ట్రాన్స్‌జెండర్‌లను మన సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను ఆదరించి, అక్కున చేర్చుకోవడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడరు. శారీరకంగా వచ్చే మార్పులని సైన్స్ చెబుతున్నా..విద్యావంతులు సైతం వాళ్లను సాటి మనుషులుగా గుర్తించరు. ఎన్నో వేధింపులు, అవమానాలు దాటుకుని కొందరూ మాత్రమే పైకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తమలాంటి వాళ్లు వేధింపులకు గురికాకుండా తలెత్తుకుని బతకాలని పాటుపడుతున్నారు. అలాంటి కోవకు చెందిందే రితుపర్ణ నియోగ్. ఎవరీ నియోగ్? ఏం చేస్తోందంటే..
అస్సాంకి చెందిన రితుపర్ణ నియోగ్ చిన్నతనంలో ఎన్నో బెరింపులు, వేధింపులకు గురయ్యింది. తన బాల్యంకి సంబంధించిన పాఠశాల జ్ఞాపకాలన్నీ చేదు అనుభవాలే. కొద్దిలో రితుపర్ణకు ఉన్న అదృష్టం ఏంటంటే..కుటుంబం మద్దతు. తన కుటుంబ సహాయ సహకారాల వల్ల ఇంట్లో ఎలాంటి వేధింపులు లేకపోయినా..బయట మాత్రం తన తోటి స్నేహితుల నుంచే విపరీతమైన వేధింపులు ఎదుర్కొంది రితుపర్ణ. కొన్నాళ్లు ఇంటికే పరిమితమై లింగ గుర్తింపు విషయమై క్వీర్ ఫోబియాను పేర్కొంది. ఇక్కడ క్వీర్ అంటే..క్వీర్ అనేది లైంగిక, లింగ గుర్తింపులను వివరించే పదం. లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి వ్యక్తులు అందరూ క్వీర్ అనే పదంతో గుర్తిస్తారు. వారు ఎదుర్కొనే సమస్యల కారణంగా భయాందోళనకు లోనై బయటకు తిరిగేందుకే జంకితే దాన్ని క్వీర్ ఫోబియా అంటారు.
తనలా అలాంటి సమస్యతో మరెవ్వరూ ఇంటికే పరిమితం కాకుండా ఉండలే చేసేందుకు నడుంబిగించింది రితుపర్ణ. దానికి ఒక్కటి మార్గం పుస్తకాలను ప్రగాఢంగా నమ్మింది. వారు బాగా చదువుకుంటే తమ హక్కులు గురించి తెలుసుకోగలుగుతారు, ఇలా భయంతో బిక్కుబిక్కుమని కాలం గడపరనేది రితుపర్ణ నమ్మకం. తాను కూడా ఆ టైంలో ఎదురయ్యే అవమానాలను ఎలాఫేస్ చేయాలనేది తెలియక సతమతమయ్యి ఆ క్రమంలోనే నాలుగు గోడలకు పరిమితమైనట్లు చెప్పుకొచ్చింది రితుపర్ణ. చివరికి ఏదోలా బయటపడి..ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకొచ్చింది. 2015లో గౌహతిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చదవు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపింది.
అప్పుడే తన గ్రామం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎంత వెనుకబడి ఉందనేది తెలుసుకుంది. ట్రాన్స్ జెండర్‌గా తాను మాత్రం ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నాని గ్రహించి..తనలాంటి వాళ్ల అభ్యన్నతికి పాటుపడాలని లక్ష్యం ఏర్పరుచుకుంది. ఆ నేఫథ్యంలో 2020లో తనలాంటి పిల్లల కోసం 'కితాపే కథా కోయి' అనే హైబ్రిడ్ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ఉచిత కమ్యూనిటీ లైబ్రరీలతో గ్రామంలోని పిల్లలు టీ ఎస్టేట్‌లోకి వెళ్లకుండా ఉండేలా చేసింది. వాళ్లు ఆ లైబ్రరీలో హిందీ, అస్సామీ, ఆంగ్లం వంటి పుస్తకాలను చదివేందుకు సహకరిస్తుంది రితుపర్ణ.
తన గ్రామంలోని ప్రజలతో తన ఆలోచనను పంచుకోవడమే గాక, ఆచరణలోకి తీసుకొచ్చింది. మొదటగా తన స్వంత పుస్తకాలతో ఉచిత లైబ్రరీ తెరిచింది. అలా వందలాది పుసక్తాలతో కూడిన పెద్ద లైబ్రరీగా రూపాంతరం చెందింది. ఆ లైబ్రరీలో.. లింగం, లైంగికత, మానసిక ఆరోగ్యం, వాతావరణ న్యాయం, సామర్థ్యం, స్త్రీవాదం, మైనారిటీ హక్కులు వంటి వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. రీతుపర్ణ ఇటీవల అస్సాం ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ కౌన్సిల్‌కు సభ్య ప్రతినిధిగా నామినేట్ అయ్యారు.
(చదవండి: అత్యంత లగ్జరియస్ వివాహం..ఒక్కో అతిథికి ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment