Dattatreya
-
ఘనంగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 10th ఎడిషన్
-
సీఎం రేవంత్‌ను కలిసిన నోరి దత్తాత్రేయుడు
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత ఆంకాలజిస్టు నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి ఆదివారం వచ్చిన దత్తాత్రేయుడు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వైద్య రంగంలో సంస్కరణలకు తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తానని సీఎంతో జరిగిన చర్చల్లో ఆయన వెల్లడించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆస్పత్రిలో కేన్సర్ విభాగాధిపతిగా దత్తాత్రేయుడు పనిచేస్తున్నారు. -
విలువలకు ప్రతీక.. ఎమ్మెస్సార్
బంజారాహిల్స్(హైదరాబాద్): కాంగ్రెస్ దివంగత నేత ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) విలువలకు ప్రతీకగా నిలిచారని, ఆ విలువలు ఉన్నందునే రాజకీయాల్లో సుదీర్ఘంగా రాణించారని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఎమ్మెస్సార్ జీవిత చరిత్రను ఆయన అల్లుడు వామనరావు రాయగా ఆ పుస్తకాన్ని మంగళవారం సోమాజిగూడలోని ఐటీసీ కాకతీయ హోటల్లో దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎమ్మెస్సార్ ముక్కుసూటిగా మాట్లాడే నాయకుడని, నీతి, నిజాయతీ గల గొప్ప నేత అని కొనియాడారు. ఆయనను ప్రతి ఒక్కరూ మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో కొత్తవారిని ఎమ్మెస్సార్ ఎంతగానో ప్రోత్సహించేవారని, తాను ఆయన వద్ద రాజకీయ కార్యదర్శిగా పని చేశానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. డబ్బుంటేనే రాజకీయాల్లో రాణిస్తారనే విషయాన్ని పక్కనపెట్టి ఎదిగిన గొప్ప నాయకుడు ఎమ్మెస్సార్ అని సీపీఐ నేత నారాయణ అన్నారు. వైఎస్సార్ సీఎం అయినప్పుడు ఎమ్మెస్సార్ స్పీకర్ కావాలనుకున్నారని, అయితే తాను అందుకు చొరవ చూపలేకపోయానని కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ విషయం తాను వైఎస్సార్‌కు కూడా చెప్పలేదన్నారు. దేశంలో ఉచిత విద్యుత్‌కు పునాది వేసింది వైఎస్సార్, ఎమ్మెస్సార్‌లేనని గుర్తు చేశారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో విడదీయరాని అనుబంధం ఉన్న ప్రజానాయకుడు ఎమ్మెస్సార్ అని, ఉన్నదున్నట్లు మాట్లాడటంలో ఆయనకు ఎవరూ సాటిరారని టీపీసీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప సామాజిక వేత్త
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప సామాజిక వేత్త అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ 106వ జయంతి ఉత్సవాలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి బాపూజీ అని దత్తాత్రేయ కొనియాడారు. అలాంటి వ్యక్తితో కలసి పనిచేసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను, గొప్పదనాన్ని భవిష్యత్ తరాలకు తెలిపే రీతిలో అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్య క్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం పాల్గొన్నారు. స్పీకర్ నివాళి స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి వేడుక శాసనసభ భవనంలోని ఆడిటోరియం హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు పాల్గొన్నారు. -
కపటస్వామి బరితెగింపు
కర్ణాటక, కోలారు: తాలూకాలోని హొళలి గ్రామంలో 18 సంవత్సరాల యువతిని పెళ్లి చేసుకున్న 48 సంవత్సరాల దత్తాత్రేయ అవధూత స్వామి అలియాస్ రాఘవేంద్ర బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా పెళ్లాం, నా జోలికి వస్తే సుపారి కిల్లర్ల చేత చంపేయిస్తానని యువతి బావ ఎం.అరుణ్‌కుమార్‌ను కపటస్వామి బెదిరిస్తున్నాడు. గత ఫిబ్రవరి 22న నిందితుడు యువతితో కలిసి పరారై తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. ఘటనపై కోలారు రూరల్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్ని రోజులు తప్పించుకుని తిరుగుతున్న అతడు యువతితో పెళ్లి తరువాత స్వామీజీ గెటప్ తీసేసి మామూలుగా తయారయ్యాడు. మిమ్మల్ని లేపేస్తా.. ఈ నేపథ్యంలో రాఘవేంద్ర యువతి బావ అరుణ్‌కుమార్‌కు ఫోన్ చేసి తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా అని దూషించాడు. నేనిప్పుడు స్వామీజీ కాదని, పెళ్లి చేసుకున్నానని మా ఇద్దరి జోలికి వస్తే ఊరుకునేది లేదని 50 లక్షలు అయినా , కోటి రూపాయలు అయినా బెంగుళూరులో ఉన్న మా కుర్రాళ్లకు చెప్పి హత్య చేయిస్తానని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. కపట స్వామిజి బెదిరింపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువతి అక్క తన చెల్లెలుతో మాట్లాడడానికి అవకాశం కల్పించాలని కోరినా అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం తన భార్యకు మీకు ఎలాంటి సంభంధం లేదని కపట స్వామి తేల్చి చెప్పాడు. వంచకుడు ప్రస్తుతం మురుడేశ్వరలో ఉన్నాడనే సమాచారంతో కోలారు పోలీసులు అక్కడకు వెళ్లారు. -
సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
మణికొండ: మన పండుగలు, సంస్కృతి, తెలుగుభాష, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని ఓం కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న తెలుగు సంగమం సంక్రాంతి మూడవ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ, తమిళిసై ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు, సినీగేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. -
శ్రీ గురుదత్తాత్రేయుడు
లోకానికి జ్ఞానకాంతులను ప్రసరింపజేసేందుకు అవతరించిన గురుమూర్తి దత్తాత్రేయుడు. జన్మసంసార బంధనాలను సులువుగా వదిలించి, జ్ఞానానందాన్ని పంచుతూ, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. ఈయన అవతార వర్ణన నారదపురాణం, శాండిల్యోపనిషత్తు, అవధూతగీత, జీవన్ముక్తిగీత తదితరాలలో కనపడుతుంది. అత్రికుమారా.... దత్తాత్రేయ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వేరుకారని నిరూపించిన సన్నివేశమే దత్తాత్రేయ ఆవిర్భావం. త్రిమూర్తులే తనకు పుత్రులుగా జన్మించాలంటూ అత్రిమహర్షి–అనసూయ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దూర్వాసుడు జన్మించగా, విష్ణు అంశతో అవతరించినవాడే దత్తాత్రేయుడు! ‘దత్తా’ అనే పదానికి ‘సమర్పించిన’ అని అర్థం. త్రిమూర్తులు అత్రి–అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక దత్తా అని పేరు వచ్చింది. అత్రిపుత్రుడు కాబట్టి ‘ఆత్రేయ’ అయింది. త్రిమూర్తులే శిరస్సులై... దిక్కులనే అంబరముగా చేసుకుని, భక్తులనుద్ధరించేందుకు అనేక రూపాలను ధరించిన దత్తాత్రేయుడి మూడుతలలలో నడిమి శిరస్సు విష్ణువుదికాగా.. కుడివైపున శివుడు సద్గురు స్వరూపంగా, ఎడమవైపు బ్రహ్మదేవుడు పరబ్రహ్మస్వరూపమైన శిరస్సుతో భాసిస్తారు. మధ్యభాగంలో అజ్ఞానాన్ని తొలగించే గురుమూర్తిగా శ్రీదత్తుడు ముల్లోకాలను రక్షిస్తాడు. ఆధ్యాత్మ సిద్ధి–నిష్కామబుద్ధి దేహంపై వ్యామోహాన్ని వదిలి, జడ పదార్థంలా ఉండేవారిని అవధూత అంటారు. ఈ పదానికి అసలైన నిర్వచనంగా మారి దత్తావధూత అయ్యాడు. ఒకానొక సందర్భంలో పద్మాసనుడై, ధ్యానముద్రలో ప్రకాశిస్తూ యోగవిద్యను సాంకృతిమహర్షికి ఉపదేశించి దానిని భోగ–విలాసాలకు ఉపయోగించకూడదని, పరబ్రహ్మను పొందడమే యోగం అంతిమలక్ష్యం అని వివరిస్తాడు. ఆధ్యాత్మ సిద్ధి, నిష్కామబుద్ధి, యోగవిద్య ఇవన్ని దత్తాత్రేయుని ఉపదేశాల్లో ప్రధానమైనవి. దత్తజయంతి దత్తుడు ఉదయించిన మార్గశిర పౌర్ణమినే దత్తజయంతిగా జరుపుకుంటారు.‘దిగంబరా దత్త దిగంబరా’ అంటూ దత్తనామ స్మరణలో గడుపుతారు. దత్తచరిత్ర, అవధూతగీత మొదలైన గ్రంథాల్ని పారాయణ చేస్తారు. భజనలు, సత్సంగాలు నిర్వహిస్తారు. త్రిపురారహస్యం పేరుతో పరశురాముడికి త్రిపురసుందరీ తత్త్వాన్ని ఉపదేశించాడు దత్తాత్రేయుడు. ఉపాసకులకు ఇది ఎంతో ఉపయుక్తమైన గ్రంథం. దత్తాత్రేయ వజ్రకవచం పఠించడం వలన అన్నిరకాల రక్షణ భిస్తుంది. దత్తుడి ఆరాధన పితృదోషాలను తొలగిస్తుంది. ధర్మబద్ధంగా ఇహలోక సుఖాలను కోరుకునేవారికి వాటిని అనుగ్రహిస్తూ, వారిని యోగమార్గంవైపు పయనింపజేసే విశ్వగురు దత్తాత్రేయడు. ఆయన అనుగ్రహిస్తే గురువుతోబాటుగా దైవానుగ్రహమూ లభించినట్లే! – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
