cool drink
-
వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందని...
పర్వతగిరి: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని ఓ కోడలు తన అత్తకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించింది. అత్త చికిత్స పొందుతూ మృతిచెందగా, తన తల్లిని చంపిందని భార్యపై భర్త శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండాలో చోటుచేసుకుంది. స్థానికులు, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన భూక్య మంజుల, దేవేందర్ భార్యాభర్తలు. మంజుల మూడేళ్లుగా వరంగల్‌లోని పెరుకవాడకు చెందిన సారయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం అత్త భూక్య గమ్మి(55)కి తెలిసి పలుమార్లు వారించింది. దీంతో మంజుల తన ప్రేమకలాపాలకు అత్త గమ్మి తరచూ అడ్డు వస్తుందని గతంలో రెండు సార్లు తలపై గాయం చేయగా, మరోసారి చేయి విరగ్గొట్టింది. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీన మంజుల తన అత్త గమ్మికి థమ్సప్‌లో పురుగుల మందు కలిపి తాగించింది. కొద్ది సేపటి అనంతరం గమ్మి కిందపడి కొట్టుకుంటుండగా కుమారుడు దేవేందర్ చూసి స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించగా ఆయన సూచన మేరకు తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించే క్రమంలో శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కూల్ డ్రింక్స్ అతిగా సేవిస్తే.. ఎంత ముప్పో తెలుసా? చివరికి...!
నేటి కాలంలో సీజన్‌తో సంబంధం లేకుండా కూల్‌డ్రింక్స్ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇక వేసవిలో అయితే కూల్ డ్రింక్స్ వినియోగం గురించి చెప్ప నక్కర లేదు. క్షణం కూడా ఆలోచించకుండా పసిపిల్లలకు కూడా తాగిస్తున్నారు. తాగిన ఆ కాసేపు రుచిగా, హాయిగా అనిపించినా, శీతల పానీయాల వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలున్నాయో తెలిస్తే షాకవుతారు. అతిగా కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిపుణుల హెచ్చరికల్ని ఒకసారి గమనించండి! నలుగురు కలిసిన చోట, పార్టీల్లోనూ, శుభకార్యాల్లోనూ కూల్‌డ్రింక్స్ ఒక స్టేటస్‌గా సింబల్‌గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. చివరకు ఇది ఒక అలవాటుగా మారిపోయి ఫ్రిజ్‌లలో స్టోర్ చేసుకొని మరీ లాగించేస్తున్నారు. కొందరైతే కూల్ డ్రింక్ తాగితే తప్ప తిన్నది అరగడం లేదు అనే స్థాయికి వచ్చేశారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం శీతల పానీయాలు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కడుపు సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది అజీర్ణం, వాంతులు ..ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు: శీతల పానీయాలు, సోడాల్లో వినియోగించే శుద్ధిచేసిన చక్కెర (ఒక్కో బాటిల్లో దాదాపు 10 టీ స్పూన్ల వరకు) అధికంగా ఉంటుంది. కేలరీలు, కెఫిన్ మోతాదు కూడా ఎక్కువే. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఫ్రక్టోజ్ తీసుకోవడంతో లెప్టిన్ హార్మోన్ ప్రభావితమవుతుంది. తద్వారా వేగంగా బరువు పెరుగుతారు. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు మూలం. డయాబెటిక్: రక్తపోటు ముప్పు పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మరింత ప్రమాదాన్ని చేకూరుస్తుంది. శీతల పానీయాలలో ఉండే ఫ్రక్టోజ్, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రధాన కార్బోహైడ్రేట్ అని గుర్తించాలి. ఫ్యాటీ లీవర్: శుద్ధి చేసిన చక్కెరలో ఉండే ప్రధానమైనవి. గ్లూకోజ్ ఫ్రక్టోజ్. శరీర కణాలు గ్లూకోజ్‌ను సులభంగా జీర్ణం చేస్తాయి. కానీ ఫ్రక్టోజ్‌ను అరిగించే పని మాత్రం కాలేయానిదే. కూల్ డ్రింక్స్ఎక్కువైతే ఫ్రక్టోజ్ ఓవర్‌లోడ్‌కు దారితీస్తుంది. కాలేయం ఈ ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. దీంతో లీవర్ సమస్యలొస్తాయి. గుండె, కీళ్ల, సమస్యలు: శీతల పానీయాలు ఎక్కువైతే గుండె ఆరోగ్యంపై ప్రభావితమవుతుంది. అలాగే వీటిల్లోని మితిమీరిన కెఫిన్ నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికమై గౌట్ , కీళ్లలో వాపు లేదా నొప్పి వస్తాయి. ఇది నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. పంటి సమస్యలు: సోడాల్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ దీర్ఘకాలంలో పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. ఇవి చక్కెరతో కలిపినప్పుడు, ఈ ఆమ్లాలు నోటిలో బ్యాక్టీరియాకి కారణమవుతాయి. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ శీతల పానీయాలు తాగే వ్యక్తుల్లో ప్యాంక్రియాటిక్ కేన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు రెండు రెట్టు పెరుగుతుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఎండోమెట్రియల్ కేన్సర్ వచ్చే ప్రమాదం. శీతల పానీయాలు క్రమం తప్పకుండా తాగే వ్యక్తుల జ్ఞాపకశక్తి ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవశరీరంపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపే శీతల పానీయాలకు బానిసలైన వారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడాలి. -
యువతిని రూమ్‌కు తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఫొటోలు.. ఆపై..
హైదరాబాద్(వెంగళరావునగర్): పబ్జి గేమ్ ద్వారా స్నేహాన్ని పెంచుకున్న యువకుడు ఓ మహిళను శారీరకంగా కలవడమే కాకుండా నగ్న ఫొటోలు అందరికీ పంపుతానని బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రాలోని కోనసీమలో చోటు చేసుకుంది. ఈ కేసును తెలంగాణలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు ఆ రాష్ట్ర పోలీసులు బదిలీ చేశారు. మధురానగర్ పోలీసుల సమాచారం మేరకు.. ఆంధ్రాలోని కోనసీమ జిల్లా గండేపల్లి మండలం పి.వినాయకంపల్లి గ్రామానికి చెందిన జాషువా, ఓ మహిళ, కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన వి.నరసింహమూర్తి పబ్జి గేమ్ ద్వారా స్నేహితులయ్యారు. ఆ మహిళ ఇటీవల తన మేనమామ జాషువాను వివాహం చేసుకుంది. వారి వివాహం తర్వాత నరసింహమూర్తి ఆ మహిళను ప్రేమ పేరుతో సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళ భర్త జాషువా ఆమెతో గొడవపడ్డాడు. దాంతో ఆమె ఉద్యోగం చేసుకుంటానని చెప్పి హైదరాబాద్‌లోని బల్కంపేటలో ఉండే తన స్నేహితురాలు నవ్యను కలిసింది. ఇటీవల నవ్య ద్వారా ఆ మహిళ అడ్రస్‌ను తెలుసుకున్న నర్సింహమూర్తి హైదరాబాద్ వచ్చాడు. ఆమె గదిలోనే రెండు రోజులు గడిపాడు. అనంతరం తన స్నేహితురాలు మంచిది కాదని ఆమెను నమ్మించి అమీర్‌పేటలోని సిద్ధి వినాయక హాస్టల్‌కు తరలించి అక్కడే ఇద్దరూ ఉంటున్నారు. ఈ క్రమంలో నిందితుడు నీ భర్తకు విడాకులిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చదవండి: దంపతుల మధ్య ‘బ్యూటీ పార్లర్’ చిచ్చు.. భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నించి.. జవహర్‌నగర్‌లోని తన మరో గదికి తీసుకెళ్లి కూల్ డ్రింక్‌లో మద్యం కలిపి ఆమె మత్తులో ఉన్నప్పుడు నగ్న ఫొటోలు తీశాడు. తనతో శారీరకంగా కలవకపోతే అందరికీ వాటిని పంపుతానని బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆందోళన చెందిన ఆమె ఆంధ్రాకు వచ్చి నిందితుని స్వగ్రామమైన అంగర గ్రామ బస్టాప్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఆమెను చుట్టుపక్కల వారు, బంధువులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ కేసును నిందితుడు ఉంటున్న హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
చల్లని కూల్‌డ్రింక్.. తాగిన తరువాతే అసలు విషయం!
భద్రాద్రి: ఓ వ్యక్తి కొనుగోలు చేసిన కూల్‌డ్రింక్ సీసాలో పురుగులు కనిపించిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని స్టేషన్ బేతంపూడి గ్రామానికి చెందిన బానోత్ చంద్రు అదే గ్రామంలోని కిరాణా షాపులో ఈనెల 2న 10 కూల్‌డ్రింక్ సీసాలు కొనుగోలు చేశాడు. ముగ్గురు కుటుంబసభ్యులు మూడు సీసాల్లోని శీతల పానీయం తాగగా వారికి వాంతులు అయ్యాయి. మిగిలిన సీసాలను గమనించగా మరో సీసాలో కూడా పురుగులు కనిపించడంతో ఖంగుతిన్నారు. సీసాలో పురుగులు ఉన్నాయని దుకాణ యజమానిని అడగగా అతడు డీలర్ వివరాలు ఇచ్చాడు. దీంతో పాత కొత్తగూడెంలోని గోడౌన్ వద్దకు సదరు సీసాను పట్టుకెళ్లి ఈ విషయాన్ని డీలర్‌కు చెప్పగా.. అతడు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించాడు. సోమవారం సుజాతనగర్లో సదరు వాహనాన్ని గుర్తించి అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే ఇది చదవండి
ఎండవేడి ఇంకా తగ్గడం లేదు. వర్షాకాలం మొదలైనా ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో వేడి తట్టుకోలేక చాలామంది శీతల పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ కూల్‌డ్రింక్స్‌ను ఇష్టపడుతుంటారు. ఇంటికి అతిథులు వచ్చినా, ఏదైనా నాన్‌వెజ్ వంటలు తిన్నా పక్కన కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందే అనేంతలా లాగిస్తుంటారు. అయితే ఇలా కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ► కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు గుర్తించాక నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ► కూల్‌డ్రింక్స్‌లో ఎక్కవ మొత్తంలో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. దీనిల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తాగితే ఊబకాయం సమస్య తలెత్తుతుంది. ► శీతల పానీయాల్లో ఉండే కృత్రిమ చక్కెర, సోడా వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఇప్పటికే గుండె, డయాబెటీస్‌తో బాధపడుతున్నట్లయితే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ► మధుమేహం, గుండె జబ్బులకు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణం. ► కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్పోరిక్ యాసిడ్ వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడతాయి. అలాగే దంతాలపై ఉండే ఎనామిల్ పొర కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ► కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారితీస్తుంది. మొత్తానికి కూల్‌డ్రింక్స్ వల్ల శరీరానికి మంచి కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. -
హబీబ్‌నగర్‌లో దారుణం.. కూల్ డ్రింక్ చోరీ చేశాడని..
