మరోసారి పాకిస్థాన్ లక్ష్యంగా... | At Asean summit, Modi says export of terror, radicalisation a threat to region | Sakshi
Sakshi News home page

మరోసారి పాకిస్థాన్ లక్ష్యంగా...

Published Thu, Sep 8 2016 11:07 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

మరోసారి పాకిస్థాన్ లక్ష్యంగా... - Sakshi

మరోసారి పాకిస్థాన్ లక్ష్యంగా...

ఉగ్రవాద ఎగుమతి అంశమే దక్షిణాసియా భద్రతకు పెనుముప్పగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

లావోస్: ఉగ్రవాద ఎగుమతి అంశమే దక్షిణాసియా భద్రతకు పెనుముప్పగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. లావోస్ లో జరుగుతున్న 14వ ఆసియన్ (ఇండియా- ఆగ్నేయాసియా దేశాల అసోసియేషన్) సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.

'ఉగ్రవాద ఎగుమతి, రాడికల్ భావజాలం పెరుగుదల, అతివాద హింసా వ్యాప్తి అనేవి మన సమాజల భద్రతకు ఉమ్మడి ముప్పుగా మారాయి' అని పేర్కొన్నారు. చైనాలో జరిగిన జీ-20 సదస్సులో పాకిస్తాన్ తీరును ఎండగట్టిన ప్రధాని మోదీ.. మరోసారి ఆసియన్ వేదికగా కూడా దాయాదిని తూర్పారబట్టారు.

'ఈ ముప్పు ఏకకాలంలో స్థానికంగా, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఉంది. ఆసియన్ తో మన భాగస్వామ్యం ద్వారా పరస్పర సహకారంతో, సమన్వయంతో ఈ ముప్పును  అన్ని స్థాయిల్లో ఎదుర్కోవాల్సి ఉంది' అని ఆగ్నేయాసియా దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. భారత్ 'యాక్ట్ ఈస్ట్' విధానంలో ఆసియన్ కేంద్ర స్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో వనరుల సమన్వయం, సామరస్యం కోసం మన సంబంధాలు అత్యంత కీలకమని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement