Rat
-
ఫుడ్ ప్యాక్‌లో ఎలుక
అవున్నిజమే! విమానంలో ఎలుక కనిపించింది. అంది కూడా ఓ ప్రయాణికురాలికి అందించిన ఫుడ్ పార్సిల్లో. ఆమె పార్సిల్ తెరవగానే ఎలుక అమాంతం బయటికి దూకి సీట్ల కింద దూరింది! దాంతో విమానంలో కలకలం రేగింది. నార్వే రాజధాని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలగాకు వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగిందీ ఘటన. ఆ దెబ్బకు విమానాన్ని అత్యవసరంగా కోపెన్‌హాగన్‌లో దించారు. ప్రయాణికులను వేరే విమానంలో మలగాకు పంపించారు. విమానాల్లోని ఎలకి్ట్రకల్ వైరింగ్ తదితరాలను ఎలుకలు కొరికాయంటే అంతే సంగతులు. అందుకే అవి విమానంలోకి రాకుండా ఎయిర్‌లైన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి! అలాంటిది ఏకంగా ఫుడ్ పార్సల్లోనే బతికున్న ఎలుక రావడాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ఆహార పంపిణీ సంస్థను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టింది. ప్రయాణికులను క్షమాపణ కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పుకొచ్చింది. ఇటీవల దక్షిణ ఇంగ్లాండ్‌లో రెండు ఉడతలు రైలెక్కడంతో చివరకు ఆ సరీ్వసును రద్దు చేయాల్సి వచి్చంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చట్నీలో చిట్టెలుక
సంగారెడ్డి: సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ వంట గదిలోని చట్నీ పాత్రలో చిట్టెలుక ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఈ సంఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివి. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం సుల్తా¯Œన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ మెస్ పనితీరు వారం రోజులుగా బాగా లేదని విద్యార్థులు పలుమార్లు ప్రి¯Œన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి విద్యార్థులు తినే చట్నీలో చిట్టెలుక ప్రత్యక్షమైంది. దాన్ని విద్యార్థులు వీడియో తీసి మంగళవారం సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరంగా మారింది. విషయం తెలియగానే కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ మంగళవారం ఉదయం హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. చట్నీలో ఎలుక పడటం వాస్తవమేనని, కానీ విద్యార్థులు తిన్న తర్వాత కడిగేందుకు నీళ్లు పోసి ఉంచిన పాత్రలోనే ఎలుక ఉందని ఆయన స్పష్టం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని హాస్టళ్లు, క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని సంస్థల లైసెన్స్‌లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లలో ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని సూచించారు. అపరిశుభ్రతపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం అడిషనల్ కలెక్టర్ మాధురి హాస్టల్‌ను సందర్శించి అక్కడి అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా శుభ్రం చేయకుండా పాత్రలను అలాగే ఉంచడమేమిటని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. బాధ్యులను వెంటనే తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట అందోల్ ఆర్డీవో పాండు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ తదితరులు ఉన్నారు. -
సాంబార్ లో ఎలుక
-
‘చట్నీలో చిట్టెలుక’.. సాక్షి కథనంపై స్పందించిన అధికారులు
సంగారెడ్డి, సాక్షి: సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక ఉరుకులు పెట్టడంపై సాక్షి ఇచ్చిన కథనం.. ప్రభుత్వం దృష్టికి వెల్లింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తి చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ.. కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. నాణ్యతలేని అల్పాహారం, భోజనంతో హాస్టల్ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈలోపు.. తాజాగా హాస్టల్ క్యాంటీన్ చట్నీలో చిట్టెలుక చక్కర్లు కొట్టడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి వైరల్ చేశారు. సాక్షిలో ఈ కథనం ప్రముఖంగా ప్రసారమైంది. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఆ వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి రంగంలోకి దిగారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, అందోల్ జోగిపేట డివిజన్ ఆర్డీవో పాండు మంగళవారం మధ్యాహ్నాం క్యాంపస్ హాస్టల్ చేరుకొని జరిగిన సంఘటనపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొంతకాలంగా మెస్‌లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న విద్యార్థుల ఫిర్యాదుల్ని.. అలాగే ఇవాళ్టి ఎలుక వీడియోను ఆమె పరిశీలించారు. కాంట్రాక్టర్‌ను తొలగించడంతో పాటు కేర్ టేకర్ పైనా లీగల్‌యాక్షన్ తీసుకుంటామని, నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఘటనతో అలర్ట్.. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో ఉన్న బోర్డింగ్, హాస్టలను , క్యాంటీన్లను తనిఖీలు నిర్వహించాలన్నారాయన. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే.. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహాకులు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ ను తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని సంస్థల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు.. హోటల్స్, రెస్టారెంట్స్ తో పాటు బేకరీలు, బోర్డింగ్, హాస్టల్స్, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకుల పై నిఘా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని మంత్రి ఆదేశించారు. -
జెప్టోలో డెలివరీ.. హెర్షే చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ డెలివరీ పార్శిల్లో వస్తున్న వాటిని చూసి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం నోయిడాలలో ఓ వ్యక్తి ఐస్క్రీంను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అందులో తెగిన మనిషి వేలు కనిపించడం సంచలనం సృష్టించింది. దీంతో సదరు ఐస్‌క్రీం సంస్థ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు. అనంతరం బెంగళూరులోని ఓ వ్యక్తి అమెజాన్ నుంచి ఎక్స్ బాక్స్ కంట్రోలర్‌ను ఆర్డర్ చేయగా.. పార్శిల్ బాక్స్‌లో చిన్న తాచు పాము వుండడం చూసి ఒక్కసారిగా కస్టమర్ భయాందోనకు గురయ్యాడు.తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఆన్ లైన్ డెలివరీ సంస్థ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుకను చూసి ప్రమీ శ్రీధర్ అనే మహిల ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు.జెప్టో నుంచి హెర్షే చాక్లెట్ సిరప్‌ని బ్రౌనీ కేక్‌లతో తినడానికి ఆర్డర్ చేయగా... సిరప్‌ను కప్‌లో పోస్తుండగా అందులో చనిపోయిన ఎలుక కనిపించిందని అని పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలియక ముందు కుటుంబ సభ్యులు సిరప్ రుచి చూశారని, దీంతో వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. ఏదైనా వస్తువు ఆర్డర్ చేసి తినే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేయాలని, కేసు వేయాలని సూచిస్తున్నారు.దీంతో హెర్షే సంస్థ స్పందించింది. ఇలాంటి ఘటన ఎదురైనందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. దయచేసి తమకు UPC అలాగే తయారీ కోడ్‌ను consumercare@hersheys.comకు రిఫరెన్స్ నంబర్ 11082163తో పంపాలని తెలిపింది. తద్వారా తమ బృంద సభ్యులు మీకు సహాయం చేయగలరని పేర్కొంది. View this post on Instagram A post shared by Prami Sridhar (@pramisridhar) -
'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'! ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!
డైట్ చేసి బరువు తగ్గాలి అంటే నోటిని చాలా కంట్రోల్ చేయాలి. నచ్చిన వాటిని తినకుండా చాలా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో డైట్ చేద్దాం అనుకునేవాళ్లు మధ్యలోనే బాబోయ్! నావల్ల కాదంటూ వదిలేస్తారు. దీంతో బరువు తగ్గలేక, నోటిని కంట్రోల్ చేయలేక చాలా మంది నానాపాట్లు పడుతుంటారు. అలాంటి వారికి 'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'(ఎలుక అల్పహారం) చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటీ ఎలుక అల్పహారమా? అని సందేహించకండి. అది అన్నింటిని కాంబేనేటడ్గా తింటుంది. దానికి దొరికిన వాటిని కొంచెం కొంచెంగా తినేస్తుంది. అది ఇది అని ఉండదు అన్నింటిని కలగపులగంగా తినేస్తుంది. అలా ఎలుక చిరుతిండిని ఫాలో అయితే అన్నింటిని తిన్న ఫీలింగ్ ఉంటుంది. పైగా బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ బ్రేక్‌ఫాస్ట్ గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటో చూద్దామా! చాలామందికి చిరుతిండ్లు తినడం అలవాటు. అంతెందుకు భోజనం చేయగానే నోట్లో కాస్త స్వీటు లేదా పండో నోట్లో పడాల్సిందే. కొందరూ అదే పనిగా తింటూనే ఉంటారు. అలాంటి వారికి ఈ ఎలుక అల్పహార విధాన మంచిం ఎంపిక. దీని వల్ల ఎక్కువ తినరు. పైగా అన్నింటిని తిన్నా.. ఫీల్ వస్తుంది. ఏంటీ ర్యాక్ బ్రేక్ ఫాస్ట్ అంటే..వివిధ పదార్థాల కలయిక. అంటే.. కొన్ని రకాల చిరుతిండ్లను కాంబినేటడ్గా అల్పహారంలా తింటే ఎక్కువ తిన్న ఫీల్ వస్తుంది. ఇలా ఎలుకలు తినేటప్పుగూ గమినిస్తే తెలుస్తుంది. అది తనకు కావాల్సిన తిండిగింజలను అన్నింటిని తెచ్చుకుంటుంది. అన్నింటిని మిక్స్‌డ్‌గా తింటుంది. అలా మనం కూడా తీసుకుంటే ఆహారం వృధా అవ్వదూ పైగా అన్ని తినగలుగుతాం. దీన్ని బ్రిటీష్ సూపర్ మార్కెట్ దిగ్గజం వెయిట్రోస్ తన వార్షిక ఆహార పానీయాల నివేదికలో ఈ ట్రెండ్‌ను హైలైట్ చేసింది. ఇది అసాధారణమైన స్నాక్ కాంబినేషన్. ఆకలిని అణుచుకోలేక వెంట వెంటనే పెద్దగా భోజనాన్ని తినేయకుండా కాస్త కడుపుకి తగ్గించి తినే విధానమే ఇది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు బేరీజు వేసుకుని సరైన విధంగా ఫాలో అవ్వాలి. అవేంటంటే.. కఠినమైన భోజనం నుంచి విముక్తి: ర్యాట్ బ్రేక్ ఫాస్ట్ పాటించడం వల్ల ఇలాగే తినాలనే మన సాధారణ భోజన షెడ్యూల్‌ని కాస్త మారుస్తుంది. ఆకలిని బట్టి తినే విధంగా, ప్రాధాన్యతల ఆధారంగా తినడానికి అనుమతిస్తుంది. బిజీ షెడ్యూల్లు ఉన్నవారికి ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. తినాలనే క్యూరియాసిటీ : ట్రెండ్‌కు తగినట్టుగా భోజన వేళలను, అలవాట్లను మార్చుకుని చిన్న భోజనాలతో రోజును పూర్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే ర్యాట్ బ్రేక్ పాస్ట్ అలవాటు చేసుకుంటే మాత్రం చిన్న చిన్న అల్పాహారాలతోనే కడుపు నింపేసుకుంటాం. బెటర్‌గా తినడం: మిగిలిపోయిన పదార్థాలను తినడం, కనిపించిన ప్రతి వస్తువునూ కొనేయడం వంటి అలవాట్లను, ఆహార వ్యర్థాలను తినే అవాటును తగ్గిస్తుంది. ఆహారంపై కంట్రోల్: నియంత్రణ లేని అల్పాహారం అధిక క్యాలరీలను తీసుకోవడానికి దారితీస్తుంది. ఈ విధానం ఒకరకంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకుని తినేలా చేస్తుంది. తత్ఫలితంగా ఆహారంపై నియంత్రణ ఏర్పడుతుంది. పోషకాహార సమతుల్యత: స్నాక్స్‌పై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం వల్ల సమతుల్య భోజనం నుంచి అవసరమైన పోషకాలను తీసుకోవడం కుదరకపోవచ్చు. అందువల్ల ఈ స్నాక్స్‌లో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు ఉండేలా చూసుకోవడం మంచిది మూడ్స్‌పై ప్రభావం: ఒకోసారి ఇలా అల్పాహారంలా తింటుంటే మన ఆకలిపై ఒత్తిడి లేదా విసుగుకు దారితీస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సరైన విధాంగా ఈ విధానాన్ని అమలు చేయాలి. అయితే ఈ ర్యాక్ బ్రేక్ ఫాస్ట్ అనేది అన్ని వేళలా సౌకర్యవంతమైన విధానం కాకపోవచ్చు గానీ కాస్త ఆహారంపై మనసు పెట్టి తినేలా మాత్రం చేస్తుంది. ఏ విధానమైనా పిచ్చిలా కాకుండా ఇష్టపూర్వకంగా పద్ధతిగా తీసుకుంటే సత్ఫలితాలను పొందగలుగుతాం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. ఈ పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటే మీ ఆరోగ్య స్థితిని అనుసరించి వ్యక్తిగత వైద్యుడిని సలహాల మేరకు అనుసరించడం మంచిది. (చదవండి: ఆ క్రీడాకారుడు ధరించిన 'షూ'లు వేలంలో రికార్డు స్థాయిలో రూ. 66 కోట్లు..) -
లికర్ తాగిన ఎలుక..పట్టుకున్న పోలీసులు
చింద్వార: పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు. దొంగలు పడడమే కాదు..స్టేషన్లో ఉన్న 60 లిక్కర్ బాటిళ్లను ఖాళీ చేశారు. ఈ విషయమై పోలీసులు ఓ దొంగను పట్టుకొని బంధించారు. ట్విస్టేంటంటే ఆ దొంగ మనిషి కాదు..ఎలుక. ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో జరిగింది. అసలేం జరిగిందంటే పోలీసులు ఓ అక్రమ మద్యం సరఫరా చేసే వ్యక్తి దగ్గర నుంచి 60 బాటిళ్ల లిక్కర్ సీజ్ చేశారు. ఈ మందు బాటిళ్లను తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అయితే పీఎస్‌లోకి వచ్చిన ఎలుకలు మొత్తం లిక్కర్ తాగేశాయని పోలీసులు చెబుతున్నారు. బాటిళ్లు ఖాళీ అయ్యాయన్న బాధ కంటే అక్రమ మద్యం కేసు నిరూపించడం ఇక కష్టమని పోలీసులు ఆవేదన చెందుతున్నారు. కేసు వీగిపోయే పరిస్థితులు కల్పించాయన్న కోపంతో లిక్కర్ బాటిళ్లు ఖాళీ చేసిన ఎలుకల్లో ఓ ఎలుకను ట్రాప్ చేసి పట్టుకున్న పోలీసులు దానిని బంధించారు. మిగతా ఎలుకలను పట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. కేవలం కొత్వాలి పోలీస్‌స్టేషనే కాదని, అక్కడున్న అన్ని ప్రభుత్వ ఆఫీసు భవనాలకు ఎలుకలు, చెదల బాధ తప్పడం లేదని, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వాటిని వదిలించుకోవడం తమ వల్ల కావడం లేదని ఓ అధికారి వాపోయారు. -
ఎలుకను అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకంటే..?
భోపాల్: తప్పు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లో పోలీసులు ఓ ఎలుకను అరెస్టు చేశారు. చిన్న బోనులో బందించి పోలీసు స్టేషన్లోనే ఓ మూలన ఉంచారు. పోలీసు గోదాంలో ఉన్న మద్యం బాటిళ్లను ఎలుకలు ఖాలీ చేసిన కారణంగా దానిని బందించినట్లు పోలీసులు చెబుతున్నారు. చింద్వారా, కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బాటిళ్లకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానంలో సాక్షంగా చూపించాల్సి ఉంది. కానీ ఎలుకలు మద్యం బాటిళ్లను ఖాలీ చేశాయి. ఇక ఏం చేయాలో తెలియక ఎలుకలను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. చాలా ఎలుకల్లో ఒక్క ఎలుక మాత్రమే దొరికిందని తెలిపారు. మిగితావి పరారీలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రభుత్వ పత్రాలను కూడా ధ్వంసం చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల శరీరాన్ని కొరికి తిన్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
ఎలుక పాలు లీటరు 18 లక్షలా..!
ఇంతవరకు అత్యంత ఖరీదైన పాలంటే గాడిద పాలనే భావించేవారు. కానీ కాదట వాటికంటే ఓ చిన్న జీవి, మన వినాయకుడి వాహనం అయిన మూషికం పాలే ఖరీదైనవి. ఏకంగా లక్షలు పలుకుతోంది ధర. పైగా పరిశోధకలకు ఎంత ప్రియమైన జంతువట అది. ఇంతకీ ఎలుక పాలు ఎందుకంత కాస్టలీ? అత్యంత ఖరీదైన పాలు ఎలుక పాలే! షాకింగ్ అనిపిస్తున్నా ఇదే వాస్తవం. ఎలుకపాలు సంపాదించటం అంత ఈజీ కాదు. పైగా ఇది 30 నిమిషాల ప్రక్రియే అయినా ఎలుక నుంచి కొద్ది మొత్తంలోనే పాలు వస్తాయి. ఒక లీటరు పాలను ఉత్పత్తి చేయడానికి దాదాపు 40 వేల ఎలుకలు అవసరం. ఈ ఎలుకల నుంచి సేకరించిన ఒక లీటరు పాల ధర దాదాపు 23 వేల యూరోలు అంటే సుమారు 18 లక్షల రూపాయలు. దేనికీ ఈ పాలు.. ఎలుక పాలను పరిశోధనలకు ఓ సాధనంగా ఉపయోగిస్తారు. మలేరియా బ్యాక్టీరియాను చంపే మందులు తయారీలో ఈ ఎలుక పాలను ఉపయోగిస్తారు. అయితే శాస్త్రవేత్తలు ఆవు పాలకు బదులుగా ఈ ఎలుక పాలేనే ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటే..ఎలుక డీఎన్ఏ ఇతర జంతువుల డీఎన్ఏకంటే ప్రభావవంతంగా ఉంటుంది. పైగా మానవ శరీరానికి సంబంధించింది. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం చాలా ఈజీ. ప్రయోగాలకు వేల జంతువులు అవసరం. అదే ఆవు అయితే వేల ఆవులను వినయోగించడం సాధ్యం కాదు. దానికంటే వేల ఎలుకలను ఉపయోగించడమే చాలా ఆచరణాత్మకమైనది, సులభమైనది కూడా. ఏ ఔషధాల్లో ఉపయోగిస్తారంటే.. మలేరియాను నయం చేసే మందుల్లోనే గాక రీసెర్చ్ మెటీరియల్గానూ ఈ పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ ఎలుక పాలు పరిశోధనల పరంగా అత్యంత ఖరీదైనవి. ఏజంతువు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందంటే.. ఒక ఆవు ఏడాదికి దాదాపు 10 వేల లీటర్ పాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని బరువు కంటే ఏడు రెట్లు ఎక్కువ. మేకలు ఏడాదికి వాటి బరువు కంటే 12 రెట్లు పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న జీవులన్నింటిలో బ్లూ వేల్ రికార్డును కలిగి ఉంది. నీలి తిమింగలం రోజుకు 600 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాలు చాలా కొవ్వుగా ఉంటాయి. కాబట్టి తిమింగలం పిల్ల రోజుకు 100 కిలోల బరువు పెరుగుతుంది. (చదవండి: వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్ ఎమోషన్..) -
‘చికెన్ కర్రీలో ఎలుక’ ఎపిసోడ్లో ట్విస్ట్!
రెస్టారెంట్లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కనిపించడం.. ఆ వార్త ప్రముఖంగా వార్తల్లో, సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడం తెలిసిందే. అయితే.. ముంబై బాంద్రాలో జరిగిన ఈ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్టమర్లు ఫుల్‌గా తాగొచ్చి అల్లరి చేయడమే కాకుండా.. తప్పుడు కేసు బనాయించారని రెస్టారెంట్ మేనేజర్ వాపోతున్నాడు. ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బాంద్రా వెస్ట్ పరిధిలోని పాలి నాకాలోని పాపా పంచావో దా దాబా రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ చికెన్, బ్రెడ్‌తో మటన్ తాలి ఆర్డర్ చేశారు. ఫుడ్ తింటుండగా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించడంతో పరీక్షించి చూడగా అందులో చనిపోయిన చిన్న ఎలుక కనిపించింది. దీనిపై కంగుతిన్న కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. మేనేజర్ తీరుపై ఆగ్రహంతో బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజర్, చెఫ్‌తో పాటు సర్వర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాగి వచ్చి డ్రామాలు గత 22 ఏళ్లుగా రెస్టారెంట్ నడుస్తోంది. ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. మద్యం మత్తులో ఆ ఇద్దరూ మా రెస్టారెంట్‌కు వచ్చారు. వచ్చాక కూడా తాగుతూ కనిపించారు. మందు కోసం డిమాండ్ చేశారు. మాది కేవలం ఫుడ్ డైనింగ్ మాత్రమని స్పష్టం చేసినా వినిపించుకోలేదు. సర్వర్‌తో గొడవ పడ్డారు. చివరకు చచ్చిన ఎలుకతో డ్రామాకు దిగారు. డబ్బు ఇస్తేనే సైలెంట్‌గా వెళ్లిపోతామని చెప్పారు. మేం ఒప్పుకోకపోవడంతో ఇంత రాద్ధాంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే.. వాస్తవాలు బయటపడతాయి అని మేనేజర్, సర్వర్లు చెబుతున్నారు. బెయిల్‌పై విడుదల అయితే రెస్టారెంట్ పేరును దెబ్బ తీయడంతోపాటు డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే రెస్టారెంట్‌పై అపవాదు మోపారని నిందితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మంగళవారం నిందితులు ముగ్గురినీ బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు. కలుషిత ఆహారం నేరం కింద కేసు నమోదు అయ్యిందని.. ఎలుక బయటపడిందిగా చెబుతున్న ప్లేట్‌ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపామని.. నివేదిక వస్తే అసలు విషయం బయటపడుతుందని బాంద్రా పోలీస్ అధికారి చెబుతున్నారు. @MumbaiPolice Rat found in our gravy at #papaPanchodadhaba near Pali naka Bandra West . No manager or owner is ready to listen . We called police and 100 as well . No Help yet . @mumbaimirror @TOIMumbai pic.twitter.com/YRJ4NW0Wyk — Stay_Raw (@AMINKHANNIAZI) August 13, 2023 చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
ఔరా.. ఎలుకల మహత్యం!
సాక్షి, చైన్నె: ఎలుకల పుణ్యమా అంటూ గంజాయి కేసు నుంచి ఇద్దరు నిందితులు విడుదలయ్యారు. పట్టుబడ్డ గంజాయిలో సగానికి సగం ఎలుకలు తినేయడం, పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించక పోవడంతో కేసు కొట్టి వేస్తూ నిందితులను మంగళవారం మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. వివరాలు.. రెండేళ్ల క్రితం మెరీనా బీచ్ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లుగా ఆ ప్రాంతానికి చెందిన రాజగోపాల్, నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసు విచారణ చైన్నె హైకోర్టు ఆవరణలోని మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో సాగుతూ వచ్చింది. చార్జ్‌షీట్‌లో ఆ ఇద్దరి నుంచి 22 కేజీలు పట్టుకున్నట్లు మెరీనా పోలీసులు కోర్టుకు వివరించారు. ఇందులో కొంత పరిశోధనకు పంపించగా, మిగిలిన 21 కేజీల 900 గ్రామాలను భద్రత పరిచామని పేర్కొన్నారు. అయితే కోర్టుకు విచారణ సమయంలో పట్టుబడ్డ మొత్తం గంజాయి కాకుండా కేవలం 11 కేజీలు మాత్రమే సమర్పించారు. మిగిలిన గంజాయి ఎక్కడఅని కోర్టు ప్రశ్నించగా, ఎలుకలు తినేసినట్టు మెరీనా పోలీసులు సమాధానం ఇవ్వడం ఇటీవల చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో ఈకేసు తుది విచారణ ముగియడంతో మంగళవారం తీర్పు వెలువడింది. చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లుగా గంజాయిని కోర్టులో సమర్పించిక పోవడం, ఆధారాలు సరిగ్గా లేక పోవడంతో కేసును కోర్టు కొట్టి వేసింది. ఇద్దరు నిందితులను విడుదల చేసింది. ఎలుకల పుణ్యమా ఈఇద్దరు జైలు శిక్ష నుంచి బయట పడటం గమనార్హం. ఇదిలా ఉండగా ఇటీవల కోయంబేడు పోలీసులు పట్టుకున్న 33 కేజీల గంజాయిలో 19 కేజీలను ఎలుకలు తినేసినట్టుగా కోర్టుకు వివరాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు బయటపడ్డారు. అదే సమయంలో పట్టుబడ్డ గంజాయిని భద్ర పరచడంలో పోలీసులు విఫలమయ్యారా? లేక ఎలుకల పేరిట గంజాయిని బయటకు పంపించి సొమ్ము చేసుకున్నారా? అనే పోస్టులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. -
ఈ వీడియో చూస్తే.. రెస్టారెంట్లో చికెన్ కర్రీ ఆర్డర్ చేయరు!
ఇంటి వంట ఎంత రుచి, శుచిగా ఉన్నా రెస్టారెంట్లను అప్పుడప్పుడు సందర్శించాల్సిందే. ఇదే ప్రస్తుత ట్రెండ్. కొన్ని పుడ్ ఐటమ్స్ ఫలానా రెస్టారెంట్లో బాగుంది అని తెలిస్తే చాలు.. క్యూలో ఉండి ఆ వంటకాన్ని ఇంటికి తెచ్చుకోవడమో, లేదా అక్కడే తినడమో చేస్తుంటారు. రెస్టారెంట్లో పుడ్ అనగానే రుచి వరకు ఓకే గానీ నాణ్యత విషయంలో మాత్రం అంతంత మాత్రమేనన్న ఘటనలు బోలెడు ఉన్నాయి. ఇక వెజ్ పరిస్థితి ఎలా ఉన్నా నాన్‌వెజ్ వంటకాల విషయంలో మాత్రం కొన్ని రెస్టారెంట్లు క్వాలిటీ పరంగా షాక్‌లు ఇస్తూనే ఉంటాయి. తాజాగా పంజాబ్‌లోని లుధియానాలో ఓ కస్టమర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చికెన్ కర్రీలో ఎలుకలుంటాయ్ వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి లుధియానాలోని ప్రకాష్ ధాబాకు వెళ్లాడు. వెయిటర్ తన వద్దకు రాగానే.. ఆ వ్యక్తి తనకు నచ్చిన చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. కాసేపు అనంతరం ఆర్డర్ తన టేబుల్ ముందుకు వచ్చింది. ఇక ఆకలిగా ఉన్న ఆ కస్టమర్.. ఓ పట్టు పట్టాలని తినేందుకు రెడీ అయ్యాడు. అంతలో చికెన్ గ్రేవీలో ఎలుక కనిపించింది. చికెన్ ముక్క అనుకుని గబుక్కున నోట్లో వేసుకుందామని చూసిన ఆ కస్టమర్ దెబ్బకు హడలిపోయాడు. సిబ్బందికి ఈ విషయం చెప్పగా.. వాళ్లు పట్టించుకోకపోవడమే కాకుండా.. అసలు తమది తప్పే కాదన్నట్టుగా మాట్లాడారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ కస్టమర్. ఆ వీడియోలో.. "ప్రకాష్ ధాబా లూథియానా. ఇండియా చికెన్ కర్రీలో ఎలుకను వడ్డించండి. రెస్టారెంట్ యజమాని ఫుడ్ ఇన్స్పెక్టర్కి లంచం ఇవ్వడంతో ఇంత స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నారా ??? అనేక భారతీయ రెస్టారెంట్లలోని కిచెన్‌లో ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి" అని పోస్ట్ కింద క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఇదిలా ఉండగా రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆ కస్టమర్ కావాలనే తమ హోటల్ గుడ్ విల్ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం కస్టమర్‌కే సపోర్ట్ చేశారు. అంత పెద్ద తప్పు చేసి మళ్లీ బుకాయిస్తున్నారా అంటూ మండి పడుతున్నారు. ఇంకొందరు...అసలు ఆ రెస్టారెంట్ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేసేయాలని ఫైర్ అవుతున్నారు. లుధియానాలో ఇదేం కొత్త కాదు. చాలా రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Parkash dhaba Ludhiana. India Serve rat in chicken curry. Restaurant owner bribe the food inspector and go free??? Very poor standards in Kitchen of many Indian restaurants. Be aware . pic.twitter.com/chIV59tbq5 — NC (@NrIndiapolo) July 3, 2023 -
ఎలుకను చంపిన వ్యక్తిపై కేసు, 30 పేజీల చార్జిషీట్.. 3 ఏళ్లు జైలు శిక్ష?
లక్నో: ఎలుకను చంపినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మనోజ్ కుమార్ ఓ ఎలుకను చిత్ర హింసలు పెడుతూ ఉండగా.. జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ ఈ మొత్తం ఘటనను చిత్రీకరించి నిందితుడు మనోజ్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విచిత్రమైన ఘటన తెరపైకి వచ్చింది. ఎలుక పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు. శర్మ ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించగా అది ఊపిరాడక చనిపోయిందని తెలిపాడు. కాగా మనోజ్‌పై జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం, జంతువులను చంపడం లేదా గాయపరచడం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, మీడియాలో విడుదలైన వీడియోలు, సంబంధిత వివిధ విభాగాల నిపుణుల అభిప్రాయాలతో సహా 30 పేజీల ఛార్జిషీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు. పోలీసులు ఎలుక మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. వాపు కారణంగా ఎలుక ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చార్జిషీట్లో స్పష్టం చేశారు. అంతే కాకుండా మైక్రోస్కోపిక్ పరీక్షలో కూడా ఊపిరాడక ఎలుక చనిపోయిందని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అటవీ శాఖ చట్టం ప్రకారం... ఎలుకను చంపడం నేరంగా పరిగణించబడదని బుదౌన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్ఓ) అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున చర్యలు తీసుకోవాల్సి ఉందని డిఎఫ్ఓ తెలిపారు. ఏ శిక్ష పడే అవకాశం ఉంది! జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో రూ.10 నుంచి రూ.2000 వరకు జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, మనోజ్ తండ్రి మధుర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎలుకను, కాకిని చంపడం తప్పుకాదని, అవి హానికర జీవులని, అలాంటి కేసులో మా కుమారుడికి శిక్ష పడితే కోళ్లు, మేకలు, మేకలను చంపే వారందరిపైనా చర్యలు తీసుకోవాలి. చేపలు, ఎలుకలను చంపే మందులను విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. -
పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..
పూరి జగన్నాథుడి ఆలయంలో ఎలుకల సమస్య అర్చకులను, ఆలయ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఎలుకల నివారణ కోసం అధికారులు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే దీనిని పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కారణం రాత్రిపూట ఆలయంలోని దేవుళ్ల నిద్రకు భంగం ఏర్పడుతుందని వ్యతిరేకిస్తున్నారు పూజార్లు. ఆ యంత్రాలు చేసే హమ్మింగ్ వల్ల దేవుడి నిద్రకు భంగం అని జగన్నాథుడి అర్చకులు చెబుతున్నారు. ఎప్పటి నుంచే ఆలయంలో ఎలుకల సమస్య ఎక్కువగా ఉందని అర్చుకులు మొరపెట్టడంతో.. ఓ భక్తుడు ఈ ఎలుకల నివారణ యంత్రాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. కానీ దీన్ని అర్చకులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాలను తీసేశారు. పైగా ఏళ్ల నుంచి అనుసరించే విధానంలోనే ఎలుక బోనులను ఏర్పాటు చేసి..వాటిని సజీవంగా పట్టుకుని బయట వదిలేస్తామని అంటున్నారు అర్చకులు. ఆలయంలో ఎలుకల మందు ఉపయోగించే అనుమతి లేదని ఆలయ నిర్వాహకుడు జితేంద్ర సాహు చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఎలుకలు చెక్కతో ఉండే పూరిజగన్నాథుడి దేవత విగ్రహాలను పాడు చేశాయని అర్చకులు తెలిపారు. ఆలయ రాతి అంతస్థల్లోని ఖాళీల్లో ఆవాసం ఏర్పరుచుకోవడంతో గర్భగుడి నిర్మాణం దెబ్బతింటుందని ఆలయ నిర్వాహకులు భయపడుతున్నారు. ఈ ఎలుకలు గర్భగుడిని మలమూత్రాలతో పాడు చేయడంతో ప్రతిరోజు పూజాదికాలు నిర్వహించేటప్పడుడూ.. చాలా ఇబ్బందిగా ఉంటోందని అర్చకులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. అదే ఆయన ఉసురు తీసింది) -
Hyderabad: షాకింగ్.. మెక్ డొనాల్డ్స్‌లో చిన్నారిని కరిచిన ఎలుక
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రెసార్టెంట్లో ఎలుక ఎనిమిదేళ్ల బాలుడిని కొరికి గాయపరిచింది. ఈ దారుణం కొంపల్లిలోని ఎస్పీజీ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లోఉన్న మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌లో మార్చి 8న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. రెస్టారెంట్‌లోని డైనింగ్ ఏరియా పక్కన ఉన్న వాష్‌రూమ్‌లో నుంచి ఒక పెద్ద ఎలుక ఒక్కసారిగా బయటకు పరుగెత్తుకొచ్చింది. అదే సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి కూర్చొని ఫుడ్ తింటున్నాడు. ఇంతలో ఎలుక బాలుడి పైకి ఎక్కి అతపి నిక్కర్లోకి చొరబడింది. భయంతో చిన్నారి కేకలు వేయగా.. అప్రమత్తమైన తండ్రి వెంటనే కొడుకు నిక్కర్లో నుంచి ఎలుకను బయటకు విసిరేశాడు. అయితే అప్పటికే ఎలుక బాలుడి తొడపై పంటితో గాయపరిచింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని బోయిన్‌పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడికి టెటానస్, యాంటీ రేబిస్ డోస్‌లు ఇచ్చామని.. అతని ఎడమకాలుపై రెండు చోట్ల కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారి అయిన చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు.. రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై స్పందించిన కంపెనీ ఈ అంశంపై మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధి స్పందిస్తూ.. భారత్‌లో ఉన్న అన్ని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో నాణ్యత, సేవ, శుభ్రత ( quality,service,clean) విషయంలో కంపెనీ రాజీపడదు, ఎలప్పుడూ హైస్టాండర్డ్లోనే నిర్వహిస్తుంటుంది. అయితే హైదరాబాద్‌లోని జరిగిన ఘటన గురించి తెలిసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాము. మరో సారి ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మా సిబ్బంది ఎల్లప్పుడూ రెస్టారెంట్ల నాణ్యత, శుభ్రత విషయంలో అత్యధిక స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తారని ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆడిట్‌లోనూ బహిర్గతమైంది. మెక్‌డొనాల్డ్స్ కస్టమర్ల భద్రత, శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. తాము ఎలప్పుడూ సురక్షితమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. RODENT ATTACK ON A CHILD in the McDonald’s restaurent Ground Floor, SPG Hotel, Kompally, Hyderabad, Telangana 500096.@McDonalds @mcdonaldsindia @consumercourtin @PiyushGoyalOffc @director_food @AFCGHMC @fooddeptgoi @TOIIndiaNews @TOIHyderabad @ABPNews @ndtv @ChildWelfareGov pic.twitter.com/wrjeQgAiBh — Savio H (@SHenrixs) March 10, 2023 -
ఎలుక కష్టం ఎవరికి ఎరుక.. కొరికితేనే బతికేది!
సాక్షి, అమరావతి: ఎలుకలు సృష్టించే విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే. కనిపించిన ప్రతీదీ కొరికేస్తూ.. బోలెడంత నష్టాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఈ విధ్వంసం వెనుక ఓ చిన్నపాటి విషాదమూ ఉంది. చిట్టెలుకల్లో ఉండే రెండు కొరుకుడు (ఇన్సైజర్స్) దంతాలు రోజూ 0.4 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతాయట. దీని వల్ల ఈ కోరపళ్లను అవి ఎప్పటికప్పుడు అరగదీయాల్సిందే! లేదంటే అవి ఎలుకల దవడలను చీల్చుకుని బయటకు రావడంతో ఆహారం తినలేవట. దీంతో తిండిలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందట. అందుకే అవి బతకాలంటే నిరంతరం దేన్నైనా కొరుకుతూ ఉండాలి. అయితే.. దాని వల్ల జరుగుతున్న నష్టం మాత్రం అపారం. తినటానికి పనికిరాకున్నా బలమైన విద్యుత్ తీగలు, ప్లాస్టిక్ వస్తువులను సైతం కొరికేస్తాయి. చిట్టెలుకలు తీసుకునే ఆహారం రోజుకు 28 గ్రాములే.. కానీ అవి కలిగించే నష్టం మనందరికీ తెలిసిందే. అమెరికాలో ఏటా 19 నుంచి 21 బిలియన్ డాలర్ల పంట నష్టం జరుగుతున్నట్లు లెక్కగట్టారు. ఎలుకలు తమ శరీర బరువులో దాదాపు 20 శాతం వరకు ఆహారంగా తీసుకుంటాయని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ గ్రాంట్ సింగిల్టన్ తెలిపారు. ఒకేసారి కాకుండా రోజుకు 3–4 సార్లు తింటాయి. ఎలుక ఏడాదిలో 10 కేజీల ఆహారం తీసుకుంటే అది కొరికి నాశనం చేసే పంట తినేదానికి పదిరెట్లు అంటే.. దాదాపు 100 కిలోలు ఉంటుందని అంచనా. ♦ దేశంలో వరి, గోధుమ పంటలకు ఎలుకలు ఏటా 5 నుంచి 15% నష్టం కలిగిస్తున్నాయి. ఇతర అన్ని పంట లను కలిపితే నష్టం సుమారు 25%వరకు ఉంటుంది. ♦ ఎలుకల కారణంగా కాలిఫోర్నియాలో 504 మిలియన్ డాలర్ల పంట నష్టం జరిగినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్–నేషనల్ వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ సెం టర్ అంచనా వేసింది. ♦ ప్రపంచవ్యాప్తంగా 84 రకాల ఎలుకలున్నా 18 రకాల మూషికాలు పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నట్లు ఒడిశా స్టేట్ ఎన్విరాన్మెంట్ విభాగంతెలిపింది. ♦ ఒడిశాలోని 4 గ్రామాల్లో ఎలుకలు 3.60 టన్నుల ఆహార ధాన్యాలను నాశనం చేసినట్లు తేలింది. దుకాణాల్లోని గోడల్లో ఎలుకలు దాచిన ఆహార పదార్థాలను వెలికితీయగాఒక్కోచోట 16.64 నుంచి 21.5 కిలోలు గుర్తించారు. ♦ సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పాటు జీవించే గోధుమ రంగు ఎలుకలు 21 రోజుల్లో 10 నుంచి 14 పిల్లలను పెడుతుంది. ఇవి నాలుగైదు వారాల్లోనే పరిపక్వ దశకు చేరి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఎలుకలు జతకడితే ఏడాదిలో వాటి సంతానం 1,000 దాటిపోతుంది. -
ఆన్లైన్ ఆర్డర్.. బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక ప్రత్యక్షం.. షాక్ తిన్న కస్టమర్!
ఒకప్పుడు ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. కిరాణం షాప్‌లు, సూపర్ మార్కెట్ల వద్ద లైన్లో నిలబడి తీసుకొచ్చుకొనేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా కూరగాయలు, పప్పులు, ఉప్పులు, వండిన ఆహారం.. పర్నీచర్ ఇలా ఒక్కటేంటి అన్నీ ఆన్లైన్లోనే లభిస్తున్నాయి. చేతిలో ఒక్క ఫోన్ ఉంటే చాలు.. కోరుకున్న వస్తువులు నిమిషాల్లో మన ముందు వాలిపోతున్నాయి. ఫోన్లోని యాప్‌ల ద్వారా మనకు ఏం కావాలో క్లిక్ చేస్తే బయట ధరలకే వస్తువు డెలివరీ అయిపోతుంది. దీంతో ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతోంది. అయితే ఆన్లైన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చాక ప్రయోజనాలతోపాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఆర్డర్లు మారిపోవడం, నాణ్యత లేని వస్తువులు రావడం లేదా పాడైపోవడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్డర్ చేసిన వాటిల్లో క్రిమి కీటకాలు వస్తుండటం ఆందోళన రేపుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. నితిన్ అరోరా అనే వ్యక్తి బ్రెడ్ కోసం బ్లింకిట్‌లో ఆర్డర్ ఇవ్వగా అందులో ఎలుక కనిపించడంతో ఖంగుతిన్నాడు. ట్విటర్ వేదికగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేశారు. ‘లెట్స్ బ్లింకిట్‌లో అత్యంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్డర్ చేసిన బ్రెడ్ ప్యాకెట్లో బతికున్న ఎలుక వచ్చింది. ఇది మనందరిని హెచ్చరించే అంశం. ఆర్డర్ చేసే ముందు గమనించుకోండి. వస్తువు డెలివరీ ఆలస్యమైనా పర్లేదు, కానీ, 10 నిముషాల్లో పార్సిల్ వస్తుందని ఇలాంటివి అంటగట్టడం దారుణం’.. అని వాపోయాడు. Most unpleasant experience with @letsblinkit , where alive rat was delivered inside the bread packet ordered on 1.2.23. This is alarming for all of us. If 10 minutes delivery has such baggage, @blinkitcares I would rather wait for a few hours than take such items.#blinkit #zomato pic.twitter.com/RHNOj6tswA — Nitin Arora (@NitinA14261863) February 3, 2023 అరోరా పోస్టులో ఎలుకతో కూడిన బ్రెడ్ ప్యాకెట్‌ను మాత్రమే చూపించకుండా బ్లింకిట్ కస్టమర్ సర్వీస్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. ఈ ఫోస్టు వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదీ మరీ ఘోరమని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహిరస్తారంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఈ ఘటనపై కంపెనీ కామెంట్స్ విభాగంలో స్పందించింది. హాయ్ నితిన్! మీకు ఇలాంటి అసౌకర్యం కలగాలని తాము కోరుకోలేదని.. మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్ లేదా ఆర్డర్ ఐడీ పంపితే సమస్యను పరిష్కరిస్తామని బదులిచ్చింది. Hi Nitin, this is not the experience we wanted you to have. Please share your registered contact number or Order ID via DM for us to look into it. https://t.co/cmvbhHSmuW — Blinkitcares (@blinkitcares) February 3, 2023 -
వైరల్ వీడియో: తన బిడ్డ కోసం పాముతో పోరాడిన ఎలుక
-
శత్రు సైన్యంపై మూషికాస్త్రం!
యుద్ధ క్షేత్రంలో శత్రు శిబిరం ఎత్తుగడలు, రహస్యాలను తెలుసుకోవడానికి సైన్యం రకరకాల మార్గాల్లో ప్రయత్నించడం తెలిసిందే. శత్రువులు ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలు మోహరించారో తెలుసుకోవడం యుద్ధంలో కీలకం. ఇలాంటివి పసిగట్టే ఎలుకలపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) నిర్విరామంగా ప్రయోగాలు సాగిస్తోంది. డీఆర్డీఓలో అంతర్భాగమైన అసిమ్మెట్రిక్ టెక్నాలజీ ల్యాబ్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైంది. మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసి, రెండో దశలోకి ప్రవేశించింది. ఏమిటీ ప్రయోగం? సైనికులు జంతువులు, పక్షులను ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఎలుకలను రంగంలోకి దించాలన్నదే భారత సైన్యం వ్యూహం. ఇవి ఏమాత్రం అనుమానం రాకుండా శత్రు సైనికుల శిబిరాల్లోకి వెళ్లి, అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సైన్యం వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఎలుకలను యానిమల్ ౖసైబర్గ్స్ అని పిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీనిగురించి ఇటీవల జరిగిన 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. యానిమల్ సైబర్గ్స్ అంటే? జీవించి ఉన్న ఎలుకల సామర్థ్యాన్ని మరింత పెంచుతారు. ఇందుకోసం ఎలక్ట్రికల్, మెకానికల్ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ఎలుకలు చేయలేని ఎన్నో పనులను ఇవి సులువుగా చేసేస్తాయి. కేవలం సైన్యంలోనే కాదు, పరిశోధనలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, భూమిల పాతిపెట్టిన బాంబుల జాడ కనుక్కోవడంతోపాటు శస్త్రచికిత్సల్లోనూ యానిమల్ సైబర్గ్స్ సేవలను వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జంతువుల్లో మార్పులు చేయడాన్ని జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. జంతువుల్లోని సహజ సామర్థ్యాలను దూరం చేయడం వాటిని బాధకు గురిచేయడమే అవుతుందని అంటున్నారు. ఎలుకలే ఎందుకు? భారత్‌లో ఎలుకలపై మొదటి దశ ప్రయోగాలు ముగిశాయి. ఎలుకల కదలికలను నియంత్రించడానికి సర్జరీల ద్వారా వాటి శరీరంలో ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఇక సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వాటిని పరీక్షించబోతున్నారు. కొండలను ఎంత వరకు అధిరోహించగలవో చూస్తారు. మొదటి దశ ప్రయోగంలో ఎలుకలు కొంత ఇబ్బందికి గురయ్యాయని డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ వెల్లడించారు. కార్యాచరణకు సిద్ధమైన ఎలుకలను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. ఏ దిశగా వెళ్లాలి? ఎంత దూరంగా వెళ్లాలి? ఎక్కడ ఆగాలి? ఎంతసేపు ఆగాలి? అనేదానిపై వాటి మెదడుకు ఎప్పటికప్పుడు సంకేతాలు అందిస్తారు. ప్రయోగానికి ఎలుకలనే ఎన్నుకోవడానికి కారణంగా ఏమిటంటే.. అవి వేగంగా కదులుతాయి. లోతైన బొరియల్లోకి సైతం తేలిగ్గా వెళ్లగలవు. గోడలు, చెట్లు ఎక్కగలవు. యానిమల్ ౖౖసైబర్గ్స్ను చైనాలో ఇప్పటికే అభివృద్ధి చేశారు. యానిమల్ సైబర్గ్స్ సినిమాల్లో కూడా ఉన్నాయి. స్టార్‌వార్స్ సినిమాలోని చ్యూబాకా కూడా ఇలాంటిదే. ఒళ్లంతా రోమాలతో కనిపించే వింత జంతువు చ్యూబాకాలో శరీరం లోపల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
సమోసాలో చిట్టెలుక.. అప్పటికే 130 సమోసాలు..!
సాక్షి, సిద్ధిపేట: ఓ హోటల్లో కొన్న సమోసాలో చనిపోయిన చిట్టెలుక బయటపడ్డ ఘటన సిద్దిపేటలోని రాఘవాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అధికం వెంకటస్వామి హోటల్లో సమోసాలు కొన్నాడు. తింటున్న క్రమంలో చనిపోయిన ఎలుక వచ్చింది. దీంతో వినియోగదారుడు హోటల్ నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మరికొంతమంది గొడవకు దిగడంతో నిర్వాహకుడు మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పడంతో గొడవ సర్దుమనిగింది. అప్పటీకే 130 సమోసాలు అమ్మినట్లు నిర్వాహకుడు తెలిపారు. చదవండి: వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే.. -
Viral Video: పిల్లిని పరిగెత్తించిన ఎలుక
-
ఎస్పీ చెంతకు ఎలుక పంచాయితీ..ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: కర్రీ పాయింట్లో కొనుగోలు చేసిన పప్పులో ఎలుక వచ్చిందని ప్రశ్నించిన పాపానికి తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను బాధితులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురం నగరంలోని కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే ఊటకూరి దుర్గాంజలి దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2.56 గంటలకు దుర్గాంజలి... ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్లో రూ.30 చెల్లించి పప్పు, రూ.20 చెల్లించి చెట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లి అన్నంలోకి పప్పు వేసుకోగా అందులో చచ్చిన ఎలుక వచ్చింది. వెంటనే ఆ ప్లేటును తీసుకెళ్లి కర్రీపాయింట్ నిర్వహిస్తున్న యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అది చూసిన వారు హోటల్లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు పడడం సర్వ సాధారణమంటూ సమాధానం ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో కక్షకట్టిన ముత్యాలరెడ్డి కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు) -
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల బెడద
-
ఎలుక తెచ్చిన తంటా.. ఐదు లక్షల పరిహారం..
బెంగళూరు: అపార్ట్మెంట్లో ఎలుక పెద్ద రగడనే తెచ్చింది. ఒక కారులోని వైర్‌ను కొరికేయడంతో యజమాని తనకు ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షున్ని డిమాండ్ చేశాడు. ఇది గొడవగా మారి పోలీసుస్టేషన్లో కేస్ అయింది. వివరాలు.. బెంగళూరు గంగానగరలో కంఫర్ట్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ ఉంది. చెత్త పేరుకుపోయి ఎలుకల గోల అధికమైంది. ఎలుక ఒక కారు వైర్లను కొరికేసింది. దీంతో కారు యజమాని.. చెత్త తొలగించపోవడం వల్లనే ఎలుకల బెడద వచ్చిందని, ఈ నిర్లక్ష్యానికి అపార్ట్మెంట్ అసోసియేషన్ కారణమంటూ గలాటా చేశారు. గలాటతో ఆక్రోశానికి గురైన ఇతర ఫ్లాట్లవారు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిహారం ఇవ్వాలని తమను ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు. చదవండి: (అర్ధరాత్రి ఫోన్.. భర్త వార్నింగ్.. గంట తర్వాత చూస్తే..) -
పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోమి..
యశవంతపుర (బెంగళూరు): టూత్‌పేస్ట్ అనుకుని ఓ యువతి ఎలుకల మందుతో బ్రష్ చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన మంగళూరు జిల్లాలో జరిగింది. సూళ్యకు చెందిన శ్రావ్య (22) సోమవారం ఉదయం నిద్ర లేచింది. బాత్రూమ్ వెళ్లిన శ్రావ్య టూత్ పేస్ట్ అనుకుని గోడపై ఉంచిన ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. కొద్ది క్షణాల్లోనే అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: (పావనికి ఏం కష్టం వచ్చిందో? రాత్రికి రాత్రి ఏమైంది..) -
భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు..
సీతానగరం(తూర్పుగోదావరి): గోకవరానికి చెందిన తాతూరి బంగార్రాజు పదేళ్ల కుమారునికి ఎలుకల మందు కలిపిన డ్రింక్ తాగించి, తనూ తాగి శనివారం ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శుభశేఖర్ ఆసుపత్రికి తరలించారు. బంగార్రాజు భార్య కువైట్‌లో ఉంటుండగా, 14 ఏళ్ల కుమార్తె, 12, 10 ఏళ్ల కుమారులు ఉన్నారు. వీరు ముగ్గురు వంగలపూడిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. చదువుల నిమిత్తం హాస్టల్లో చేర్చారు. ఈ నెల 13న సంక్రాంతి సందర్భంగా వంగలపూడిలోని అత్తవారి ఇంటికి బంగార్రాజు వచ్చాడు. భార్యతో అతనికి కుటుంబ కలహాలు ఉన్నాయి. చదవండి: మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల.. ఈ నేపథ్యంలో తన ముగ్గురు పిల్లలతో బంగార్రాజు సీతానగరం కైలాస భూమి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న బంగార్రాజు కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి పదేళ్ల కుమారుడు ప్రజ్వల్‌తో బలవంతంగా తాగించి, తనూ తాగాడు. సమాచారం అందుకున్న ఎస్సై శుభ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురికి సీతానగరం బస్టాండ్ సెంటర్ వద్దగల ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యసేవలు అందించిన అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం
మగావా.. డ్యూటీలో చాలా సిన్సియర్. రోజూ ఫీల్డ్‌లోకి దిగి ల్యాండ్మైన్లను పసిగట్టడం. వందల మంది ప్రాణాలు రక్షించడం. ఇదంతా ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. ఇట్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్.. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్!!. సూపర్ హీరోకి అర్హతలేంటని అడిగితే.. ఏవేవో చెప్తుంటారు కొందరు. కానీ, ఆ అర్హతలేవీ లేకుంటే?.. ఆ సూపర్ హీరో అసలు మనిషి కాకుంటే!! యస్.. మాగావా మనిషి కాదు. ఓ ఎలుక. సాధారణమైంది మాత్రం కాదు. ల్యాండ్ మైన్లను గుర్తించడంలో కఠోర శిక్షణ తీసుకుంది. తన విధి నిర్వహణలో నిబ్ధదత ప్రదర్శించిన ఈ ఎలుక.. ఈమధ్యే కన్నుమూసింది. అందుకే సోషల్ మీడియాలో అంత ఎమోషనల్ అవుతున్నారు. టాంజానియా బ్రీడ్‌కు చెందిన మగావాను కంబోడియా తీసుకొచ్చి.. ల్యాండ్మైన్లను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో వందకి పైగా ల్యాండ్ మైన్లను గుర్తించింది. తద్వారా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ఈ చిట్టి హీరో. 2020లో మాగ్వా యూకేకి చెందిన ఓ ఆర్గనైజేషన్ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకుంది మగావా. కిందటి ఏడాది జూన్‌లో విధుల నుంచి రిటైర్ అయిన ఈ ఎలుక.. చివరికి ఎనిమిదేళ్ల వయసులో ఈమధ్యే కన్నుమూసింది. ఈ విషయాన్ని దానికి శిక్షణ ఇచ్చిన APOPO అనే బెల్జియం ఎన్జీవో ప్రకటించింది. అంతర్యుద్ధంతో దశాబ్దాలపాటు నలిగిపోయిన కంబోడియా.. ల్యాండ్మైన్ల గనిగా ఒక పేరు దక్కించుకుంది. వీటి ధాటికి వందల మంది ఏటా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అందుకే రిస్క్ లేకుండా ఎలుకలకు ల్యాండ్మైన్లను గుర్తించే శిక్షణ ఇప్పిస్తున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ల్యాండ్మైన్లతో పాటు టీబీ రోగి శాంపిల్స్ గుర్తించేందుకు ఎలుకలను ఉపయోగిస్తున్నారు. విశేషం ఏంటంటే.. చాలా సందర్భాల్లో ఇవి విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేస్తున్నాయి కూడా. అందుకే ఆ ర్యాట్హీరోలకు ఓ సలాం కొడుతూ.. RIP Magawa. -
పేస్టు అనుకుని.. ఎలుకల మందుతో పళ్లు తోముకుని..
అద్దంకి రూరల్(ప్రకాశం జిల్లా): పేస్టు అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుని ఓ యువతి మృతి చెందిన సంఘటన అద్దంకి మండలంలోని వెంకటాపురంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. వెంకటాపురం గ్రామానికి చెందిన పాలపర్తి కోటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమారె పాలపర్తి కీర్తి(18) తల్లితో పాటు కూలి పనులకు వెళ్తోంది. చదవండి: హాస్టల్లో ఉండలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఈ నేపథ్యంలో గురువారం పేస్టు అనుకుని ఎలుకల మందు బ్రెష్‌పై వేసుకుని కీర్తి పళ్లు తోముకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కడుపులో మంటగా ఉందని తల్లికి చెప్పడంతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించింది. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందూతూ శనివారం కీర్తి మృతిచెందింది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ లక్ష్మీభవాని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
కరోనా సోకిన ఎలుక కరవడంతో సైంటిస్టుకు పాజిటివ్
దాదాపు రెండేళ్ల నుంచి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తోంది. కోట్లాది మంది కోవిడ్ భారిన పడగా.. లక్షలాది మంది ఈ మహమ్మారి బలితీసుకుంది. కరోనా తగ్గుముఖం పడతుందనుకున్న ప్రతీసారి మరో కొత్త రూపం దాల్చి మళ్లీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వేరియంట్లలో ఆల్ఫా, బీటాలు పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ తరువాత వచ్చిన డెల్లా వేరియంట్ మాత్రం ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 57 దేశాలకు పాకింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ ఒక మనిషి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలుసు. అలాగే కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, అతని వాడిన వస్తువులు వేరే వారు తాకిన కోవిడ్ వ్యాపిస్తుందని తెలుసు. అయితే తాజాగా ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్లు తేలింది. తైవాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన బయో-సేఫ్టీ ల్యాబరేటరీలోని ఓ సైంటిస్ట్‌కు ఎలుక కరవడంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తైవాన్‌లోని టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అకాడెమియా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థలో పనిచేస్తున్న 20 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు తేలిందని అక్కడి ఆరోగ్య మంత్రి చెన్ షిహ్-చుంగ్ బ్రీఫింగ్ తెలిపారు. చదవండి:: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి! కాగా ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ ను కూడా సైంటిస్ట్ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక గత నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. చివరి సారిగా నవంబర్ 5న పాజిటివ్ నమోదైంది. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది. సైంటిస్ట్‌కు పాటివ్‌గా తేలడంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన 100 మందిని క్వారంటైన్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఎలుక కరవడం వల్లే కరోనా సోకింది అనేది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఎలుక కారణంగానే వైరస్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన జరుగుతంద ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మహిళకు డెల్టా వేరియంట్ సోకిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సైంటిస్ట్‌కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఒమిక్రాన్ అలజడి: భారత్‌లో మరో మూడు కేసులు.. -
ఎలుకలు చేసిన పని.. ఇబ్బందుల్లో 2000 మంది..
లండన్: ఎలుకల సంగతి అందరికీ తెలిసిందే.. తాము తినేవే కాదు అడ్డం వచ్చిన ఏ వస్తువులను కూడా వదలిపెట్టవు. తమ ఇంట్లో ఎలుకలు ఉన్నవారికి వీటి శాడిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ తరహాలోనే ఎలుకల కారణంగా ఏకంగా రెండు వేల మంది ఇంటర్నెట్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని టోరిడ్జ్, డేవాన్ ప్రాంతాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టోరిడ్జ్, డేవాన్ ప్రాంతాలలో ఎలుకల బెడద కాస్త ఎక్కువే. (చదవండి: తల్లిదండ్రులకు షాకిచ్చిన చైనా.. ఇకపై పిల్లలు తప్పు చేశారో అంతే సంగతి..) ఇటీవల ఆ ఎలుకల గుంపు ఇంటర్నెట్ కేబుళ్లను సైతం వదలక, ఇష్టం వచ్చినట్లు కొరికిపడేశాయి. దీంతో టోరిడ్జ్ ప్రాంతంలో 1800 మంది, డేవాన్ ప్రాంతంలో 200 మంది వరకు వైఫై సేవలను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. బీటీ, వొడాఫోన్, ప్లస్‌నెట్,స్కై, ఇతర కంపెనీల సేవలు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి. అంతేగాక అక్టోబర్ 14న వీటి చర్యలకు దాదాపు ఏడు గంటల పాటు కాల్స్ సేవలు నిలిచిపోయాయి. గత రెండు నెలల నుంచి ఆ ప్రాంత స్థానికుల ఇంటర్నెట్ సౌకర్యంగా సరిగా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీనిపై స్థానిక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. బిడ్ఫర్డ్, క్లోవెల్లీ, హార్ట్‌ల్యాండ్ ప్రాంతాల్లో టెలిఫోన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల ఈ ప్రాంతాల్లో దాదాపు 1800 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి మా ఇంజనీర్లు ఈ సమస్యను పరిష్కరించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే మునుపటి పరిస్థితి తీసుకొచ్చేందుకు వారికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. చదవండి: Afghanistan: ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి.. -
పార్లమెంట్‌కు అనుకోని అతిథి; పరుగులు పెట్టిన ఎంపీలు
మాడ్రిడ్: స్పెయిన్ దేశంలోని అండలూసియా పార్లమెంట్లో ఒక ఎలుక హల్చల్ చేసింది. సమావేశాల్లో భాగంగా కీలక ఓటింగ్ నిర్వహిస్తున్న దశలో ఎవరు ఊహించని విధంగా టేబుల్‌పైకి చేరిన ఎలుక.. అక్కడి ఎంపీలను ఉరుకులు పరుగులు పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్ సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. విషయంలోకి వెళితే.. కొన్ని రోజులుగా పెండింగ్‌లో పడిపోయిన ఒక ముఖ్యమైన తీర్మానంపై బుధవారం ఎంపీలు ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఓటింగ్‌కు సంబంధించి స్పీకర్ మార్తా బోస్కెట్ సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక ఎలుక ఎంపీలు కూర్చున్న టేబుల్‌పైకి ఎక్కింది. దానిని చూసిన స్పీకర్ షాక్ తిన్నారు. ఏమైందో అని మిగతా సభ్యులు కూడా అటు ఇటూ చూశారు. ఇంతలో ఎలుక పరిగెత్తడం చూసి కొంతమంది ఎంపీలు ఉరుకులు పరుగులు పెట్టగా.. మరికొందరు టేబుళ్లపైకి ఎక్కడానికి ప్రయత్నించారు. చివరకు ఎలాగోలా తంటాలు పడి ఎలుకను బయటకు పంపించి ఓటింగ్ ప్రక్రియను తిరిగి నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. This is the moment when a rat causes havoc in Andalusia's parliament in Spain 🐀 pic.twitter.com/PypFRWvQfQ — Reuters (@Reuters) July 21, 2021 -
పాపం.. ఎలుక తప్పించుకుంది.. మహిళ దొరికింది..
సాక్షి, హసన్‌పర్తి(వరంగల్) : ఎలుకను మింగేందుకు యత్నించిన పాము అది తప్పించుకోవడంతో అక్కడే ఓ మహిళపై కాటు వేయగా ఆమె మృతి చెందింది. హన్మకొండ 65వ డివిజన్ చింతగట్టులోని సుభాష్‌నగర్‌కు చెందిన పుల్లా కమలమ్మ(55) మరికొందరితో కలిసి మంగళవారం ఉదయం బయట కూర్చుని మాట్లాడుతోంది. కాగా, కమలమ్మ వెనుక వైపు నుంచి ఎలుక వెళ్తుండగా.. దానిని పట్టుకునేందుకు పాము వచ్చింది. అయితే, ఎలుక క్షణంలో తప్పించుకోవడంతో పాము కింద కూర్చోని ఉన్న కమలమ్మ చేతిపై కాటు వేసింది. పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: అదేమో కింగ్ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో! -
పాముతో ఎలుక ముద్దులాట.. ఇంకేముంది..
ఈ ఎలుక తన బుర్రను ఇంట్లోని బీరువాలో పెట్టి వచ్చినట్లు ఉంది.. లేకపోతే.. కలర్ఫుల్గా కనిపిస్తే చాలు.. ఇలా డైరెక్టుగా వెళ్లిపోయి ముద్దులిచ్చేయడమేనా.. పోనీ మనమేమైనా పులా, సింహమా.. జస్ట్ ఎలుక.. ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి.. ఎంతమంది మింగేయడానికి రెడీగా ఉంటారు.. ఇవన్నీ ఆలోచిస్తేగా.. అందుకే అన్నది బుర్రను బీరువాలో పెట్టి వచ్చిందని.. ఇంతకీ దీని తర్వాత ఏం జరిగిందని మాత్రం మమ్మల్ని అడగకండి.. ఎందుకంటే.. సార్‌వారు స్వర్గస్తులై.. అల్రెడీ రెండ్రోజులైంది.. ప్రస్తుతం దాని బంధుమిత్రులు సార్‌గారి దశదినకర్మ పనుల్లో బిజీబిజీగా ఉన్నారట. కార్యక్రమం ఎక్కడ జరగనుందో చెప్పలేదు కదూ.. ఇండోనేసియాలోని బెకాసీ అడవుల్లో.. -
ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం
కంబోడియా : ఓ ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ ఛారిటీ అందజేస్తున్న ‘‘పీడీఎస్ఏ’’ అనిమల్ బ్రేవరీ(జంతువులకు సంబంధించిన అవార్డుల్లో గొప్పది) అవార్డును సొంతం చేసుకుంది. కంబోడియాలోని భూముల్లో దుండగులు పాతిపెట్టిన లాండ్‌మైన్స్‌ను కనిపెట్టడంలో ప్రతిభ కనపరిచినందుకు గానూ మగావా అనే ఆఫ్రికన్ ఎలుకకు ఈ గౌరవ పురష్కారం లభించింది. దాదాపు ఏడేళ్ల కాలంలో 39 లాండ్మైన్లను, 28 ఇతర పేలుడు పదార్థాలను మగావా కనుగొంది. ( ఊహించని ట్విస్ట్‌తో మైండ్‌బ్లాక్ ఖాయం ) పీడీఎస్ఏ గోల్డ్ మెడల్‌తో మగావా ‘‘ప్రాణాలను రక్షించటంలో తెగువ’’ చూపినందుకు గానూ బంగారు పతకంతో సత్కరించారు. ఎలుక జాతిలో పీడీఎస్ఏ గోల్డ్ మెడల్ అందుకున్న మొదటిది మగావా కావటం విశేషం. మగావా ఓ బెల్జియం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లాండ్మైన్లను కనుగొనటంలో శిక్షణ తీసుకుంది. అంతేకాకుండా విజయవంతమైన ఎలుకగా కీర్తి పొందింది. (వావ్.. ఎంత క్యూట్‌గా ఉందో..! ) -
ఎలుకల మందుతో పళ్లు తోముకుని..
సాక్షి, బెంగళూరు: పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలోని హోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరి సమీపంలోని మొల్లంపట్టి గ్రామానికి చెందిన సేదుపతి(18) అనే యువకుడు అదే ప్రాంతంలోని జ్యూస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈనెల 21వ తేదీ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకొని స్పృహకోల్పోయాడు. అస్వస్థతకు గురైన అతన్ని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎలుక పెయింటింగ్‌కు అన్ని వేలా?
-
ఎలుక పెయింటింగ్‌కు ఎంత డిమాండో..
లండన్ : పెయింటింగ్.. సహజంగా వివిధ రంగులతో ఉండి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి కళా రూపాన్ని కొన్ని లక్షలు పోసి కొంటారు. అయితే కళకు మనుషులు, జంతువులు అన్న భేదం లేదని నిరూపించింది ఓ ఎలుక. తన చిట్టి పొట్టి పాదాలతో ఓ కళాఖండాన్ని రూపొందించింది. ఈ చిట్టెలుక గీసిన బొమ్మను వేలు పెట్టి కొంటారని మీకు తెలుసా. అవునండి.. ఎలుక గీసిన చిత్రం ఏకంగా 1000 పౌండ్లు (అక్షరాల 92 వేలు) సంపాందించింది. (బుడ్డోడి వలకు చిక్కిన ఖజానా; కానీ) వివరాళ్లోకి వెళితే.. మాంచెస్టర్‌కు చెందిన జెస్ అనే మహిళ కొన్ని ఎలుకలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో గుస్ అనే ఎలుకతో ఓ పెయింటింగ్ వేసింది. డ్రాయింగ్ రూమ్‌లో ఎలుక పాదాలను పెయింట్‌లో ముంచి కొన్ని కాగితాలపై ఉంచారు. అది అటు ఇటు తిరుగుతుంటే పేపర్‌పై ఎలుక అడుగులు కలర్ఫుల్గా ఏర్పడ్డాయి. అలా కొన్ని పేపర్లపై వేసిన ఎలుక పాదాల పేయింటింగ్లన్నింటినీ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. అలా పెయింటింగ్‌లు అన్ని అమ్ముడుపోగా జెస్ మొత్తం 1000 పౌండ్లను రాబట్టింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'ఎలుక చిత్రాలకు ఇంత మార్కెట్ ఉందా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుస్ ప్రస్తుతం మినీ ‘హెన్రీ మాటిస్సే’ అయ్యిందని ఆమె అన్నారు. (నేను మాస్కు ధరించా.. మరి మీరు: మహేశ్) -
అరె! అచ్చం పాములాగా పరిగెడుతుందే..
-
అరె! అచ్చం పాములాగా పరిగెడుతుందే..
సోషల్‌మీడియాలో రోజులో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేచర్ ఈజ్ మెటల్ అనే సంస్థ తన ట్విటర్లో షేర్ చేసిన వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకర్షిసుంది. అదేంటంటే.. వీడియోలో ఒక ఎలుకను చూడగానే అచ్చం పాములా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఎలుక అచ్చం పాములాగే వంపులు తిరుగుతూ పరుగులు పెట్టడంతో అసలు ఇది ఎలుకా..లేక పామా అన్న సందిగ్ధంలో పడిపోయారు. ఇది కచ్చితంగా వింత జీవే అయ్యుంటుదని కూడా చాలామంది కామెంట్లు పెట్టారు. అయితే వీరి కామెంట్లు చూసిన నేచర్ మైండ్ అసలు విషయం వెల్లడించింది. పరిగెడుతున్న ఎలుక తోకకు ఒక ప్లాస్టిక్ తాడులాంటిది అతుక్కుపోవడంతో అది పరిగెడుతున్న కొద్ది ఆ తాడు కూడా దాని వెనకే వెళ్లడంతో అచ్చం పాములా కనిపించిందంటూ తెలిపారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు తమ అంచనా తప్పిందంటూ సరదాగా నవ్వుకున్నారు. దాదాపు 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోనూ 10 లక్షల మందికి పైగా చూశారు. ఇంకెందుకు ఆలస్యం! వెంటనే మీరు కూడా వీడియో చూసి నవ్వుకోండి. Rats pretending to be a snake to avoid predators pic.twitter.com/PVwOpkeVXv — Nature is Metal (@NaturelsMetal) February 21, 2020 -
బతికున్న ఎలుకల్ని కరకరా నమిలేశాడు..!
-
‘దీంతో మా నాన్న మనసు తెలిసింది!’
తండ్రి ఎప్పుడూ తన కూతురిని ఓ రాజకుమారిలా చూసుకుంటాడు అని అనడంలో సందేహమే లేదు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కూతురు ఇష్టపడిన వాటిని ఇవ్వడానికి తండ్రి ఎంతగా తపిస్తాడో అందరికీ తెలిసిందే. తాజాగా ఓ తండ్రి తన కూతురు ఇష్టంగా పెంచుకునే ఓ చిట్టెలుక తప్పిపోవడంతో ఆఫీసుకు కూడా వెళ్లకుండ దానిని వెతికిపెట్టాడు. ఇందుకు సంబంధించిన సంభాషణ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టెప్ వీర్మన్(19) అనే యువతి ప్రేమగా పెంచుకునే చిట్టెలుక కనిపింలేదు. విషయం తెలుసుకున్న వీర్మన్ తండ్రి కూతురికి కాల్ చేసి బాధపడ్డాడు. ఈ సంభాషణను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ తండ్రి బాధపడుతుంటే స్టెప్ ఓదార్చిన మెసేజ్‌లను చూసి నెటిజన్లు వారి అనుబంధాన్ని అర్థం చేసుకుంటున్నారు. వీర్మన్కు ఇష్టమైన చిట్టెలుక కనిపించకపోవడానికి కారణం తనే అంటూ క్షమించమని ఆమె తండ్రి అడిగిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ‘నేను తిరిగి హాస్టల్‌కు వెళ్లాక మా నాన్న దానికి చాలా దగ్గరయ్యారు. ఈరోజు అది కనిపించకపోవడంతో దాని కోసం బాధపడుతున్న తీరు చూస్తే.. ఆయనది ఎంత స్వచ్ఛమైన మనసో తెలుస్తోంది’ అనే క్యాప్షన్‌తో వీర్మన్ పోస్టు చేశారు. వీర్మన్ షేర్ చేసిన పోస్టులో.. చిట్టెలుక కనిపించకపోవడంతో జరిగిన విషయం చెప్పడానికి ఆమె తండ్రి కంగారుపడుతూ కాల్ చేయమని మెసేజ్ చేశాడు. అది చూసిన ఆమె తండ్రిని ఓదారుస్తూ ‘ఏం కాదు నాన్న అది ఒక ఎలుక మాత్రమే.. మీరు కంగారు పడకండి’ అని ధైర్యం చెప్పారు. దీంతో ఆమె తండ్రి అది తప్పిపోవడానికి తానే కారణమని బాధపడుతూ కూతురిని క్షమాపణలు అడుగుతూ... ‘నిజంగా ఇది బాధాకరమైన విషయం.. ఒకవేళ అది తిరిగి రాకపోతే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను, ఇక రేపు ఆఫీసుకు కూడా వెళ్లకుండా దాన్ని వెతుకుతా’ అని అన్నారు. దీనికి వీర్మన్ ‘డాడి మీరు కచ్చితంగా ఆఫీసుకు వెళ్లాల్సిందే అది కేవలం ఒక చిట్టెలుక మాత్రమే.. కానీ మీరు ఓ న్యాయవాది’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత అతడు ఎలుక బొను వద్ద వేరు శనగ క్రీమ్‌ను ఉంచి దాని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశాడు. చివరికి ఆ ఎలుక దాని బోనులోనే ఉందని తెలుసుకున్న అతను సంతోషంతో స్టెప్‌కు మెసేజ్ చేశాడు. అది చూసిన నెటిజన్లు ‘మీ డాడి నిజంగా మంచి మనసు కలవాడు అని, ‘చిట్టెలుక దొరికినందుకు సంతోషం.. మీ నాన్న నీ మాటలను రుజువు చేశాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. my dad took over my hamster once i went back to college and ended up getting really attached and today he escaped and this goes to prove how truly pure my father is pic.twitter.com/JmTJl6jFBI — Steph Veerman (@stephyj725) November 25, 2019 -
రూ. 5 కోట్లు కావాలన్నాడు.. ఆఖరికి జైలుకెళ్లాడు
బీజింగ్ : హోటల్‌కెళ్లి సుష్టుగా భోంచేయడం.. ఆపై బిల్లు ఎగ్గొట్టడం కోసం ప్లేట్లో వెంట్రుకలు, బొద్దింకలు లాంటివి వేయడం చాలా సినిమాల్లో చూశాం కదా. ఇదే ట్రిక్కు ప్రయోగించబోయి.. ఆఖరుకి జైలు పాలయ్యడో వ్యక్తి. బిల్లు ఎగ్గొట్టడం కోసం ఏకంగా భోజనంలో చచ్చిన ఎలుకను వేశాడు. ఆ తర్వాత ఏమైంది... చదవండి. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదిలావో అనేది చైనాలో చాలా ఫేమస్ రెస్టారెంట్. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఓ వ్యక్తి సదరు రెస్టారెంట్లో ఉచితంగా భోజనం చేయాలని భావించాడు. ఎలా అని ఆలోచిస్తుండగా రోడ్డు పక్కన ఓ చచ్చిన ఎలుక కనిపించింది. దాంతో అతడి బుర్రలోకి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఎలుకను తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లాడు. భోజనం ఆర్డర్ చేశాడు. తినడం పూర్తయిన తరువాత తనతో పాటు తీసుకువచ్చిన ఎలుకను ప్లేట్లో వేశాడు. ఆ తర్వాత తనకు భోజనంలో ఎలుక వచ్చిందని చెప్పి నానా హంగామా సృష్టించాడు. ఈ విషయం బయటకు తెలిస్తే రెస్టారెంట్‌కున్న పేరు పొతుందని భావించిన యాజమాన్యం.. సదరు వ్యక్తి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. కానీ అందుకతడు ఒప్పుకోలేదు. దాంతో ఓ రెండు లక్షల రూపాయలు ఇస్తామంది. ఆ వ్యక్తి దాన్ని కూడా తిరస్కరించి.. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. ఈ వివాదం ఎటు తేలకపోవడంతో.. సదరు రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభంచడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉచితంగా భోజనం చేయాలని భావించి.. చచ్చిన ఎలుకను తెచ్చి ఈ నాటకం ఆడానని.. కానీ చివర్లో అత్యాశకు పోవడంతో దొరికిపోయానని విచారం వ్యక్తం చేశాడు. పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
ఎరక్కపోయి ఇరుక్కుని!
అనగనగా ఒక ఎలుక. ఎలుకంటే ఎలుకలా ఉండదు. బాగా బలిసిన పందికొక్కులా కనిపిస్తుంది. చలికాలం వస్తే చాలు ఇలాంటి జంతువులన్నీ కొవ్వెక్కి బాగా లావెక్కిపోతాయి. జర్మనీలోని బెన్షీమ్ పట్టణం దాని నివాసం. ఓ రోజు బాగా తిన్న ఆ ఎలుక కాసేపు వాకింగ్‌కు బయల్దేరింది. రోడ్డు మీద ఉన్న మ్యాన్ హోల్ పైకప్పు కన్నంలో ఎరక్కపోయి ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా పైకి రాలేక.. మ్యాన్హోల్లోకి దిగలేక అవస్థలు పడింది. ఎటూ కదల్లేక అరవసాగింది. అదే సమయంలో అటు వైపు నుంచి వెళ్తున్న స్థానికుడైన నాట్, అతని భార్య జూలియానాలు.. ఆ ఎలుక పడుతున్న అవస్థలు చూసి ఆగారు.. ఆ ఎలుకను నెమ్మదిగా పైకి లాగడానికి జూలియానా ప్రయత్నించింది. అసలే ఇరుక్కుపోయిన బాధలో ఉన్న ఆ ఎలుక గట్టిగా అరుస్తూ ఆమె చేతికున్న లెదర్ గ్లౌజులను కొరికేసిందట. ఇక లాభం లేదనుకుని ఎలుకల్ని పట్టే నిపుణులకు వాళ్లు ఫోన్ చేశారు. అగ్నిమాపక దళ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఆ ఎలుకను రక్షించేందుకు ఏకంగా 9 మంది అధికారులు వచ్చారు. జంతువుల్ని కాపాడే నిపుణుడు షేర్ కూడా వారికి సాయం చేశారు. తమ దగ్గరున్న పరికరాల సాయంతో ఎలుకను గట్టిగా కిందకి నెట్టారు. ఆ మూత నుంచి బయటపడిన ఎలుక.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. మమూలుగా అయితే ఇలాంటి రక్షణ చర్యలకు అగ్నిమాపక సిబ్బంది 120 జర్మనీ యూరోల డబ్బు వసూలు చేస్తారు. కానీ ఆ ఎలుక ఎవరికీ చెందదు కాబట్టి జంతు ప్రేమతోనే ఉచితంగానే కాపాడారు. నాట్ ఇద్దరు కుమార్తెలు మ్యాన్‌హోల్‌ను తవ్వి ఈ ఎలుకను పట్టే ప్రక్రియ అంతా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి అవి వైరల్‌గా మారాయి. -
చట్నీలో ఎలుక, తాగునీటిలో కప్ప
అన్నానగర్: చెన్నై సమీపంలో సోమవారం ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల క్యాంటిన్ ఆహారంలో ఎలుక, తాగునీటి తొట్టెలో కప్ప ఉండడంతో విద్యార్థులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. చెన్నై సమీపం సెమ్మంజేరిలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ ఉంది. ఇక్కడ రాష్ట్రానికి చెందిన విద్యార్థులతో పాటూ ఇతర రాష్ట్రాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్థితిలో సోమవారం ఆహారం తినేందుకు విద్యార్థులు కళా శాల క్యాంటిన్‌కి వెళ్లారు. అక్కడ గిన్నెలో ఉంచిన కొబ్బరి చట్నీలో ఎలుక ప్రాణాలతో తిరుగుతూ ఉంది. ఇది చూసిన విద్యార్థులు దిగ్భ్రాంతి చెం దారు. అక్కడున్న క్యాంటీన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తరువాత అనుమానంతో అక్కడున్న తాగునీటి ట్యాంక్‌ను తెరచి చూడగా అందులో కప్ప ఉంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. కళాశా ల నిర్వాహకులు వచ్చి విద్యార్థులతో చర్చలు జరి పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంటిన్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థులు అక్కడినుంచి వెళ్లిపోయారు. -
కుక్కనుకుని పెంచితే చివరకు..
బీజింగ్ : కుక్క ఎప్పటికి ఎలుక కాలేదు. ఇది వాస్తవం. కానీ తాను కుక్క అనుకుని తెచ్చి పెంచుకున్న ఆ జీవి కాస్తా చివరకూ ఎలుక అయ్యింది. అంటే మొదట కుక్కగా ఉండి తరువాత ఎలుకగా మారలేదు. పుట్టడం, పెరగడం అంతా ఎలుకగానే చేసింది. కానీ దాన్ని పెంచుకున్న యాజమానే దాన్ని కుక్కగా భావించాడు. ఈ వింత సంఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని స్మాల్ మౌంటేన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుని ఇంటి దగ్గర అతనికి ఓ చిన్న జీవి కనిపించింది. చూడ్డానికి చాలా చిన్నగా, నల్లగా ఉన్న ఆ జీవిని సదరు వ్యక్తి కుక్క పిల్లగా భావించాడు. దాంతో ఆ కుక్క పిల్లను పెంచుకోవాలని ముచ్చడపడ్డాడు. స్నేహితున్ని అడిగి ఆ బుజ్జి కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చాడు. కుక్కపిల్లగానే భావించి దాన్ని కొన్ని రోజులపాటు పెంచాడు. కానీ కొన్ని రోజులు గడిచిన తరువాత తాను పెంచుతున్న జీవి కుక్క కాదేమోనని ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. అసలు తన దగ్గర ఉన్న జీవి ఏంటో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. దాంతో ఆ జీవి ఫోటో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫోటోలో ఉన్న జీవి ఏంటో చెప్పమని నెటిజన్లను కోరాడు. చివరకూ ఓ నెటిజన్ సదరు జీవిని ఎలుకగా తేల్చాడు. ఆ జీవి పేరు పేరు బ్యాంబో రాట్ అని అది ఎక్కువగా దక్షిణ చైనాలో కనిపిస్తుందని.. అది వెదురు తినడం వల్ల దానికి ఆ పేరు వచ్చిందని తెలిపాడు. గతంలో కూడా చైనాకు చెందిన ఓ వ్యక్తి కుక్కగా భావించి ఎలుగు బంటిని పెంచాడు. -
ఎలుక తెచ్చిన తంటా
సాక్షి ప్రతినిధి, చెన్నై: రైలు బోగీలో ప్రయాణికులే కాదు.. అడపాదడపా ఎలుకలూ ప్రయాణిస్తుంటాయి. అలాంటి ఓ ఎలుక బుద్ధిగా ప్రయాణం చేయకుండా తగుదునమ్మా అంటూ సాటి ప్రయాణికుడిని కరిచింది. బాధితుని ఫిర్యాదుతో రైల్వేశాఖకు రూ.32 వేలు వదిలింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన వెంకటాచలం 2014 ఆగస్టు 8వ తేదీన ఎక్స్‌ప్రెస్ రైల్లో సేలం మీదుగా చెన్నైకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో అతడిని ఎలుక కరవగా తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే టీటీఈకి ఫిర్యాదు చేసినా ప్రథమచికిత్స అందలేదు. తరువాత వచ్చే స్టేషన్లో మాత్రమే చికిత్స చేయగలమని టీటీఈ బదులిచ్చారు. దీంతో చెన్నై చేరుకోగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసుకుని, మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తనకు కలిగిన బాధకు నష్టపరిహారం కోరుతూ వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశాడు. బాధితునికి రూ.25 వేల నష్టపరిహారం, వైద్య ఖర్చులకు రూ.2వేలు, కోర్టు ఖర్చులకు రూ.5వేలు లెక్కన మొత్తం రూ.32 వేలను 9 శాతం వడ్డీ సహా చెల్లించాలని తమిళనాడు వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి ఆర్వీ దీనదయాళన్, సభ్యులు రాజ్యలక్ష్మి రైల్వేశాఖను ఆదేశిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ఈ సొమ్ము 3 నెలల్లోగా బాధితునికి అందజేయాలని ఆదేశించారు. -
స్మార్ట్‌లో.. ర్యాట్...!!
విశాఖసిటీ: మీ స్మార్ట్ ఫోన్లోకి ఎలుక దూరింది. అది.. వైర్లు కొరికే ఎలుక కాదు. మీ గాడ్జెట్‌ను సైబర్ నేరగాడి ఆధీనంలోకి తీసుకెళ్లిపోయే వైరస్. లింక్ వచ్చిందా.. యాప్ డౌన్లోడ్ చేశామా అన్నది ముఖ్యం కాదు. ఆ యాప్ ఎంత వరకూ కరెక్ట్.. అది మంచి కంపెనీ తయారు చేసిందా లేదా అన్నది ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మరి చిపోయిన వారందరికీ ఈ ర్యాట్ ఓ హెచ్చరిక. తెల్లారింది మొదలు.. నిద్ర పోయే వరకూ ప్రతి పని కోసం స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన యాప్‌లనే వినియోగిస్తున్నారు. నూటికి 80 మందికి యాప్స్‌తోనే తెల్లారుతోంది. మెసేజ్ నుంచి మనీ ట్రాన్సాక్షన్ వరకూ.. పెన్ను నుంచి ఫ్లయిట్ టికెట్స్ వరకూ తమకు కావాల్సిన అన్ని పనులకు దాదాపు యాప్స్‌నే వాడుతున్నారు. ఇలాంటి వారిని దోచుకునేందుకు ఇప్పుడు సైబర్‌నేరగాళ్లు యాప్స్‌నే ఎరగా వేస్తున్నారు. ఫలానా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పాయింట్లు వస్తాయని, ఫ్రీ షాపింగ్ కూపన్లు అంటూ ఓ మెసేజ్‌ను ఫోన్‌కు పంపిస్తారు. వీటితో అవసరం ఉన్నా లేకున్నా ఉచితం కదా అని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా గుర్తించిన ఈ తరహా ఆందోళనకర అంశాన్ని ‘రిమోట్ అడ్మినిస్ట్రేషన్ ట్రౌజన్ అని పిలుస్తున్నారు. షార్ట్ కట్లో ర్యాట్ అన్నమాట. వివిధ రకాల యాప్స్ మాటున నేరగాళ్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను గాడ్జెట్స్లోకి చొప్పించి దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్‌ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ తరహా మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అన్నింటికీ యాప్స్ వినియోగమే.. ఇటీవల స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో యాప్స్ వాడకం కూడా అలాగేపెరిగింది. నిద్ర లేవడం నుంచి ఉష్ణోగ్రత తెలుసుకోవడం, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ఇలా.. ఒక్కో ఫోన్లో కనిష్టంగా 10 వరకు అప్లికేషన్లు ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో పెరుగుతున్న ఈ ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకోవడం కోసం సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తొలుత ఈ నేరగాళ్లు దేశ వ్యాప్తంగా ఉన్న మొబైల్ నెంబర్ల డేటాను సేకరిస్తున్నారు. దీనికోసం వారు కష్టపడకుండానే ఆన్లైన్లో కొంత మొత్తం చెల్లించి తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ నెంబర్లు తమ చేతికి వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతోంది. ర్యాట్‌తో ఓటీపీ సైతం స్వాహా... మన ఫోన్‌కు వచ్చే ఓటీపీని కూడా ఇక్కడ సైబర్ నేరగాళ్లు సంగ్రహించేస్తారు. ఇందుకు వారు ముందు పంపే యాప్ ద్వారానే ఏర్పా?ట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే వారికి వెళ్లిపోతుంది. కార్డుల వివరాలు వారివద్ద అప్ప?టికే సిద్ధంగా ఉంటాయి. కనుక ఓటీపీ రాగానే వారు తేలిగ్గా లావాదేవీ పూర్తి చేసేస్తున్నారు. ఇలానే సైబర్ నేరగాళ్లు మనకు తెలియకుండానే దోపిడీలకు తెగబడుతున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను మాత్రం సైబర్ నేరస్థులు అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో మొబైల్స్ వినియోగదారులు నిద్రలో ఉంటారని, ఈ నేపథ్యంలోనే అతడి ఫోన్‌ను అతని ప్రమేయం లేకుండానే ఓటీపీ వచ్చిన విషయమే గుర్తించరని వివరిస్తున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి అక్రమ లావాదేవీలు చేసే సైబర్ నేరస్థులు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, ఆన్లైన్లో ఖరీదు చేసి బోగస్ చిరునామాల్లో తీసుకుంటున్నట్టు గుర్తించారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా వారిని పట్టుకోవడం దాదాపు సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు, వ్యక్తులు రూపొందించే యాప్స్‌కు దూరంగా ఉండటమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న మెసేజ్‌తో ప్రారంభమై.. తాము ఉచితంగా అందిస్తున్న యాప్‌లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ నేరగాళ్ల తొలుత బల్క్ ఎస్సెమ్మెస్‌లు అనేకమందికి పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు ఎవరైనా అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే చాలు.. సదరు యాప్ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. యాప్‌తోపాటే నేరగాళ్లు పంపించే ‘ట్రోజన్’ కూడా అదే గాడ్జెట్‌లోకి డౌన్లోడ్ అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి మన ఫోన్ సైబర్ క్రైమ్ నేరస్థుడి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఏదైనా జరగరాని నష్టం జరిగితే తప్ప.. ఫోన్ సైబర్ నేరగాడి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న స్మార్ట్ మొబైల్‌ను నియంత్రిస్తూ తనకు అవసరమైన విధంగా వాడుకుంటారు. అందుకే ఈ వైరస్‌ను ‘రిమోట్ అడ్మినిస్ట్రేషన్ ట్రౌజన్ అని పిలుస్తుంటారు. మన ప్రమేయం లేకుండానే.. నేరగాళ్ల ఆధీనంలోకి ఫోన్ వెళ్లిపోవడంతో మనం ఫోన్లో చేసే ప్రతి చర్యను అతడు కూడా పర్యవేక్షించగలడు. కాల్స్, డేటా వినియోగం, మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు.. ఇలా మొబైల్లో ఉన్న మొత్తం సమాచారం దాని ఫ్రంట్, బ్యాక్ కెమెరాలను సైతం సైబర్ నేరస్థుడు ఈ ర్యాట్ చొప్పించడం ద్వారా తమ నియంత్రణలోకి తీసుకోగలడు. ఎస్సెమ్మెస్‌లతో పాటు ఇటీవల సినిమా టిక్కెట్ల నుంచి చాలా రకాల బిల్లుల చెల్లింపులను కూడా ఆన్లైన్లో అత్యధిక శాతం సెల్‌ఫోన్ ద్వారానే చేసేస్తున్నారు. ఇలాంటి క్రయవిక్రయాల కోసం మొబైల్ వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతో పాటు లావాదేవీలకు సంబంధించిన ఓటీపీ సైతం అదే ఫోన్‌కి వస్తుంది. ఎవరైనా డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా ఓటీపీ నమోదు చేయందే లావాదేవీ పూర్తికాదు. అందుకే.. సైబర్ నేరగాడు తెలివిగా ర్యాట్‌ను ఫోన్లోకి యాప్స్ ద్వారా పంపించి సమాచారం లాగేస్తున్నాడు. -
విద్యార్థుల భోజనంలో ఎలుక చర్మం
సాక్షి, అమరావతి/ వైఎస్ఆర్ : ప్రభుత్వ పాఠశాలలో భోజన తయారీలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. జిల్లాలోని సరోజిని నగర్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వడ్డించే పప్పులో సోమవారం ఎలుక చర్మం, పేగులు వచ్చాయి. పిల్లలకు వడ్డించే భోజనంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది దీన్ని బట్టిచూస్తే అర్థమవుతోంది. భోజన తయారిని ఏపీ ప్రభుత్వం ప్రయివేటీకరించడంతో ఇస్కాన్ సంస్థ భోజనాన్ని తయారు చేస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో ఇస్కాన్ చెలగాటం ఆడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 100 పాఠశాలలకు ఇదే సంస్థ భోజనాన్ని పంపిణీ చేస్తోంది. కాగా భోజన తయారిని ప్రభుత్వం ప్రయివేటీకరించడం ప్రజలు తీవ్రంగ తప్పుపడుతున్న విషయం తెలిసిందే. -
విద్యార్థుల మిడ్ డే మీల్స్‌లో ఎలుక చర్మం పేగులు
-
హాస్టల్ విద్యార్థుల కిచిడిలో ఎలుక
జడ్చర్ల టౌన్ మహబూబ్ నగర్ : స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోని ఎస్సీ హాస్టల్లో బుధవారం అల్పాహారంలో ఎలుక కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అల్పాహారం కోసం సిబ్బంది కిచిడి తయారు చేశారు. వండి వార్చిన కిచిడిని విద్యార్థులకు వడ్డిస్తుండగా ఒక విద్యార్థి ప్లేటులో చిన్న ఎలుక కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే ఇతర విద్యార్థులకు అల్పాహారం వడ్డించకుండా బయటకు పారవేశారు. మళ్లీ వండి వార్చారు. హాస్టల్ వార్డెన్ ఆదినారాయణకు బాలానగర్ హాస్టల్ ఇన్చార్జ్ బాధ్యతలు ఉండటంతో ఆయన అక్కడ ఉన్నారు. విషయం తెలియగానే భవిష్యత్‌లో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. అయితే బాదేపల్లి జెడ్పీహైస్కూల్‌కు ఎస్సీ వసతి గృహం నుంచి వెళ్లే విద్యార్థులు ఆలస్యంగా రావడంతో ఎలుక విషయం వెలుగు చూసింది. హైస్కూల్‌కు నూతన గేట్ పెట్టి దానిని మూసివేయడంతో ఆలస్యమైన విద్యార్థులు బయటే ఉండిపోయారు. ఆలస్యానికి గల కారణాలను ఎంఈఓ మంజులాదేవి, ఉపాధ్యాయులు ఆరా తీయగా అల్పాహారంలో ఎలుక రావడం వల్ల వంట ఆలస్యమైందని విద్యార్థులు చెప్పారన్నారు. -
కూరలో ఎలుక.. సోషల్ మీడియాలో వైరల్
హన్మకొండ అర్బన్: ‘కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి..’ అని ఆకలి ఎక్కువైతే చెప్పేందుకు వాడే జాతీయం. కానీ వరంగల్ నగరంలోని ఓ హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లిన ఇద్దరు దంపతులు ఏమరుపాటుగా ఉంటే కడుపులోకి నిజంగానే ఎలుక పోయే పరిస్థితి ఏర్పడింది. వారు భోజనం చేస్తుండగా వంకాయ కూరలో కలిసిపోయిన చనిపోయిన కలేబరాన్ని గుర్తించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి పక్కనగల అక్షయ టిఫిన్ సెంటర్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఆందోళనకు గురైన అతడు హోటల్ నిర్వాహకులను నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మొత్తం వ్యవహారాన్ని సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో విషయం వైరల్ అయింది. అనారోగ్యంతో వచ్చి.. వరంగల్‌కు చెందిన రమేష్ తన భార్య చంద్రకళ నరాల సంబంధ వ్యాధితో బాధపడుతుండడంతో రోహిణి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చిన అతడు ఆకలిగా ఉండటంతో తాను భోజనం చేసి భార్యకు పార్సిల్ తీసుకెళ్దామని పక్కనే ఉన్న అక్షయ టిఫిన్స్‌కు వెళ్లాడు. భోజనం ఆర్డర్ చేసి తింటుండగా వంకాయ కూరలో ఎలుక కనిపించింది. అనుమానంతో బయటకు తీసి చూడగా కూరలో బాగా ఉడికినట్లు సగం తోలు ఊడిన ఎలుక కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన రమేష్ మిగతా వారిని కూడా తినవద్దని సూచించాడు. విషయం నిర్వాహకులకు తెలిపాడు. అయితే బాధితుడి ఆందోళనపై నిర్వాహకుల నుంచి చాలా సేపటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహించి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పాడు. బాధితుడి ఆందోళనతో హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. విషయం తెలుసుకుని హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లేక ప్రజల ప్రాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. ఈ విషయమై హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలుగడ్డలు, ఇతర కూరగాయల బస్తాలు, సామగ్రి కిచెన్‌లో ఉన్నందున పొరపాటు జరిగి ఉండొచ్చన్నారు. హోటల్ సీజ్, రూ.10 వేల జరిమానా ట్రేడ్ లైసెన్స్ రద్దు.. ల్యాబ్‌కు నమూనాలు : గ్రేటర్ ఎంహెచ్ఓ రాజారెడ్డి వరంగల్ అర్బన్: అక్షయ టిఫిన్ సెంటర్లో వంకాయ కర్రీలో మృతిచెందిన ఎలుక వెలుగు చూడటంతో గ్రేటర్ ఎంహెచ్ఓ రాజారెడ్డి, సిబ్బంది తనీఖీలు నిర్వహించారు. టిఫీన్ సెంటర్‌కు రూ.10 వేల జరిమానా విధించి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి, ఆహార నమూనాలను సేకరించి సిబ్బంది ద్వారా ల్యాబ్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ రాజారెడ్డి సంఘటన వివరాలను వెల్లడించారు. వంట గది అధ్వాన్నంగా ఉన్నందున సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదన్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు. -
కోమా పేషెంట్ కన్ను కొరికిన ఎలుకలు..
ముంబై : బాల్ థాక్రే ట్రామా కేర్ ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న పేషెంట్‌ని ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 23న చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితుడి తండ్రి గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో ఆయన కుమారుడు పరమిందర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అందుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేసినా కుమారుడి పరిస్థితిలో మార్పు రాలేదని చెప్పారు. 40 రోజులు గడిచిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఏప్రిల్ 21న వైద్యులు కోమాలో ఉన్న తన కుమారుడిని జనరల్ వార్డుకు తరలించారని పేర్కొన్నారు. జనరల్ వార్డులో ఎలుకలు సంచరించడం తాను చూశానని తెలిపారు. తన కుమారుడి కంటి నుంచి ఒక్కసారిగా రక్తం రావడంతో దగ్గరికి వెళ్లి చూస్తే ఎలుకలు కొరికిన గుర్తులు కనిపించాయని ఆయన ఆరోపించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది చోటు చేసుకుందని పేషెంట్ బంధువులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై అస్పత్రి వర్గాలు స్పందిస్తూ.. పేషెంట్ బంధువుల ఆరోపణలను తోసిపుచ్చారు. ఆస్పత్రిలో ఎలాంటి ఎలుకలు సంచరించడం లేదని.. తమ ఆస్పత్రి పేరును పాడుచేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పేషెంట్‌ని కంటికి ఎటువంటి గాయం కాలేదని తెలిపారు. -
నూనె ప్యాకెట్లో ఎలుక
కందుకూరు: నూనె ప్యాకెట్లో మృతి చెందిన ఓ ఎలుక పిల్ల బయటపడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గౌరీశంకర్.. కందుకూరు చౌరస్తాలోని ఓ కిరాణా షాపు నుంచి పామ్డిలైట్ పేరుతో ఉన్న పామోలిన్ నూనె ప్యాకెట్‌ను ఇటీవల కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాడు. ఆదివారం ఇంట్లో వంట చేయడానికి నూనె ప్యాకెట్‌ను కొద్దిగా కత్తిరించి గిన్నెలోకి వంపుతుండగా తేడా కన్పించడంతో ప్యాకెట్‌ను మొత్తం కత్తిరించి చూశాడు. అందులో మృతిచెందిన ఓ ఎలుక పిల్ల కనిపించింది. దీంతో ఆయన ఆశ్చర్యానికి గురై విషయాన్ని మీడియాకు తెలిపాడు. -
వంట నూనె ప్యాకెట్లో ఎలుక దర్శనం
-
భోజనంలో పురుగులు.. ఎలుక
మునిపల్లి (అందోల్): గురుకుల పాఠశాల విద్యార్థులకు వడ్డించిన భోజనంలో పురుగులు, చనిపోయిన ఎలుక ప్రత్యక్షమయ్యాయి. ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని గురుకుల పాఠశాల హాస్టల్లో ఉదయం బగారా అన్నం పెట్టారు. ఏడో తరగతికి చెందిన అరుణ్ కొంచెం తినగానే తెల్లటి పురుగులు, మృతి చెందిన ఎలుక పిల్ల కనిపించాయి. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ విద్యార్థులకు చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. మధ్యాహ్నానికి వండుతున్న భోజనంలోనూ పురుగులు కనిపించడంతో తహసీల్దార్ పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అంటూ వార్డెన్ అశోక్, సిబ్బందిపై మండిపడ్డారు. -
మూషికానికి ముచ్చటైన విందు!
