Asian
-
జిమ్నాస్టిక్స్‌లో వెలిగిన దీపం
ఆరేళ్ల వయసులోనే ఆ అమ్మాయి జిమ్నాస్టిక్స్ వైపు ఆకర్షితురాలైంది. అయితే ఆమె పాదం కింది భాగం చూస్తే సమతలంగా ఉంది. ఈ ఆటకు ఇలాంటి పాదం పనికి రాదని, జంప్ చేసే సమయంలో ఇబ్బంది కలుగుతుందని స్థానిక కోచ్‌లు చెప్పేశారు. కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్‌గా ఉన్న బిశ్వేశ్వర్ నంది మాత్రం ఆ అమ్మాయిలో చురుకుదనాన్ని గుర్తించాడు. తాను ఆమె లోపాన్ని ఎలాగైనా సరిదిద్ది మరీ ఆటలో తీర్చిదిద్దుతానని ఆమె తండ్రికి మాటిచ్చాడు. అక్కడి నుంచి మొదలైన ఆ చిన్నారి ప్రస్థానం ఆపై భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలిచే వరకు సాగింది. ఆ అమ్మాయే దీపా కర్మాకర్. 16 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప.. ఎన్నో అరుదైన రికార్డులను, గతంలో ఎవరికీ సాధ్యం కాని మరెన్నో ఘనతలను నమోదు చేసింది.ఓడినా విజేతగా నిలిచి..ప్రొడునోవా వాల్ట్.. జిమ్నాస్టిక్స్‌లో అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన ఈవెంట్. ప్రపంచ జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఐదుగురు మాత్రమే ఈ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగారు. వారిలో దీప కూడా ఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఈ విన్యాసాన్ని చేసి చూపించింది. తన సత్తాను చాటింది. అప్పటి వరకు మన దేశం నుంచి.. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో ఎవరూ కనీసం అర్హత కూడా సాధించలేకపోయారు. అది దీపకు మాత్రమే సాధ్యమైంది. ఆపై ఫైనల్‌కు కూడా చేరిన ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. కానీ దురదృష్టవశాత్తు 0.15 పాయింట్ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. అయితేనేమి.. ఆమె ఘనతను అందరూ గుర్తించారు. అందుకే పతకాలు గెలుచుకున్నవారితో సమానంగా ఆమెకూ అభినందనలు, ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభించాయి. ఒలింపిక్ పతకం గెలవకపోయినా ఆటలో తన 17 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలంతో దీప కన్నీళ్లపర్యంతమైంది. ఈ క్రమంలో సహజంగానే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ.. దీపను వరించాయి. జాతీయ స్థాయిలో..త్రిపుర రాజధాని అగర్తలా దీప స్వస్థలం. తండ్రి ప్రోత్సాహంతో ఆటల వైపు ఆసక్తి చూపించిన ఆమె బిశ్వేశ్వర్ నంది అండగా నిలవడంతో పూర్తి స్థాయిలో జిమ్నాస్టిక్స్‌పై దృష్టి సారించింది. కఠోర శ్రమ, ప్రాక్టీస్ తర్వాత తన సమతల పాదం లోపాన్నీ అధిగమించిన దీపకు ఆపై ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. స్థానికంగా చిన్న చిన్న టోర్నీల్లో విజయాలు సాధించిన తర్వాత 15 ఏళ్ల వయసులో దీప పేరు తొలిసారి పెద్ద స్థాయికి చేరింది. బెంగాల్‌లోని జల్పాయీగుడీలో జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె తన సాధనకు మరింత పదును పెట్టింది. ఫలితంగా సీనియర్ టీమ్‌లోకి పిలుపు వచ్చింది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో దీపకు చోటు దక్కింది. అయితే పోటీల్లో పాల్గొనే అవకాశం మాత్రం రాలేదు. కానీ తర్వాతి ఏడాది జాతీయ క్రీడల్లో త్రిపుర తరఫున పాల్గొని అందుబాటులో ఉన్న నాలుగు స్వర్ణాలనూ దీప గెలుచుకోవడం విశేషం. విమర్శలను దాటి..అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి దీప ఏం చేసినా అది భారత్ తరఫున మొదటి ఘనతగానే నమోదైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన దీప ఈ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. తర్వాతి ఏడాదే ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ ఐదో స్థానం సాధించింది. ఇదే ఆమెను రియో ఒలింపిక్స్ దిశగా తీసుకెళ్లింది. ‘నా గురించి విమర్శలు వచ్చిన ప్రతిసారి వారికి నా ఆటతోనే సమాధానం ఇచ్చాను. 2014లో ప్రొడునోవా మొదలుపెట్టినప్పుడు నన్ను బఫెలో అంటూ చాలా మంది ఆట పట్టించారు. వెంటనే కామన్వెల్త్ పతకం సాధించి చూపించాను. వయసు అయిపోయింది, ఆటలో దమ్ము లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చూపించాను. ఇలాంటి ముగింపు ఇవ్వాలనే ఇంతకాలం ఆగాను. ఇప్పుడు సంతృప్తిగా ఉంది’ అంటూ దీప తన రిటైర్మెంట్ సమయంలో వెల్లడించింది. వండర్‌ఫుల్‌గా ముగించి..తన ఆత్మకథ స్మాల్ వండర్‌లో ఆమె తన కెరీర్‌లోని పలు మలుపుల గురించి చెప్పుకుంది. రియో ఒలింపిక్స్ తర్వాత ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ హోదా వచ్చినా ఆ తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వరుస గాయాలతో ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. పైగా పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి మద్దతు దక్కకపోవడంతో ట్రయల్స్‌లో అగ్ర స్థానంలో నిలిచినా పలు సాకులు వెతికి ఆమెను ఆసియా క్రీడలకు పంపకుండా ఫెడరేషన్ నిలిపివేసింది. ఇలాంటి కఠిన సమయాల్లో తాను మానసికంగా మరింత దృఢంగా తయారైంది. విరామం తర్వాత 2018లో రెండు పెద్ద విజయాలతో ఆమె తన సత్తా చాటింది. రెండు వరల్డ్ కప్‌లలో వరుసగా స్వర్ణం, కాంస్యం గెలిచి ఘనంగా పునరాగమనం చేసింది. ఆస్తమా, దగ్గు కోసం వాడే హైజినమైన్ మందును అనుకోకుండా తీసుకొని నిషేధానికి గురైనప్పుడు ఆమెకు ఎక్కడా కనీస మద్దతు లభించలేదు. ఈ ఘటన తర్వాత మళ్లీ తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదల ఆమెలో కనిపించింది. 30 ఏళ్లు దాటినా.. అదే జిమ్నాస్టిక్స్ బార్‌పై తీవ్రంగా సాధన చేసింది. 2024 మేలో తాష్కెంట్లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ బరిలోకి దిగి స్వర్ణ పతకంతో మెరిసి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఈ టోర్నీకి ముందు ‘నేను ఇంకా బతికే ఉన్నానని చాటాలనిపించింది. అందుకే పోటీ పడుతున్నా’ అని భావోద్వేగంతో చెప్పిన దీప సగర్వంగా తన కెరీర్‌ను ముగించి భవిష్యత్ తరాలకు జిమ్నాస్టిక్స్‌లో వెలుగుల దారి చూపించింది. -
దేవుడా..!ఇదేం పిచ్చి..చర్మ సంరక్షణ కోసం..ఏకంగా పక్షి లాలాజలంతో..!
