మరో వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్ఆర్ఎన్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల 19వ వార్షికోత్సవంలో మంత్రి మాట్లాడారు. ఈ ఏడాది 400 గురుకులాలను ప్రారంభించిన సీఎం.. రానున్న రోజుల్లో వెయ్యి రెసిడెన్షియల్ గురుకులాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నారు. గురుకులాల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. -
గురుకుల విద్యార్థి అదృశ్యం
బోనకల్: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆ విద్యార్థి తాను చనిపోతానంటూ లేఖ రాసి తోటి విద్యార్థులకు ఇచ్చివెళ్లడంతో కలకలం రేగింది. తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల కథనం మేరకు.. ఏన్కూరు మండలం తూతూకలింగన్నపేట గ్రామానికి చెందిన కేతినేని రామారావు కుమారుడు రవి కుమార్ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో 5వ తరగతినుంచి విద్యనభ్యసిస్తున్నాడు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. జనవరి 1న మధ్యాహ్నం 3గంటల సమయంలో తోటి విద్యార్థులకు లేఖ ఇచ్చి కళాశాల నుంచి వెళ్లిపోయాడు. వెంటనే విద్యార్థులు ఆ లేఖను ప్రిన్సిపాల్ అంజలికి అందజేశారు. అదే రోజు సాయంత్రం 5 గం టలకు విద్యార్థి తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు సోమవారం కళాశాల వద్దకు చేరుకున్నారు. తోటి విద్యార్థులను ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థి లేఖపై తల్లిదండ్రులు ప్రశ్నించగా ప్రిన్సిపాల్ లెటర్ ఏమీ లేదని బుకాయించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్ఐ నారాయణరావు కళాశాలకు చేరుకుని విద్యార్థి అదృశ్యంపై విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్‌ను అడిగి వివరాలు సేకరించారు. అప్పటివరకు బుకాయించిన ప్రిన్సిపాల్ ఏఎస్ఐకి విద్యార్థి రాసిన లేఖ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆమెను నిలదీశారు. తాను చనిపోతానంటూ రవికుమార్ లేఖలో పేర్కొనడంతో చదివిన తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమారునికి ఏమైనా జరిగితే కళాశాల సిబ్బందే పూర్తిబాధ్యత వహించాలన్నారు. అధ్యాపకుల వేధింపులు భరించలేక.. తనకు ఆరోగ్యం సరిగాలేదని, కళాశాలలో చదవడం ఇష్టంలేదని, కొంతమంది గెస్ట్ అధ్యాపకులు తనను వేధిస్తున్నారని, ముఖ్యంగా సాంబ య్య అనే అధ్యాపకుడు వేధిపులు భరించలేకపోతున్నానని రవి కుమార్ రాసినæనోట్లో పేర్కొన్నాడు. ఇటీవల కళాశాలకు వచ్చిన ఉన్నతాధికారులకు కళాశాలలో భోజనం సక్రమంగాలేదని, తాను ఫిర్యాదుచేశానని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తనను సూటిపోటిమాటలతో వేధిస్తున్నారని రాశాడు. విద్యార్థితండ్రి రామారావు ఫిర్యాదుమేరకు ఏఎస్ఐ నారాయణరావు కేసు నమోదుచే శారు. విద్యార్థి అదృశ్యంపై కలెక్టర్ ఆదేశాలతో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రుషికేష్‌రెడ్డి సోమవారం కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ అంజలిని వివరాలడిగి తెలుసుకున్నారు. ఆమెనుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులపట్ల ఇంత నిర్లక్ష్యమైతే ఎలాఅని ప్రశ్నించారు. పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తానని తెలి పారు. ప్రిన్సిపాల్ అంజలి, గెస్ట్ టీచర్లు కూడా రోజూ అప్ అండ్ డౌన్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల బాగోగులను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై కళాశాల ఎస్ఎంసీ చైర్మన్ జిల్లా అధికారికి ఫిర్యాదుచేశారు. గతంలో ఒక విద్యార్థి కళాశాలనుంచి బయటకువచ్చి సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న రైలుఎక్కి విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. కళాశాల అధ్యాపకులతీరుపై మండలవాసులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
గురుకులాలన్నింటికీ శాశ్వత భవనాలు
శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన అన్ని గురుకుల పాఠశాలలకు ఒకే తరహా శాశ్వత భవనాలను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ భవనాల నిర్మాణానికిగాను డిజైన్లు తయారు చేస్తున్నామని, ఫిబ్రవరిలోపు అన్ని చోట్లా స్థలాలను సేకరించి మార్చిలో భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం శాసనసభలో వెల్లడించారు. సంక్షేమ గురుకులాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు హన్మంత్ షిండే, శంకర్‌నాయక్, శోభ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటివరకు అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించి మొత్తం 299 గురుకుల పాఠశాలలుంటే, తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండున్నరేళ్లలోనే 487 గురుకుల పాఠశాలలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.23 కోట్ల చొప్పున రూ.11,200 కోట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. -
గురుకుల పాఠశాల నుంచి విద్యార్థి పరార్..
-
హత్నూర పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
- ప్రతి నెలా విద్యార్థులకు స్కాలర్షిప్లు - హాస్టల్ సమస్యల పరిష్కారానికి విరాళాలు -పూర్వ విద్యార్థుల కన్వీనర్ పల్లె నరేందర్ సంగారెడ్డి మున్సిపాలిటీ : తాము చదువుకున్న పాఠశాల నేడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పాఠశాలలో చదవడం వల్లే తాము ఈ రోజు వివిధ రంగాల్లో స్థిరపడ్డాం.. మనకు జీవితం ఇచ్చిన స్కూల్‌కు చేయూత నివ్వాలనే ఆలోచన పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులకు వచ్చింది. అంతే 1991 నుంచి 2005 వరకు చదువుకున్న 1257 మంది పూర్వ విద్యార్థుల సమాచారం సేకరించారు. అంతటితో ఆగకుండా ఐదుగురు సభ్యుల (హత్నుర సర్పంచ్)ను కలుపుకోని కమిటీ నియమించారు. అందులో భాగంగా ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. హత్నూరలో పాఠశాల ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తయినందున అందులో చదువుతున్న విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఆరు నెలలకు ఒక సారి హాస్టల్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ పరంగా హాస్టల్ అభివృద్ధికి వచ్చే నిధులుపై ఆధార పడకుండా విద్యార్థులు ఎదుర్కొంటున్నా ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు గాను 1991 నుంచి 2005 వరకు చదువుకున్న విద్యార్థుల ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి విరాళాలను సేకరించాలని నిర్ణయించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో నైపుణ్యం పంపొందేలా అవసరమైన అవగాహన సదస్సులు చేపట్టాలని తీర్మానం చేశారు . ప్రతి సంవత్సరం 25 మంది విద్యార్థులకు ప్రతి నెలా స్కాలర్ షిప్ ఇవ్వాలని, ఇందుకోసం కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్యక్షుడు రవీందర్ తెలిపారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్.. 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన హత్నూర గురుకుల పాఠశాల ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది.. అక్కడ ఎటువంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఎలా సేకరించాలి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పూర్వ విద్యార్థులు సమీక్ష నిర్వహించారు. ఇందుకు గాను వివిధ హోదాల్లో ఉన్న వారితో పాటు కింది స్థాయిలో ఉద్యోగం చేస్తున్న వారు సైతం తాము చదువుకున్న పాఠశాల ఆభివృద్ధి కోసం నెలనెలా తమకు తోచినంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. జమ చేసిన డబ్బులతో పాఠశాలను, సర్పంచ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఐఎఎస్ అధికారి శంకరన్ జయంతి రోజు నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. పూర్వ విద్యార్థుల కన్వీనర్లు రాహుల్, కిరణ్, ప్రధాన కార్యదర్శి మోజెస్‌తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బంగారు బడులే..
నాణ్యమైన విద్యే ధ్యేయం ♦ సర్కారు పాఠశాలల్లో మెరుగైన వసతులు ♦ గత పాలకుల వల్లే వ్యవస్థ చిన్నాభిన్నం ♦ జిల్లాకు 30 గురుకుల పాఠశాలలు మంజూరు ♦ విద్యా సమీక్ష సమావేశంలో మంత్రి కడియం ♦ ‘భోజనం’లో తేడా రావొద్దు: మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కాక, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్, సాంకేతిక విద్య, ప్రాథమిక జిల్లా పరిషత్ విద్య పై విద్యాశాఖ, ప్రజా ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గానికి రూ. 5 కోట్లు ఎమ్మెల్యే నిధుల ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే మరో రూ. 5 కోట్లు ఇతర పద్దుల కింద మంజూరుచేసి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిధులు సమకూరుస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రాలేకపోతున్నారని, ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలే ప్రధాన కారణమని మంత్రి గుర్తు చేశారు. విద్యారంగానికి గత ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో పాఠశాలల్లో సమస్యలు నెలకొన్నాయన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన మాదిరిగా నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశాలను నిర్వహించినట్లయితే విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు కొంతమేరకైనా పరిష్కారమవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను పటిష్టపరిస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తారని అన్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే నాణ్యమైన విద్యతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విశాలమైన క్రీడా మైదానాలు, తరగతి గదులు ఉన్నా విద్యార్థులు పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవడం వెనక గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నిధులు వెచ్చించాల్సి ఉందని, వాటికి తోడుగా ప్రభుత్వం తరఫున కూడా 50 శాతం నిధులు మంజూరు చేస్తుందన్నారు. జిల్లాకు 11 మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీలకు 8, ఎస్టీలకు 8, మూడు డిగ్రీ కళాశాలలతో పాటు ఎస్సీ బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల కళాశాలలను మంజూరు చేశామన్నారు. జిల్లాకు మంజూరైన 30 గురుకుల పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశించారన్నారు. నాణ్యమైన ‘భోజనం’ అందిస్తాం సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో లోపాలను సవరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు గాను వారంలో మూడు రోజులు మండల విద్యాశాఖ అధికారులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడమేకాక, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. దీని ద్వారా నాణ్యమైన భోజనం అందుతుందో లేదో తెలుసుకోవచ్చన్నారు. పాఠశాలలకు పాత సన్న బియ్యాన్నే సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడైనా లోపాలు జరిగితే ఎంఈఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే నాసిరకపు బియ్యాన్ని సరఫరా చేసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని జేసీ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా అదనపు తరగతి గదులు, ప్రహరీలు, ఇతర భవనాల నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయని, అధికారులకు ఇచ్చే నివేదికల్లో ఆ శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఆ శాఖ ఏఈ అనిల్ కుమార్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు రావడం లేదని, వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి హరీష్‌రావు డీఈఓ నజీమోద్దీన్ను ఆదేశించారు. విద్యా వలంటీర్ల నియామకంలో జాప్యం జరగకుండా ఈ నెల 30 లోగా నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్ కళాశాలల పరిస్థితిపై ఆర్ఐఓ కిషన్ ఇచ్చిన వివరణపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. -
ఇదంతా రవళి చేసిందని ఎలా తెలిసింది?
గజ్జెల గజ్జి! మతాల గజ్జి... కులాల గజ్జి మనకు తెలిసినవే! కానీ... ఈ గజ్జెల గజ్జి ఏంటి? ఇది పెద్దవాళ్ల గొడవల గజ్జి... దానిని పిల్లలకూ అంటించారు. గజ్జెలకు తగిలిన ఆ అసూయ పిల్లలకూ పాకింది. వికసించే మనసులలో లయతప్పిన ఈ ధ్వనులు రాక్షస తాండవమాడాయి! అది సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల. వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో మళ్లీ పాఠశాల ప్రారంభమైంది. ఆరవ తరగతికి కొత్త బ్యాచ్ విద్యార్థుల నమోదు జరుగుతోంది. పాత పిల్లలు ఇంకా అందరూ రాలేదు. వారాంతానికి అందరూ దిగుతారు. అప్పటికే వచ్చిన వాళ్లలో కొత్త క్లాసుకెళ్తున్న ఉత్సాహం కనిపిస్తోంది. ‘‘కొత్త పుస్తకాలు ఎప్పుడిస్తారు మేడమ్’’ అని టీచర్లను అడుగుతున్నారు. ‘‘ఈ శనివారానికంతా వచ్చేస్తాయి. సోమవారం మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అప్పటి వరకు రఫ్ నోట్‌బుక్‌లో రాసుకోండి. మీ పాతటెక్ట్స్బుక్స్ పారేయకండి. మధ్యలో ఎవరైనా పుస్తకాలు పోగొట్టుకుంటే పనికొస్తాయి’’ అని టీచరు చెప్పేలోపే ‘‘కొత్త యూనిఫామ్ కూడా ఆ రోజే ఇస్తారా’’ ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. సిక్త్స్ క్లాసు నుంచి సెవెన్త్ కెళ్తున్న రూపను వాళ్ల అమ్మానాన్నలు తీసుకొచ్చారు. రూప బుగ్గల మీద కన్నీళ్లు చారికలు కడుతున్నాయి. అలాగే రూప చేయి పట్టుకుని ప్రిన్సిపల్ గదిలోకి తీసుకెళ్లారు. రిపోర్టు చేసి బయటకు వచ్చేశారు. రూప మాత్రం వాళ్ల అమ్మ కొంగు పట్టుకుని ఉంది. రూపకు కేటాయించిన గదికి వెళ్లడానికి ముందు ఓ పక్కగా నిలబడి ఉన్నారు ముగ్గురూ. ‘‘ఇక్కడ నేనుండనమ్మా’’ అని గునుస్తోంది రూప. ‘‘ఏం కాదమ్మా! చూడు అందరూ ఇక్కడ ఉండి చక్కగా చదువుకుంటున్నారు. మనూళ్లో పెద్ద బడి లేదు కద తల్లీ’’ అనునయిస్తోంది రూప తల్లి. ఇంటి నుంచి వచ్చినప్పుడు ఇదంతా మామూలే, రెండు రోజుల్లో పిల్లలు మామూలైపోతారు... అన్నట్లు అక్కడి టీచర్లు తమ వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. ఓ అరగంట గడిచిందో లేదో... రూప ఏడుపు వినిపించింది. టీచర్లు పరుగున వచ్చారు. రూప వాళ్ల అమ్మ కొంగును తన చేతికి గట్టిగా చుట్టుకుంటోంది. వదిలితే ఎక్కడ వెళ్లిపోతారేమోనన్న భయం ఆ కళ్లలో. ‘‘పిల్లలకు హోమ్‌సిక్‌నెస్ ఉంటుంది. మేము చూసుకుంటాం మీరు వెళ్లండి. దిగులు పడితే ఫోన్ చేయిస్తాం’’ అని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు టీచర్లు. అయినా వాళ్ల సంకోచం వదల్లేదు. రూప తల్లిని చుట్టేసుకుంది. ‘‘ఏమిటి ప్రాబ్లెమ్’’ అని ఓ టీచరు అడిగారు. తల్లి మెల్లగా నోరు విప్పింది... ‘‘మేడమ్! రాత్రిళ్లు పాపకు దెయ్యం కనిపిస్తోందట’’. టీచరు ఇబ్బందిగా చూసింది. ఇలాంటప్పుడు గద్దిస్తే పిల్లలు హడలిపోతారు. బుజ్జగించి నచ్చచెప్పాల్సిందే. రూపను దగ్గరకు పిలిచి... ‘‘దెయ్యం ఉందని నీకెలా తెలిసింది’’ అని అడిగారు. ‘‘నిద్రపోతుంటే పక్కనే గజ్జెల శబ్దం వినిపిస్తోంది’’ ‘‘మరి మిగిలిన వాళ్లకు వినపడదా’’ ‘‘ఉహూ... నాకు మాత్రమే మెలకువ వస్తోంది. ఎవరో కాలు మీద తట్టినట్లవుతోంది. లేచి చూస్తే ఎవరూ ఉండరు... గజ్జెల శబ్దం మాత్రం వినిపిస్తోంది’’. ఎలా నచ్చచెప్పాలా అని టీచర్ ఆలోచనలో పడ్డారు. తల్లి కొంగును గుంజుతూ ‘‘నేనుండనమ్మా’’... మళ్లీ మొదటికొచ్చింది రూప మారం. ఇంతలో మరో ఇద్దరు టీచర్లు చేరారు. ‘‘సరే, రూపా! వార్డెన్ మేడమ్ ఇక్కడే ఉంటారు. వాచ్‌మన్‌ను నీ బెడ్ దగ్గరే పడుకోమని చెప్తాను. నీకు గజ్జెల చప్పుడు వినిపించగానే అతడిని పిలువు’’ అని పాపకు ధైర్యం చెప్పి, తల్లితండ్రులకు నచ్చచెప్పి పంపించారు. అదే రోజు ఓ టీచరు అన్ని క్లాసులకెళ్లి ‘‘అందరూ కాలి పట్టీలు ఇచ్చేయండి’’ అని అడిగి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయానికి... రూప పుస్తకాలు చిందరవందరగా పడి ఉన్నాయి. కాగితాలను గట్టిగా లాగి చించినట్లున్నారెవరో. రూపకు ధైర్యం చెప్పి, ఏడుపు ఆపించి, స్కూలుకు పంపించేసరికి వార్డెన్‌కు చుక్కలు కనిపించాయి. ఆ రాత్రి రూపను క్లాస్ లీడర్ దగ్గర పడుకోబెట్టారు టీచర్లు. క్లాస్ లీడర్ ధైర్యమైన అమ్మాయి. రూపకు ధైర్యం చెప్తోంది. ఆ తర్వాతి రోజు తెల్లవారే సరికి... ‘‘రాత్రి కూడా గజ్జెల శబ్దం చెవిలో వినిపించింది’’ అని ఏడుపు లంకించుకుంది రూప. పిల్లలందరూ చుట్టూ చేరారు. రూపలో ఏదో తేడా కనిపిస్తోంది. ఏమిటా అని చూస్తే... జుట్టు కత్తిరించేసి ఉంది. అప్పటి వరకు ఆందోళన పడుతున్న ప్రిన్సిపల్కూ, టీచర్లకూ మబ్బు వీడిపోయినట్లయింది. వీలయినంత త్వరగా చెక్ పెట్టేయాలి. లేకపోతే స్కూలుకు చెడ్డపేరు వస్తుంది... అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రహస్యంగా దర్యాప్తు మొదలైంది. ఎంత గుంభనంగా ఉంచాలనుకున్నా విషయం బయటకు పొక్కింది. ‘హాస్టల్లో దెయ్యం తిరుగుతోందట’ అంటూ మొదలైన పుకారు రకరకాల అనుబంధ కథనాలతో చిక్కదనం సంతరించుకుంటోంది. కొందరు తల్లిదండ్రులు పాఠశాలకొచ్చి ప్రిన్సిపల్‌తో గొడవ పడుతున్నారు. ‘ఇక ఆలస్యం కాకూడదు’ ప్రిన్సిపల్ నుంచి ఘాటుగా ఆదేశం. స్కూల్ స్టాఫ్ అంతా రంగంలోకి దిగింది. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వారి ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. రూప గ్రామంలో తెలిసిన వారి ద్వారా కొంత ఆధారభూతమైన సంగతి తెలిసింది. దాంతో హాస్టల్లో శోధనకు ఆధారం దొరికినట్లయింది. గజ్జెల గుట్టు బయటపడింది. అప్పటి వరకు రూప చెవుల్లో మోగిన గజ్జెల చప్పుడు, స్టాఫ్ గుండెల్లో పరుగెత్తిన రైళ్ల చప్పుడు రెండూ ఆగిపోయాయి.(గోప్యత కోసం పేర్లు మార్చాం) - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదంతా రవళి చేసిందని ఎలా తెలిసింది? స్కూల్ స్టాఫ్ సేకరించిన సమాచారం ప్రకారం తర్జని రవళి వైపు చూపిస్తోంది. ఆ అమ్మాయి కదలికలను గమనించమని క్లాస్ లీడర్లకు చెప్పారు. రెండు రోజుల్లోనే ఆ అమ్మాయి కాలిపట్టీలు ఎక్కడ దాచిందో కనిపెట్టి తెచ్చి ఇచ్చారు. రోజూ వాటితో రూప చెవి దగ్గర, ఆమెకు మాత్రమే వినిపించేటట్లు శబ్దం చేసినట్లు రవళి ఒప్పుకుంది. ఏం జరిగిందంటే! రూప గ్రామానికి చెందిన మరొక అమ్మాయి రవళి కూడా అదే హాస్టల్లో ఉంటోంది. ఆ రెండు కుటుంబాలకు మధ్య మంచి సంబంధాలు లేవు. రవళి తల్లిదండ్రులు పిల్లల మధ్య కూడా కక్షలు పెరగడానికి కారకులయ్యారు. రూపను చదువుకోనివ్వకుండా హడలగొట్టి పంపేయాలనుకున్నారు. అందులో భాగంగానే రవళి తన కాలి పట్టీలతో రూప మంచం దగ్గర చప్పుడు చేయడం, పుస్తకాలు చించడం, జుట్టు కత్తిరించడం వంటివన్నీ చేసింది. మరి దెయ్యం భయం? పిల్లల్లో దెయ్యం భయం పోగొట్టడానికి కళాజాతాల సహకారం తీసుకున్నారు. వాళ్లు వర్క్‌షాప్ నిర్వహించి దెయ్యాలు, చేతబడులు ఉండవని కౌన్సెలింగ్ ఇచ్చారు. వెలుగుతున్న కర్పూరం నోట్లో వేసుకుని చూపించిన తర్వాత చాలా మంది అమ్మాయిలు తామూ చేస్తామని ముందుకొచ్చారు. ‘ఒక్కో బ్యాచ్‌కి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తుంటే, మరుసటి ఏడాదికి కొత్త బ్యాచ్ మూఢవిశ్వాసాలను మూటగట్టుకుని వస్తుంటుంది. వీటికి తోడు చీకటంటే పిల్లలకు స్వతహాగానే భయం ఉంటుంది. దాంతో కనీసం రెండేళ్లకోసారైనా ఇలాంటి సందర్భం ఒకటి ఎదురవడం, ఆ పరిస్థితిని సున్నితంగా అధిగమించడానికి కత్తిమీద సాము చేయడం మాకు అలవాటే’నంటుంటారు సంక్షేమ పాఠశాలల టీచర్లు. ఏ చప్పుడు విన్నా భయపడతారు! ఈ సంఘటన నేను పుడూరులో ఉన్నప్పుడు జరిగింది. ఇది చాలా సంకట స్థితి. సంక్షేమ హాస్టళ్లకు వచ్చే వారిలో ఎక్కువ మంది అల్పాదాయ వర్గాల వాళ్లే ఉంటారు. వెనుకబాటుతనంతోపాటు వారి జీవనశైలిలో మూఢవిశ్వాసాలు కూడా పాదుకుని ఉంటాయి. దెయ్యాలు, చేతబడులు... అనే పదాలను పిల్లలు తరచు వింటుంటారు. వారు గ్రామం వదిలి హాస్టల్‌కు వచ్చినా కూడా విశ్వాసాల ప్రభావం అంత త్వరగా వదలదు. హాస్టల్ అంటే కొత్త ప్రదేశం. అమ్మానాన్నలు, సొంతవాళ్లెవరూ ఉండరు. ఆ గుబులు మనసులో గూడు కట్టుకుని ఉంటుంది. ఏం జరిగినా, ఏది విన్నా తాము నమ్ముతున్న విశ్వాసాలతో అన్వయించుకుని భయపడిపోతుంటారు. ‘‘దెయ్యం లేదు, ఏమీ లేదు, వెళ్లి పడుకోండి’’ అని గట్టిగా అంటే ఇంకా భయపడిపోతారు. అందుకే అనునయంగా చెబుతుంటాం. - తన్నీరు శశికళ, పి. జి. టి, గణితం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, నాయుడుపేట సమన్వయం ఎలా! ఇద్దరి తల్లిదండ్రులకూ విషయం చెప్పి... పిల్లల మధ్య కక్షలు, కార్పణ్యాలు పెంచకూడదని, వారి మెదళ్లను కలుషితం చేయకూడని హితవు చెప్పారు టీచర్లు. రవళి పేరు బయటకు వస్తే ఆమెని దోషిగా చూస్తారని బయట పెట్టలేదు. స్నేహంగా ఉండకపోతే స్కూలు నుంచి పంపేస్తామని టీచర్లు భయపెట్టడంతో కొన్నాళ్లలోనే ఆ పిల్లలు కలిసిపోయారు. -
గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సంస్థ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ పి.వేణుగోపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 24 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 2003, సెప్టెంబర్ 1 నుంచి 2007, ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలని, బీసీ, ఓసీ విద్యార్థులైతే 2005, సెప్టెంబర్ 1 నుంచి 2007, ఆగస్టు 31 మధ్య పుట్టినవారై ఉండాలన్నారు. 2015-16 ఏడాదిలో తప్పనిసరిగా 4వ తరగతి చదివి ఉం డాలన్నారు. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికైతే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థులైతే రూ.2 లక్షలు మించి ఉండరాదని, సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి వర్తించదన్నారు. ఆసక్తిగల విద్యార్థినీ,విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు ఆన్లైన్లో రూ.50 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాల కోసం 98665 59678 నంబర్లో సంప్రదించవచ్చు. -
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలసలోని గురుకుల పాఠశాలను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆదివారం ఆకస్మిక తనఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాసిరకం భోజనాన్ని అందిస్తున్నారని గుర్తించి.. దీనికి బాధ్యుడైన ప్రిన్సిపల్‌పై మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పెడ చెవిన పెడుతోందని.. భావి పౌరులైన విద్యార్థుల విషయంలో ప్రభుత్వం చిత్త శుద్దితో వ్యవహరించడం లేదని ఆయన విమర్వించారు. -
ఇదేం గురుకులం?
ఒకప్పుడు గురుకుల పాఠశాలలంటే చదువు.. సంధ్యలతోపాటు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవి. తల్లిదండ్రులు వీటిని కార్పొరేట్ పాఠశాలలకంటే గొప్పగా చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర విభజన తరువాత వీటి మనుగడ రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. సమస్యలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. జిల్లాలోని ఒక్కో పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేవంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. - సమస్యలతో విద్యార్థుల సావాసం - చాలాచోట్ల మంచినీటికి ఇక్కట్లు - పీడిస్తున్న సిబ్బంది కొరత - సీఎం ఇలాకాలో మరిన్ని ఖాళీలు పలమనేరు: సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రాభవం ఏటా తగ్గుముఖం పడుతోంది. సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. జిల్లాకు సంబంధించి జోన్-4లో మొత్తం 13 (రామకుప్పం, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, చిత్తూరు, పీలేరు, బురకాయలకోట, పలమనేరు, సత్యవేడు, పుత్తూరు, మదనపల్లె, కుప్పం, జీడీ నెల్లూరు, పూతలపట్టు) పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఐదోతరగతి నుంచి ఇంటర్ ద్వితీయసంవత్సరం వరకు ఐదు వేలమందికిపైగా చదువుతున్నారు. గతంలో ఇక్కడ విద్యాబోధన, పాఠశాలల నిర్వహణ, నిధులు అన్నీ బాగుండేవి. కానీ ఇప్పుడు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మంచినీటికి కటకట పలు పాఠశాలల్లో విద్యార్థులకు తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. ఇక ఇతరత్రాలకు ఇబ్బందులే. రోజూవారీ స్నానాలూ కరువే. వారానికొక్కసారి మాత్రమే దుస్తులు ఉతుక్కోవాలి. పలమనేరు పాఠశాలలో పలుబోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. మున్సిపాలిటీ నుంచి అందే రెండు ట్యాంకర్లే దిక్కు.వీరు ప్రయివేటుగా నీటిని కొనుక్కొని ఎలా గో నెట్టుకొస్తున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని బొ.కొత్తకోట, రామకుప్పం, పీలేరు తదితర పాఠశాలల్లో నెలకొంది. పూర్తిస్థాయిలో అందని యూనిఫాం పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా అందరికీ యూనిఫాంలు అందలేదు. వీటిని కుట్టేందుకు టెండర్లు దక్కించుకొన్నవారు చాలా పాఠశాలలకు ఒకరిద్దరు కావడంతో ఓ చోట కుట్టి మరో చోటుకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సగం మందికి మాత్రమే యూనిఫాంలున్నాయి. వీటికి చున్నీలు కూడా ఇంతవరకూ రాలేదు. దాంతో గతేడాది యూనిఫాంనే వీరు ధరించాల్సి వస్తోంది. సీఎం సొంత ఇలాకాలో ఖాళీలు మెండు సీఎం సొంత నియోజకవర్గం కుప్పం గురుకుల పాఠశాల అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు దడుసుకుంటున్నారు. ఇక్కడ అన్నీ సమస్యలే. ఇక్కడ 40 సీట్లు వరకు ఖాళీలున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి మిగిలిన పలు పాఠశాలల్లో ఉంది. కానీ సంబంధిత ప్రిన్సిపాళ్లు మాత్రం తమకు ఖాళీలు పెద్దగా లేవంటూ చెప్పుకురావడం విమర్శలకు తావిస్తోంది. ఇక టీచింగ్ స్టాఫ్‌కు సంబంధించి 40 శాతం మంది మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులున్నారు. మిగిలినవారంతా కాంట్రాక్టు సిబ్బందే. నాన్ టీచింగ్ సా్‌టఫ్ ఖాళీలూ 40కి పైగా ఉన్నాయి. ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తే తప్ప ఇవి భర్తీకాని పరిస్థితి. ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులను కాంట్రాక్టు వారితో పూర్తిచేస్తే ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే విమర్శలున్నాయి. ఈ పోస్టుల నియామకాల్లోనూ సంబంధిత ప్రిన్సిపాళ్ల హవా కనిపిస్తోంది. మోడల్ స్కూళ్ల ఎఫెక్ట్ జిల్లాలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు, కస్తూర్బా పాఠశాలల కారణంగా వీటిల్లో చేరేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఏదేమైనా భవిష్యత్‌లో ఈ పాఠశాలల వన్నె తగ్గకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. అన్ని సమస్యలు సర్దుకుంటాయిలే.. జిల్లాలోని పలు చోట్ల నీటి సమస్య ఉంది. ప్రయివేటుగానే నీటిని కొంటున్నాం. ఇక యూనిఫాంలు వచ్చేనెల 15లోపు అందేలా చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్టు అధ్యాపకులకు కౌన్సెలింగ్ చేశాం. కుప్పంలో మాత్రం ఖాళీలున్నాయి. త్వరలో అన్నీ సర్దుకుంటాయిలే.. - స్వర్ణకుమారి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కన్వీనర్, శ్రీకాళహస్తి -
గురుకులంలో కలకలం
-
గురుకులంలో కలకలం
కలుషితాహారం తిన్న 90 మంది విద్యార్థులకు అస్వస్థత మోపిదేవిలో ఘటన తల్లిదండ్రుల్లో ఆందోళన ప్రాణాపాయం లేదన్న డీఎంహెచ్‌వో మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్ల పరామర్శ ‘బాబూ ఎలా ఉన్నావు..అసలేం జరిగింది’ ఓ తల్లి ఆవేదన. నాన్న నీకేం కాదురా కన్నా... బాధపడకు మరో తండ్రి ఓదార్పు..ఇవీ మోపిదేవి గురుకుల పాఠశాలలో గురువారం కనిపించిన దృశ్యాలు. ఫుడ్ పాయిజన్‌తో 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని టీవీ చానల్స్ ద్వారా తెలుసుకున్న మూడు జిల్లాల్లో ఉన్న తల్లిదండ్రులు హుటాహుటిన మోపిదేవికి పరుగులు తీశారు. పాఠాలు చదువుకునే గదుల్లోని బల్లలపైనే సెలైన్స్ ఎక్కించుకుంటున్న పిల్లలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మంచి విద్య అందిస్తారని పాఠశాలకు పంపితే అధికారుల నిర్లక్ష్యం తమ చిన్నారుల ప్రాణాలమీదకు తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోపిదేవి : స్థానిక గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్‌తో 90 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా అందులో 24 మందికి సెలైన్లు ఎక్కిస్తున్నారు. దూరప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు టీవీల ద్వారా విషయం తెలుసుకొని పాఠశాలకు వచ్చారు. శాసనసభ ఉపసభాపతి విద్యార్థులను పరామర్శించి, వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని వైద్యాధికారులంతా చిన్నారుల వైద్యసేవల్లో నిమగ్నమయ్యారు. బుధవారం రాత్రి భోజనంలో గుడ్డు, సాంబారు తీసుకోవడంతో ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని డీఎంహెచ్‌వో డాక్టర్ నాగమల్లేశ్వరి తెలిపారు. ఆహారంతో పాటు మంచినీరు వల్ల కూడా బ్యాక్టీరియా వ్యాపించవచ్చునని, వాటర్‌ను టెస్టింగ్ కోసం పంపుతున్నామన్నారు. నియోజకవర్గంలోని పీహెచ్సీ డాక్టర్స్, సిబ్బంది అంతాపాఠశాలలోనేవిద్యార్థులకువైద్యసేవలందిస్తున్నారన్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు. పాఠశాల గదులు ఇరుకుగా ఉండడంతో అందరికీ బెడ్స్‌తోపాటు ఫ్యాన్లు కూడా ఏర్పాటుచేస్తున్నామన్నారు. తెల్లవారు జామునుంచే వాంతులు, విరేచనాలు గురువారం తెల్లవారు జామునుంచే వాంతులు, విరేచనాలు అవ్వడంతో డెప్యూటీ వార్డెన్‌కు చెప్పామని అస్వస్థతకు గురైన విద్యార్థులు తెలిపారు. కొన్ని మందులు ఇచ్చారని అవి వేసుకున్నా తగ్గలేదని చెప్పారు. డెప్యూటీ వార్డెన్ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పడంతో ఆయన వైద్య సిబ్బందిని పాఠశాలకు పంపారన్నారు. బెడ్లు లేకపోవడంతో సెలైన్లు ఎక్కించుకోవడానికి బల్లలపై పడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చెందాం : తల్లిదండ్రులు ఒకేసారి 90 మందికి ఫుడ్‌పాయిజన్ జరిగిందని తెలుసుకుని భయపడిపోయాం. పిల్లలను చూసుకునే వరకు కాళ్లు, చేతులు ఆడలేదు. భగవంతుని దయవల్ల ప్రాణాపాయం లేదని సంతోషించాం. వాటల్ ట్యాంకు శుభ్రం చేసేకంటే ఎప్పుడో వేసిన వాటర్ పైపులు తొలగించి కొత్తవి వేయాలని పలుమార్లు కోరినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగింది. -
దన్నుగా నిలుస్తా
ఆయన జిల్లాలోనే పేరుగాంచిన సీనియర్ నేత. 40 ఏళ్లుగా ప్రజలతో మమేకమవుతూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం నారాయణఖేడ్ శాసన సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయనే పట్లోళ్ల కిష్టారెడ్డి. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, గురుకుల పాఠశాల విద్యార్థుల బాగోగులు తెలుసుకునేందుకు తొలిసారి జర్నలిస్టు అవతారం ఎత్తారు. ‘సాక్షి’ తరఫున విలేకరిగా మారి నారాయణఖేడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్‌ను సందర్శించారు. హాస్టల్లోని విద్యార్థులుంటున్న గదులతో పాటు వంటగది, వరండా, మూత్రశాలలు, మరుగుదొడ్లును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. గురుకులం భవనం 20 ఏళ్ల క్రితం నిర్మించింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. నూతన భవనం నిర్మించేందుకు రూ.13 కోట్లు మంజూరు అయ్యేలా కృషి చేశాను. నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివారులోని 8 ఎకరాల్లో గురుకుల భవనం నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నాం. అది పూర్తయితే భవనం సమస్య తీరుతుంది. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకుంటాను. మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానపుగదుల నిర్వహణపై ప్రిన్సిపాల్‌కు పలు సూచనలు చేశాను. విద్యార్థులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలకు వెనుకాడబోం. - పట్లోళ్ల కిష్టారెడ్డి, శాసనసభ్యులు, నారాయణఖేడ్. పి.కిష్టారెడ్డి: ఏం పిల్లలూ బాగున్నారా? విద్యార్థులు : బాగున్నాం.. సార్. పి.కిష్టారెడ్డి: బాబూ నీపేరేంది? ఏ తరగతి చదువుతున్నావు? సందీప్(టెన్త్): నా పేరు సందీప్ సార్, నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను. పి.కిష్టారెడ్డి: టెన్త్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. పాసవుతావా? సందీప్: పాసవుతాను సార్. కానీ కొద్దిగా కష్టంగా ఉంది. ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదు. స్టడీ అవర్స్ నిర్వహించడం లేదు. పి.కిష్టారెడ్డి: మీకు యూనిఫాంలు అందాయా? వసతి గదులు ఎలా ఉన్నాయి.. ఒక గదిలో ఎంత మంది ఉంటున్నారు? రజనీకాంత్(టెన్త్): పాఠశాల ప్రారంభమై 8 నెల లు గడిచినా ఇంత వరకు బట్టలు అందలేదు. మేము ఉండే గదులు బాగా లేవు. మేము ఉండేం దుకునానా ఇబ్బందులు పడుతున్నాం. వాన పడితే నీళ్లు లోపలికి వస్తున్నాయి. ఒక గదిలో 16 నుంచి 20 మందిమి ఉంటున్నాం. పి.కిష్టారెడ్డి: హాస్టల్లో ఇంకేం సమస్యలు ఉన్నాయి? సతీష్(ఇంటర్ సెంకడ్ ఇయర్) : హాస్టల్లో బాత్రూంలు సరిగ్గా లేవు. నీళ్లు సమస్య తీవ్రంగా ఉంది. కరెంట్ పోతే బోరు మోటారు లేక బయటకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీరు కూడాసరిగ్గా లేవు. బోరునీరే తాగుతున్నాం. పి.కిష్టారెడ్డి: రోజూ మీకు భోజనంలో ఏమేమి వడ్డిస్తున్నారు? జి.దత్తు(5వ తరగతి): ఉదయం కిచిడీ, మధ్యాహ్నం సాంబారు అన్నం, సాయంత్రం బఠానీలు, శనగలు, పెసర్లు, అరటిపండ్లు ఇస్తున్నారు. రాత్రిపూట అన్నం, కర్రీ, సాంబారు పెడుతున్నారు. నెలకు మూడు సార్లు మాంసాహారం పెడుతున్నారు. తాగడానికి మాత్రం మురికినీళ్లు వస్తున్నాయి. మంచినీరు ఇవ్వాలి. పి.కిష్టారెడ్డి: ఇంతకు ముందు ఎక్కడ చదువుకున్నావు. అక్కడికీ, ఇక్కడికి తేడా ఉందా? సుకుమార్( 6వ తరగతి): కల్హేర్ మండలం రాపర్తిలో చదువుకున్నాను. 6లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంగ్లీష్‌లో బోధిస్తున్నారు. అర్థం అవుతుంది. అనంతరం హాస్టల్లోని గదులను పరిశీలించి సమస్యలు అడిగారు. పి.కిష్టారెడ్డి: తినడానికి ప్లేట్లు, గ్లాసులు, బట్టలు పెట్టుకునేందుకు పెట్టెలు ఉన్నాయా? రాజ్‌కిరణ్(9వ తరగతి) : తినడానికి ప్లేటు ఉంది. గ్లాసులు మాత్రం లేవు. ప్లేట్లతోనే నీరు తాగుతున్నాం. పెట్టెలకు తాళాలు లేకపోవడంతో ఇచ్చిన గ్లాసు పోయింది. హాస్టల్లోని క్లినిక్ తాళం తీయించి స్టాఫ్‌నర్సుతో మాట్లాడారు. పి.కిష్టారెడ్డి: విద్యార్థులకు ఇచ్చేందుకు మందులు ఉన్నాయా. ఈ రోజు ఎంత మందికి ఏమిచ్చావు? దేవేందర్(స్టాఫ్‌నర్స్): మందులు ఉన్నాయి సార్. విద్యార్థులకు జబ్బులు వస్తే తెలుసుకొని మందులు ఇస్తున్నాను. ఈరోజు ఇద్దరు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వారికి మందులు ఇచ్చాను. మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశీలించి విద్యార్థులను అడిగారు. పి.కిష్టారెడ్డి: బాత్రూంలు శుభ్రంగా ఉన్నాయా? అనిల్‌కుమార్(టెన్త్): సరిగ్గా లేవు. నీరు రావడం లేదు. వారానికి ఓసారి శుభ్రం చేస్తారు. నీరు రాకపోవడంతో బహిర్భూమికి చీకట్లో వెళ్లాల్సి వస్తోంది. అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయి. వంట మనుషులు శుభ్రత పాటించడంలేదు. దీంతో వారు చేసిన ఆహారం తినలేకపోతున్నాం. వంట గదిని, అన్నం, సాంబారును పరిశీలించాక.. పి.కిష్టారెడ్డి: అన్నం , సాంబారు బాగున్నాయా? మోహన్‌దాస్(7వ తరగతి): అన్నం ఉడక లేదు. మధ్యాహ్నం వండిన సాంబారే పెడుతున్నారు. సాంబారులో కూడా నీళ్లే ఉన్నాయి. ఉప్పు, నూనె అస్సలే లేవు. తినలేకపోతున్నాం. -
పుస్తకాల్లేవ్ !
వైరా : విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా జిల్లాలోని పలు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు అందలేదు. ఓవైపు త్రైమాసిక పరీక్షలు ప్రారంభం కావస్తుండగా.. పుస్తకాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పాఠశాలల సిబ్బంది పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. దీంతో జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో 10 గురుకుల పాఠశాలల్లో అదే పరిస్థితి... జిల్లాలోని వైరా, అడవిమల్లెల, ములకలపల్లి, కల్లూరు, నేలకొండపల్లి, ఎర్రుపాలె ం, టేకులపల్లి, దమ్మపేట, పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు, బాలుర పాఠశాలల్లో సగానికి పైగా విద్యార్థులను పుస్తకాల కొరత వేధిస్తోంది. ఆయా పాఠశాలల్లో 5 నుంచి పదో తరగతి వరకు సుమారు 7,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో సగం మంది పుస్తకాలు లేక తరగతి గదుల్లో ఖాళీగానే కూర్చుంటున్నారు. అందాల్సిన పుస్తకాలివే.... 5వ తరగతిలో ఈవీఎస్, తెలుగు, గణితం, ఇంగ్లిష్, 6వ తరగతిలో తెలుగు, గణితం, భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రం, 7వ తరగతిలో హిందీ, గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాలు, 8వ తరగతిలో గణితం, భౌతికశాస్త్రం, బయాలజీ, సోషల్, 9వ తరగతిలో హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతికశాస్త్రం, బయాలజి, సోషల్, 10లో ఇంగ్లిష్, గణితం, భౌతికశాస్త్రం, బయాలజి, సోషల్ పుస్తకాలు ఇప్పటి వరకు 50 శాతానికి పైగా రావాల్సి ఉంది. అగమ్యగోచరంగా ‘పది’ విద్యార్థులు... ఈ ఏడాది పదో తరగతిలో సిలబస్ మారడంతో గత ఏడాది పుస్తకాలను తీసుకునే అవకాశం కూడా లేదు. వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకల పాఠశాలలో 79 మంది విద్యార్థులు ఉండగా వారిలో సగానికి పైగా మంది పుస్తకాలు లేకుండానే తరగతులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది సిలబస్ మారడం, పుస్తకాల కొరతతో ఉపాధ్యాయునులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఏజేసీ పరిశీలనలో కూడా ఇవే సమస్యలు... ఏజేసీ బాబురావు ఇటీవల వైరాలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చే య గా, తాము పుస్తకాలు లేకుండానే పాఠాలు వింటున్నామని పలువురు విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చినా.. నేటికీ విద్యాశాఖాధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. -
సమస్యల ఒడిలో గురుకుల బడి
కీసర: ఒకప్పుడు ఆదర్శ విద్యాలయంగా పేరు సంపాదించిన ఆ గురుకుల పాఠశాల నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన సాగాల్సి ఉండగా అధ్వాన పరిస్థితుల్లో కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో 1978లో కీసరగుట్టలో గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే మొదట్లో సకల సౌకర్యాలతో అత్యుత్తమ బోధనతో ఆదర్శ గురుకుల విద్యాలయంగా పేరు గడించింది. రానురాను పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ఎప్పుడో 35 ఏళ్ల క్రితం కల్పించిన సౌకర్యాలు తప్పితే కొత్తగా చేసింది ఏమీ లేదు. ఒకప్పుడు ఐదు నుంచి పదో తరగతి వరకు 500 నుంచి 600 వరకు విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 370 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ఏళ్లక్రితం విద్యార్థులకోసం నిర్మించిన ఐదు డార్మెంట్ హాళ్లు అధ్వాన స్థితికి చేరాయి. కిటికీలు, తలుపులు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో విద్యార్థులు రాత్రి వేళ పడరానిపాట్లు పడుతున్నారు. దోమలు, ఈగల బాధకు తోడు చలికాలం, వర్షకాలంలో కంటికి కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో విద్యార్థులకోసం ఇచ్చిన మంచాలు తుప్పుపట్టి పోవడంతో మూలన పడేశారు. వాటిస్థానంలో ఇప్పటి వరకు కొత్తవి మంజూరు కాకపోవడం విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. ఇక పాఠశాలకు పక్కా ప్రహరీ లేకపోవడం కుక్కలు, పందులు, పశువులు పాఠశాల ఆవరణలోనే తిరుగుతున్నాయి. విషసర్పాలు డార్మింట్ రూమ్ సమీపంలోనే సంచరిస్తూ విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. డైనింగ్‌హాల్ సమీపంలోనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి. సరైన బాత్రూమ్లు, మరుగుదొడ్లు లేకపోవడం విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం చేస్తున్నారు. మంచినీటి సమస్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాఠశాలలో ఒకే ఒక్కబోరు ఉండటంతో నీటికోసం ప్రతిరోజు ఇబ్బందులు తప్పడంలేదు. ఉన్న ఒక్కబోరు చెడిపోతే విద్యార్థులు స్నానాలకోసం కీసరగుట్ట వేదపాఠశాల, పార్కు, టీటీడీ ధర్మశాల వద్దకు బకెట్లు పట్టుకొని పరుగులు తీయాల్సిందే. ఇక డైనింగ్‌హాల్, వంటగదిలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు భోజనపాట్లు అదనంగా తోడయ్యాయి. పేరుకే గురుకుల పాఠశాల అయినా కనీసం సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న కొద్దిపాటి వసతులు కూడా విద్యార్థులకు అందడం లేదు. అమ్మో ఆ స్కూలా..! ఒకప్పుడు ఇక్కడి పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపేవారు. నేటి పరిస్థితులను చూసి ఇక్కడ ఉండడానికి, చదవడానికి జంకుతున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చామా అని విద్యార్థులు.. తమ పిల్లలను ఎందుకు పంపించామా అని తల్లిదండ్రులు ఆవేదన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. మూడు సంవ త్సరాలుగా పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఇక్కడ చదవలేక వెనుదిరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా వికారాబాద్ ఆలంపల్లికి చెందిన విఘ్నేశ్వర్‌రెడ్డి ఐదో తరగతిలో అడ్మిషన్ పొంది వారం రోజులు తిరక్కముందే ఇక్కడి పరిస్థితులు చూసి మంగళవారం వెనుదిరిగాడు. ఈ మేరకు విద్యార్థితండ్రి మహిపాల్‌రెడ్డి పాఠశాల దయనీయ పరిస్థితులను స్వయంగా కలెక్టర్‌కు తెలియజేశారు. తమ బిడ్డను కూలీనాలి చేసైనా ఎక్కడైనా చదివిస్తాను తప్ప ఈ గురుకుల పాఠశాలలో మాత్రం చదివించనని స్పష్టం చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. కీసరగుట్ట గురుకులాన్ని జిల్లాలోనే ఆదర్శపాఠ శాలగా తీర్చిదిద్దుతామని దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు గుప్పిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. పూర్వ విద్యార్థులు అడపాదడపా విరాళాలు ఇస్తున్నా లెక్కలేకుండాపోయింది. విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి పాఠశాలకు పూర్వవైభవం తేవాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.