ఇంట్లో ఎలుకలను చూస్తే మనకు ఎక్కడలేని చీదర వచ్చేస్తుంది. కర్రపెట్టి పిల్లిని తరిమినట్లు తరిమితే అవి పోవు. అందుకే బోన్ పెట్టి బంధించడానికో.. మందు కలిపి మర్డర్ చేయడానికో అస్సలు వెనకాడం. కానీ కొన్ని దేశాల్లో ఎలుకలను పెట్స్‌గా పెంచుకుంటారు. ముద్దు చేసి ముచ్చటిస్తుంటారు. ఇంట్లో మనిషిగా ప్రేమిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హచ్చుకుక్కలు, బొచ్చుకుక్కలను సాకినట్లుగా.. పెట్ ర్యాట్స్ని చూసుకుంటారు. అంత ప్రేమగా చూసుకునే పెట్ ర్యాట్స్ని ఇంట్లో వదిలి షికార్లకు వెళ్లాలంటే మనసు ఒప్పదుగా! అది గ్రహించిన శాన్ ఫ్రాన్సిస్కో టూరిజం తమ ప్రాంతాన్ని సందర్శించే వారి పెట్ ర్యాట్స్ కోసం ర్యాట్ కేఫ్‌ను ఫ్రారంభించింది. అందుకోసం శాన్ ఫ్రాన్సిస్కోలోని క్రిటెర్స్ అనే కంపెనీ ‘ది శాన్ ఫ్రాన్సిస్కో డన్జిన్’ అనే పేరుతో ఒక ర్యాట్ కేఫ్‌ను జూలైలో నడిపింది. దానిలో ఎలుకలు తినేవి, తినగలిగేవీ అన్నీ సమకూర్చారు. ఈ కేఫ్ టికెట్ ఎంతో తెలుసా 49.99 డాలర్లు. అంటే 3,206 రూపాయలు. ఆ కేఫ్‌లో టీ, కాఫీ, కేక్స్ ఇలా చాలానే ఉన్నాయి. దాంతో తమ ప్రియతమ మూషికాలను ఈ కేఫ్‌కి తీసుకెళ్లి ఏం కావాలో తెలుసుకుని మరీ... వాటి కోరికలు తీర్చారు ఎలుక ప్రేమికులు!! -
పప్పుతో ఎలుక ఫ్రీ..!
► యాప్ ద్వారా బిగ్ బాస్కెట్లో సరుకుల ఆర్డర్ ► పప్పు ప్యాకెట్లో చచ్చిన ఎలుక ► మాదాపూర్ పీఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు గచ్చిబౌలి: ఇంట్లో ఏదో ఓ మూల ఎలుక చనిపోతేనే కంపుకొడుతుంది. అదే ఆర్డర్ చేసిన పప్పు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక దర్శనమిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఆన్లైన్ సూపర్ మార్కెట్లో దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ కలిగిన బిగ్ బాస్కెట్ ద్వారా సరఫరా చేసిన పప్పు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక దర్శనమివ్వడంతో బాధితురాలు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..రాజమండ్రి ఐడీబీఐ బ్యాంక్‌లో డిప్యూటీæ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న మానికొండ రవి కుమార్ కుటుంబం మాదాపూర్‌లోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటోంది. ఈ నెల 6న రవికుమార్ భార్య సుమన మొబైల్ యాప్ ద్వారా బిగ్ బాస్కెట్ సూపర్ మార్కెట్‌కు సరుకులు ఆర్డర్ చేసింది. మినప పప్పు, ఇండ్లీ రవ్వ, పనీర్, నెయ్యి, రిఫైండ్ తదితర పది రకాల సరుకులను ఆర్డర్ చేసి బిల్లు చెల్లించింది.. 7వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డెలివరీబాయ్ వారి ఇంటి గుమ్మం ముందు సరుకుల సంచి ఉంచి వెళ్లాడు. కొద్ది సేపటికి వచ్చిన సుమన సరుకులను తీసుకొని ఇంట్లో ఉంచింది. 8న ప్యాకెట్ తెరిచేందుకు ప్రయత్నించగా అందులో నల్లటి ఆకారం కనిపించడంతో తెరవకుండా అలానే ఉంచింది. బుధవారం ఉదయం వీడియో తీస్తూ ప్యాకెట్‌ను కత్తిరించి చూడగా, ప్యాకెట్లో చనిపోయిన ఎలుక కనిపించింది. దుర్వాసన రావడంతో ప్యాకిగ్ చేసినప్పుడే ఎలుక చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదు దీంతో బాధితురాలు ప్యాకెట్ తీసుకువెళ్లి మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్కెట్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ప్యాకెట్ కత్తిరించిన వీడియోలు, ప్యాకెట్లో ఎలుక ఫొటోలను పోలీసులు సేకరించారు. రెండేళ్లుగా సరుకులు తీసుకుంటున్నా: సుమన గత రెండేళ్లుగా బిగ్ బాస్కెట్లో సరుకులు ఆర్డర్ చేస్తున్నట్లు సుమన ‘సాక్షి’కి తెలిపారు. పప్పు ప్యాకెట్లో ఎలుక కనిపించడం దారుణమన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
మీ ఏసీలు పాములకు పుట్టలేమో చూడండి?
పాము ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తే ఎవరైనా టక్కున పుట్టలో ఉంటుందని చెబుతారు. కానీ, ఈ రోజుల్లో పాము ఎక్కడ ఉంటుందని ప్రశ్నించినప్పుడు కూడా అలాంటి పాత సమాధానమే చెబితే పప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పాములు పుట్టలు వదిలేసి ఏసీల్లో కూడా దూరిపోతున్నాయి. ఈ మాట నిజమే. ఓ కుటుంబానికి ఈ అనుభవం స్వయంగా ఎదురైంది. తమ ఎయిర్ కండిషన్లో దూరిన పామును చూసి వారు బిత్తర పోయారు. ఇంకాస్త ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే అప్పటి వరకు ఏసీలో నిద్రించిన ఆ పాము కాస్త వారు అలా చూస్తుండగానే ఓ ఎలుకని చూసి బుస్సుమంటూ సగానికి పైగా బయటకొచ్చి నేరుగా దాన్ని నోట కరిచిపట్టింది. ఆ వెంటనే చక్కగా తన ఏసీ గదులు పడుకొని ఆరగించేందుకు తిరిగి మళ్లీ అదే ఏసీలోకి దూరిపోయింది. ఇదంతా చూసిన ఆ కుటుంబ సభ్యులు గజగజా వణికిపోతూనే ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. -
మధ్యాహ్న భోజనం ఉడుతలు..ఎలుకలే!
♦ ఆకలిబాధ తట్టుకోలేక ఉడుతల్ని, ఎలుకల్ని తింటున్న జార్ఖండ్ గిరిజన బాలలు ♦ అధికారుల జేబుల్లోకి చేరుతున్న మధ్యాహ్న భోజనం నిధులు ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు పింకి. మధ్యాహ్నం కాగానే ఉడతలు పట్టడం పింకి దినచర్య. దొరకకపోతే ఎలుకలు కూడా పడుతుంది. వాటితో ఆడుకోవడానికో.. సరదా కోసమో పింకి ఉడతలను, ఎలుకలను పట్టడంలేదు. కడుపు కాలి.. ఆకలి బాధను భరించలేక ఈ పనిచేస్తోంది. ఆమె మధ్యాహ్న భోజనం ఇదే అంటే ఆశ్చర్యమేస్తోంది కదూ! కానీ ఇది నిజం. మరి పింకి అలా.. ఉడుతలను, ఎలుకలనే ఎందుకు తింటోంది? ...ఎందుకంటే అధికారుల రూపంలో ఉన్న పందికొక్కులు పింకి నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నాయి. మధ్యాహ్న భోజనానికి వందలు.. కాదు వేలు.. కాదు కాదు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నా అవేవీ దేశంలోని చాలామంది పిల్లల వద్దకు చేరడంలేదనేందుకు ఈ పింకే నిదర్శనం. వివరాల్లోకెళ్తే... జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లా రాజ్‌మహల్ హిల్స్ ప్రాంతం చుహా పహర్ అనే ఓ కుగ్రామం ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ఉంది. ఐదేళ్ల వయసున్నప్పుడే పింకిని పాఠశాలలో చేర్చారు. ఇప్పుడు పింకి వయసు తొమ్మిదేళ్లు. పింకి వయసు పెరుగుతోందే తప్ప.. తరగతి పెరగడంలేదు. కారణం.. పాఠశాల ఉంది పేరుకు మాత్రమే. ఆ ఊరిలో బడి ఈడు పిల్లలున్నా పాఠశాలలో మాత్రం ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే చదువు చెప్పేందుకు అసలు టీచరే ఉండడు. ప్రభుత్వ లెక్కల్లో పక్కాగా.. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో మాత్రం గత నాలుగు సంవత్సరాలుగా పింకి పేరుమీద నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. స్కూల్ యూనిఫారంకు, పోషకాహారాలతో కూడిన మధ్యాహ్న భోజనానికి రూపాయి రూపాయి లెక్కగడుతూ నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. వీటితో పింకికి యూనిఫారం ఇచ్చినట్లు, ఆకుకూరలు, అన్నం, రోజుకో గుడ్డుతో భోజనం పెడుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు కూడా అందుతున్నాయి. అయితే ఇక్కడ పింకి తింటోంది మాత్రం ఎలుకలు, ఉడతలు. ఎంత దారుణం!! పదివేల కోట్లు... ఈ ఏడాది బడ్జెట్లో పాఠశాల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలను కేటాయించింది. వీటితో 10.03 కోట్ల మంది చిన్నారుల చదువు, పోషకాహారం అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూ.6కు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమవంతుగా మరో రూ.4 కలిపి మొత్తం రూ.10తో పిల్లలకు పోషకాహారం పెట్టాలి. నిధులైతే మంజూరవుతున్నాయి. అయినా పింకి మాత్రం పస్తూలుంటూనే ఉంది. జార్ఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పింకిలు ఎంతోమంది కనిపిస్తారు. సొమ్మంతా అధికారుల జేబుల్లోకి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయంటే... సమాధానం సుస్పష్టం. అవన్నీ అధికారుల జేబుల్లోకి చేరుతున్నాయి. పిల్లల నోటికాడి ముద్దను మాత్రమే కాదు... వారి భవిష్యత్తునూ లాగేసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఎందుకంటే... బడిలో భోజనం పెడతారనే ఆశతో పాఠశాలకు వచ్చే చిన్నారులు మనదేశంలో ఇప్పటికే కోట్లాదిమందే ఉన్నారు. ఆ భోజనం దొరకనప్పుడు వారు బడికి రారు. దీంతో వారి భవిష్యత్తు నాశనమైనట్లే కదా? –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
కన్నమేస్తే అంతేమరి!
జుహై నగరం: అదో ఎలుక.. ప్రతిరోజు పిల్లిలా శబ్ధం చేయకుండా వచ్చి ధాన్యపు బస్తాలకు కన్నమేసి తినేస్తోంది. దీంతో యజమాని ఉచ్చు బిగించి దాన్ని పట్టుకున్నాడు. అంతటితో సరిపెట్టలేదు. ఆ ఎలుకకి శిక్ష అమలు చేశాడు. ఎవరైనా అదే చేస్తారు. కానీ, అతను కాస్త విచిత్రంగా చేశాడు. చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టుకున్న ఎలుక చేసిన నేరాన్ని దాని మెడలో బోర్డులా తగిలించాడు. ఈ ఫోటోలను నెట్లో పోస్టు చేయడంతో నెటిజన్లు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. జుహై నగరంలోని తన కిరాణాదుకాణంలో ఓ ఎలుక ధాన్యపు బస్తాల నుంచి బియ్యం కాజేయడంపై యజమానికి ఆందోళన చెందాడు. తన స్నేహితుడి సాయంతో మొత్తానికి దాన్ని పట్టుకున్నాడు. దాని మెడలో ఓ బోర్డు తగిలించాడు. మొదటి ఫొటోలో ’నన్ను కొట్టిచంపినా.. బియ్యాన్ని దొంగిలించానన్న నిందను మాత్రం ఒప్పుకోను’ అని ఎలుక దృష్టితో యజమానిని తిడుతున్నట్టు రాయగా.. మరో ఫొటోలో ‘ఇలాంటి సాహసం మళ్లీ వదిలిపెట్టండి’ అని వేడుకుంటూ కామెంట్ రాసి పెట్టారు. వినోదాన్ని పంచుతున్న ఈ పోస్టులను చైనీయులు తెగ షేర్ చేసేస్తున్నారు. -
ఎలుక చంపింది..సిగరెట్ కాపాడింది..!
చిలకలగూడ : చిలకలగూడ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి పురాతన భవనం కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఈ ఘటనలో ఎలుకల మందు పెట్టబోయి ఒకరు ప్రాణాలు కోల్పోగా, సిగరెట్ కోసం వెళ్లి మరొకరు ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళితే..కూలిపోయిన భవనంలో కొనసాగుతున్న అక్బర్ చికెన్ షాపులో భవానీనగర్‌కు చెందిన మహ్మద్‌వాజిద్ (29) చిలకలగూడకు చెందిన రెహమాన్ పని చేసేవారు. సోమవారం రాత్రి ఇద్దరు కలిసి షాపును శుభ్రం చేశారు. యజమాని అదేశాల మేరకు వాజిద్ ఎలుకల మందు పెట్టేందుకు లోపలకు వెళ్లగా,అక్బర్ దుకాణం ఎదుట నిల్చున్నాడు. రహమాన్ సిగరెట్ కోసం బయటకు వెళ్లాడు. అదే సమయంలో భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న అక్బర్, వాజిద్ మృతిచెందగా, సిగరెట్ కోసం వెళ్లిన రెహమాన్ ప్రాణాలతో భయటపడ్డాడు. కాగా అంతకు కొన్ని నిమిషాల ముందే అదే రహదారిలో పలహారంబండి ఊరేగింపు వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. -
ఎలుకలు కూడా వాటిని పట్టేస్తాయి !
-
ఎలుక తల కొరికి.. మూడు పెగ్గులేశాడు!
సిడ్నీ: బతికివున్న తెల్ల ఎలుక తలను కొరికి తిన్న వీడియోను చిత్రించుకుని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన వ్యక్తిని మూడేళ్ల పాటు పెంపుడు జంతువులను పెంచకూడదని, బదులుగా సామాజిక సేవ చేయాలని ఆ దేశ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో మాథ్యూ మలోనీ(25) ఎలుకను కొరికి చంపిన వీడియోను ఆన్ లైన్ లో పోస్టు చేశాడు. ఆ వీడియోలో మలోనీ గదిలోకి ఓ తెల్ల ఎలుక తీసుకుని వెళ్లాడు. ఎలుకను తన నోట్లో పెట్టుకుని గట్టిగా దాని తల తెగిపోయేవరకూ కొరికాడు. ఆ తర్వాత నోటికి అంటుకున్న రక్తాన్నికడిగేందుకు మూడు పెగ్గులు వాడ్కాను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఫేస్ బుక్ లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ కోర్టులో హజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తులు మూగజీవాలపై రాక్షసత్వాన్ని ప్రదర్శించిన అతనికి 100 గంటలపాటు సామాజిక సేవ చేయాలని శిక్షను విధించారు. -
పాముకు చుక్కలు చూపించిన ఎలుక
చిట్టి ఎలుక.. గట్టి సాహసం సాధారణంగా ప్రపంచంలో ఏ జీవి అయినా సరే ఎవరైనా తన పిల్లల జోలికొస్తే ఆ తల్లి ఊరుకోదు. ఈ విషయం మరోసారి రుజువైంది. కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు, కీటకాలు కూడా తమ తల్లి ప్రేమను నిరూపించుకుంటాయి. ఓ చిట్టి ఎలుక పిల్లను దాదాపు ఏడు అడుగుల పాము ఆహారంగా తీసుకోవాలని ప్రయత్నించింది. ఇక అంతే ఈ విషయాన్ని ఆ ఎలుక తల్లి గమనించింది. దాని కోపం తారాస్థాయికి చేరుకుంది. అవతల శత్రువు అన్నది పామా.. లేక ఏంటి అన్నది ఆ తల్లి హృదయానికి అక్కర్లేదని భావించింది. ప్రాణాలకు తెగించి మరీ పాముతో పోరాటానికి దిగింది. ఆ పామును చిరుతలా వెంటాడి మరీ తరిమికొట్టింది. పాము బుసలు కొడుతున్నా ఆ ఎలుక తల్లి వెనక్కి తగ్గలేదు. తన పిల్లను రక్షించుకోవడానికి పాము కాటుకు బలైన సరే అన్న తీరుగా చెలరేగిపోయింది. దీంతో చేసేదేం లేక బతుకు జీవుడా అనుకుంటూ చిన్న ఎలుకను వదిలేసి పాము అక్కడి నుంచి పారిపోయింది. రోడ్డుపై నుంచి మెల్లగా జారుకుని పొదల్లోకి పారిపోయింది. అయినా సరే పామును వెంటాడి తరిమేసింది. చిన్న ఎలుకను నోట కరుచుకుని తల్లి ఎలుక తీసుకెళ్లింది. -
జీవోల ఎలుక...
హ్యూమర్ ఫ్లస్ ఒక ఎలుక సెక్రటేరియట్ కలుగులో నివసిస్తూ ఉండేది. చిన్నప్పుడే దానికి జ్ఞానదంతం మొలిచింది. దాంతో దొరికిన ప్రతి జీవో కాగితాన్ని తినేసింది. ప్రభుత్వ పారిభాషిక పదాలన్నీ కంఠతా పట్టేసింది. నిద్రలో లేపి అడిగినా జీవోలు అప్పజెప్పేది. తోటి ఎలుకలతో కూడా జీవో భాషతోనే సంభాషించేది. ‘‘జీవో నంబర్ 79 ప్రకారం నిర్దిష్ట నిర్మాణాత్మక, నిష్టుర నిర్హేతుక, సాంకేతిక, చట్టబద్ధ, ఛందస్సహిత తాత్పర్య, విమోచనం దృష్ట్యా క్యాంటిన్ ఉత్తరం వైపున మనకీ రోజు భోజనం దొరకొచ్చు’’ అని చెప్పేది. అక్షరమ్ముక్క అర్థంకాకపోవడం వల్ల సాటి ఎలుకలు దాన్ని జ్ఞానిగా పరిగణించేవి. అనేక జీవోల మధ్య ఇరుక్కుపోయిన అధికారులు, ఏ జీవో ఎందుకుందో అర్థంకాక తలలు బద్దలు కొట్టుకునేవారు. అప్పుడు మన జ్ఞాన ఎలుక వచ్చి మాటసాయం చేసేది. ‘‘జీవో నం. 22లో ప్రజాబాహుళ్య చట్టపర, చర్యాత్మక, విశ్రాత్మ పరమాత్మ చేతన్ చేన్ తోడన్ తోన్, విభక్తి, అన్వయ, ప్రత్యామ్నాయ దోషరహిత కార్యాచరణవల్ల ప్రజలకు మేలు జరగొచ్చు’’ అని అధికారులు చెప్పేవారు. ‘‘మీరు పొరపడుతున్నారు. జీవో నంబర్ 36, సవరణ నంబర్ 116 ప్రకారం చేతనాత్మక ప్రక్రియలో స్థూలవిచారణ, సూక్ష్మదర్శినితో శోధన, సాధన, వేదన, సంవేదన సకలాత్మక, గుణాత్మక, క్రియాత్మక శూన్యంలోంచి కాలానుగుణ త్రిలోక దండకారులై మసలితే జనానికి క్షేమం’’ అని ఎలుక సవరించేది. ఇలా జరుగుతూ ఉండగా జ్ఞానికి మరో జ్ఞాని ఎదురవడం సంభవమే కాబట్టి పొరుగూరి ఎలుక దారి తప్పి సెక్రటేరియట్‌లోకి చొరబడింది. జ్ఞానదంతం వల్ల అది కూడా జ్ఞానీకరించబడి ఉంది. ‘‘జీవో నంబర్ 170 ప్రకారం ఎలుకైనా, చిలుకైనా, పంచదార పలుకైనా ఈ కార్యాలయ క్రమబద్ధీకరణ, యోగ్యతాపత్ర, కార్యోన్ముఖ, సహిష్ట, సంతుష్ట, సంభావనాదృష్ట్యా ప్రవేశం నిషిద్ధం’’ అని జ్ఞాన ఎలుక అంది. ఈ భాష విని కొత్త ఎలుక కొంచెం కంగారుపడింది. అవతలివాడు మనకి అర్థంకానపుడు మనమంటే ఏమిటో అర్థం అయ్యేలా మాట్లాడాలి. ‘‘అయ్యా మీ జీవోల గురించి నాకు తెలియదు. నంబర్ల ప్రకారం లెక్కలే నడవనపుడు ఇక ఎలుకలేం నడుస్తాయి. దంతాలున్నవాడికి జీవోలతో పనిలేదు. దంతంలోనే వేదాంతం, సిద్ధాంతం దాగున్నాయి. జీవోలున్నవి తిండి తనడానికే. నమిలి తినాలన్నా, కొరికి తినాలన్నా దంతాలుండాలి. అజీర్ణమే అజ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకోవడం దేవుడి అజ్ఞానం. జ్ఞానమైనా, దంతమైనా ఊగిసలాడుతున్నపుడే జాగ్రత్తపడితే, ఊడిపోకుండా కాపాడుకోవచ్చు. అంతటా తాను ఉండలేడు కాబట్టి దేవుడు ఈ భూమ్మీద డెంటిస్ట్‌ని సృష్టించాడు. పళ్లతోపాటు డబ్బుని రాలగొట్టడం వారి విధి. గతంలో నేను దంత వైద్యశాలలో పనిచేయడం వల్ల ఈ అనుభవం సంపాదించాను’ అని కొత్త ఎలుక చెప్పింది.‘‘దంత వైద్యశాలలో ఎలుక పనిచేయడం ఎలా సాధ్యం?’’ అని జీవో ఎలుక అడిగింది. ‘‘డాక్టర్లకైనా, అధికారులకైనా ఇప్పుడు దంతసిరి ముఖ్యం. జనాన్ని కొరికి నమలాలి. అందువల్ల నన్ను ఎలుకగా గుర్తించలేకపోయారు. నువ్వు సెక్రటేరియట్లో ఉన్నప్పుడు నేను డెంటిస్ట్ దగ్గర ఉండకూడదా?’’ ఎలుకలు ఇలా సంవాదిస్తుండగా ఒక పిల్లి నిశ్శబ్దంగా వచ్చి ఎలుకల తోకల్ని కాలితో అదిమి పెట్టింది. ఎలుకలు గాబరాపడ్డాయి. ‘‘జీవో నంబర్ 99 ప్రకారం విచిత్ర ఉన్మత్త, వేదాంత స్థితిగతి యోచనలో క్రూరపరివర్తన మార్జాల ప్రవేశం నిషిద్ధం’’ అని జీవో ఎలుక బెదిరించింది. కొత్త ఎలుక బెదిరిపోతూ ‘‘అయ్యా నా వేదాంతమంతా తిండికోసమే కానీ, ఇతరులకు తిండిగా మారడానికి కాదు’’ అంది. సత్యాన్ని తేలిగ్గా ఒకప్పుకున్నందుకుగానూ దాన్ని గుటుక్కున మింగి మ్యావ్‌మని త్రేన్చింది పిల్లి. జీవో ఎలుక మాత్రం తనకు తెలిసిన జీవోలన్నీ వివరిస్తూ పిల్లికి చట్టపరంగా వచ్చే చిక్కులు గురించి హెచ్చరించింది. అంతా సావధానంగా విన్న పిల్లి ‘‘వొరే పిచ్చోడా, ఎలుకల చట్టం పిల్లికి పనికిరాదు. జీవోల ప్రకారం ప్రభుత్వాలే నడవవు. ఇక పిల్లేం నడుస్తుంది. ఎలుక తెలుసుకోవాల్సింది జీవోలు కాదు, పిల్లి అడుగుల చప్పుడుని. పిల్లిని గుర్తించడమే ఎలుకకి దివ్యజ్ఞానం. ఎలుకని పిల్లి తినాలని జీవోలో ఉంది నీకు తెలియదా?’’ అంది.‘‘ఎన్నో నంబర్ జీవో’’ ఉక్రోషంగా అడిగింది ఎలుక. ‘‘జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కాదురా కుయ్యా గాడ్స్ ఆర్డర్’’ - జి.ఆర్. మహర్షి -
అన్నింటికీ ‘మూల’కణం..!
మూలకణ చికిత్సలో నవశకం.. కొత్త అవయవాలు సృష్టించే అవకాశం అవయవాలు కోల్పోయిన వారికి వరం.. ఎలుకలపై పరిశోధనలు విజయవంతం వచ్చే ఏడాది మానవులపై ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: బల్లి తోక తెగిపోతే ఏమవుతుంది.. తిరిగి కొంత కాలానికి పెరుగుతుంది. ఆటోటోమి అనే ఈ ప్రక్రియ సరీసృపాలు, కొన్ని జాతుల ఉభయచరాల్లో సర్వసాధారణం. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు వీటిల్లో ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే ఏదైనా ప్రమాదంలో మనుషులు అవయవాలు కోల్పోతే కృత్రిమ అవయవాలను అమర్చుకోవాల్సిందే. అయితే వారికి కూడా బల్లుల మాదిరిగానే కోల్పోయిన అవయవాలు తిరిగి వస్తే.. ఇది నిజంగా వారికి ఓ వరం లాంటిదే. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలపై ఈ మేరకు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలనిచ్చాయి. ఎముక, కొవ్వు కణాలను మూలకణాలుగా మార్చడం ద్వారా కొత్త అవయవాలు పెరిగేలా చేయొచ్చని వారు నిరూపించారు. త్వరలోనే మానవులపై ప్రయోగాలు చేసి అవయవాలు కోల్పోయిన వారికి శుభవార్త చెబుతామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే కనుక నిజమైతే అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్లవుతారు. మూల కణాలంటే..? పిండస్థ దశలో ఉండే మూల కణాల నుంచే శిశువు వివిధ శరీర భాగాలు ఏర్పడతాయి. పెద్ద పెరిగిన తర్వాత కూడా ఈ మూల కణాలు ఉంటాయి. అయితే ఒక్కో అవయవంలో దానికి సంబంధించినవే ఉంటాయి. ఆ అవయవంలోని కణాలు కానీ, కణజాలం కాదెబ్బ తింటే తిరిగి పెరిగేందుకు పెద్దల మూల కణాలు దోహదపడుతాయి. అంటే ఈ కణాలు కేవలం సంబంధిత అవయవ కణాలుగానే వృద్ధి చెందగలవు. అయితే ఈ పెద్దల మూల కణాలను కూడా పిండ కణాలుగా మార్చేయొచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ శాస్త్రవేత్తలు నిరూపించారు. మానవుని కొవ్వు కణాల నుంచి వేరు చేసిన మూలకణాలను పిండంలోని మూల కణాల మాదిరిగా మార్చి ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. దీంతో ఎలుకల్లో దెబ్బ తిన్న కణజాలం స్థానంలో కొత్తది ఏర్పడటం గుర్తించినట్లు పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాన్ పిమాండా తెలిపారు. తెగిపోయిన బల్లుల తోకల స్థానంలో ఈప్రక్రియ ద్వారానే కొత్త తోకలు ఏర్పడతాయని ఆయన వివరించారు. వచ్చే ఏడాది చివరిలో మానవులపై చేపట్టే ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స అందజేయొచ్చని పేర్కొన్నారు. గుండె కణాలు, నాడీ కణాలు, వెన్నుముక వంటి కీలకమైనవి దెబ్బ తిన్నపుడు వాటిని ఈ ప్రక్రియ ద్వారా పునరుద్ధరించొచ్చని చెప్పారు. -
కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకలు
నవాబుపేట : కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకల తేలియాడుతున్న సంఘటన నవాబుపేట మండలం గేట్‌వనంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ఆందోళన చెందిన స్థానికు లు ఆం దోళన చేపట్టారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్‌వనంపల్లి గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డి కల్లు తాగేందుకు శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గ్రామంలోని నర్సింహులుకు చెందిన కల్లు దుఖానానికి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న శ్రీైశైలం జైపాల్‌రెడ్డికి ఒక కల్లు సీసా ఇచ్చాడు. దాంతో అతను తాగడానికి తీసుకోగానే అందులో పాలవిందె కదులుతూ కని పించింది. గమనించిన అతను తోటి వారికి చూపిం చాడు. అందరూ కలిసి కల్లు విక్రయిస్తున్న వారిని నిలదీశారు. శుక్రవారం సైతం దుకాణంలో కల్లు సీసాల్లో ఎలుకలు వచ్చాయని చెప్పారు. సుచి, శుభ్రత లేని కల్లు మా గ్రామంలో విక్రహించవద్దని హెచ్చరించారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినా విచారణ కూడా చేపట్టలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఇందులో తమ తప్పు లేదని, గొల్లగూడ వద్ద ఉన్న కల్లు డిపోలో వ్యాపారులు తయారు చేసి పంపిన కల్లును మాత్రమే విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలి పారు. చర్యలు తీసుకుంటాం.. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ సుధాకర్‌ను వివరణ కోరగా కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకలు వచ్చిన విషయం తమ దృష్టికి రాలేదని, పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఆ.. ఎలుకలే కదా!
కేవీఆర్‌లో పందికొక్కులు రెండు రోజుల్లో తొమ్మిదిమంది ఆసుపత్రిపాలు పాములు, ఎలుకలతోవిద్యార్థుల అవస్థలు హాస్టల్ చుట్టూఅపరిశుభ్ర వాతావరణం నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నఅధికారులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కేవీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ హాస్టల్ వసతి ఉండడంతో మహిళల విద్యాభ్యాసానికి అనుకూలంగా భావిస్తారు. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ వరకు చదువుకునే వీలుంది. ఈ కారనంగా గ్రామీణ విద్యార్థినులు దాదాపుగా ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు. 2015-16 విద్యా సంవత్సరంలో 1,100 మంది విద్యార్థినులు ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. అయితే హాస్టల్లో అధికారులు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో నాన్‌టీచింగ్ స్టాఫ్ ఇష్టారాజ్యం సాగుతోంది. అసలే హాస్టల్ భవనం పాతది కావడం.. దీనికి తోడు పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో ఎలుకలు, పందికొక్కులు, పాముల సంచారం అధికమైంది. ముఖ్యంగా ఎలుకల బెడద అధికమవడంతో విద్యార్థినులకు కంటి మీద కునుకు దూరమవుతోంది. మూడు రోజుల క్రితం ఎలుకలు కొరకడంతో 9 మంది విద్యార్థినులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. బుధవారం 5గురు, గురువారం నలుగురు ఆసుపత్రిలోని అంటువ్యాధుల విభాగంలో చికిత్స పొందారు. వచ్చే నెలలో పరీక్షలు ప్రారంభమవుతున్న సమయంలో ఎలుకల సమస్యతో చదువుపై దృష్టి సారించలేని పరిస్థితికి కారణమవుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు విద్యార్థినులు ప్రిపరేషన్ హాలిడేస్ పేరిట సొంతూళ్లకు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితిని అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలుకలు ఎవరిళ్లలో లేవంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా విద్యార్థినులే హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం లేదనే సాకులతో సరిపుచ్చుతున్నారు. గోడ కూలి ఏడాది హాస్టల్ భవనాల సమీపంలోని కేసీ కెనాల్ వైపున్న గోడ కూలి ఏడాది గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయించేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రాత్రిళ్లు బయటి వ్యక్తులు లోపలికి వస్తున్నారనే చర్చ జరుగుతోంది. హాస్టల్‌కు సమీపంలోనే సారా తయారీ ప్రాంతమైన బంగారుపేట ఉండటంతో మందుబాబుల సంచారం ఈ ప్రాంతంలో అధికంగా ఉంటోంది. అయినప్పటికీ విద్యార్థినుల భద్రతను అధికారులు గాలికొదిలేశారు. ఎవరింట్లో ఎలుకలు ఉండవు ఎలుకలు ఎవరింట్లో ఉండవు. అందరిండ్లలో ఉంటాయి. హాస్టల్లో కూడా అంతే. విద్యార్థినులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలేదు. అందువల్లే ఎలుకల సంచారం అధికమైంది. విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం నా దృష్టికి రాలేదు - పురుషోత్తమరెడ్డి, ప్రిన్సిపాల్ -
విమానాన్ని వెనక్కు రప్పించిన ఎలుక
బీజింగ్: ఎలుక విమానాన్ని వెనక్కి రప్పించిన ఘటన మరోసారి చోటు చేసుకుంది. చైనాలో ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు విమానంలో ఎలుక కనిపించడంతో వెంటనే వెనక్కు దారి మళ్లించి ల్యాండ్ చేశారు. శుక్రవారం హాంగ్జౌ నగరం నుంచి యునాన్ ప్రాంత పరిధిలోని జిషువాంగ్బనాకు లూంగ్ ఎయిర్ ఫ్లైట్ బయల్దేరిన కాపేపటికి క్యాబిన్ లో ఎలుక కనిపించింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానాన్ని ల్యాండ్ చేసిన తర్వాత ఎలుకను పట్టుకునేందుకు గాలించారు. విమానంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడంతో పాటు ఎలక్ట్రిక్ వైర్లను కొరకడం వల్ల ప్రమాదం జరిగే అవకాశముంది. ఈ ఉదంతంపై లూంగ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎలుక విమానంలోకి ఎలా వచ్చిందో తమకు అర్థం కావడం లేదని చెప్పారు. భోజనం సరఫరా చేసే వారి ద్వారా ఎలుక వచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. లూంగ్ ఎయిర్‌లైన్స్ 50కి పైగా దేశవాళీ రూట్లలో సర్వీసులు నడపుతోంది. ఎలుక కారణంగా విమానం వెనుకకు వచ్చిన సంఘటనలు గతంలో పలుమార్లు జరిగాయి. -
'ఎలుక దాడి' కేసులో లొంగిపోయిన నిందితులు
గుంటూరు లీగల్: సంచలనం సృష్టించిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల దాడి కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు సోమవారం కోర్టులో లొంగిపోయి అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. వివరాలు... విజయవాడకు చెందిన చావలి లక్ష్మి 2015 ఆగస్టు 17న విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు ఆరోగ్య సమస్య రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అదేరోజు రాత్రి 10.30 గంటలకు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా అదే నెల 25న లక్ష్మి తన బిడ్డ ఎలుక కాటుకు గురైనట్లు గమనించి వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లింది. పరిశీలించిన వైద్యుడు గాయానికి ఆయింట్మెంట్ పూయమని చెప్పారు. తిరిగి 26వ తేదీ తెల్లవారుజామున తన బిడ్డ ఎలుక కాటుకు గురైన విషయాన్ని మరోసారి ఆస్పత్రి సిబ్బందికి తెలిపింది. అక్కడ ఉన్న సిబ్బంది గాయాలకు కట్టుకట్టారు కానీ, ఏవిధమైన చికిత్స అందించలేదు. అదేరోజు మద్యాహ్నం 2.45 గంటలకు బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తూ లక్ష్మి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వార్డు స్టాఫ్‌నర్స్ జి జయజ్యోతి కుమారి, హెడ్నర్స్ సీహెచ్ విజయలక్ష్మి, స్టాఫ్‌నర్స్ వి.విజయలక్ష్మి, నర్సింగ్ సూపరింటెండెంట్ కె.పుష్పావతి, శానిటరీ ఇన్స్పెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, కార్పెంటర్ చందోలు వెంకటప్పయ్య, ఇన్చార్చి ఆర్ఎంవో డాక్టర్ అనంత శ్రీనివాసులు నిందితులుగా పేర్కొన్నారు. వీరందరూ సోమవారం తమ న్యాయవాది కొమ్మా రమేష్ ద్వారా కోర్టులో లొంగిపోయారు. అనంతరం న్యాయమూర్తి కె.ప్రత్యూష కుమారి వీరందరికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల15వ తేదీకి వాయిదా వేశారు. -
వంట నూనెలో ఎలుక కలకలం
రామంతపూర్: ఇప్పటికే కల్తీపాలు, కల్తీ నెయ్యి, కల్తీ మసాలాలు హైదరాబాదీల ప్రాణాలు హరిస్తుంటే తాజాగా.. ఓ పెద్ద షోరూంలో కొన్న నూనెలో ఎలుక రావడంతో మళ్లీ కలకలం రేగింది. నగరంలోని రామంతపూర్‌లో నివాసముంటున్న చక్రవర్తి అనే వ్యక్తి ఆకాశవాణిలో పని చేస్తున్నారు. ఆయన ఈ నెల ఒకటో తారీకున దగ్గరలో ఉన్న ఒక మాల్ నుంచి సరుకులు తెచ్చారు. అందులో భాగంగా ఓ కంపెనీకి చెందిన వంట నూనె కొనుగోలు చేశారు. ఈ రోజు నూనె ప్యాకెట్ కత్తిరించి చూడగా.. అందులో ఎలుక కనిపించింది. దీంతో ఆయన సిబ్బందిని సంప్రదించగా.. బిల్లు తీసుకురావాలని.. బిల్లు లేకపోతే తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. -
ఎలుక సెల్ఫీ తీసుకుంది!
లండన్: ఓ ఎలుక సెల్ఫీ తీసుకుని అబ్బురపరిచింది. సెల్ఫీ తీసుకున్నతొలి ఎలుకగా రికార్డు సృష్టించింది. న్యూయార్క్ సిటీ రైల్వే స్టేషన్లో యాదృశ్చికంగా ఈ ఘటన జరిగింది. డాన్ రిచర్డ్స్ అనే టూరిస్టు కథనం ప్రకారం అతను రైలు కోసం ప్లాట్‌ఫామ్‌పై ఎదురు చూస్తుండగా.. ప్లాట్ఫామ్లో గోడకు ఆనుకుని ఓ వ్యక్తి నిద్రపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ ఎలుక అతనిపైకి ఎగబాకింది. దీంతో మెళకువ వచ్చిన ఆ వ్యక్తి కంగారుగా లేచేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని జేబు నుంచి సెల్‌ఫోన్ కింద పడింది. వెంటనే దాన్ని తీసుకుని చూడగా మొబైల్లో ఎలుక సెల్ఫీ కనిపించింది. ఎలుక పరిగెత్తేక్రమంలో కిందపడిఉన్న సెల్‌ఫోన్‌పై ఎక్కడంతో కెమెర్ క్లిక్ మనడం, సెల్ఫోన్లో ఎలుక ఫోటో నిక్షిప్తమైంది. ఈ తతంగాన్ని వీడియో తీసిన డాన్ రిచర్డ్స్ యూట్యూబ్‌లో పెట్టాడు. -
ఫ్రీడాం ఆయిల్ ప్యాకెత్లో ఎలుక
-
బ్రెడ్ ప్యాకెట్లో నుంచి ఎలుక దూకింది!
న్యూఢిల్లీ: అస్వస్థతతో బాధ పడుతున్న మీరు అధిక పోషక విలువలుగల గోధుమ బ్రెడ్‌ను తిందామని సీల్డ్ ప్యాకెట్‌ను విప్పితే హఠాత్తుగా అందులో నుంచి బతికున్న ఎలుక బయటకు దూకితే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! ఎవరికైనా ఒళ్లు జలధరిస్తుంది కదా! ఈ సంఘటన రోజుకు వందలాది మంది రోగులకు చికిత్సచేసే ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలో ఏయిమ్స్ ఆస్పత్రిలోనే జరిగింది. పర్యవసానంగా ఆ బ్రెడ్‌ను తయారుచేసి సరఫరా చేసిన ఎం/ఎస్ బాన్ న్యూట్రియెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏయిమ్స్ షోకాజ్ నోటీసును జారీ చేసి, మూడేళ్లపాటు ఆ కంపెనీ ఉత్పత్తుల సరఫరాను నిషేధిస్తున్నామని ప్రకటించింది. బ్రెడ్స్, బిస్కట్లు, కేక్స్, కుకీస్ లాంటి వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారుచేసి దేశంలోనే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్న ప్రముఖ బాన్ న్యూట్రియెంట్స్ కంపెనీ విషయంలోనే ఇలా జరిగితే ఇక సాధారణ కంపెనీలను ఎలా నమ్మగలం. సీల్డ్ బ్రెడ్ ప్యాకెట్‌ను విప్పగానే సజీవ ఎలుక సాక్షాత్కరించిన సంఘటన ఏయిమ్స్‌లో గత జూలై 29వ తేదీన జరగ్గా, దానిపై స్పందించేందుకు ఏయిమ్స్ లాంటి వైద్య విజ్ఞాన సంస్థ కూడా తాత్సారం చేసింది. సెప్టెంబర్ 9వ తేదీతో సెప్టెంబర్ 24వ తేదీన సదరు కంపెనీ ఉత్పత్తుల కొనుగోలును నిలిపివేస్తున్నట్టు నోటీసు జారీ చేసింది. ఎందుకింత ఆలస్యంగా స్పందించారని మీడియా ప్రశ్నించగా, అసలు అలాంటి సంఘటన జరిగినట్టు తన దృష్టికే రాలేదంటూ ఆస్పత్రి సూపరింటెండ్ వ్యాఖ్యానించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండడం వల్ల బ్రెడ్ నాణ్యతను గుర్తించగలిగామని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఏయిమ్స్ సీనియర్ డాక్టరొకరు వెల్లడించారు. తమ ఆస్పత్రిలో సాధారణ రోగులకే కాకుండా శస్త్ర చికిత్సలు చేసిన వారికి కూడా అధిక పోషక పదార్థాల కోసం బ్రౌన్ బ్రెడ్ అందిస్తామని ఆయన తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన బ్రెడ్‌ను తిన్నట్లయితే ఎలర్జీ, ఫీవర్, డయేరియా లాంటి జబ్బులే కాకుండా బ్లడ్ ఇన్ఫెక్షన్, మెనింజైటీస్ లాంటి ప్రమాదకర జబ్బులు కూడా వస్తాయని ఆయన వివరించారు. అలాంటి సంఘటన తన దృష్టికి రాలేదంటూ ఏయిమ్స్ సూపరింటెండెంట్ తప్పించుకోజూసినా 24, సెప్టెంబర్, 2015 నాడు కంపెనీకి జారీచేసిన షోకాజ్ నోటీసులో ఎలుక బయట పడిన సంఘటన ప్రస్థావన స్పష్టంగా ఉంది. ఇదే విషయమై బాన్ న్యూట్రియంట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఢిల్లీ డివిజన్ మేనేజర్‌ను మీడియా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. సీసం పాలు ఎక్కువ ఉందంటూ ఇటీవల మ్యాగీ ఉత్పత్తుల కంపెనీ ‘నేస్లీ’పై కొన్ని రాష్ట్రాల్లో నిషేధం విధించిన విషయం తెల్సిందే. భారత్‌లో తయారవుతున్న పలు బ్రాండ్ల ఆహోర్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు, సీసం పాళ్లు ఎక్కువగా ఉంటోందంటూ పలు ఉత్పత్తులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ (ఎఫ్‌డీఏ) నిషేధించిన విషయం తెల్సిందే. -
ప్రజల్లో ‘ర్యాట్’ ఫీవర్
చెన్నై : నగర వాసుల్లో ర్యాట్ ఫీవర్(లెప్టోస్పైరోసిస్) భయం పట్టుకుంది. ఈ జ్వరం క్రమంగా ప్రబలుతుండడంతో ఆందోళన పెరుగుతోంది. ప్రధానంగా పిల్లలు ఈ జ్వరం బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. రాజధాని నగరం వాసుల్ని తరచూ ఏదో ఒక జ్వరాలు పీడిస్తున్నాయి. తొలుత చికున్ గున్య, చికున్ ఫాక్స్ వణికించాయి. తదనంతరం స్వైన్ ఫ్లూ భయం ఆందోళన రేకెత్తించింది. ఇందు కోసం ప్రత్యేక వార్డుల్ని సైతం ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసి ఆ ఫ్లూను కాస్తా తరిమి కొట్టారు. అనంతరం డెంగీ, మలేరియా జ్వరాలు పీడించాయి. తాజాగా ర్యాట్ ఫీవర్ నగర వాసుల్ని పట్టిపీడిస్తోంది. ప్రధానంగా మురికి వాడల్లో ఈ జ్వరం తీవ్రత పెరుగుతున్నది. ఐదేళ్ల క్రితం ఈ జ్వరం నగర వాసుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. కుటుంబాలు కుటుంబాలు ఆసుపత్రుల పాలు కావాల్సి వచ్చింది. తాజాగా మళ్లీ ఈ జ్వరం బారిన పడ్డ కేసులు నమోదు అవుతోండడంతో ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. ఎక్కువ శాతం చిన్న పిల్లలు జ్వరంతో ఆసుపత్రుల్లో చేరుతున్నట్టుగా వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ క్లీనిక్, ఆసుపత్రులు చూసినా జ్వరంతో బాధ పడుతున్న వాళ్లే అధికంగా ఉన్నారు. తీవ్ర తలనొప్పి, మూడు రోజులకు పైగా జ్వరం, వాంతుల తీవ్రత అధికంగా ఉంటే, తప్పని సరిగా రక్త పరీక్ష చేసుకుని ర్యాట్ ఫీవర్‌గా నిర్ధారించుకుని అందుకు తగ్గ వైద్యసేవల్ని పొందాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఇళ్లల్లో ఎలుకలు ఉంటే, వాటిని తరిమి కొట్టాలని, మురికి వాడల్లో ఉండే వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ జ్వరం తీవ్రత పెరుగుతుండడంతో కార్పొరేషన్ వర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. మురికి వాడల్లో, కాలువల్లో బ్లీచింగ్ చేయడంతో పాటుగా ఎలుకల్ని నాశనం చేసే క్రిముల్ని చల్లేందుకు సిద్ధం అవుతున్నారు. -
700 ఎలుకలకు రూ.24.47 లక్షలు!
రాష్ట్ర చట్టసభల్లో ఎలుకను పట్టేందుకు గత ఏడేళ్లలో ప్రభుత్వం రూ. 24.47 లక్షలు ఖర్చు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఈ సమాధానం లభించింది. 2015 ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు విధానసౌధతో పాటు వికాసౌధలో ఎలుకలతో పాటు క్రిములును తొలగించేందుకు గాను రూ.4,96,333లను చెల్లించేలా ఓ ప్రైవేట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ లెక్కన గత ఏడేళ్లలో ఎలుకల కోసం రూ.24.47 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. కాగా, ఈ ఏడేళ్లలో 700 ఎలుకలు పట్టుబడ్డాయని ప్రభుత్వం తెలియజేసింది. - సాక్షి, బెంగళూరు -
పట్టుకుంటే రూ. 10
గుంటూరు ఘటనతో ఆస్పత్రుల్లో మూషికాలపై ఏపీ సర్కారు ఆదేశం హైదరాబాద్: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది ఏపీ సర్కారు వ్యవహారం. గుంటూరు జిల్లా సమగ్ర ఆస్పత్రిలో పసికందును ఎలుకలు కొరికిన ఘటన అనంతరం కళ్లు తెరిచింది. ఎలాగైనా ప్రభుత్వాస్పత్రుల్లో మూషికాలను మట్టుబెట్టాలని కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్కో ఎలుకను పట్టిన వారికి రూ.10 ప్రకటించింది. ఇంకేముంది.. ఇప్పుడు ఎలుకలు పట్టే వారికి గిరాకీ పెరిగింది. చిట్టెలుక, చుంచు.. ఇలా ఏదైనా ఒక ఎలుకకు ఒకే ధర. పందికొక్కులకు మాత్రం రేటు నిర్ధరించలేదు. మొత్తం 11 వైద్య కలాశాలలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ ఎలుకలను నిర్మూలించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇకపై 15 రోజులకోసారి ఎన్ని ఎలుకలను పట్టిందీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఎలుకలను పట్టినందుకు అయ్యే వ్యయాన్ని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నుంచి ఖర్చు చేసుకునే వీలుంటుంది. లక్షలకు చేరిన ఎలుకల సంతానం.. కొన్నేళ్లుగా ఎలుకలపై నివారణ చర్యలు తీసుకోకపోవడంతో వాటి సంతానం లక్షలకు చేరుకుని ఉంటుందని ఓ పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ అన్నారు. తాజాగా గుంటూరులో జరిగిన ఘటన అనంతరం వారంలో 400 పైగా ఎలుకలను పట్టుకున్నట్టు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇవి కూడా నాలుగైదు వార్డుల్లోనే. దీన్నిబట్టి ఎలుకల సంతానం అపరిమితంగా పెరిగిపోయిందని తెలుస్తోంది. రోగి ఐసీయూ బెడ్‌పై ఉంటూండగానే పడకపై తిరుగుతూ గెంతులేసే స్థాయికి ఎలుకలు చేరుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొదట డ్రైనేజీలు చక్కదిద్దాలి.. ఎలుకలను నిర్మూలించాలంటే ముందు డ్రైనేజీ పరిస్థితులను చక్కదిద్దాలని, ఊరికే బోన్లు పెడితే అవి వచ్చి ఇరుక్కునే పరిస్థితి లేదని ఆస్పత్రుల సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎలుకలను పట్టడం కూడా పారిశుధ్య కాంట్రాక్టరుదే బాధ్యతని ప్రభుత్వం చెబుతోంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం తాము పారిశుధ్యం చేస్తాం గానీ, ఎలుకలను ఎలా పట్టుకోగలమని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇకపై రోగులపైకి ఎలుకలు వచ్చాయంటే డ్యూటీలో ఉన్న వైద్యుడు, ఆర్ఎంఓ, స్టాఫ్ నర్సులే బాధ్యత వహించాలని చెబుతున్నారు. -
వదల బ్లాక్‌బెర్రీ.. నిన్నొదలా...
అనగనగా ఓ చిట్టెలుక.. ఓ రోజు ఉదయాన్నే ఆకలి వేయడంతో ఆహారాన్వేషణకు బయలుదేరింది.. బ్లాక్‌బెర్రీ పళ్లు దాని కళ్లలో పడ్డాయి.. కానీ కొంచెం ఎత్తులో ఉన్నాయి.. అయినా వెనకడుగు వేయలేదు.. అందని బ్లాక్‌బెర్రీ పుల్లన అని అనుకోలేదు.. దాని చిట్టి మెదడుతో గట్టి ఐడియానే వేసింది.. వెనక కాళ్లపై నిటారుగా నుంచొని కొంచెం పైకి ఎగిరి ఆ కొమ్మను అందుకుంది.. అంతే అలా గాలిలో వేలాడుతూనే బెర్రీలను సుష్టుగా లాగించేసింది.. తర్వాత ఎంచక్కా కిందకు దిగి వెళ్లిపోయింది! వియన్నాలోని ఓ శ్మశానంలో కనిపించిన ఈ దృశ్యాలను జులియన్ గెహర్మన్ రాడ్ అనే విద్యార్థి కెమెరాలో బంధించాడు. -
మన జాతీయాలు
పేడకుప్పకు దిష్టి మంత్రమా? దిష్టి ఎప్పుడు తీస్తారు? ఎందుకు తీస్తారు? అందం, ఐశ్వర్యం, విజయం కలిగిన వారికి నరదిష్టి తగులుతుందని ఒక నమ్మకం. అందుకే దిష్టి తీస్తుంటారు. ఒక కొత్త భవనానికో, అందమైన భవనానికో దిష్టిబొమ్మ తగిలిస్తే అదేమీ వింత కాదు. అదే ఒక పాడుబడిన భవంతికి దిష్టిబొమ్మ కడితే అందరూ నవ్వుకుంటారు. ఎందుకంటే ఆ పాడుబడిన భవంతికి దిష్టి తీయాల్సిన అవసరం ఏముంటుంది అని! కొందరు అవసరం లేని పనులు చేసి నలుగురూ నవ్వుకునేలా చేస్తారు. ‘‘మావాడు కార్యశూరుడు. ఎంత పెద్ద కార్యశూర్యుడు అంటే పేడకుప్పకు దిష్టి మంత్రం వేసే రకం’’ అని ఒకరు అంటారు. ‘‘చేయక చేయక ఒక పని చేస్తాడు. తీరా చూస్తే ఆ పని పేడకుప్పకు దిష్టిమంత్రం వేసినట్లుగా ఉంటుంది’’ అని ఇంకొకరు అంటారు. ఇలా రకరకాల సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పేడకుప్పను చూడగానే ముక్కు మూసుకోవా లనుకుంటాంగానీ, ‘ఆహా ఏమి సౌందర్యం’ అని అనుకోము కదా! మరి పేడకుప్పకు దిష్టి మంత్రం వేస్తే ఎంత నవ్వులాటగా ఉంటుంది! ఈ నేపథ్యంలో నుంచి పుట్టిన జాతీయమే ‘పేడకుప్పకు దిష్టిమంత్రం వేసినట్లు’ అన్నది! కాక స్నానం ‘‘పనైతే చేస్తాడుగానీ... అది కాక స్నానంలా ఉంటుంది’’ అన్నమాట చాలాసార్లు వింటుంటాం. పనులు చేసేవాళ్లు రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం వారు చిత్తశుద్ధితో చేస్తారు. సంపూర్ణంగా చేస్తారు. రెండో రకం వారు నామమాత్రంగా చేస్తారు. అందులో లోపాలు, పరిమితులు బోలెడు కనిపిస్తాయి. ఈ రెండో కోవకు చెందిన వారి విషయంలోనే పై జాతీయాన్ని ఉపయోగిస్తారు. కాకి స్నానం ఎలా చేస్తుందో ఎప్పుడైనా చూశారా? తన రెండు రెక్కలనూ నీళ్లలో ఆడించి స్నానం పూర్తి చేశాను అనుకుంటుంది. మనుషుల్లో కూడా కొందరు ఏదైనా పని చేసేటప్పుడు ఏదో చేశాం అన్న పేరుకి చేసేసి, అద్భుతంగా చేసేశాం అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. అలాంటివారి పనిని కాకస్నానంతో పోలుస్తారన్నమాట! శనివారపు జడి వాన! శనివారం ఏ పని చేయాలన్నా వెనకడుగు వేస్తుంటారు. కారణం మంచి పనులు చేయడానికి శనివారాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదన్న నమ్మకం. ఇక వాన గురించి. వాన పడితే చేయాల్సిన పనులు చేయలేము. ఆ జల్లులో, బురదలో పనికి రకరకాల ఆటంకాలు కలుగుతాయి. పని వాయిదా పడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇక జడివాన మొదలైతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఇక ఈ రెండూ కలిస్తే?! శనివారం పూట పని చేయడానికే సంకోచిస్తుంటే ఇక వాన కూడా పడిందనుకోండి, ఇక అంతే సంగతులు కదా! అందుకే శనివారపు జడివాన అన్న జాతీయం పుట్టుకొచ్చింది. కొందరు మాట్లాడ్డం మొదలు పెడితే ఆపరు. అలాంటి ‘ఆగని నస’ని శనివారపు జడివాన అంటారు. ‘అయ్యబాబోయ్... అతను ఉపన్యాసం మొదలు పెట్టాడు... ఇక శనివారపు జడివానే!’ అని చమత్కరిస్తారు. ఎలుక చావుకు పిల్లి మూర్ఛ పోయిందట! అసమంజసమైన, పొంతన లేని, అసంబద్ధమైన విషయాలను విన్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇద్దరిలో ఒకడికి ఏమైనా అయితే, రెండోవాడు బాధ పడుతున్నట్లు నటించినా, సానుభూతి చూపించినా... జనాలు నమ్మకపోగా ‘వీడి వాలకం చూస్తే ఎలుక చావుకు పిల్లి మూర్ఛపోయినట్లుగా ఉంది’ అంటారు. ఎలుక, పిల్లుల మధ్య జాతివైరం ఉంటుంది. పిల్లి నుంచి ఎలా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవాలా అని ఎలుక ఆలోచిస్తుంది. ఎలుక ప్రాణాలు ఎలా తీయాలా అని పిల్లి ఆలోచిస్తుంది. కాబట్టి వాటి మధ్య స్నేహానికి, బంధుత్వానికి చాన్సే లేదు కదా! ఈ వాస్తవంలో నుంచి పుట్టిన జాతీయమే ఇది. -
క్యాబిన్లో ఎలుక... గాలిలో విమానం
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నుంచి యూరప్‌లోని మిలాన్ నగరానికి ఏయిర్ ఇండియా విమానం ఏఐ -123 గురువారం బయలుదేరింది. విమానం బయలుదేరి అప్పటికి నాలుగు గంటలు దాటింది. ఇంతలో విమాన క్యాబిన్లో ఎలుక సందడి చేస్తుంది. ఆ విషయాన్ని విమాన సిబ్బంది, ప్రయాణికులు గుర్తించారు. వెంటనే దింపేందుకు ప్రయత్నించారు. తీరా చూస్తే సదరు విమానం పాకిస్థాన్‌లో ప్రవేశించింది. విమానంలో మొత్తం 200 మంది ప్రయాణికులు ఉన్నారు. క్యాబిన్ లోని ఎలుక ఓ వేళ వైర్లు కొరికితే... గాలిలో ప్రాణాలు గాలిలోనే కలిసిపోతాయి. వారికి ఏం చేయాల్లో పాలుపోలేదు. తిరిగి న్యూఢిల్లీ వెళ్లితే.. అదే విషయాన్ని పాలం విమానాశ్రయ అధికారులకు తెలిపారు. వారు ఉన్నతాధికారులను సంప్రదించి... వెనక్కి వచ్చేందుకు విమాన పైలెట్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో విమానం మళ్లీ న్యూడిల్లీలో ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులంతా హామయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. విమాన క్యాబిన్లో ఎలుక ఉందో లేదా ఇంకా నిర్థరాణ కాలేదు. ప్రయాణికుల క్షేమమే తమకు ముఖ్యం అందుకే విమానాన్ని వెనక్కి వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఏయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై తమ ఇంజనీరింగ్ బృందం విచారణ జరుపుతుందని తెలిపారు.