ఇటీవల గ్లామరస్‌గా ఉండటంపై వ్యామోహం మాములుగా లేదు. ఇదివరకు ఎవరో అక్కడక్కడ అందంపై శ్రద్ధ పెట్టేవారు. అందుకోసమని మరి ఇంతలా ప్రయాస పడేవారు కాదు. కానీ ఇప్పుడూ అందం అనేది అతిపెద్ద స్టేటస్. అందుకోసం ఎంత డబ్బులైనా వెచ్చిచ్చేందుకు వెనకాడటం లేదు. ముఖ్యంగా ఎలాంటి వెర్రిపనులు చేసేందుకైనా సై అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా విచిత్రమైన సౌందర్య సాధానాలు వస్తున్నాయి. అలాంటి బ్యూటీ ప్రొడక్టే ఈ ఆసియా పక్షి లాలాజల సూప్. అసలు ఏంటిది? పక్షి లాలాజలంతో సూప్ ఎలా చేస్తారు? మంచిదేనా..?దీన్ని "బర్డ్స్ నెస్ట్ సూప్" అని కూడా అంటారు. చైనా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో చేస్తారు. గట్టిపడిన పక్షి ఉమ్మి గూళ్లతో తయారు చేస్తారు. ఇది వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. పైగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీన్ని ఈస్ట్ కేవియర్ అని కూడా పిలుస్తారు. ఎలా తయారు చేస్తారంటే..ఇది స్విఫ్ట్లెట్స్ అనే పక్షి జాతికి చెందిన తినదగిన గూడు. ఈ పక్షి ఎక్కువగా ఆగ్నేయా తూర్పు ఆసియాలోనే కనిపిస్తుంది. ఈ స్విఫ్ట్లెట్స్ పక్షులు తమ లాలాజలంతో గూళ్లను తయారు చేస్తాయి. ఇవి గూళ్లను తయారు చేసేందుకు కొమ్మలు, ఈకలను వినియోగించదు. వీటిని మార్కెట్లో విక్రయిస్తారు. ఆ గూళ్లు ఎరుపు, తెలుపు, బంగారు వర్ణంలో ఉంటాయి. ప్రతిఒక్క గూడుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలుగా బాగా విశ్వస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా..! అని చర్మ సంరక్షణకు సంబంధించిన పక్షి ఉమ్మి గూడు సూప్ గురించి అందరికీ తెలిసింది. అయితే దీన్ని కొనుగోలు చేయడం అందరివల్ల కాదు. ఎందుకంటే..? 500 గ్రాములే ఏకంగా రూ. 1,60,000/- పలుకుతుంది. ఈ లాలాజల పక్షి గూళ్లతో తయారు చేసిన కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. యూఎస్‌లో దీనికి సంబంధించిన గోల్లెన్ నెస్ట్ అనే షాపును 1996లో ఏర్పాటయ్యింది కూడా. ఇక్కడ ఈ పక్షి గూడును ప్రధాన పదార్ధంగా చేసే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.ప్రయోజనాలు..పోషకాలు సమృద్ధిగా ఉంటాయిఅమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయికణాల పునరుత్పత్తికి, మరమత్తుకు మంచిదిరోగనిరోదక వ్యవస్థను పెంచుతుంది. అంటువ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుందికొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని చైనా ప్రజల నమ్మకం. నిజానికి ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారం ఈ పక్షి గూడు యవ్వన రూపాన్ని ఇస్తుందనేది ప్రజల నమ్మకం మాత్రమేనని తేల్చి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే..పక్షి లాలాజల ప్రోటీన్లు లేదా గూడు కలుషితమైతే అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉండవచ్చు.హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్ పద్ధతుల రీత్యా పక్షి గూడుని పరిశుభ్రంగా నిర్వహించకపోతే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వంటి కలుషితాలను కలిగి ఉండవచ్చు.ఆ గూళ్లను నిర్మించుకునే వాతావరణాన్ని బట్టి భారీ లోహాలతో కలుషితం అయ్యే ప్రమాదం కూడా ఉంది. View this post on Instagram A post shared by Golden Nest Inc (@goldennestusa) (చదవండి: ప్రపంచంలోనే తొలి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్ఫ్లుయెన్సర్..!) -
అత్యంత లగ్జరియస్ వివాహం..ఒక్కో అతిథికి ఏకంగా..!
మనకు తెలిసినంత వరకు అత్యంత విలాసవంతంగా పెళ్లిళ్లు చేసేది రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ కుటుంబమే. బాలీవుడ్, హాలీవుడ్ అతిరథులతో మ్యూజికల్ షో పెట్టించి మరీ కళ్లు చెదిరేలా వైభోవోపేతంగా చేస్తారు. ఇటీవల జరిగిన చిన్న కుమారుడు అనంత్-రాధిక ఫ్రీ వెడ్డింగ్ వేడుకలే అందుకు నిదర్శనం. ఏకంగా రెండు ప్రీ వెడ్డింగ్ వేడుకలను అత్యంత విలాసవంతంగా, ప్రముఖులే నోరెళ్లబెట్టే రేంజ్లో అత్యంత లగ్జరియస్‌గా చేశారు. ఆ విలాసవంతమైన పెళ్లినే తలదన్నేలా చైనాలో జరిగిన అత్యంత లగ్జరియస్ వివాహ తంతు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పెళ్లి తంతు విశేషాలు వింటే వామ్మో..అని అంటారు.ఎలా చేశారంటే..సినిమాల్లో చూపించే తరహాలో ఈ వివాహ తంతు ఉంది. ప్రతిదీ లగ్జరియస్‌గా ఉంది. ఎక్కడా..?తగ్గేదేలే..అంతకు మించి అన్న రేంజ్లో వివాహ తంతు ప్రతి ఒక్క ఘట్టం అత్యంత విలాసవంతంగా చేశారు. రియల్ లైఫ్‌లో క్రేజీ రిచ్ ఏషియన్ వెడ్డింగ్ ఇలా ఉంటుందా..? అనేలా ఘనంగా చేశారు ఈ పెళ్లిని . అంతేగాదు ఆ పెళ్లికి వచ్చిన అతిధులకు అంత తేలిగ్గా మర్చిపోలేని మధురానుభూతిని అందించేలా ఘనంగా చేసుకున్నారు ఆ చైనా జంట. ఏకంగా ఐదురోజుల పాటు ఫైవ్ స్టార్ హోటల్లో అతిధులు బస చేసేలా ఏర్పాట్లు చేశారు. అలాగే రవాణ కోసం రోల్స్ రాయిస్ కార్లు, బెంట్లీలు వంటి వాటిని వినియోగించారు. వివాహ అలంకరణ సైతం ఆశ్చర్యచకితులను చేసే రేంజ్లో ఉంది. నిజానికి చైనా సంప్రదాయం ప్రకారం..అతిధులు పెళ్లి కానుకలు కింద వధువరులకు ఎరుపు పాకెట్స్‌లో డబ్బుని గిఫ్ట్‌గా ఇస్తారు. అయితే ఆ సంప్రదాయన్ని తిప్పికొట్టి..ఆ జంటే తమ పెళ్లికి అతిథులుగా వచ్చిన వారికి ఎరుపు రంగు పాకెట్స్‌లో ఏకంగా రూ. 66వేలు రిటర్న్ గిఫ్ట్లందివ్వడం అత్యంత హైలెట్‌గా నిలిచింది. అంతేగాదు వచ్చిన అతిధులు ఆనందంగా తిరిగి పయనమయ్యేలా విమానాలను కూడా బుక్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ జంట అతిధుల పట్ల కనబర్చిన ఔదార్యాన్ని మెచ్చుకోగా, మరికొందరూ అతిధుల ప్రయాణ ఖర్చులు భరించనప్పుడూ అందులో ప్రేమ ఆప్యాయత ఏముంది అని ప్రశ్నిస్తూ..కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు View this post on Instagram A post shared by Dana Wang | Solo & Adventure Travel (@bydanawang)(చదవండి: తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!) -
నవ్వు... భయం
తమన్నా, సుందర్ సి, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాక్’. సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్, తెలుగులో ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివానీ పాత్రలో తమన్నా, శివ శంకర్‌గా సుందర్ సి. నటించారు. వారి పాత్రలను పరిచయం చేస్తూ లుక్స్ రిలీజ్ చేశారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బాక్’’ అన్నారు మేకర్స్. -
ఆర్సి పురం పటాన్చెరులో ఆసియా వైష్ణవి మల్టీప్లెక్స్ లాంచ్ చేసిన హీరో
-
ఇషా డబుల్ ధమాకా
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో తొలి రోజు భారత షూటర్లు అదరగొట్టారు. నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలు గెల్చుకున్నారు. అంతేకాకుండా రెండు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు కూడా ఖరారయ్యాయి. తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ అందించింది. ఎనిమిది మంది షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్ 243.1 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. తలత్ కిష్మలా (పాకిస్తాన్; 236.3 పాయింట్లు) రజతం, భారత్‌కే చెందిన రిథమ్ సాంగ్వాన్ (214.5 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. భారత్‌కే చెందిన మరోషూటర్ సురభి రావు 154 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి రావు 579 పాయింట్లతో వరుసగా మూడు, ఐదు స్థానాల్లో నిలువగా... ఇషా సింగ్ 578 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌లో రిథమ్, సురభి, ఇషా సింగ్ సాధించిన స్కోరు ఆధారంగా భారత జట్టుకు టీమ్ విభాగంలో బంగారు పతకం లభించింది. భారత బృందం మొత్తం 1736 పాయింట్లు స్కోరు చేసింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ వరుణ్ తోమర్ స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు భారత్‌కు పారిస్ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేశాడు. ఇదే ఈవెంట్లో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా రజత పతకం నెగ్గాడు. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో వరుణ్ 239.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలువగా... అర్జున్ 237.3 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. వరుణ్, అర్జున్ సింగ్, ఉజ్వల్ మలిక్‌లతో కూడిన భారత బృందం 1740 పాయింట్లతో టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని గెల్చుకుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి 15 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ నుంచి 15 మంది షూటర్లు బరిలోకి దిగారు. -
ఏసీసీ చేతికి ఏషియన్ కాంక్రీట్స్
న్యూఢిల్లీ: ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌లో మిగిలిన 55 శాతం వాటాను అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ కైవసం చేసుకుంది. ఇందుకు సుమారు రూ.426 కోట్లు వెచి్చంచింది. అంబుజా సిమెంట్స్ అనుబంధ సంస్థ అయిన ఏసీసీకి ఇప్పటికే ఏషియన్ కాంక్రీట్స్లో 45 శాతం వాటా ఉంది. ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని నలఘర్ వద్ద 1.3 మిలియన్ టన్నుల ప్లాంటు, అలాగే అనుబంధ కంపెనీ అయిన ఏషియన్ ఫైన్ సిమెంట్స్‌కు పంజాబ్‌లోని రాజ్‌పురాలో 1.5 మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటు ఉంది. -
ఆ లిస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్‌లో ఎవరంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్ దంపతులు..!) ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్‌బీర్ కపూర్ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు. కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!) -
ఏఐఎన్‌యూలో ఏషియన్ హెల్త్‌కేర్ హోల్డింగ్స్ మెజారిటీ వాటా
హైదరాబాద్: సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ డెలివరీ ప్లాట్‌ఫాం అయిన ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ (ఏహెచ్‌హెచ్) సంస్థ.. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు గాను దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి అయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)లో మెజారిటీ వాటాను తీసుకుంది. ఏఐఎన్‌యూకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఆస్పత్రులు ఉండటంతో పాటు రోబోటిక్ యూరాలజీ సర్జరీలలో ముందంజలో ఉన్న ఘనత ఉంది. ప్రైమరీ, సెకండరీ ఇన్‌ప్యూజన్ల ద్వారా ఏహెచ్‌హెచ్ ఈ సంస్థలో రూ.600 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఏహెచ్‌హెచ్ ఇప్పుడు యూరాలజీ, నెఫ్రాలజీ విభాగంలోకి ఈ పెట్టుబడి ద్వారా అడుగుపెట్టడంతో నాలుగో స్పెషాలిటీలోకి కూడా వచ్చినట్లయింది. తద్వారా, భారతదేశంతో పాటు ఆసియా ఉపఖండంలోనే ఏకైక అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ హెల్త్‌కేర్ డెలివరీ ప్లాట్‌ఫాం అవుతుంది. ఏహెచ్‌హెచ్ 2017లో ప్రారంభమైంది. అప్పటినుంచి ఆంకాలజీ (సీటీఎస్ఐ), మహిళలు, పిల్లలు (మదర్‌హుడ్ హాస్పిటల్స్), ఐవీఎఫ్, సంతాన సాఫల్యం (నోవా ఐవీఎఫ్) ఆస్పత్రులలో వాటాలు తీసుకుంది. ఇవన్నీ ఆయా రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నవే. డాక్టర్ సి.మల్లికార్జున, డాక్టర్ పి.సి. రెడ్డిల నేతృత్వంలోని ప్రముఖ యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు కలిసి 2013లో ఏఐఎన్యూను స్థాపించారు. అప్పటినుంచి దేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ క్లినికల్ స్పెషాలిటీలో ప్రముఖ ఆస్పత్రిగా ఎదిగింది. ఈ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, సిలిగురి, చెన్నై నగరాల్లో ఏడు ఆస్పత్రులు నడుపుతోంది. వీటన్నింటిలో కలిపి 500కు పైగా పడకలున్నాయి, 4 లక్షల మందికి పైగా రోగులకు చికిత్స చేసి, 50వేల ప్రొసీజర్లు పూర్తిచేసింది. రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలలో ఏఐఎన్‌యూ నాయకత్వస్థానం సంపాదించింది. ఇప్పటికి ఈ టెక్నాలజీతో వెయ్యికి పైగా ఆపరేషన్లు పూర్తిచేసింది. ఇక నెఫ్రాలజీ విభాగం విషయానికొస్తే, 2 లక్షలకు పైగా డయాలసిస్‌లు, 300 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు ఇక్కడ చేశారు. “యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో ఏఐఎన్‌యూ ఒక విభిన్నమైన సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్. ఆయా విభాగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వైద్యులు.. క్లినికల్ నైపుణ్యం అనే పునాదిపై దీన్ని నిర్మించారు. ఏహెచ్‌హెచ్ ప్లాట్‌ఫాంలో ఏఐఎన్‌యూ కేవలం ఒక కొత్త స్పెషాలిటీని కలపడమే కాక, దేశంలో సింగిల్ స్పెషాలిటీ వైద్యవ్యవస్థను మరింత పెంచాలన్న మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. యూరలాజికల్ సమస్యలు అత్యంత ఎక్కువగా ఉన్న టాప్-3 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇక్కడ మధుమేహం, రక్తపోటు అధికంగా ఉండటంతో పాటు దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) కూడా ఎక్కువగా ఉంటోంది. దేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యసేవలకు ఉన్న డిమాండుకు, సరఫరాకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ఏఐఎన్‌యూ మాతో కలవడం మాకెంతో సంతోషంగా ఉంది” అని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ విశాల్ బాలి తెలిపారు. ఏఐఎన్‌యూ తన ఆస్పత్రులన్నింటిలో యూరాలజీ సమస్యలకు అత్యాధునిక చికిత్సను అందిస్తుంది. దీని సమగ్ర సేవలలో మూత్రపిండాల్లో రాళ్లు, యూరాలజీ క్యాన్సర్లు, ప్రోస్టేట్ వ్యాధులు, పునర్నిర్మాణ యూరాలజీ శస్త్రచికిత్స, లాపరోస్కోపిక్ యూరాలజీ, ఆండ్రాలజీకి రోగనిర్ధారణ, చికిత్స ఉన్నాయి. నెఫ్రాలజీ విభాగంలో తీవ్రమైన, దీర్ఘకాలిక, తుది దశ మూత్రపిండ వ్యాధులకు (ఇఎస్ఆర్డీ) చికిత్సను అందిస్తారు. అలాగే మెరుగైన క్లినికల్ ఫలితాలను అందించడానికి హై-ఎండ్ హిమోడయాఫిల్టరేషన్ (హెచ్డీఎఫ్) యంత్రాలతో కూడిన అత్యాధునిక డయాలసిస్ యూనిట్ ఉంది. “భారతీయులకు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు, కేన్సర్ రహిత ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ సమస్యలు ఎక్కువ. గత దశాబ్ద కాలంలో యూరలాజికల్ కేన్సర్లు కూడా ఎక్కువ కావడాన్ని మేం గమనించాం. ప్రోస్టేట్, బ్లాడర్ కేన్సర్లు ఎక్కువవుతున్నాయి. మా బృందం యూరలాజికల్ కేన్సర్లకే వెయ్యి రోబోటిక్ సర్జరీలు చేసింది. కేవలం భారతీయ నగరాల్లోనే కాక, 2టైర్ పట్టణాల్లోనూ రోబోటిక్ యూరాలజీ సర్జరీలను అందుబాటులోకి తెస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో యూరో-ఆంకాలజీ, యూరో-గైనకాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ కేసులు పెరిగే అవకాశాలున్నాయి. ఏహెచ్‌హెచ్ రాబోయే కాలంలో మా తదుపరి దశ వృద్ధికి సరైన భాగస్వామి అవుతుందని నమ్ముతున్నాం” అని ఏఐఎన్‌యూ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సి. మల్లికార్జున చెప్పారు. “భారతదేశ జనాభాలో సుమారు 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షకు పైగా మూత్రపిండాల వైఫల్యం కేసులు నమోదవుతున్నాయి. ఇది భారతదేశంలోని రోగులకు నెఫ్రాలజీ చికిత్సలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని పెంచుతోంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నందున, క్లినికల్ ఫలితాలను మెరుగుపరచడానికి, మెరుగైన రోగి సంరక్షణ కోసం డయాలసిస్, మూత్రపిండాల మార్పిడిలో సాంకేతిక పురోగతి చాలా అవసరం” అని ఏఐఎన్‌యూ సీనియర్ యూరాలజిస్ట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పిసి రెడ్డి అన్నారు. 2022లో భారతదేశం సుమారు 1.89 కోట్ల నెఫ్రాలజీ, యూరాలజీ విధానాలను నమోదు చేసింది. వచ్చే ఐదేళ్లలో సిఎజిఆర్ 8-9% పెరుగుతుందని అంచనా. భారత్ లో 6,000 మంది యూరాలజిస్టులు, 3,500 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 350 మంది యూరాలజిస్టులు, 250 మంది నెఫ్రాలజిస్టులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. లాపరోస్కోపిక్, ఎండోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సా ఎంపికల పెరుగుదల దేశంలోని మెట్రోలు, ద్వితీయ శ్రేణి నగరాలలో ఎఐఎన్యుకు బలమైన వృద్ధి అవకాశాన్ని ఇస్తుంది. ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ గురించి 2017లో ప్రారంభమైన ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ (ఏహెచ్‌హెచ్) అనేది సింగపూర్‌కు చెందిన సావరిన్ హెల్త్ ఫండ్ అయిన టిపిజి గ్రోత్, జిఐసి నిధులతో ఏర్పడిన సింగిల్ స్పెషాలిటీ ఇన్వెస్ట్మెంట్, ఆపరేటింగ్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం. భారతదేశంలోని 11 నగరాల్లో 23 చోట్ల మహిళలు, పిల్లల ఆసుపత్రుల సమగ్ర నెట్వర్క్ అయిన మదర్‌హుడ్ హాస్పిటల్స్ దీని పరిధిలో ఉన్నాయి. దాంతోపాటు భారతదేశం, దక్షిణాసియాలోని 44 నగరాల్లో 68 ఐవిఎఫ్ సెంటర్లున్న నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీని కూడా ఏహెచ్‌హెచ్ కలిగి ఉంది. ఏహెచ్‌హెచ్ భారతదేశంలోని రెండో అతిపెద్ద ఆంకాలజీ ఆసుపత్రుల చైన్ అయిన సీటీఎస్ఐని ఏర్పాటుచేసి, 2019 లో కంపెనీ నుంచి నిష్క్రమించింది. ఏఐఎన్‌యూ గురించి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) అనేది యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలకు భారతదేశంలో అతి పెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి. దేశంలోని నాలుగు నగరాల్లో ఏడు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో కూడిన బృందాలు ఉన్నాయి. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో క్లినికల్ నైపుణ్యాలకు ఇది పెట్టింది పేరు. దాంతోపాటు యూరో-ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, ఫిమేల్ యూరాలజీ, ఆండ్రాలజీ, మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ లాంటి సేవలూ అందిస్తుంది. రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలకు దేశంలోనే ఇది ఆదర్శప్రాయం. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆస్పత్రి నెట్‌వర్క్‌లో 500 పడకలు ఉన్నాయి, ఇప్పటివరకు లక్ష మందికిపైగా రోగులకు చికిత్సలు చేసింది. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్బీ (యూరాలజీ, నెఫ్రాలజీ), ఎఫ్ఎన్బీ (మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ)ల గుర్తింపు ఉంది. -
వచ్చే వారం ఇండోనేషియాకు మోదీ
న్యూఢిల్లీ: ఏషియాన్, ఈస్ట్ ఆసియా సదస్సుల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6, 7 తేదీల్లో ఇండోనేషియాకు వెళ్లనున్నారు. రాజధాని జకార్తాలో జరిగే ఈ సమావేశాలకు ఏషియాన్ చైర్ హోదాలో ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఏషియాన్లోని సభ్యదేశాలతో వ్యాపార, భద్రతా సంబంధాల బలోపేతంపై మోదీ దృష్టి సారించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహా్వనం మేరకు ప్రధాని మోదీ 6, 7వ తేదీల్లో జకార్తాకు వెళుతున్నారని విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
అదిగో మన పి.టి.ఉష
జూలై 13, గురువారం. బ్యాంకాక్‌లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 100 మీటర్ల హర్డిల్స్ పోటీ. ట్రాక్ మీద జ్యోతి యర్రాజీ చిరుతలా సిద్ధంగా ఉంది. కాని ఆ రోజు వాతావరణం ఆమె పక్షాన లేదు. వాన పడటం వల్ల ట్రాక్ తడిగా ఉంది. 100 మీటర్ల హర్డిల్స్‌ను జాతీయ స్థాయిలో 12.82 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సాధించి ఉంది జ్యోతి. ఇప్పుడు అంతకన్నా తక్కువ సమయంలో పూర్తి చేస్తే మరో రికార్డు స్థాపించవచ్చు. పోటీ మొదలైంది. అందరూ వాయువేగంతో కదిలారు. వింటి నుంచి సంధించిన బాణంలా జ్యోతి దూసుకుపోతోంది. హర్డిల్స్ మీదుగా లంఘిస్తూ గాలిలో పక్షిలా సాగుతోంది. కాని 6వ హర్డిల్కు వచ్చేసరికి తడి వల్ల కొద్దిగా రిథమ్ తప్పింది. వెంటనే సర్దుకుని పోటీని 13.09 సెకన్లలో పూర్తి చేసి మొదటిస్థానంలో నిలిచింది. 50 ఏళ్లుగా సాగుతున్న ఆసియా అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో తొలి స్వర్ణపతకం సాధించిన ఘనమైన రికార్డు ఇప్పుడు జ్యోతి వశమైంది. బుడాపెస్ట్‌లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎంపికైంది. అక్కడ ప్రతిభ చూపి ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం కోసం ఇదే 100 మీటర్ల హర్డిల్స్‌ను 12.77 సెకన్లలో పూర్తి చేయగలిగితే చాలు ఆ పోటీల్లో పాల్గొని ఒలింపిక్స్ విజేతగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. అందుకే క్రీడాభిమానులు ఆమెపై ఆశలు పెట్టుకున్నారు. ఆమెను హర్షధ్వానాలతో ప్రోత్సహిస్తున్నారు. సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోతి యర్రాజీ విశాఖ పోర్ట్ స్కూల్లో చదువుకుంది. ఆటలు తెలిసిన కుటుంబం కాదు. తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్. తల్లి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయాగా పని చేసేది. వారిరువురికీ కుమార్తెను చదివించడమే ఎక్కువ. స్పోర్ట్స్‌లో ప్రవేశపెట్టడం కష్టం. కాని జ్యోతి డ్రిల్ పీరియడ్‌లో తోటి పిల్లలతో పరుగెత్తేది. పాఠశాలకు చేరువలోనే విశాఖ పోర్ట్ స్టేడియం ఉండటంతో అక్కడ సీనియర్ అథ్లెట్ల ప్రాక్టీస్‌ను పరిశీలించడం దినచర్యగా చేసుకుంది.తొలుత సబ్ జూనియర్ స్థాయిలో అంతర పాఠశాలల అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనేది. 2015 రాష్ట్రస్థాయి పోటీల్లో పసిడి పతకం సాధించడంతో తోటి అథ్లెట్ల సలహాతో హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ హాస్టల్లో కోచ్ రమేష్ వద్ద శిక్షణ పొందింది. ఆమె ఆర్థిక స్థితి చూసి ఊరు వెళ్లాలంటే రమేషే డబ్బు ఇచ్చేవారు. అలాగే ఆమె సీనియర్ కర్నాటపు సౌజన్య (అప్పట్లో సికింద్రాబాద్–లింగంపల్లి రూట్ టి.సిగా పని చేసేది) కూడా ఆర్థికంగా సాయం చేసేది. జూనియర్ స్థాయి వరకే అక్కడ సదుపాయం ఉండటంతో సీనియర్స్ స్థాయిలో గుంటూరులోని అథ్లెటిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి వచ్చింది. విదేశీ కోచ్‌ల ప్రోత్సాహం దక్కడంతో నేషనల్స్ మెడల్ సాధించగలిగినా సెంటర్ కొనసాగకపోవడంతో అన్వేషణ తిరిగి మొదలైంది. మలుపుతిప్పిన భువనేశ్వర్ అయితే జ్యోతి ప్రతిభ జాతీయ స్థాయిలో తెలియడం వల్ల 2019లో రిలయన్స్ ఆధ్వర్యంలో ఒడిశాలోని భువనేశ్వర్‌లో నడిచే అథ్లెటిక్స్ హై–పెర్ఫార్మెన్స్ సెంటర్ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. 5.9 అడుగుల ఎత్తు, పొడుగు కాళ్లు ఉన్న జ్యోతికి వంద మీటర్ల పరుగుతో పాటు హర్డిల్స్‌లో కూడా శిక్షణనివ్వడం మొదలు పెట్టాడు ఇంగ్లండ్ నుంచి వచ్చిన కోచ్ జేమ్స్ హిల్లర్. దాంతో కర్ణాటకలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్–యూనివర్శిటీ అథ్లెటిక్స్ మీట్లో 100 మీటర్ల హర్డిల్స్‌ను 13.03 సెకన్లతో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది జ్యోతి. 2020 ఫిబ్రవరిలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో మరో స్వర్ణం వచ్చింది. 2022 సెప్టెంబర్‌లో గుజరాత్లో జరిగిన జాతీయ పోటీల్లో 12.79 సెకన్లతో రికార్డు స్థాపించింది. ఇప్పుడు బ్యాంకాక్ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ‘ఫాస్టెస్ట్ ఆసియన్ ఉమెన్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ హర్డిల్స్’ రికార్డు స్థాపించింది. ఆమెకు జాతీయ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలియచేశారు. – డాక్టర్ మాడిమి సూర్యప్రకాశరావు, సాక్షి విశాఖ స్పోర్ట్స్ -
‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని
Lawsuit on Meta: యూఎస్ టెక్ దిగ్గజం మెటా (Meta) జాతి వివక్షకు పాల్పడుతోందని, ఆసియన్లను చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ వైష్ణవి జయకుమార్ అనే సింగపూర్‌కు చెందిన భారతీయ సంతతి ఉద్యోగిని కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగంలో దావా వేశారు. 2020 జనవరిలో మెటా కంపెనీలో చేరిన ఆమె అంతకు ముందు డిస్నీ, గూగుల్, ట్విటర్ సంస్థల్లో పనిచేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనను తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల కింద చేర్చి అవకాశాలు లేకుండా చేశారని వైష్ణవి వాపోయారు. ఆసియన్ మహిళ అయిన తనపై ఎలా జాతి వివక్ష చూపారో వైష్ణవీ జయకుమార్ ఇటీవలి లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. గత నెలలో మాస్ లేఆఫ్‌ల రూపంలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మెటా కంపెనీలో యూత్ పాలసీ హెడ్‌గా ఉన్న వైష్ణవీ జయకుమార్ మెటా యాప్‌లన్నింటిలో వయసు ఆధారిత పాలసీలు, ఉత్పత్తి లక్షణాలపై పనిచేసే బృందానికి నాయకత్వం వహించేవారు. మొదటి రెండేళ్లు అంతా బాగానే జరిగిందని, ఆ తర్వాత ప్రమోషన్ గురించి అడిగినప్పుడు జాతి వివక్షను ఎదుర్కొన్నట్లు వైష్ణవి పేర్కొన్నారు. తన మేనేజర్ ఉన్నట్టుండి జాతి వివక్ష చూపడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. తనకు ఇతర అభ్యర్థుల కంటే ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ నాయకత్వ బాధ్యతలకు తాను సీనియర్ని కానంటూ యాజమాన్యానికి తప్పుడు నివేదిక ఇచ్చారని వాపోయారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతమే.. వైష్ణవీ జయకుమార్ తన దావాలో ఆసియా, పసిఫిక్ ద్వీపవాసుల నిపుణుల నెట్వర్క్ ‘అసెండ్’ 2022లో చేసిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించారు. దాని ప్రకారం మెటా కంపెనీలోని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 49 శాతం మంది ఆసియన్లు ఉంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతం మంది మాత్రమే ఆసియన్లు ఉన్నారు. 2022 చివరి నాటికి మెటా కంపెనీ 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మార్చిలో మరో రౌండ్ మాస్ లేఆఫ్‌లలో మరో 10,000 మందికి ఉద్వాసన పలికింది. సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలంగా ఉన్న జాతి వివక్షకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని కోరుతూ టెక్ పరిశ్రమలో ఆసియా అమెరికన్లు దాఖలు చేసిన అనేక వ్యాజ్యాలలో వైష్ణవీ జయకుమార్ వేసిన దావా కూడా ఒకటి. అయితే ఈ ఆరోపణలపై మెటా కంపెనీ వర్గాల నుంచి ఇంతవరకు ఎటువంటి వివరణ రాలేదు. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌పై కోర్టులో దావా: ఇష్టమొచ్చినట్లు తొలగించడం కాదు.. కట్టు రూ. 4వేల కోట్లు! -
జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా తెలుగమ్మాయి
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి స్వర్ణ పతకంతో మెరిసింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ తన తడాఖా చూపించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకంతో మెరిసింది. ఈ క్రమంలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందింది. జ్యోతితోపాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్... పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ పసిడి పతకాలు నెగ్గారు. బ్యాంకాక్: గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి మీట్లలో నిలకడగా రాణిస్తున్న భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. అయితే ఆసియా చాంపియన్‌షిప్‌లో వర్షం కారణంగా ట్రాక్ తడిగా ఉండటంతో జ్యోతి 13 సెకన్లలోపు పూర్తి చేయలేకపోయింది. స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలిపారు. ♦ పురుషుల 1500 మీటర్ల ఫైనల్ రేసును అజయ్ కుమార్ సరోజ్ 3ని:41.51 సెకన్ల లో ముగించి బంగారు పతకాన్ని సాధించా డు. ఈ పోటీల్లో అజయ్కిది మూడో పతకం. 2017లో స్వర్ణం, 2019లో రజతం గెలిచాడు. ♦ పురుషుల ట్రిపుల్ జంప్‌లో కేరళ అథ్లెట్ అబ్దుల్లా అబూబాకర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన అబూబాకర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో 16.92 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు. ♦ పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. ఢిల్లీకి చెందిన తేజస్విన్ 7,527 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్ కోసం తీవ్రంగా శ్రమించా. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ఆసియా చాంపియన్‌షిప్‌లో నా అత్యుత్తమ సమయాన్ని నమోదు చేస్తానని ఆశించా. అయితే రేసు మొదలయ్యే సమయానికి వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డా. ఐదో హర్డిల్‌లో ఆధిక్యం అందుకోగా, ఆరో హర్డిల్‌ను కూడా అలవోకగా అధిగమించాను. అయితే ఏడో హర్డిల్ దాటే సమయంలో కాస్త తడబడటంతో 13 సెకన్లలోపు రేసును ముగించలేకపోయా. జపాన్ అథ్లెట్స్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావించా. పతకాల గురించి ఆలోచించకుండా సాధ్యమైనంత వేగంగా పరిగెత్తాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. పలు టోర్నీలలో నేను క్రమం తప్పకుండా 13 సెకన్లలోపు సమయాన్ని నమోదు చేశా. భవిష్యత్‌లో నా సమయాన్ని మరింత మెరుగుపర్చుకొని మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించినందుకు ఆనందంగా ఉంది. –జ్యోతి యర్రాజీ -
అచ్చం మనిషిలానే తింటున్న ఏనుగు.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఏనుగులు శాంతంగా ఉంటే ఎంత సరదాగా ఉంటాయో కోపమొస్తే గజరాజులా మారి అదే స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వీటికున్న ప్రత్యేకత ఏంటంటే మావాటి చెప్పేవి బుద్ధిగా వినడంతో పాటు వాటిని పాటిస్తాయి కూడా. వీటి ప్రవర్తన చూసి మనుషులు ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కవగా ఇష్టపడుతుంటారు. మరీ పిల్ల ఏనుగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా ఓ ఏనుగు అరటి పండు తినే తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. బెర్లిన్ జూలో ఉన్న ఓ ఏనుగు అరటి పండును తినే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. పంగ్ ఫా అనే ఆసియా ఏనుగు అరటి పండు ఇస్తుంటే.. ముందుగా అది అరటిపండు తొక్క తీసేసి ఆపై పండును మాత్రం తింటోంది. ఇది తినే తీరు చూస్తే అచ్చం మనిషిలానే తిన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండోయ్ పసుపు రంగులో బాగున్న అరటిపండ్లను మాత్రం తింటూ.. గోధుమ రంగు (సరిగా లేని) అరటి పండ్లను తినేందుకు ససేమిరా అంటోంది. దీన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకూ 32,000 మంది వీక్షించారు. -
Namrata shirodkar: ఏసియన్ నమ్రత ‘ప్యాలెస్ హైట్స్’ రెస్టారెంట్ ప్రారంభం ( ఫొటోలు)
-
ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్.. ఇండియా నుంచి ఆ రెండు చిత్రాలే
ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్- పార్ట్ చిత్రాలు ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్స్‌లో సత్తా చాటాయి. పొన్నియిన్ సెల్వన్ 6 నామినేషన్లు, ఆర్ఆర్ఆర్ పలు విభాగాల్లో నామినేట్ అయ్యాయి. మార్చి 12న హాంకాంగ్‌లో జరగనున్న 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్లను శుక్రవారం ప్రకటించారు. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్- 1 ఉత్తమ చిత్రంతో సహా ఆరు విభాగాలలో నామినేట్ అయింది. ఎస్ఎస్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ కూడా రెండు విభాగాల్లోకి పోటీలో నిలిచింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో నామినేట్ అయింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- శ్రీనివాస్ మోహన్, ఉత్తమ సౌండ్- అశ్విన్ రాజశేఖర్ నామినేట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా అనేక ఉత్తమ జాబితాల్లో చోటు దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట కూడా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చేరింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్- 1 థియేటర్లలో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్‌గా శ్రీకర్ ప్రసాద్, ఉత్తమ సినిమాటోగ్రఫీగా రవి వర్మన్, ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్‌గా ఎ.ఆర్. రెహమాన్, ఉత్తమ సంగీతానికి ఏకా లఖాని, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌గా కాస్ట్యూమ్ డిజైన్ తోట తరణి విభాగాల్లో నామినేషన్స్ లభించాయి. The press conference of the 16th Asian Film Awards has ended successfully just now! The 16th Asian Film Awards will be held at 7:30pm on 12 March (Sunday) at the Hong Kong Palace Museum. The nomination list for the 16th Asian Film Awards and the jury president were announced. pic.twitter.com/l5zhegY8Tt — Asian Film Awards Academy (@AsianFilmAwards) January 6, 2023 제16회 아시아 필름 어워즈 의 후보 라인업은 다음과 같습니다. 헤어질 결심 -- 10개의 후보 드라이브 마이 카 -- 8개 후보 Ponniyin Selvan : I -- 6개의 후보 ...등 여러가지 영화가 있습니다. 자세한 정보를 많이 기대해주세요~ pic.twitter.com/6gYF6ik3nn — Asian Film Awards Academy (@AsianFilmAwards) January 6, 2023 -
కాట్రావత్ శాంతకుమారి: తండా నుంచి థాయ్‌లాండ్‌కు
నాలుగోసారీ ఆడపిల్ల పుట్టింది. భారమవుతుందేమో అమ్మాలనుకుంటే అయిదొందలకు బేరమూ కుదిరింది. మళ్లీ వద్దనుకున్నారు అమ్మానాన్న. ఎంత కష్టమైనా తామే సాకాలనుకున్నారు. ఐదో క్లాసు నుంచే కూలిపనులకెళ్లింది. మిల్లులో కూలిపనుల కోసం సంచుల్లో తవుడు ఎత్తిన ఆ చేయి... ఇప్పుడు అంతర్జాతీయ ఆటస్థలాల్లో వాలీబాల్ ఎత్తుతోంది. బంతిని బాదినంత తేలిగ్గా బీదరికాన్నీ బాదడానికి ప్రయత్నిస్తోంది. నెట్ అవతలికి బంతిని పంపినట్టుగా తన నైపుణ్యాలను దేశం బయటా చూపుతోంది. ఎక్కడో గిరిజనతండాల్లో పుట్టిన ఆ యువతి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపడానికి ఇప్పుడు మరోసారి సమాయత్తమవుతోంది. ఆల్ ద బెస్ట్... శాంతకుమారి. ఉమ్మడి పాలమూరులోని ప్రస్తుత వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పుతండాకు చెందిన క్రీడా ఆణిముత్యం కాట్రావత్ శాంతకుమారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత వాలీబాల్ క్రీడలో మహిళల కేటగిరిలో జాతీయ జూనియర్ జట్టుకు ఎంపికైన మొట్టమొదటి బాలిక ఆమె. ఈ నెల ఆరు నుంచి 13వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరిగిన 14వ ఏషియన్ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్కపూట తిండికీ కష్టమే.. మా అమ్మ పేరు భామిని, నాన్న అమృనాయక్, మేము మొత్తం ఆరుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు అయ్యాయి. మూడో అక్క మంజుల ఇంటర్ సెకండియర్, తమ్ముళ్లు కుమార్ తొమ్మిది, రాహుల్ ఏడో తరగతి చదువుతున్నారు. మా అమ్మానాన్న అందరినీ సమానంగా చూస్తారు. పెద్ద కుటుంబం కావడం.. అమ్మానాన్నలకు ఉపాధి దొరక్కపోవడంతో ఒక్క పూట తిండి కూడా కష్టమయ్యేది. మేమందరం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోనే చదువుతున్నాం. కరోనాకు ముందు వరకు అమ్మానాన్న ముంబాయికి వలస వెళ్లారు. కరోనా కాలంలో తిరిగి వచ్చాక ఉపాధి దొరకడం కష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్ షేక్‌పేట (నాలా)లో మేస్త్రీ వద్ద పనిచేస్తున్నారు. వారు కష్టం చేసి సంపాదించిన దాంతోపాటు అప్పులు చేసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. మిల్లులో కూలి పనులకు వెళ్లా.. నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాల ప్రైమరీ స్కూల్లో చదువుకున్నా. ఐదు నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు)లో చదువుతున్నా. నేను ఐదో తరగతి నుంచి మా అక్కలతో కలిసి సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేదాన్ని. రైస్‌మిల్లులో సంచులు కుట్టడం, తవుడు ఎత్తడం వంటి పనులు చేశాను. పీడీ మేడం చొరవతో ... నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఎవరైనా ఆటలాడుతుంటే అక్కడే ఉండిపోయేదాన్ని. గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత మా సీనియర్స్ ఖో ఖో అడుతుంటే.. ఒక్కొక్కరి ఆటను దగ్గరుండి గమనించేదాన్ని. ఒకరోజు మా పీడీ మేడమ్ అరుణారెడ్డి వచ్చి ‘ఏం చూస్తావ్.. నీవు ఆడవా’ అని అడిగారు. ఆ తర్వాత నుంచి మేడమ్‌తో మంచి చనువు ఏర్పడింది. మెల్లమెల్లగా నా దృష్టిని వాలీబాల్ వైపు మళ్లించారామె. ఉదయం ఐదు నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు. ఓటమితో మొదలు.. 2016లో మండల స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారించా. మహబూబ్‌నగర్‌లో అండర్ 14 విభాగంలో జరిగిన ఎస్జీఎఫ్ ఎంపికల్లో జిల్లా జట్టుకు ఎంపికయ్యా. ఆ తర్వాత భద్రాచలంలో అసోసియేషన్ మీట్ జరిగింది. ఇందులో సెలెక్ట్ కాలేకపోయా. నాలో నిరుత్సాహం అలుముకుంది. అక్కడి నుంచే మేడంకి ఫోన్ చేశా. ఇక నేను వాలీబాల్ ఆడనని! కానీ.. ఆమె నాకు ఎక్కడలేని ధైర్యాన్ని నూరిపోశారు. ఆమె సూచనతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. అప్పటి నుంచి నేను మానసికంగా బలంగా తయారయ్యా. మెళకువలు నేర్చుకున్నా. అనంతరం సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచా. చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో సెమీఫైనల్ వరకు వెళ్లాం. అలా టెన్నిస్, వాలీబాల్, బీచ్ వాలీబాల్‌తోపాటు రగ్బీ క్రీడలో సైతం రాణించా. అయితే కోవిడ్ విజృంభణతో రెండేళ్లుగా ఆటల పోటీలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మా మేడమ్ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై ఆన్లైన్ ద్వారా క్లాస్ తీసుకునే వారు. వాలీబాల్ ఆట నుంచి నా దృష్టి మరలకుండా శిక్షణ ఇచ్చేవారు. పాస్‌పోర్టు ఇతరత్రా ఖర్చులు కూడా ఆమే భరించారు. మా పీడీ మేడమ్ చొరవ, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయుల ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. నేను వారిని ఎన్నటికీ మరిచిపోలేను. ఏషియన్ పోటీలకు ప్రాతినిధ్యం మరువలేను.. ప్రస్తుతం నేను ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. వార్షిక పరీక్షల సమయంలోనే జాతీయ స్థాయి ఎంపికలు జరిగాయి. ఏప్రిల్ 6న భువనేశ్వర్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 225 మందికి ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 32 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇందులో నుంచి 20 మందిని ఎంపిక చేసి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇందులో నుంచి 12 మందిని ఎంపిక చేశారు. ప్రధాన జట్టు ఆరుగురిలో నేను ఒకరిగా నిలవడం.. మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా జన్మలో మరచిపోలేని సంఘటన. థాయిలాండ్ లో 14వ ఏషియన్ జూనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పూల్–బీలో పటిష్ట జట్లు అయిన జపాన్, చైనాతోపాటు భారత్ ఉంది. మేము గెలిచింది ఒక మ్యాచ్‌లోనే అయినా... వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గరుండి చూశాను. ఆటను మరింత మెరుగుపరుచుకుని జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావడమే తొలి లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎస్ సాధించడమే నా ఆశయం’’ అన్నారు శాంతకుమారి. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే.. బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) విద్యార్థినులు మొదటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ ముందున్నారు. రగ్బీలో రాష్ట్ర స్థాయిలో మా స్కూల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. జట్టు గోల్డ్‌మెడల్ గెలుచుకుంది. కాట్రావత్ శాంతకుమారికి క్రీడలంటే చాలా ఇష్టం. వాలీబాల్‌లో ఆమె రాణిస్తుందనే నమ్మకంతో ఆ క్రీడవైపు మళ్లించా. ఎలాంటి ఆధునిక వసతులు లేని చోటు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే ఆమె ఈ స్థాయికి వచ్చింది. – ఎం.అరుణారెడ్డి, పీడీ, బాలానగర్ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) ఐదు వందలకు అమ్మాలనుకున్నాం! మాకు మొదటి ముగ్గురూ ఆడపిల్లలే. నాలుగో సంతానం కూడా ఆడ పిల్లే. అప్పుడే మా గుడిసెలు తగలబడ్డాయి. దీంతో నాలుగో కూతుర్ని అమ్మాలని మా పెద్దలు నిర్ణయానికి వచ్చారు. రూ.500కు గిరాకీ కూడా తీసుకొచ్చారు. కానీ మాకు మనసు ఒప్పలే. ఏ కష్టం చేసైనా సరే. మా బిడ్డల్ని మేమే సాకుతాం అని చెప్పినం. ఉన్న దాంట్లో తింటున్నం. సదివిస్తున్నం. పెళ్లిళ్లు చేసినం.. మా బిడ్డ గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతాంటే గర్వంగా ఉంది. – కె. భామిని, అమృనాయక్, శాంతకుమారి తల్లిదండ్రులు – కిషోర్ కుమార్, పెరుమాండ్ల, (సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్) ఫొటోలు: భాస్కరాచారి, (సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్) -
ఆకుల శ్రీజకు మిశ్రమ ఫలితాలు
ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో శ్రీజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్లోకి ప్రవేశించగా... డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్యోగి అయిన శ్రీజ సింగిల్స్ తొలి రౌండ్లో 11–4, 11–7, 12–10తో సితీ అమీనా (ఇండోనేసియా)పై విజయం సాధించింది. డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–అర్చన కామత్ (భారత్) జోడీ 11–5, 11–3, 11–6తో సోనమ్ సుల్తానా–సాదియా (బంగ్లాదేశ్) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీజ–అర్చన ద్వయం 10–12, 7–11, 12–10, 13–15తో డు హై కెమ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
మళ్ళీ అంబానీని దాటిన అదాని...
-
కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాల కంటే..
ముంబై: బోర్డుల్లో మహిళా ప్రాధాన్యతలో ఇతర పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే కార్పొరేట్ ఇండియా వెనుకడుగులో ఉంది. అయితే ఇటీవల కంపెనీ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. దీంతో తాజాగా మహిళా డైరెక్టర్ల శాతం 17.3 శాతానికి బలపడింది. ఇదే సమయంలో ప్రపంచ సగటు 24 శాతంగా నమోదైనట్లు క్రెడిట్ స్వీస్ రీసెర్చ్ సంస్థ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 46 దేశాలలో 3,000 కంపెనీలకు చెందిన 33,000 మంది ఎగ్జిక్యూటివ్స్‌ను పరిగణనలోకి తీసుకుని సర్వేను తయారు చేసినట్లు క్రెడిట్ స్వీస్ తెలియజేసింది. వీటిలో 12 ఆసయా పసిఫిక్ మార్కెట్లలోని 1,440 సంస్థలను సైతం కవర్ చేసినట్లు పేర్కొంది. అయితే సర్వేలో దేశీయంగా ఎన్ని కంపెనీలూ, ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించిందీ క్రెడిట్ స్వీస్ వెల్లడించలేదు. నివేదికలోని ఇతర అంశాలు చూద్దాం.. 2015తో పోలిస్తే.. గత ఆరేళ్లలో దేశీ కార్పొరేట్ బోర్డుల్లో స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. దీంతో 2015లో వీరి సంఖ్య 11.4 శాతంగా నమోదుకాగా.. 2021కల్లా మరో 6 శాతం పుంజుకుంది. ఈ బాటలో గత రెండేళ్లలో యాజమాన్యంలోనూ స్త్రీ ప్రాతినిధ్యం 2 శాతం బలపడింది. ఫలితంగా 2019లో నమోదైన 8 శాతం వాటా 2021కల్లా 10 శాతానికి చేరింది. కాగా.. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో 17.3 శాతం వాటాతో ఎపాక్ ప్రాంతంలో భారత్ మూడో కనిష్ట ర్యాంకులో చేరింది. దక్షిణ కొరియా(8 శాతం), జపాన్(7 శాతం) కంటే ముందు నిలిచింది. మహిళా సీఈవోలలో 5 శాతం, సీఎఫ్వోలలో 4 శాతం వాటాను కలిగి ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కుటుంబ సభ్యులుకాకుండా స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ను తప్పనిసరి చేసినప్పటికీ చాలా కంపెనీలు నిబంధనలు పాటించడంలో వెనుకబడి ఉన్నాయి. ఇక ప్రపంచస్థాయిలో 2015–2021 మధ్య కాలంలో బోర్డులో మహిళల ప్రాతినిధ్యం 8.9 శాతంమేర పెరిగింది. యూరప్‌లో 34.4 శాతం, ఉత్తర అమెరికాలో 28.6 శాతం చొప్పున మహిళలకు ప్రాధాన్యత లభిస్తోంది. ఆసియా పసిఫిక్ సగటు 17.3 శాతంకాగా.. లాటిన్ అమెరికాలో ఇది 12.7 శాతంగా నమోదైంది. చదవండి: ఆఫీసులకు రమ్మంటే.. వీళ్ల రియాక్షన్ ఇది! -
శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్
చిత్రలేఖనం అందరికీ తెలుసు. లీజా దినూప్ చేసేది నృత్య లేఖనం. శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ చేసి నృత్యకళను, చిత్రకళను వేదిక మీద సంగమకళగా ప్రదర్శిస్తోందామె. ఇలా చేస్తున్న ఒకే కళాకారిణి లీజా. అందుకే ఆమె పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ ‘చిత్రనర్తకి’ పరిచయం. తెలుగు వారి విశిష్ట సంప్రదాయ నృత్యం ‘కూచిపూడి’లో ‘తాళ చిత్ర నృత్యం’ అనే విభాగం ఉంది. అందులో చిత్రకారిణి నృత్యం చేస్తూ పాదాల కదలికతో బట్ట మీద పరిచిన రంగును చెదరగొడుతూ నర్తనం ద్వారా ఒక బొమ్మను గీస్తుంది. ఎంతో సాధన ఉంటే తప్ప ఈ విద్య సాధ్యం కాదు. ఇదే కూచిపూడిలో ‘సింహనందిని’ అనే నృత్యవిభాగం దుర్గపూజ సమయంలో నర్తకీమణులు ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో రంగు పరిచిన బట్ట మీద నర్తిస్తూ పాదాలతో సింహం బొమ్మ గీస్తారు. ఇది దుర్గాదేవిని ఆరాధించే ఒక పద్ధతిగా వ్యాఖ్యానిస్తారు. భారతీయ నృత్యకళల్లో వేరే నృత్యాలకు లేని విశిష్టత ఈ విధంగా కూచిపూడికి ఉంది. అయితే కేరళలోని కాసర్గోడ్ టౌన్‌కు సమీపంలో ఉండే పయ్యూర్ అనే ఊరికి చెందిన 30 ఏళ్ల లీజా దినూప్ భరతనాట్యం చేస్తూ వేదిక మీద సిద్ధంగా ఉంచిన కేన్వాస్ మీద దేవతల బొమ్మలను గీస్తూ నృత్య చిత్రాల సంగమ కళను ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతోంది. కన్నూర్ యూనివర్సిటీలో ఎం.ఏ భరతనాట్యం చేసిన లీజా ఆ తర్వాత తిరువనంతపురంలో బేచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆమె నృత్యం చేయగలదు... చిత్రకళను ప్రదర్శించగలదు. ఈ రెంటిని కలిపి తానొక ‘చిత్రనర్తకి’ని ఎందుకు కాకూడదు అనిపించింది. వెంటనే ఆమె ఆ కళను సాధన చేసింది. ‘రామాయణ గాధలను, శివ ఆరాధనను, రవివర్మ గీసిన చిత్రాలను కేన్వాస్ మీద పునఃప్రతిష్టిస్తూ నేను భరతనాట్యం చేస్తాను’ అని లీజా దినూప్ అంటుంది. వివాహం అయ్యి మూడేళ్ల పాప ఉన్న లీజా కేరళలో రాష్ట్ర, జాతీయ సాంస్కృతిక కార్యక్రమం ఏది జరిగినా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. ఇప్పటికి ఆమె రాష్ట్రమంతా దాదాపుగా 50 చిత్రనర్తన ప్రదర్శనలు ఇచ్చింది. అంతే కాదు ఇలా చేసే ఏకైక చిత్రకారిణి కనుక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కింది. వేదిక మీద సంగీత బృందం రాగతాళాలు కొనసాగిస్తుండగా నృత్యం చేస్తూ మధ్య మధ్య కేన్వాస్ దగ్గరకు వస్తూ కుంచెతో ఆమె ఆ నృత్యంలో ఉన్న ఆధ్యాత్మిక, భక్తిభావాలకు తగిన బొమ్మను గీస్తుంది. ముఖ్యంగా రామాయణంలోని నవరసచిత్రాలను, గణేశ భక్తిని, స్త్రీ శక్తి రూపాన్ని ఆమె కేన్వాస్ మీద రంగుల్లో నాట్యం ద్వారా దేహంలో ప్రదర్శించి మెప్పు పొందుతోంది. ‘కళాత్మిక లలితకళాగృహం’ పేరుతో ఒక నటనాలయాన్ని ప్రారంభించి చిన్నారులకు శిక్షణ ఇస్తున్న లీజా నుంచి చిత్రనృత్యాన్ని అభ్యసించే కొత్తతరం తయారవుతోంది. భవిష్యత్తులో ఈ ప్రయోగం మరింత ముందుకు వెళ్లొచ్చని ఆశిద్దాం. -
Boxing Championships: ఆడక ముందే భారత్‌కు 21 పతకాలు!
దుబాయ్: ఆసియా యూత్ అండ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇంకా అడుగు పెట్టక ముందే భారత్‌కు కనీసం 21 పతకాలు ఖరారయ్యాయి! ఈ నెల 24నుంచి దుబాయ్‌లో జరిగే ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి వేర్వేరు వెయిట్ కేటగిరీలలో భారత్ తరఫున 250 మంది బాక్సర్లు పాల్గొంటున్నారు. కోవిడ్, ప్రయాణ ఆంక్షల కారణంగా వివిధ దేశాలనుంచి పెద్ద సంఖ్యలో బాక్సర్లు తప్పుకోవడంతో ‘డ్రా’ బాగా చిన్నదిగా మారిపోయింది. దాంతో కనీసం 21 పతకాలు ఖాయం కాగా, ఇందులో 9 మంది నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించారు. -
అమెరికాలో పెరుగుతున్న ఆసియన్ల జనాభా
వాషింగ్టన్: అమెరికాలో ఆసియన్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. మరే ఇతర మైనార్టీల కంటే ఆసియన్ల సంఖ్య గత దశాబ్ద కాలంలో చాలా పెరిగిందని ఆ దేశ జనాభా లెక్కల్లో వెల్లడైంది. 2020 సంవత్సరం నాటికి ఆసియన్ అమెరికన్ల సంఖ్య 2.4 కోట్లకు చేరుకున్నట్టు తేలింది. అమెరికా జనాభా గణన బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాలో మైనార్టీ కమ్యూనిటీల ప్రాబల్యమే ప్రస్తుతం అధికంగా ఉంది. అందులోనూ ఆసియన్లు 7.2 శాతం మంది ఉన్నారు. 1776 అమెరికా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా వైట్ అమెరికన్ల సంఖ్య తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి. అమెరికాలో తెల్లజాతీయులు సంఖ్య తొలిసారిగా 60శాతానికి దిగువకి పడింది. 2000ఏడాదిలో వారి జనాభా 69 శాతం ఉంటే 2010 నాటికి 63.7శాతానికి తగ్గింది. 2020లో ఇది 58 శాతానికి తగ్గినట్టుగా జనగణనలో వెల్లడైంది. అమెరికాలో గత దశాబ్దకాలంలో మొత్తంగా జనాభా 7.4% పెరిగి 33.1 కోట్లకు చేరుకుంది. 1930 తర్వాత జనాభా అతి తక్కువగా పెరగడం గత దశాబ్దంలోనే జరిగింది. -
ఆ నటిని తీసుకుని తప్పుచేశాం
జాతి విద్వేషం, జెనోఫొబియా (ఇతర దేశస్థులపై వివక్షత) అమెరికా పౌరుల్లో రోజురోజుకీ పెరిగిపోతోంది. గత కొంతకాలంగా తమ పౌరులపై దాడులు పెరిగిపోతుండడంతో ఆసియా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. సినిమా రంగంలోనూ ఆసియన్లకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలో కొంత వాస్తవం ఉందని అంటున్నాడు మార్వెల్ స్టూడియో చీఫ్ కెవిన్ ఫెయిగి. ‘‘మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ డాక్టర్ స్ట్రేంజ్(2016) సినిమా టైంలో మేము ఒక పొరపాటు చేశాం. ఏన్షియట్ వన్ క్యారెక్టర్ కోసం స్కాటిష్ నటి టిల్డా స్విన్టన్ను తీసుకున్నాం. మార్వెల్ ఒరిజినల్ కామిక్స్‌లో అది ఏషియన్ క్యారెక్టర్. అయితే ‘క్రియేటివ్ ఫ్రీడమ్’ అనే వంకతో మేం టిల్డాతో నటింపజేశాం. ఆ సినిమా టైంలో ఈ పాయింట్‌ను చాలామంది లేవనెత్తారు. విమర్శించారు. అది మాకొక మేలుకొలుపు ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం’’ అని ఫెయిగి ఓ ప్రెస్మీట్లో తెలిపాడు. ఇక సిము లీ హీరోగా ‘షాంగ్-చీ’ తెరకెక్కింది. ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 3న రిలీజ్ చేసేందుకు మార్వెల్ ప్లాన్ వేసింది. ఆసియాకు చెందిన ఒక నటుడిని లీడ్ రోల్ తీసుకోవడం మార్వెల్ హిస్టరీలో ఇదే మొదటిసారి. ఈ స్ట్రాటజీతో చైనా, ఇండియాలో బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టాలని మార్వెల్ స్కెచ్ వేసింది. చదవండి: ఆ మధుర బాణీలకర్త ఇకలేరు -
వర్ణ వివక్షపై ‘కరోనా’ పెంచిన విద్వేషం
కంటికి కనిపించని సూక్ష్మక్రిమి విద్వేషాగ్నిని రగిల్చింది కరోనా వైరస్ పరోక్షంగానూ నిండు ప్రాణాలను తీసేస్తోంది ఎవరో జ్వాలని రగిలిస్తే, మరెవరో బలైపోతున్నారు అసలే నల్లజాతీయులన్న వివక్ష, దానికి తోడు వైరస్ నింపిన విద్వేషం వెరసి అగ్రరాజ్యంలో ఆసియన్లపై దాడులు పెరిగిపోతున్నాయ్... ఆసియన్ల పట్ల అక్కసుతో రగిలిపోతున్న అమెరికన్లు నిన్నగాక మొన్న అట్లాంటాలోని ఆసియన్ మసాజ్ పార్లర్లను లక్ష్యంగా చేసుకొని ఎనిమిది మందిని పిట్టల్లా కాల్చిపారేశారు. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన శరణార్థిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి ప్రాణాలు తీశారు. ఒక ఫిలిప్పీన్ వ్యక్తిపై కత్తులతో దాడి చేస్తే , మరో చైనా మహిళకి నిప్పంటించి తగులబెట్టారు. ఇండియానాలో నాలుగు రోజుల కిందట ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా... అందులో నలుగురు సిక్కులు ఉన్నారు. ఇది జాతి వివక్ష దాడా? కాదా? అనేది దర్యాప్తులో తేలనుంది. ఈ మధ్య కాలంలో అమెరికాలో ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ బయటపడ్డపుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ దానిని చైనా వైరస్ అంటూ పదే పదే ప్రస్తావించడంతో ఆసియన్లు అంటేనే అమెరికన్లు మండిపడుతున్నారు. మొదట్నుంచి ఆసియన్లపై జాతి వివక్ష, చులకన భావం ఉండేవి. కరోనా అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేశాక విద్వేషం రెట్టింపైంది. ఆసియన్ అమెరికన్ అయిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలి పదవిని అందుకున్నప్పటికీ ఈ విద్వేషపూరిత దాడులు ఆగడం లేదు. కమలా హ్యారిస్‌ను చంపుతామని బెదిరించినందుకు ఫ్లోరిడాకు చెందిన ఓ 39 ఏళ్ల నర్సును గత శనివారం అరెస్టు చేశారు కూడా. జాతి వివక్ష దాడులకి వ్యతిరేకంగా పోరాడుతున్న స్టాప్ ఏఏపీఐ హేట్ న్యాయవాద సంస్థ గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు అమెరికా వ్యాప్తంగా ఆసియన్లను లక్ష్యంగా చేసుకొని 3,800 దాడుల ఘటనలు జరిగాయి. కరోనా విజృంభణ తర్వాత ఈ దాడుల ఘటనల్ని ఆ సంస్థ ఇంటర్నెట్ టూల్ సాయంతో సేకరించింది. వైరస్ వెలుగులోకి వచ్చాక ఆసియన్లపై దాడులు 150% పెరిగిపోయాయి. కాలిఫోర్నియాలో పెరిగిన దారుణాలు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా ఆసియన్ అమెరికన్లు నివసిస్తారు. తాజా అంచనాల ప్రకారం ఆ రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా ఆసియన్లు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 15 శాతానికి పైగా ఆసియన్లే. కరోనా వైరస్ వ్యాప్తి చెందక ముందు, తర్వాత దాడుల్ని పరిశీలిస్తే కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో ఏకంగా 1,200% పెరిగిపోయాయని ఆసియన్ ఫసిఫిక్ పాలసీ ప్లానింగ్ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది మార్చి-మే మధ్య 34 కౌంటీలలో 800కి పైగా కరోనా వైరస్‌కి సంబంధించిన దాడులే జరిగాయి. నేడు సెనేట్‌లో బిల్లుపై ఓటింగ్ అట్లాంటాలో కాల్పుల తర్వాత ఆ రాష్ట్రంలో పర్యటించిన అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు ఈ తరహా ఘటనల్ని ఇకపై జరగనివ్వబోమని ఆసియన్ కమ్యూనిటీకి హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్థానిక ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ ఒక బిల్లుని రూపొందించారు. బుధవారం ఆ బిల్లుపై సెనేట్‌లో ఓటింగ్ జరగనుంది. ఆసియన్లపై వివక్షాపూరిత భాషని వాడడం, హింసించడం, భౌతిక దాడులకు దిగడం వంటివాటికి అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లులో అంశాలను పొందుపరిచారు. ప్రధానంగా స్థానిక యంత్రాంగం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే చెరి సమానమైన బలం ఉన్న సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ఎంతవరకు కలిసివస్తుందోనన్న అనుమానాలున్నాయి. అందుకే సెనేట్ మెజారిటీ లీడర్ చక్ చమర్ ఈ బిల్లుని ఎవరైనా వ్యతిరేకిస్తే అంతకన్నా సిగ్గు చేటు ఉండదని వ్యాఖ్యానించారు. తప్పకుండా బిల్లు పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో ఆసియన్లకి కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. ఈ వైరస్‌కి ఆసియా దేశాలే కారణమని భావిస్తున్న అమెరికన్లు వారు కనిపిస్తే చాలు అకారణంగా ఆవేశానికి లోనవుతున్నారు, దాడులకు దిగుతున్నారు. ఒక ఆసియన్ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలు అయినప్పటికీ ఈ నేరాలు ఘోరాలు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. బైడెన్ సర్కార్ తెస్తున్న బిల్లులో వీటికి ఏమేరకు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.