మనకు తెలిసినంత వరకు అత్యంత విలాసవంతంగా పెళ్లిళ్లు చేసేది రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ కుటుంబమే. బాలీవుడ్, హాలీవుడ్ అతిరథులతో మ్యూజికల్ షో పెట్టించి మరీ కళ్లు చెదిరేలా వైభోవోపేతంగా చేస్తారు. ఇటీవల జరిగిన చిన్న కుమారుడు అనంత్-రాధిక ఫ్రీ వెడ్డింగ్ వేడుకలే అందుకు నిదర్శనం. ఏకంగా రెండు ప్రీ వెడ్డింగ్ వేడుకలను అత్యంత విలాసవంతంగా, ప్రముఖులే నోరెళ్లబెట్టే రేంజ్‌లో అత్యంత లగ్జరియస్‌గా చేశారు. ఆ విలాసవంతమైన పెళ్లినే తలదన్నేలా చైనాలో జరిగిన అత్యంత లగ్జరియస్ వివాహ తంతు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పెళ్లి తంతు విశేషాలు వింటే వామ్మో..అని అంటారు.
ఎలా చేశారంటే..సినిమాల్లో చూపించే తరహాలో ఈ వివాహ తంతు ఉంది. ప్రతిదీ లగ్జరియస్‌గా ఉంది. ఎక్కడా..?తగ్గేదేలే..అంతకు మించి అన్న రేంజ్‌లో వివాహ తంతు ప్రతి ఒక్క ఘట్టం అత్యంత విలాసవంతంగా చేశారు. రియల్ లైఫ్‌లో క్రేజీ రిచ్ ఏషియన్ వెడ్డింగ్ ఇలా ఉంటుందా..? అనేలా ఘనంగా చేశారు ఈ పెళ్లిని . అంతేగాదు ఆ పెళ్లికి వచ్చిన అతిధులకు అంత తేలిగ్గా మర్చిపోలేని మధురానుభూతిని అందించేలా ఘనంగా చేసుకున్నారు ఆ చైనా జంట.
ఏకంగా ఐదురోజుల పాటు ఫైవ్ స్టార్ హోటల్లో అతిధులు బస చేసేలా ఏర్పాట్లు చేశారు. అలాగే రవాణ కోసం రోల్స్ రాయిస్ కార్లు, బెంట్లీలు వంటి వాటిని వినియోగించారు. వివాహ అలంకరణ సైతం ఆశ్చర్యచకితులను చేసే రేంజ్‌లో ఉంది. నిజానికి చైనా సంప్రదాయం ప్రకారం..అతిధులు పెళ్లి కానుకలు కింద వధువరులకు ఎరుపు పాకెట్స్‌లో డబ్బుని గిఫ్ట్‌గా ఇస్తారు. అయితే ఆ సంప్రదాయన్ని తిప్పికొట్టి..ఆ జంటే తమ పెళ్లికి అతిథులుగా వచ్చిన వారికి ఎరుపు రంగు పాకెట్స్‌లో ఏకంగా రూ. 66వేలు రిటర్న్ గిఫ్ట్‌లందివ్వడం అత్యంత హైలెట్‌గా నిలిచింది.
అంతేగాదు వచ్చిన అతిధులు ఆనందంగా తిరిగి పయనమయ్యేలా విమానాలను కూడా బుక్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ జంట అతిధుల పట్ల కనబర్చిన ఔదార్యాన్ని మెచ్చుకోగా, మరికొందరూ అతిధుల ప్రయాణ ఖర్చులు భరించనప్పుడూ అందులో ప్రేమ ఆప్యాయత ఏముంది అని ప్రశ్నిస్తూ..కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు
Comments
Please login to add a commentAdd a comment