దుష్ప్రభావాల్లేని ‘నొప్పి’ మాత్రలు
బెర్లిన్: నొప్పినివారణ మాత్రల తయారీలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఎటువంటి ప్రమాదకర దుష్ప్రభావాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసే నొప్పి నివారణ మాత్రల తయారీకి కొత్త పద్ధతిని జర్మనీ శాస్త్రవేత్తలు రూపొందించారు. బెర్లిన్ లోని చారెట్ మెడిసిన్ వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
ఈ నూతన పద్ధతిలో జంతువులకు మార్ఫిన్ లాంటి మత్తుమందును ఇచ్చినప్పుడు వాటిలోని దెబ్బతిన్న కణాలపై ఇది సమర్థవంతంగా పనిచేసిందని తెలిపారు. అదే సమయంలో ఇతర ఆరోగ్యకర కణజాలంపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని వెల్లడించారు. ఓపియోడ్ నొప్పి నివారణ మాత్రలను సర్జరీలు, నరాలు దెబ్బతిన్నప్పుడు, కీళ్లనొప్పులు, కేన్సర్ వంటి సందర్భాల్లో ఉపయోగిస్తారని, దీని వల్ల నిద్రమత్తు, వికారం, మలబద్ధకం, శ్వాస నిలిచిపోవడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి.