
విజయవాడ: ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరో భారీ అప్పుకు రెడీ అయ్యింది. రాష్ట్రాన్ని అప్పులు చేసి నడిపించడంలో భాగంగా వచ్చే మంగళవారం రూ. 7వేల కోట్ల అప్పుకి ఇండెంట్ పెట్టింది. రిజర్వ్ బ్యాంకుకి ఇండెంట్ పెట్టింది చంద్రబాబు సర్కార్. ఇప్పటివరకూ లక్షా 52 వేల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మళ్లీ రూ. 7వేల కోట్ల అప్పుకి సిద్ధం కావడం గమనార్హం.
ఎన్నికల సమయంలో సంపద సృష్టి తనతోనే సాధ్యమని చెప్పిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల సృష్టి కోసమే వేట కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు.