
సాక్షి, అమరావతి: ప్రభుత్వం 117 జీవోకు ప్రత్యామ్నాయంగా తెస్తున్న మార్పులతో రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగి విద్యార్థుల చేరిక తగ్గిపోయి మూతబడే ప్రమాదముందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ పరిస్థితి రాకుండా ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలో 1:20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు కేటాయించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాసినట్టు ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు తెలిపారు. మిగులు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో హెచ్‌ఎంగా నియమించే కంటే వారిని యూపీ పాఠశాలలో నియమిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే, ఎస్జీటీలకు పదోన్నతి కలి్పంచి మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో హెచ్‌ఎంలుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు.