ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్‌ సోదరి ఎవరో తెలుసా.. | Qamar Sheikh, PM Narendra Modi's Pakistani Sister Travel Across Borders To Tie Him Rakhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్‌ సోదరి ఎవరో తెలుసా..

Published Mon, Aug 19 2024 10:49 AM | Last Updated on Mon, Aug 19 2024 11:05 AM

Qamar Sheikh, PM Narendra Modi's Pakistani Sister Travel Across Borders To Tie Him Rakhi

ప్రధాని నరేంద్ర మోదీ చేతికి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి మరీ భారత్‌ పయనమవుతున్నారు పాకిస్తాన్‌ సోదరి ఖమర్‌ షేక్‌. రక్షాబంధన్‌ సందర్భంగా కమర్‌ షేక్‌ సరిహద్దునే దాటి వస్తున్నారు. తన సోదరుడు ప్రధాని మోదీతో కలిసి ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలని వస్తున్నట్లు సమాచారం. 

ఆమె ఇలా వరుసగుగా 30 ఏళ్ల నుంచి ప్రధాని మోదీ మణికట్టుకు రాఖీ కడుతున్నారట. ఇది వరుసగా ముప్పైవ ఏడాదని ఖమర్‌ షేక్‌ చెబుతున్నారు. తన సోదరుడుతో కలిసి ఈ పండుగను జరుపుకోవడాన్ని ఎన్నటికీ మిస్‌ చేసుకోనని అన్నారు. ప్రతి ఏడాది తానే స్వయంగా రాఖీ కట్టేలా ఏర్పాట్లు చేసుకుంటానని అన్నారు. 

ఎవరీ ఖమర్‌ షేక్‌..?
కరాచీలో జన్మించింది ఖమర్‌ షేక్‌. ఆమెకు 1981లో మొహ్సిన్‌ షేక్‌తో వివాహం జరిగింది. కమర్‌ భారతదేశానికి వచ్చినప్పుడు 1990లో అప్పటి గుజరాత్‌ గవర్నర్‌ డాక్టర్‌ స్వరూప్‌ సింగ్‌ ద్వారా మోదీని కలిసినట్లు చెప్పారు. అప్పటి నుంచే మా మధ్య అన్నా చెల్లెళ్ల సాన్నిహిత్యం ఏర్పడిందని వివరించారు. అంతేగాదు ప్రతి ఏడాది రక్షాబంధన్‌కు తానే స్వయంగా చేతులతో చేసిన రాఖీని మోదీకి కడతానని చెప్పారు. ఈ ఏడాది తాను రాఖీని వెల్వెట్‌పై తయారు చేసినట్లు తెలిపారు. 

అందులో ముత్యాలు, మెటల్‌ ఎంబ్రాయిడరీలు, టిక్కీలు ఉపయోగించినట్లు పేర్కొంది. రక్షాబంధన్‌కు ఒక రోజు ముందుగా టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు తెలిపారు. మోదీ 1990లో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడిగా ఉన్నప్పుడు తొలిసారిగా కలిశానని, అప్పుడే తాను ముఖ్యమంత్రి అవుతావని మోదీకి చెప్పానని నాటి సంభాషణను గుర్తు చేసుకున్నారు ఖమర్‌ షేక్‌. అలాగే ఆమె రాఖీని ఎలా తయారు చేశానో వివరిస్తున్న వీడియోని కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 
 

 (చదవండి: 'ఖుష్బు ఇడ్లీ' గురించి విన్నారా..? ఆ పేరు వెనకున్న స్టోరీ ఇదే..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement