morphine
-
నవ వధువుపై గ్యాంగ్‌రేప్
కురుక్షేత్ర: ఓ నవవధువుకు మత్తుమందు ఇచ్చిన అత్తారింటివారు.. ఆమెపై ఓ తాంత్రికుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ‘మీ కుమార్తె మానసికస్థితి సరిగ్గా లేదు’ అంటూ అమ్మాయి తండ్రికి సమాచారం అందించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హరియాణాలోని యమునానగర్ జిల్లాలో చోటుచేసుకుంది. యమునానగర్ పట్టణంలో ఉంటున్న ఓ యువకుడికి కురుక్షేత్రకు చెందిన యువతితో ఈ నెల 12న వివాహమైంది. ఆమె అత్తారింటిలో అడుగుపెట్టగానే ఓ తాంత్రికుడిని కుటుంబ సభ్యులు రప్పించారు. అనంతరం యువతిచేత ఓ ద్రవాన్ని తాగించారు. ఆమె స్పృహ కోల్పోగానే భర్త అన్నయ్యతో పాటు ఆడపడుచు భర్త అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించిన తాంత్రికుడు.. కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె దుస్తులను తగలబెట్టారు. తనపై జరిగిన దారుణాన్ని కుమార్తె తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఈ కుట్రలో పెళ్లికుమారుడి తల్లి, చెల్లెలు కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తొలుత జీరో ఎఫ్ఐఆర్(బదిలీ చేయగలిగే ఎఫ్ఐఆర్)ను నమోదుచేసిన కురుక్షేత్ర పోలీసులు.. యమునానగర్ పోలీస్‌స్టేషన్‌కు దాన్ని బదిలీచేశారు. -
దుష్ప్రభావాల్లేని ‘నొప్పి’ మాత్రలు
బెర్లిన్: నొప్పినివారణ మాత్రల తయారీలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఎటువంటి ప్రమాదకర దుష్ప్రభావాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసే నొప్పి నివారణ మాత్రల తయారీకి కొత్త పద్ధతిని జర్మనీ శాస్త్రవేత్తలు రూపొందించారు. బెర్లిన్ లోని చారెట్ మెడిసిన్ వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ నూతన పద్ధతిలో జంతువులకు మార్ఫిన్ లాంటి మత్తుమందును ఇచ్చినప్పుడు వాటిలోని దెబ్బతిన్న కణాలపై ఇది సమర్థవంతంగా పనిచేసిందని తెలిపారు. అదే సమయంలో ఇతర ఆరోగ్యకర కణజాలంపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని వెల్లడించారు. ఓపియోడ్ నొప్పి నివారణ మాత్రలను సర్జరీలు, నరాలు దెబ్బతిన్నప్పుడు, కీళ్లనొప్పులు, కేన్సర్ వంటి సందర్భాల్లో ఉపయోగిస్తారని, దీని వల్ల నిద్రమత్తు, వికారం, మలబద్ధకం, శ్వాస నిలిచిపోవడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. -
భార్య.. తల్లి.. ఓ వ్యక్తి
గ్యాంగ్‌గా ఏర్పాటు ‘మత్తుమందు’ దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు పరారీలో తల్లి, భార్య సొత్తు స్వాధీనం చేసున్న పోలీసులు కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ మేడ్చల్: ఇంట్లో అద్దెకు దిగి యజమాని కుటుంబీకులకు మత్తు మందు ఇచ్చి దోపిడీలకు పాల్పడే గ్యాంగ్‌లో ఇద్దరు సభ్యులను మేడ్చల్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పేట్‌బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ మేడ్చల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్ల డించారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తన్నపల్లి మండలం బృగుబండ గ్రామానికి చెందిన గుంజి వెంకటేష్ అలియాస్ శ్రీను (25)తన భార్య దివ్య(22), తల్లి తిరుపతమ్మ(65) తదితరులు నల్లగొండ జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన దేవునూరి బాలయ్య(45)తో కలిసి ఓ గ్యాంగ్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. బాలయ్య వీరికి అద్దెకు గదులు చూస్తుండేవాడు. అందులో వెంకటేష్ కుటుంబీకులతో కలిసి దిగేవాడు. ఇంటి యజమాని, కుటుంబీకులకు అన్నం, కూర, కల్లు తదితర వాటిల్లో ఏదో ఒకదాంట్లో మత్తు పదార్థాలు కలిపి వారు అపస్మారకస్థితిలోకి వెళ్లగానే ఇంట్లోని సొత్తును అపహరించుకుపోయేవారు. ఈక్రమంలో గత నెల మండలంలోని పూడూర్ గ్రామానికి చెందిన తోకల రాము ఇంట్లో అద్దెకు దిగారు. 27వ తేదీన ఇంట్లో ఉన్న యజమాని రాములమ్మ, ఆమె కోడలు నీరజకు కాకరకాయ కూరలో మత్తు మందు కలిపి ఇచ్చారు. వారు అది తిన్న తర్వాత అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఇంట్లో ఉన్న 9 తులాల బంగారు నగలను దోచుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో పోలీసులు బుధవారం ఉదయం శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ వద్ద వెంకటేష్, బాలయ్యను అరెస్ట్ చేయగా తిరుపతమ్మ, దివ్య పరారీలో ఉన్నారు. మెదక్ జిల్లా జిన్నారం మండలం గుమ్మడిదల లో ఇదేవిధంగా వీరు ఇంటి యజమానికి కల్లులో మత్తుమందు కలిపి ఇచ్చి ఓ బంగారు మంగళసూత్రంతోపాటు ఓ బైక్‌ను అపహరించారు. ఈ చోరీ గత నెల 17న చేశారని ఏసీపీ వివరించారు. అయితే, వెంకటేష్‌పై సత్తన్నపల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు ఉందని తెలిపారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్ బృందాన్ని ఈసందర్భంగా ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో పోలీసులు 9 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. -
ఎనిమిదేళ్ల నుంచి ఆమెపై అత్యాచారం...
పహడీషరీఫ్: ఎనిమిదేళ్లుగా ఓ వివాహితను బలవంతంగా లోబర్చుకుంటున్నాడో కీచకుడు. కీచకుని చెరలో బంధీలా తనంతో మనోవేదనకు గురైన మహిళ.. ఈ విషయం బయటకు చెబితే తన భర్తను చంపేస్తానని బెదిరించడంతో నోరు విప్పలేదు. చివరికి కీచకుడి వ్యవహారం తన భర్తకు తెలియడంతో అసలు విషయాన్ని రోదిస్తూ చెప్పింది. ఈ సంఘటన పహడీషరీఫ్ పోలీస్‌ష్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రకుంట జమ్జమ్ కాలనీకి చెందిన 28 ఏళ్ల గృహిణీని సాదత్‌నగర్‌కు చెందిన అహ్మద్ జాసిన్ లతీఫ్ ఖాన్ (26) ఎనిమిదేళ్ల క్రితం మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ భర్తను చంపుతానంటూ బెదిరించాడు. అప్పటి నుంచి లతీఫ్ ఖాన్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే జల్పల్లిలో ఒక గది తీసుకొని ఏడాది పాటు ఆమెతో ఉన్నాడు. ఇటీవల ఈ విషయం భర్తకు తెలియడంతో పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా నిందితుడు పలుమార్లు తన వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. -
హౌరా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్చల్
శ్రీకాకుళం: హౌరా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ ఫస్ట్‌క్లాస్ బోగీలో గురువారం దొంగలు హల్చల్ సృష్టించారు. రైల్లో ప్రయాణిస్తున్న శ్రీకిషన్ సింగ్, రాజ్ కుమారి దంపతులకు మత్తుమందు ఇచ్చి బంగారు నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. దాంతో తోటి ప్రయాణికులు పలాస రైల్వేస్టేషన్లో రైల్వేసిబ్బందికి బాధితులను అప్పగించారు. దంపతులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. -
మత్తుమందు ఇచ్చి గోల్డ్ వర్క్ షాపును దోచేశాడు...
సిద్దిపేట రూరల్(మెదక్): నగల దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి ఆ దుకాణం యాజమానికి మత్తుమందు దిచ్చి దోచుకుపోయాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలోని పటేల్పురాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు...సిద్దిపేట మండలంలోని పొన్నాల గ్రామానికి చెందిన ఉప్పల వీర బ్రహ్మాచారి పట్టణంలోని పటేల్ పురాలో గోల్డ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గ్రామం నుంచి షాపుకు వచ్చాడు. బ్రహ్మాచారి షాపులో ఉండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఉంగరం చేయాలంటూ మాటలు కలిపాడు. నమ్మకంగా దగ్గరికి వచ్చి అతని ముక్కు వద్ద కర్చీఫ్ వాసన చూపాడు. మత్తు ఆవరించటంతో వీరబ్రహ్మాచారి స్పృహ కోల్పోయాడు. ఈ క్రమంలో ఆగంతకుడు అక్కడున్న ఐదు తులాల బంగారు నగలు తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత పక్క దుకాణం యజమానులు వచ్చి బ్రహ్మాచారిని నిద్ర లేపారు. జరిగిన విషయంపై బాధితుడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. -
లిఫ్టిచ్చి దోచేశాడు!
శంషాబాద్:లిఫ్టిస్తానని ఓ మహిళను కారులో ఎక్కించుకున్న దుండగుడు మత్తుమందు చల్లి ఒంటిమీదున్న నాలుగు తులాల బంగారం దోచుకెళ్లాడు. శంషాబాద్ మండల పరిధిలోని ఆర్జీఐఏ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. డీఐ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న మండలంలోని తొండుపల్లికి చెందిన లక్ష్మి(35) శంషాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌కు వచ్చింది. కూరగాయలు తీసుకున్న అనంతరం మార్కెట్ బయట నిల్చుంది. ఓ తెలుపురంగు కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి తొండుపల్లిలో దింపుతానని నమ్మబలికి వాహనంలో ఎక్కించుకున్నాడు. అనంతరం దుండగుడు ఆమెపై మత్తు మందు చల్లడంతో స్పృహ కోల్పోయింది. కారులో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తిప్పిన దుండగుడు చెవి కమ్మలు, పుస్తెలతాడు తీసుకొని తొండుపల్లి వద్ద వదిలేసి వెళ్లాడు. మహిళ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో శనివారం రాత్రి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. -
మరదలిపై అత్యాచారం.. వీడియో నెట్లో పెట్టి బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి మరదలు వరసయ్యే మహిళపై లైంగికదాడికి పాల్పడిన ఓ కీచకుడు.. వీడియో తీసి నెట్లో పెట్టి బెదిరించిన ఉదంతం హైదరాబాద్‌లో తాజాగా వెలుగులోకొచ్చింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు భర్తతో కలసి మంగళవారం రాత్రి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లికి చెందిన ఓ వ్యక్తికి వరుసకు సోదరుడైన అంజద్ మదీనా సర్కిల్లో అఫ్జల్స్ సూట్స్ అండ్ శారీస్ దుకాణం నడుపుతున్నాడు. దుస్తులు కొనుగోలు కోసం 2010లో ఈ దుకాణానికి వచ్చిన బాధితురాలికి అంజద్ మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. ఆమె స్పృహతప్పడంతో వీడియో చిత్రీకరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో ఇన్నాళ్లూ బాధితురాలు నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే తాజాగా వీడియో క్లిప్పింగ్‌లు నెట్లో హల్చల్ చేయడంతో కంగుతిన్న భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.