బ్రిటన్లో కలకలం రేపుతున్న అంశం
సుప్రీంకోర్టుకు వివాదం, త్వరలో తీర్పు
మహిళ అంటే ఎవరు? ఒక వ్యక్తి స్త్రీ అని నిర్ధారించేందుకు ప్రాతిపదిక ఏమిటి? జన్మతః సంక్రమించిన లైంగికత మాత్రమేనా? లింగ మార్పిడితో మహిళగా మారిన వాళ్లు కూడా ‘స్త్రీ’అనే నిర్వచనం కిందకు వస్తారా? తద్వారా మహిళలకు వర్తించే హక్కులన్నీ వారికీ వర్తిస్తాయా? అత్యంత సంక్లిష్టమైన ఈ అంశాలను తేల్చాల్సిన బాధ్యత బ్రిటన్ సుప్రీంకోర్టుపై పడింది. అతి వివాదాస్పదమైన ఈ అంశంపై జోరుగా కోర్టులో వాద వివాదాలు జరుగుతున్నాయి.
ఒకరకంగా ‘మహిళ వర్సెస్ మహిళ’అని చెప్పదగ్గ న్యాయపోరాటం జరుగుతోంది. స్త్రీగా గుర్తింపు సర్టిఫికెట్ ఉన్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని సమానత్వ చట్టాల ప్రకారం మహిళగా పరిగణించవచ్చా, లేదా అన్నది ఈ కేసు. బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు దీనిపై మంగళవారం లోతైన వాదనలు సాగాయి. అవి బుధవారమూ కొనసాగాయి. ఇక న్యాయమూర్తులు తీర్పు వెలువరించడమే మిగిలింది. అందుకు రెండు వారాలు పట్టవచ్చు. రాబోయే తీర్పు బ్రిటన్‌తో పాటు ప్రపంచమంతటా లింగమార్పిడి ద్వారా మహిళలుగా మారిన వారి గుర్తింపును, హక్కులు తదితరాలపై ఎంతగానో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
ఏమిటీ కేసు?
నిజానికి మహిళా హక్కుల ఉద్యమకారులకు, స్కాట్రండ్ ప్రభుత్వానికి దీర్ఘకాలంగా సాగుతున్న వివాదమిది. స్కాట్లాండ్ ప్రభుత్వ రంగ సంస్థళ బోర్డుల్లో 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా 2018లో అక్కడి ట్లాండ్ పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. లింగమారి్పడి ద్వారా మహిళలుగా మారిన వారిని కూడా ఈ చట్టం ప్రకారం ‘స్త్రీ’నిర్వచన పరిధిలో చేర్చారు. దీన్ని స్కాటిష్ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇలా ‘మహిళ’ను పునరి్నర్వచించే అధికారం పార్లమెంటుకు లేదన్నది వారి వాదన. ‘‘ఈ చట్టం అమలైతే బోర్డుల్లో 50 శాతం మంది పురుషులతో పాటు మిగతా 50 శాతం కూడా మహిళలుగా మారిన పురుషులే ఉంటారు. అది మహిళా ప్రాతినిధ్య లక్ష్యాలకే గొడ్డలిపెట్టు’’అని ‘ఫర్ విమెన్ స్కాట్లాండ్’(ఎఫ్‌డబ్ల్యూఎస్) అనే మహిళ స్వచ్ఛంద సంస్థ అంటోంది. అంతిమంగా ఇది మహిళల రక్షణకూ విఘాతమమేనన్ని వాదిస్తోంది. ఈ చట్టాన్ని స్కాట్లాండ్ కోర్టులో సవాలు చేయగా చుక్కెదురైంది. ఈ కేసును కోర్టు తిరస్కరించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడానికి గతేడాది అనుమతించింది. అలా బంతి బ్రిటన్ సుప్రీంకోర్టు వద్దకు చేరింది.
ట్రాన్స్‌జెండర్ల హక్కులకు విఘాతం: ఆమ్నెస్టీ
సమానత్వ చట్టం ప్రకారం లైంగికత తల్లి గర్భంలోనే నిర్ణయమవుతుందని ఎఫ్‌డబ్ల్యూఎస్ తరపు న్యాయవాది అంటున్నారు. పుట్టిన అనంతరం దాన్ని మార్చడం సాధ్యం కాదని వాదిస్తున్నారు. దీనితో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా పలు మానవహక్కుల సంఘాలు విభేదిస్తున్నాయి. ‘‘జెండర్ అనేది శారీరక వ్యక్తీకరణ. లింగ గుర్తింపు సరి్టఫికెటున్న ట్రాన్స్‌జెండర్లకు మహిళల హక్కులను నిషేధించడం మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధం’’అని అవి అంటున్నారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని బ్రిటన్ సుప్రీంకోర్టును ఆమ్నెస్టీ లిఖితపూర్వకంగా కోరింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment