
తనిఖీ చేస్తున్నతహసీల్దార్ పద్మావతి
మునిపల్లి (అందోల్): గురుకుల పాఠశాల విద్యార్థులకు వడ్డించిన భోజనంలో పురుగులు, చనిపోయిన ఎలుక ప్రత్యక్షమయ్యాయి. ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉదయం బగారా అన్నం పెట్టారు. ఏడో తరగతికి చెందిన అరుణ్ కొంచెం తినగానే తెల్లటి పురుగులు, మృతి చెందిన ఎలుక పిల్ల కనిపించాయి. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ విద్యార్థులకు చికిత్స అందించారు.
అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. మధ్యాహ్నానికి వండుతున్న భోజనంలోనూ పురుగులు కనిపించడంతో తహసీల్దార్ పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అంటూ వార్డెన్ అశోక్, సిబ్బందిపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment