rakhi
-
ఐఏఎస్ కల నుంచి సాధ్వీ గౌరీ గిరి దాకా...
ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం అది. నిక్కీ అని ముద్దుగా పిలుచుకునే చెల్లెలు ప్రాచీతో కలిసి ఆడుకోవడమంటే 13 ఏళ్ల అక్క రాఖీ సింగ్‌కు మహా ఇష్టం. పాఠశాలలోనూ చక్కని చదువరి. పెద్దయ్యాక ప్రజాసేవ చేయాలనేది ఆమె కల. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఆమె ఆశయం. స్ప్రింగ్ ఫీల్డ్ ఇంటర్కాలేజీలో 9వ తరగతి చదువుతూ స్కూళ్లో పాఠ్యాంశాలతోపాటు రామయణ, భాగవతాది ఇతిహాసాలపైనా అనర్గళంగా మాట్లాడేది. హిందూ మతంపై అచంచల విశ్వాసం ఉన్న రాఖీసింగ్ దుర్గాదేవిని బాగా పూజించేది. దేవీ శరన్నవరాత్రుల కాలంలో చెప్పుల్లేకుండానే నడిచిందని స్కూల్ యాజమాన్యంలోని అధికారి పీసీ శర్మ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలోని దౌలీ పట్టణం ఈమె స్వస్థలం. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి చూపే రాఖీ హఠాత్తుగా తాను సన్యాసినిగా మారతానని చెప్పినా తల్లిదండ్రుల్లో ఎలాంటి కలవరపాటు లేదు. ఆధ్యాత్మిక భావాలున్న తమ పెద్దకూతురు నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించారు. దీంతో జనవరి 19వ తేదీన జునా అఖాడాలో చేరి సాధ్వీగా మారేందుకు రాఖీ సిద్ధమైంది. ఆమెను పిండదాన్ క్రతువు తర్వాత గౌరీ గిరిగా పేరు మార్చి అఖాడాలో చేర్చుకుంటామని అఖాడా పెద్ద మహంత్ కౌషాల్ గిరి చెప్పారు. మలుపు తిప్పిన మహాకుంభమేళా తండ్రి సందీప్ సింగ్ ధాకరా, తల్లి రీమా సింగ్‌లతో కలిసి గత ఏడాది డిసెంబర్లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రాంతానికి వెళ్లింది. అక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రాపంచిక సుఖాలకు దూరంగా నిరాడంబరంగా గడుపుతున్న సాధువుల జీవనశైలిని చూసి ఆకర్షితురాలైంది. ఐఏఎస్ అధికారిగా ప్రజల కష్టాలను తీర్చే బదులు ఆధ్యాత్మిక బోధనల ద్వారా ప్రజల మానసిక సమస్యలు తీర్చడం ముఖ్యమని భావించింది. బాహ్య ప్రపంచ కష్టాల కడలిని ఈదలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను తన ఆధ్యాత్మిక బోధనలతో సాంత్వన చేకూరుస్తానని, సాధ్విగా తన వంతు సాయం చేస్తానని రాఖీసింగ్ చెప్పింది. డిసెంబర్ 26వ తేదీన తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వాళ్లు అందుకు అంగీకరించి సెక్టార్20 ప్రాంతంలోని మహంత్ కౌషాల్ గిరి ఆశ్రమంలో చేరి్పంచారు. కన్యాదానం నుంచి సాధ్వి దాకా 13 ఏళ్ల రాఖీ నడవడికను స్వయంగా గమనించిన అఖాడా పెద్దలు ఆమెను సన్యాసినిగా స్వీకరించేందుకు అంగీకరించారు. గురుగ్రామ్ నుంచి మహంత్ రాగా ఆయన సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ జనవరి ఆరో తేదీన తల్లిదండ్రులు ఆశ్రమానికి రాఖీని కన్యాదానం చేశారు. ఆరోజున అఖాడాలు ఆమెకు గౌరి అని నామకరణం చేశారు. కూతురు సన్యాసినిగా మారుతుండటంపై తల్లి రీమా స్పందించారు. ‘‘మా కుటుంబం గత నాలుగేళ్లుగా ఆధ్యాత్మిక మార్గంలోనే పయనిస్తోంది. మహంత్ మేముండే ప్రాంతంలో భాగవతం విశేషాలను అందరికీ విడమరిచి చెప్పేవారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లినప్పుడు రాఖీ తన మనసులోని మాట చెప్పింది. అది ఆమె నిర్ణయం కాకపోవచ్చు. భగవత్ సంకల్పం అనుకుంటా. ఆశ్రమంలో ఎందుకు చేర్పించారని బంధువుల నుంచి ఎన్నో ప్రశ్నలు. అయినా తల్లిగా నా బిడ్డ అక్కడ ఎలా ఉండగలదు? ఏం తింటుంది? అనే భయం నాకూ ఉంది. కానీ ఆమె నిర్ణయం దైవేచ్ఛ కాబట్టి మేం కూడా అడ్డుచెప్పలేదు’’అని తల్లి రీమా అన్నారు. సుదీర్ఘంగా క్రతువు సనాతన ధర్మ ప్రకారం సాధ్విగా మారితే ఆ అమ్మాయి కేశసంరక్షణపై ధ్యాస పెట్టకూడదు. జుట్టంతా ఉండలు కట్టినా పట్టించుకోవద్దు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించాలి. సాధ్వి గా మారే రోజున ఐదుగురు సాధువులు ఇచ్చిన ఐదు పవిత్ర పత్తిదారాలను స్వీకరించాలి. సన్యాసుల అన్నపానాలు, దీక్షా నియమాలను పాటించాలి. ప్రేమ, రాగద్వేషాలు, కామామోహాలను త్యజించాలి. మహాకుంభమేళాలో నాలుగో పవిత్ర పుణ్యస్నానాల రోజున అంటే జనవరి 19వ తేదీన పిండదాన్ క్రతువులో భాగంగా గౌరీని వేదమంత్రోచ్ఛారణల మధ్య గంగానదిలో 108 సార్లు ఓం నమఃశివాయ అని చదివిస్తూ ముంచుతారు. తర్వాత గంగాదేవికి హారతి ఇచ్చాక గౌరీ గిరిగా కొత్త పేరుతో పిలుస్తారు. ఇటీవల మరికొందరూ.. ఇటీవలికాలంలో భారత్‌లో ఎంతోమంది సాధారణ జీవితానికి స్వస్తిపలికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించారు. ఇందులో టీనేజర్లూ ఉన్నారు. సూరత్‌లో వందల కోట్ల ఆస్తులున్న వజ్రాల వ్యాపారి గారాలపట్టి, 8 ఏళ్ల దేవాన్షీ సంఘ్వీ సైతం సన్యాసినిగా మారింది. జైన్ సాధ్విగా కొత్త జీవితాన్ని ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి ఘటన ఇంకోటి గుజరాత్‌లోనే జరిగింది. హిమ్మత్‌నగర్‌లో నిర్మాణరంగంలో వ్యాపారం చేస్తూ రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టిన భవేశ్ భాయ్ భండారీ దంపతులు సన్యాసులుగా మారారు. అంతకుముందే అంటే 2022లోనే వీళ్ల టీనేజీ కుమారుడు, కుమార్తె సన్యాసులుగా మారడంతో వీళ్ల బాటలనే తల్లిదండ్రులు పయనించడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సైకిల్‌పై వెళ్లి.. రాఖీ కట్టించుకుని..
కథలాపూర్: రాఖీ పండుగంటే అన్నాదమ్ముల వద్దకు వచ్చి సోదరీమణులు రాఖీలు కట్టడం సర్వసాధారణం. అయితే తాను వృద్ధాప్యంలో రాలేను తమ్ముడు.. అనగానే ఓ తమ్ముడు సుమారు పది కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లి అక్కతో రాఖీ కట్టించుకున్నాడు. కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన ఉశకోల శంకరయ్యకు సుమారు 75ఏళ్లు ఉంటాయి. ఆయన అక్క, మెట్పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన చిలివేరి భాగమ్మకు సుమారు 80 ఏళ్లు ఉంటాయి. రాఖీ పండుగ సందర్భంగా భాగమ్మ తమ్ముడి వద్దకు వచ్చి రాఖీ కట్టాల్సి ఉంది. కానీ.. వృద్ధాప్యంతో రాలేకపోతున్నామని తమ్ముడికి కబురు పంపింది. దీంతో శంకరయ్య మనసు ఆపుకోలేక సైకిల్‌పై ఆత్మనగర్‌లోని అక్క వద్దకు వెళ్లి ఆమెతో రాఖీ కట్టించుకున్నాడు. -
అక్కలో అమ్మను చూసుకుంటా: బాలీవుడ్ నటి
అక్క నాకు మరో అమ్మలాంటిది అంటోంది బాలీవుడ్ నటి ఇషా గుప్తా. రాఖీ పండగ సందర్భంగా తన సోదరి నేహా గుప్తాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఇషా మాట్లాడుతూ.. అక్క ఎప్పుడూ సమయపాలన పాటించదు. కానీ తను చాలా మంచి వ్యక్తి. తనలో నేను మరో అమ్మను చూసుకుంటాను. అలా నాకు ఇద్దరు తల్లులు.బ్లాక్మెయిల్ చేసేదాన్నిమేము ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ క్లోజ్‌గా ఉంటాం. ఎప్పుడూ పోట్లాడుకోం. నేను కాస్త రౌడీయిజం చేసినా తను మాత్రం ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది. చిన్నప్పుడు తను ప్రోగ్రెస్ కార్డులు దాచిపెట్టుకుంటే నేను వాటిని తీసి అమ్మానాన్నకు చూపించేదాన్ని. లేదంటే ఎక్కడున్నాయో చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేసేదాన్ని అని పేర్కొంది.సహించలేనునేహా మాట్లాడుతూ.. నాకు మా చెల్లి అంటే ఎంత ఇష్టమంటే.. తను నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అస్సలు సహించలేను. తన ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నా సరే నా కాల్ లిఫ్ట్ చేయాలంతే! తన గురించి ప్రతీది నాకు తెలియాలనుకుంటాను. ప్రతి ఏడాది ఒకరికి ఒకరం రాఖీ కట్టుకుంటాం. పెద్దదాన్ని కాబట్టి గిఫ్టులు మాత్రం నేనే ఇస్తుంటాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. -
ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్ సోదరి ఎవరో తెలుసా..
ప్రధాని నరేంద్ర మోదీ చేతికి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి మరీ భారత్ పయనమవుతున్నారు పాకిస్తాన్ సోదరి ఖమర్ షేక్. రక్షాబంధన్ సందర్భంగా కమర్ షేక్ సరిహద్దునే దాటి వస్తున్నారు. తన సోదరుడు ప్రధాని మోదీతో కలిసి ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలని వస్తున్నట్లు సమాచారం. ఆమె ఇలా వరుసగుగా 30 ఏళ్ల నుంచి ప్రధాని మోదీ మణికట్టుకు రాఖీ కడుతున్నారట. ఇది వరుసగా ముప్పైవ ఏడాదని ఖమర్ షేక్ చెబుతున్నారు. తన సోదరుడుతో కలిసి ఈ పండుగను జరుపుకోవడాన్ని ఎన్నటికీ మిస్ చేసుకోనని అన్నారు. ప్రతి ఏడాది తానే స్వయంగా రాఖీ కట్టేలా ఏర్పాట్లు చేసుకుంటానని అన్నారు. ఎవరీ ఖమర్ షేక్..?కరాచీలో జన్మించింది ఖమర్ షేక్. ఆమెకు 1981లో మొహ్సిన్ షేక్‌తో వివాహం జరిగింది. కమర్ భారతదేశానికి వచ్చినప్పుడు 1990లో అప్పటి గుజరాత్ గవర్నర్ డాక్టర్ స్వరూప్ సింగ్ ద్వారా మోదీని కలిసినట్లు చెప్పారు. అప్పటి నుంచే మా మధ్య అన్నా చెల్లెళ్ల సాన్నిహిత్యం ఏర్పడిందని వివరించారు. అంతేగాదు ప్రతి ఏడాది రక్షాబంధన్‌కు తానే స్వయంగా చేతులతో చేసిన రాఖీని మోదీకి కడతానని చెప్పారు. ఈ ఏడాది తాను రాఖీని వెల్వెట్‌పై తయారు చేసినట్లు తెలిపారు. అందులో ముత్యాలు, మెటల్ ఎంబ్రాయిడరీలు, టిక్కీలు ఉపయోగించినట్లు పేర్కొంది. రక్షాబంధన్‌కు ఒక రోజు ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మోదీ 1990లో ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నప్పుడు తొలిసారిగా కలిశానని, అప్పుడే తాను ముఖ్యమంత్రి అవుతావని మోదీకి చెప్పానని నాటి సంభాషణను గుర్తు చేసుకున్నారు ఖమర్ షేక్. అలాగే ఆమె రాఖీని ఎలా తయారు చేశానో వివరిస్తున్న వీడియోని కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #WATCH | Ahmedabad, Gujarat: Qamar Mohsin Shaikh, PM Narendra Modi's rakhi sister says, "This time I have made the 'Rakhi' myself. I will also gift him (PM Modi) a book on agriculture as he is fond of reading. For the last 2-3 years I was unable to go due to Covid but this time I… pic.twitter.com/BMbbNrRyOP— ANI (@ANI) August 22, 2023 (చదవండి: 'ఖుష్బు ఇడ్లీ' గురించి విన్నారా..? ఆ పేరు వెనకున్న స్టోరీ ఇదే..!) -
మహాకాళేశ్వరునికి రక్షాబంధనం... అలరిస్తున్న వీడియో
దేశవ్యాప్తంగా నేడు రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వరుని ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.నేటి(సోమవారం) తెల్లవారుజామున 2.30 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించడంతోపాటు అందంగా అలంకరించిన రాఖీని కట్టారు. 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని సమర్పించారు. ఈ లడ్డూలను ఈరోజు భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఆలయ పురోహితులు పండిట్ ఆశిష్ పూజారి, పండిట్ వికాస్ పూజారి భస్మ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. #WATCH उज्जैन (मध्य प्रदेश): सावन माह के 5वें सोमवार के अवसर पर श्री महाकालेश्वर मंदिर में भक्तों की भीड़ उमड़ी। pic.twitter.com/SSjHKAk6eR— ANI_HindiNews (@AHindinews) August 19, 2024 -
అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అక్కచెల్లెమ్మలంతా తమ జీవితాల్లో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ఈ ప్రయాణంలో తాను తోడుగా ఉంటానంటూ ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2024 -
తమ్ముడిని మిస్ అవుతున్నా..
మహబూబ్‌నగర్‌కు చెందిన ఆర్.రాంకోటి, ప్రభావతికు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. వీరిలో పెద్దమ్మాయి సౌమ్య పెళ్లి అనంతరం గత నాలుగేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. మూడేళ్లు చికాగోలో ఉండగా ఏడాది నుంచి డల్లాస్‌లో ఉంటున్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి ప్రతి రాఖీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకొనేవారు. గతేడాది ఇక్కడికే వచ్చిన ఆమె తమ్ముడికి స్వయంగా రాఖీ కట్టింది. ఈ ఏడాది అమెరికాలో ఉండడంతో తన తమ్ముడు వినయ్‌కుమార్‌కు డల్లాస్ నుంచి కొరియర్ ద్వారా తమ్ముడికి రాఖీ పంపించింది. దీంతో వినయ్‌కుమార్ అక్క సౌమ్య పంపిన రాఖీతోపాటు మరో సోదరి విష్ణుప్రియతో రాఖీ కట్టించుకుంటానని పేర్కొన్నాడు.తమ్ముడిని మిస్ అవుతున్నా.. చిన్నప్పటి నుంచి రాఖీ పండుగ అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం డల్లాస్‌లో ఉండడం వల్ల తమ్ముడిని రాఖీ కట్టలేకపోతున్న. గతేడాది రాఖీ పండుగ రోజు అక్కడే ఉండడం వల్ల తమ్ముడికి రాఖీ కట్టాను. ఈ ఏడాది రాఖీ పండుగ రోజు తమ్ముడిని ఎంతో మిస్ అవుతున్నా. నేను పంపే రాఖీ తమ్ముడికి అందాలనే ఉద్దేశంతో మూడేళ్ల నుంచి కొరియర్ ద్వారా పంపుతున్న. ఆ రోజు వీడియో కాల్లో తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతాను. – సౌమ్య, ఎన్ఆర్ఐ (డల్లాస్) -
ఈసారి రాఖీ వ్యాపారం రూ. 12,000 కోట్లు!
ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ సుమారు రూ. 12,000 కోట్ల వ్యాపారాన్ని ఆర్జించే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. చైనాలో తయారైన రాఖీలతో పోలిస్తే దేశీయ రాఖీలకు డిమాండ్ గణనీయంగా పెరగడం వ్యాపార వృద్ధికి ముఖ్యమైన కారణం.రాఖీలకు పెరిగిన డిమాండ్‌తో గతేడాది జరిగిన రూ.10,000 కోట్ల వ్యాపారంతో పోలిస్తే ఈసారి పండుగ వ్యాపారం రూ.12,000 కోట్లకు చేరుకుంటుందని సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. అంటే గతేడాది కంటే 20 శాతం పెరుగుతుందన్న మాట. రాఖీల వ్యాపారం 2022లో రూ.7,000 కోట్లు కాగా, 2021లో రూ.6,000 కోట్లు, 2020లో రూ.5,000 కోట్లు, 2019లో రూ.3,500 కోట్లు, 2018లో రూ.3,000 కోట్లు.ఇప్పుడు దేశంలోని నగరాల్లో వివిధ కళారూపాలను సూచించే స్థానికంగా తయారు చేసిన రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాగ్‌పూర్‌లో తయారైన ఖాదీ రాఖీలు , జైపూర్‌కు చెందిన సంగనేరి ఆర్ట్ రాఖీ, పుణె నుంచి విత్తన రాఖీ, మధ్యప్రదేశ్‌లోని సత్నా నుంచి ఉన్ని రాఖీ, గిరిజన వస్తువులతో చేసిన వెదురు రాఖీ, అస్సాంలో తయారు చేసిన టీ ఆకు రాఖీలు వంటివి వీటిలో ఉన్నాయి. ఈ పండుగ సీజన్లో దేశీయ ఉత్పత్తుల అమ్మకాలు దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని సీఏఐటీ అంచనా వేసింది. -
కక్షలెందుకు తమ్ముడూ.. కలిసి ఉందాం ఎప్పుడూ..
ఖిలా వరంగల్: ఇంటిస్థలం విషయమై అక్కాతమ్ముడి మధ్య తలెత్తిన వివాదానికి పోలీసులు ప్రేమపూర్వక పరిష్కారం చూపించారు. తమ్ముడికి అక్కతో రాఖీ కట్టించి ఇద్దరినీ ఏకం చేశారు. ఉర్సు కరీమాబాద్ కోయవాడకు చెందిన పస్తం కోటమ్మ, ఆమె తమ్ముడు కొత్తూరు ఏడుకొండలు మధ్య వారసత్వ ఇంటిస్థలంకోసం గొడవ జరుగుతోంది. చివరికి కోటమ్మ.. తమ్ము డిపై మిల్స్‌కాలనీ పీఎస్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ సురేశ్ అక్కాతమ్ముడిని స్టేషన్‌కు పిలిపించారు. వారసత్వ ఇంటిస్థలం, తోబుట్టువుల అనుబంధంపై అవగాహన కల్పించి.. స్థల వివాదాన్ని పరిష్కరించారు. అనంతరం అక్కతో తమ్ముడికి రాఖీ కట్టించారు. సుహృద్భావ పరిష్కారానికి కృషి చేసిన ఎస్ఐ సురేశ్‌ను ఇన్స్పెక్టర్ మల్లయ్య అభినందించారు. -
Raksha Bandhan 2024: ఎక్కడ చూసినా మోదీ రాఖీలే..
అనుబంధాలను పంచుకునే పండుగ రక్షా బంధన్. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అన్యోన్యతకు చిహ్నం ఈ పండుగ. రాఖీ నాడు సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, ఆశీర్వాదం పొందుతారు. ఈసారి రక్షాబంధన్ ఆగస్టు 19న వచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో విక్రయాల కోసం రాఖీలను అందుబాటులో ఉంచారు. ఈసారి పిల్లల కోసం వెరైటీ రాఖీలు అనేకం కనిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చిన్నారులు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే ఛోటా భీమ్, హల్క్, డోరేమాన్, సూపర్మాన్, షించెన్, మోటు-పత్లు లాంటి అనేక కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన దుకాణదారు భాస్కర్ సాహ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా రక్షాబంధన్ రోజున మార్కెట్లోకి వివిధ రకాల రాఖీలను తీసుకువస్తుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీకి అమితమైన డిమాండ్ ఏర్పడిందని, ఎక్కడ చూసినా ఇటువంటి రాఖీలు కనిపిస్తున్నాయని తెలిపారు. మార్కెట్లో రూ.10 నుంచి రూ.50 వరకు ఖరీదు కలిగిన రాఖీలు విరివిగా విక్రయమవుతున్నాయన్నారు. -
విశాఖ: వందేళ్ల చరిత్ర సాక్ష్యానికి రక్షాబంధన్ (ఫొటోలు)
-
స్టేజీపైనే డైరెక్టర్‌కు రాఖీ కట్టిన అనుపమ..
-
ఆ కొత్త సీఎంకు ఏటా 20 వేల రాఖీలు..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్రంలోని మహిళల నుంచి ఎంతో ఆదరణ లభించింది. మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో శివరాజ్ సింగ్ ముందున్నారనే వాదన వినిపిస్తుంటుంది. రాష్ట్ర ప్రజలు ఆయనను ముద్దుగా ‘మామ’ అని పిలుచుకుంటారు. శివరాజ్‌కు ఇంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ అతని స్థానంలో మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే మోహన్ యాదవ్ కూడా రాష్ట్రంలోని మహిళల ఆదరణకు దక్కించుకున్నారు. గడచిన పదేళ్లుగా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని 20 వేల మంది అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీ కడుతున్నారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్ స్థానంలో మోహన్ యాదవ్ పేరును సీఎం పదవికి ప్రకటించడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మహిళా ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణ కూడా ఇందుకు ఒక కారణమంటున్నారు. పదేళ్ల క్రితం మోహన్ యాదవ్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఉజ్జయినిలోని బాగ్పురా, గోపాల్పురా ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది మహిళలు మోహన్ యాదవ్‌కు రాఖీ కట్టారు. ఆ సంఖ్య నేడు 20 వేలకు చేరుకుంది. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు మోహన్ యాదవ్ కానుకలు ఇస్తుంటారు. మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ ఆనందీబెన్ కూడా మోహన్ యాదవ్‌కు రాఖీ కట్టారు. మోహన్ యాదవ్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఒక సోదరి పేరు గ్యారాసి బాయి, మరొక సోదరి పేరు కళావతి యాదవ్. అతనికి ఇద్దరు సోదరులు నంద్లాల్ యాదవ్, నారాయణ్ యాదవ్. మోహన్ యాదవ్ ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. కళావతి యాదవ్ రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారు ఉజ్జయినిలోని వివిధ ప్రాంతాల నుండి ఆరుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కళావతి యాదవ్ ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మోహన్ యాదవ్‌కు భార్య సీమా యాదవ్, కుమారులు అభిమన్యు యాదవ్,వైభవ్ యాదవ్, కుమార్తె ఆకాంక్ష యాదవ్ ఉన్నారు. ఇది కూడా చదవండి: 2001- 2023.. అదే డిసెంబరు 13.. పార్లమెంట్ దాడుల్లో తేడా ఏమిటి? -
వ్యసనాల నుంచి వెలుగులోకి
పట్నాలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న రాఖీ శర్మ ఆ ఉద్యోగాన్ని వదిలేసి భర్త నడుపుతున్న రీహాబిలిటేషన్ సెంటర్‌ను తను స్వయంగా నిర్వహించడం మొదలుపెట్టింది. 5 వేల మంది ఇరవై ఏళ్ల లోపు పిల్లలను డ్రగ్స్ బారి నుంచి విముక్తి పొందేలా చేసింది. ఖైదీలలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్స్ ఇస్తోంది. మహిళలు వ్యసనానికి ఎలా లోనవుతున్నారు, వారు ఆ వ్యసనాల నుంచి బయట పడటం ఎలా అనే అంశంపై పని చేస్తున్నాను’ అని వివరిస్తోంది రాఖీ. వ్యసనాలకు గురైన వారు వాటినుంచి బయటపడి తిరిగి సంతోషకరమైన జీవనాన్ని పొందేందుకు ఆమె చేస్తున్న స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం కీలక అంశాలు. ‘‘ఒకరోజు అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. విషయం విని చాలా బాధ అనిపించింది. ఒక మహిళ బ్లేడ్‌తో ఒళ్లంతా కోసుకుంది. డ్రగ్స్ కారణంగా ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. మత్తు పదార్థాల నుంచి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కావడం లేదు. మహిళలు డీ–అడిక్షన్ సెంటర్లకు వెళ్లడం అనేది ఉందా.. అని నన్ను అడిగారు. మద్యపానం, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడిన వ్యక్తులు తమ అలవాటును వదిలించుకోవడానికి సహాయం చేయడం కూడా ఒక ముఖ్యమైన పని. నా మౌనం–పని ఈ రెండింటితో ఈ సెంటర్‌ను 22 ఏళ్లుగా నడుపుతున్నాను. వేలాదిమందిని మాదకద్రవ్య వ్యసనం బారి నుంచి బయటికి తీసుకువచ్చాను. ఒకప్పుడు తమ జీవితాలు అంధకారంలో ఉండి, అన్ని వైపులా నిరాశకు గురైన వారు ఇప్పుడు వారి కుటుంబాలతో జీవిస్తున్నందుకు సంతోషపడుతున్నాను. ► బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి.. పుట్టి పెరిగింది గురుగ్రామ్. కొన్నాళ్లు ఢిల్లీలోనే ఉన్నాను. జంషెడ్పూర్, కోల్‌కతాలలో చదువుకున్నాను. డాక్టర్ కావాలనుకున్నాను కాని బ్యాంక్ ఉద్యోగి అయిన నాన్న కోరిక మేరకు సీఏ చదివాను. పెళ్లయ్యాక పట్నా వచ్చాను. నేనూ బ్యాంకు ఉద్యోగం సంపాదించుకున్నాను. కానీ కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఏకకాలంలో నిర్వహించడం అంత సులభం కాదని కొన్ని రోజుల్లోనే అర్థమయ్యింది. అప్పటికే మా వారు డీ–అడిక్షన్ సెంటర్ నడుపుతున్నారు. కొన్నిరోజులు గమనించిన తర్వాత, బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేశాను. నిజానికి డీ–అడిక్షన్ సెంటర్ ఎలా పనిచేస్తుంది, మత్తు పదార్థాల నుంచి వ్యసనపరులను ఎలా బయట పడేయాలో ఏమాత్రం తెలియదు. కానీ క్రమంగా నేర్చుకున్నాను. ► కాల్చివేస్తానని బెదిరింపులు.. బీహార్‌లో డీ–అడిక్షన్ సెంటర్ నడపడం చాలా కష్టం. మాదకద్రవ్యాల వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఎక్కువగా నేర నేపథ్యం ఉన్న వారు వస్తారు. మంచి కుటుంబాలకు చెందిన పిల్లలు డ్రగ్స్‌కు బానిసలైతే పరువు పోతుందనే భయంతో వారిని బీహార్ నుంచి వేరే చోటకు పంపేవారు. ఇక ఓల్డ్‌సిటీలో డీ అడిక్షన్ సెంటర్‌కు వచ్చిన వారిని నిలువరించడం పెద్ద సవాలుగా ఉండేది. అలాంటి వాళ్లు మా కేంద్రానికి వచ్చి కొడతామంటూ ఉద్రేకంతో వస్తుంటారు. ఆ సమయంలో వారిపై వారికి అదుపు ఉండదు. వారి అలవాట్లను అడ్డుకుంటే బెదిరింపులు ఉండేవి. ‘బయటకు వెళ్లాక చూడు.. నిన్ను కాల్చేస్తామ’నేవారు. కేంద్రాన్ని మూసివేస్తామని బెదిరింపులు. కానీ నేనేం తప్పు చేయట్లేదు. భయమెందుకు? ► జైలులో డ్రగ్స్ నుంచి మహిళా ఖైదీల వరకు... పట్నాలోని బ్యూర్ జైల్లో ఖైదీల కోసం 10 ఏళ్లపాటు డీ–అడిక్షన్ క్యాంప్ నడిపాను. మహిళాఖైదీలతో ఈ క్యాంప్ స్టార్ట్ అయ్యింది. జైలులో ఓ బాలిక తన బట్టలు చింపుకుని బీభత్సం సృష్టించింది. అప్పుడు నన్ను పిలిచారు. ఆమెను చూడగానే ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని అర్థమైంది. తనకు డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఆమె అలా ప్రవర్తించింది. అప్పుడు ఇక్కడ ఖైదీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో జైలు ఐజీకి నివేదించాను. ఐజీ అభ్యర్థన మేరకు జైలులో మూడు రోజుల పాటు డీ–అడిక్షన్ క్యాంపు నిర్వహించారు. శిబిరంలో 1000 మందికి పైగా ఖైదీలు పాల్గొన్నారు. వందలాది మంది ఖైదీలు మాదకద్రవ్యాల నుండి విముక్తి పొందారు. ► నిషేధం తర్వాత.. ఒక డ్రగ్ మానేస్తే మరో మందు వాడటం మొదలు పెడతారు. బీహార్‌లో మద్య నిషేధం తర్వాత ఈ ట్రెండ్ కనిపించింది. ఇప్పుడు ప్రజలు గంజాయి, ఇతర డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులు మద్యం కంటే వారి వ్యసనం నుండి బయటపడటం చాలా కష్టం. నిషేధం కారణంగా, ప్రజలు డీ–అడిక్షన్ సెంటర్లకు రావడం మానేశారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ కోసం 15 ప్రత్యేక పడకలను అందించేందుకు కృషి చేశాం. ఆ తర్వాత ఈ విషయంలో వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చాం. 5 వేల మంది పిల్లలు మాదకద్రవ్యాల నుండి విముక్తి పొందారు. ► మహిళల కోసం.. చాలా మంది మహిళలు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండానే డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడేందుకు వస్తుంటారు. మహిళల కోసం ప్రత్యేక డీ–అడిక్షన్ సెంటర్ కూడా ఉంది. చాలా మంది మహిళలు తమ గుర్తింపును దాచుకుంటారు, కొందరు తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇక్కడకు వస్తారు. ఓ మహిళ భర్త దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడి నుంచి ఖరీదైన మద్యం తెచ్చేవాడు. ఆమె తన బిడ్డతో ఇంట్లో ఒంటరిగా ఉంటూ మద్యం సేవించి క్రమంగా దానికి బానిసయ్యింది. పట్టించుకునేవారెవరూ లేకపోవడంతో ఆమె బిడ్డ చదువుకు దూరమయ్యాడు. దాంతో డీ–అడిక్షన్ సెంటర్‌కి వెళ్లి, కొన్ని సెషన్స్ తర్వాత నార్మల్‌గా మారింది. అదేవిధంగా పట్నాలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన ఓ మహిళ డ్రగ్స్‌కు బానిసైంది. ఆమె ఎంబీఏ చేసింది. తల్లి చైనాలో, సోదరుడు అమెరికాలో ఉన్నారు. ఆమె వైవాహిక జీవితం బాగోలేదు. విడాకుల తర్వాత ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. డీ–అడిక్షన్ సెంటర్‌కు వచ్చేటప్పటికి ఆమె శరీరంపై చాలా కోతలు ఉన్నాయి. బ్లేడుతో తానే కోసుకుని ఆనందించేది. కొన్నినెలల చికిత్స తర్వాత ఆమె సాధారణ స్థితికి వచ్చింది. బీహార్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి మద్యానికి బానిసయ్యాడు. ఎంత ప్రయత్నించినా ఆ వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నాడు. భార్య ప్రోద్బలంతో ఆ ఐఏఎస్ డీ–అడిక్షన్ సెంటర్లో చికిత్స తర్వాత తన వ్యసనాన్ని విడిచిపెట్టాడు. చాలా మంది డాక్టర్లు, ఇంజినీర్లు డీఅడిక్షన్ సెంటర్ కు వచ్చి డ్రగ్స్ అలవాటు నుండి విముక్తి పొందారు.’’ అంటూ తను చేస్తున్న సేవ గురించి వివరించే రాఖీశర్మ ఎందరికో స్ఫూర్తిదాయకం. వీధిబాలలు, అనాథలు, వదిలివేయబడిన పిల్లలు ఎక్కువగా మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారు. అలాంటి పిల్లల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించాం. వీధి బాలల కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. 30–35 మంది పిల్లలకు భోజనం, పానీయం, విద్య అన్ని ఏర్పాట్లు ఉన్న చోట ఈ కేంద్రానికి వసతి కల్పించే సామర్థ్యం కల్పించాం. -
అక్కకు 95, తమ్ముడికి 85
సుభాష్‌నగర్: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది. -
అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తున్నారా.. ఐటీ రూల్స్ ఏంటో తెలుసా?
తోబుట్టువుల మధ్య అపురూపమైన బంధానికి అపూర్వ ప్రతిక రక్షా బంధన్. సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ తమ బంధం జన్మ జన్మలకూ కొనసాగాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడతారు. ఇక తమ సోదరీమణులకు ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలగాలంటూ అన్నాతమ్ముళ్లు తమ శక్తిమేరకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇదీ చదవండి: ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు బహుమతులు లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కాలంతో పాటు ట్రెండ్స్ మారుతున్నాయి. కానీ స్థిరంగా ఉన్న ఒక విషయం కొనసాగుతోంది. అదే సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ రక్షా బంధన్ సందర్భంగా సోదరికి ఎంత డబ్బు బహుమతిగా ఇవ్వవచ్చు.. దీనిపై ట్యాక్స్ ఉంటుందా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఎలా ఉన్నాయి.. నిపుణులు ఏం చెబుతున్నారు...? తెలుసుకుందాం. రూ.2 లక్షలకు మించితే.. ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేవైనా ఇతర చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బహుమతి ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అది నగదు బహుమతికైనా సరే ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి బహుమతి ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ ఉంటుందా? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం బహుమతులు గ్రహీతల చేతిలోకి వెళ్లాక పన్ను ఉంటుంది. అయితే కొంతమంది నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే పన్నుల ప్రభావం లేకుండా షేర్లను సోదరికి బదిలీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం.. అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తే.. ఇచ్చేవారికి కానీ, తీసుకునేవారికి కానీ ఎలాంటి ట్యాక్స్ పడదు అని పేర్కొంటున్నారు. -
రాఖీ కట్టేందుకే విక్రమ్‌ని పంపించాం! ఏం గిప్ట్ ఇస్తున్నావ్ మామా!
చందమామ రావే... జాబిల్లి రావే... అని పాలబువ్వ తిన్నన్ని రోజులూ పాడుతూనే ఉన్నాం. నీ పాట పాడుతూ, నువ్వు వస్తావని నమ్ముతూనే పెరిగాం. పెద్దయిన తర్వాత రావోయి చందమామా అని పిలిచాం. వస్తాడు నా రాజు ఈ రోజు అని దొంగచూపులు, బెంగచూపులు చూశాం. నెలవంక కోసం ఆకాశంలో వెతికాం. పున్నమి రోజు నీ వెన్నెల కోసం ఎదురుచూస్తుంటాం. మా చిన్నప్పుడు మా అమ్మ ‘నిన్ను అంతగా పిలిచింది’ ఎన్ని తరాలు పిలిచినా, ఎన్ని తరాల అమ్మలు పిలిచినా నువ్వు రాలేదు. అందుకే మేమే నీ దగ్గరకు వచ్చేశాం. అమ్మలందరికీ అమ్మ మా భూమాత. భూమి తల్లి తన ప్రతినిధిగా నీ దగ్గరకు విక్రమ్‌ని పంపించింది చూశావు కదా! అమ్మకు తమ్ముడంటే చాలా ఇష్టం మామా! రక్షాబంధన్ పండుగకు నీకు రాఖీ కట్టడానికే విక్రమ్‌ని పంపించింది చూడు! మరి!!! రక్షాబంధన్ కట్టించుకున్న నువ్వు... అమ్మకు బహుమతి ఏమిస్తున్నావ్ చందమామా! ఈ రోజు శ్రావణమాసం, పున్నమి రోజు. రక్షాబంధన్ వేడుక చేసుకుంటున్నాం. ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. అన్నదమ్ముల శ్రేయస్సు కోరుతూ అక్కచెల్లెళ్లు భగవంతుడికి పూజ చేసి, తీపి వంటకాలను నివేదన చేస్తారు. పూజలో ఉంచిన రక్షాబంధనాన్ని అన్నదమ్ముల ముంజేతికి కట్టి ‘ఇది నీకు రక్ష, నువ్వు నాకు రక్ష’ అని మమతలు పూయిస్తారు. పురాణకాలంలో యమున తన సోదరుడు యముడికి రాఖీ కట్టింది. శ్రీకృష్ణుడికి వరుసకు చెల్లెలైన ద్రౌపది రాఖీ కట్టింది. చరిత్రకాలంలో రాణి కర్ణావతి చక్రవర్తి హుమయూన్‌కి రాఖీ పంపింది. ఈ కథనాలను చదువుకున్నాం. రాఖీ మీద వచ్చిన సినిమాలను చూశాం. సినిమాలో హీరోకి అక్క పాత్ర కట్టినంత అందమైన రాఖీని చూసినప్పుడు ఈ సారి రక్షాబంధన్‌కి తన తమ్ముడికి కూడా అలాంటి అందమైన రాఖీనే కట్టాలని ప్రతి అక్కా ఉవ్విళ్లూరుతుంది. అలా వచ్చినవే రకరకాల రాఖీలు. ముత్యాలను పోలిన తెల్లటి పూసలతో అల్లిన రాఖీలు, కెంపుల వంటి రాళ్లు పొదిగిన రాఖీలు, తెల్లటి రాళ్లు, పచ్చటి చమ్కీలతో మెరిసే రాఖీలు, రంగురంగు పూసల రాఖీలు, మువ్వల రాఖీలు రూపుదిద్దుకున్నాయి. ఎకో ఫ్రెండ్లీగా మట్టి రాఖీలు మణికట్టును ఆకట్టుకున్నాయి. బంగారు, వెండి రాఖీలు రాజ్యమేలాయి. ఈ ఏడాది మాత్రం రాఖీల్లో చందమామ హీరో అయ్యాడు. రాఖీల మీద రాకింగ్ చేస్తున్నాడు. ఇక మేమైతే ఈ ఏడాది నీ రాఖీలతో పండుగ చేసుకుంటున్నాం. అమ్మాయిల చెవులు పట్టుకుని ఉయ్యాలలూగిన చాంద్‌బాలీలు ఇప్పుడు అబ్బాయిల మణికట్టు మీద మకుటాయమానంగా మెరుస్తున్నాయి. అర్ధవలయాకారంలో నువ్వు ముంజేతి మీద ఉంటే ప్రతి అబ్బాయీ ‘మా అక్క కట్టింది చూడు’ అని ప్రియురాలికి చూపించుకుంటూ తామే చందమామ అయినట్లు మురిసిపోతున్నారు... మెరిసిపోతున్నారు నీ మేనల్లుళ్లు. (చదవండి: తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!) -
తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!
ఆత్మీయత.. ఆప్యాయత.. సోదరభావం.. భద్రత ఇవన్నీ మిళితమైన సెంటిమెంటే రాఖీ పండుగ. అందుకే అన్నకు చెల్లి... తమ్ముడికి అక్క రాఖీ కట్టి ఆశీర్వాదాలొకవైపు.. అండగా ఉంటా అనే భరోసా మరోవైపు.. ఇలా భిన్న పార్శ్వాలు కనిపించే సెంటిమెంట్ పండుగ రాఖీపౌర్ణమి. అయితే, రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్న ఓ చిన్నారి.. కాస్త భిన్నంగా రాఖీని తానే స్వయంగా తయారు చేసిన కథే ఇది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మామిడి సహస్ర తల్లి ఇంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే, అమ్మతో పాటు కుట్లు, అల్లికలూ ప్రాక్టీస్ చేస్తున్న సహస్రకు ఓ ఆలోచన తట్టిందే ఆలస్యం.. ఓ క్లాత్ తీసుకుని దానిపై పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆకట్టుకునేలా ఓ రాఖీగా మల్చింది. అంతేకాదు.. తమ్ముడు అని ఎంబ్రాయిడరీ చేసిన ఆ రాఖీని రేపు రాఖీ పున్నమ సందర్భంగా తన సోదరుడికి కట్టబోతోంది చిన్నారి సహస్ర. అలా సహస్ర ఐడియా షాపుకెళ్లి రాఖీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చేస్తూనే.. అందరికంటే భిన్నమైన రాఖీని తమ్ముడికి కట్టేందుకు కారణమైంది. (చదవండి: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా!) -
అమితాబచ్చన్‌కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ..
ముంబయి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ని కలిశారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు నుంచి ముంబయిలోని జుహులో ఉన్న అమితాబ్ ఇంటికి వెళ్లారు. అనంతరం బిగ్‌బీకి దీదీ రాఖీ కట్టారు. ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనున్న 'ఇండియా' కూటమి భేటీకి హాజరయ్యేందుకు ముంబయికి చేరుకున్నారు. Today, Hon'ble CM Smt @MamataOfficial met Mr. @SrBachchan and Mrs. Jaya Bachchan along with their family at their residence in Mumbai. She wholeheartedly thanked them for their precious time and wished them luck in all their future endeavours. Few glimpses from the visit 👇 pic.twitter.com/MxgcoKi95B — All India Trinamool Congress (@AITCofficial) August 30, 2023 అమితాబ్‌ను కలిసి అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఆయన్ని విందుకు ఆహ్వానించినట్లు చెప్పారు. అమితాబ్ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపిన దీదీ.. బెంగాల్లో జరగనున్న దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఆహ్వానించినట్లు తెలిపారు. గతేడాది కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అమితాబ్ హాజరైన వేళ.. సినీ రంగంలో అందించిన సేవలకు ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం.. -
గుండెపోటుతో అన్న మృతి.. కడసారి రాఖీ కట్టి..
సాక్షి, పెద్దపల్లి జిల్లా: సంతోషంగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన సోదరి షాక్‌కు గురైంది. కళ్ల ముందు అన్న విగతజీవిగా ఉండడాన్ని చూసి ఆమె గుండెలు అవిసెలా రోదించింది. అంత దుఖంలో అన్న మృతదేహానికి ఆమె రాఖీ కట్టి తన రక్తసంబంధాన్ని ప్రదర్శించింది. ఈ హృదయ విదారకమైన దృశ్యం చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కనకయ్యకి.. రాఖీ పండగ సందర్బంగా రాఖీ కట్టడానికి ఆయన చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. సంతోషంగా వచ్చిన ఆమెకు అన్న కనకయ్య గుండెపోటుతో మృతి చెందాడని తెలిసి సొమ్మసిల్లిపడిపోయింది. అన్న మృతిని తట్టుకోలేకోపోయిన గౌరమ్మ బోరున విలపించింది. పుట్టెడు దుఃఖంలోనూ కడసారిగా అన్న మృతదేహానికి చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపింది. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
భంగపడ్డ మహిళా నేత ‘రాఖీ’ అస్త్రం.. వర్క్‌వుట్ అవుతుందా?
ప్రతీ పండుగా ఓ సెంటిమెంటే.. ఎన్నికల కాలంలో ప్రతీ సెంటిమెంటూ ఓ రాజకీయాస్త్రమే. అలాంటి ఆసక్తికర సెంటిమెంట్ రాజకీయాలకు ఇప్పుడు రాఖీ పండుగా ఓ అస్త్రంగా మారుతోందక్కడ. బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడటంతో పాటు.. సిట్టింగ్‌పై తిరుగుబావుటా ఎగరేసిన ఆ మహిళా నేత.. అవసరమైతే బీఆర్ఎస్ రెబల్‌గా.. ఇండిపెండెంట్‌గా బరిలో నిలవాలని యోచిస్తున్నారట. అందుకే.. ఇప్పుడక్కడ రాఖీలు కడుతూ.. కార్మిక క్షేత్రంలో సోదరభావాన్ని పెంచే యత్నం చేస్తోంది ఆ మహిళామణి. రామగుండంలో రాజకీయాలు చాలాకాలంగా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని కొందరు అసమ్మతి నేతలు తిరుగుబాటు ప్రకటించినా.. మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో గులాబీ బాస్ చందర్‌కే టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే, మంత్రుల బుజ్జగింపులతో కొంత సద్దుమణిగినట్టు తాత్కాలికంగా కనిపించినా.. అసమ్మతి నేతల్లో ఆ జ్వాలలు మాత్రం ఆరడం లేదు. అందులో పాలకుర్తి జెడ్పీటీసీ, బీఆర్ఎస్ ఆశావహ నేత కందుల సంధ్యారాణిది కూడా కీలకపాత్రే. అయితే, చందర్‌కు టిక్కెట్ కేటాయించాక.. ఆయన అనుచరులు ఆమెను కించపర్చే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ వారం క్రితం సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోస్ కూడా పోస్ట్ చేసిన సంధ్యారాణి.. ఇప్పుడు రామగుండంలో బీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ( ఫైల్ ఫోటో ) అవసరమైతే ఇండిపెండెంట్‌గా కూడా బరిలో ఉండేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో.. సంధ్యారాణి ఇప్పుడు రాఖీపండుగ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటోంది. కార్మిక క్షేత్రమైన సింగరేణిలో వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు.. ప్రతీ గనిలో పర్యటిస్తూ తనకు మద్దతు ప్రకటించాలంటూ రాఖీ కడుతూ సోదరభావంతో కూడిన సెంటిమెంట్ ను వారిలో తీసుకొస్తున్నారు సంధ్యారాణి. చదవండి: అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం మొత్తంగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్న క్రమంలో.. కొంత అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్న చోట అవి మరింత రక్తి కట్టిస్తున్నాయి. మరోవైపు నేతలు ఎవరికివారు ప్రజల మద్దతును కూడగట్టి వాటిని ఓట్లుగా మల్చుకునే క్రమంలో ప్రతీ అంశాన్నీ తమకనుకూలమైన అస్త్రంగా మల్చుకునే యత్నాలు చేస్తూనే ఉన్నారు. పైగా ఇండిపెండెంట్లకు కూడా పెద్దపీట వేస్తూ.. ఎమ్మెల్యేలను మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కోల్ బెల్ట్ ఏరియా రామగుండంలో ఆ సెంటిమెంట్‌ను అందిపుచ్చుకునేందుకు.. ఇప్పుడు రాఖీ సెంటిమెంట్‌తో ముందుకొచ్చారు కందుల సంధ్యారాణి. -
ఎకో ఫ్రెండీ వినాయకుడినే చూశారు.. మట్టితో ఈసారి రాఖీ చేసుకుందామా?
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేశాం. ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలను చూశాం. ప్రకృతి– పర్యావరణాల బంధానికి... ఇకపై... ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధనం. బంధాల అల్లిక రాఖీ పండుగకు... అనుబంధాల లతలల్లింది శ్రీలత. నిజామాబాద్‌కు చెందిన శ్రీలత సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. గృహిణిగా ఇంటి నాలుగ్గోడలే జీవితం అనుకోలేదామె. నాలుగు గోడలను సృజనాత్మకతతో తీర్చిదిద్దారు. శ్రీలత తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఏ గోడను చూసుకున్నా తాను చేసిన ఫ్లవర్ వాజ్, కార్నర్ స్టాండ్, తలమీద కుండలు పేర్చుకుని భవనంలోకి అడుగుపెడుతున్న ఎంబ్రాయిడరీ గొల్లభామ, రాధాకృష్ణుల వాల్ హ్యాంగింగ్‌లు కనిపిస్తాయి. తలెత్తి చూస్తే షాండ్లియర్ కనువిందు చేస్తుంది. బీరువా తెరిస్తే తాను పెయింటింగ్ చేసుకున్న చీరలు. ఏక్తార మీటుతున్న భక్త మీరాబాయి ఆమె కుంచెలో ఒదిగిపోయి చీర కొంగులో జాలువారి ఉంది. మెడలో ధరించిన టెర్రకోట ఆభరణంలో రాధాకృష్ణులు వయ్యారాలొలికిస్తుంటారు. మరోదిక్కున వర్లి జానపద మహిళలు కొలువుదీరిన మినీ టేబుల్ స్టాండ్. డాబా మీదకెళ్తే మొక్కల పచ్చదనం, చుట్టూ ఎర్రటి పిట్టగోడల మీద తెల్లటి చుక్కల ముగ్గులు... ఖాళీ సమయాన్ని ఇంత ఉపయుక్తంగా మార్చుకోవచ్చా... అన్న విస్మయం, అందరికీ రోజుకు ఇరవై నాలుగ్గంటలే కదా ఉంటాయి... ఇన్ని రకాలెలా సాధ్యం అనే ఆశ్చర్యం ఏకకాలంలో కలుగుతాయి. ఇప్పుడామె రాబోతున్న రాఖీ పండుగకు పర్యావరణహితమైన టెర్రకోట రాఖీల తయారీకి సిద్ధమయ్యారు. తన కళాభిరుచిని సాక్షితో పంచుకున్నారు శ్రీలత. రంగు... బ్రష్ ఉంటే చాలు! ‘‘మా సొంతూరు దోమకొండ. మా చిన్నప్పుడే నిజామాబాద్‌కి వచ్చేశాం. అత్తగారిల్లు బాన్సువాడ, కానీ మావారి వ్యాపారరీత్యా నిజామాబాద్‌లోనే స్థిరపడ్డాం. అత్తగారిల్లు ఉమ్మడి కుటుంబం, ఇంటి బాధ్యతల కోసం పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండేది. దాంతో ఉద్యోగం మానేయక తప్పలేదు. అయితే నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత ఖాళీ సమయం ఎక్కువగా ఉంటోంది. పిల్లలు ముగ్గురూ స్కూళ్లకు, కాలేజ్‌కి, మా వారు బయటకు వెళ్లిన తర్వాత రోజంతా ఖాళీనే. టీవీ చూస్తూ గడిపేయడం నాకు నచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్న కళలన్నీ గుర్తుకు వచ్చాయి. నా క్రియేటివ్ జర్నీ అలా మొదలైంది. వీటన్నింటినీ చేయడానికి ముడిసరుకు కోసం మార్కెట్కెళ్లే పనే ఉండదు. ఇంటికి వచ్చిన పెళ్లి పత్రిక, చాక్లెట్ బాక్సులు, కేక్ కట్ చేసిన తర్వాత మిగిలిన అట్టముక్క... దేనినీ వదలను. రంగులు, బ్రష్‌లు కొంటే చాలు ఇక నాకు చేతినిండా పని. నా మెదడు చివరికి ఎంతగా ట్యూన్ అయిపోయిందంటే... ఉపయోగంలో లేని ఏ వస్తువును చూసినా దాంతో ఏమి చేయవచ్చు... అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఆలోచనలకు ఒక రూపం వచ్చిందంటే పని మొదలు పెట్టడమే. వచ్చిన ఐడియాని మర్చిపోతానేమోనని ఒక్కోసారి ఒకటి పూర్తికాకముందే మరొకటి మొదలు పెడతాను. మట్టితో రాఖీ! కోవిడ్ లాక్డౌన్ సమయం నాకు బాగా కలిసి వచ్చింది. ఒక్కరోజు కూడా బోరు కొట్టలేదు. అప్పటివరకు ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు మాత్రమే చేసిన నేను రాఖీల తయారీ కూడా మొదలు పెట్టాను. మొక్కల కోసం తెప్పించుకునే ఎర్రమట్టిని రాఖీలు, ఆభరణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుంటాను. మట్టిని నీటిలో నానబెట్టి కరిగిన తరవాత సన్నని చిల్లులున్న జల్లెడలో వేసి బకెట్లోకి వడపోయాలి. రాళ్లు, నలకలు, పుల్లల వంటివి జల్లెడ పైన ఉండిపోతాయి. ఓ గంట సేపటికి బకెట్లో నీరు పైకి తేలుతుంది. అడుగుకు చేరిన మట్టిని తీసి ఎండబెట్టాలి. తేమ ఆరిపోతూ ముద్దగా ఉన్నప్పుడు ఆభరణాలు తయారుచేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత కొబ్బరిపీచు, వరిపొట్టులో వేసి కాల్చాలి. ఇటుకలు కాల్చినట్లేనన్నమాట. వేడి చల్లారిన తర్వాత రంగులు వేసి, దారాలు చుడితే రాఖీ రెడీ. లాకెట్లు, చెవుల జూకాలు కూడా ఇలాగే చేస్తాను. మొక్క నాటుతాం! రాఖీలను మొదట్లో మా ఇంట్లో వరకే చేశాను. ఇప్పుడు నా రాఖీలు కావాలని బంధువులు, స్నేహితులు అడుగుతున్నారు. ఓ వంద రాఖీలు అవసరమవుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఆగస్టు మొదటివారం నుంచే పని మొదలుపెట్టాను. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగినప్పటి నుంచి మట్టి వినాయకుడి బొమ్మనే తెచ్చుకుంటున్నాం. పండుగ తరవాత గణపతిని పూలకుండీలో పెట్టి నీరు పోసి కరిగిన తరవాత మొక్క నాటుతాను. మరో విషయం... మా ఇంట్లో ఏటా పుట్టినరోజులు, పెళ్లిరోజుకు కొత్త మొక్కను నాటుతాం’’ అని చెప్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేశారు శ్రీలత. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు!
రక్షాబంధన్.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తమ ఆత్మీయతను వ్యక్తపరిచేరోజు. ఆ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు జీవితాంతం రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అయితే సోదరులు ఈ వాగ్దానంతో పాటు తమ సోదరీమణులకు ఏదైనా కానుక ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ విషయంలో సోదరులు మల్లగుల్లాలు పడుతుంటారు. కాగా ఒక కుర్రాడు రాఖీ రోజున తనకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఒక లిస్టు తయారు చేశాడు. దానిని సోషల్ మీడయాలో షేర్ చేయగా, అది వెంటనే వైరల్‌గా మారింది. అతను తనకు వరుసకు సోదరీమణులయ్యేవారికి రాఖీ రోజున ఎంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలో ఆ పోస్టులో రాశాడు. పిన్ని కూతురికి 11 రూపాయలు. ఎదురింటిలోని చెల్లెలికి 10 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ స్కూల్లోని చెల్లెలికి 21 రూపాయలు. ట్యూషన్లోని చెల్లెలికి 11 రూపాయలు. డైరీ మిల్క్ చాక్లెట్. ఇంకా ఎక్కువ మంది సోదరీమణులు వస్తే వారికి 5 రూపాయల పర్క్ చాక్లెట్ నా సొంత సోదరికి ఒక రూపాయికి లభించే 2 ఎక్లెయిర్స్ టోఫీలు ఈ కుర్రాడు రాఖీకి తనకు అయ్యే మొత్తం ఖర్చును 80 రూపాయలలో అడ్జెస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. @indian.official.memes అనే పేజీలో దీనిని షేర్ చేశారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేశారు. ఈ పోస్టును చూసిన యూజర్లు దీనిని లైక్ చేస్తున్నారు. వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ 2000 మందికి పైగా లైక్ చేశారు. ఒక యూజర్ ఇలా రాశాడు.. ‘ఈ కుర్రాడు తన సొంత సోదరికి కేవలం ఒక రూపాయి విలువ చేసే 2 చాక్లెట్లు మాత్రమే ఇస్తున్నాడు. ఎంత క్రూరమైన సోదరుడు’ అని రాయగా మరొక యూజర్ ‘వావ్ బ్రదర్, వాట్ యాన్ ఐడియా’ అని రాశాడు. ఇంకొక యూజర్ ‘ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి’ అని రాశాడు. ఇది కూడా చదవండి: యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది? -
ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ..
రక్షా బంధన్ రోజు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన పాకిస్తాన్ సోదరి రాఖీ కట్టనున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ రానున్నారని సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన మహిళ ఖమర్ మొహసిన్ షేక్ తన వివాహం తర్వాత అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. గత 30 ఏళ్లుగా ప్రధాని మోదీకి రాఖీ కడుతూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా రావడం లేదు కానీ సంప్రాదాయం ప్రకారం స్పీడ్ పోస్టులో ప్రధాని మోదీకి రాఖీ పంపించారు మెహసిన్ షేక్. ఆయనకు పంపించే రాఖీ స్వయంగా ఆమె తన చేతులతో తయారు చేస్తానని చెప్పారు. గత ఏడాది పంపించిన రాఖీతో పాటు 2024 ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది స్వయంగా వచ్చి రాఖీ వేడుకలను ప్రధాని మోదీతో కలిసి జరుపుకోనున్నట్లు స్పష్టం చేశారు. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఉండే తన అన్నకు వ్యవసాయానికి సంబంధించిన ఓ బుక్‌ను కూడా బహుకరించనున్నట్లు వెల్లడించారు. ' రాఖీని నేనే తయారు చేశాను. ఈ సారి ఓ బుక్‌ను కూడా బహుమతిగా ఇవ్వనున్నాను. గత 2-3 ఏళ్లుగా కోవిడ్ కారణంగా కలవలేదు.. ఈ సారి మాత్రం తప్పకుండా కలుస్తాను. ప్రధాని మోదీకి సుధీర్ఘంగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన కోరికలన్నీ నిజమవుగాక. అప్పట్లో గుజరాత్‌కు సీఎం అవ్వాలని కోరుకున్నా.. అలాగే అయ్యారు. రాఖీ కట్టిన ప్రతిసారి నరేంద్ర మోదీ పీఎం కావాలని కోరుకునేదాన్ని. నేను కోరుకునేవన్నీ దేవుడు ఇస్తాడని మా అన్న మోదీ అనేవాడు. దేశానికి ఎనలేని సేవ చేశాడు.' అని ఖమర్ మొహసిన్ షేక్ చెప్పారు. #WATCH | Ahmedabad, Gujarat: Qamar Mohsin Shaikh, PM Narendra Modi's rakhi sister says, "This time I have made the 'Rakhi' myself. I will also gift him (PM Modi) a book on agriculture as he is fond of reading. For the last 2-3 years I was unable to go due to Covid but this time I… pic.twitter.com/BMbbNrRyOP — ANI (@ANI) August 22, 2023 ఖమర్ మొహసిన్ షేక్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసినప్పుడు గతంలో ప్రధాని మోదీకి మొదటిసారి రాఖీ కట్టినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 30 ఏళ్లుగా ప్రతి ఏడాది రాఖీని కడుతూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 186 ఏళ్ల తర్వాత.. కొత్త చరిత్రకు శ్రీకారం,, భారత శిక్షా స్మృతి సరికొత్తగా.. -
నేను స్టూడెంట్ సార్ అనేవాణ్ణి
‘‘నేను ప్రతిరోజూ విద్యార్థిలానే భావిస్తాను. ‘నేను స్టూడెంట్ సర్’ టైటిల్ విన్నప్పుడు నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. ఏదైనా తింగరి పని చేసి పోలీసులకు దొరికినప్పుడు ‘నేను స్టూడెంట్ సార్’ అనేవాణ్ని’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. బెల్లంకొండ గణేశ్ హీరోగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘24/7 ఒకటే ధ్యాస..’ అనే పాటని విశ్వక్ సేన్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నేను స్టూడెంట్ సర్’ టీజర్ బాగుంది. సినిమా మంచి హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఫోన్ కొనడానికి కష్టపడే సమయంలో వచ్చే మాంటేజ్ సాంగ్ ‘24/7 ఒకటే ధ్యాస..’’ అన్నారు బెల్లంకొండ గణేశ్. ‘‘మా సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాఖీ ఉప్పలపాటి. ‘‘హీరో క్యారెక్టర్ ఏంటో ఈ పాట ద్వారా చెప్పాం’’ అన్నారు సతీష్ వర్మ. కథారచయిత కృష్ణ చైతన్య, పాటల రచయిత హర్ష, హీరోయిన్లు అవంతిక, రితిక మాట్లాడారు. -
నేను స్టూడెంట్ సార్ రిలీజ్ డేట్ వచ్చేసింది
స్టూడెంట్‌గా థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు బెల్లకొండ గణేశ్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లకొండ గణేశ్ హీరోగా ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేను స్టూండెట్ సార్!’. ఇందులో అవంతిక దస్సాని హీరోయిన్గా నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారం యూనిట్ ప్రకటించింది. సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్. -
Chintala Posavva: దివ్య సంకల్పం
జీవితానికి పరీక్షలు అందరికీ ఉంటాయి. బతుకు పరీక్షాపత్రం అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో పత్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరి పరీక్ష వారిదే... ఎవరి ఉత్తీర్ణత వారిదే. ఆ పరీక్షలో పోశవ్వకి నూటికి నూరు మార్కులు. తన ఉత్తీర్ణతే కాదు... తనలాంటి వారి ఉత్తీర్ణత కోసం... ఆమె నిర్విరామంగా సాగిస్తున్న దివ్యమైన సేవ ఇది. ‘ఒకటే జననం... ఒకటే మరణం. ఒకటే గమనం... ఒకటే గమ్యం’ చింతల పోశవ్వ కోసం ఫోన్ చేస్తే ఆమె రింగ్‌టోన్ ఆమె జీవితలక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో చెబుతుంది. తెలంగాణ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే పోశవ్వ ఓ ధీర. జీవితం విసిరిన చాలెంజ్‌ని స్వీకరించింది. ‘అష్టావక్రుడు ఎనిమిది అవకరాలతో ఉండి కూడా ఏ మాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. పైగా రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి గురువయ్యాడు. నాకున్నది ఒక్క వైకల్యమే. నేనెందుకు అనుకున్నది సాధించలేను’ అనుకుంది. ఇప్పుడామె తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక, తనలాంటి వాళ్లకు ఉపాధికల్పిస్తోంది. పోరాటం చేస్తున్న వాళ్లకు ఆసరా అవుతోంది. తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న పోశవ్వ సాక్షితో తన జీవనగమనాన్ని పంచుకున్నది. నాన్న వైద్యం... నానమ్మ మొక్కు! ‘‘విధి నిర్ణయాన్ని మార్చలేమనుకుంటాను. ఎందుకంటే మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండీ నేను పోలియో బారిన పడ్డాను. ఆ తర్వాత నాన్న ఆయుర్వేద వైద్యం నేర్చుకుని నాకు వైద్యం చేశారు. నానమ్మ నన్ను గ్రామ దేవత పోచమ్మ ఒడిలో పెట్టి ‘నీ పేరే పెట్టుకుంటా, బిడ్డను బాగు చేయ’మని మొక్కింది. మెడ కింద అచేతనంగా ఉండిపోయిన నాకు ఒక కాలు మినహా మిగిలిన దేహమంతా బాగయిపోయింది. కష్టంగానైనా నాకు నేనుగా నడవగలుగుతున్నాను. నాకు జీవితంలో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని ఎం.ఏ., బీఈడీ చదివించారు. చదువు పూర్తయిన తర్వాత మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌లో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేదు. ఫీల్డు మీదకు వెళ్లాల్సిన ఉద్యోగం అది. నేను పనిని పరిశీలించడానికి పని జరిగే ప్రదేశానికి వెళ్లి తీరాలి. నేను వెళ్లడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని చోట్లకు మామూలు మనుషులు వెళ్లడం కూడా కష్టమే. ఇతర అధికారులు, ఉద్యోగులు ‘మీరు రాకపోయినా ఫర్వాలేదు’ అంటారు. అయినా ఏదో అసంతృప్తి. ఉద్యోగాన్ని అలా చేయడం నాకు నచ్చలేదు. నెలకు ముప్ఫై వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను. హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో సర్ఫ్, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సబీనా తయారీలో శిక్షణ, చిన్న ఇండస్ట్రీతో బతుకు పుస్తకంలో కొత్త పాఠం మొదలైంది. కోవిడ్‌తో కొత్త మలుపు నేను మార్కెట్లో నిలదొక్కుకునే లోపే కోవిడ్ వచ్చింది. మా ఉత్పత్తులు అలాగే ఉండిపోయాయి. దాంతోపాటు వాటి ఉత్పత్తి సమయంలో ఎదురైన సమస్యలు కూడా నన్ను పునరాలోచనలో పడేశాయి. క్లీనింగ్ మెటీరియల్ తయారీలో నీటి వృథా ఎక్కువ, అలాగే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు దివ్యాంగులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. అందుకే నీటితో పని లేకుండా తయారు చేసే ఉత్పత్తుల వైపు కొత్త మలుపు తీసుకున్నాను. అవే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆ ప్రయత్నం నేను ఊహించనంతగా విజయవంతం అయింది. ఆ తర్వాత గోమయ గణపతి నుంచి ఇప్పుడు పదకొండు రకాల ఉత్పత్తులను చేస్తున్నాం. అందరూ దివ్యాంగులే. ఇక మీదట ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించాలనుకుంటున్నాను. కన్యాదాతనయ్యాను! మా జిల్లాలో ఎవరికి వీల్ చైర్ కావాలన్నా, ట్రై సైకిల్, వినికిడి సాధనాలు, పెన్షన్ అందకపోవడం వంటి సమస్యల గురించి నాకే ఫోన్ చేస్తారు. ఎన్జీవోలు, డీఆర్డీఏ అధికారులను సంప్రదించి ఆ పనులు జరిగేటట్లు చూస్తున్నాను. దివ్యాంగులకు, మామూలు వాళ్లకు కలిపి మొత్తం పన్నెండు జంటలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లలో ఇద్దరికి మాత్రం అమ్మాయి తరఫున పెళ్లి పెద్ద బాధ్యత వహించాల్సి వచ్చింది. నాకు అమ్మాయిల్లేరు, ముగ్గరబ్బాయిలు. ఈ రకంగా అవకాశం వచ్చిందని సంతోషించాను. సంకల్పం గొప్పది! నేను నా ట్రస్ట్ ద్వారా సమాజానికి అందించిన సహాయం ఎంతో గొప్ప అని చెప్పను. ఎంతో మంది ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. కానీ నాకు ఉన్నంతలో నేను చేయగలుగుతున్నాను. నా లక్ష్యం గొప్పదని మాత్రం ధీమాగా చెప్పగలను. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. నాకు గత ఏడాది మహిళాదినోత్సవం సందర్భంగా సత్కరించింది. నా కుటుంబ పోషణకు నా భర్త ఉద్యోగం ఉంది. నా దివ్యహస్తం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సర్వీస్ అంతా పర్యావరణ పరిరక్షణ, సమాజహితం, దివ్యాంగుల ప్రయోజనం కోసమే’’ అన్నారు. ‘ఉన్నది ఒకటే జననం... అంటూ... గెలుపు పొందే వరకు... అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు... గెలుపు కొరకే బతుకు’ అనేదే ఆమె తొలిమాట... మలిమాట కూడా. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. – వాకా మంజులారెడ్డి -
రాఖీ కట్టించుకునేందుకు భార్యతో కలిసి చెల్లి ఇంటికి వెళ్తూ... అంతలోనే..
న్యూఢిల్లీ: చెల్లితో రాఖీ కట్టించుకుందామని ఆనందంగా భార్యతో కలిసి బైక్ పై కలిసి వస్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీ జాతీయ రహదారిలో చోటుచేసుకుంది. ఈ మేరకు రాజధానికి సమీపంలోని నాంగ్లోయ్‌లో నివశిస్తున్న 35 ఏళ్ల విపిన్ కుమార్ రక్షబంధన్ పండుగను జరుపుకునేందుకు లోని ప్రాంతంలో ఉన్న తన చెల్లి ఇంటికి తన భార్యతో వస్తున్నాడు. అతను బైక్‌పై శాస్త్రి ఫై ఓవర్ వద్దకు చేరుకునేటప్పటికీ చైనీస్ గాలిపటం అతని మెడకు చుట్టుకుంది. అంతే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతని భార్య రహదారిపై ఉన్న స్థానికుల సాయంతో తన భర్తను ఆస్పత్రికి తరలించేటప్పటికే మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. వాస్తవానికి ఈ ఘటనలు గతంలో చాలా జరగడంతో ఢిల్లీలో 2016లోనే ఈ గాలిపటాల విక్రయాలను నిషేధించారు. దీంతో ఈ విషయమై స్పందించిన ఢిల్లీ హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించిన చైనీస్ ఫ్లాగ్‌ల విక్రయంలో పోలీసులు తీసుకున్న చర్యలేంటో వివరించాలని కోరింది. ధర్మాసం 2016లో ఈ చైనీస్ గాలిపటాలపై దాఖలైన ఫిల్‌ని విచారిస్తూ వీటిని నిషేధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. గతంలో ఈ గాలిపటాల కారణంగా వేర్వేరు ప్రమాదంలో చిన్నారుల నుంచి పెద్దలు వరకు మృతి చెందిన పలు ఘటనలు చోటుచేసుకోవడంతో ఢిల్లీ హైకోర్టు వాటి విక్రయాలను నిషేధించింది. (చదవండి: ఘోరం.. గోడపై మూత్రం పోయడంతో గొడవ.. తల్లిని దుర్భాషలాడినందుకు వెంటాడి చంపాడు) -
సోదరుడు అర్జున్ రెడ్డితో కలిసి సింగపూర్‌లో మంత్రి రోజా రాఖీ సెలబ్రేషన్
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరుడు అర్జున్‌రెడ్డితో కలిసి సింగపూర్‌లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య విడదీయరాని బంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్ సందర్భంగా సోదరుడికి రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు. -
చిరుతకు రాఖీ కట్టిన మహిళ: ఫోటో వైరల్
అందరూ రాఖీ పండుగను తమ సోదరులకు తమ ప్రియమైన వ్యక్తులకు కట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. మరికొంతమంది మనల్ని రక్షించే రక్షక భటులకు కట్టడం వంటివి చేస్తుంటారు. ఒక్కొకరు ఒక్కో పద్ధతిలో తమకు నచ్చిన రీతిలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడొక మహిళ మాత్రం ఏకంగా చిరుతకే రాఖీ కంటే తన గొప్ప మనసుని చాటుకుంది. ఏం జరిగిందంటే...చిరుతకి రాఖీ కట్టడమా! అని ఆశ్యర్యపోకండి. ఔను రాజస్తాన్‌లోని ఓ మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. అనారోగ్యానికి గురైన చిరుత పులిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆ చిరుతకు రాఖీ కట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద శుక్రవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన భారతీయులు జంతువుల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తూ వాటితో సామరస్యంగా ఉంటారని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది. ప్రపంచం మానువులకు మాత్రమే కాదని దేవుడు అన్ని రకాల జంతువులను సృష్టించాడని ఒకరు, వన్యప్రాణుల పట్ల మహిళలా ప్రేమగా వ్యవహరించాలని మరోకరు సదరు మహిళను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. For ages, man & animal in India have lived in harmony with unconditional love to the wild. In Rajasthan, a lady shows this unfettered love to our wild by tying a Rakhi(symbol of love & brotherhood ) to an ailing Leopard before handing over to Forest Department. (As received) pic.twitter.com/1jk6xi1q10 — Susanta Nanda IFS (@susantananda3) August 12, 2022 (చదవండి: నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం... తిట్టిపోస్తున్న జనాలు) -
Most Expensive Rakhi: ఖరీదైన రాఖీ... వజ్రాలపై ‘ఓం’గుర్తు’తో..
ఇప్పుడెక్కడ చూసినా రాఖీ ముచ్చటే. గుజరాత్‌లోని సూరత్ మాత్రం ఇంకాస్త స్పెషల్. ఎందుకంటే... అక్కడంతా ఈ ఫొటోలో ఉన్న రాఖీ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో ఏముంది? అంటే. దాని విలువ. ఆ రాఖీ ఖరీదు ఐదు లక్షలు. బంగారంతో డిజైన్ చేసిన రాఖీ మధ్యలో వజ్రాలను పొదిగారు. ఆ వజ్రాలపై మళ్లీ ‘ఓం’గుర్తును పొందుపరిచారు. ప్రతి ఏటా వివిధ రకాల బంగారు, వెండి, ప్లాటినమ్ రాఖీలతో ఆకట్టుకునే ఆ షాప్ ఈసారి... వజ్రాలు పొదిగిన రాఖీని తయారు చేసింది. సాధారణంగా రాఖీని రెండు, మూడు రోజుల తరువాత తీసేస్తారు. కానీ ఈ రాఖీని ఎప్పుడైనా ఆభరణంగా కూడా ధరించే వీలుందంటున్నాడు నగల షాప్ యజమాని దీపక్ భాయ్ చోక్సీ. అంతవిలువైన రాఖీని మీ అక్కనో, చెల్లెనో కడితే బాగుండేది అనుకుంటున్నారా.. అయితే అంతకంటే విలువైన గిఫ్ట్‌ను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మరి! -
ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నివాసంలో గురువారం ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సిబ్బంది కుమార్తెలు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మోదీకి రాఖీ కట్టిన వారిలో స్వీపర్స్, ప్యూన్స్, తోటమాలి, డ్రైవర్ సహా ప్రధాని కార్యాలయంలో పని చేసే వారి పిల్లలు ఉన్నారు. మోదీకి రాఖీ కడుతున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు పీఎంఓ అధికారులు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘ఈ ప్రత్యేక పండుగ రక్షా బంధన్ రోజున ప్రతిఒక్కరికి నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు మోదీ. అధికారిక నివాసంలో తనకు రాఖీ కట్టిన చిన్నారులను ఆశీర్వదించారు. వారితో కాసేపు ముచ్చటించారు. A very special Raksha Bandhan with these youngsters... pic.twitter.com/mcEbq9lmpx — Narendra Modi (@narendramodi) August 11, 2022 ఇదీ చదవండి: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు -
Photo Feature: చెట్టుకు రాఖీ.. సేమ్యాలపై జాతీయ గీతం
చెట్లను కూడా కుటుంబ సభ్యుల్లా సాకాలనే సందేశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో వందేళ్ల వయసున్న మర్రి చెట్టుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధులు బుధవారం రక్షాబంధన్ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విత్తన రాఖీ కట్టి చెట్లను కాపాడతామని ప్రతినబూనారు. – సాక్షి, విశాఖపట్నం సేమ్యాలపై జాతీయ గీతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భం పాస్తా(సేమ్యా)లపై జాతీయ గీతాన్ని రాసి అబ్బురపరుస్తోంది బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ గీతాన్ని రాయగలిగినట్టు ఆమె తెలిపింది. – కారంచేడు ముందుకొచ్చిన సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు తీరంలో ‘అల’జడి నెలకొంది. ముక్కాం, చేపలకంచేరు మధ్య బుధవారం 50 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. కెరటాల తాకిడికి ముక్కాం గ్రామ తీరంలోని రోడ్డు, మత్స్యకారుల ఇళ్లు కోతకు గురయ్యాయి. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది తీర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. (క్లిక్: ఉగ్ర కృష్ణ.. మహోగ్ర గోదావరి) – భోగాపురం మనోహర దృశ్యం శ్రీశైలం డామ్ పదిగేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు తరలివస్తున్నారు. పాల నురుగులా పొంగుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ పర్యాటకులు పరశించిపోతున్నారు. (క్లిక్: ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..) -
స్పృహ: పర్యావరణ రక్షాబంధన్
ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అని గట్టిగా అనుకోవచ్చు. అయితే ముంజేతి రాఖీకి అద్దం అక్కర లేకపోవచ్చుగానీ... అర్థం మాత్రం ఉంటుంది. బంధాల గురించి రాఖీ ఎన్నో మాటలు చెప్పకనే చెబుతుంది. ఇప్పుడది పర్యావరణహిత వచనాలు కూడా అందంగా చెబుతోంది. ‘మమ్మల్ని చల్లగా చూడు తల్లీ’ అంటూ చెట్లకు రాఖీ కట్టే ఆచారం ఉంది. ‘అయితే మనం చల్లగా ఉండాలంటే చెట్టు చల్లగా ఉండాలి. పర్యావరణం బాగుండాలి’ అంటున్నారు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహిళలు. పైన్ చెట్ల పత్రాలతో ఎకో–ఫ్రెండ్లీ రాఖీలు తయారుచేస్తూ పర్యావరణహిత సందేశాన్ని ఊరూరు తీసుకువెళుతున్నారు.... పైన్ చెట్ల నుంచి నేల రాలిన పత్రాల వలన ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నకు ఉపయోగపడే సమాధానం ఒకప్పుడు ఒక్కటి కూడా వినిపించేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. బోలెడు సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫామ్స్ ప్రయోగాత్మకంగా 22 మంది మహిళలకు పైన్ పత్రాలతో రాఖీల తయారీ నేర్పించింది. ఆ తరువాత సిమ్లా, సోలన్ జిల్లాలో 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒక కోణం అయితే, పర్యావరణానికి మేలు జరగడం మరో కోణం. ఎండిపోయిన పైన్ పత్రాల వల్ల అడవుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఆ ప్రమాదాల సంఖ్య చాలావరకు తగ్గింది. ‘గతంలో పైన్ పత్రాలపై దృష్టి ఉండేది కాదు. అయితే ఇప్పుడు అవి మాకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యావరణ ప్రయోజన కార్యక్రమాల్లో భాగం అయ్యేలా చేస్తున్నాయి’ అంటుంది ప్రియదర్శిని కుమారి. రకరకాల మొక్కల విత్తనాలు కూర్చి ఈ రాఖీలను తయారు చేయడం ప్రత్యేకతగా నిలుస్తుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణప్రాంతాల్లో చిన్నస్థాయిలో అయినా ఉపాధి దొరకడం కష్టం అయ్యేది. ఈ రాఖీల తయారీ వల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలను జనాలలో ప్రచారం చేయగలుగుతున్నాం’ అంటుంది 42 సంవత్సరాల హేమావతి. ట్రైనర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన హేమావతి నెలకు ముప్పై వేలకు పైగా సంపాదిస్తుంది. ‘పర్యావరణ స్పృహ పెరిగిన తరువాత ఎకో–ఫ్రెండ్లీ రాఖీలకు డిమాండ్ పెరిగింది. రెగ్యులర్ రాఖీల కంటే భిన్నంగా ఉండడం కూడా వీటి డిమాండ్‌కు మరో కారణం’ అంటుంది నేహా. ఊరూరూ తిరిగి ఎకో–ఫ్రెండ్లీ రాఖీలను అమ్మడమే కాదు పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలను ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకు వెళుతున్నారు. ‘ఈ సంవత్సరం నా సోదరులకు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు కట్టాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితులకు కూడా వీటి ప్రత్యేకతను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది కాలేజి స్టూడెంట్ శ్వేత. దిల్లీకి చెందిన తోరాని బ్రాండ్ రాఖీలు కూడా పర్యావరణ స్పృహతో తయారుచేయబడుతున్నాయి. పాత దుస్తులు, బట్టలతో తయారుచేసిన పాతబ్యాగులు... మొదలైన వాటిని ఉపయోగించి అందమైన రాఖీలు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంగళూరు(కర్నాటక)లోని ‘పేపర్‌సీడ్ కో’ అనే సామాజిక సంస్థ రకరకాల మొక్కల విత్తనాలను కూర్చి పర్యావరణహిత రాఖీలను తయారు చేస్తుంది. పండగ తరువాత చేతికి ఉన్న రాఖీలోని విత్తనాలు భూమిలోకి వెళ్లి పచ్చటి భవిష్యత్‌ను ఇస్తాయి. ఈ రాఖీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను ‘పేపర్‌సీడ్ విలేజి’ కోసం కేటాయిస్తున్నారు. ఇది మహిళలకు పర్యావరణహిత బొమ్మల తయారీలో శిక్షణ ఇచ్చే సంస్థ. ఎకో–ఫ్రెండ్లీ రాఖీల గురించి సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. -
మోదీకి రాఖీ పంపిన పాక్ సోదరి.. మళ్లీ పీఎం కావాలని ఆకాంక్ష
ఇస్లామాబాద్: రక్షాబంధన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ సోదరి కమార్ మోసిన్ షేక్ రాఖీ పంపించారు. ఈ సందర్భంగా 2024 జనరల్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ రాఖీ పండగకి పీఎం మోదీని కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపారు మోసిన్ షేక్. రాఖీని రేష్మీ రిబ్బన్, ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో తానే సొంతంగా తయారు చేసినట్లు చెప్పారు. ఈసారి మోదీ తనను ఢిల్లీకి ఆహ్వానిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాఖీతో పాటు మోదీ ఆరోగ్యంగా ఉండాలని లేఖ రాశారు మోసిన్ షేక్. ‘నేను లేఖ రాశాను. ఆయన ఆరోగ్యంగా, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు చేస్తున్న మాదిరిగానే ముందు ముందు మంచిపనులు కొనసాగించాలి. 2024లో మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది, అందుకు సరైన వ్యక్తి మోదీనే. ప్రతిసారి మోదీనే పీఎంగా ఉండాలి.’ అని పేర్కొన్నారు. గత ఏడాది సైతం రాఖీ, రక్షాబంధన్ కార్డు పంపించారు మోసిన్ షేక్. ఇదీ చదవండి: ‘ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం’.. ఇస్రో అధికారిక ప్రకటన -
సీఎం జగన్ కు రాఖి కట్టిన మహిళా డ్రైవర్
-
బొగ్గు గౌను.. మైనం చీర..ఫ్యాషన్ డిజైనర్ సృజన
కాలానుగుణంగా దుస్తులను రూపొందించి, విభిన్న మోడల్స్‌లో ఆకట్టుకునే ఫ్యాషన్ డిజైనర్లను ఎంతో మందిని చూశాం. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో బరేలీ జిల్లా వాసి ఫ్యాషన్ డిజైనర్ గుప్తా పరిచయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్ట్‌ను సైన్స్‌ను కలగలిపి వినూత్న డిజైన్లు రూపొందించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఏడుసార్లు గుర్తింపు తెచ్చుకుంది. టిష్యూ పేపర్‌తో చేసిన గౌను, మైనంతో చేసిన డ్రెస్, ఫెవికాల్తో చేసిన తెల్లటి దుస్తులు, బొగ్గు, తారుతో చేసిన గౌన్లు్ల, స్వచ్ఛమైన బంగారంతో రూపొందించిన లెహెంగా, వైట్ సిమెంట్‌తో చేసిన డ్రెస్, లిక్విడ్ సోప్‌తో చేసిన చీర.. ఇలా ఆమె రూపొందించిన వినూత్నమైన ఏడురకాల దుస్తులకు ఏడు సార్లు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసిన రాఖీ డ్రెస్ డిజైన్స్‌లో చేస్తున్న ఆసక్తికర ప్రయోగాలు తెలుసుకున్నా కొద్దీ ఆసక్తికరంగా ఉంటాయి. మోడల్ దుస్తులతో సైన్స్ ప్రాజెక్ట్ రాఖీ గుప్తా కుటుంబంలో అందరూ వైద్య వృత్తిలో ఉన్నారు. రాఖీ కూడా డాక్టర్ అవుతుంది అని అనుకున్నారు ఆమె తల్లీ తండ్రి. కానీ, చిన్ననాటి నుంచి రాఖీ ప్రవర్తన వేరుగా ఉండేది. తినడానికి ప్లేట్లో రొట్టెలను పెడితే, వాటిని అందంగా అలంకరించేది. స్కూల్లో టీచర్ సైన్స్ ప్రాజెక్ట్ చేయమంటే వార్తాపత్రికల కటింగ్‌తో డ్రెస్ డిజైన్స్ చేసి, పుస్తకంలో అతికించేది. ‘రెడ్ కార్పెట్‌పై నడిచే మోడల్స్ ధరించే దుస్తులంటే నాకు చాలా ఇష్టం. నా మనసు ఆసుపత్రిలో కాకుండా దేవకన్యలు, యువరాణుల దుస్తులలో చిక్కుకుంది. దీంతో నేను ఫ్యాషన్ డిజైనింగ్‌నే ఎంచుకున్నాను’ అంటుంది రాఖీ. సరైన దారి.. 2009లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాను. ఆ కోర్సు సమయంలోనే ఫ్యాషన్ షోలు చేశాను. అక్కడ నా డిజైన్స్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సంవత్సరం నాన్న చనిపోయారు. సర్వం కోల్పోయినట్టుగా అనిపించింది. డిజైనింగ్ నుంచి బయటకు వచ్చేశాను. అప్పుడు అమ్మ నాకు అండగా నిలిచింది. రంగుల ప్రపంచంపై నాకున్న ఇష్టాన్ని పదే పదే చెప్పేది. దీంతో తిరిగి డిజైనింగ్‌పై దృష్టి పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిజైనింగ్‌లో ఏదో కొత్త పని చేస్తూనే ఉన్నాను. సైన్స్, కళల కలయికకు గుర్తింపు ఫ్యాషన్ ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. ఇందులో డిజైనర్లందరూ తమ సృజనను చూపుతూనే ఉంటారు. నేను సంప్రదాయ దుస్తులను ముఖ్యంగా పెళ్లి డ్రెస్సులను డిజైన్ చేసేదాన్ని. ఫ్యాషన్ అనేది కేవలం బట్టలకే పరిమితం కాదని, ఏదో కొత్తదనాన్ని చూపాలనుకున్నాను. అప్పుడే సైన్స్ ద్వారా ఏదైనా సృష్టించాలనుకున్నాను. ఆ తర్వాత నా ఆలోచనలపై పరిశోధన చేస్తూనే ఉన్నాను. ప్రజలు ఊహించని విధంగా మైనం, బొగ్గు బేస్ చేసుకొని రెండు డ్రెస్సులను తయారు చేశాను. ఆ రెండింటికీ లిమ్కాబుక్ రికార్డ్‌లో చోటు దక్కింది. ఎంతో మంది చేత ప్రశంసలు, గౌరవం దక్కాయి. డిజైనింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకొని ఇతర వస్తువులనూ ఉపయోగిస్తూ ఫ్యాబ్రిక్‌ను తయారు చేయడం, వాటితో డ్రెస్సులను రూపొందించడం నా హాబీ. దీంట్లో భాగంగానే వైట్ సిమెంట్, ఫెవికాల్, సోప్ లిక్విడ్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ చీరలు, డ్రెస్సులు రూపొందించాను. ఏడురకాల ఈ దుస్తులకు ఏడుసార్లు లిమ్కా బుక్రికార్డులో చోటు దక్కించుకున్నాను’’ అని వివరించారు రాఖీ గుప్తా. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, సైన్స్‌ను కళను కలిపి తయారుచేసే డిజైన్లతో రికార్డులు సాధిస్తూ తీరిక లేకుండా ఉండే రాఖీ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటుంది. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళుతుంది. వృద్ధాశ్రమంలోని బామ్మలకు నచ్చిన చీరలు ఇచ్చి వస్తుంటుంది. పిల్లలకు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తుంది. బహుమతులు, భోజనం అందిస్తుంది. వినూత్నంగా ఆలోచించమని అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఆమె చేస్తున్న కృషికి గాను మహిళా సాధికారత అవార్డు, విశిష్ట పౌర పురస్కారం లభించాయి. -
రాఖీల తయారీదారుల బతుకు చిత్రం
-
‘రాఖీ’కి బదులు వినూత్న వేడుక
సాక్షి, అచ్చంపేట(మహబూబ్‌నగర్): సాధారంగా అక్కా చెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుక చేసుకుంటారు. కానీ నియోజకవర్గంలో మాత్రం పద్మశాలీలు వినూత్నంగా రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకుని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ. గాయత్రీ మాలధారణ.. పత్తితో తయారు చేసిన దారంతో కంకణం, జంధ్యం (గాయత్రిమాల) ధరిస్తారు. గాయత్రి హోమం నిర్వహించిన తరువాత పద్మశాలీలంతా నూలుతో తయారు చేసిన జంద్యాలను 41ఏళ్లు సామూహికంగా ధరిస్తారు. అనంతరం పూజలు నిర్వహిస్తారు. గతేడాది కరోనా వల్ల నిర్వహించలేకపోయారు. ఈసారి మళ్లీ నిర్వహించేందుకు భక్తమార్కడేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూలు పూర్ణిమకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రధానికి.. బృందావన్ రాఖీ!
బీద, గొప్ప, స్థాయి భేదం లేనివే అనుబంధాలు. అందుకే సొంత అన్నయ్యలు, తమ్ముళ్లకేగాక.. అప్యాయత, అనురాగాలు పంచేవారు, కష్టాల్లో వెన్నంటి ఉండి ధైర్యం నూరిపోసేవారు, ఆపదలో ఆదుకునే ప్రతిఒక్కరినీ తమ సోదరులుగా భావించి రాఖీ కడుతుంటారు మన భారతీయ అడపడుచులు. వీర జవాన్ల నుంచి ప్రధాని మంత్రిదాకా అందరికీ రాఖీలు పంపుతూ సోదర సమానులపై తమకున్న ప్రేమను చాటిచెబుతుంటారు. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన కొంతమంది వితంతువులు ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీలు పంపించారు. బృందావన్‌లోని ‘మా శారద’, రాధా తిల ఆశ్రమంలోని వయసుపైబడిన వితంతువులు ప్రధాని కోసం ప్రత్యేకంగా రంగురంగుల రాఖీలను రూపొందించారు. 251 రాఖీలను స్వయంగా తయారు చేసి, వాటిపై మోదీ ఫొటోనూ చిత్రీకరించారు. రాఖీలతోపాటు ‘ఆత్మనిర్భర్’, ‘స్టే సేఫ్’ అని మెసేజ్æ రాసిన ప్రత్యేకమైన మాస్కులు, స్వీట్లు పంపడం విశేషం. వీళ్లంతా మోదీని తమ సోదరుడిలా భావించి గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా రాఖీలు పంపిస్తున్నారు. గతేడాది బృందావన్‌కు చెందిన 103 ఏళ్ల వితంతు బామ్మ మోదీకి రాఖీ కట్టగా ఈ ఏడాది ఆ అవకాశం దక్కలేదు. దీంతో నలుగురు మహిళలతో మోదీకి రాఖీల బుట్టను పంపారు. -
ఒక కొమ్మకు పూచిన అనుబంధం
పుట్టినింటి ప్రేమ బంధం ఎన్నేళ్లయినా దారం పోగులతో మరింత పదిలంగా అల్లుకుంటూనే ఉంటుంది. అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఆండగా ఉండే ఆప్యాయతలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ మది నిండా సంతోషాలను నింపుతూనే ఉంటుంది. రక్షగా నేనున్నానంటూ జీవితమంతా భరోసాను చూపుతూనే ఉంటుంది. ఒక కొమ్మకు పూచిన పూలను కలిపే దారమైన రాఖీ తోబుట్టువుల ప్రేమను లోకాన చల్లని పున్నమి వెలుగులుగా పంచుతూనే ఉంటుంది. ‘‘బాగున్నావా అన్నా!’’ అంటూ ఆప్యాయతల మధ్య పుట్టినింటి గడపకు వచ్చి యోగక్షేమాలను కనుక్కునేలా చేసే రాఖీ పండగ అంటే అన్నకు అమితమైన ఆనందం. ‘అంతా సంతోషమేనా చెల్లీ’ అనే అన్న పలకరింపుతో గుండె బరువును దింపేసే రాఖీ అంటే తోబుట్టువుకు సంబరమే. హంగూ ఆర్బాటాలకు చోటు లేని, ధనిక–పేద తేడా చూపని రాఖీ తమ జీవితాల్లో నింపే ఆనందం గురించి కొందరు తోబుట్టువులు పండగపూట పంచుకున్న అనుభవాలు ఇవి. కేరింగ్.. షేరింగ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. పీజీ వరకు చదువుకున్న. గవర్నమెంట్ టీచర్ అవ్వాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నాకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు. మా చిన్నమ్మ కొడుకు గోపాల్ నాకు తోడబుట్టినవాడికంటే ఎక్కువ. ఏ చిన్న అవసరమైనా ‘అక్కా’ అంటూ ముందుంటాడు. తోడబుట్టిన అన్నదమ్ములు లేరనే లోటు ఎప్పుడూ అనిపించలేదు. చిన్ననాటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. స్కూల్, కాలేజీ ప్రతి చిన్న విషయం తమ్ముడితో షేర్ చేసుకోకుండా ఏ రోజూ లేదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాఖీ కట్టడం మిస్ అవలేదు. – విజయలక్ష్మి జీవితానికి మంచి దారి ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్నానంటే అక్క ఇచ్చిన సజెషన్సే. చదువులో ఎప్పుడూ సాయంగా ఉంటుంది. టెన్త్, ఇంటర్, ఆ తర్వాత బీటెక్ చేసే విషయంలోనూ అక్క గైడెన్స్ ఉంది. నాకు అవసరమైనది అమ్మనాన్నలకు చెప్పి మరీ ఒప్పిస్తుంది. నేనే విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడంలో ఆందోళన పడుతున్నట్టుగా అనిపిస్తే చాలు వెంటనే పసిగట్టేస్తుంది. ట్యూషన్స్ చెప్పి, పార్ట్ టైమ్ వర్క్స్ చేస్తుంటుంది. చదువే జీవితాలను మార్చుతుంది అని ఎప్పుడూ చెబుతుంది. ఏదైనా అవసరం ఉంటుందని, నాకే డబ్బులు ఇస్తుంటుంది. – గోపాల్ నా బాధ్యత మా అమ్మ, నాయినలు కూలీనాలీ చేసుకుని బతుకుతుండిరి. నేను ఏడో తరగతి దాగా చదివిన. నలుగురు అక్కచెల్లెళ్ల తోడ నేను ఒక్కణ్ణే. ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు ముందుగల్లనే అయిపోయినయి. అమ్మ, నాయిన చనిపోతే చెల్లెలి బాధ్యత∙నాదే అనుకున్న. మంచిగ చదువుకుని మా ఇంటికి వెలుగైంది. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల చదువుల సంగతి మా చెల్లెనే చూసుకుంటోంది. నా చెల్లెలిని చూస్తే గర్వంగా, సంతోషంగా ఉంటుంది. – సాయిలు మా అన్న త్యాగం గొప్పది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఉంటున్నాం. మా అమ్మనాన్నలు చనిపోతే అన్నీ తానై చూసుకున్నాడు మా అన్న. కూలి పనులకు వెళుతూ నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉన్నత చదువు చదవడానికి కారణం మా అన్నయ్యే. ఎం.ఎ. బీఈడీ చేశాను. ఇప్పుడు విద్యాశాఖలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్నాను. అన్నయ్య చేతుల మీదుగానే పెళ్లి జరిగింది. ఈ రోజు నేను ఆనందంగా ఉన్నానంటే మా అన్ననే కారణం. నా కోసం అన్న చేసిన త్యాగం చాలా గొప్పది. – సరోజ కలిస్తే పండగే! రాఖీ పండగ నాడు మా అన్న మా ఇంటికైనా రావాలి. లేదంటే నేనే మా అన్న ఇంటికి వెళ్లాలి. అన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తాడు. నేను ఇండ్లళ్ల పనులు చేస్త. నా పెళ్లయి పదిహేనేళ్లయినా ఏ ఒక్కసంవత్సరమూ రాఖీ కట్టుకోకుండా ఉన్నది లేదు. ఒకసారి అన్నకు ఆరోగ్యం బాగోలేకుండే. ఎంత తల్లడిల్లిననో. ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్ననో. అన్న ఉంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తది. మేం, మా అన్నపిల్లలు, మా పిల్లలు కలిస్తే చాలు ఆ రోజు మా ఇంట్ల పండగే. ఇక రాఖీ పండగ అయితే చాలు, ఆరోజు అందరం కలిసి సినిమాకు కూడా పోయేవాళ్లం. రాఖీ పండగ నాడు మాత్రం మా అన్న నాకు చీర తేకుండా రాడు. – సుమలత ఒకరికొకరం రక్ష మా సుమలత మనసు మంచిది. తన చేత్తో ఏది తీసుకున్నా నాకు మంచి జరుగుతుందని చిన్నప్పటి నుంచి నాకు నమ్మకం. మేం సదువుకున్నది లేదు. కానీ, ఒకరి కష్టంలో ఒకరం తోడుంటం. మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్‌ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నం. ఊరి నుంచి దూరంగా వచ్చి బతుకుతున్నవాళ్లం, మాకు మేమే రక్షగా ఉండాలనుకుంటాం. – సురేష్ మా మామయ్యకు మా అమ్మ రాఖీ కడుతుంది. నేను మా తమ్ముడు అజయ్‌కి రాఖీ కడతాను. పొద్దున్నే నేనూ, తమ్ముడు కొత్తబట్టలు వేసుకుంటాం. అమ్మ స్వీట్ చేస్తుంది. నాకు చాక్లెట్స్ ఇష్టం. అమ్మనడిగితే తిడుతుంది. కానీ, రాఖీ పండగ రోజు మాత్రం పెద్ద చాక్లెట్ కొని తమ్ముడితో నాకు ఇప్పిస్తుంది. ఒకటే చాక్లెట్ కదా అందుకని సగం చాక్లెట్‌ను తమ్ముడికి ఇస్తాను. ఈ పండగ చాలా బాగుంటుంది. – లాస్య ఎంత పని ఉన్నా ముందుంటాడు మాది తెలంగాణలోని చేవెళ్ల. ఆశావర్కర్‌గా పనిచేస్తున్నాను. రాఖీ పండగ వచ్చిందంటే చాలు మా తమ్ముడు ఇంటికి రాకుండా ఉండడు. ముగ్గురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు అన్నదమ్ములం. మా శేఖర్ చిన్నవాడు. అందుకే మా కందరికీ వాడంటే కొడుకులెక్క. నాకు ముగ్గురు బిడ్డలు. అందరి బాగోగులు తెలుసుకుంటూ, ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎంత పని ఉన్నా ‘అక్కా’ అని వచ్చేస్తడు. – అమృత రాఖీ కడితేనే ఆ ఏడాది అంతా మంచి అమ్మనాన్నలు పనికిపోతే అక్కనే నన్ను ఎక్కువ చూసుకుంది. అమ్మలెక్కనే నా బాగోగులు చూసుకుంది. హైదరాబాద్ బాలానగర్‌లోని ఓ హాస్పిటల్లో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తా. మా అందరి పెళ్ళిళ్లు అయి ఎవరి కుటుంబాలు వారివి అయినా వారానికి ఒకసారైనా కలుసుకుంటం. రాఖీ పండగ వస్తే మాత్రం ఎక్కడున్నా అక్కల దగ్గరవాలిపోతా. వారి చేత రాఖీ కట్టించుకుంటేనే ఆ సంవత్సరం అంతా నాకు మంచిగ ఉంటుందని నమ్మకం. – శేఖర్ -
నచ్చిన రాఖీ.. మెచ్చిన సందేశం..
సాక్షి, హైదరాబాద్: వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోల్లో నచ్చిన రాఖీని ఎంపిక చేసుకొని.. అక్కడే ఉన్న నచ్చిన సందేశాన్ని కూడా క్లిక్ చేసి పంపాల్సిన చిరునామా టైప్ చేసేసి.. రూ.100 చెల్లిస్తే స్పీడ్ పోస్టులో సందేశంతోపాటు ఎంపిక చేసిన రాఖీ ఆ అడ్రస్‌కు చేరిపోతుంది. తొలిసారి రాఖీని ఈ–షాప్ పద్ధతిలో సోదరులకు పంపే ఏర్పాటు చేసింది. తపాలాశాఖ ఠీఠీఠీ.్ఛటజిౌp.్టటఞౌట్టట.జీn వెబ్సైట్ ద్వారా ఈ అవకాశం లభించనుంది. శుక్రవారం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ దీన్ని ప్రారంభించారు. వెబ్సైట్లో రకరకాల నమూనాల రాఖీల చిత్రాలుంటాయి. పోస్టల్ కవర్, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ సందేశాలుంటాయి. -
రాఖీ మూవీ ఫొటో గ్యాలరీ
-
లైంగిక వేధింపులు: రాఖీ కడితే సరిపోతుందా?!
సాక్షి, న్యూఢిల్లీ: లైంగికదాడి కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిందితుడు బాధితురాలితో రాఖీ కట్టించుకోవాలంటూ నిబంధన విధించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ ఇచ్చే ఇలాంటి ఆదేశాలతో వేధించిన వ్యక్తిని సోదరుడిగా మార్చినట్లయిందని వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు వెలువరించిన ఆదేశాలను తప్పుపట్టిన న్యాయస్థానం లైంగిక దాడి కేసుల విచారణ సమయంలో జడ్జీలు పాటించాల్సిన పలు మార్గదర్శకాలను జారీ చేసింది. లైంగిక దాడి బాధితుల గత ప్రవర్తన, వారి వస్త్ర ధారణ, వారి పరస్పర విరుద్ధ వైఖరుల వంటి వాటిని తీర్పులిచ్చే సమయంలో ప్రస్తావించరాదని స్పష్టం చేసింది. ‘బెయిల్ దరఖాస్తుదారు తన భార్యాసమేతంగా 2020 ఆగస్టు 3వ తేదీ ఉదయం11 గంటలకు బాధితురాలి ఇంటికి రాఖీ, స్వీట్లు తీసుకుని వెళ్లాలి. ఆమెతో రాఖీ కట్టించుకుని, అన్ని వేళలా రక్షణగా నిలుస్తానని వాగ్దానం చేయాలి’అని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు అక్రమమంటూ 9మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టి మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టింది. ఇటువంటి తీర్పులు కేసు తీవ్రతను ముఖ్యంగా లైంగిక వేధింపుల విషయంలో తక్కువ చేస్తాయని పేర్కొంది. చట్టం ప్రకారం బాధితురాలిపై జరిగిన నేరం.. క్షమాపణలు, సామాజిక సేవ, రాఖీ కట్టించుకోవడం, బహుమతుల ద్వారానో, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం ద్వారా సమసిపోయే చిన్న తప్పు కాదని తెలిపింది. ఇటువంటి విషయాలపై జడ్జీలు, లాయర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అవగాహన కల్పించాలని బార్ కౌన్సిల్‌కు సూచించింది. చదవండి: మరాఠాలు వెనుకబడిన వర్గం కాదు -
ట్రెండింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ మూవీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం రాఖీ.. ఛార్మీ కౌర్, గోవా బ్యూటీ ఇలియానా ఫీమెల్ లీడ్‌లో నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సీనియర్ నటి సుహాసిని పవర్ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో రాఖీ ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. తను తప్ప మరెవరూ నటించలేరన్నంతగా డైలాగులతో ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా టచ్ చేశారు. 2006లో ప్రేక్షకుల ముదుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నేటితో రాఖీకి(డిసెంబర్22) 14 ఏళ్లు పూర్తియ్యాయి. ఈ సందర్భంగా ట్విటర్లో #14YearsForRakhi అనే హ్యష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సినిమాలో ఎన్టీఆర్ నటన వేరే లేవల్లో ఉందంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. చదవండి: బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా ఎన్టీఆర్ సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి చలించిపోయిన హీరో తీవ్ర కుంగుబాటుకు గురవుతాడు. తన చెల్లె కేసుకు వ్యతిరేకంగా వాదించిన న్యాయవాదిని, దొగ సాక్ష్యం ఇచ్చిన డాక్టరును, పోలీసులను కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. ఇలాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదని కంకణం కట్టుకుంటాడు. అప్పటి నుంచి సమాజంలో ఏ ఆడపిల్లకు ఎక్కడ అన్యాయం జరిగినా అంతు చూసే పనిలో పడతాడు. అక్కడ నుంచి మాయమయిపోయిన రాఖీ ఎక్కడ ఏ ఆడపిల్లను ఎవరు వేదించినా, బాధించినా వాళ్ళని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. ప్రెగ్నెంట్ అయిన తన చెల్లెను డబ్బుపిచ్చితో కాల్చి చంపినా కోర్టులో కేసుకొట్టేయడం చూసిన రాఖీ తన చెల్లి అత్తింటి వారందరినీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు. సినిమా క్లైమాక్స్‌లో రాఖీ కోర్టులో మాట్లాడే సీన్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. -
రాఖీ: చెల్లెళ్లతో చిరంజీవి.. వీడియో వైరల్
రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. రక్షా బంధన్ సంబర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవికి రాఖీ కట్టి నోరు తీపి చేసి ఆశీర్వాదం తీసుకోగా, వాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకొని ఆనందంగా గడుపుతున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. అంతే కాకుండా ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశారు. నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. Happy #RakshaBandhan ! pic.twitter.com/DAZrypOm5B — Chiranjeevi Konidela (@KChiruTweets) August 3, 2020 అలాగే హీరో నితిన్ కూడా తన సోదరి నిక్షిత రాఖీ కట్టిన ఫోటోను ట్విటర్లో పంచుకుంటూ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు తన కూతురు, కుమారుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ..'రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' అని పేర్కొన్నారు. -
ప్రతి ఇంటిలో అన్నగా మహిళల అభివృద్ధికి..
సాక్షి, తిరుపతి: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరి ఎమ్మెల్యే రోజా ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఇంటిలో అన్నగా ఉంటూ మహిళల ఆభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని కేవలం అమరావతిలో భూములు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
మోదీకి రాఖీ పంపిన పాకిస్తాన్ మహిళ!
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో రక్షబంధన్ రాబోతుంది. ప్రతి సోదరి తమ సోదరులకు రాఖీ కట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ పంపుతున్న పాకిస్తాన్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ ఈసారి కూడా రాఖీ పంపారు. మోదీ ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపినట్టు కమర్ తెలిపారు. మోదీని తనతోపాటు తన భర్త మొహిసిన్, కుమారుడు సుఫీయాన్ కూడా అభిమానిస్తారని ఈ సందర్భంగా కమర్ పేర్కొన్నారు. గత 25 ఏళ్ల నుంచి మోదీకి రాఖీ కడుతున్నానని అప్పుడు మోదీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని తెలిపారు. తన పట్టుదల, శ్రమతో మోదీ ప్రధానమంత్రి వరకు ఎదిగారని ప్రశంసించారు. మోదీ నుంచి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని కమర్ చెప్పుకొచ్చారు. చాలా సార్లు మోదీ, కమర్‌కు ఫోన్ చేసి రాఖీ కట్టించుకోవడానికి పిలిచారు. కమర్ భర్త, కొడుకు గురించి అడిగి తెలుసుకునే వారు. మోదీ చాలా సాధారణంగా కనిపించినా పనులు మాత్రం గొప్పగా చేస్తారని కమర్ కొనియాడారు. తన ఇద్దరు చెల్లెళ్లు కూడా మోదీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన కమర్ మొహిసిన్ భారత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వారు అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. రాఖీ కట్టినందుకు ప్రధాని నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడగ్గా ఆయన ఆశీర్వదం మాత్రం చాలని, తన ప్రతి విజయం వెనుక మోదీ ఉన్నారని పేర్కొన్నారు. చదవండి: దైవ దూషణ: కోర్టులో ముస్లిం హత్య -
రాఖీలు అమ్ముకుంటున్న సీరియల్ నటి
లాక్డౌన్ కష్టాలు ఎవ్వరినీ వదలట్లేదు. ముఖ్యంగా కేవలం నటనపైనే ఆధారపడ్డ వారి బతుకులు మరింత విషాదంగా మారాయి. ఈ క్రమంలో ఓ నటుడు పండ్లు అమ్ముతూ కనిపించగా తాజాగా ఓ నటి రాఖీలు అమ్ముకుంటున్నారు. "సాథ్ నిభానా సాథియా" సీరియల్ (కోడలా కోడలా కొడుకు పెళ్లామా)తో పాపులారిటీ సంపాదించుకున్న విద్యా విత్లానీ చివరిగా 'హమారి బహు సిల్క్' సీరియల్లో నటించారు. కానీ దానికి సంబంధించి ఇంతవరకూ నిర్మాతలు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను గతేడాది మే నుంచి అక్టోబర్ వరకు షూటింగ్లో పాల్గొన్నాను. లక్షల రూపాయలు రావాల్సి ఉంది. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క పైసా చెల్లించలేదు, నేను దాచుకున్న డబ్బు మొత్తం అయిపోయింది" (‘నటించమని ఎవరూ బెదిరించలేదు కదా’) "గతేడాది చివర్లో 'ముస్కాన్'లో నటించాను. ఆ డబ్బులు ఇచ్చారు. కానీ అవి ఎన్ని రోజులు వస్తాయి? అందుకే రాఖీలు తయారు చేస్తూ వాటిని ఆన్లైన్లో అమ్ముకుంటూ కొంత డబ్బు సంపాదిస్తున్నా. దీనివల్ల ఎక్కువ ఆదాయమేమీ రాదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఈ మాత్రం చేసుకోవడమైనా మంచిదే"నని పేర్కొన్నారు. తన భర్త విపుల్ కూడా నటుడేనని, కరోనా వల్ల అతని పనికి గండి పడిందని తెలిపారు. కాగా "హమారి బహు సిల్క్" సీరియల్ నటుడు జాన్ ఖాన్ సైతం నిర్మాతలు తమకు డబ్బులు చెల్లించడం లేదంటూ గతంలో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. (ఓటీటీలో కాజల్ చిత్రం) -
చిరుత దాడి నుంచి తమ్ముడిని రక్షించిన బాలిక
పారి: నాలుగేళ్ల తన తమ్ముడిని ఓ చిరుతపులి బారినుంచి కాపాడిందో 11ఏళ్ల అక్క. ఉత్తరాఖండ్‌లోని దేవ్కుందైతల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ నెల నాలుగోతేదీన నాలుగేళ్ళ తమ్ముడితో కలసి రాఖీ (11) ఆడుకుంటోంది. ఇంతలో ఒక్కసారిగా ఒక చిరుత తన తమ్ముడిపై దాడి చేసింది. అయితే రాఖీ ఏమాత్రం ఆ చిరుతకు భయపడకుండా ఎదురొడ్డి ధైర్యంగా నిలబడింది. చిరుత లాక్కెళ్లకుండా రాఖీ తన తమ్ముడిని మీదపడి అడ్డుగా నిలబడింది. ఈ క్రమంలో రాఖీ మెడపై తీవ్రగాయాలయ్యాయి. ఇంతలో గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో చిరుత పక్కనే ఉన్న అడవిలోకి ఉడాయించింది. ప్రస్తుతం బాలిక ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలోకి చికిత్సపొందుతోంది. వైద్య ఖర్చులకు రాష్ట్రమంత్రి బాలికకు రూ.1లక్ష ఆర్థికసాయం చేశారు. -
ప్రతీకారం తీర్చుకుంటా..!
అన్నలు ఉన్నవాళ్లు రాఖీలు కట్టారు. అన్నలు లేనివాళ్లు ‘అన్న’ అనుకున్న వాళ్లకు రాఖీలు కట్టారు. అన్న ఉండీ, లేకుండా పోయిన దుఃఖంలో కవితా కౌశల్ అనే చెల్లి తన అన్నకు గుర్తుగా మిగిలి ఉన్న రైఫిల్‌కు రాఖీ కట్టింది! కవిత అన్న రాకేశ్ అసిస్టెంట్ కానిస్టేబుల్. ఛత్తీస్‌గఢ్‌లోని అరణ్‌పూర్‌లో గత ఏడాది మావోయిస్టులు దొంగ దెబ్బ తీసినప్పుడు రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటనలో రాకేశ్‌తోపాటు మరో ఇద్దరు పోలీసు సిబ్బంది, దూరదర్శన్ కెమెరామన్ దుర్మరణం చెందారు. ‘‘మా అన్నను చంపినవారిపై ప్రతీకారం తీర్చుకోవడమే నా ధ్యేయం’’ అంది కవిత, అన్న రైఫిల్‌కు రాఖీ కట్టాక. కవిత ఇప్పుడు దంతేవాడలో పోలీస్ కానిస్టేబుల్. అన్న ఉద్యోగాన్ని ఆమెకు ఇచ్చారు. -
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాఖీలు..
దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర సంగ్లీలో వరదల తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడి ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ప్రస్తుతం సంగ్లీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి సిద్దమయ్యాయి. అయితే తమ ప్రాణాలను కాపాడిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిపై అక్కడి మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. వారు తమకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పూజలు చేశారు. సిబ్బంది నుదుటిపై తిలకాలు దిద్ది.. వారి చేతికి రాఖీలు కట్టారు. అలాగే వారికి హారతి కూడా ఇచ్చారు. కాగా, సంగ్లీ, కొల్హాపూర్, సతారా జిల్లాలోని 4.5 లక్షల మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలించారు. సంగ్లీ జిల్లాలో వరద బాధితులను పడవలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న క్రమంలో కూడా ఓ మహిళ ఆర్మీ జవాన్‌కు పాదాభివందనం చేసిన సంగతి విదితమే. -
‘రాఖీ విత్ ఖాకీ’కి గిన్నిస్ గుర్తింపు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘రాఖీ విత్ ఖాకీ’కి గిన్నిస్ బుక్ గుర్తింపు లభించింది. ఆగస్టు 25న నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కేవలం పది గంటల వ్యవధిలోనే సుమారు 50 వేల మంది మహిళలు, బాలికలతో పోలీసులకు రాఖీలు కట్టించారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఈ రికార్డును గుర్తిస్తూ శనివారం గిన్నిస్ బుక్ నుంచి సర్టిఫికేట్ అందుకున్నట్లు బిలాస్పూర్ పోలీసులు వెల్లడించారు. మహిళల భద్రతకు హామీ ఇస్తూ వారితో పోలీసులకు రాఖీలు కట్టించాలనే ఆలోచన బిలాస్పూర్ ఎస్పీ షేక్ ఆరిఫ్ హుసేన్‌కు వచ్చింది. -
మీఠా బంధన్
ఇదిగోండి బుజ్జి బుజ్జి మిఠాయిలు. కొరకక్కర్లేదు. నాలుక మీద పెడితే చాలు... అయినా ఈ రోజుల్లో మిఠాయి పెద్దదైతే ముఖాలు చిన్నవవుతున్నాయి... కేలరీలు గట్రా ఎక్కువని!అందుకే ఈ రాఖీకి చిన్న చిట్టి చిన్నారి చ్వీట్లు చిన్నారి జిలేబి కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూను; బేకింగ్ సోడా – చిటికెడు; పుల్ల పెరుగు – 3 టేబుల్ స్పూన్లు; మిఠాయి రంగు – చిటికెడు (నీళ్లలో కలిపి కరిగించాలి); నీళ్లు – అర కప్పు + 3 టేబుల్ స్పూన్లు; నూనె లేదా నెయ్యి – డీప్ ఫ్రైకి సరిపడా పాకం కోసం: పంచదార – ఒక కప్పు; నీళ్లు – అర కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; నిమ్మ రసం – అర టీ స్పూను. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, సెనగ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ∙ఏలకుల పొడి, పుల్ల పెరుగు జత చేసి మరోమారు కలపాలి ∙మిఠాయి రంగు కలిపిన నీళ్లు జత చేసి మూత పెట్టాలి ∙(పిండి మరీ పల్చగా ఉండకూడదు. అవసరాన్ని బట్టి మాత్రమే నీళ్లు కలుపుకోవాలి) ∙మిశ్రమాన్ని ఒక రోజు నాననివ్వాలి ∙మరుసటి రోజు మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలిపి, అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో పంచదార, నీళ్లు వేసి ఉడికించాలి ∙తీగ పాకం వచ్చిన తరవాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, నిమ్మ రసం వేసి కలిపి దింపేయాలి ∙జిలేబి మిశ్రమాన్ని జిలేబి వేసే సీసాలో పోసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక జిలేబి సీసాలోని మిశ్రమాన్ని నూనెలో జిలేబి ఆకారం వచ్చేలా తిప్పుకోవాలి ∙రెండువైపులా దోరగా వేయించిన తరవాత పంచదార పాకంలో వేసి సుమారు రెండు గంటల తరవాత ప్లేటులో అందించాలి. చమ్ చమ్ ఇన్ డాలర్ కావలసినవి: పాలు – ఒక లీటరు; నిమ్మ రసం – 2 టేబుల్‌స్పూన్లు; పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – 4 కప్పులు; ఏలకుల పొడి – పావు టీ స్పూను. స్టఫింగ్ కోసం: పచ్చి కోవా – పావు కప్పు (సన్నగా తురమాలి); పంచదార పొడి – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు రేకలు – 5 (పావు టీ స్పూను పాలలో నానబెట్టాలి); ఏలకుల పొడి – చిటికెడు; పిస్తాచూ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి మంట బాగా తగ్గించి నిమ్మ రసం వేస్తూ కలపాలి ∙పాలు విరిగి నీళ్లు, పాల ముద్ద విడివడతాయి ∙స్టౌ మీద నుంచి దింపేసి, చల్లారాక పల్చటి వస్త్రంలో వేసి, నీరు పూర్తిగా పిండేసి, ఆ వస్త్రానిన గట్టిగా మూట కట్టి, సుమారు గంట సేపు మూట మీద బరువు ఉంచాలి ∙ఇలా చేయడం వల్ల నీరు పూర్తిగా పోతుంది ∙నీరు పోయిన తరవాత ఆ ముద్దను ఒక ప్లేటులోకి తీసుకుని, చేతితో పొడిపొడిగా విడదీయాలి ∙పాల విరుగును చేతితో బాగా కలుపుతూ ముద్ద చేయాలి ∙కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని మనకు కావలసిన ఆకారంలో గుండ్రంగా లేదా పొడవుగా ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙వెడల్పాటి పాత్రలో ఒకటిన్నర కప్పుల పంచదార, నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, సన్న మంట మీద కొద్దిగా మరిగించాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఉండలను ఒక్కొక్కటిగా పాకంలో వేసి మూత పెట్టాలి ∙సుమారు పది నిమిషాల తరవాత మూత తీసి చమ్చమ్లను చెక్క స్పూనుతో వెనక్కు తిప్పి మూత పెట్టాలి ∙మరో పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙పావు టీ స్పూను ఏలకుల పొడి జత చేసి చల్లారనివ్వాలి ∙కుంకుమ పువ్వుతో అలంకరించాలి. స్టఫింగ్ తయారీ: ∙ఒక పాత్రలో పావు కప్పు పచ్చి కోవా, టీ స్పూను పంచదార పొడి, చిటికెడు ఏలకుల పొడి, పాలలో కలిపిన కుంకుమ పువ్వు వేసి ఒక స్పూనుతో బాగా కలపాలి చమ్చమ్లలో అదనంగా ఉన్న పంచదార పాకాన్ని తీసేయాలి ∙ఒక్కో చమ్చమ్ను చేతిలోకి తీసుకుని చాకుతో మధ్యకి కట్ చేయాలి ∙ఒక టీ స్పూను స్టఫింగ్ మిశ్రమాన్ని అందులో ఉంచి, కొబ్బరి తురుమును పైన చల్లాలి పిస్తాచూ తరుగును సిద్ధంగా ఉన్న చమ్చమ్ల పైన చల్లి, చేతితో మృదువుగా అదమాలి ∙కావాలనుకుంటే నీళ్లలో కలిపిన కుంకుమపువ్వుతో గార్నిష్ చేసుకోవచ్చు. పైనాపిల్ బర్ఫీ కావలసినవి: పైనాపిల్ స్లయిసులు – 4; పాలు – ఒక లీటరు; నెయ్యి – కొద్దిగా; పెరుగు – అర టీ స్పూను; పంచదార – ఒక కప్పు; నిమ్మ ఉప్పు – రెండు చిటికెలు; పైనాపిల్ ఎసెన్స్ – నాలుగు చుక్కలు. తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి వేడి చేసి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక అందులో పెరుగు వేయాలి ∙ఈ మిశ్రమాన్ని స్టౌ మీద ఉంచి చిక్కపడేవరకు ఆపకుండా కలుపుతుండాలి ∙మిశ్రమం సగానికి తగ్గిన తరవాత పంచదార జత చేయాలి నిమ్మ ఉప్పు కూడా వేసి బాగా కలపాలి మిశ్రమం బాగా గట్టిపడేవరకు ఉడికించాలి ∙పైనాపిల్ ఎసెన్స్ వేసి బాగా కలిపి, నెయ్యి రాసిన పాత్రలో సగం మిశ్రమం పోయాలి తరిగి ఉంచుకున్న పైనాపిల్ స్లయిసెస్‌ను మిశ్రమం మీద ఉంచి, మిగిలిన సగం మిశ్రమం ఆ పైన వేయాలి ∙మిశ్రమాన్ని సమానంగా పరిచి చల్లారనివ్వాలి కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. లౌకీ కలాకండ్ కావలసినవి:సొరకాయ – ఒకటి (తొక్క తీసి సన్నగా తురమాలి); పంచదార – అర కప్పు; కోవా – పావు కిలో; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; బాదం + పిస్తాచూ తరుగు – కొద్దిగా; కుంకుమపువ్వు – పావు టీ స్పూను; మిఠాయి రంగు – పావు టీ స్పూను (కొద్దిగా నీళ్లలో కలపాలి); ఏలకుల పొడి – అర టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో సొరకాయ తురుము, నీళ్లలో కలిపిన మిఠాయి రంగు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙కొద్దిగా చల్లారాక నీరు పిండి తీసేసి, అర కప్పు పంచదార జత చేసి పక్కన ఉంచాలి ∙పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద సుమారు పది నిమిషాల సేపు మరిగించాక, బొంబాయి రవ్వ వేసి కలిపి దింపేయాలి ∙పెద్ద బాణలిలో సొరకాయ మిశ్రమం వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, పాలు జత చేసి బాగా కలపాలి ∙వెడల్పాటి పళ్లానికి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న కలాకండ్ మిశ్రమం పోసి సమానంగా పరవాలి ∙బాదం తరుగు, పిస్తాచూ తరుగుతో అలంకరించి, ఫ్రిజ్‌లో ఉంచాలి ∙గంట సేపయ్యాక బయటకు తీసి కావలసిన ఆకారంలో కట్ చేయాలి. ఖీర్ కదమ్ కావలసినవి పచ్చి కోవా – ఒక కిలో; పాలు – 2 లీటర్లు; కుంకుమ పువ్వు – కొద్దిగా; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పంచదార – ఒక కిలో; పంచదార పొడి – 4 టీ స్పూన్లు; కొబ్బరి తురుము – తగినంత; మిఠాయి రంగు – 4 చుక్కలు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; నీళ్లు – తగినన్ని తయారీ: ∙మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచాలి ∙పాలు పోసి మరిగించాక, నిమ్మ రసం వేసి కలపాలి ∙పాలు విరిగాక ఒక వస్త్రంలో కట్టి, నీళ్లు పిండేసి పనీర్ తయారు చేసుకోవాలి ∙చిన్న చిన్న ఉండలుగా రసగుల్లాలను చేసుకుని పక్కన ఉంచాలి ∙మరొక పాత్రను స్టౌ మీద ఉంచి నీళ్లు, పంచదార వేసి తీగ పాకం వచ్చేవరకు ఉడికించాలి ∙కుంకుమ పువ్వు, మిఠాయి రంగు వేసి కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న రసగుల్లాలను పంచదార పాకంలో వేసి సుమారు గంటసేపు ఉంచాలి ∙స్టౌ మీద ఒక నాన్‌స్టిక్ పాన్‌లో కోవా వేసి కొద్దిగా రంగు మారేవరకు కలపాలి ∙కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేయాలి. చిట్టి కాజా కావలసినవి మైదా పిండి – ఒక కప్పు; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – పావు కప్పు + 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; బియ్యప్పిండి – కొద్దిగా; పంచదార పాకం కోసం; పంచదార – 2 కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, ¯ð య్యి వేసి ఉండలు లేకుండా కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి, గంట సేపు పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో పంచదార, నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి ∙వేరొక పాత్రలో బియ్యప్పిండి, నెయ్యి వేసి ముద్దలా చేసి పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని ఉండలుగా చేసి, ఒక్కో ఉండ తీసుకుని చపాతీల మాదిరిగా అన్నిటినీ ఒత్తుకోవాలి ∙బియ్యప్పిండి ముద్దను ఒక చపాతీ మీద పూసి ఆ పైన మరో చపాతీ ఉంచి దాని మీద మళ్లీ బియ్యప్పిండి ముద్ద పూయాలి ∙ఈ విధంగా ఐదు చపాతీలను ఒకదాని మీద ఒకటి ఉంచాక, రోల్ చేయాలి ∙అంగుళం మందంలో ముక్కలుగా కట్ చేసి, మధ్య భాగంలో కొద్దిగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, కాజాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙తయారుచేసి ఉంచుకున్న పాకంలో వేసి రెండు మూడు గంటలయ్యాక బయటకు తీసి ప్లేట్లో అందించాలి. గవ్వలు కావలసినవి: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; మైదా పిండి – 2 కప్పులు; నూనె – డీప్ ఫ్రైకి తగినంత; ఉప్పు – చిటికెడు; బెల్లం తరుగు/పంచదార – ఒక కప్పు; నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒకపాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి బాగా కలపాలి.నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙గవ్వలు తయారుచేసుకునే బల్ల మీద ఒక్కో ఉండను గవ్వ మాదిరిగా ఒత్తి పక్కన పెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న గవ్వలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం తరుగు/పంచదార వేసి స్టౌ మీద ఉంచి తీగపాకం వచ్చేవరకు ఉడికించాలి ∙తయారుచేసిన గవ్వలను బెల్లం పాకంలో వేసి చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. స్వీట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; నానబెట్టిన సెనగ పప్పు – అర కప్పు; పంచదార పొడి/బెల్లం తరుగు – అర కప్పు; కరిగించిన నెయ్యి – పావు కప్పు; జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు (ముక్కలు చేయాలి); కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు – 10 (నీళ్లలో నానబెట్టి, తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి); ఏలకుల పొడి – టీ స్పూను; నెయ్యి లేదా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి పూరీ పిండిలా కలిపి, సుమారు అర గంట సేపు మూత పెట్టి పక్కన ఉంచాలి ∙సెనగపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించి దింపేయాలి చల్లారాకి నీరు ఒంపేసి సెనగ పప్పును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మెత్తగా చేసిన సెనగ పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙నెయ్యి వేరుపడుతున్నట్లుగా అనిపించాక కిందకు దింపి చల్లారాక డ్రై ఫ్రూట్స్ ముక్కలు, బెల్లం తరుగు/పంచదార పొడి, ఏలకుల పొడి జత చేసి బాగా కలిపి, వేరొక పాత్రలోకి తీసి, పక్కన ఉంచాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి దీర్ఘచతురస్రాకారంలో సన్నగా పొడవుగా ఒత్తుకుని, సమోసా ఆకారం వచ్చేలా మడతలు వేయాలి ∙ఒక టీ çస్పూను స్టఫింగ్ మిశ్రమం అందులో ఉంచి అంచులు మూసేయాలి (అంచులను నీటితో తడి చేస్తే గట్టిగా అతుకుతుంది ∙ఇలా అన్నీ తయారుచేసుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొద్దిగా చల్లారాక అందించాలి. రాఖీ మిఠాయిలను ఇలా అందంగా అలంకరించండి... రక్షాబంధన్‌ను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకోగానే, రకరకాల మిఠాయిలు తయారుచేసి, పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకుంటారు. ఈ మిఠాయిలను చేసినవి చేసినట్లుగా కాకుండా, వాటిని అందంగా అలంకరిస్తే, మిఠాయిలు రుచిగానే కాకుండా, కనువిందు కూడా చేస్తాయి. ∙మోతీచూర్ లడ్డూ వంటి వాటిని బాదం, జీడిపప్పు, పిస్తా తరుగులతో అలంకరించాలి. ∙లడ్డూలను ప్లేట్లో ఉంచాక, చుట్టూ గులాబి రేకలు వేస్తే కంటికి ఇంపుగా ఉంటుంది. ∙గులాబ్‌జామ్, రసగుల్ల వంటివాటిని కొబ్బరి తురుముతో గార్నిష్ చేయాలి. ∙వంటకం పూర్తి చేసి, ప్లేట్లో అందించేటప్పుడు గార్నిషింగ్ చేస్తే తాజాగా ఉంటుంది. ∙రాఖీ పండుగ ప్రతిబింబించేలా మీరు తయారుచేసే స్వీట్లను రాఖీ ఆకారంలో తయారుచేస్తే, మిఠాయిలోనే పండుగ కనిపిస్తుంది. ∙బర్ఫీ, పేడా వంటి వాటి మీద రాఖీ డిజైన్ చేసి, చుట్టూ పంచదార పాకంతో డిజైన్ చేశాక, కొబ్బరి తురుమును చల్లి, చివరగా ఒక చెర్రీ ఉంచితే, నోటికి విందు చేసే రాఖీ తయారయినట్లే. – డా. బి. స్వజన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్) -
రేప్ చేసిన చేతులకు రాఖీలా?
అభిప్రాయం ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా పాల్నార్ గ్రామంలోని బాలికల వసతి గృహంలో 500 మంది ఆదివాసీ బాలికలు ఉన్నారు. రాఖీ పండుగ రోజున అక్కడి పాఠశాలను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సందర్శిం చారు. ఈ పాఠశాల పిల్లలతో సీఆర్íపీఎఫ్ సైనికులకు రాఖీ లు కట్టించాలని వారికి ఆలోచన వచ్చింది. జూలై 31నే ఈ పథకాన్ని రచించి వందమంది జవాన్లను తీసుకొని ఆ వసతి గృహానికి వెళ్లారు. అధికారులు ఈ రాఖీ కట్టే దృశ్యాన్నంతా వీడియో తీసే ఏర్పాటు కూడా చేశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆదివాసీ మహిళలకు సీఆర్పీఎఫ్ జవాన్లు సంరక్షకులుగా ఉన్నారని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి చూపాలనుకున్నది. రక్షాబంధన్ రోజు ఆ కార్యక్రమాన్ని లైవ్ షో చేయాలనుకున్నారు. అందుకని రాఖీ పున్నమి రోజు చాలాసేపటి వరకు ఆ కార్యక్రమం కొనసాగింది. ఉదయం నుంచి ఈ కార్యక్రమం చాలాసేపు కొనసాగడంతో కొంతమంది బాలికలు కార్యక్రమం మధ్యలో మరుగుదొడ్డికి వెళ్లారు. వాళ్లను ఐదారుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు అనుసరించారు. తాము మరుగుదొడ్ల లోపల ఉండగా బయట ఇట్లా జవాన్లు నిలబడడానికి ఆ అమ్మాయిలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆ జవాన్లు బెదిరిం చారు. మీ శరీరంలోని రహస్య ప్రదేశాల్లో ఏం దాచుకున్నారో మేం వెతకాల్సి ఉంటుందని చెబుతూ ముగ్గురు అమ్మాయిల స్థనాలను దారుణంగా నలిపేశారు. ఒక అమ్మాయి మరుగుదొడ్డిలో తలుపు వేసుకొని ఉండిపోయింది. ముగ్గురు సైనికులు తలుపు తోసుకొని లోపలికి వెళ్లారు. 15 నిమిషాలు వాళ్లు ఆ లోపలే ఉండిపోయారు. మిగిలిన అమ్మాయిలను బయట ఉన్న జవాన్లు గొడవ చేయకుండా నోరు మూశారు. తర్వాత రక్షా బంధన్ సంరక్షకుల కార్యక్రమం ముగిసింది. ఆ రాత్రి ఆ బాలికలు తమ వార్డెన్ ద్రౌపదీ సిన్హాకు జవాన్లు తమతో వ్యవహరించిన తీరు చెప్పారు. వార్డెన్ ఈ విషయాన్ని ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తెచ్చింది. ఈ ఫిర్యాదు చేసిన అమ్మాయిలను సీఆర్పీఎఫ్ క్యాంపు నకు తీసుకురమ్మన్న కలెక్టర్, ఎస్పీ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని హెచ్చరించారు. గ్రామస్తులు చొరవ తీసుకొని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోవాలని సోనీ సోరీని పిలిపించారు. సోనీ సోరీ అక్కడికి వెళ్లినప్పుడు ఆ హాస్టల్ వార్డెన్ గేటుకు తాళం పెట్టి వాచ్‌మన్‌లాగా గేటు ముందు కూర్చున్నది. ఒక పోలీసు కానిస్టేబుల్‌ను పై అధికారులు అక్కడ నియమించారు. ఇంక చేసేది లేక సోనీ సోరీ అక్కడి పాఠశాలలో చదివే పిల్లల ఇళ్లల్లోకి వెళ్లి ఆ సంఘటనకు సంబంధించిన సమాచారమంతా సేకరించింది. దంతెవాడలో చాలాకాలం పాటు వనవాసి ఆశ్రమం నిర్వహించి, పోలీసుల దౌర్జన్యంతో ఛత్తీస్‌గఢ్ వదిలి వెళ్లిన హిమాంశు కుమార్ ఈ సంఘటనను బయటి ప్రపంచం దృష్టికి తెచ్చాడు. తమపై లైంగిక అత్యాచారం చేసిన జవాన్లకే తాము రాఖీలు కట్టే స్థితికి నెట్టబడిన ఆదివాసీ బాలికలపట్ల ఈ వ్యవస్థ వైఖరి ఏమిటి? ఆదివాసులపై సామూహిక లైంగిక అత్యాచారాలను ప్రోత్సహించిన నేరారోపణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు రుజువైన పోలీసు ఉన్నతాధికారి కల్లూరిని ఆగస్టు 15న ఒక విశ్వవిద్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ఆహ్వానించడం రేప్ చేసిన చేతులకు రాఖీలు కట్టించడమనే దుర్మార్గానికి పరాకాష్ట కాదా? వరవరరావు వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు -
పాపం ఎల్లమ్మ..
♦ అన్నకు రాఖీ కట్టడానికి వచ్చి తప్పిపోయిన 95 ఏళ్ల వృద్ధురాలు ♦ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ♦ స్థానికుల సాయంతో కుటుంబ సభ్యుల వద్దకు... హైదరాబాద్: 95 ఏళ్ల పండు ముసలి. అన్నపై ఉన్న మమకారంతో హైదరాబాద్‌కు వచ్చి రాఖీ కట్టి ప్రేమను పంచింది. ఇంతలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వచ్చి తప్పిపోయింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు బుధవారం స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆమెను క్షేమంగా అప్పగిం చారు. జనగాం సమీపంలోని కంచెన్పల్లికి చెందిన ఎల్లమ్మ.. యాప్రాల్‌లో ఉండే కొడుకు సంజీవ్‌ను తీసుకుని, ముషీరాబాద్‌లోని ఇందిరానగర్‌లో ఉండే రాములుకు రాఖీ కట్టడానికి ఈ నెల 7న వచ్చింది. రాఖీ కట్టిన అనంతరం కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుండి బయటకు వచ్చింది. అయితే తిరిగి ఇంటిని గుర్తు పట్టక ఎటో వెళ్లిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో సంజీవ్ ముషీరా బాద్, చిక్కడపల్లి పోలీస్స్టేషన్లతో పాటు మరో 3 పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు. రెండు రోజులు ఆగండి.. ఆమె దొరుకుతుందని, లేకుంటే అప్పుడు రండి.. అంటూ పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. తప్పిపోయిన ఎల్లమ్మ మంగళవారం రాంనగర్‌లోని ఎస్బీఐ సమీపంలో ఉండగా, స్థానిక స్కూటర్ రిపేర్ షాపు అతను బీట్ కానిస్టేబుళ్లకు సమాచారం అందించాడు. వారు వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లకుండా రూ.50 చేతిలో పెట్టి ఆటో ఎక్కించి రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలు ఎక్కి ఇంటికి వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే రైలు ఎక్కబోతూ కిందపడిన ఆమెను కొందరు గమనించి కాపాడారు. ఆమె మళ్లీ నడుచుకుంటూ రాంనగర్‌లోని మీ సేవా వద్ద గల ఓ హోటల్ వద్దకు చేరుకుంది. ఆ హోటల్‌కు వచ్చిన వారు ఆమెను ఆరా తీయగా తప్పిపోయానని చెప్పింది. దీంతో పక్కనే ఉన్న సంఘ సేవకుడు శ్రీనునాయుడు ఆమె ఊరి అడ్రస్‌ను, ఫోన్ నంబర్‌ను తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అం దించాడు. సంజీవ్ వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. పాపం వృద్ధురాలు.. రెండు రోజుల పాటు తిండిలేక.. వర్షంలో తడిసి నీరసించి పోయింది. -
సన్నీలియోన్ రాఖీ కట్టింది.. ఎవరికంటే..
ముంబై: మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మన సాంప్రదాయాలకు మెల్లిగా అలవాటు పడిపోయింది. మొన్ననే రక్షాబంధన్ ను జరుపుకొంది. అయితే అది ఆమె సోదరుడు సందీప్ వోహ్రాతో మాత్రం కాదు. అతను అమెరికాలో ఉండటంతో ఈసారి మరో వ్యక్తికి రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకీ అతనెవరంటారా? సన్నీలియోన్ వ్యక్తిగత సంరక్షకుడు(బౌన్సర్) యూసఫ్ కు రాఖీ కట్టి అతనితో తన అనుబంధం చాటుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మరోవైపు దీపికా పదుకొనే, మరికొందరు తారలు కూడా తమ బ్రదర్స్ కు రాఖీ కట్టిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం బాద్షాహో, సంజయ్‌దత్ భూమి చిత్రాల కోసం ఐటెం గర్ల్ గా మారిన ఈ సెక్సీ క్వీన్ త్వరలో సన్నీసిటీ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. -
హిందూ, ముస్లింల కోసమా రక్షాబంధన్?
న్యూఢిల్లీ: దేశంలో పశ్చిమ బెంగాల్ రూటే సెపరేట్. దేశమంతా పండుగలను పబ్బాలను ఏకరీతిన జరుపుకుంటే బెంగాల్ ప్రజలు అందుకు భిన్నంగా జరుపుకుంటారు. దేశ ప్రజలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఉంటే, బెంగాల్ ప్రజలు దుర్గా పూజ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. విజయదశమి సందర్భంగా దేశమంతా దసరా వేడుకలను జరుపుకుంటే బెంగాల్ ప్రజలు దసరా రోజున కన్నీళ్లు పెట్టుకుంటారు. వారు రాఖీ పండుగను కూడా హిందూ, ముస్లిం ప్రజల సమైక్యతకు చిహ్నంగా జరపుకుంటారు. అంతా విస్తృతంగా లేకపోయినా ఈ రోజున కూడా వారు భాయి, భాయి అంటూ పరస్పరం రాఖీలు కట్టుకొని భిన్న మతాల సమైక్యత గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. విభజించు పాలించు సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్న నాటి బ్రిటీష్ పాలకులు, హిందూ ముస్లింలు ఎక్కువగా ఉన్న సువిశాల బెంగాల్‌ను మతం ప్రాతిపదికన విభజించాలనుకున్నారు. పాలనాపరమైన సౌలభ్యం పేరిట ముస్లింలు ఎక్కువగా వున్న తూర్పు ప్రాంతాన్ని ఒక ప్రాంతంగా (ప్రస్తుత బంగ్లాదేశ్), హిందువులు ఎక్కువగా ఉన్న పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంగా విభజించాలని 1905, ఆగస్టు నెలలో నిర్ణయించారు. అందుకు అప్పటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ కర్జాన్ అక్టోబర్ 16వ తేదీన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ విదేశీ వస్తువులను బహిష్కరించాలంటూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. బెంగాల్ విభజనను అడ్డుకోవాలంటే హిందూ, ముస్లింల మధ్య ఐక్యత పెరగాలని, ఇరుమతాలు ఐక్యతతో పోరాడితే బెంగాల్ విభజనను అడ్డుకోవచ్చని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత రవీంద్ర నాథ్ టాగూర్ భావించారు. హిందూ, ముస్లింల మధ్య సమైక్యతను చాటుతూ బెంగాల్ ప్రజలెవరూ అక్టోబర్ 16వ తేదీన ఇంట్లో వంటచేయరాదని, ఇరుమతాల వారు ఒకరికొకరు రక్షించుకునే విధంగా పరస్పరం రాఖీలు లేదా రక్షాబంధన్‌లు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. నాడు అక్టోబర్ నెల శ్రావణ మాసంలో రావడంతో టాగూర్ తన పిలుపును విజయవంతం చేయడం కోసం ఉదయమే గంగానదికి వెళ్లి పవిత్రస్నానమాచరించి అక్కడి నుంచి ప్రజలతో ఓ ప్రదర్శనగా కోల్‌కతా నగరంలోకి వస్తూ దారిలో కనిపించిన వారందరికి రాఖీలు కడుతూ వచ్చారు. మసీదుల్లోకి వెళ్లి మౌల్వీలకు కూడా రక్షాబంధన్‌లు కట్టారు. అలా హిందూ ప్రజలు ఓ ఊరేగింపులా మసీదుల్లోకి దూసుకుపోయినా మౌల్వీలెవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. బెంగాల్ రక్షణ, ఐక్యత కొనసాగాలని ఆకాంక్షిస్తూ టాగూర్ స్వయంగా రాసిన పాటను ప్రజలు ఆలపిస్తూ ప్రదర్శన వెంట ముందుకు సాగారు. హిందూ ముస్లింలకు ఐక్యతకు చిహ్నంగా ఫెడరేషన్ హాలు నిర్మాంచాలనుకున్న చోటు వరకు వారి ప్రదర్శన సాగింది. అక్కడ భవన నిర్మాణానికి టాగూర్ శంకుస్థాపన చేశారు. వాస్తవానికి బారిస్టర్ ఆనంద్ మోహన్ బోస్ అక్కడ ఉపన్యాసం ఇవ్వాల్సి ఉండింది. అనుకోకుండా ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆయన ప్రసంగ పాఠాన్ని టాగూర్ చదవి వినిపించారు. అదే సందర్భంగా భవన నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలు వసూలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రజల రాఖీ యాత్ర బాగ్‌బజార్‌లోని పాసుపతి, నంద్లాల్ బసు ఇల్లైన బసు బాటి వద్దకు కొనసాగింది. అప్పటి నుంచి బెంగాల్ ప్రజలు రాఖీ పండుగను హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా జరుపుకుంటూ వచ్చారు. దాంతో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం బెంగాల్ విభజనపై వెనక్కి తగ్గింది. 1911లో బెంగాల్ విభజన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. మరో ఏడాదికి, అంటే 1912లో మళ్లీ బెంగాల్‌ను విభజించాలని నిర్ణయించింది. -
అనురాగం అనుబంధం
అన్నా చెల్లెళ్లు..అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. రాఖీ కట్టి...తీపి తినిపించి ఆనందపడుతుంది సోదరి. బహుమతి ఇచ్చి ఆశీస్సులు పొంది ఉప్పొంగిపోతాడు సోదరుడు. రాఖీ వేళ.. ఈ అనురాగాల పండుగ గురించి పలువురు సెలబ్రిటీలు చెప్పిన ముచ్చట్లు... కనిపెంచే వారు తల్లిదండ్రులైతే.. కనిపెట్టుకుని కాచుకునే వారు అన్నదమ్ములు. నీ పాదం మీద పుట్టుమచ్చనై తోడబుట్టిన రుణం తీర్చుకుంటాననే సోదరుడి హామీ ప్రతి సోదరికీ కొండంత కానుక. అనుక్షణం అండదండగా నిలిచే అన్నా/తమ్ముడికి ఏ ఆపదా రాకూడదని తన ప్రేమాభిమానాలు రక్షగా.. అతడు అన్నింటా అజేయుడై నిలవాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారు. మణికట్టు మీద మెరుస్తారు. నేడు ‘రక్షాబంధన్’ సందర్భంగా పలువురు ప్రముఖులు అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘రాజువై గెలవరా.. రక్ష నేనే సోదరా’ అంటూ దీవించారు. – సాక్షి, సిటీబ్యూరో లక్కీ బ్రదర్ రాఖీ పండుగ అంటే ఫుల్ సందడి. చిన్నప్పుడు మా అమ్మ నాకు, తమ్ముడు అమన్‌కి ఇష్టమైన లడ్డూలు, కేకులు, జిలేబీలు చేసేది. రాఖీ సందర్భంగా ఇంట్లో ఉన్న టాయ్స్ అన్నీ ఓ చోట పెట్టి బెలూన్స్‌తో అలంకరించేది. నేనేమో ‘అమ్మా.. స్వీట్స్ తినొచ్చా’ అంటే.. ‘ముందు రాఖీ కట్టు. ఆ తర్వాతే’ అనేది. స్వీట్స్ తినడం కోసం అమన్‌కి త్వరగా రాఖీ కట్టేదాన్ని. అప్పుడు రాఖీ విలువ తెలియదు. పెద్దయ్యాక తెలిసింది. ఓ బ్రదర్ ఉండటం లక్. నా విషయంలో అమన్ చాలా కేరింగ్‌గా ఉంటాడు. కానీ, తను మాత్రం కేర్లెస్గా ఉంటాడు. వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోడు. చిన్నప్పుడు ఈ విషయంలో చాలా గొడవపడేవాళ్లం. ఇప్పుడు మాత్రం మా మధ్య చిన్న చిన్న గొడవలు కూడా లేవు. మేమిద్దరం అక్కాతమ్ముడు అనేకన్నా మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి. ఏ విషయాన్నయినా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. అమన్‌కి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. ఒక సినిమా కూడా స్టార్ట్ అయింది. ‘ఐయామ్ హ్యాపీ ఫర్ హిమ్’. నేను సక్సెస్ అయినట్లే కచ్చితంగా తనూ సక్సెస్ అవుతాడు. మా తమ్ముడి మీద నాకంత నమ్మకం ఉంది. – రకుల్ ప్రీత్‌సింగ్ ఆనందాల వేడుక జీవితంలో అన్నా చెల్లెళ్ల అనుబంధం చాలా గొప్పది. మనకు ఎప్పుడూ తోడుండేది వారే. నా జీవితాన్ని బ్రదర్స్ లేకుండా ఊహించుకోలేను. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా వారితో పంచుకుంటా. వారిద్దరికీ నేనంటే చాలా ఇష్టం. అన్ని విధాలుగా భరోసానిస్తుంటారు. బ్రదర్స్ ఉండటం ఓ వరం. ప్రతి ఏటా ఆనందోత్సాహాల మధ్య రాఖీ పండుగ జరుపుకుంటాం. ఈ ఏడాది రాఖీ పండుగకు ప్రత్యేక బహుమతులు సిద్ధం చేశా. – మంచు లక్ష్మి అక్కే నాకు పెద్ద అభిమాని.. ప్రపూర్ణక్క. నాకంటే మూడేళ్ల పెద్దది. చాలా ఫ్రెండ్లీ. నేను పదోతరగతిలో ఉన్నప్పుడు అక్క స్టడీస్ కోసం పూణేకు వెళ్లింది. స్టడీస్ ముగిశాక పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లింది. అలా దూరం అయ్యాక నాకు బాండింగ్ ఎక్కువైంది. నా ప్రతి షో మిస్ కాకుండా చూస్తుంది. సలహాలు సూచనలు అందిస్తుంది. నా బిగ్గెస్ట్ ఫ్యాన్ అక్కే. తను అమెరికాలో ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. రాఖీ పండుగ రోజు తను ఎక్కడున్నా కొరియర్లో రాఖీ పంపిస్తుంది. ఈ ఏడాది స్వయంగా రాఖీ కడుతుందని అనుకున్నా. బిజినెస్ పని ఉండడంతో నిన్ననే అమెరికాకు వెళ్లింది. – ప్రదీప్, యాంకర్ పేరు ప్రఖ్యాతుల కంటే పేగుబంధం గొప్పది.. రాఖీ పండుగొస్తే తోబుట్టువులతో నా ఇల్లు కళకళలాడుతుంది. నా అక్కలు లలిత, శకుంతల నా చెల్లి ఇంద్రాణి అనురాగానికి ప్రతీకలు. ఉదయమే వచ్చి రాఖీకట్టి నన్నుఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వాదాలే నాకు శ్రీరామరక్ష. కొండంత అండ. నా ముద్దుల చెల్లి మహేశ్వరి మమ్మల్ని విడిచివెళ్లడం విషాదకరం. ఆ రోజు కచ్చితంగా అందరం ఆమెను తలచుకుంటాం. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంత పేరు గడించినా పేగుబంధమే గొప్పదని నమ్మే మనిషిని నేను. – టి. పద్మారావు, రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి రాఖీ పండుగ రోజు తెల్లవారుజామునే తూఫ్రాన్ నుంచి బయల్దేరతా. సూర్యోదయం నాటికి అన్న ఇంటికి వస్తా. రాఖీ కట్టి అన్నని ఆశీర్వదిస్తా. ప్రతి ఏటా ఇలానే చేస్తా. – శకుంతల, మంత్రి పద్మారావు అక్క ఆత్మీయులే నా సోదరులు రాఖీ పండుగ వస్తే నాకు మహానందం. నాకు సోదరులు లేరు. అందుకే నా చుట్టూ ఉండే వారికి రాఖీలు కట్టి ఆనందం పంచుకుంటా. బంధువుల పిల్లలకు రాఖీ కట్టి బహుమతులు అందజేస్తా. రాఖీ పండుగ రోజు నా చెల్లితో ప్రత్యేకంగా గడుపుతా. సృష్టిలో సోదరబంధం చాలా గొప్పది. – మధుప్రియ, గాయని ఫ్రెండ్లీ బ్రదర్ నా దృష్టిలో రాఖీపౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. నా సోదరుడు రౌనాక్ మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నాడు. అతను మాకు అందుబాటులో ఉండేవాడు కాదు. గతేడాది రాఖీపౌర్ణమికి రౌనాక్ నేరుగా నా వద్దకు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యా. ఆనందంగా రాఖీ కట్టా. ఈ ఏడాది మాత్రం కొరియర్లో రాఖీ పంపించా. వెరీ ఫ్రెండ్లీ బ్రదర్. సోదర ప్రేమ అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. – రాశీఖన్నా, హీరోయిన్ -
రాఖీ అందమైన బ్యాండ్ మాత్రమేనా?
సెల్ఫ్ చెక్ పిల్లలకు రాఖీ అంటే మణికట్టుకు కట్టుకునే అందమైన బ్యాండ్ అనే తెలుసు. పురాణ కాలం నుంచి శ్రావణ పౌర్ణమి నాడు దేశం మొత్తం స్థానిక సంప్రదాయాలను అనుసరిస్తోంది. పిల్లలకు చెప్పే ముందు మనం గుర్తు చేసుకుందాం. 1. యమున తన సోదరుడు యముడు క్షేమంగా ఉండాలని రక్షాబంధనాన్ని కట్టిందని, రక్షాబంధనం కట్టే ఆనవాయితీకి ఇదే మొదలు అని విశ్వాసం. ఎ. అవును బి. కాదు 2. బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రాఖీ కట్టినట్లు పురాణ కథనం. ఎ. అవును బి. కాదు 3 శచీదేవి రాఖీని ఇంద్రునిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసం కలిగించడానికి సాధనంగా ఉపయోగించింది. ఎ. అవును బి. కాదు 4. శిశుపాల వధలో కృష్ణుని మణికట్టుకు గాయమై రక్తం కారితే ద్రౌపది తన చీర చెంగును చించి గాయానికి కడుతుంది. అప్పుడు కృష్ణుడు ఆమెకు అండగా ఉంటానని మాట ఇచ్చినట్లు ఒక కథనం వాడుకలో ఉంది. ఎ. అవును బి. కాదు 5. అరేబియా తీరంలోని వాళ్లు ఈ రోజు సముద్రంలో కొబ్బరికాయలను వదిలి నారియల్ పూర్ణిమగా పండగ చేసుకుని చేపల వేట ప్రారంభిస్తారు. ఎ. అవును బి. కాదు 6. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పర్వదినాన్ని రుషి తర్పణ్, అవని అవిట్టమ్ పేరుతో సంప్రదాయబద్ధంగా చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 7. ఉత్తరాది రైతులు ఈ రోజును కజారి పూర్ణిమగా పండగ చేసుకుంటారు. గోధుమ, బార్లీ పంటలు నాటే రోజులివి. భగవతీదేవికి పూజ చేసి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. గుజరాత్లో ఈ రోజు శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి మణికట్టుకు పంచకవ్యంలో(ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడలతో చేసిన మిశ్రమం) ముంచిన నూలుదారాలను కట్టుకుంటారు. ఇది విషాన్ని హరిస్తుందని, పాపనాశకంగా పని చేస్తుందని వారి విశ్వాసం. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే ఈ పండగ పుట్టు పూర్వోత్తరాల గురించి మీకు ఆసక్తి ఎక్కువ. పిల్లలకు దీని మూలాలను చెప్పడానికి తగిన సమాచారం ఉంది. -
రాఖీ సాక్షిగా
మణికట్టుకు కడుతున్న రాఖీ ఎందుకివాళ బాధపడుతోంది? పువ్వులా వికసించే రాఖీ ఎందుకు వడలిపోయినట్టుగా అనిపిస్తోంది? అసలు రాఖీకొచ్చిన బాధ ఏంటి? కలుగుతున్న కష్టమేంటి? రాఖీ కరువయ్యారా? రక్షణ బరువయ్యిందా? ఆగండాగండి! ఇవాళ రాఖీ పండగ. రాఖీ స్వగతం వింటే సోదరులకే కాదు... అక్కాచెల్లెళ్లకు కూడా కళ్ళు చెమరుస్తాయి. ఆ అందమైన బంధాన్ని మళ్లీ బలపరచాలన్న స్ఫూర్తి కలుగుతుంది.. రాఖీ... అంటే భారతీయుల పరిభాషలో రక్షణ. అంటే నేనే! అన్న, తమ్ముడు, కొన్నిచోట్ల నాన్నకు కూడా అక్క, చెల్లి, కూతురు నన్ను మణికట్టుకు కడతారు.. జీవితాంతం తమకు అండగా, రక్షగా ఉండమని! అందుకే ఈ వేడుక రక్షాబంధన్ అయింది. ఒకరకంగా ఇది నా పుట్టినరోజు. నాది నిన్నమొన్నటి జన్మ కాదు. పురాణకాలంలోనే పురుడు పోసుకున్నాను. ఎప్పుడు పుట్టానో చెప్పలేను కాని నాటి నుంచయితే ఉనికిలో ఉన్నా! నాకు గుర్తున్నంత వరకు నా పుట్టిన రోజులు.. మీలో చాలామందికి తెలిసినవి.. నెమరు వేసుకునేవి మరోమారు గుర్తు చేస్తా! ఇది ద్వాపర యుగం నాటిది.. ఓ రోజు... శ్రీ కృష్ణుడు చెరుకుగడను విరుచుకుంటుంటే దాని పేడు తగిలి వేలు కోసుకుపోయింది. జలజల రక్తం కారడం మొదలైంది. పక్కనే ఉన్న రుక్మిణి కంగారు పడి ఆ పక్కనే ఉన్న చెలికత్తెలను పురమాయించింది కట్టుకట్టడానికి గుడ్డ తెమ్మని. ఈ పక్కనే ఉన్న ద్రౌపది క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కొంగు చించి శ్రీకృష్ణుడి వేలుకు గట్టిగా చుట్టి రక్తప్రవాహానికి అడ్డుకట్టవేసింది. కృష్ణుడు ఆప్యాయంగా ద్రౌపది తల నిమిరి.. ‘‘చెల్లెమ్మా.. ఆపదకాలంలో నీకు రక్షణ గా నిలిచి నీ రుణం తీర్చుకుంటాను’’ అని మాట ఇచ్చాడు. దుశ్శాసనుడు నిండుసభలో ద్రౌపదిని అవమానించినప్పుడు ఆమె అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడి ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. ఇదీ రక్షాబంధనమే! ఇంకో జ్ఞాపకం కూడా చెప్తా.. ఒకసారి యమునా నది యమధర్మరాజు ముంజేతికి నన్ను కట్టింది. సంతోషపడిన యమధర్మరాజు ‘‘నీకు మరణం అనేది ఉండదు. నిత్యం పరవళ్లు తొక్కుతూ ఉంటావ్’ అని ఆశీర్వదించాడు. ‘‘నువ్వే కాదు రాఖీ కట్టిన ఏ సోదరైనా సోదరుల రక్షణలో చిరంజీవులుగా వర్థిల్లుతారు’’ అనే వరమూ ఇచ్చారు. అప్పుడు తెలిసింది నాకు నా శక్తేంటో! చరిత్ర సరే... ‘‘పైనవన్నీ యుగాలనాటివి.. పైగా పురాణాలంటున్నావు.. వాటిల్లో నిజమెంతో.. అబద్ధమెంతో?’’ అని ఫేస్ క్వశ్చన్మార్క్లా పెట్టారు? ఒకే అయితే చరిత్రలోని సంఘటనలే చెప్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా? దండయాత్రలతో ప్రపంచాన్ని చుడుతూ మన దేశానికీ వచ్చాడు. ఇక్కడ పురుషోత్తముడు అనే చక్రవర్తి గొప్ప వీరుడు, మహా శూరుడు అని అలెగ్జాండర్తోపాటు అతని భార్య రుక్సానా కూడా విన్నది. అలాంటి పరాక్రమవంతుడు యుద్ధంలో తన భర్తను మట్టుపెట్టేస్తాడేమోనని భయపడింది. అప్పుడు నా గురించి తెలుసుకొని.. సేవకుడి ద్వారా పురుషోత్తముడి దగ్గరకు పంపింది. నన్ను తన మణికట్టుకు ముడివేసుకొని తనను సోదరిగా స్వీకరించమని.. యుద్ధంలో అలెగ్జాండర్‌ను వధించకుండా వదిలేయమని విన్నవించుకుంది. అన్నట్టుగానే పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్‌ను వధించే అవకాశం వచ్చినా.. వదిలేసి రుక్సానాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దీనినే ఇంకోలా కూడా చెప్పుకుంటారు. పురుషోత్తముడి భార్య సంయుక్త అలెగ్జాండర్‌కు రాఖీ కట్టిందని, ఆమెను చెల్లిగా భావించిన అలెగ్జాండర్, పురుషోత్తముడికి ప్రాణభిక్ష పెట్టాడనీ కూడా చెబుతారు. కథ ఏదైతేనేం... నాకున్న పవర్ అదీ! నన్ను కట్టిన అక్క, చెల్లి ధనమాన, ప్రాణాలే కాదు సౌభాగ్యాన్నీ కాపాడతా. జీవితాంతం రక్షగా నిలుస్తా! పరువుకోసం.. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో అట... తమ కులం కాని వాళ్లను ప్రేమించారని.. వాళ్లనే పెళ్లి చేసుకుంటామని పట్టుబట్టారనికడుపున పుట్టిన బిడ్డలని కూడా చూడకుండా నరికి పోగులు పెట్టారు. పదిమందిలో పరువు కోసం కన్నపిల్లల ప్రాణాలనే బలిపెట్టారు. వాళ్లనుకునే పేరుప్రతిష్టలను నిలుపుకోవడం కోసం ఆ ఇళ్లల్లో ఆడపిల్లలను చంపడానికి ఇంటి పెద్ద సహా అన్నాతమ్ముళ్లు కూడా సిద్ధపడుతున్నారు. భద్రతకు భావమే లేకుండా చేస్తున్నారు. భ్రూణ హత్యలు పుట్టాక అమ్మాయి మీద కక్షగట్టి చేస్తున్న నీచాలు ఒకెత్తయితే.. పుట్టకుండా చూసే పాతకం ఒకెత్తు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిసిందంటే చాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనే కాదు పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలాంటి చోట్ల కూడా అబార్షన్‌తో ఆ పిల్లకు పుట్టుకలేకుండా చేస్తున్నారు. ఒకవేళ పుట్టినా పురిట్లోనే గొంతునొక్కేస్తున్నారు. ఇవన్నీ కాక.. ప్రతి అన్న, తమ్ముడు, మామయ్య, బాబాయ్, చివరకు తాతయ్య వయసు వృద్ధులు కూడా ఇంట్లోంచి బయటకు వెళితే చాలు.. పరాయి ఆడపిల్ల కనపడితే చాలు ఈవ్‌టీజింగ్, వెకిలి నవ్వులు, అసభ్యప్రవర్తనలు, అవాకులు, చవాకులతో అమ్మాయిలు గడపదాటకుండా కట్టడి చేస్తున్నారు. దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షును తలపిస్తున్నారు! వీళ్లంతా అన్నదమ్ములు, తాతతండ్రులే అయినప్పుడు.. నా సాక్షిగా ప్రతి ఇంటి ఆడపిల్లకు భద్రతనివ్వాలి కదా.. రక్షణగా నిలవాలి కదా! మరెందుకు ఇలా కాల్చుకు తింటున్నారు? అర్థమైంది.. అంటే నా అస్తిత్వంతో అమ్మాయిలంతా భద్రంగా ఉంటున్నారని అనుకున్నాను. ప్రతియేటా నా పుట్టిన రోజుకి నన్ను వాళ్ల సోదరుల చేతులకు కట్టి రక్షణను కానుకగా స్వీకరిస్తున్నారనే భ్రమలో ఉన్నాను. అసలు రక్షాబంధన్‌కు విలువే ఇవ్వట్లేదు ఇన్ని వాస్తవాలు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. నన్ను ఒక పండుగలా సంవత్సరానికి ఒక్కరోజుకు పరిమితం చేశారు. దాని స్ఫూర్తిని అవగతం చేసుకోలేదు. ఏడుపొస్తుంది నాకు.. ఇన్నాళ్లు ఎంత విర్రవీగాను.. ఈ మగాళ్లలాగే. నాదేదో అద్భుతమైన జన్మ అని.. లోకంలోని అమ్మాయి సంక్షేమం, శ్రేయస్సు కోసం కారణజన్మురాలిగా అవతరించానని గర్వపడ్డాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. అయినా నా ధర్మం మరిచిపోను. రక్షణ.. భద్రత స్వీయ బాధ్యత అని తెలిసొచ్చింది. అందుకే ఇప్పటి నుంచి నన్ను మీకు మీరే కట్టుకోండి అమ్మాయిలూ.. మీ భద్రత, మీ రక్షణను మీ చేతుల్లోనే పెట్టుకోండి. నాకు పవిత్రత కన్నా ప్రాక్టికాలిటీని ఆపాదించండి. సంత్సరానికి ఒక్కసారి కాదు... ప్రతిరోజును రాఖీపౌర్ణమిని చేసుకోండి. నేను మీ ముంజేతికున్న శక్తిని, యుక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అని మరచిపోకండి. నిజమా? మరి ఇవేంటి? ‘‘పురాణాలను, చరిత్రను చూపించి నిన్ను నువ్వు భలే రొమాంటిసైజ్ చేసుకుంటున్నావ్.. బాగానే ఉంది. నీ ఉనికికి అది అవసరం కూడా! కాని వర్తమాన భారతం చూడు.. అక్క, చెల్లి, తల్లి, బిడ్డ పడుతున్న యాతన చూడు..’’ అంటారా? .. విశాఖపట్టణం జిల్లాలోని వాకపల్లిలో రక్షణనివ్వాల్సిన పోలీసులే ఆదివాసి ఆడబిడ్డల మీద లైంగిక దాడి చేశారు. వాళ్ల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. దేశాన్ని కంటికిరెప్పలా కాపుకాయాల్సిన జవాన్లు కశ్మీరు ఆడపిల్లల మానాభిమానాల్ని మంటగలిపారు. తమకు జరిగిన అన్యాయాన్ని నోరెత్తి ఎక్కడా చెప్పుకోనివ్వకుండా చేశారు. పోలీసుల, జవాన్ల అహంకారం వాకపల్లికో.. కశ్మీర్‌కో పరిమితం కాలేదు.. దేశంలోని ఎనిమిది దిక్కులకూ వ్యాపించింది. అన్న.. తండ్రి.. జన్మనిచ్చిన తండ్రే కూతుళ్ల పాలిట భక్షకుడిగా మారుతుంటే జవాన్లను, పోలీస్‌లను అని ఏం లాభం? ఇదేదో పల్లెటూరులో జరిగిన దారుణం కాదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని.. హైదరాబాద్ నగరంలో బయటపడ్డ విషాదం! పన్నెండేళ్ల కూతురికి ఆత్మస్థయిర్యమై.. ఆమె వెనకాల నిలబడాల్సిన తండ్రి.. కన్న బిడ్డ అనే ఇంగితం కూడా మరచి ఆ పిల్లపట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. మూడేళ్లపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేదని నిరూపించాడు. ఇంకెక్కడో బిహార్‌లో.. అన్న తన చెల్లి పట్ల ఇలాంటి నిర్వాకమే వెలగబెట్టాడట. బయటి వాళ్ల నుంచి చెల్లికి అపాయం కలగకుండా చూడాల్సిన అన్నే చెల్లెలిని చెరిచాడు. ఆ తప్పును పెద్దవాళ్ల ముందు బయటపెడుతుందని చెల్లి గొంతు కోసేశాడు. భగవంతుడా.. ఇంకా ఏమేమి చూడాలి? ఎన్ని ఘోరాల గురించి వినాలి? కదిలే కార్లల్లో.. బస్సుల్లో.. నాలుగు గోడల కప్పు కింద.. కన్నవాళ్ల సంరక్షణలోనే భద్రత లేనప్పుడు వీధుల్లో.. నడి బజారుల్లో.. కదిలే కార్లల్లో.. బస్సుల్లో ఎక్కడిది? నిర్భయను కదిలే బస్సులోనే కబళించారట. భారత దేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు.. అన్న ప్రతిజ్ఞను మరచి మరీ నిర్భయ జీవితాన్ని చెరిచారు. భవిష్యత్తు గురించి బంగారు కలలు కన్నది, ఏదో సాధించాలనే తపనతో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వచ్చింది. తండ్రి ఉన్న ఆస్తి అంతా అమ్మి కూతురును ఫిజియోథెరపీలో చేర్పించాడు. మంచి ఫిజియోథెరపిస్ట్‌గా పేరు తెచ్చుకుంటుందని తల్లిదండ్రులు ఆశపడ్డారు. వాళ్ల కోరికను నెరవేర్చాలనే పట్టుదలతో చదువుతోంది. ఈ లోపే బస్సులో దుర్మార్గులు ఆమె కలలను కుళ్లబొడిచారు. బతుకును బుగ్గిపాలు చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే అయిదేళ్ల గుడియా.. ఇంటిపక్క అన్నయ్య కోరికకు బలైంది దారుణంగా! ఇలాంటివి ప్రపంచానికి తెలిసినవి వందల్లో.. తెలియనివి వేలల్లో ఉన్నాయ్! అమ్మేస్తున్నారు... ఆడపిల్లను లక్ష్మీదేవిగా కొలవడం.. రాతలకు, మాటలకే పరిమితం. ఇప్పుడైతే అమ్మాయి పుడితే భారంగానే భావిస్తున్నారు. అందుకే వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండుల్లో, వీథుల్లో, చివరకు చెత్త కుప్పల దగ్గరా ఉట్టిగానే వదిలేసి వెళితే.. కొంతమంది అమ్మేసి కాసులు తీసుకుంటున్నారు. ఇది కన్నవాళ్లు మూటగట్టుకుంటున్న పాపమైతే.. ఇంకొంతమంది తమకూ కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు ఉంటారు అని మరచి తమ ఇంటి ఆడపిల్ల కాకపోతే చాలు అనుకొని ఇంకే ఇంటి ఆడపిల్ల అమాయకంగా కనిపించినా మాయచేసి.. మోసంచేసి చేతులు మారుస్తున్నారు, ట్రాఫికింగ్‌తో క్యాష్ చేసుకుంటున్నారు. క్షమించలేని తప్పుకు పాల్పడుతున్నారు. -
రమేశ్ అన్నయ్య నాన్న అయితే.. మహేశ్ అన్నయ్య ఫ్రెండ్
పద్మినీ ప్రియదర్శిని ‘ఒక్కడు’ సినిమాలో తన చెల్లెలితో మహేశ్‌బాబు చాలా సరదాగా ఉంటారు. ఆటపట్టించారు.. ప్రేమ చూపించారు. మరి, రియల్ లైఫ్‌లో తన అక్కాచెల్లెళ్ల (పద్మ, మంజుల, పద్మినీ ప్రియదర్శిని)తో ఎలా ఉంటారు? ‘రాఖీ’ పండగ సందర్భంగా మహేశ్‌బాబు చెల్లెలు, హీరో సుధీర్‌బాబు భార్య పద్మినీ ప్రియదర్శిని ఆ విశేషాలను పంచుకున్నారు. రమేశ్ – మహేశ్బాబుగార్లకు చిన్న చెల్లెలు మీరు... మీ ఇద్దరు అన్నయ్యల గురించి? రమేశ్ అన్నయ్య నాకు నాన్నలా. నానీ (మహేశ్‌ని అలానే పిలుస్తారు) ఫ్రెండ్‌లా. రమేశ్ అన్నయ్యను నాన్న అని ఎందుకు అన్నానంటే మా చిన్నప్పుడు నాన్నగారు (సూపర్ స్టార్ కృష్ణ) మాకు పాకెట్ మనీ ఇస్తే, రమేశ్ అన్నయ్య తన మనీనంతా నాకోసం ఖర్చు పెట్టేవాడు. రెస్టారెంట్స్‌కి తీసుకెళ్లి నాక్కావల్సినవి కొనిపెట్టేవాడు. నాకు రమేశ్ అన్నయ్య ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ వాచ్. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఇక, నానీ ఫ్రెండ్ అని ఎందుకు అన్నానంటే, ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న గొడవలుంటాయి కదా. అలా చిన్నప్పుడు మేమిద్దరం గొడవపడేవాళ్లం. ముఖ్యంగా ‘ఇంక్’ పెన్ విషయంలో నానీ నన్ను ఇబ్బందులపాలు చేసేవాడు. మార్నింగ్ ఇద్దరం మా పెన్స్లో ఇంక్ ఫిల్ చేసుకునేవాళ్లం. ఆ తర్వాత నాకు తెలియకుండా నా పెన్నులో ఉన్న ఇంక్ అంతా నానీ తీసేసి, సైలెంట్‌గా నా బ్యాగులో పెట్టేవాడు. స్కూల్కెళ్లి చూసుకుంటే, ఖాళీ పెన్ను కనిపించేది. రాసుకోవడానికి చాలా ఇబ్బందిపడేదాన్ని. అది తల్చుకుంటే నవ్వొస్తోంది. పెద్దయ్యాక మహేశ్‌గారు మీ గురించి తీసుకుంటున్న కేర్ గురించి? నాకు పెళ్లి కుదిరినప్పుడు చాలా టెన్షన్ పడ్డాడు. సుధీర్ (హీరో సుధీర్‌బాబు – పద్మినీ ప్రియదర్శిని భర్త) మంచి వ్యక్తేనా? అని ఆరా తీశాడట. మంచి అబ్బాయి అని తెలుసుకుని, రిలాక్స్ అయ్యాడు. పెళ్లికి ముందు ఇలా అంటే, పెళ్లి తర్వాత కూడా నానీ టెన్షన్ పడ్డాడు. మంజుల (మహేశ్ రెండో చెల్లెలు) దగ్గర ‘బుల్లి (పద్మినీని ఇంట్లో అలానే పిలుస్తారు) హ్యాపీగా ఉందా?’ అని అడిగేవాడట. ‘హ్యాపీ’ అని చెప్పాక రిలీఫ్ అయ్యాడు. సిస్టర్స్ అంటే నానీకి అంత కేర్. మా ఇద్దరన్నయ్యలూ అంతే. అంటే.. మీ నాన్నగారు మిమ్మల్ని చూసుకున్నంత జాగ్రత్తగా మహేశ్‌గారు చూసుకుంటారన్న మాట? అవునండి. చిన్నప్పుడు అల్లరి బాగా చేసేవాడు. జనరల్‌గా కూతుళ్ల గురించి తల్లీతండ్రీ ఎక్కువ కేరింగ్‌గా ఉంటారు. మహేశ్ కూడా ఓ ఫాదర్ తీసుకున్నంత కేర్ తీసుకుంటాడు. మంచి ఫ్యామిలీ పర్సన్. మీ హజ్బెండ్ సుధీర్‌బాబు హీరో అవుతానన్నప్పుడు మీరెలా ఫీలయ్యారు? మీ అన్నయ్య మహేశ్ ఏమన్నారు? నేను సుధీర్ దగ్గర ఒక్కటే చెప్పాను. ‘నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఆ టాలెంట్‌తోనే పైకి రావాలి. మహేశ్ హెల్ప్ తీసుకోకూడదు. ఎందుకంటే తనని హెల్ప్ అడగడానికి బయటివాళ్లు చాలామంది ఉంటారు. ఇక, ఇంట్లోవాళ్లు కూడా అడిగి ఇబ్బందిపెట్టకూడదు’ అన్నాను. యాక్చువల్‌గా సుధీర్ కూడా తన టాలెంట్‌ని నమ్ముకునే ముందుకెళ్లాలనుకున్నాడు. అందుకు నాకు సంతోషంగా అనిపించింది. నిజానికి నానీకి అందర్నీ ఎంకరేజ్ చేసే హ్యాబిట్ ఉంది. కానీ, ఫెయిలైతే ఎక్కడ అప్సెట్ అయిపోతామోనని భయం. అందుకే సుధీర్ హీరో అవుతానన్నప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాడు. అయితే, సుధీర్ వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలు, తన ప్యాషన్ చూసి, ‘గో ఎ హెడ్’ అన్నాడు. మహేశ్ తన ముగ్గురు సిస్టర్స్ హజ్బెండ్స్తో ఎలా ఉంటారు? వెరీ ఫ్రెండ్లీ. సేమ్ టైమ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. మేమంతా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అందరం కలసి మాట్లాడుకుంటాం. అందరి ఫీలింగ్స్‌ని రెస్పెక్ట్ చేస్తాం. మీ పిల్లలతో ఎలా ఉంటారు? మాకిద్దరు అబ్బాయిలు. మా రెండో బాబు పుట్టినప్పుడు నానీ చూడ్డానికి వచ్చాడు. అప్పుడు మా వదిన నమ్రతతో మనక్కూడా ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుందన్నాడట. అప్పటికే వాళ్లకు గౌతమ్ పుట్టాడు. ఆ తర్వాత సితార పుట్టింది. తన పిల్లలతో ఎలా ఉంటాడో మా పిల్లలతో కూడా అలానే ఉంటాడు. పిల్లలతో సరదాగా మాట్లాడతాడు. ఫైనల్లీ... వ్యక్తిగా మహేశ్ ఎలాంటి టైప్? హీ ఈజ్ పర్ఫెక్ట్. నాకు నచ్చే విషయం ఏంటంటే.. ఇంట్లో ఆడవాళ్లను ఒకలా బయటివాళ్లను ఒకలా నానీ చూడడు. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు. అక్కలు పద్మ, మంజులతో ప్రియదర్శిని -
మోదీకి రాఖీ: 22 ఏళ్లుగా పాక్ మహిళ!
న్యూఢిల్లీ: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పాక్ మహిళ కమర్ మోహ్సిన్ షేక్ తెలిపారు. గత రెండు దశాబ్దాలకు పైగా మోదీకి రాఖీ కడుతన్నట్లు చెప్పిన కమర్ మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 'నేను తొలిసారిగా నరేంద్ర మోదీ గారికి రాఖీ కట్టినప్పుడు ఆయన ఓ సాధారణ కార్యకర్తగా ఉన్నారు. కానీ నిరంతరం కృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఓ వ్యక్తి ఎదిగితే ఎలా ఉంటారో చెప్పడానికి మోదీనే నిదర్శనంగా చెప్పవచ్చునని' పాక్ మహిళ కొనియాడారు. 'గత 22, 23 ఏళ్లుగా నరేంద్ర మోదీకి రాఖీ కడుతున్నాను. ప్రస్తుతం భారత ప్రధానిగా ఉన్న ఆయన ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉంటారని భావించాను. కానీ ఎంతో ప్రేమతో ఆయన రెండు రోజుల కిందట రక్షా బంధనం గురించి నాకు ఫోన్ కాల్ చేశారు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోసారి మోదీకి రాఖీ కట్టబోతున్నానని' కమర్ మోహ్సిన్ వివరించారు. -
అనుబంధానికి రక్ష
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. తమకు జీవితంలో అన్ని సందర్భాల్లోనూ తోడుండమని కోరుతూ సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టడమే ఈ పండుగ. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణిమ రోజున ఈ పండుగను దేశమంతా ఘనంగా జరుపుకొంటారు. దీన్ని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుపుకొటున్నట్లు మన పురాణాలు చెబుతన్నాయి. రక్షాబంధన్ వెనుక ఉన్న పురాణగాథలు, చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం.. శ్రీకృష్ణుడు–ద్రౌపదిల బంధం... తన సోదరి అయిన ద్రౌపది విషయంలో శ్రీ కృష్ణుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాడో తెలుసుకుంటే మన సంస్కృతిలో అన్నాచెల్లెల్ల మధ్య బంధం ఎంత దృఢమైనదో అర్థమవుతుంది. కృష్ణుడు శిశుపాలుడిని సుదర్శన చక్రం ప్రయోగించి వధించాడు. ఈ సమయంలో కృష్ణుడి చూపుడు వేలుకు గాయమై, రక్తం ధారగా కారుతుంది. దీంతో ద్రౌపది తన చీర అంచు కొద్దిగా చించి, అన్నయ్య కృష్ణుడికి కట్టుకట్టి రక్తం కారడం ఆగిపోయేలా చేస్తుంది. దీంతో సంతోషించిన కృష్ణుడు, తన చెల్లికి ఎల్లవేళలా అండగా ఉంటానని అభయమిస్తాడు. చెప్పినట్లుగానే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో శ్రీ కృష్ణుడు ఆమెకు చీరలు అందించి అండగా నిలిచాడు. పురుషోత్తముడి కథ.. జగజ్జేతగా మారాలనే తలంపుతో గ్రీకు రాజు అలెగ్జాండర్ అనేక దేశాల మీద దండెత్తుతూ ఉంటాడు. ఈ క్రమంలో క్రీస్తూపూర్వం 326లో మనదేశంపైకి కూడా దండెత్తేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపైకి దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే ఈ తరుణంలో అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ యుద్ధం విరమించుకుంటాడు. కర్నావతి చరిత్ర.. మొఘల్ చక్రవర్తి హుమయూన్‌కు క్రీస్తుశకం 1535లో చిత్తోర్ రాణి కర్నావతి రాఖీ పంపి, అతడి నుంచి అభయం పొందిందట. భర్త మరణించడంతో చిత్తోర్ రాజ్యపాలన బాధ్యతలు చేపట్టిన రాణి కర్నావతికి, గుజరాత్ రాజు అయిన సుల్తాన్ బహదూర్ షా నుంచి హాని ఉండేది. అతడి బారి నుంచి తనకు, తన రాజ్యానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె హుమయూన్‌కు రాఖీ పంపిందని, హుమయూన్ ఆమెను సోదరిగా అంగీకరించి కర్నావతి రక్షణకు అభయం ఇచ్చాడనే కథనం ప్రచారంలో ఉంది. పండుగ విశిష్టత.. రాఖీ పండుగ వెనుక చారిత్రక నేపథ్యాలు ఏవైనా ఇది సోదరసోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలనే సందేశాన్ని రాఖీ పండుగ అందిస్తోంది. ఒకప్పుడు ఈ వేడుకను ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా నేర్చుకునేవారు. కానీ ప్రస్తుతం ఇది దేశవ్యాప్తమైంది. ఈ పండుగ రోజున మహిళలు ఎక్కడ ఉన్నా తమ సోదరుల దగ్గరికి వెళ్లి రాఖీ కడుతుంటారు. రాఖీలు కట్టి, తమ సోదరులకు స్వీట్లు తినిపించడం ఆనవాయితీ. సోదరులు కూడా తమ అక్కాచెల్లెళ్లకు మంచి కానుకలు అందజేస్తారు. పండుగ సందర్భంగా మార్కెట్లు రాఖీ విక్రయాలతో కళకళలాడుతుంటాయి. భిన్నమైన రాఖీలు అందుబాటులో ఉంటున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో.. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాఖీ పండుగ రోజున రాఖీలు కట్టుకోవడంతో పాటు, రాధాకృష్ణులకు ఊయల వేడుక నిర్వహిస్తారు. దీనినే వారు ‘ఝులన్ పూర్ణిమ’ (ఊయల పున్నమి) అని వ్యవహరిస్తారు. ఒడిశాలో కొన్ని చోట్ల ‘గుమ్మా పున్నమి’గా వ్యవహరిస్తారు. వీధుల్లో మట్టిదిబ్బలు ఏర్పాటు చేసి, వాటికి రెండువైపులా పొడవైన వెదురుబొంగులు నాటి, వాటికి కట్టిన దండేనికి రకరకాల వస్తువులు కడతారు. వాటిని అందుకోవడానికి యువకులు, పిల్లలు శక్తికొద్ది మట్టిదిబ్బ మీదుగా దూకుతారు. ఇది దాదాపు ఉట్టెకొట్టడంలాగానే ఉంటుంది. మహారాష్ట్రలో ఇదే రోజున ‘నారాలీ పూర్ణిమ’ (కొబ్బరి పున్నమి) వేడుకలు జరుపుకొంటారు. ఈ సందర్భంగా చెరువులు, నదులు... కుదిరితే సముద్రంలో కొబ్బరికాయలు విడిచిపెట్టి, వరుణ దేవుడికి పూజలు జరుపుతారు. జమ్ముకశ్మీర్‌లో రాఖీపూర్ణిమ రోజున జనాలు ఆరుబయటకు వచ్చి గాలిపటాలను ఎగరేస్తారు. ముఖ్యంగా జమ్ము ప్రాంతంలో ఈ వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. ఎక్కడ ఆకాశం వైపు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. నేపాల్‌లో ఇదేరోజున జనై పూర్ణిమగా జరుపుకొంటారు. అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టడమే కాకుండా, ఆడామగా పిల్లా పెద్దా అందరికీ అక్కడి పూజారులు పవిత్రరక్షలను ముంజేతులకు కడతారు. రక్ష కట్టిన పూజారులకు కట్టించుకున్న వారు శక్తికొద్ది కానుకలు సమర్పించుకుంటారు. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
వలసదారులపై మరో పిడుగు
► అమెరికాలో తొలి ఐదేళ్లు సంక్షేమానికి ట్రంప్ చెక్ ► ట్రంప్‌కు భారత రాఖీలు వాషింగ్టన్: వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అమెరికాకు వచ్చే వలసదారులు తొలి ఐదేళ్లు సంక్షేమ పథకాల లబ్ధి పొందలేరని పేర్కొంటూ షాకిచ్చారు. గ్రీన్‌కార్డుల(శాశ్వత నివాస హోదా) జారీని తగ్గించే లక్ష్యంతో ప్రతిభ ఆధారిత వలస విధానానికి(రైజ్ చట్టం) మద్దతు తెలిపిన రెండ్రోజులకే తాజా నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రజల్ని ఉద్దేశించి వారాంతపు వెబ్, రేడియో ప్రసంగం చేస్తూ.. ‘మీరు మా దేశంలోకి వచ్చిన ఐదేళ్ల అనంతరం గానీ సంక్షేమ పథకాల్ని అందుకోలేరు. గతంలో లాగా అమెరికాలో ప్రవేశించగానే ప్రయోజనాల్ని పొందడం ఇక నుంచి కుదరదు’ అని పేర్కొన్నారు. అమెరికా కోసం ధైర్యంగా, సాహసోపేతమైన చర్యల్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. అమెరికా సరైన మార్గంలో ప్రయాణిస్తోందని, ఈ ఏడాది మే నాటికి దేశంలో నిరుద్యోగ శాతం 16 ఏళ్ల కనిష్టానికి చేరిందని ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డుల జారీతో సంక్షేమ ప్రయోజనాల దుర్వినియోగం, అడ్డూఅదుపూ లేని వలసల్ని అడ్డుకోవడంతో పాటు, అమెరికన్ ఉద్యోగులకు మేలు జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌కు 1001 రాఖీలు రాఖీ పౌర్ణమి సందర్భంగా హరియాణాలోని ట్రంప్ గ్రామం (అసలు పేరు మరోరా) నుంచి 1001 రాఖీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1800 జనాభా ఉన్న ఈ గ్రామాన్ని సులభ్ ఇంటర్నేషనల్ దత్తత తీసుకుంది. గ్రామంలోని మహిళలు ట్రంప్ ముఖంతో రాఖీలు తయారుచేసి.. రక్షా బంధన్ నాటికి(ఆగస్టు 7) ట్రంప్‌కు చేరేలా అమెరికాకు పంపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం కూడా 501 రాఖీలను తయారుచేశారు. తమ గ్రామంలో పర్యటించాలంటూ ఇద్దరు నేతలకు ఆహ్వాన పత్రాలు కూడా పంపారు. ట్రంప్, మోదీలను పెద్దన్నలుగా భావిస్తున్నామని.. వారిద్దరూ తమ గ్రామానికి రావాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. రాఖీ పండుగ రోజున ప్రధాని మోదీని కలవాలనేది తమ కోరికని ఆ గ్రామానికి చెందిన వితంతువులు పేర్కొన్నారు. మరోరా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సులభ్ ఇంటర్నేషనల్ చేపట్టింది. -
సర్వరక్షా బంధనం
సోమవారం రక్షాపూర్ణిమ పర్వదినం శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానవిధిని పూర్తి చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి కట్టదలిచామో వారి ముంజేతికి కడుతూ– ఆ రక్షిక మీద అక్షతలని వేసి, రక్షాబంధనాన్ని కట్టాలి. రక్షాబంధనం కట్టించుకున్న వారు వీరికి అన్ని విధాలా అండగా నిలబడాలి. రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని వదిలేయకూడదు. మాటకి కట్టుబడి అండగా నిలవాలి. తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు, తదితర విపత్తుల బారినుంచి కాపాడాలని, భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వస్తారు ఆడపడచులు. తమ సోదరుల చేతికి రక్షాబంధనం కట్టి, వారికి తీపి తినిపిస్తారు. అప్పుడు ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయ . అయితే రక్షాబంధనాలను వెండివి, బంగారువి లేదా విలువైనవి కట్టాలని లేదు. సంప్రదాయ రక్షాబంధనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో సరిపెట్టకూడదు. దాని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సామాజిక శ్రేయస్సు పరిఢవిల్లుతుంది. -
రాఖీని ఎలా కట్టాలి?
సెల్ఫ్ చెక్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేసినంత ఈజీగా ఉండదు. ఒకరి క్షేమాన్ని ఒకరు కాంక్షిస్తూ సంప్రదాయబద్ధంగా చేసుకునే తంతు ఇది. మాటల్లో చెప్పలేని అభిమానానికి దేవుని అనుగ్రహాన్ని రంగరించి వేసే ఆత్మీయబంధనం. 1. మంత్రోచ్చారణతో పూజ చేసి ఆ కుంకుమను నుదుట దిద్ది, పూజాక్షతలను తల మీద వేసిన తర్వాత మాత్రమే రాఖీని కడతారు. ఎ. అవును బి. కాదు 2. సోదరులు తల మీద వస్త్రం ఉంచుకుని దాని మీద అక్షతలు వేయించుకోవాలి. ఎ. అవును బి. కాదు 3. అన్నయ్యకు సోదరి హారతి ఇవ్వాలి, కర్పూరం పూర్తయ్యే వరకు వెలగనివ్వాలి. ఎ. అవును బి. కాదు 4. కొబ్బరికాయకు నూలు దారాన్ని చుట్టి సోదరునికి ఇచ్చిన తర్వాత స్వీటు తినిపిస్తారు. ఎ. అవును బి. కాదు 5. సంప్రదాయ రాఖీ ఎరుపు, పసుపు దారం మధ్యలో గురివింద గింజ సైజులో వెల్వెట్ బాల్ ఉంటుంది. దీనిని బొమ్మనిరాఖీ అంటారు. ఎ. అవును బి. కాదు 6. ఈ పండగరోజు సోదరికి సోదరులు పాదనమస్కారం చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఆడపడుచు పుట్టింటికి వెళ్లి రాఖీ కట్టడానికి సాధ్యం కాని పక్షంలో సోదరులే ఆమె ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుంటారు లేదా పోస్టులో పసుపు, కుంకుమ, రాఖీ పంపిస్తారు. ఎ. అవును బి. కాదు 8. సోదరునికి అన్నింటిలోనూ విజయం కలగాలని, సుఖసంతోషాలతో ఉండాలని సోదరి కోరితే, ఆదుకోవడానికి నేను ఉన్నాను అని సోదరుడు తెలియచేయడమే ఈ వేడుక ఉద్దేశం. ఎ. అవును బి. కాదు 9. ఇది పైకి సన్నటి దారంలా కనిపించినప్పటికీ మనసుకు ‘సున్నితమైన, బలమైన బంధం’ అన్న భావనను సూచిస్తుంది. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీ దృష్టిలో రక్షాబంధనం ఒక వేడుక మాత్రమే కాదు అనుబంధాల బంధనం కూడ. ఎదుటి వారి శ్రేయస్సును కోరి కట్టే రాఖీకి ప్రతిగా అవ్యాజమైన అనురాగాన్ని పొందుతున్నారనుకోవాలి. -
చెర్రీకి రాఖీ కట్టిన చిట్టి చెల్లి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిన్న కూతురు.. తన పెద్దన్నయ్య రామ్ చరణ్‌తో రాఖీ పండుగ జరుపుకున్న ఓ ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో హల్ చల్ చేస్తుంది. పవన్ కూతురు తనకు రాఖీ కడుతున్న ఫొటోను స్వయంగా రామ్ చరణే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ సతీమణి అన్నా లెజ్నోవా దగ్గరుండి పాప చేత చెర్రీకి రాఖీ కట్టించారు. ఈ ఫొటో పవన్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తుంది. చిట్టి చెల్లికి చెర్రీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. కుటుంబంలో జరిగే వేడుకలకు పవన్ తరఫున ఆయన సతీమణి అన్నా హాజరవుతున్నారు. శ్రీజ వివాహ వేడుకలో సందడి చేసిన ఆమె, తాజాగా మెగాస్టార్ బర్త్ డే పార్టీలో కూడా మెరిశారు. మెగా ఫంక్షన్లకు హాజరు కాకపోయినా అన్నయ్య కుటుంబంతో తమ్ముడు సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడని స్పష్టం అవుతోంది. -
సైనికులకు రాఖీలు కట్టడం చరిత్రలో ప్రథమం
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హిందూపురం అర్బన్ : దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు కేంద్ర మహిళా మంత్రులు రాఖీలు కట్టి వేడుకలు చేసుకోవడం దేశ చరిత్రలోనే ప్రథమమని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు చేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా మంగళవారం ఆమె కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా విదురాశ్వత్థంలో పర్యటించారు. ఇక్కడున్న స్వాతంత్య్ర సమరయోధుల సమాధులను సందర్శించి.. నివాళులర్పించారు. వారి త్యాగాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకలను ప్రభుత్వం, ప్రజలు ఉత్సవంలా నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. ప్రధాని ప్రోత్సాహంతోనే మహిళా మంత్రులు సైనికులకు రాఖీలు కట్టారని గుర్తుచేశారు. 1938 ఏప్రిల్ 25న విదురాశ్వత్థం వాసులు సంఘటితమై బ్రిటీష్ పాలకులను ధిక్కరించినట్లు వివరించారు. ఈ సందర్భంగా సుమారు 35 మంది నేలకొరిగారని, అందుకే ఈ ప్రాంతానికి దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్ అని పేరొచ్చిందని చెప్పారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బెంగళూరు ఎంపీ పీసీ మోహన్, బీజేపీ రాష్ట్ర నేతలు రవికుమార్, నరసింహారెడ్డి, చిక్బళ్లాపురం జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నా చెల్లెల ఆప్యాయతే రాఖీ
-
సోదరికి టాయిలెట్ గిప్ట్ గా ఇచ్చాడు..
రాంచీ: రక్షాబంధన్ రోజున తన సోదరికి ఓ అన్న అరుదైన కానుక ఇచ్చాడు. సాధారణంగా రాఖీ కడితే సోదరులు... అక్కా లేదా చెల్లెళ్లకు చీర లేక నగదు రూపంలో బహుమతి ఇస్తుంటారు. అయితే జార్ఖండ్‌లోని రాంగఢ్‌కు చెందిన పింటూ అనే యువకుడు మాత్రం తన సోదరికి మరుగుదొడ్డిని నిర్మించి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపకల్పన చేసిన స్వచ్ఛ భారత్ ద్వారా స్ఫూర్తి పొందిన అతడు ఈ పనికి పూనుకున్నాడు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనకు వెళ్లడం అనేది ఎంతో ఇబ్బందో తనకు తెలుసునని, అది ఆరోగ్యానికి మంచిది కాదని పింటూ పేర్కొన్నాడు. దీంతో మరుగుదొడ్డి నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు అతడు తెలిపాడు. 'నేను రక్షా బంధన్ సందర్భంగా నా సోదరికి టాయిలెట్ బహుమతిగా అందించాను. ఇతరులు కూడా దీన్ని అనుసరిస్తే బాగుంటుంది' అని సూచన చేశాడు. ఈ నిర్ణయంతో తన సోదరి కూడా సంతోషంగా ఉందని పింటూ తెలిపాడు. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుందన్నట్లు పింటూ ఆలోచనతో ...ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. కాగా స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. -
రాజ్‌భవన్‌లో ఘనంగా రక్షాబంధన్
సాక్షి, హైదరాబాద్: శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినులు, మహిళలు, రాజకీయ ప్రముఖులు.. గవర్నర్ నరసింహన్‌ను కలసి, శుభాకాంక్షలు చెబుతూ ఆయన చేతికి రాఖీలు కట్టారు. రాఖీ కట్టేందుకు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ గవర్నర్ నరసింహన్ మాట్లాడి, వారితో రాఖీలు కట్టించుకున్నారు. గవర్నర్ మాట్లాడుతూ.. సమాజంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య బలమైన బంధానికి రక్షాబంధన్ ప్రతీక అన్నారు. మిమ్మల్ని మేం రక్షిస్తామంటూ.. అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములంతా భరోసానిచ్చి, వారి బాధ్యతను స్వీకరించాలన్నారు. అలాగే, మహిళలపై వేధింపులు, హింసాత్మక ఘటనల కవరేజీలో ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని గవర్నర్ ఆవేదన వ్యక్తంచేశారు. లైంగిక వేధింపుల వీడియోలను పదే పదే ప్రసారం చేయడం మంచిది కాదని.. దీంతో ఆత్మీయులు, బాధితుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఇలాంటివాటిని మీడియా వారు మార్చుకోవాలని.. బాధ్యతాయుతంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. -
జలానుబంధం..!
-
రాఖీతో అన్నకు అంతిమ వీడ్కోలు
చిప్పగిరి: మృతిచెందిన అన్నకు రాఖీ కడుతున్న ఈ దశ్యం ఎంతో హదయ విదారకంగా ఉంది కదూ! అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా చెప్పుకునే రక్షాబంధన్ రోజు నేమకల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నేమకల్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ మాల పెద్దలక్ష్మన్న(62) కొన్ని నెలలుగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాడు. చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రయివేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మతిచెందాడు. ఇతనికి యశోదమ్మ, ఈరమ్మ, నరసమ్మ అనే ముగ్గురు చెల్లెలు. ఉదయం వెళ్లి అన్నకు రాఖీ కట్టాలనుకున్న వీరికి పెద్దలక్ష్మన్న మతి విషయం తెలిసింది. కష్టసుఖాల్లో తోడుగా ఉండే అన్న ఇక లేడని విషాదాన్ని దిగమింగుతూ రాఖీ కట్టి అంతిమ వీడ్కోలు పలికారు. అన్నాచెలెల్ల అనుబంధం గొప్పతనాన్ని చాటారు. -
అన్నాచెళ్లెల్ల అనుబంధానికి ప్రతీక..
– ఘనంగా రాఖీ పండగ మక్తల్ : రాఖీ పండగ పర్వదినం సందర్భంగా శుక్రవారం పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో అన్నాచెళ్లెల్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. అన్నాచెళ్లెల్లు అప్యాయతతో రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. ఇతర ప్రాంతాల నుంచి ఆడపడుచులు రావడంతో గ్రామాల్లో సందడి కనిపించింది. శ్రావణ మాసంలో రాఖీ పండగ రావడంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆత్మకూర్ : సోదరీసోదరుల అనురాగ బంధానికి ప్రతీక అన్నాచెళ్లెల్ల ప్రేమకు చిహ్నం రాఖీ. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెళ్లెల్లు, సోదరీలు తమ తమ్ముళ్లకు, అన్నలకు రక్షాబంధన్ కట్టి మిఠాయిలు తినిపించారు. ఆత్మకూర్‌లోని శిశుమందిర్‌లో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చిన్నారులు పట్టణంలోని పురవీధుల గుండా తిరుగుతూ దుకాణ సముదాయాల వద్దకు వెళ్లి రాఖీలు కట్టారు. మూలమల్ల పుష్కరఘాట్‌లో మహిళా పోలీసులు న్యాయవాదులకు రాఖీలు కట్టారు. -
జనగామ జిల్లా బహుమతిగా ఇవ్వాలి
ప్రతిపక్ష పార్టీ నేతలకు రాఖీ కట్టి కోరిన మహిళా ప్రజాప్రతినిధులు జనగామ : జిల్లాల పునర్విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20న నిర్వహించే ప్రజాప్రతినిధుల సమావేశంలో జనగామకు అనుకూలంగా వాణి వినిపించాలని కోరుతూ జేఏసీ నాయకులు హైదరాబాద్‌లో ప్రతిపక్ష పార్టీ నేతలను బుధవారం కలిశారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి, జిల్లా కోసం రాజీ నామా చేసిన 25వ వార్డు కౌన్సిలర్ ఆకుల రజని, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, ప లువురు జేఏసీ నాయకులు తరలివెళ్లారు. టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్, అరవింద్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిసి జనగామ జిల్లా చేయాలని ఏకవాక్య తీర్మాణంతో సంపూర్ణ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. పలు పార్టీల నేతలకు మహిళా ప్రజాప్రతి నిధులు రాఖీ కట్టి జనగామ జిల్లా కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దశమంత్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని పార్టీలకు చెందిన నేతలు జనగామ జిల్లాకు అనుకూలంగా పూర్తి సహకారం అందిస్తామన్నారని తెలిపారు. ఆయన వెంట జేఏసీ నాయకులు ఆకుల వేణుగోపాల్‌రావు, ఆలేటి సిద్దిరాములు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళంపల్లి రాజు, మునిసిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, తీగల సిద్దుగౌడ్, బెడిదె మైసయ్య ఉన్నారు. -
‘రాఖీ’ బంధన్
-
భానుడికి రక్షా బంధనం!
మన దగ్గరే కాదు పైన కూడా రాఖీ పండుగ జరుగుతున్నట్టు ఉంది. ఇదిగో ఇలా సూర్యునికి రాఖీ కట్టినట్టు హరివిల్లు వర్ణాల అందమైన వలయం ఒకటి బుధవారం ఆవిష్కృతమైంది. సాధారణంగా వర్షాలు వెలిశాక ఇంద్రధనసులు కనువిందు చేస్తాయి. కానీ భానుడి చుట్టూ ఇలా రంగురంగుల వలయం ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. -
రకుల్ ఎలాంటి అబ్బాయితో ప్రేమలో పడాలని కోరుకుంటున్నారు?
రకుల్‌కి అమన్... భాయ్. అమన్‌కి కూడా రకుల్... భాయ్! అలా పెరిగారు ఇద్దరూ... అన్నదమ్ముల్లా!! చిన్నప్పట్నుంచీ తనను తానే ప్రొటెక్ట్ చేసుకునే కాన్ఫిడెన్స్ ఉన్న అక్కయ్య రకుల్. అక్కయ్యే కాదు, తమ్ముడిని ఒక ఆట ఆడుకునే అన్నయ్య కూడా! రాఖీ కట్టి గిఫ్ట్ ఇచ్చే అక్కయ్య రకుల్. అక్కయ్య మాత్రమే కాదు.. నీ కష్టంలో సంతోషంలో తోడుంటాననే అన్నయ్య కూడా! అందుకే రకుల్... రకుల్భాయ్. ముందుగా అక్క మాటల్లో తమ్ముడి గురించి.. తమ్ముడి మాటల్లో అక్క గురించి తెలుసుకోవాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్: నాకంటే అమన్ మూడేళ్లు చిన్న. హి ఈజ్ ఏ బ్రాట్. చాలా నాటీ. చిన్నప్పట్నుంచి ‘జంగిల్ బుక్’లో మోగ్లీ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మతో నాకు మోగ్లీ కావాలని మారాం చేసేదాన్ని. నిజంగానే మోగ్లీ వచ్చాడు. (నవ్వుతూ అమన్ వైపు చూస్తూ)... చాలా తుంటరి పిల్లాడు. అమన్: ఐయామ్ నాటీ. నా స్నేహితులు, అక్క స్నేహితులు... ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. (నవ్వుతూ..) అక్క కూడా తక్కువేం కాదు. చాలా నాటీ, తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. షి ఈజ్ వెరీ స్మార్ట్. తను కూడా అల్లరి పనులు చేస్తుంటుంది. రకుల్: తమ్ముడివైపు చూస్తూ ‘హలో...’ అమన్: హలో.. హాలో.. ఏంటి? రకుల్: ఏం లేదు. ఇంటర్వ్యూ కదా అని ఓవర్‌గా మాట్లాడకు. మనిద్దరం ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడు. చిన్నప్పుడూ ఇలానే ఉండేవారా? అమన్: చేయాల్సిన అల్లరంతా చేసేసి, ఆ తర్వాత భలే కవర్ చేసుకుంటుంది. స్కూల్లో అచ్చం టామ్‌బాయ్ టైప్‌లో ఉండేది. క్లాసులు బంక్ కొట్టేది. కానీ, ఒక్కసారి కూడా దొరకలేదు తెలుసా! నేనెప్పుడు బంక్ కొట్టినా దొరికిపోయేవాణ్ణి. రకుల్: అప్పుడు నన్ను ఎంత ఇరిటేట్ చేసేవాడో తెలుసా? ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మానాన్నలకు అన్నీ చెప్పేసేవాడు. ‘సొంత తమ్ముడు అయ్యుండి ఎందుకిలా చేస్తున్నాడు. అన్నీ ఇంట్లో చెప్తున్నాడు’ అనుకునేదాన్ని. లెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలసి బయటకు వెళ్లా. దూరంగా అమన్ కనిపించాడు. రకుల్ తమ్ముడు వస్తున్నాడంటూ అందరూ భయపడ్డారు. ఎట్ దట్ టైమ్.. ఐ హేట్ హిమ్. నాలుగేళ్ల క్రితం నేను ఢిల్లీ నుంచి ముంబ య్‌కి షిఫ్ట్ అయ్యాను. అప్పుడు బాగా క్లోజ్ అయ్యాం. అక్కలు ఎప్పుడూ తమ్ముణ్ణి భయపెట్టాలని చూస్తారు. మీరేమో మీ తమ్ముడికి భయపడ్డారన్న మాట.. రకుల్: అప్పుడు ప్రతిదీ ఇంట్లో కంప్లైంట్ చేస్తాడని భయం. నేను కాలేజ్‌కి ఎంటరయ్యే సరికి తను బంక్‌ల కొట్టి, సినిమాలు అని తిరిగేవాడు. ‘సడన్‌గా నువ్ చాలా మారిపోయావ్’ అని ఆటపట్టించేదాన్ని. నిజంగానే హైస్కూల్‌కి వచ్చిన తర్వాత అమన్‌లో మార్పు వచ్చింది. ‘సారీ.. సారీ’ అనేవాడు. ‘నా స్కూల్ లైఫ్ అంతా స్పాయిల్ చేశావ్, ఇప్పుడెందుకు సారీ చెప్తున్నావ్’ అనేదాన్ని. ఇప్పుడు అక్కాతమ్ముళ్ల కంటే మేము మంచి ఫ్రెండ్స్. ఏ విషయాన్నయినా మాట్లాడుకుంటాం. అమన్: అక్కతో మాట్లాడుతున్నానని ఆలోచించవలసిన అవసరం లేదు. నో ఫిల్టర్స్. మీ గురించి కంప్లైంట్ చేసిన అమన్ పై కంప్లైంట్ ఇవ్వాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? రకుల్: ఆలోచిస్తూ.. నో. 9వ తరగతి వరకూ రాముడు మంచి బాలుడు టైప్. నా దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి ఏం లేదు. కానీ, చిన్నప్పడు ఇద్దరి మధ్య ఫైటింగులే. జుట్టు పట్టుకుని మరీ కొట్టుకునేవాళ్లం. నేనే చెంపదెబ్బలు కొట్టి, నన్ను కొట్టాడని ఏడ్చిన సందర్భాలున్నాయి. (నవ్వుతూ...) ఫైటింగ్స్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? రకుల్: నాకంటే తను చిన్నగా ఉన్నప్పుడు నాదే అప్పర్ హ్యాండ్. పెద్ద అయిన తర్వాత ఫైట్ చేయలేక ‘సారీ’ చెప్పేశాను. అమన్: నేను ఎప్పుడూ కొట్టలేదు. తనే నన్ను కొట్టి ఏడ్చేది. రకుల్: నువ్ సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇంట్లోనే కరాటే ప్రాక్టీస్ చేసేవాళ్లం. గుర్తుందా? అమన్: (నవ్వుతూ...) ప్రతిదీ తనే స్టార్ట్ చేసేది. నాకు పంచ్ ఇచ్చేది. ఒకసారి నేను కాలితో కడుపు మీద ఓ కిక్ ఇచ్చాను. సడన్‌గా కింద పడింది, శ్వాస తీసుకోవడం కష్టమైంది. రకుల్: ‘అసలేం చేస్తున్నారు? ఇలాంటి ఆటలేనా ఆడేది? ఇలా చేస్తే అక్క చచ్చిపోతుంది’ అంటూ ధడక్.. ధడక్.. అని నాన్న అమన్‌కి రెండిచ్చారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అమన్: నాన్న బెల్ట్‌కి దొరక్కూడదని పరుగులు పెట్టా. రకుల్: మీకో విషయం చెప్పాలి... తమ్ముడు పుట్టేవరకూ అందరి అటెన్షన్ నాపైనే ఉండేది. నన్ను ముద్దు చేసేవారు. అమన్ పుట్టిన తర్వాత నా వాకర్ని వాడికి ఇచ్చారు. అది నాకు నచ్చేలేదు. ఆ వాకర్ పనికి రాకుండా చేయాలని ఏదేదో చేసేదాన్ని. చిన్నగా వాణ్ణి గిల్లేదాన్ని. అమ్మ చాలా ఇరిటేట్ అయ్యేది. అమ్మానాన్న తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకున్నా, నాకంటే ఎక్కువ అటెన్షన్ వాడికి ఇచ్చినా కోపం వచ్చేది. కానీ, ఆ కోపం లైట్‌గానే. ఎందుకంటే నేను తమ్ముణ్ణి జాగ్రత్తగానే చూసుకునేదాన్ని. చిన్నప్పుడు లిటిల్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫైట్స్ తప్ప బ్యాడ్ ఫైట్స్ ఎప్పుడూ లేవు. బ్యూటిఫుల్ సిస్టర్ ఉంటే బ్రదర్‌కి టెన్షన్ ఎక్కువ ఉంటుందేమో కదా... అమన్: నో టెన్షన్. షి ఈజ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ డేంజరస్. ముందు చెప్పానుగా టామ్‌బాయ్ టైప్ అని. ఎవరూ రకుల్‌కి ప్రపోజ్ చేయాలని కూడా అనుకోరు. వెరీ స్ట్రాంగ్ గాళ్. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే పబ్లిక్‌లోనే కొడుతుంది. రకుల్: (నవ్వుతూ..) మైండ్ యూజ్ చేశాడు చూశారా? బ్యూటిఫుల్ పర్వాలేదు. స్టిల్ డేంజరస్ అంటున్నాడు. ఈవ్ టీజింగ్, టీజర్స్‌పై తిరగబడడం వంటివి..? రకుల్: ఉన్నాయి. కాలేజీ ఫస్ట్ ఇయర్లో ఫ్రెండ్స్‌తో కలసి హాలిడేకి నైనిటాల్ వెళ్లాను. మాల్ రోడ్డులో వెళ్తుంటే.. ఒకడు మా ఫొటోలు తీసుకుంటున్నాడు. వాడి దగ్గరకి వెళ్లి కాలర్ పట్టుకుని ‘ఏం కావాలి రా నీకు’ అని గట్టిగా ఒక్కటి పీకాను. వాడికి ఏమీ తెలియనట్లు ‘ఏమైంది’ అన్నాడు. ‘నువ్ ఇక్కడే ఉండరా’ అని పక్కనున్న షాప్కీపర్తో పోలీసులను పిలవమని చెప్పాను. వాడి ఫొన్ తీసుకుని కింద పడేశాను. నా కడుపు మీద గట్టిగా కొట్టి వాడు పారిపోయాడు. నేనూ వాడి వెనకాలే పరిగెట్టి, రాయి తీసుకుని కొట్టాను. ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే తాట తీస్తా. అమ్మాయిలు ఎందుకు భయపడాలి? {బదర్స్ ఎప్పుడూ బాడీగార్డ్స్‌లా సిస్టర్స్‌ని కాపాడుకుంటారు. అమన్‌కి ఆ చాన్స్ వచ్చినట్టు లేదు. అమన్: (నవ్వుతూ..) షి ఈజ్ మై బాడీగార్డ్. రకుల్: అబద్ధం చెప్తున్నాడు. నా గురించి ఎప్పుడూ కేర్ తీసుకుంటాడు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తనే నా బాడీగార్డ్. అమన్: నాకు బ్లాక్ కలర్ చాలా ఇష్టం. తనతో నేనెప్పుడు బయటకి వెళ్లినా.. బ్లాక్ వేసుకోవద్దని చెబుతుంది. ‘నా వెనక బౌన్సర్లా కనిపిస్తావ్. బ్లాక్ వద్దు’ అంటుంది. రకుల్: బౌన్సర్ డైలాగ్ అమన్దే. పార్టీలకు ఎప్పుడూ ఇద్దరం కలసి వెళ్తాం. ‘అమన్, నాకోసం ఓ గ్రీన్ టీ తీసుకురమ్మని చెప్పు’ అంటే చాలు. ‘యస్, మేడమ్. బ్లాక్ వేసుకున్నాను కదా’ అని సరదాగా అంటుంటాడు కానీ, నా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాలు, పార్టీలకు వెళ్లినప్పుడు ఎవరైనా ఫొటోలని ఇబ్బంది పెడితే వాళ్లను వారిస్తాడు. క్రౌడ్ అంతా క్లియర్ చేస్తాడు. సెలబ్రిటీ అయిన తర్వాత రకుల్ బిహేవియర్లో సడన్‌గా చేంజ్ ఏమైనా వచ్చిందా? అమన్: నో. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంది. రకుల్ సెలబ్రిటీగా ఫీలవదు. రకుల్: హైదరాబాద్‌లో నాకంటే అమన్ చాలా పెద్ద సెలబ్రిటీ. ఓసారి నేనూ, రెజీనా ఓ పనిమీద ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాం. రాత్రి పదకొండైంది. లిఫ్ట్‌లో పనిచేసేవాళ్లు ‘హలో మేడమ్, అమన్ సర్ రాలేదా?’ అనడిగారు. ఓరోజు బయటకు వెళ్లా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. దగ్గర వచ్చి..‘హాయ్, హౌ ఆర్ యు? మీ తమ్ముడు మీకంటే పెద్ద స్టార్ తెలుసా?’ అంది. థాంక్యూ అని చెప్పాను. అమన్ గోల్ఫ్ నేషనల్ ప్లేయర్‌గా అందరికీ తెలుసు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లాల్సినప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో డిస్కస్ చేసుకుంటారా? రకుల్: బయటకు వెళ్తున్నప్పుడు సీరియస్‌గా ‘కొంచం మేకప్ వేసుకో. ఎలా కనిపిస్తున్నావో తెలుసా? నీట్‌గా ఉండే డ్రస్ వేసుకోవచ్చు కదా’ అని తనే నాకు చెప్తాడు. ‘రోజంతా మేకప్ వేసుకుంటాను. ఇప్పుడు కూడా ఎందుకు? నా ఫేస్ నా ఇష్టం. నీకేంటి? అవసరమైతే నైట్ సూట్ వెసుకుని వెళతా’ అని కౌంటర్ఇస్తా. అమన్: చెప్పినా వినకుంటే ఏం చేస్తాం. యాక్టర్‌గా మంచి రెమ్యునరేషన్ వస్తోంది. లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డారా? అమన్: మనీ వేస్ట్ చేయడం రకుల్‌కి అస్సలు ఇష్టముండదు. వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఓసారి నేనే స్పోర్ట్స్ కార్ కొనిస్తానంటే వద్దని చెప్పింది. సింపుల్ ఫోర్ సీటర్ కారుంటే చాలు అంటుంది. రకుల్: కోటి రూపాయలు పెట్టి టు సీటర్ కారు కొనుక్కోవాలా? అందులో ఏమీ రాదు. నా బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. రకుల్ ఎలాంటి అబ్బాయితో ప్రేమలో పడాలని కోరుకుంటున్నారు? అమన్: ఫస్ట్... రకుల్ కంటే హైట్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్.. మంచి సెన్సాఫ్ హ్యూమర్, నిజాయితీ, తెలివితేటలు ఉండాలి. (నవ్వుతూ..) ఒకవేళ అటువంటి మంచి లక్షణాలున్న వ్యక్తి ఎవరైనా రకుల్‌ని ప్రేమిస్తే.. ప్రేమ గుడ్డిది అనుకోవాలి (రకుల్ వైపు సరదాగా చూస్తూ).. రకుల్: తప్పడ్ మారూంగీ (చెంపపై ఒక్కటిస్తా). నన్ను ఎవరైనా ప్రేమిస్తే ప్రేమ గుడ్డిది అనుకోవాలా? మంచి వ్యక్తి అయితే చాలు. మంచి వ్యక్తి అయితే చాలా? డబ్బులు వద్దా? అమన్: రిచ్ అయినా.. పూర్ అయినా.. నో ప్రాబ్లమ్. రకుల్: మరీ పూర్ అయితే వద్దు. అలాగని ‘దేవుడా.. ఓ వెయ్యి కోట్లున్న అబ్బాయి కావాలి’ అని కోరుకోను. అమన్ ఎలాంటి అమ్మాయితో ప్రేమలో పడాలనుకుంటున్నారు? రకుల్: (నవ్వుతూ..) ఒక్క అమ్మాయితో ప్రేమలో పడితే చాలు. ‘పది మంది గాళ్‌ఫ్రెండ్స్ ఉన్నా ఫర్వాలేదు. ఎవ్వరితోనూ అబద్దం చెప్పకు. డోంట్ బ్రేక్ ఎనీవన్స్ హార్ట్. నీతో అమ్మాయిని బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడేలా ప్రవర్తించకు’ అని అమన్‌కు ఎప్పుడూ చెబుతుంటాను. అర్థం చేసుకున్నాడు. తమ్ముడిలో నచ్చే విషయం ఏంటంటే... ఐదేళ్ల పిల్లాడి నుంచి యాభై ఏళ్ల వ్యక్తి వరకూ అందరితోనూ ఫ్రెండ్షిప్ చేస్తాడు. యాక్టర్స్, నా స్నేహితులందరూ తమ్ముడి స్నేహితులే. ఒకవేళ నేను ఊరి (హైదరాబాద్)లో లేననుకోండి.. ‘సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం రా’ అని అమన్‌కి కాల్ చేస్తారు. చిన్నప్పట్నుంచీ అంతే. ఎవ్వరితోనైనా చైల్డ్‌హుడ్ బడ్డీస్ అన్నట్టు ఐదు నిమిషాల్లోనే ఎదుటి వ్యక్తితో మాట్లాడేస్తాడు. సైమాలో.. రవితేజగారి నుంచి ప్రకాశ్‌రాజ్ గారి వరకూ, లక్ష్మీ మంచు నుంచి హ్యూమా ఖురేషి వరకూ అందరూ అమన్ జోకులకు నవ్వలేక చచ్చిపోయారు. అక్కలో నచ్చే విషయం ఏంటంటే... 17 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. 19 ఏళ్లకు ఢిల్లీలో సొంతంగా ఇల్లు కొనుక్కుంది. హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు తను కొనుక్కున్న మొదటి ఇల్లు కాదు. సాధారణంగా ఆ వయసులో ఎవరైనా ఫ్రెండ్స్, పార్టీలు, షాపింగ్ అంటూ ఖర్చు పెడతారు. కానీ, రకుల్ డే వన్ నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేసింది. రాఖీ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్లు? రకుల్: నాన్న ఆర్మీ ఆఫీసర్ కదా. ప్రతి రాఖీ పండక్కి వేర్వేరు ఊళ్లలో ఉండేవాళ్లం. అమ్మ మాకు ఇష్టమైన లడ్డూలు, కేకులు, జిలేబీలు చేసేది. ఇంట్లో ఉన్న టాయ్స్ అన్నీ ఓ చోట పెట్టి బెలూన్స్‌తో డెకరేట్ చేసేది. మధ్యలో నేనూ, తమ్ముడు. నేనేమో ‘అమ్మా.. తినొచ్చా’ అంటే.. ‘ముందు రాఖీ కట్టి తర్వాత తిను’ అనేది. మీ తమ్ముడు గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చారా? రకుల్: యస్. నాకింకా గుర్తుంది. మిజోరాంలో ఉన్నామప్పుడు. నేను మూడో తరగతి.. అమన్ యుకేజి. అప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేశాడు, కొంచం కొంచం అర్థం చేసుకుంటున్నాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో క్యాసెట్స్ మాత్రమే ఉండేవి. అది తెలుసుకుని.. పది పది రూపాయలు దాచి, రూ.60 పెట్టి ‘క్యా కెహనా’ మూవీ క్యాసెట్ కొనిచ్చాడు. ఈ రాఖీకి ఏం గిఫ్ట్ కొనిస్తున్నారు? అమన్: ఏం ఇవ్వడం లేదు. రకుల్‌తో సమస్య ఏంటంటే.. ‘నీకు ఏం కావాలి?’ అనడిగితే ‘నువ్ నా కోసం ఏం కొనివ్వలేవు. నా దగ్గర అన్నీ ఉన్నాయి’ అంటుంది. రకుల్: ‘డోంట్ ట్రబుల్ మి, డోంట్ బి నాటీ. రెస్పాన్సిబిలిటీగా ఉండు’ ... అలాంటివి అడుగుతాను. తమ్ముడికి ఎప్పుడైనా ఖరీదైన గిఫ్ట్స్ కొనిస్తారా? అమన్: ఒక్క సెకన్, (నవ్వుతూ..) నా ఫోన్ ఎక్కడుంది. రకుల్: చేసింది చాలు. ఎన్నిసార్లు నీకు ఫోన్స్ కొనిచ్చాను. టెన్త్ క్లాస్‌లో బ్లాక్‌బెర్రీ ఫోన్ కొనిచ్చాను. ఒక్కరోజులో పోయింది. ఆ తర్వాత రెండుసార్లు కొత్త ఫోన్ కొనిచ్చాను. లాస్ట్ ఫోన్ విండోలో నుంచి కిందపడి పోయింది. అస్సలు జాగ్రత్త ఉండదు. అందుకే ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వను. ఇంటర్వ్యూ: సత్య పులగం -
ఆన్లైన్లో అన్నా చెల్లెళ్ల పండుగ
సోదరులకు రాఖీలు పంపేందుకు ప్రత్యేక స్టోర్లు రాఖీలతో పాటు స్వీట్లు, ప్రత్యేక బహుమతులు కూడా లభ్యం బెంగళూరు: ఇప్పటి సమాజమంతా హైటెక్మయం. పెరుగుతున్న టెక్నాలజీ వినియోగంతో ఇప్పుడు అన్ని వస్తువులు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేశాయి. ఇక ఈ ఆన్లైన్ వాడకం అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌కు కూడా మినహాయింపేమీ కాదు. రాఖీ పండుగ కోసమే ప్రత్యేకంగా ఈ-కామర్స్ వెబ్సైట్లు ఏర్పాటవుతున్నాయి. విదేశాల్లో ఉండే తమ సోదరుల కోసం రాఖీలను పంపాలనుకునే సోదరీమణులు కూడా ఆన్లైన్ ద్వారా రాఖీలను పంపేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఎన్నో వేల రకాల డిజైన్లు ఈ ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండడంతో పాటు ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండడంతో ఆన్లైన్లో రాఖీలను కొనుగోళ్లు చేసేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బంగారు మొదలుకొని సాధారణ త్రెడ్ రాఖీ వరకు.... ప్రత్యేకంగా రాఖీల అమ్మకాల కోసమే ఏర్పాటైన ఆన్లైన్ స్టోర్లలో ఎన్నో వందల రకాల రాఖీలు, వేల రకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. సాధారణ తాడుతో తయారైన రాఖీ మొదలుకొని జర్దోసీ వర్క్, మీనా, కుందన్, వెండి, బంగారు పూత పూయబడిన రాఖీలు, తక్కువ ధరగల రత్నాలు పొదగబడిన రాఖీలు ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. రాఖీల డిజైన్లు, వాటిలో వాడిన వస్తువులను బట్టి వీటి ధర రూ.400 నుంచి ప్రారంభమై వేల రూపాయల వరకు కొనసాగుతుంది. ఇక రాఖీతో పాటు తమ సోదరులకు డ్రైఫ్రూట్స్, స్వీట్స్ పంపేందుకు కూడా ఈ ఆన్లైన్ స్టోర్లు అవకాశం కల్పిస్తున్నాయి. రాఖీతో పాటు ఇతర కానుకలను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక డిస్కౌంట్లను సైతం అందజేస్తూ మహిళలను ఆకర్షిస్తున్నాయి. తొందరగా అందుతాయనే.... ప్రపంచమే కుగ్రామంగా మారిన పరిస్థితుల్లో చాలా మంది పైచదువులు, ఉద్యోగాలు.. ఇలా అనేక కారణాలతో విదేశాలకు వెళ్లిపోతున్నారు. అలా విదేశాల్లో ఉన్న తోబుట్టువులకు స్వయంగా వెళ్లి రాఖీ కట్టడం అనేది ప్రతి అక్కా, చె ల్లికి సాధ్యం కాని పని. అలాగని రక్షాబంధన్ రోజున తమ ప్రేమ, అనుబంధాలకు గుర్తుగా రాఖీ కట్టకపోతే ఎలా? అందుకే దేశ, విదేశాల్లో ఎక్కడున్నా సరే గంటల వ్యవధిలో రాఖీని పంపించే సౌకర్యాన్ని ఆన్లైన్ స్టోర్లు అందజేస్తున్నాయి. ఆన్లైన్ స్టోర్లు రాఖీలను వినియోగదారులకు డెలివరీ చేస్తుండడంతో ఈ ఏడాది ఆన్లైన్లో రాఖీలను పంపుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. చెల్లెమ్మకు బహుమతులు కూడా... ఈ ఆన్లైన్ స్టోర్లలో అన్నదమ్ముల కోసం రాఖీలు మాత్రమే కాదు తమకు ఎంతో ఆప్యాయంగా రాఖీని పంపిన అక్కాచెళ్లెళ్ల కోసం బహుమతులు పంపేందుకు కూడా అవకాశం ఉంది. రాఖీని రక్షాబంధన్ రోజున అందజేసినట్లుగానే అక్కాచెల్లెళ్ల కోసం బుక్ చేసిన బహుమతులను సైతం రక్షాబంధన్ రోజునే అందజేస్తారు. ఈ బహుమతుల్లో కాశ్మీరీ డిజైనర్ స్టోల్స్, అందమైన హ్యాండ్ బ్యాగ్‌లు, ఆభరణాలు, దుస్తులు తదితర వస్తువులు ఆయా ఆన్లైన్ స్టోర్లు పొందుపరిచాయి. ఆన్లైన్ స్టోర్లివే.... రాఖీల అమ్మకాల కోసం ప్రత్యేకంగా కొన్ని ఆన్లైన్ స్టోర్లు అందుబాటులో ఉన్నాయి.