సాక్షి, హైదరాబాద్: కూల్ డ్రింక్ దొంగతనం చేశాడంటూ ఓ దుకాణ యజమాని తొమ్మిదేళ్ల బాలుడిని దుస్తులు ఊడదీసి చేతులు, కాళ్లు కట్టేసి చితకబాదడమేగాక ప్రైవేట్ పార్ట్స్ పై కారం చల్లి పైశాచికానందం పొందారు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని వీడియో తీసి బాలుడి తల్లికి పంపించిన సంఘటన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై గాయత్రి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక అఫ్జల్‌సాగర్ కట్ట ప్రధాన రహదారిపై అబ్రహీమ్ జనరల్ అండ్ స్టేషనరీ దుకాణాన్ని అదే ప్రాంతానికి చెందిన కృష్ణ అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. ఖదిరియా మసీదు సమీపంలో ఉండే బాలుడు (9) తరచూ సదరు దుకాణానికి సరుకుల కొనుగోలు నిమిత్తం వచ్చేవాడు. ఈ క్రమంలో ఇటీవల అతను దుకాణంలో కూల్ డ్రింక్ బాటిల్ దొంగలించాడు. దీనిని గుర్తించిన కృష్ణ సోమవారం బాలుడిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి టెర్రస్ పైకి తీసుకువెళ్లి అతడి బట్టలు ఊడదీసి, చేతులు కాళ్లు కట్టేశాడు. ఆపై బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై కారం పొడి చల్లాడు. బాధను భరించలేక బాలుడు కేకలు వేశాడు. అంతేకాకుండా ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసి బాలుడి తల్లికి షేర్ చేశాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తమ బంధువుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న హబీబ్‌నగర్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన బాలుడిని చేరదీసుకుని చికిత్స నిమిత్తం నాంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతడి దాడికి పాల్పడిన కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. దాడి చేసిన విషయం వాస్తవమేనని ఒప్పుకోవడంతో నిందితుడిపై కేసులు నమోదు చేశారు. దుకాణంలో చోరీకి పాల్పడిన బాలుడిని విచారించేందుకు సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. బాలుడిపై దాడి అమానుషం కూల్‌డ్రింక్ చోరీ చేశాడనే నెపంతో ఓ బాలుడి పట్ల దుకాణం యజమాని ప్రవర్తించిన తీరు దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న పిల్లలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే శిక్షాస్మృతిని మార్చాలని కోరారు. చదవండి: ఆన్లైన్ గేమ్ ఆడి.. రూ.95 లక్షలు ఓడి.. -
బిలియన్ డాలర్ బ్రాండ్‌గా స్ప్రైట్
న్యూఢిల్లీ: నిమ్మ రసం రుచిని తలపించే సాఫ్ట్‌డ్రింక్ స్ప్రైట్.. భారత మార్కెట్లో బిలియన్ డాలరు (దాదాపు రూ. 8,300 కోట్లు) బ్రాండుగా ఎదిగింది. బ్రాండ్ మాతృ సంస్థ కోక–కోలా కంపెనీ చైర్మన్ జేమ్స్ క్విన్సీ ఈ విషయం వెల్లడించారు. 2022 మూడో త్రైమాసికంలో భారత మార్కెట్లో అమ్మకాల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ప్రథమార్ధంలో కోక–కోలా మార్కెట్ షేరును పెంచుకోవడం కొనసాగిందని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులకు, సందర్భాలకు అనుగుణంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు, ప్రకటనలతో స్ప్రైట్ బిలియన్ డాలర్ బ్రాండుగా మారిందని క్విన్సీ వివరించారు. కోక–కోలాకు అంతర్జాతీయంగా భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్. దేశీ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ 2021లో బిలియన్ డాలర్ బ్రాండ్‌గా చేరిందని ఈ ఏడాది జనవరిలో కంపెనీ ప్రకటించింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
రికార్డులకు అతుక్కుపోతాడు
పిల్లలను ఆడించడానికి రకరకాల వేషాలేస్తారు పెద్దవాళ్లు. అలా కూల్‌డ్రింక్స్ క్యాన్లను అతికించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడో వ్యక్తి. యూఎస్‌కు చెందిన జామీ కీటన్ది అసాధారణ చర్మం. ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునే లక్షణం ఉన్న జామీ చర్మానికి అతుక్కునే గుణం ఎక్కువ. ఏడేళ్ల వయసులోనే ఇది గుర్తించిన జామీ... బొమ్మలు అతికించుకోవడం మొదలుపెట్టాడు. అల్లరివాడు కాబట్టి ఏ చెట్లెక్కి గమ్ అంటించుకున్నాడోనని అతని తల్లిదండ్రులు తేలికగా తీసుకున్నారు. కానీ ఓసారి గుండు చేసుకుని బేస్‌బాల్ ఆడుతున్న టైమ్‌లో తలకు కూల్‌డ్రింక్ టిన్ అతుక్కుపోయింది. పరుగెత్తినా పడిపోలేదు. అలా తనలోని ప్రత్యేకతను తెలుసుకున్నాడు. 2016లో తలకు 8 క్యాన్లను అతికించుకొని గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత 2019లో జపాన్‌కు చెందిన షునుచి కన్నో తొమ్మిది క్యాన్లతో జామీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు పది క్యాన్లను తలపై అతికించుకొని ఆ రికార్డును దాటేశాడు జామీ. ఖాళీ క్యాన్లను తలపై అతికించుకోవడమే కాదు.. బరువున్న బాటిల్స్‌ను కూడా క్యారీ చేయగలడు. బాటిల్స్‌ను తలకు అతికించుకుని వాటిలోని డ్రింక్‌ను గ్లాస్ల్లోకి ఒంపే టెక్నిక్‌ను నేర్చుకున్నాడు. తనకున్న ప్రత్యేకతనే బిజినెస్‌గా ఎంచుకుని, పలు కంపెనీలకు మార్కెటింగ్ చేస్తూ.. వీకెండ్స్‌లో 10 నుంచి 20వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. ‘సెలబ్రిటీస్‌కు కూడా నేను తెలిసిపోయాను. సాధారణంగా వాళ్లతో ఫొటోలు దిగాలని అందరూ కోరుకుంటారు. కానీ సెలబ్రిటీలే నాతో ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు’అంటున్నాడు జామీ. -
కూల్‌డ్రింక్ తాగిన 18 మంది మహిళా కూలీలకు అస్వస్థత
వేలూరు(చెన్నై): దుకాణంలో శీతల పానియం తాగిన 18 మంది మహిళా కూలీలు అస్వస్థతకు గురై.. ఆరణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని మలయంబట్టు గ్రామానికి చెందిన కుమరేశన్‌కు చెందిన వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన మంజుల, శాంతి, విజయలక్ష్మి తో పాటు మొత్తం 18 మంది మహిళలు వ్యవసాయ పనులకు వచ్చారు. మధ్యాహ్నం ఎండలు తీవ్రం కావడంతో కలంబూరులోని ఓ దుకాణంలో కూల్‌డ్రింక్ తాగారు. వెంటనే 18 మంది వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో స్థానికులు గమనించి మలయంబట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆరణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కలంబూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. 6 నుంచి వీరరాఘవుడి బ్రహ్మోత్సవాలు తిరువళ్లూరు: పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్యవీరరాఘవుడి ఆలయ బ్రహ్మాత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక్కడ ఏటా చైత్రమాసంలో పది రోజుల పాటు ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం 4.45 గంటలకు ధ్వజారోహణం, అనంతరం తంగసభ్రం, తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం సింహవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం గరుడసేవ, సాయంత్రం హానుమంత వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఏడవ రోజు రథోత్సవం, 8వ రోజు అశ్వవాహన సేవ ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం తీర్థవారి, పదో రోజు ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ నిర్వాహకులు వివరించారు. చదవండి: యూపీలో దారుణం.. పోలీస్ స్టేషన్లోనే అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి -
భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు..
సీతానగరం(తూర్పుగోదావరి): గోకవరానికి చెందిన తాతూరి బంగార్రాజు పదేళ్ల కుమారునికి ఎలుకల మందు కలిపిన డ్రింక్ తాగించి, తనూ తాగి శనివారం ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శుభశేఖర్ ఆసుపత్రికి తరలించారు. బంగార్రాజు భార్య కువైట్‌లో ఉంటుండగా, 14 ఏళ్ల కుమార్తె, 12, 10 ఏళ్ల కుమారులు ఉన్నారు. వీరు ముగ్గురు వంగలపూడిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. చదువుల నిమిత్తం హాస్టల్లో చేర్చారు. ఈ నెల 13న సంక్రాంతి సందర్భంగా వంగలపూడిలోని అత్తవారి ఇంటికి బంగార్రాజు వచ్చాడు. భార్యతో అతనికి కుటుంబ కలహాలు ఉన్నాయి. చదవండి: మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల.. ఈ నేపథ్యంలో తన ముగ్గురు పిల్లలతో బంగార్రాజు సీతానగరం కైలాస భూమి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న బంగార్రాజు కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి పదేళ్ల కుమారుడు ప్రజ్వల్‌తో బలవంతంగా తాగించి, తనూ తాగాడు. సమాచారం అందుకున్న ఎస్సై శుభ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురికి సీతానగరం బస్టాండ్ సెంటర్ వద్దగల ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యసేవలు అందించిన అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
కూల్‌డ్రింక్ తాగి మహిళ మృతి
ఆత్మకూర్–ఎస్(సూర్యాపేట): కూల్‌డ్రింక్ తాగిన మహిళ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కాశీగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీగూడెం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్‌బీ(45) వారం రోజుల క్రితం ఉపాధి హామి కూలీ డబ్బులు తీసుకునేందుకు ఏపూరులోని పోస్టాఫీస్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు తన దూరపు చుట్టమైన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బండోని పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా కలిసి కూల్‌డ్రింక్ తాగమని ఇచ్చాడు. కూల్‌డ్రింక్ తాగిన హుస్సేన్‌బీ తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్పటి నుంచి స్థానిక ఆర్ఎంపీ వద్ద చిక్సిత్స పొందుతున్న ఆమెను కుటుంబ సభ్యులు శనివారం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆదివారం మరోసారి అస్వస్థతకు గురై మృతిచెందింది. కూల్‌డ్రింక్‌లో విషం కలపడంతోనే తన తల్లి మృతిచెందిందని మృతురాలి చిన్న కుమారుడు మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లింగం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. -
కోచింగ్ సెంటర్ యజమానిపై కన్నేసిన ప్రొఫెసర్.. ఇంటికి ఆహ్వనించి
జైపూర్: ఉదయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వనించి.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. కాగా, బాధిత యువతి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, తాజాగా (సోమవారం) జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన బాధిత మహిళ స్థానికంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్‌ను నడుపుతుంది. దీంట్లో ఎందరో విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో.. నీరజ్‌కుమార్ అనే వ్యక్తి.. సదరు ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను తీసుకునేవాడు.కాగా, ఇతను ఉదయ్‌పూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేసేవాడు. అయితే, కోచింగ్ సెంటర్ లో క్లాసులు తీసుకోవడం వలన వీరిద్దరికి కొంత పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా నీరజ్ .. కోచింగ్ సెంటర్ యజమానిపై కన్నేశాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను లోంగదీసుకోవాలనుకున్నాడు. అదును కోసం చూడసాగాడు. దీంట్లో భాగంగానే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ యువతిని ఉదయ్‌పూర్‌లోని తన ఇంటికి రావల్సిందిగా ఆహ్వనించాడు. అయితే, బాధిత యువతి తెలిసినవాడే కదా.. అని ఉదయ్‌పూర్ వెళ్లింది. కానీ, ప్రొఫెసర్ మనసులో ఉన్న దుర్భుద్ధిని మాత్రం గుర్తించలేకపోయింది. ఈ క్రమంలో అతగాడు..యువతి.. ఉదయ్‌పూర్ వచ్చాక ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత , ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దాని ప్రభావంతో ఆమె మత్తులోకి జారుకుంది. దీంతో.. అతగాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి మత్తు నుంచి తేరుకున్నాక.. సదరు యువతి ఆందోళనకు లోనైంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నీరజ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న గోడుండా పోలీసులు నీరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కూల్ డ్రింక్ తాగిన మైనర్ బాలిక.. కాసేపటికే నీలిరంగులోకి..
చెన్నై: కూల్‌డ్రింక్ తాగిన ఒక మైనర్ బాలిక.. కాసేపటికే కిందపడిపోయి అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బసంత్‌నగర్ ప్రాంతంలో జరిగింది. కాగా, తరణి, అశ్విని ఇద్దరు అక్కచెల్లెలు. వీరిద్దరు తమ కుటుంబంతో కలిసి బసంత్‌నగర్‌లోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో, 13 ఏళ్ల తరణి గడిచిన మంగళవారం(ఆగస్టు3)న మధ్యాహ్నం తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక షాప్‌కు వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చుకుంది. కాసేపటి తర్వాత.. తరణి కూల్ డ్రింక్ తాగింది. అప్పటి వరకు బాగానే ఉన్న తరణి ఒక్కసారిగా కిందపడిపోయింది. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఎంత కదిలించిన ఉలుకు.. పలుకులేదు. ఈ అనుకొని ఘటనతో అశ్విని షాక్‌కు గురయ్యింది. కాగా, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు, హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. తరణిని పరీక్షీంచిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. యువతి శరీరం కూడా.. నీలిరంగులోకి మారింది. తరణి మృత దేహన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, యువతి ఊపిరితిత్తులలో కూల్ డ్రింక్ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ పానీయంలో.. ఏదైన ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా.. అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం.. ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దుకాణంపై దాడిచేసి.. షాపును సీజ్ చేశారు. అక్కడ ఉన్న 540 కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం లాబ్‌కు తరలించారు. అయితే, ఇప్పటి వరకు ఆ దుకాణంలో 17 కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను అమ్మినట్లు గుర్తించారు. ఆ షాపును అధికారులు సీజ్ చేశారు. కాగా, ధరణి గతంలో అస్తమాతో బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పిల్లకు పాలు.. తల్లికి కూల్ డ్రింక్
రాయవరం: మండే ఎండల్లో ఎవరికైనా దప్పిక వేయడం సహజం. దాహార్తితో అల్లాడుతున్న ఓ వానరానికి ఓ వ్యక్తి గ్లాసులో కూల్‌డ్రింక్ పోసి దాని సమీపంలో ఉంచాడు. ఒక్క ఉదుటున దానిని అందుకున్న ఆ వానరం కూల్‌డ్రింక్‌ను ఆత్రంగా తాగుతూనే.. తన బిడ్డకు చనుబాలు ఇచ్చిన అపురూప దృశ్యాలివి. రాయవరం మండలం మాచవరం గ్రామ సమీపంలో ‘సాక్షి’ కంటపడ్డాయి. గ్లాసులో ఉన్నది ఏమిటబ్బా! తాగి చూస్తే పోలా! అమ్మా.. నాకు ఇవ్వవా మరి..! నువ్వు నా పాలు తాగు.. నేను ఈ డ్రింక్ తాగుతా -
కూల్‌డ్రింక్ ఆర్డర్ చేస్తే.. యూరిన్ బాటిల్ వచ్చింది!
లండన్: చల్లచల్లగా కూల్‌డ్రింక్ తాగుదాం అనుకున్న ఓ వ్యక్తికి ఓ ఫుడ్ డెలివరీ కంపెనీ దిమ్మతిరిగే షాకిచ్చింది. అతడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కూల్‌డ్రింక్ బాటిల్ పంపింది. కానీ అందులో యూరిన్ నింపి ఉంది. ఈ దారుణ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఒలీవర్ మెక్మానస్ లాక్డౌన్లో భోజనం ఆర్డర్ చేశాడు. అందులో కూల్‌డ్రింక్ కూడా ఉంది. అయితే ఆర్డర్ అందుకున్నాక బాటిల్లో ఉన్నది ఏదో తేడాగా కనిపించింది. తీరా అది మనిషి యూరిన్ అని అర్థం కావడంతో అతడికి కడుపులో దేవినట్లైంది. ఆకలితో ఉన్న నాకు ఇలా యూరిన్ బాటిల్ పంపుతారా అని ఆవేశంతో ఊగిపోయాడు. యూరిన్ నింపిన కూల్‌డ్రింక్ బాటిల్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దాన్ని పంపిన హెల్లో ఫ్రెష్ యూకే కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ అడ్రస్ చెప్తే దీన్ని మీకు పంపిస్తానని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఇంకేముందీ అతడి ట్వీట్ కాస్త వైరల్‌గా మారగా ఏం జరిగిందో వివరించి చెప్పండి అంటూ జనాలు అతడి వెంటపడ్డారు. దీంతో ఇదెక్కడి గోలరా నాయనా అనుకున్న మెక్ తెల్లవారేసరికి ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. అయితే అప్పటికే ఈ వార్త దావానంలా వ్యాపించగా మేలుకొన్న హలో ఫ్రెష్ కంపెనీ సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పింది. జరిగిన తప్పిదానికి మీకు ఎలా క్షమాపణలు చెప్పాలో అర్థం కావడం లేదని చింతిస్తూ ట్వీట్ చేసింది. We truly lack the words to describe how sorry we are because of this. Could you please send us a DM so we could deal with this as soon as possible? -Harry — HelloFresh UK (@HelloFreshUK) February 21, 2021 అయితే ఈ బాటిల్‌కు ఆ కంపెనీకి అసలు ఎలాంటి సంబంధమే లేదట. ఆ కంపెనీ కేవలం భోజనం పంపుతుందే తప్పఎటువంటి కూల్‌డ్రింక్స్ పంపదని నెటిజన్లు అంటున్నారు. కాకపోతే డెలివరీ బాయ్ మూత్ర విసర్జన చేసే సమయం లేకపోవడంతో బాటిల్లోనే కానిచ్చేసి ఉంటాడని, ఆ సంగతి మర్చిపోయి ఆ బాటిల్‌ను నేరుగా కస్టమర్‌కు డెలివరీ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మెక్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇది డెలివరీలో జరిగిన పొరపాటు కావచ్చని చెప్పుకొచ్చాడు. చదవండి: భర్త జూమ్ కాల్లో బిజీగా ఉండగా, భార్య ఏం చేసిందంటే.. సెల్ఫీ కోసం బిత్తిరి పని, పోలీసుల ఎంట్రీతో.. -
థమ్సప్‌లో పురుగులు..
తూర్పుగోదావరి, సీతానగరం: మండలంలోని వెదుళ్లపల్లి ఇసుక ర్యాంపు వద్ద గల షేక్ మహ్మద్ నజీమా థమ్స్ అప్ కూల్‌డ్రింక్ తాగి, అపస్మారకస్థితికి చేరుకుని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్న ఘటన ఇది.(చిన్న జీతం.. పెద్ద మనసు) వివరాల్లోకి వెళితే.. శుక్రవారం వెదుళ్లపల్లి ర్యాంపు వద్ద నజీమా చిన్నపాటి టిఫిన్ హోటల్ ఉంది. అందులో అల్పాహారం వండుతూ అలసిపోయిన ఆమె పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాపు నుంచి అరలీటర్లు థమ్స్ అప్ బాటిల్ తెప్పించుకుంది. బాటిల్ అందుకుని కూల్‌డ్రింక్ తాగుతుండగా దుర్వాసన రావడంతో బాటిల్‌ను పరిశీలించింది. అందులో పురుగులు కనిపించాయి. డ్రింక్ తాగిన నజీమాకు వాంతులు మొదలై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను సీతానగరం బస్టాండ్ వద్దగల శ్రీరమా నర్సింగ్ హోమ్‌లో చేర్చగా, వైద్యసేవలు పొందుతోంది. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.(విషం కలిసిన కూల్‌డ్రింక్ తాగిన చిన్నారులు) -
చిన్న జీతం.. పెద్ద మనసు
-
వైరల్ వీడియో: చిన్న జీతం.. పెద్ద మనసు
చిన్న పనిచేసుకుని జీవనం కొనసాగించే ఓ మహిళ తన పెద్ద మనుసును చాటుకుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న పోలీసులకు తన వంతు సహాయాన్ని అందించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తుని పట్టణంలో నివసించే ఓ మహిళ స్థానికంగా పని చేసుకుంటూ జీవనాన్ని కోనసాగిస్తోంది. ఈ క్రమంలో తమ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తన సొంత డబ్బులతో కూల్‌డ్రింక్స్ కొని వారికి అందించింది. రెండు లీటర్ల థమ్సప్, ఫాంటాను తీసుకుచ్చి.. ‘మీరు మాకోసం కష్టపడుతున్నారు. మాకు తోచినంత సాయం చేస్తున్నాం.ఇవి తాగండి’ అంటూ పోలీసులకు కూల్‌డ్రింక్స్ అందించింది. (కరోనా : తండ్రి ప్రేమ.. కొడుకు కోసం స్పెషల్ సూట్ ) మహిళ మాటలు విని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ. మహిళ పేరు, ఏం చేస్తుంటావని అడగ్గా.. దానికి మహిళ స్థానికంగా ఆయాగా పనిచేస్తున్నానని, తన జీతం మూడు వేల అయిదు వందలని చెప్పింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తక్కువ జీతం తీసుకుంటున్నప్పటికీ.. మహిళ చేస్తున్న సాయం గొప్పదని, ఆమెది పెద్ద మనసు అని పోలీసులు మహిళను ప్రశంసించారు. అంతేగాకుండా వారి కోసం తీసుకొచ్చిన కూల్‌డ్రింక్స్‌ను ఇంట్లో వాళ్ల కోసం తీసుకెళ్లామని మహిళకు చెప్పారు. అలాగే రోజు ఒకసారి వచ్చి కనిపించమని, వారికి ధైర్యంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా వీడియోను ట్విటర్లో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘అమ్మ మనసు బంగారం అంటూ.. గొప్ప మానవత్వాన్ని చాటుకుందని’ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ వీడియోపై హీరో మాధవన్ సైతం స్పందించడం విశేషం. (కరోనా కలకలం: క్వారంటైన్లోకి సీఎం ) -
విషం కలిసిన కూల్‌డ్రింక్ తాగిన చిన్నారులు
సాక్షి, బెల్లంపల్లి : పాతకక్షలు పగబట్టాయో..? మరేం జరిగిందో తెలియదుగానీ.. అభంశుభం తెలియని ఓ పసివాడి ప్రాణం మాత్రం గాలిలో కలిసిపోయింది. కూల్‌డ్రింక్ (మజా)లో విషం కలిపిన విషయం తెలియని ఆ ఇద్దరు చిన్నారులు ఆనందంగా తాగి అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే.. పసివాడి ప్రాణం పోయింది. మరొకరు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. తాళ్లగురిజాల ఎస్సై కిరణ్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కపల్లి పంచాయతీ లంబాడితండాకు చెందిన బానోత్ తిరుపతి, రజిత దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు ఐశ్వర్య (7) బెల్లంపల్లిలోని లోటస్ పాఠశాలలో ఒకటో తరగతి, కుమారుడు శివరాంనాయక్ (4) స్థానిక అంగన్వాడీకేంద్రంలో చదువుకుంటున్నాడు. సోమవారం సాయంత్రం తిరుపతి, రజిత పిల్లలతో కలిసి శివారులో ఉన్న పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఐశ్వర్య, శివరాం పొలం గట్లపై ఆడుకుంటున్న సమయంలో వారికి గట్టుపై మాజా కూల్‌డ్రింక్ బాటిల్ కన్పించింది. ఆ బాటిల్ తీసుకుని చిన్నారులిద్దరూ తాగారు. కొద్దిసేపటికి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. తాము తేని కూల్‌డ్రింక్ గట్టుపై ఎలా ఉందని అనుమానించిన ఆ దంపతులు బాటిల్‌తోపాటు పరిసరాలను పరిశీలించగా.. ఆ ప్రాంతంలో మద్యంసీసాలు కనిపించాయి. కూల్‌డ్రింక్ బాటిల్‌ను తీసుకుని పరిశీలించగా క్రిమి సంహారక మందు వాసన వచ్చింది. అందులో విషం కలిపినట్లు అనుమానించేలోపే.. ఆ చిన్నారులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని తిరుపతి బైక్‌పై బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు పంపించారు. కరీంనగర్‌కు తరలిస్తుండగా.. శివరాం పరిస్థితి విషమించి.. పెద్దపల్లి శివారులో చనిపోయాడు. ఐశ్యర్యను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం ఉదయం శివరాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐశ్వర్యను కాపాడుకునేందుకు ఆమె వద్దే ఉన్న ఆ కన్నతల్లి.. తన కుమారుడు శివరాంనాయక్ను కడసారి చూసేందుకు వచ్చి గుండెలవిసేలా రోదించిన తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. కొడుక్కు అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆ తల్లిదండ్రులు శోకాతప్త హృదయాలతో కూతురి వద్దకు పయనమయ్యారు. -
కూల్‌డ్రింగ్ తాగబోయి ...
యశవంతపుర : పర్యటకులు తాగి పడేసిన కూల్‌డ్రింక్ టిన్‌లో తలదూర్చిన పాము చిక్కుకుని విలవిలలాడింది. చివరకు ఓ వ్యక్తి చొరవ తీసుకుని పాముకు స్వేచ్ఛ కల్పించారు. ఈ సంఘటన చిక్కమగళూరు తాలూకా మల్లందూరు గ్రామంలో జరిగింది. రోడ్డు పక్కన మిరిండా ఖాళీ టిన్ ఒక జెర్రిపోతు పాముకు కనపడింది. ఆ పానీయం రుచి చూద్దామని కాబోలు అది టిన్ రంధ్రం గుండా తలను లోపలకు దూర్చింది. అయితే తల తీయడానికి దాని వల్ల కాలేదు. టిన్‌లో చిక్కుకొంది. ఇలా సుమా రు గంట పాటు రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ అందోళన చెందింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకపోయింది. ఈ సమయంలో చిక్కమగళూరు నుంచి మల్లందూరుకు కారులో వెళ్తున్న వన్యప్రాణి ముఖ్యడు శ్రీదేవ్ పట్టుకుని లాగడంతో పాము బయటకు వచ్చింది. హమ్మ య్య అనుకుంటూ చెట్లలోకి వెళ్లిపోయింది. -
మానవ మృగంగా మార్చేసిన వివాహేతర సంబంధం
వివాహేతర సంబంధం ఒక మనిషిని మానవ మృగంగా మార్చేసింది. అభం, శుభం ఎరుగని ఇద్దరు వ్యక్తులు మృతి చెందడానికి కారణమైంది. మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిండ్ర మండలం అగరం పంచాయతీలోని దళితవాడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చిత్తూరు, నిండ్ర: విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగడంతో ఇద్దరు మరణించిన ఉదంతమిది. నిండ్ర సీఐ వెంకటేశులు కథనం..అగరం దళితవాడకు చెందిన గోపి(38), పరిమళ భార్యాభర్తలు. ఇదే గ్రామానికి చెందిన వేలాయుధం(40)తో పరిమళకు వివాహేతర సంబంధం కలిగింది. పరిమళ భర్తతో చనువు పెంచుకున్న వేలాయుధం అతన్ని మద్యం మత్తులో దింపి పరిమళతో సాన్నిహిత్యంగా గడిపేవాడు. కొన్నాళ్లకు దీన్ని పసిగట్టిన గోపి భార్య పరిమళతో గొడవకు దిగాడు. దీంతో పరిమళ తన పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రావాలని పరిమళను వేలాయుధం ఫోన్లో ఒత్తిడి చేయగా తన భర్త గొడవకు దిగుతాడని అతనుండగా తాను రాలేనని తేల్చి చెప్పింది. దీంతో వేలాయుధం గోపిని ఎలాగైనా మట్టుపెట్టాలని నిశ్చయించుకున్నాడు. తన చేతికి మట్టి అంటకుండా దీనికి వ్యూహరచన చేశాడు. దీనికిగాను దళితవాడకు చెందిన గోపి స్నేహితుడు మేఘవర్ణం(35)ను పావుగా వాడుకున్నాడు. రాత్రి పూట గోపి తప్పనిసరిగా మద్యం సేవిస్తాడని తెలిసిన వేలాయుధం కూల్‌డ్రింక్‌లో విషం కలిపి మేఘవర్ణంకు ఇచ్చి మద్యం తాగడానికి వాడుకోండని ఇచ్చి పంపాడు. ఇది తెలియని మేఘవర్ణం తన మిత్రుడు గోపికి కూల్‌డ్రింక్‌ను మద్యంలో కలిపి ఇచ్చాడు. అతను తాగగా మిగిలిన కూల్‌డ్రింక్‌ను విషం అని తెలియకపోవడంతో ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో ఉంచాడు. కాసేపటికే ఫ్రిజ్‌లో కూల్‌డ్రింక్ బాటిల్ చూసిన మేఘవర్ణం భార్య మాధవి(28) తన భర్త కూల్ డ్రింక్ తెచ్చి ఉంచాడని భావించి దానిని తాగింది. విష ప్రభావంతో కొంతసేపటికే కేకలు వేసి స్పృహ కోల్పోయి పడిపోయింది. ఇంటికి వచ్చిన మేఘవర్ణం ఆమెను నగరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. మరోవైపు మంగళవారం రాత్రి 10 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న గోపిని గుర్తించిన స్థానికులు అతను మృతి చెందినట్లు గుర్తించారు. మేఘవర్ణం వెంటనే గోపి ఇంటికి వెళ్లగా అప్పటికే అతను ఇంటిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు నిందితుడు వేలాయుధం అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన మాధవి పిల్లలు , రోదిస్తున్న గోపి భార్యాపిల్లలు మూడు కుటుంబాలు చిన్నాభిన్నం గోపి, మాధవి మృతి చెందడంతో ఆ రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. వేలాయుధం అరెస్టు కావడంతో అతని కుటుంబానిదీ ఇదే పరిస్థితి తప్పలేదు. వివాహేతర సంబంధం మూడు కుటుంబాలను నాశనం చేసిందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం మాధవి మృతి చెందడంతో ఆమె కుమారుడు రవితేజ(13), కుమార్తె భార్గవి(9), గోపి మృతి చెందడంతో అతని కుమార్తెలు శృతి (15), కీర్తన (13)ల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోతే, ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉసురు తీసిన వివాహేతర సంబంధం పుత్తూరు: వివాహేత సంబంధం ఒక మహిళ ఉసురు తీసింది. బుధవారం పుత్తూరు మున్సిపాలిటీలోఇది చోటుచేసుకుంది. సీఐ యల్లమరాజు కథనం.. మున్సిపల్ పరిధిలోని తాయిమాంబాపురం గ్రామానికి చెందిన రామదాసు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈయనకు భార్య మునెమ్మ (30), ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన మహేష్‌తో మునెమ్మకు వివాహేతర సంబంధం ఉంది. మంగళవారం పుత్తూరు పక్కనే ఉన్న కొండలచెరువు గ్రామంలో నిర్వహిస్తున్న జాతరకు మునెమ్మ వెళ్లింది. విషయం తెలుసుకున్న మహేష్ కూడా కొండలచెరువుకు వెళ్లాడు. మంగళవారం రాత్రి గ్రామ పొలిమేర్ల వద్ద వారిద్దరూ గొడవ పడ్డారు. స్థానికులు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించేశారు. తనకున్న వివాహేత సంబంధం అందరికీ తెలిసిపోయిందనే అవమాన భారం భరించలేక మునెమ్మ బుధవారం వేకువజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి పుత్తూరు పోలీసులకు సమాచారం చేరవేశారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
శీతల పానీయాలతో వ్యాధులు..
విజయనగరం ఫోర్ట్ : వేసవితాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది చల్లగా ఉండే శీతలపానీయాలు, చల్లటి పదార్థాలు తీసుకుంటారు. దీని వల్ల వేసవి నుంచి ఉపశమనం పొందలేరు సరికదా మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశ ఉంది. తియ్యగా ఉండే షర్బత్, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, బాదంమిల్క్, లస్సీ వంటివి తీసుకోవడం వల్ల ఆ క్షణానికి చల్లగా ఉంటుందే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనీసం వడదెబ్బ బారి నుంచి కూడా కాపాడలేదు. పైగా చాలామంది ఐస్‌క్రీమ్‌లు, గడ్డ కట్టిన రస్నాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. అటువంటి వాటి వల్ల గొంతు సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్స్తో పాటు టాన్సల్స్ వచ్చే ప్రమాదం ఉంది. తీసుకోవాల్సినవి.. ఉప్పు కలిపిన మజ్జిగ, నీరు, ఉప్పు కలిపిన నిమ్మరసం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకోవాలి. వీటివల్ల వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాధులు వచ్చే అవకాశం.. ఐస్‌క్రీమ్స్, ఇతర శీతల పానీయాల వల్ల గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎండ నుంచి ఉపశమనం పొందాలంటే ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకుంటే మంచిది. వ్యవసాయకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఫుట్‌పాత్ వ్యాపారులు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్ పెనుమత్స రామకృష్ణంరాజు, ఈఎన్టీ వైద్యుడు , కేంద్రాస్పత్రి -
కూల్‌వాటర్‌తో అనారోగ్య సమస్యలు
వేసవి కాలంలో కొద్దిసేపటికే గొంతెండుతూ ఉంటుంది. కాస్త ఎండలో వెళ్లి ఇంటికి వస్తే చాలు.. వెంటనే ఫ్రిజ్ తీసి గటగటమంటూ కూల్ వాటర్ తాగేస్తాం.. అప్పటికి ఉపశమనం కలగడంతో కాస్త సాంత్వన పొందుతాం. కానీ ఈ కూల్ వాటర్‌తో ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ వాటర్ తాగిన వారిలో ఎక్కువ శాతం మంది గొంతు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో కూలింగ్ వాటర్ తాగడం ఫ్యాషన్‌గా కూడా మారిందని, ఇది ఆరోగ్యానికి చేటని స్పష్టం చేస్తున్నారు. గుంటూరు, తాడేపల్లి రూరల్ :రోజుకి కనీసం ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు తాగాలి. శరీరంలోని కాలుష్యాన్ని కడిగేందుకు నీరు ఎంతో ఉపకారం చేస్తుంది. అయితే జాగ్రత్తలు పాటించకుంటే అదే నీరు మన ప్రాణాల మీదకు తెస్తుంది. సమస్యలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా ఫ్రిజ్ వాటర్‌కు ఆమడ దూరంలో ఉండాలి. ఎందుకంటే నేరుగా గొంతుపై దీని ప్రభావం పడుతుంది. గొంతులోని భాగాలు ప్రభావితమైతే గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు ముప్పు తెస్తుంది. గత ఏడాది ఈ సీజన్లో గొంతు వ్యాధులు గణనీయంగా పెరిగాయి. ఇందుకు అతి చల్లని నీరే కారణం. ఈ వ్యాధులకు గురయ్యే వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలుంటున్నారు. ఆస్పత్రులకు వచ్చే ప్రతి నలుగురిలో ముగ్గురు పిల్లలు కూలింగ్ వాటర్ తాగి సమస్యలు కొని తెచ్చుకున్నవారే. వీరంతా 14 ఏళ్లలోపు చిన్నారులే. వీటితోపాటు వేసవిలో వివిధ ఫ్లేవర్లలో లభించే ఐస్‌క్రీమ్‌లు తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గొంతులోని పొరలు చల్లదనం బారిన పడి రోగ నిరోధక శక్తి కోల్పోతాయి. ఈ కారణంగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. గాలిలో ఉన్న రైనో, ఎడినో, ఇన్ఫ్లూయంజాలాంటి బ్యాక్టీరియాలు, వైరస్లు గొంతుపై ప్రభావం చూపిస్తాయి. జ్వరం రావడం, గొంతు మంట, బొంగురు పోవడం, వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. చల్లనినీళ్లు తాగితే దగ్గు కూడా వస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ల కారణంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడి న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. ఒళ్లు, కీళ్ల నొప్పుల సమస్య ఏర్పడుతుంది. గుండె, కిడ్నీలకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉంది. పాటించవలసిన జాగ్రత్తలు కాచి వడపోసిన వేడి నీరు మాత్రమే తాగాలి. ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది తప్పనిసరి. పెరుగు, పండ్లు ఫ్రిజ్‌లో తీసిన వెంటనే కాకుండా కాసేపు ఉంచి గది ఉష్ణోగ్రతకు చేరాక తినాలి. కలుషిత నీటి వల్లే కలరా, టైఫాయిడ్, అతిసార వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతా యి. బయటకు వెళ్లినప్పుడు కూడా వేడి నీటిని తీసుకెళ్లాలి. చిన్న పిల్లలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 నుండి 12 ఏళ్ల చిన్నారుల గొంతుల్లో టాన్సిల్స్, ఎడినాయిడ్ గ్రంథులు అతి త్వరగా ఇన్ఫెక్షన్కు గురవుతుంటాయి. వీరికి చల్లని నీటికి దూరంగా ఉంచాలి. జ్వరం సమయంలో భోజనం చేసేందుకు గొంతు సహకరించదు. దాదాపు 18 డిగ్రీల సెల్సియస్‌కంటే తక్కువ చల్లదనాన్ని గొంతు తట్టుకోవడం కష్టం. ఒక గ్లాస్ చల్లని నీళ్లు తాగగానే గొంతులోని రక్తనాళాలు బాగా బిగుసుకుపోతాయి. కొద్ది సమయానికి గొంతులోని రక్తనాళాలు ఉబ్బి, గొంతు గోడలకుండే పొరలు దెబ్బతింటాయి. గొంతు భాగం నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లే రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగం 20 నుంచి 30 శాతానికి పడిపోతుంది.–రమేష్ నాయక్, తాడేపల్లి ప్రభుత్వ వైద్యాధికారి -
మత్తుమందు కలిపి యువతిపై లైంగికదాడి
నాగోలు: కూల్‌డ్రింక్ లో మత్తు మందు కలిపి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడమేగాక, బ్లాక్ మెయిల్ చేస్తున్న భార్యాభర్తలపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మహిళను అర్టెస్ చేసి రిమాండ్ తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ హస్తినాపురం కాలనీ చెందిన తాళ్లూరి సౌందర్య స్రవంతి, అమె భర్త ప్రవీణ్‌కుమార్‌రాజ్ నగరంలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. 2017 అక్టోబర్‌లో ఓ యువతి వారి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత కొద్ది రోజులకు సదరు యువతిని తన ఇంటికి పిలిపించిన స్రవంతి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి ఆమెపై తన భర్త ప్రవీణ్‌తో లైంగికదాడికి చేయించి వీడియోలు, ఫోటోలు తీసింది. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి ఆమె నుంచి నగదు, నగలు, ప్లాట్ పేపర్లు తీసుకుంది. ఇటీవల బాధితురాలికి పెళ్లి కుదరడంతో పెళ్లి చేసుకోవద్దని, ఇంటిని సైతం తమకు స్వాధీనం చేయాలని ఒత్తిడి చేయడమేగాక బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్రవంతిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. -
శీతలపానీయంలో విషం కలిపి తాగించి..
సాక్షి, వినుకొండ : వినుకొండ మండలం నీలగంగవరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన రసూల్, సలోమి(35) దంపతులు బతుకు దెరువు కోసం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండలం వెల్లటూరు పాలేనికి కొన్నేళ్ల కిందట వలస వెళ్లారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బుధవారం సలోమి తన ఇద్దరు కుమారులైన విలియమ్ కేర్(12), బిలీగ్రామ్(8)లకు శీతలపానీయంలో విషం కలిపి తాగించి, తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, శుక్రవారం మృతదేహాలను స్వగ్రామమైన నీలగంగవరం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సలోమి కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. -
‘పది’ విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ
ముషీరాబాద్: అతనో చిరు వ్యాపారి.. అయితేనేం సేవలో పెద్ద మనసున్న వ్యక్తి. ముషీరాబాద్ ఏక్‌మినార్‌లోని మసీదు ఎదుట ఓ చిన్న కూల్‌డ్రింక్స్ దుకాణం నిర్వహించే షాహెద్ సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాడు. తనకు తోచిన సాయం చేస్తూ గొప్పగా జీవిస్తున్నాడు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం విదితమే. సాయంత్రం 7గంటల వరకు విద్యార్థులు స్కూళ్లోనే ఉండాల్సి రావడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఇది గమనించిన సామాజిక కార్యకర్త మహ్మద్ షాహెద్.. వారి ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నాడు. గత ఐదేళ్లుగా పరీక్షలకు 40 రోజుల ముందు నుంచి ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు (దాదాపు 100 మంది) ప్రతిరోజు స్నాక్స్ అందజేస్తున్నాడు. అరటిపండ్లు , మిక్చర్, జ్యూస్, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్, మ్యాంగో టెట్రా ప్యాకెట్స్ ఇలా ఒక్కో రోజు ఒక్కో రకం అందిస్తున్నాడు. ప్రతిరోజు రూ.2,500 చొప్పున 40 రోజులకు రూ.లక్ష సేవకు వెచ్చిస్తున్నాడు. ‘నాంది’ ఫౌండేషన్‌కు ముందే షాహెద్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. తన షాప్‌లో షాహెద్ సేవానందం... ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఎవరైనా సహాయం కోరితే నాకు తోచిన సహాయం చేయడం బాధ్యతగా భావిస్తాను. నేను పెద్దగా చదువుకోకపోయినా కష్టపడి చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయాలనుకున్నాను. సేవలోనే నాకు ఆనందం ఉంది. నాకు ఎంత ఆదాయం వస్తుందనేది ముఖ్యం కాదు.. నాకున్న దాంట్లో నేనెంత సహాయం చేస్తున్నాననేదే ముఖ్యం. – షాహెద్ -
అయ్యో..ఎంత పని జరిగింది
చిత్తూరు, బుచ్చినాయుడుకండ్రిగ: విషపు గుళికలు కలిపిన కూల్ డ్రింక్ తాగి నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం మండలంలోని పట్టాభి గిరిజన కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పట్టాభి గిరిజన కాలనీ చెందిన ప్రసాద్ కుమార్తెలు అశ్విని (5), అమ్ములు (3), పోలయ్య కుమారుడు ప్రవీణ్ (6), సుబ్బయ్య కుమార్తె లక్ష్మి (3) ఆదివారం కాలనీ సమీపంలోని మామిడితోటలో ఆడుకుంటూ అక్కడ పాతభవనంలో ఎవరో మద్యం సేవించి వదలి వెళ్లిన కూల్‌డ్రింక్‌ను చూశారు. అక్కడే ఉన్న డిస్పోజబుల్ గ్లాసులో పోసుకుని నలుగురు చిన్నారులు తాగేశారు. కాసేపటికి కడుపులో నొప్పిగా ఉందని ఇంటికి వచ్చి అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. 108లో వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇదలా ఉంచితే, మామిడితోటలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి, కూల్‌డ్రింక్ బాటిల్లో విష గుళికలు కలుపుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి, చివరి నిమిషంలో విరమించుకుని, కూల్‌డ్రింక్ బాటిల్ వదలి వెళ్లి ఉంటాడని ఎస్ఐ రామ్మోహన్ అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కూల్ డ్రింక్ అనుకుని.. పురుగుమందు
నెల్లూరు, కలువాయి: కూల్‌డ్రింక్ అని పొరబడి పురుగు మందు తాగి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన కలువాయి మండలం ఉయ్యాలపల్లి పంచాయతీ ఎర్రబల్లిలో విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన శివకృష్ణ, ధనమ్మల మొదటి కుమారుడు కాకుమూరి జగదీష్ (9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. జగదీష్ తండ్రి శివకృష్ణ మంగళవారం ఉయ్యాలపల్లిలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంలో మూగజీవాలకు వాడే క్లాటాక్స్ (సైఫర్మెత్రిన్) పురుగు మందును ఖాళీ స్ప్రైట్ బాటిల్లో తీసుకువచ్చి ఇంటి వరండాలోని ఫ్రిజ్‌పై ఉంచి బయటకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన జగదీష్ ఫ్రిజ్‌పై ఉన్న బాటిల్‌ను చూసి కూల్‌డ్రింక్ అనుకుని తాగాడు. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే కలువాయికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం పొదలకూరుకు తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి మృతితో అతని తల్లిదండ్రులు, బంధువులు గుండెలు అవిసేలా రోదించారు. గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. జగదీష్‌ను కడచూపు చూసి కాలనీ వాసులు బాలుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అందుబాటులోకి రాని 108 వాహనం బాలుడిని చికిత్స నిమిత్తం కలువాయి నుంచి పొదలకూరుకు తరలించేందుకు బాధితులు పలుమార్లు 10 8 వాహనానికి ఫోన్ చేసినా సరిగా స్పందించలే దు. వాహనం రాకపోవడంతో గంట ఆలస్యంగా ప్రై వేట్ వాహనంలో తరలించడంతో అప్పటికే జాప్యం కారణంగా బాలుడు మృతిచెందాడని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈఓ పరామర్శజగదీష్ మృతి నేపథ్యంలో ఎంఈఓ జి.సుధీర్‌బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, సీఆర్పీలు బుధవారం ఉదయం గ్రామానికి వెళ్లి జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగదీష్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
భార్య స్నేహితురాలిని తల్లిని చేసిన కీచకుడు
చెన్నై ,తిరువొత్తియూరు: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి భార్య స్నేహితురాలిపై అత్యాచారం జరిపి తల్లిని చేసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటకు చెందిన సిలంబరసన్ (22). అతనికి కవరపేట, కిలికోడి గ్రామానికి చెందిన షర్మిల అనే యువతితో మూడేళ్ల కిందట వివాహమైంది. దంపతలకు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. వివాహం తరువాత సిలంబరసన్ భార్యతో కలిసి కిలికోడి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య స్నేహితురాలు (24) తరచూ ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్లేవారని తెలిసింది. ఆమెపై కన్నేసిన సిలంబరసన్ భార్య లేని సమయంలో ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి ఆమెను బెదిరించి లొంగదీసుకుని పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. దీంతో గర్భం దాల్చిన బాధితురాలు గత 21వ తేదీన పొన్నేరి ఆస్పత్రిలో మగశిశువును ప్రసవించింది. ఈ క్రమంలో తనను బెదిరించి అత్యాచారం జరిపి తల్లిని చేసిన సిలంబరసన్‌పై బాధితురాలు గుమ్మిడిపూండి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ జయకుమార్ నేతృత్వంలో పోలీసులు ఆదివారం సిలంబరసన్ను అరెస్టు చేశారు. -
కంటి వెలుగు కార్యక్రమంలో అపశ్రుతి
పాల్వంచ : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షల చేయించుకునేందుకు తన రెండేళ్ళ కూతురుని తీసుకుని తల్లి వెళ్లింది. అక్కడ ఓ కూల్ డ్రింక్ సీసాను చూసిన ఆ చిన్నారి, దానిని చేతిలోకి తీసుకుని అందులోని ద్రవాన్ని తాగింది. అందులో ఉన్నది కూల్‌డ్రింక్ కాదు... పురుగు మందు. ఆ తల్లి తెలిపిన వివరాలు.. శుక్రవారం పట్టణంలోని శేఖరం బంజరకు చెందిన బోడ వెంకటేష్ భార్య పద్మ. ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలను చేయించుకునేందుకు రెండేళ్ల కూతురు సహస్త్రను తీసుకెళ్లింది. అక్కడ పెద్ద క్యూ ఉండటంతో నిరీక్షిస్తోంది. ఆమె ఒళ్లో నుంచి ఆ చిన్నారి కిందకు దిగి ఆడుకుంటోంది. పాఠశాల గదిలో ఓ మూలకు కూల్ డ్రింక్ సీసా కనిపించింది. దానిని తీసుకుని, అందులోని ద్రవాన్ని తాగింది. కొద్దిసేపటికే చిన్నారి నోటి నుంచి నురగలు రావడంతో తల్లి కంగారు పడింది. బాటిల్లోని డ్రింక్ తాగిందని ఓ పాప చెప్పింది. అది పురుగు మందుగా గుర్తించిన ఆ తల్లి, వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపపత్రికి తన బిడ్డను తీసుకెళ్లింది. ఆ చిన్నారి కడుపు నుంచి మందును వైద్యులు కక్కించారు. ఆ మందును ఎండ్రోసల్పాన్గా గుర్తించారు. పాఠశాలలోకి పురుగుల మందు ఎలా వచ్చింది..? సీసాలో పెట్టి ఉంచినా ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని తల్లిదండ్రులు వెంకటేష్, పద్మ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవి విచారణ చేపట్టారు. -
కూల్ డ్రింక్ బాటిల్లో బల్లి
విజయవాడ: కూల్ డ్రింక్ బాటిల్లో బల్లి ఆకారం కనిపించడంతో దానికి కొనుగోలు చేసిన వ్యక్తి కలవరపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బందరు రోడ్డులోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కె.పూర్ణేష్బాబు మొగల్రాజపురంలోని రిలయన్స్మార్ట్లో ఇటీవల ఓ కేస్ కూల్‌డ్రింక్ బాటిళ్లను కొనుగోలు చేశారు. శుక్రవారం ఆయన తన ఇంటికి వచ్చిన అతిథులకు కూల్ డ్రింక్ ఇచ్చేందుకు కేస్‌లోంచి ఓ బాటిల్ తీశారు. అందులో బల్లిఆకారంలో ఉన్న పురుగు కనపడింది. డ్రింక్ బాటిల్లో బల్లి ఆకారం ఉండటంతో పూర్ణేష్బాబు రిలయన్స్ మార్ట్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. రిలయన్స్ సిబ్బంది దాన్ని చూసి అది ఫంగస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆహార తనిఖీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితుడు మీడియాకు తెలిపారు. -
స్ప్రైట్ డ్రింక్‌లో కప్ప, పురుగులు
రాయగడ : రాయగడ డైలీమార్కెట్‌లో గల దేవ్బంగళా దుకాణాలలో ఉండే కటక్ పాన్‌షాప్‌లో స్ప్రైట్ కుల్‌డ్రింక్ బాటిల్లో పురుగులు, కప్పలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ స్ప్రైట్ కంపెనీపై, బాటిల్‌ను విక్రయించిన హోల్‌సేల్ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్ప్రైట్ కూల్‌డ్రింక్ పెద్ద బాటిల్ కార్టన్‌ను హోల్‌సేలర్ వద్ద తీసుకుని రిటైల్‌గా విక్రయించేందుకు కటక్ పాన్‌షాప్‌లో ఓపెన్ చేసి ఒక బాటిల్ తీసి చూడగా డ్రింక్‌లో కప్పతో సహా పురుగులు తేలి ఉన్నాయి. దీనికి సంబంధించి పాన్‌షాప్ యజమాని రాజును ప్రశ్నించగా ఈ ఘటనపై తనకేమీ తెలియదని కొత్త కార్టన్ ఓపెన్ చేసి చూడగా పురుగులు ఉన్నాయని దీనిపై హోల్‌సేల్ ఏజెంట్‌కు ఫిర్యాదు చేస్తానని వివరించాడు. వాస్తవంగా కూల్‌డ్రింక్స్ విక్రయాలపై హెల్త్ ఇన్స్పెక్టర్తో సహా ఫుడ్ ఇన్స్పెక్టర్, సివిల్ సప్లయిస్ విభాగం తరచూ దాడులు చేసి తనిఖీ చేయాలని పేరుమోసిన కంపెనీలు ప్రమాదకరమైన డ్రింక్‌లను సరఫరా చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి మహిళపై అత్యాచారం
సేలం: భర్తకు దూరంగా ఉంటున్న మహిళను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, పర్యాటక ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం కలిపిన శీతలపానీయం తాగించి అత్యాచారం చేసిన ముగ్గురు యువకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ధర్మపురి జిల్లా అరూర్ తాలూకా మొరప్పూర్ గ్రామానికి చెందిన మహిళ (25) వివాహిత. భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటోంది. ఆమెకు తండ్రి లేడు, తల్లి మూగ. ఈ స్థితిలో తాత అనారోగ్యం కారణంగా 20 రోజుల కిందట సేలం జీహెచ్‌లో చేరారు. ఆయన కోసం మహిళ ఆస్పత్రికి వెళ్లి వచ్చేది. ఆస్పత్రిలో సేలం సమీపం అలగాపురానికి చెందిన నయీమ్ (25)తో పరిచయం ఏర్పడింది. గత 29న నయీమ్ ఆమెతో ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. తర్వాత ఆమెను సేలం, ఏర్కాడు ప్రాంతాలకు తీసుకెళ్లి చత్తిరంలోని లాడ్జిలో దిగారు. ఆమెకు మద్యం కలిపిన శీతలపానీయాన్ని తాగించి నయీమ్, అతని సోదరుడు నఫీస్ (29), స్నేహితుడు రంజిత్ అత్యాచారం చేశారు. మత్తు నుంచి మేల్కొన్న తర్వాత ఆమెను కత్తితో బెదిరించి మళ్లీ అత్యాచారం చేశారు. ఆమె వద్ద నుంచి ఏటీఎం కార్డు తీసుకుని రూ.30వేలు నగదు డ్రా చేశారు. విషయం బయటకుచెబితే ఆమె తల్లిని హత్య చేస్తామని బెదిరిం చారు. అనంతరం వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు బుధవారం డైఫీ జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు చెప్పింది. ఆయన సహాయంతో గురువారం సేలం కమిషనర్ శంకర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి గురువారం నయీమ్, నఫీస్, రంజిత్‌లను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది. -
చేదెక్కిన తీపి!
ఎండలు మండితే కూల్ డ్రింక్! నలుగురు కలిసినా.. విందువినోదాల్లో సేద తీరాలన్నా ఇదే.. ఊరెళ్లినా పక్కన ఉండాల్సిందే.. మితిమీరిన చక్కెరతో ఒళ్లు హూనమవుతుందని తెలిసినా.. తగ్గని ఈ తీపి అలవాటుకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అమ్మే ప్రతి బాటిల్‌పై ప్రభుత్వాలు పన్నుల కొరడా ఝళిపిస్తున్నాయి. మెక్సికోతో మొదలైన ఈ దాడి యూకేకూ పాకిన నేపథ్యంలో.. మనకు చేటు చేసే చక్కెర సంగతులేమిటో చూసేయండి! ఎంత పన్ను వేస్తున్నారు? ఐదు నుంచి ఎనిమిది శాతం చక్కెర ఉంటే.. లీటర్‌కు 18% 8 శాతం కంటే ఎక్కువ ఉంటే.. లీటర్‌కు 24% కూల్డ్రింక్స్పై షుగర్ ట్యాక్స్ విధించిన దేశాలు 24 తొలి దేశం.. మెక్సికో(2014) అదే బాటలో.. ఫ్రాన్స్, నార్వే, పోర్చుగల్, థాయ్‌లాండ్, స్పెయిన్. ఇదే బాటలో ఐర్లండ్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా. దుష్ప్రభావాలివీ.. షుగర్ అంతా క్యాలరీలతో నిండిపోయి ఉంటుంది. అందులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, శరీరానికి అవసరమయ్యే ఫాట్స్ లాంటివేవీ ఉండవు. అప్పటికప్పుడు శక్తినిచ్చే పదార్థమే. అవసరానికి మించి షుగర్‌ని తీసుకుంటే ఎన్నో వ్యాధుల బారిన పడతాం. అవేంటో ఓసారి చూద్దాం.. ♦ షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల నోట్లో హానికరమైన బ్యాక్టీరియా చేరి దంతాలు పాడైపోతాయి ♦ మన శరీరంలోని ఇన్సులిన్ వ్యవస్థ దెబ్బతిని మధుమేహ వ్యాధి(టైప్ 2) సంక్రమిస్తుంది ♦ మెటబాలిజమ్‌పై ప్రభావం చూపించి అధికంగా బరువు పెరుగుతారు. ఒబెసిటీకి దారి తీయొచ్చు ♦ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధులు రావొచ్చు ♦ బ్రెయిన్లో అధిక మోతాదులో డొపమైన్ విడుదలై పంచదార తినడం అన్నది ఒక వ్యసనంగా మారుతుంది ♦ కాలేయానికి సంబంధించి వ్యాధులు, చివరికి కేన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది చక్కెరపై పరిమితి ఎంత? (ఒక టీ స్పూన్ పంచదార 4.2 గ్రాములతో సమానం) పురుషులు 9 టీ స్పూన్స్ మహిళలు 6 టీ స్పూన్స్ పిల్లలు 3 టీ స్పూన్స్ ఏ డ్రింక్స్‌లో ఎంత షుగర్! సాఫ్ట్ డ్రింక్(600 ఎంఎల్) - 16 టీ స్పూన్స్ స్పోర్ట్స్ డ్రింక్ (600 ఎంఎల్) - 9 టీ స్పూన్స్ ఎనర్జీ డ్రింక్ (250 ఎంఎల్) - 7 టీ స్పూన్స్ -
కోకాకోలా బాటిల్లో చచ్చిన ఎలుక
-
కూల్ డ్రింక్ బాటిల్లో చచ్చిన ఎలుక
అసలే ఎండలు మండిపోతున్నాయి...చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగుదమనుకునే వారు మనలో కోకొల్లలు. వేసవి అనే కాదు ఏ కాలంలో అయిన కూల్ డ్రింక్‌ల వినియోగం ఎక్కువే. వీటి ప్యాకింగ్ సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది కాస్తా వినియోగదారుల ప్రాణాల మీదకు తెస్తుంది. ఇందుకు సంబంధించిన వార్తలను కూడా తరచుగా చూస్తునే ఉంటాము. ఈ మధ్యే కాఫీలో బొద్దింక వచ్చిందనే వార్త చూశాము. ప్రస్తుతం ఈ కోవకు సంబంధించిన ఓ వార్త ఒకటి వైరల్ అయ్యింది. కోక్ బాటిల్ కొన్న వ్యక్తికి దానిలో చచ్చిన ఎలుక వచ్చింది. అర్జెంటీనాకు చెందిన డియాగో పెరియా అనే వ్యక్తి తాను కొన్న కోక్ బాటిల్లో ఏదో ఉన్నట్లు అనిపించింది. అదేంటో తెలుసుకోవడం కోసం బాటిల్లో ఉన్న కోక్‌ను ఒక గ్లాసులోకి పోశాడు. అప్పుడు బాటిల్లో అతడికి చచ్చిన ఎలుక కనిపించింది. ఈ మొత్తం విషయాన్ని అతడు వీడియో తీశాడు. తాను కోక్ బాటిల్లో ఎలుకను చూడటం ఇది రెండోసారి అంటూ సోషలో మీడియాలో పోస్టు చేశాడు. కానీ కంపెనీ మాత్రం ఈ విషయం గురించి ఏమి మాట్లడలేదు. -
విషాదం: కూల్ డ్రింక్ తాగి ఇద్దరు మృతి
సాక్షి, అనంతపురం : అనంతపురంలోని హిందూపురంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో కూల్ డ్రింక్ తాగి ముగ్గురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అస్వస్థతకు గురైన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ప్రశ్నించగా... లైట్‌గా టిఫిన్ చేసి, స్ప్రైట్ (కూల్ డ్రింక్) తాగామని తెలిపాడు. అయితే కూల్ డ్రింక్‌లో కల్తీ మద్యం లేదా విషం కలుపుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులను ప్రదీప్, శివగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కూల్ డ్రింక్ తాగి ముగ్గురు యువకుల అస్వస్థత
-
కూల్‌డ్రింక్‌తో గర్భధారణ సమస్యలు?
చక్కెర అధికంగా ఉన్న కూల్‌డ్రింక్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల మహిళల గర్భధారణ శక్తి తగ్గిపోతుందని బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు అంటున్నారు. మహిళలతో మాత్రమేనా ఈ సమస్య అంటే.. కానేకాదు ఇది మగవాళ్లకూ వర్తిస్తుందని.. రోజుకు ఒక కూల్‌డ్రింక్ తాగినా సరే.. తండ్రి అయ్యే అవకాశాలు తగ్గుతాయని వీరు అంటున్నారు. కాకపోతే ఈ అధ్యయనం అమెరికాలో జరిగింది కాబట్టి.. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన ఫలితాలు ఉంటాయన్న గ్యారెంటీ లేదు. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు 21 – 45 ఏళ్ల మహిళలు, 1045 మంది పురుషులతో మాట్లాడి.. వివరాలు సేకరించారు. ఆరోగ్య వివరాలతోపాటు, జీవనశైలి వివరాలు, ఆహారం, కూల్‌డ్రింక్‌ల వివరాలు కూడా తీసుకున్నారు. ఆ తరువాత మహిళల నుంచి రెండు నెలలకు ఒకసారి కొన్ని వివరాలు సేకరిస్తూ వచ్చారు. గర్భధారణ జరిగేంతవరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. పురుషులు, మహిళలు ఇద్దరి వివరాలు, గర్భధారణ సమయాలను పరిగణలోకి తీసుకున్న తరువాత ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం 20 శాతం వరకూ తగ్గినట్లు స్పష్టమైంది. రోజుకు కనీసం ఒక్క కూల్‌డ్రింక్ తాగిన మహిళల్లో 25 శాతం తగ్గుదల ఉండగా.. పురుషుల్లో ఇది 33 శాతం వరకూ తగ్గినట్లు స్పష్టమైంది. -
ఐస్‌క్రీమ్ తలనొప్పి!
మీరు ఐస్‌క్రీమ్ లాంటి చల్లటి పదార్థం ఏదైనా తినగానే మీకు తలనొప్పి వస్తోందా? లేదా మీరు కూల్‌డ్రింక్స్ తాగగానే హెడేక్ మొదలవుతోందా?వైద్యపరిభాషలో ‘స్ఫినోపాలటైన్ గాంగ్లియోన్యూరాల్జియా’ అనే వ్యాధి వల్ల ఇలా జరుగుతుంది. ఈ జబ్బును వాడుక భాషలో ‘ఐస్‌క్రీమ్ హెడేక్’ అంటారు. కొంతమంది మైగ్రేన్ బాధితుల్లో కూడా ఈ తరహా తలనొప్పి కనిపిస్తుంటుంది. చల్లటి పదార్థం తగలగానే నోటిలోని ఖాళీస్థలాలలోకి తెరచుకునే రక్తనాళాలు సత్వరం సంకోచిస్తాయి. దాంతో ఆ విషయాన్ని మెదడుకు తెలిపేందుకు సంబంధిత నరం ప్రతిస్పందిస్తుంది. అలా నోట్లోని ఇబ్బందికరమైన పరిస్థితి తలకు పాకుతుంది. ఇలా ఒకచోటి సమస్య మరోచోటికి పాకడాన్ని ‘రిఫరింగ్ పెయిన్’ అంటారు.నొప్పి నోటిలోని పై భాగానికి అంటే... అంగిలిలోకి పాకుతుంది. ఇలా పాకడంతో వచ్చే ఈ నొప్పిని కూడా రిఫరింగ్ పెయిన్ అంటారు. ఈ ఐస్‌క్రీమ్ తలనొప్పి లేదా రిఫరింగ్ పెయిన్ నిరపాయకరం. కేవలం 20 సెకండ్ల నుంచి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాస్త గోరు వెచ్చని నీళ్లతో పుక్కిలించగానే ఈ నొప్పి తగ్గిపోతుంది. -
కూల్‌డ్రింక్‌లో పాము పిల్ల ముక్కలు
కొత్తపేట: పాము పిల్ల ముక్కలున్న కూల్‌డ్రింక్ తాగి ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన ఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మేడిద సత్యనారాయణ అనే వ్యక్తి శనివారం తన కుమార్తెను కొత్తపేటలో ఆమె అత్తవారింటిలో దించి తిరిగివెళుతూ స్థానిక కమ్మిరెడ్డిపాలెం సెంటర్లోని ఒక కూల్ డ్రింక్ షాపులో 200 ఎం.ఎల్. థమ్సప్ కూల్‌డ్రింక్ బాటిల్ తీసుకుని తాగుతుండగా చిన్న పాము ముక్కలు నోటికి తగిలాయి. అప్పటికే రెండు ముక్కలు పొట్టలోకి వెళ్లిపోవడంతో వాంతులు చేసుకున్నాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆయన బంధువులకు సమాచారం అందజేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం మండలం బొమ్మూరులోని ఒక షాపులోని థమ్సప్ కూల్‌డ్రింక్‌లో పాము పిల్ల కనిపించిన ఘటన మరిచిపోకముందే శనివారం మరో ఘటన అదే కంపెనీ శీతల పానీయంలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
కూల్‌డ్రింక్‌లో పాము
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం బొమ్మూరు గ్రామంలోని ఓ దుకాణంలో కూల్‌డ్రింక్‌లో మూడు అంగుళాల పాము దర్శనమిచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన బూలా నాగరాజు శుక్రవారం థమ్సప్ కొనుగోలు చేసి తాగుతుండగా అందులో పాము కనిపించింది. అది చూసిన నాగరాజు వెంటనే వాంతులు చేసుకున్నాడు. సదరు కూల్‌డ్రింక్ కంపెనీపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయనున్నట్లు నాగరాజు విలేకరులకు తెలిపాడు. – రాజమహేంద్రవరం రూరల్ -
కూల్ డ్రింక్‌లో 'బ్లేడ్'
సోమందేపల్లి : కూల్ డ్రింక్ బాటిల్లో (స్లైస్) బ్లేడు ప్రత్యక్షమయిన సంఘటన ఆదివారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి ప్రక్కలో ఉన్న ఓ డాబా చోటు చేసుకుంది. నాగినాయనిచెరువుకు చెందిన విజయ్నాయక్తో పాటు మరికొందరు హోటల్లో శీతల పానీయం(కూల్‌డ్రింక్స్) కొనుగోలు చేశారు. వాటిని తాగిన తర్వాత కింది భాగంలో బ్లేడ్‌ను గమనించి వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగారు. కస్టమర్లకు ఈ విధంగా వస్తువులు విక్రయిస్తున్నారా అంటూ నిలదీశారు. కూల్‌డ్రింక్ ఏజెన్సీపై కేసు నమోదు చేయిస్తామని వారు హెచ్చరించి వెళ్లారు. -
25 గ్రాముల చక్కెర చాలు!
అమెరిక : చాక్లెట్లు, కూల్‌డ్రింకులను పిల్లలు ఎడాపెడా లాగించేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు లోపు పిల్లలు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. సర్క్యులేషన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రోజుకు ఆరు టీస్పూన్లు లేదా 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తింటే పిల్లలు, యుక్తవయస్సులో ఉన్న వారికి రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశముందని, గుండెజబ్బుల బారిన పడే ప్రమాదముందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మిర్రమ్ వాస్ అంటున్నారు. చక్కెర పదార్థాలు ఎక్కువగా తినే పిల్లలు ఆరోగ్యకరమైన పండ్లు, కాయగూరలు, హోల్ గ్రెయిన్స్ తక్కువగా తింటారని, ఇది కూడా వారి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుందని పేర్కొన్నారు. పిల్లలు ఎంత మేరకు చక్కెరలు తీసుకోవచ్చు అన్న అంశంపై ఇప్పటివరకూ స్పష్టత లేదని, ఫలితంగా అన్నిరకాల ఆహార పదార్థాల్లో చక్కెరలు చేరిపోతున్నాయన్నారు. అమెరికాలోని పిల్లలు ప్రతిరోజూ మూడు రెట్లు ఎక్కువ చక్కెరలు తింటున్నారని, ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న శాస్త్రీయ పరిశోధనలన్నింటినీ సమీక్షించిన తర్వాత రోజుకు 25 గ్రాములకు మించి చక్కెర తీసుకోవడం మంచిది కాదన్న అంచనాకు తాము వచ్చినట్లు తెలిపారు. అలాగే రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు చక్కెరలు ఇవ్వకపోవడమే మంచిదని సూచించారు. దీనివల్ల వారు చక్కెర రుచికి అలవాటు పడకుండా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు దోహదపడుతుందని చెప్పారు. -
కూల్ యాడ్ కుర్రాడు హాట్
‘నువ్వు ఎప్పుడైనా తెలుగు సినిమా మొదటి రోజు మొదటి ఆట చూశావా.? ఈలలు, కేకలు.. అసలా రుచే వేరు’ అంటూ చురుగ్గా సంభాషణలు చెబుతూ కూల్‌డ్రింక్‌ను స్టైల్‌గా సిప్ చేసే కుర్రాడిని గమనించారా.? టీవీల్లో, ప్రచార హోర్డింగ్‌ల్లో సందడి చేస్తున్న ఆ మోడల్ మన హైదరాబాద్ కుర్రాడే. పెద్ద పెద్ద స్టార్లకు పెద్దపీట వేసే కూల్‌డ్రింక్ యాడ్‌లో అవకాశం దక్కించుకొని అకస్మాత్తుగా స్టార్డమ్ అందుకున్న ఆ కుర్రాడి పేరు సన్నీ నవీన్. ‘స్ప్రైట్’ కూల్‌డ్రింక్ యాడ్‌లో తనకు దక్కిన అవకాశం, భవిష్యత్తు ప్రణాళికల గురించి నవీన్ చెప్పిన సంగతులు అతని మాటల్లోనే.. మాది అనంతపురం. నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్. ఇబ్రహీంపట్నంలోని భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. ఇప్పటి వరకు 15 షార్ట్‌ఫిల్మ్‌లు, కొన్ని మ్యూజిక్ వీడియోల్లో నటించాను. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సినిమా అవకాశాలపై దృష్టి పెట్టాను. అవకాశం వచ్చిందిలా.. నా షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు చూసిన ‘కోకోనట్ ఫిల్మ్స్’ క్యాస్టింగ్ డెరైక్టర్ ప్రవీణ గారు నన్ను కొన్ని బిట్స్ ఆడిషన్స్‌కు పంపించమంటే పంపాను. మూడు రోజుల తరువాత మీరు సెలక్ట్ అయ్యారని ప్రవీణ గారి నుంచి సమాచారం రాగానే ఆశ్చర్యపోయాను. షూటింగ్ ప్రారంభమయ్యే వరకూ కలో నిజమో అర్థం కాలేదు. ఆ సమయంలో టీవీలో వ్యాపార ప్రకటన అంటే ఎంత గొప్ప అవకాశమో నాకు బాగా తెలుసు. దర్శకులు సెంథిల్, నిర్మాత సూర్ ఇద్దరూ కూడా షూటింగ్‌కి ముందే నన్ను పిలిచి నా ఆడిషన్‌ను మెచ్చుకున్నారు. వారి మాటలు నాకు ప్రోత్సాహంతో పాటు, ఎంతో బలాన్ని కూడా ఇచ్చాయి. షూటింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఇది తొలి అడుగు.. నిస్సందేహంగా ఈ యాడ్ ఓ అద్భుతమైన ఛాన్స్. అయితే ఇలాంటి అవకాశాలు రోజూ వచ్చి తలుపు తడుతాయని మాత్రం అనుకోను. మరిన్ని మంచి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. మోడల్‌గా, మంచి నటుడిగా గుర్తింపు పొందాలనే నా కలను సాకారం చేసుకోవడానికి ఇది మొదటి మెట్టుగా భావిస్తున్నాను. ఇష్టమైన నటితో.. షూటింగ్ రోజు వరకు నాతో నటిస్తున్న ఫిమేల్ ఆర్టిస్ట్ ఎవరో నాకు అసలు తెలియదు. బాలీవుడ్ నటి బర్ఖాసింగ్ అని తెలియగానే చెప్పలేని ఆనందం, ఆశ్చర్యం. చిన్నప్పటి నుంచి ఆమె వాణిజ్య ప్రకటనలు చూశాను. నా ఫేవరెట్ నటి ఆమె. బర్ఖాసింగ్తో కలసి నటించడం మరిచిపోలేని అనుభవం. ఇక సెట్లో ఉన్న వారంతా నేనెవరో తెలియకపోయినా నాతో సెల్ఫీలు తీసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. -
ట్యాప్ తిప్పితే కూల్‌డ్రింక్ వస్తుంది!
వేసవిలో ఫ్రిజ్‌లో కూరగాయలు ఉన్నా, లేకున్నా సాఫ్ట్ డ్రింక్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. మామూలుగా అయితే బాటిల్‌ను బయటకు తీసి, డ్రింక్ గ్లాసులో పోసుకొని, మళ్లీ బాటిల్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటాం. అయితే అందరూ కూర్చుని సరదాగా తింటున్నప్పుడే వస్తుంది సమస్య. బాటిల్ బయట ఉంచితే కూలింగ్ పోతుంది. అలా అని ప్రతిసారీ డ్రింకు పోసుకుంటూ ఉండటం కష్టం. చిన్నపిల్లలయితే బాటిల్‌ను తీసి గ్లాసుల్లో పోసుకునే క్రమంలో కింద పారబోస్తుంటారు కూడా. ఇవేవీ జరగకుండా ఉండాలంటే ‘సాఫ్ట్‌డ్రింక్ డిస్పెన్సర్’ ఉండాల్సిందే. డ్రింక్ బాటిల్ మూత తీసి, దాన్ని ఈ డిస్పెన్సర్‌పై తలకిందులుగా పెట్టి ట్యాప్ తిప్పితే చక్కగా డ్రింక్ గ్లాసుల్లో పడుతుంది. ఇంట్లో పార్టీలు, ఫంక్షన్లు జరిగినప్పుడు ఇది బాగా ఉపయోగపడు తుంది. ధర ఆన్లైన్లో రూ.130-250 వరకు ఉంది. షాపుల్లో అయితే మరో రూ.20-30 అదనంగా ఉండొచ్చు. వేరే మోడల్స్ రేటు ఇంకాస్త ఎక్కువే! -
మార్కెట్లోకి కాలిమార్క్ ‘విబ్రో’ బ్రాండ్
కూల్‌డ్రింక్ తయారీ కంపెనీ ‘కాలిమార్క్’ తాజాగా ‘విబ్రో’(పన్నీర్ సోడా) బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చిత్రంలో బ్రాండ్‌ను ఆవి ష్కరిస్తున్న డెరైక్టర్లు కార్తిక్ బాలాజీ, చంద్రశేఖర్, కేపీఆర్ శక్తివేల్, మేనేజింగ్ డెరైక్టర్ కేపీఆర్ ధనుష్కోడి, డెరైక్టర్లు జయేంద్రన్ ధనుష్కోడి, అరుణ్ నాగేశ్వరన్. (ఎడమ నుంచి కుడికి) -
కూల్‌డ్రింక్ అనుకుని..
యలమంచిలి : రోజూలాగే సాయంత్రం పాఠశాల నుంచి ఉత్సాహంగా ఇంటికి వచ్చిన ఐదో తరగతి బాలిక కూల్‌డ్రింక్ అనుకుని పొరబాటు పురుగు మందు తాగడంతో మృత్యువాత పడింది. రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. దిమిలి గ్రామానికి చెందిన మామిడి శ్రీహరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె మామిడి నాగభవాని (10) స్థానికంప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో వ్యవసాయ పనుల నిమిత్తం శ్రీహరి, అతని భార్య పొలం పనులకు వెళ్లారు. సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన భవాని సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఆకలి తీర్చుకునేందుకు కూల్‌డ్రింక్ అనుకుని పురుగుమందును పొరబాటున తాగింది. కొద్దిసేపటికే బాలిక నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు తండ్రికి సమాచారం అందించారు. ఆమెను హుటాహుటిన స్థానిక 30 పడకల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆలస్యం కావడంతో బాలిక పరిస్థితి పూర్తిగా విషమించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు, సిబ్బంది లాభంలేదని మెరుగైన చికిత్స కోసం విశాఖకు తీసుకెళ్లాల్సిందిగా చెప్పడంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తండ్రి భుజాలపై వేసుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేసరికి బాలిక మృతి చెందింది. తండ్రి శ్రీహరి కన్నీరుమున్నీరుగా విలపించడం కంట తడిపెట్టించింది. బరువెక్కిన హృదయంతో బాలిక మృతదేహాన్ని తండ్రి ఇంటికి తీసుకెళ్లడంతో బాలిక తల్లి, సోదరి, సోదరుడితో పాటు బంధువులు తీవ్రంగా రోదించారు. -
లారీతో పరార్..ఆపై పోలీసుల కస్టడీకి
హైదరాబాద్: డ్రైవర్‌ను గాయపరిచి లారీని తీసుకెళ్లిన మహ్మద్ అలీఖాన్ అనే వ్యక్తిని గురువారం పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇవి... ఫిబ్రవరి 1న విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్‌కు స్క్రాప్ తరలిస్తున్న లారీ అనకాపల్లి చేరుకున్నప్పుడు మహ్మద్ అలీ ఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్లేందుకు ఎక్కాడు. లారీ సూర్యాపేట చేరుకున్న తర్వాత డ్రైవర్, క్లీనర్లకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు. డ్రింక్ తాగిన డ్రైవర్‌కు నిద్ర రావడంతో లారీని రోడ్దు పక్కన ఆపేశాడు. లారీ దొంగిలించేందుకు ఇదే అదునుగా భావించిన అలీఖాన్, తాను కూడా లారీ డ్రైవర్‌ను అయినందున హైదరాబాద్‌కు వరకు డ్రైవ్ చేస్తానని చెప్పాడు. లారీని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. తుకారం గేట్ సమీపంలోకి వచ్చిన తర్వాత టైర్ పంక్చర్ అయిందని చెప్పి క్లీనర్‌ను దింపేశాడు. తర్వాత లారీతో ఉడాయించాడు. మత్తులో ఉన్న డ్రైవర్‌ను బండరాయితో మోది గాయపరిచి రోడ్డు పక్కన పడేసి వెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. 2014లో ఇదే తరహా దొంగతనానికి పాల్పడిన కేసులో నిందితుడి నుంచి రూ. 2.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బడ్జెట్ఎవరికి లాభం ?
ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల ఎవరికి లాభం అంటే.. కచ్చితంగా ఉత్పత్తిదారులకే. దీనివల్ల వినియోగదారులకు సమకూరే ప్రయోజనం స్వల్పమే. దీనికితోడు రవాణా చార్జీలు పెరిగాయి. డీజిల్ ధరలు తగ్గనంటున్నాయి. దీనివల్ల బడ్జెట్ ప్రకారం కొన్ని రకాల ఉత్పత్తుల ధరలు తగ్గినా ట్రాన్స్‌పోర్టు చార్జీలు కలిపితే మరింత ప్రియమయ్యే ప్రమాదం నెలకొంది. కొత్త బడ్జెట్ విధానాన్ని స్పష్టం చేయాలంటే మరికొంత కాలం ఆగాలని వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ‘చల్లదనం’ ఇక వేడెక్కుతుంది కూల్డ్రింక్లంటే పిల్లల నుంచి పెద్దలదాకా ఇష్టపడాల్సిందే. ఎండాకాలంలో అయితే వాటికి యమ డిమాండ్ ఉంటుంది. అయితే కొత్త బడ్జెట్ ప్రకారం వాటి ధరలు పెరగనుండటంతో శీతల పానీయాల ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు సరాసరిన రూ.10 లక్షల వ్యాపారం జరుగుతుంది. ఎండాకాలంలో అయితే సుమారు 15 లక్షల వరకు, మిగిలిన సమయంలో రూ. 7 నుంచి రూ. 8 లక్షల వరకు అమ్మకాలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూల్డ్రింక్స్పై ఎక్సైజ్ సుంకం 5 శాతం పెరగనుంది. 200 ఎంఎల్ బాటిల్ ధర 10కు విక్రయించాల్సి ఉన్నా.. మార్కెట్లో రూ. 13వరకు విక్రయిస్తున్నారు. ఇక ఎక్సైజ్ ట్యాక్స్ పెరిగితే ఈ బాటిల్‌కు మరో రూపాయి పెరుగుతుంది. అంటే వ్యాపారులు కచ్చితంగా రూ. 15కు విక్రయిస్తారు. ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే రోజుకు లక్ష రూపాయల దాకా వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇదే జరిగితే వ్యాపారం తగ్గుముఖం పడుతుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరికే పాద‘రక్షలు’ నూతన బడ్జెట్లో పాద రక్షల ధరలు దిగివచ్చేలా చర్యలు తీసుకున్నా.. అది కొంతమందికే ఉపయోగపడనుంది. వీటిపై ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. అయితే ఇక్కడే మెలిక ఉంది. రూ. 500 నుంచి వెయ్యి రూపాయల్లోపు ఉండే పాదరక్షలకే ఈ సుంకం తగ్గింపు వర్తిస్తుంది. జిల్లాలో పరిశీలిస్తే దాదాపు 60 శాతం మార్కెట్ రూ. 500 లోపు కొనుగోలు చేసేవారిదే. ఇక మిగిలిన 40 శాతం మందిలో కూడా దాదాపు 30 శాతం మంది మాత్ర మే బ్రాండెడ్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రముఖ కంపెనీల ఉత్పత్తులన్నీ వెయ్యి రూపాయల పైగానే ఉంటాయి. అంటే సెమీ బ్రాండ్ల ఉత్పత్తులు కొనేవారే తాజా సవరణల వల్ల లబ్ధిపొందుతారన్నమాట. ఇలాంటివారు జిల్లాలో పదిశాతం మందే ఉన్నట్లు అంచనా. దీనివల్ల పేద , మధ్య తరగతివారికి ఒరిగిందేమీలేదు. ‘పోర్టబుల్’ మేజిక్ పని చేసేనా? పోర్టబుల్ టీవీల సైజు 14 అంగుళాలుంటుంది. అయితే పోర్టబుల్ టీవీల కొనుగోళ్లు జిల్లాలో పదిశాతానికి మించి లేదు. మధ్యతరగతివారు ఎక్కువగా ఫ్లాట్ టీవీలు కొనుగోలు చేస్తుంటారు. ఇవి, 20 లేదా 21 అంగుళాల నుంచి అందుబాటులో ఉంటాయి. ఎల్సీడీలు అయితే 23 అంగుళాల నుంచి ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి.. 19 అంగుళాల్లోపు ఉండే కలర్ టీవీలకు మాత్రమే 10 శాతం కస్టమ్స్ సుంకం మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇంత తక్కువ సైజు టీవీల కొనుగోలుకు మెజారిటీ ప్రజలు అనుకూలంగా ఉండరు. దీనివల్ల తక్కువమంది మాత్రమే ప్రయోజనం పొందగలరు. అదే సమయంలో సుంకం నుంచి మినహాయింపు వచ్చింది కాబట్టి 19 అంగుళాల సైజులో ఉండే టీవీలు త్వరలో మార్కెట్లోకి భారీగా వచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల ఒక్కో టీవీకి 500 రూపాయల దాకా తగ్గుతుంది. అయితే తక్కువ సైజులో ఉంటే టీవీలను ఎంతమంది ఇష్టపడతారో చూడాలి. కలర్ పిక్చర్ ట్యూబులపై కూడా పన్ను మినహాయింపు ఇచ్చినందువల్ల కలర్ టీవీ ధర కూడా 200 రూపాయల దాకా తగ్గే అవకాశాలున్నాయి. పొగ ఊదితే జేబుకూ చిల్లు.. జిల్లాలో పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారికి కొదువే లేదు. మొత్తం మీద 33.97 లక్షల మంది జనాభా ఉండగా వారిలో ఏకంగా 5 నుంచి 6 లక్షల మంది దాకా ధూమపానం లేదా పాన్ మసాలా ఉత్పత్తులు తీసుకుంటారు. వీరి ద్వారా రోజుకు 3 కోట్ల రూపాయల కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే బడ్జెట్ ప్రకారం పొగాకు ఉత్పత్తుల ధరలు 25 శాతం మేర పెరగనున్నాయి. అంటే జిల్లాలో రోజుకు వ్యాపారం 4 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. అయితే ఈ ధరల దెబ్బకు కొంతమేర వినియోగదారుల సంఖ్య తగ్గినా.. అది తాత్కాలికమే అని భావిస్తున్నారు. -
చిన్నారులపై విష ప్రయోగం ?
-
మరదలిపై అత్యాచారం.. వీడియో నెట్లో పెట్టి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మరదలు వరసయ్యే మహిళపై లైంగికదాడికి పాల్పడిన ఓ కీచకుడు.. వీడియో తీసి నెట్లో పెట్టి బెదిరించిన ఉదంతం హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకొచ్చింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు భర్తతో కలసి మంగళవారం రాత్రి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లికి చెందిన ఓ వ్యక్తికి వరుసకు సోదరుడైన అంజద్ మదీనా సర్కిల్లో అఫ్జల్స్ సూట్స్ అండ్ శారీస్ దుకాణం నడుపుతున్నాడు. దుస్తులు కొనుగోలు కోసం 2010లో ఈ దుకాణానికి వచ్చిన బాధితురాలికి అంజద్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. ఆమె స్పృహతప్పడంతో వీడియో చిత్రీకరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో ఇన్నాళ్లూ బాధితురాలు నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే తాజాగా వీడియో క్లిప్పింగ్‌లు నెట్లో హల్చల్ చేయడంతో కంగుతిన్న భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.