ఘనంగా ‘ఆప్త’ పదోవార్షికోత్సవం | APTA 2018 National Convention | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 10 2018 10:49 PM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

APTA 2018 National Convention - Sakshi

వాషింగ్టన్‌: ఆప్త (అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌) పదో వార్షికోత్సవ సభలు ఘనంగా ముగిశాయి. ఆప్త అధ్యక్షుడు గోపాల గూడపాటి ఆధ్యర్యంలో వాషింగ్టన్‌ డీసీ మేరిల్యాండ్‌ బాల్దిమోర్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు ఈ వేడుకలు జరిగాయి.  మూడు రోజుల పాటు జరిగిన ఆప్త నేషనల్‌ కన్వెన్షన్‌ 2018 కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరయ్యారు.  

ఈ సందర్భంగా ఆప్త వేదికపై ఎస్వీఆర్‌ సిల్వర్‌ కాయిన్‌ను, విగ్రహావిష్కరణతో పాటు అనంత శ్రీరామ్‌ రాసిన పాటను, ఆప్తవాణి సౌవెనీర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు రఘుపతి వెంకయ్యనాయుడు ఆప్త అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమానికి హాజరరైన ప్రముఖులు దాసరి అరుణ్‌ కుమార్‌, రవణం స్వామి నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, యర్రం శెట్టి, టీటీ ప్లేయర్‌ ఉమేశ్‌ అచంటలను ఘనంగా సత్కరించారు.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆప్త బోర్డు చైర్ రాధిక నైగాపుల,  ప్రెసిడెంట్  గోపాల గూడపాటి, ఆప్త కన్వెన్షన్ 2018 కన్వీనర్ ధీరజ్ ఆకుల, కో కన్వీనర్స్  నటరాజు ఇల్లూరి,  రెడ్డియ్య ప్రత్తిపాటి, శ్రీనివాస్ సిద్ధినేని, లలిత బైరా, ఆప్త ఫౌండర్స్  ప్రసాద్ సమ్మెట, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట , కన్వెన్షన్ కమిటీ సెక్రటరీ ఆనంద్ జవ్వాజి, సభ్యులు వీరబాబు ప్రత్తిపాటి, రాజ్ సిరిగిరి, శివ యర్రంశెట్టి, మధు దాసరి, రవీంద్రనాథ్ కొట్టే, రవి ముళ్ళపూడి, కిషోర్ ముత్యాల, రాజేష్ అంకం, ప్రవీణ్ అండపల్లి,  బోర్డు సెక్రటరీ శివ కొప్పరాతి, జనరల్ సెక్రటరీ శౌరి ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర కన్వెన్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/8

2
2/8

3
3/8

4
4/8

5
5/8

6
6/8

7
7/8

8
8/8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement