మరదలిపై అత్యాచారం.. వీడియో నెట్‌లో పెట్టి బెదిరింపులు | woman Raped, Black mailed with video clip | Sakshi
Sakshi News home page

మరదలిపై అత్యాచారం.. వీడియో నెట్‌లో పెట్టి బెదిరింపులు

Published Thu, Aug 29 2013 1:36 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

woman Raped, Black mailed with video clip

సాక్షి, హైదరాబాద్:  కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మరదలు వరసయ్యే మహిళపై లైంగికదాడికి పాల్పడిన ఓ కీచకుడు.. వీడియో తీసి నెట్‌లో పెట్టి బెదిరించిన ఉదంతం హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకొచ్చింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు భర్తతో కలసి మంగళవారం రాత్రి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లికి చెందిన ఓ వ్యక్తికి వరుసకు సోదరుడైన అంజద్ మదీనా సర్కిల్‌లో అఫ్జల్స్ సూట్స్ అండ్ శారీస్ దుకాణం నడుపుతున్నాడు.

 

దుస్తులు కొనుగోలు కోసం 2010లో ఈ దుకాణానికి వచ్చిన బాధితురాలికి అంజద్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. ఆమె స్పృహతప్పడంతో వీడియో చిత్రీకరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో ఇన్నాళ్లూ బాధితురాలు నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే తాజాగా వీడియో క్లిప్పింగ్‌లు నెట్‌లో హల్‌చల్ చేయడంతో కంగుతిన్న భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement