వాళ్లు కొట్టుకున్నా..తిట్టుకున్నా ప్రేమే | bandaru dattatreya rakhi celebrations | Sakshi
Sakshi News home page

వాళ్లు కొట్టుకున్నా..తిట్టుకున్నా ప్రేమే

Published Sat, Aug 29 2015 1:26 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

వాళ్లు కొట్టుకున్నా..తిట్టుకున్నా ప్రేమే - Sakshi

వాళ్లు కొట్టుకున్నా..తిట్టుకున్నా ప్రేమే

హైదరాబాద్: అన్నా చెల్లె అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ పండుగను కుల మతాలకతీతంగా శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.  నగరంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు బీజేపీ మహిళా కార్యకర్తలు రాఖీ కట్టారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లు కొట్టుకున్నా.. తిట్టుకున్నా అందులో ప్రేమ ఉంటుందన్నారు. మరో వైపు రాజభవన్ లో  జరిగిన వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు, విద్యార్థులు గవర్నర్ కు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా  ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ ఆయన రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement