సీతానగరం(తూర్పుగోదావరి): గోకవరానికి చెందిన తాతూరి బంగార్రాజు పదేళ్ల కుమారునికి ఎలుకల మందు కలిపిన డ్రింక్ తాగించి, తనూ తాగి శనివారం ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శుభశేఖర్ ఆసుపత్రికి తరలించారు. బంగార్రాజు భార్య కువైట్‌లో ఉంటుండగా, 14 ఏళ్ల కుమార్తె, 12, 10 ఏళ్ల కుమారులు ఉన్నారు. వీరు ముగ్గురు వంగలపూడిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. చదువుల నిమిత్తం హాస్టల్లో చేర్చారు. ఈ నెల 13న సంక్రాంతి సందర్భంగా వంగలపూడిలోని అత్తవారి ఇంటికి బంగార్రాజు వచ్చాడు. భార్యతో అతనికి కుటుంబ కలహాలు ఉన్నాయి.
చదవండి: మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..
ఈ నేపథ్యంలో తన ముగ్గురు పిల్లలతో బంగార్రాజు సీతానగరం కైలాస భూమి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న బంగార్రాజు కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి పదేళ్ల కుమారుడు ప్రజ్వల్‌తో బలవంతంగా తాగించి, తనూ తాగాడు. సమాచారం అందుకున్న ఎస్సై శుభ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురికి సీతానగరం బస్టాండ్ సెంటర్ వద్దగల ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యసేవలు అందించిన అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment