APTA
-
అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా
సాక్షి, హైదరాబాద్: ‘ఆంట్రప్రెన్యూర్షిప్’ అంటే స్పెల్లింగ్ కూడా నాకు తెలీదు. దాని గురించి పెద్దగా మాట్లాడలేను. నా గురించి చెప్తా. తిరుగులేని మనిషి అనే సినిమా ఎన్టీఆర్‌తో చేస్తే ఫ్లాప్ అయ్యింది. తర్వాత డేట్లు చెప్పిన వ్యక్తి సినిమా నుంచి నన్ను తీసేశారు. ఏమైందంటే సినిమా పోయింది కదా అన్నారు. ఆ పరిస్థితుల్లో కుంగిపోయాను. ఐరన్ లెగ్ అనే పేరొస్తుందని భయపడ్డా. ఆకాశంలో గద్ద గుర్తొచి్చంది. అది కొంతవరకే కష్టపడి ఎగరాలి. తర్వాత గాలితో పాటు సునాయాసంగా పైకి ఎగరగలుగుతుంది.నన్ను నేను అలా మార్చుకోవాలని అనుకున్నా. నన్ను వద్దు అనుకున్న వ్యక్తితోనే ఎన్టీఆర్ కంటే ఎక్కువ చిత్రాలు తీసేలా మలచుకున్నా. పరిస్థితులు ఎలా ఉన్నా మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మన సానుకూల దృక్పథమే మనకు బలం..’అని ప్రముఖ నటుడు చిరంజీవి చెప్పారు. ఆదివారం హైటెక్స్‌లో ఆప్టా (అమెరికన్ ప్రోగ్రెస్సివ్ తెలుగు అసోసియేషన్) కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాజ్‌కపూర్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్నాం ‘విమర్శించే వారు మన గురించి ఆలోచన చేసే విధంగా మనం ఉండాలి. సినిమాల్లోకి కొత్తవారు వస్తారు. టాలెంట్ ఉంటే నడిచిపోతుందనుకుంటారు. అది సెకెండరీ. ప్రవర్తన బాగుండాలి. నైపుణ్యంతో పాటు వ్యక్తిత్వం ఉండాలి. ఎన్టీఆర్ తర్వాత నేనే టాప్‌లో నిలిచా. కానీ స్థానం కోసం ఏనాడూ ఆరాట పడలేదు. మన కుటుంబంలో 9 మంది నటులు ఉన్నారు. రాజ్‌కపూర్ కుటుంబంలా మన కుటుంబం ఉండాలని పవన్ అన్నాడు. అన్నట్టుగానే దక్షిణ భాతర దేశపు రాజ్‌కపూర్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్నాం..’అని చిరంజీవి చెప్పారు. అంతకుముందు జరిగిన ప్యానల్ చర్చలో పలువురు సభ్యులు మాట్లాడారు. ప్రతి ఒక్కరిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉంటాడని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించడం, దాన్ని విజయవంతం చేయడానికి విశ్వాసం, దూర దృష్టి, సహనం, స్వీయ క్రమశిక్షణ, సంకల్పం ఉండాలన్నారు.పోటీతత్వం లాంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉద్యోగులకు టీం, యాజమాన్య బాధ్యతలు అప్పగించడం వల్ల మరింత అంకితాభావంతో పనిచేస్తారని తెలిపారు. చిత్ర పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ప్యానలిస్టులు అభిప్రాయపడ్డారు. కేటలిస్ట్ బిజినెస్ పిచ్ పోటీలో టాప్ 5 స్టార్టప్‌లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అందులో ముగ్గురిని విజేతలుగా ప్రకటించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆప్టా చైర్మన్ సుబ్బు కోట, బిజినెస్ ఫోరం చైర్మన్ రమేష్, కన్వినర్ సాగర్, కమిటీ సభ్యులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
కుంచనపల్లిలో ఆప్త మెడికల్ క్యాంప్
సాక్షి, తాడేపల్లి(గుంటూరు): అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్త), కాజ సాంబశివరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాట్రగడ్డ శ్రీకాంత్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గురువారం తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన ఈ మెగా ఉచిత మెడికల్ క్యాంప్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, అడిషనల్ డీజీపీ సునీల్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మెగా శిబిరానికి కుంచనపల్లి ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉచిత వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు పొందారు. ఈ మెడికల్ క్యాంప్ దిగ్విజయంగా జరగడానికి తోడ్పడిన మెయిన్ స్పాన్సర్స్ శ్రీకాంత్ కాట్రగడ్డ, డాక్టర్ సూర్య రగతు, డాక్టర్ నీరజ చవాకుల, అమాప్ చైర్ డాక్టర్ సురేష్ అలహరి, లక్ష్మి చిమట, శివ మొలబంటి, శ్రీకాంత్ మన్నెం, బనారసీ తిప్పా, ఇన్నయ్య యనమల, ఈశ్వర్ అరిగే, నాగ కుమారి అరిగే, త్రినాథ్ ముద్రగడ, గోపాల్ గూడపాటి, విజయ్ గుడిశేవ, వెంకట్ చలమల శెట్టి, ఆప్త కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్లు, కుంచనపల్లి గ్రామప్రజలకు ఆప్త ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నటరాజు యిల్లూరి, చైర్ కిరణ్ పల్లాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కాయల భాను ఉదయశంకర్, డాక్టర్ శనక్కాయల రాధా మాధవి, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ బిందేశ్ దాది, డాక్టర్ లంకా దుర్గ కళ్యాణ్, డాక్టర్ చప్పిడి అరుణ్ కుమార్, డాక్టర్ నరాలశెట్టి అనిల్ కుమార్, డాక్టర్ తోట నవీన్ కుమార్, డాక్టర్ కాట్రగడ్డ పృథ్వీరాజ్, డాక్టర్ పోతుల పవన్ సాయి, డాక్టర్ చాగంటి సింధు, డాక్టర్ చిద్రుపుపి, డాక్టర్ నందిని, మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్ అమూల్య గోవాడ, డాక్టర్ గిరీష్, డాక్టర్ రేష్మ, ఆపరేటర్ లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొని వైద్యసేవలను అందించారు. -
ఆప్త నూతన అధ్యక్షుడిగా నటరాజు యిల్లూరి
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) 2019-2020 నూతన కార్యవర్గ ఎన్నికల్లో ఆప్త అధ్యక్షుడిగా నటరాజు యిల్లూరి ఎన్నికయ్యారు. అమెరికాలోని తెలుగువారి కోసం 2008లో ప్రారంభమైన ఈ సంస్థ గతపదేళ్లుగా పలు స్వచ్చంద సేవాకార్యక్రమాలను నిర్వహిస్తోంది. అమెరికాలోని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఎదుర్కునే ఇబ్బందులను పరిష్కరించేందుకు ఈ సంస్థ తమవంతు సహకారాన్ని అందిస్తోంది. సేవాకార్యక్రమాలతో పాటు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను, సాంస్కృతిక కళల వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఈ సంస్థ ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ.. తెలుగువారందరిలో ఐకమత్య భావన కోసం కృషిచేస్తోంది. 2008లో ప్రారంభమైన ఆప్త సంస్థ ప్రస్తుత సభ్యుల సంఖ్య 5వేలుగా ఉంది. ఆప్త నూతన కార్యవర్గంలో కోర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నటరాజు యిల్లూరి, బనారసిబాబు, ఎనుముల ఇన్నయ్య, శివ మొలబంటి, డా.నీరజా నాయుడు చవకులు, శ్రీకాంత మెన్నం, లక్ష్మి చింతల, రావూరి సుభాషిణి, కోడె సురేష్, డా.గోపాల్ సిరిసాని, తోట వీరా, మదన్ మోహన్ బోనేపల్లి ఎంపికయ్యారు. వీరితో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ గా కిరణ్ పల్లా, అరుణ దాసరి, శ్రీధర్ నిస్సంకరరావు, రే దీప్తి నాయుడు, మహేష్ కర్రి, శ్రీధర్ వెన్నం రెడ్డి, గోన సురేష్, శ్రీనివాస్ సిద్దినేని, డా.సురేష్ అలహరి, దుర్గా ప్రసాద్ పెద్దిరెడ్డి ఎన్నికయ్యారు. ఆప్త అధ్యక్షుడిగా ఎన్నికైన నటరాజు యిల్లూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆవిర్భావం నుంచి సంస్థ ఎదుగుదలకు కృషిచేసిన పూర్వ కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో కలిసి ఆప్త సంస్థ ఎదుగుదలకు మరింత కృషి చేస్తానని తెలియజేశారు. -
ఘనంగా ‘ఆప్త’ పదోవార్షికోత్సవం
వాషింగ్టన్: ఆప్త (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) పదో వార్షికోత్సవ సభలు ఘనంగా ముగిశాయి. ఆప్త అధ్యక్షుడు గోపాల గూడపాటి ఆధ్యర్యంలో వాషింగ్టన్ డీసీ మేరిల్యాండ్ బాల్దిమోర్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు ఈ వేడుకలు జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఆప్త నేషనల్ కన్వెన్షన్ 2018 కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆప్త వేదికపై ఎస్వీఆర్ సిల్వర్ కాయిన్‌ను, విగ్రహావిష్కరణతో పాటు అనంత శ్రీరామ్ రాసిన పాటను, ఆప్తవాణి సౌవెనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు రఘుపతి వెంకయ్యనాయుడు ఆప్త అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమానికి హాజరరైన ప్రముఖులు దాసరి అరుణ్ కుమార్, రవణం స్వామి నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, యర్రం శెట్టి, టీటీ ప్లేయర్ ఉమేశ్ అచంటలను ఘనంగా సత్కరించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆప్త బోర్డు చైర్ రాధిక నైగాపుల, ప్రెసిడెంట్ గోపాల గూడపాటి, ఆప్త కన్వెన్షన్ 2018 కన్వీనర్ ధీరజ్ ఆకుల, కో కన్వీనర్స్ నటరాజు ఇల్లూరి, రెడ్డియ్య ప్రత్తిపాటి, శ్రీనివాస్ సిద్ధినేని, లలిత బైరా, ఆప్త ఫౌండర్స్ ప్రసాద్ సమ్మెట, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట , కన్వెన్షన్ కమిటీ సెక్రటరీ ఆనంద్ జవ్వాజి, సభ్యులు వీరబాబు ప్రత్తిపాటి, రాజ్ సిరిగిరి, శివ యర్రంశెట్టి, మధు దాసరి, రవీంద్రనాథ్ కొట్టే, రవి ముళ్ళపూడి, కిషోర్ ముత్యాల, రాజేష్ అంకం, ప్రవీణ్ అండపల్లి, బోర్డు సెక్రటరీ శివ కొప్పరాతి, జనరల్ సెక్రటరీ శౌరి ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర కన్వెన్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అప్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్
వర్జీనియా : మెగాస్టార్ చిరంజీవి 40 వసంతాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని అమెరికాలో ఆప్తా ఆధ్వర్యంలో చిరు అభిమానుల సహాయంతో మెగా రక్తదాన కార్యక్రమానికి కార్యచరణ సిద్ధం చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న 40 రోజుల్లో 40 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని విజయ్ రేపల్లె పిలుపునిచ్చారు. వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో ఇనోవా హాస్పిటల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది దాతలు రక్త దానం చేశారు. ఈ వేడుకలను అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు సేవలను ఇనోవా బ్లడ్ డొనేషన్స్ స్టెర్లింగ్ హాస్పిటల్స్ మేనేజర్ ఏజే కొనియాడారు. ఈ కార్యక్రమానికి 75 మందికి పైగా మహిళలు, చిన్నారులు హాజరయ్యారు. -
కోర్టు ఆదేశాలనే పట్టించుకోరా?
ఇరు రాష్ట్రాల సీఎస్ల తీరుపై హైకోర్టు అసహనం ఏపీఏటీ ఆస్తుల విభజనకు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్(ఏపీఏటీ) ఉద్యోగుల, ఆస్తుల విభజ నపై తేల్చాలని తామిచ్చిన ఆదేశాల అమలుకు ఎలాంటి చర్య లు తీసుకోక పోవడంపట్ల ఉమ్మడి హైకోర్టు గురువారం ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలా అయితే వారిని కోర్టు ముందుకు పిలిపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరో అవకాశం ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్ జనరల్స్ కోరడంతో హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఏటీ సమర్పించిన నిర్వహణ బిల్లులను స్వీకరించేందుకు ఏపీ సర్కార్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత నెలలో విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం... ఏపీఏటీ ఉద్యోగుల, ఆస్తుల విభజన విషయంలో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డిసెంబర్ 7లోపు సమావేశం నిర్వహించాలని స్పష్టం చేసింది. నవంబర్ నెలకు వ్యయాలను ఏపీనే భరించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. గురు వారం ఈ వ్యాజ్యం గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తమ ఆదేశాల మేరకు సీఎస్‌లు తగిన చర్యలు తీసుకోక పోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాల ఏజీలు చెప్పిన సమాధానాలపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోక పోవడం ఎంత మాత్రం సరికాదన్న ధర్మాసనం.. సీఎస్‌లను కోర్టు ముందుకు పిలిపిం చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరో అవకాశం ఇవ్వాలని ఇరువురు ఏజీలు కోరడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
ఆప్త ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు
-
ఆప్త ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు
మాంచెస్టర్: అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్త)ఆధ్వర్యంలో నార్త్ ఈస్ట్ రీజినల్ కాన్ఫరెన్స్ దీపావళి సంబరాలు మాంచెస్టర్‌లో అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి తెలుగు వారు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. పెద్దలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. రఘు కుంచె, ఆదర్శిని, శేషు ఆకుల, శ్రవణ్ మట్లపూడి, షాలిని గంధం, శుభ రావూరి, సుభాష్ తన్నీరు, కుమారి లావణ్య అందే తమ గానామృతంతో ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సంగీత విభావరిని రవి వర్రే,శేఖర్ నల్లం స్పాన్సర్ చేశారు. పిల్లల చదువుల మీద నెక్స్ట్ జెన్ కిడ్స్ ప్రోగ్రాంని కిరణ్ పళ్ళా నిర్వహించారు. తల్లితండ్రులు, పిల్లలు పాల్గొని భవిష్యత్తు ప్రణాళికలను వాటి మీద ఉన్న సందేహాలని నివృత్తి చేసుకున్నారు. ఆప్త ఆర్గనైజషన్ వ్యవస్థాపకులలో ఒకరైన శ్రీనివాస్ చిమట, ఆప్త ప్రెసిడెంట్ గోపాల గూడపాటి, బోర్డు సెక్రటరీ రాజేష్ యాళ్ళబండి, బోర్డు డైరెక్టర్ మధు దాసరి, వైస్ ప్రెసిడెంట్ జిడుగు సుబ్రహ్మణ్యం, సెక్రటరీ శౌరి ప్రసాద్ కొచ్చెర్ల, జాయింట్ ట్రెజరర్ సురేష్ ధూళిపూడి, ఆప్త ఇంటర్నల్ ఆడిటర్ వెంకట్ యనుముల, ఆప్త నార్త్ ఈస్ట్ సెంట్రల్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ మధు ఉల్లి, ఎంపైర్ రీజియన్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ బనారసీ బాబు తిప్పా, న్యూ జెర్సీ స్టేట్ కోఆర్డినేటర్ సత్య వెజ్జు, కల్చరల్ చైర్ రాజేష్ సుంకర, వైస్ చైర్ సురేష్ కరోతు ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం లో ఏఎంఏపీ (ఆప్త మెడికల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం) చైర్ డాక్టర్ కుమార్ కొత్తపల్లి, డాక్టర్ రవి ఆకుల, డాక్టర్ వెంకట సత్యనారాయణ నాగిరెడ్డి, డాక్టర్ నీరజ చవాకుల పాల్గొని డయాబెటిస్ మీద అవేర్నెస్, ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించారు. నార్త్ ఈస్ట్ రీజియన్‌లో ప్రముఖ, సీనియర్ డాక్టర్స్ అయిన డాక్టర్ సూర్యనారాయణ సీరం, డాక్టర్ సాయి కొల్ల, ప్రొఫెసర్ అల్లం అప్పారావులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి శ్రీధర్ నిశ్శంకరరావు, శ్రీనివాస్ కమ్మిలి, సురేష్ కరోతు, శ్రీనివాస్ సుంకర, నిరంజన్ కొప్పెర్ల, శుభ రావూరి, సుభాష్ తన్నీరు, సురేష్ తాడిశెట్టి, శిల్ప తాడిశెట్టి, మురళి శెట్టి, రాజేంద్ర కొల్లిపర, అనిల్ కుమార్ వీరిశెట్టి, శివ మోలబంతి, ప్రకాష్ ఆచంట, హరి సింహాద్రి, లక్ష్మి సింహాద్రి, సత్య అడపా, శివ మట్ట, మహేష్ బొల్లిముంత, పవన్ ఉప్పు, నందిత బీగాల, నందిని చిన్నాల, లావణ్య, రమా ముత్యాల, వెంకట్ చవాకుల, సమీరా చవాకుల, ఆనంద్ జవ్వాజి, ఆనంద్ చిక్కాల, యతీంద్ర శీలం, కృష్ణ ఐనబత్తిని, వై ఆర్ సి రావు కార్యక్రమం విజయానికి తమ అమూల్యమైన సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా సురేష్ కరోతు, శ్రీనివాస్ సుంకర, శారద కొప్పెర్ల, శుభ రావూరి, కళ్యాణి తన్నీరు, ప్రవీణ రావూరు వ్యవహరించారు. చివరిగా నటరాజు ఇల్లూరి వందన సమర్పణ చేశారు. అతిథులందరికి నార్త్ ఈస్ట్ రీజినల్ కాన్ఫరెన్స్ దీపావళి సంబరాలు టీం తరుపున కన్వీనర్ శ్రీ నటరాజు ఇల్లూరి, కో కన్వీనర్ శ్రీ శ్రీధర్ నిశ్శంకరరావు అందరికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ యూ.యస్.ఏ కన్వీనర్ శ్రీ రత్నాకర్ పండుగాయల, యువసేన వాలంటీర్స్ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆప్త నార్త్ ఈస్ట్ రీజినల్ కాన్ఫరెన్స్ దీపావళి సంబరాలు టీం కృతజ్ఞతలు తెలిపింది. ధరణి రెస్టారెంట్స్ గ్రూప్ అధినేత శ్రీ భాస్కర్ రెడ్నం రుచికరమైన తెలుగు విందు భోజనాలు స్పాన్సర్ చేశారు. శ్రీమయి డిజైన్స్ అధినేత్రి శ్రీమతి నందిత బీగాల రీజినల్ కాన్ఫరెన్స్ కి విచ్చేసిన అతిధులందరికి ఆప్త, శ్రీమయి డిజైన్స్ లోగోతో ఉన్నఅందమైన బ్యాగ్‌ను బహుకరించారు. -
మహమ్మారిని తరిమికొట్టేందుకు 'ఆప్త' పోరాటం
టెక్సాస్: ధ్రంబోసిస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ఆప్త (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) నడుం బిగించింది. ధ్రంబోసిస్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రపంచంలో ఈ వ్యాధి సోకిన ప్రతి నలుగురిలో ఒకరు మరణిస్తున్నారు. రక్త నాళాలలో రక్తం గడ్డకట్టుకు పోవడం వలన, గుండెపోటు, ఊపిరితిత్తులు మూసుకు పోయి మరణించే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో ముఖ్యంగా తెలుగు వారిలో ధ్రంబోసిస్ గురించి అవగాహన కలిగించి ఈ మరణాలకు అడ్డుకట్ట వేయడానికి ఆప్త తన వంతుగా కృషి చేస్తోంది. విద్యా, వైద్య రంగాల్లో అనేక సేవలు చేస్తున్న ఈ సంస్థ ప్రపంచ ధ్రంబోసిస్ డే(అక్టోబర్ 13) సందర్భంగా అమెరికా, భారత్‌లోని అనేక చోట్ల ధ్రంబోసిస్ అవగాహన శిబిరాలను నిర్వహించింది. ఈ వ్యాధి లక్షణాలు తెలుసు కోవడం, తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటి విషయాలపై అవగాహన కలిగించడం ముఖ్య ధ్యేయంగా ఆప్త వైద్యుల బృందం గురువారం ఈ కార్యక్రమాలను నిర్వహించింది. 80 దేశాల్లో ధ్రంబోసిస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా ఆప్త సంస్థ ఒకే రోజు అమెరికా, భారత్‌లోని 10 ప్రదేశాల్లో ఏకకాలంలో నిర్వహించింది. అమెరికా, భారత్‌లో ఆప్త నిర్వహించిన కార్యక్రమాల వివరాలు విశాఖపట్నం: ఆప్త వైద్యులు డా. నీరజ ఆధ్వర్యంలో శుభం ప్రేమ హాస్పటల్స్ అధినేతలు డా. అది నారాయణ సుంకర, డా. శశి ప్రభ, డా. రాజ్ తమ హాస్పటల్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ I: ఆప్త సభ్యులు ఎర్రంశెట్టి శ్రీ , ఎర్రంశెట్టి శివ ఆధ్వర్యంలో లిబర్టీ హాస్పిటల్ అధినేత, శివ సోదరులు డా. శ్రీ ఎర్రంశెట్టి రవి , డా. దుర్గా రావు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విజయవాడ II: ఆప్త సభ్యులు నంబూరి కృష్ణ విజయవాడలోని డా. ప్రభాకర్ ఆసుపత్రి ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు: స్థానిక అహల్య హాస్పటల్స్‌లో డా. ఉదయ్ శంకర్, డా. దుర్గారావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాచేపల్లి: ఆప్త ఎంపైర్ రీజియన్ ఉపాధ్యక్షులు బనారసీ తిప్పా ఆధ్వర్యంలో స్థానిక మండల పంచాయతీ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మండల రెవెన్యూ ఆఫీసర్, ప్రభుత్వ వైద్యులతోపాటూ భారీ ఎత్తున స్థానికులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. కాకినాడ: అమృతా హాస్పిటల్ అధినేత డా. కిరణ్, డా. శశిధర్ ఆధ్వరంలో మెగా కార్యక్రమాన్ని నిర్వహించగా, స్థానికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తిరుపతి: ఆప్త సభ్యురాలు సమీరా చవాకుల ఆధ్వర్యంలో ఎలైట్ హాస్పిటల్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. నంద్యాల: స్థానిక లైఫ్ హాస్పిటల్లో ఆప్త సభ్యురాలు సమీరా చవాకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అమెరికాలో... టెక్సాస్: హ్యూస్టన్‌లో పెయిన్ మేనేజ్ మెంట్ హాస్పటల్ అధినేత డా. సూర్య రగుతు గారి ఆధ్వర్యంలో పెయిన్ మేనేజ్ మెంట్ హాస్పటల్ ఆవరణలో డా. వెంకట్ వీరి శెట్టి , డా. మంజులా రగుతు, ఆప్త అధ్యక్షులు గోపాల్ గూడపాటి, ఆప్త బోర్డు సెక్రటరీ రాజేష్ యాళ్లబండి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మిస్సోరి: సెయింట్ లూయిస్‌లో డా. నాగిరెడ్డి హాస్పిటల్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆప్త వైద్యులు డా. రవి ఆకుల, డా.సాయి కొల్ల, డా.నాగి రెడ్డి, డా. సూర్య, డా. నీరజల కృషి వల్లే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించగలిగామని వైద్య బృందం నాయకులు, ఆప్త మెడికల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం (ఏఎంఏపీ) చైర్ డా. కుమార్ కొత్తపల్లి పేర్కొన్నారు. ఆప్త అధ్యక్షులు గోపాల్ గూడపాటి సారధ్యంలో ఉపాధ్యక్షులు జె.జె.వి సుబ్రహ్మణ్యం, నార్త్ ఈస్ట్ రీజనల్ సమన్వయ కర్త బనారసీ తిప్పా, న్యూ జెర్సీ సమన్వయ కర్త సత్య వెజ్జు ఆప్త వైద్య బృందానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.