కాలుష్యంతో వ్యాధుల ముప్పు
సాక్షి, హైదరాబాద్: ‘పరిసరాల పరిశుభ్రత, మూసీ ప్రక్షాళలనతోనే జల, వాయుకాలుష్యం సహా డెంగీ, మలేరియా దోమల నియంత్రణ సాధ్యం. ప్రజారోగ్యానికి హానికరంగా మారిన మూసీని ఎంత త్వరగా ప్రక్షాళన చేస్తే అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ఆధ్వర్యం లో ‘హెల్త్ హైదరాబాద్’పేరుతో ఆదివారం స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీలో కరుణా గోపాల్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతోన్న జల, వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మూసీని ప్రక్షాళన చేయడం ద్వారా డెంగీ, మలేరియా వ్యాధులకు కారణమవుతున్న దోమలను నియంత్రించవచ్చని చెప్పారు. శారీరక శ్రమను అలవర్చుకోవడం, సహజ ఆహారం తీసుకోవడం ద్వారా రోగాల బారీ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. పాఠశాలల్లో ఆటస్థలాలను ఏర్పాటు చేయడం, పిల్లలకు ఆడుకునే అవకాశం ఇవ్వడం ద్వారా అధిక బరువు ముప్పు నుంచి పిల్లలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం వల్ల అనేక మంది చిన్న వయసులోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. వైద్య ఖర్చులు బాధిత కుటుంబాలనే కాదు ప్రభుత్వాలను కూడా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శరీరానికి అవసరమైన వ్యాయామం అందించడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన సూచించారు. -
ఆ యువకుడిని భారత్‌కు రప్పించండి: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: జర్మనీలోని ఒట్టో–వాన్–జ్యూరిక్ యూనివర్సిటీలో చదువుకునేందుకు వెళ్లి తీవ్ర మానసిక సమస్య తో బాధపడుతూ గల్లంతైన హైదరాబాద్‌కు చెందిన సాయి రాహుల్ అనే యువకుడిని భారత్ రప్పించేలా చొరవ చూపాలని కోరుతూ మాజీ ఎంపీ దత్తాత్రేయ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. సాయి సోదరి హిమబిందు మంగళవారం దత్తాత్రేయను కలిసి సోదరుడి పరిస్థితి వివరించి కన్నీ టి పర్యంతమయ్యారు. దీంతో ఆ యువకుడి జాడ కనిపెట్టి హైదరాబాద్‌కు రప్పించేలా చొరవ చూపాల్సిందిగా దత్తాత్రేయ లేఖలో కోరారు. -
జనాభా ఆధారంగా బీసీలకు సీట్లు
హైదరాబాద్: సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ఆధారంగా బీసీలకు సీట్లు కేటాయిస్తామని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గత స్థానిక సంస్థల్లో కూడా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ రిట్ పిటిషన్ వేసి బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయించామని గుర్తుచేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సోమాజి గూడ ప్రెస్‌క్లబ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కులాల జేఏసీ చైర్మన్ గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ ఎంబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ జిల్లాల వారీగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రస్తుత పాలకుల అడ్డగోలు విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని, సుప్రీం గైడ్‌లైన్స్‌ను బూచిగా చూపిస్తూ చాలా జిల్లాల్లో ఒక్క స్థానం కూడా బీసీలకు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. బీసీలు తప్పకుండా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ 1994 ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నప్పటికీ, మనకు సంబంధంలేని 50 శాతం రిజర్వేషన్లు చూపిస్తూ బీసీ రిజర్వేషన్లు తగ్గించడం సబబుకాదన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి జనరల్ కోటాలో ఏ ప్రాంతంలో ఎవరు ఎక్కువ జనాభా ఉన్నారో వారినే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో, విద్య, ఉద్యోగాల్లో, ఎంబీబీఎస్ సీట్లల్లో కూడా బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఆదరబాదరాగా ఎన్నికలు నిర్వహించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని రిజర్వేషన్ల అంశం తేలేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో బీసీ ద్రోహిగా మిగిలిపోతారన్నారు. కేసీఆర్ బీసీ ద్రోహిగా మిగిలిపోతారు: జాజుల జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 5,843 ఎంపీటీసీలు ఉన్నారని, గతంలో 34 శాతం బీసీలకు కేటాయించగా 1,987 ఎంపీటీసీలు ఉండేవని, ప్రస్తుతం 1,011 మాత్రమే కేటాయించారన్నారు. దీంతో 972 ఎంపీటీసీలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 534 ఎంపీపీలు ఉండగా గతంలో 34 శాతం రిజర్వేషన్ ఉన్నప్పుడు 182 ఉండగా, ప్రస్తుతం 94 మాత్రమే కేటాయించారని, ఇక జెడ్పీటీసీలు 535 ఉండగా గతంలో 182 స్థానాలు బీసీలకు ఉండేవని, ప్రస్తుతం దాన్ని 17 శాతానికి కుదించారన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం 32 ఉండగా గతంలో 34 శాతం రిజర్వేషన్‌తో 11 మంది ఉండేవారని, ప్రస్తుతం 19 శాతానికి కుదించి 6 జెడ్పీ చైర్మన్లకు మాత్రమే అవకాశం ఇచ్చారని, దీంతో 5 సీట్లు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని జాజుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.ఎల్.మల్లయ్య, బహుజన్ ముక్తి పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అభ్యర్థి వి.దాస్‌రాం నాయక్, గోపాల్‌తోపాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మే 23 తర్వాతే ఫలితాలు ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను మే 23వ తేదీ తర్వాతే ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేసింది. వీటి ఫలితాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి తదితరులు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియపై చర్చించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ ఓట్లతో గెలిచి బీసీలకు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇది వరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా.. కేసీఆర్ ప్రభుత్వం వాటిని సగానికి కుదించిందని తెలిపారు. టీఆర్ఎస్ బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేసిందని మండిపడ్డారు. స్థానిక రాజకీయాలతో పైకొచ్చే బీసీలను పూర్తిగా అణచివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పులో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని ఉందని, కానీ బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని చెప్పలేదని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్న సీఎం.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు ఎలా కోత పెట్టారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లన్నీ తప్పుల తడకగా జరిగాయని ఆరోపించారు. తప్పుల తడకగా, అశాస్త్రీయంగా ఆదరాబాదరాగా రిజర్వేషన్లు కేటాయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 32 జిల్లా లలో 13కి పైగా జెడ్పీ చైర్మన్ స్థానాలు బీసీలకు రావాల్సి ఉండగా.. ప్రభుత్వం కేవలం 6 స్థానాలు మాత్రమే రిజర్వ్ చేసిందని చెప్పారు. టీఆర్ఎస్ లబ్ధి కోసమే ఎన్నికలు: దత్తాత్రేయ కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీ కాలం జూలై 4 వరకు ఉందన్నారు. అప్పట్లోగా ఎన్నికల ఫలితాలు ప్రకటిం చుకోవచ్చని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల పలితాల్లో టీఆర్ఎస్కి చరిష్మా తగ్గుతుందని భావించిన కేసీఆర్ ముందుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. కేవలం పార్టీ లబ్ధి కోసమే ఆయన ముందుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
జస్ట్ మిస్!
సికింద్రాబాద్ :సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూవరుసగా మూడుసార్లు గెలవలేదు. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచినపలువురు నేతలకు మూడోసారిఆశాభంగం తప్పలేదు. ఈ నియోజకవర్గం 1956లో ఆవిర్భవించగా, ఇప్పటి వరకు 17సార్లు (ఉప ఎన్నికతో 1987–89)ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన వారిలో ఐదుగురురెండుసార్లు వరుసవిజయాలు సాధించారు. మూడోసారి పోటీ చేసేఅవకాశం లభించక కొందరు, పోటీ చేసి పరాజయం పాలవడంతో మరికొందరు హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. ఒకరు మూడుసార్లు, మరొకరు నాలుగు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ హ్యాట్రిక్ మాత్రం దక్కలేదు. ♦ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన నరాల సాయికిరణ్ యాదవ్ 1957, 62 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.ఆ తర్వాత ఎన్నికలకు పోటీకి దూరమైన ఆయన తిరిగి 1971లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ♦ కాంగ్రెస్ నేత పి.శివశంకర్ 1979, 1980 ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. ♦ 1987, 89 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యమరణానంతరం ఆయన సతీమణి మణెమ్మ రెండుసార్లుఎంపీగా గెలుపొందారు. ♦ 1991 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ.. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, పీవీ తనయుడు రాజేశ్వరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ♦ తిరిగి 1998, 99 ఎన్నికల్లో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన దత్తాత్రేయ... 2004లో ఓటమిపాలై హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. 2014లో నాలుగోసారి ఎంపీగా గెలిచారు. ♦ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అంజన్‌కుమార్‌యాదవ్ తొలి విజయం సాధించారు. 2009లోనూ రెండోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి హ్యాట్రిక్ మిస్ అయ్యారు. -
‘ఉపాధి లేదు కానీ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : మతంతో దేశాన్ని విభజించారని.. పాకిస్థాన్‌లో ఇస్లాం రాజ్యం నడుస్తోందని.. అక్కడ ఉపాధి లేదు కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. పుల్వామా ఘటనలో వీర మరణం పొందిన సైనికులకు ఇందిరా పార్కు వద్ద ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి సభకు కిషన్‌రెడ్డి హాజరై పై విధంగా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు యుద్దాలలో ఓడిపోయినా బుద్ధి రాలేదని, భారతదేశాన్ని చీల్చి జమ్మూ కాశ్మీర్‌ను సొంతం చేసుకునేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భద్రతా బలగాలకు అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. రాజకీయాలకు, మతాలకతీతంగా ఏకమై నరేంద్రమోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా చైనాలాంటి దేశాలు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, ప్రజలందరూ మన సైన్యానికి నైతికంగా బలమిస్తే.. తగిన చర్యకు పూనుకుంటారని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడి ప్రమాదకరమైందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడటం మంచి పరిణామం కాదన్నారు. భారతదేశాన్ని ముక్కలు చేసి సమగ్రత, సమైఖ్యతను దెబ్బతీయాలని ఏళ్ల తరబడి పాకిస్థాన్ యోచిస్తోందన్నారు. చైనా తప్పా మిగితా దేశాలు పాకిస్థాన్ చర్యను ఖండించాయని గుర్తుచేశారు. పాకిస్థాన్‌ను పక్కన పెట్టుకుని చైనా పాత వైరాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. పాకిస్థాన్, చైనా దేశాలు ఉగ్రవాదానికి అండగా ఉండటం బాధాకరమని, ఇస్లాం కూడా శాంతినే కోరిందని, ఉగ్రవాదాన్ని మతంతో చూడకూడదన్నారు. -
మళ్లీ దత్తన్న!
సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు విజయం సాధించిన బండారు దత్తాత్రేయ మరోసారి బరిలో నిలిచేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు ఆదివారం జరిగిన రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దత్తాత్రేయ పార్టీ ఎన్నికల ఇన్చార్జి అరవింద్ నింబావలి వద్ద తన మనోగతాన్ని వెల్లడించారు. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనల్లో మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ సైతం ఉన్నారు. ఈ ఇద్దరూ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం, డాక్టర్ లక్ష్మణ్‌కు బీజేపీ అధ్యక్ష పదవి ఉండడం వల్ల తనకు చివరిసారిగాఅవకాశం కల్పించాలని దత్తాత్రేయ పార్టీ ఎన్నికల కమిటీకి నివేదించాలని నిర్ణయించారు. ఇప్పటికే బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటును సైతం వేగవంతం చేశారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ భారీగా వెనకబడిపోయింది. అయినా లోక్‌సభకు వచ్చేసరికి పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలో బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో దత్తాత్రేయతో పాటు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ సైతం సికింద్రాబాద్ స్థానంపై ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌కు రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాను హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని నిలబడ్డ రాజాసింగ్ అయితేనే హైదరాబాద్ లోక్‌సభలో పార్టీ క్యాడర్లో కొత్త ఉత్తేజం వస్తుందన్న భావనను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక చేవెళ్ల లోక్‌సభకు నియోకజవర్గ ఇన్చార్జి బి.జనార్దన్‌రెడ్డిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి కోరే అవకాశం ఉన్నా, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలవడం వల్ల కొత్త అభ్యర్థి జనార్దన్‌రెడ్డి వైపు ఎన్నికల కమిటీ మొగ్గుచూపే అవకాశం ఉందని సమాచారం. ఇక మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని పార్టీకి చెందిన ముఖ్య నాయకుల్లో ఒకరికి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈనెల 5న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోకజవర్గాల ఎన్నికల సమావేశాన్ని ఇంíపీరియల్ గార్డెన్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై గెలిచే అభ్యర్థులెవరన్న అంశాన్ని పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 11న షాద్‌నగర్‌లో నిర్వహించే చేవెళ్ల నియోజకవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరు కానున్నారు. వీలైనంత త్వరంగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అందరి కంటే ముందుగా ప్రచారాన్ని హోరెత్తించే దిశగా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
‘టీటీడీ అక్రమాలపై విచారణ జరిపించాలి’
సాక్షి, హైదరాబాద్ : పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్ర - తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీటీడీలో అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. వీటి వెనక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు. గత నెల టీటీడీలో టికెట్ల కుంభకోణం వెలుగు చూసినప్పటికి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ను ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను కోరామని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఈవోకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాల వల్ల భక్తులకు తిరుమల దేవస్థానం పట్ల నమ్మకం సన్నగిల్లుతుందనిదత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై తాను చర్యలు తీసుకున్నట్లు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వెలుగు చూసిన టికెట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం బాధాకరం: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి 22 రోజులైనా ఇప్పటికీ మంత్రిమండలిని విస్తరించకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలో అధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మంత్రులు లేకపోవడంతో పాలనాపరమైన శాఖల్లో పనితీరు లోపించిందన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలసి రాష్ట్రంలో పలు రహదారుల అభివృద్ధిపై వినతిపత్రాన్ని ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట–ఎల్కతుర్తి, జనగాం–దుద్దెడ, మెదక్–ఎల్లారెడ్డి, ఫకీరాబాద్–బైంసా, సిరిసిల్ల–కామారెడ్డి, వలిగొండ–తొర్రూర్, నిర్మల్– ఖానాపూర్ రహదారులను జాతీయ రహదారుల ప్రాజెక్టులో చేర్చి అభివృద్ధి చేయాలని కోరినట్టు చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించాలన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో రహదారుల అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. -
మీకు తెలుసా
సూర్యుడు ఏడాదిలో ప్రతినెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే.. ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. ఆదిత్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి.. మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం. ∙ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో గోదాదేవి విరచిత తమిళ పాశురాలు వినిపిస్తుంటాయి. శ్రీరంగనాథుడి భక్తురాలైన గోదాదేవి నెల రోజుల పాటు రోజుకో పాశురం చొప్పున కృష్ణలీలల్ని కీర్తిస్తూ శ్రీవ్రతం ఆచరించింది. ఈ 30 పాశురాలు ‘తిరుప్పావై’ పేరుతో ప్రఖ్యాతి గాంచాయి.ధనుర్మాసంలో విష్ణుభక్తులే కాదు, శివభక్తులు కూడా పాశురాలు పాడుకుంటారు. తమిళనాడులోని శివాలయాల్లో తిరువెంబావై పాశురాలు వినిపిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్ ఈ పాశురాలను రాశారు. శివ తత్వాన్ని తెలిపే ఈ పాశురాల సంఖ్య కూడా 30. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవాడు మాణిక్య వాచకర్. చిన్ననాటి నుంచి శివ భక్తుడు. ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే మదురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవాడు మాణిక్య వాచకర్. నగర వీధుల్లో నడుస్తూ తిరువెంబావై పాశురాలను రాగయుక్తంగా ఆలపించేవాడు. ఆ అమృతగానం విని మదురై వాసులంతా ఆయనతో గొంతు కలిపే వారు. అలా మొదలైన తిరువెంబావైని నేటికీ ఆచరిస్తూనే ఉన్నారు. తమకు మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ ఆడపిల్లలు తిరువెంబావై పాశురాలను పాడుకోవడం పరిపాటి. తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో ధనుర్మాసమంతా సుప్రభాత సేవలో గోదాదేవి పాశురాలు ఆలపిస్తారు. గోదాదేవి కృష్ణభక్తికి ప్రతీకగా శ్రీవారి పవళింపు సేవ రజతకృష్ణస్వామి మూర్తికి నిర్వహిస్తారు. మనల్ని నీడలా అనుసరించేది వీరే..! చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ.. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయసంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు. పండుగ పర్వం ఉత్తర ద్వారాన వైకుంఠ వాసుడు మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఇది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా ప్రతీతి. దీనికే ముక్కోటి ఏకాదశి అని పేరు. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. (18, మంగళవారం ముక్కోటి) గీతాజయంతి మార్గశిర శుద్ద ఏకాదశి గీతా జయంతి. ఈవేళ భగవద్గీత పారాయణం, పార్ధసారధిని (కృష్ణుని) ఆరాధన చేయడం మంచిది. హనుమద్వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమత్భక్తులు హనుమత్ వ్రతాన్ని ఆచరిస్తారు. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందని చెబుతారు. (20, గురువారం హనుమద్వ్రతం) దత్త జయంతి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే త్రిమూర్తి స్వరూపం. ఈ వేళ అనఘావ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే.. సకల పాపాలు తొలగుతాయి. కోరల పున్నమి కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రలుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం.. యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. (22, శనివారం దత్త జయంతి, కోరల పున్నమి) -
మహా కూటమికి మహా ఓటమి తప్పదు
హైదరాబాద్: బీజేపీతో కలిసి పనిచేసేందుకు యువ తెలంగాణ పార్టీ నడుంకట్టింది. ఈమేరకు ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమదేవీలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌తో కలిసి చర్చలు జరిపారు. సమావేశం అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ దేవీలు బీజేపీతో కలిసి పని చేస్తామని తెలిపినందుకు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నామని తెలిపారు. వీలైతే కలిసి పోటీ చేస్తామని, అనేక సంఘాలు, చిన్న పార్టీలు కూడా సంప్రదిస్తున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమికి, ఈ ఎన్నికల్లో మహా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ భవిష్యత్తును మార్చే పార్టీ బీజేపీయేనని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు లేని పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీనేనని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోలేక విష కూటములు వస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరు, విధానం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్‌తో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు..ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తర్వాత రెండూ కలిసే పార్టీలేనని విమర్శించారు. చంద్రబాబు ఫోటోతో కాంగ్రెస్ ప్రచారం.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఫోటో పెట్టి కాంగ్రెస్ ఓట్లడుగుతోంది..ఇదీ కాంగ్రెస్ దుస్థితి అని లక్ష్మణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పెత్తనం చెలాయించడం కోసమే కూటమిలో చేరారని విమర్శించారు. కేటీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019 తర్వాత కేసీఆర్ ఉనికిని వెతకాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్ షా సభల తర్వాత రాజకీయం మారుతుందని అన్నారు. సీట్ల ప్రకటన తర్వాత కాంగ్రెస్ విచ్చిన్నం కాబోతుందని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ.. యువ తెలంగాణ పార్టీ, బీజేపీ పొత్తు నూతన పరిణామమని అన్నారు. అవమానాలు భరించి సీట్ల కోసమే కోదండరాం, సీపీఐ అందులో ఉన్నారు..ఇది పచ్చి అవకాశవాద కూటమి అని విమర్శించారు. టీఆర్ఎస్ ఓటమి అంచున ఉన్న పార్టీ అని, ఇంకా అనేక మంది నాయకులు మాతో మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు బీజేపీ ఎదుగుదల ఇష్టం లేదని అందుకే తమపై అవసరంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో టీడీపీ ఈ ఎన్నికలతో పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ, కోదండరాం కలయికతోనే బీజేపీ వైపు ప్రజలు ఉన్నారనే సంకేతం వస్తోందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ టీఆర్ఎస్, టీడీపీ, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. రెండు కూటములు కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీలతోనే నిండి ఉన్నాయని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమసమయంలో యువ తెలంగాణ పార్టీ కీలక పాత్ర పోషిందని గుర్తు చేశారు. జాతీయ భావంతో, దేశ అభివృద్ధిని చూసి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూటమి పేరుతో తెలంగాణాని విచ్చిన్నం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు చేశారు. యువ తెలంగాణ నాయకురాలు రాణి రుద్రమ మాట్లాడుతూ.. బీజేపీ, యువత మహిళలకు ప్రాధన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. తన బిడ్డ కవిత ఐడెంటిటీ పోవద్దనే కారణంతోనే కేసీఆర్ తెలంగాణాలో మహిళలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. -
నేడు స్వగ్రామంలో శరత్ అంత్యక్రియలు
-
సహకరిస్తే పరిశీలిస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల్లో్ల స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలను సాయమడిగామని.. వారు ఏ మేరకు సహకరిస్తారో పరిశీలించి వెంటనే ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ చెప్పారు. బీజేపీ ఎంపీ దత్తాత్రేయ, పార్టీ నేత వెదిరె శ్రీరాం తదితరులతో కూడిన బృందం సోమవారం మంత్రిని కలసి ఈ అంశాలపై చర్చించింది. సమావేశం అనంతరం బీరేంద్రసింగ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ, ఏపీల్లో స్టీలు ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలత లేదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికిచ్చింది. తర్వాత ఓ ఏజెన్సీ ఏర్పాటు చేశాం. ఆ ఏజెన్సీ కూడా ముడిసరుకు ఐరన్ ఓర్లో నాణ్యత లేదని తేల్చింది. దీంతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం. టాస్క్‌ఫోర్స్‌లో రాష్ట్రాల ప్రాతినిథ్యం ఉంది. డిసెంబర్లో చివరి భేటీ జరిగింది. 2 రాష్ట్రాలు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంబంధిత సమాచారం కోరాం. మెకాన్ అనే కన్సల్టెన్సీ సంస్థ సాంకేతిక నివేదిక ఇచ్చింది’ అని చెప్పారు తెలంగాణ నుంచి ప్రకటన.. ప్లాంట్లను ఏర్పాటు చేయబోమని తాము ఎక్కడా చెప్పలేదని బీరేంద్రసింగ్ అన్నారు. తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఒక కమిటీ ఏర్పాటు చేశామని, ఏ రకమైన సాయం చేస్తారో నెలరోజుల్లో ఒక నివేదిక ఇస్తామని తెలిపారు. ఆ నివేదిక వస్తే టాస్క్‌ఫోర్స్ పని పూర్తవుతుంది. తదుపరి మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం. పాల్వంచలో ఒక పాత ప్లాంటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సాయంతో త్వరలో దీన్నీ తెరుస్తాం. ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ప్లాంటు విషయంలో ఇదే ప్రక్రియ అమలవుతుంది. ఆర్సెలర్ మిట్టల్ సంస్థతో సెయిల్ జేవీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం జరిగింది. ఆటోగ్రేడ్ స్టీలు తయారు చేసేందుకు విశాఖపట్నం సమీపంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీ వారితో కూడా మాట్లాడాం. స్థలం ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. ఇంకా సమాచారం రావాల్సి ఉంది’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంటు పెడతామని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. ఏపీ ప్రభుత్వం తొందరపాటు రాజకీయం చేసిందని, అభివృద్ధి కోసం ముందుకు రావాలని ఆయన సూచించారు. -
మార్కెటింగ్‌పై హరీశ్‌కు చిత్తశుద్ధి లేదు
భూదాన్ పోచంపల్లి: నీటి పారుదల మంత్రి హరీశ్‌రావుకు మిషన్ కాకతీయ, భగీరథ పథకాలపై ఉన్న చిత్తశుద్ధి మార్కెటింగ్‌పై లేదని, దాంతో ఆ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పోచంపల్లి, రేవనపల్లి, గౌస్‌కొండ, ఇంద్రియాల గ్రామాల్లో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను సందర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షంతో వరి, మామిడి తోటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 799 వరి రకాన్ని సాధారణ గ్రేడ్ కింద పరిగణించడం రైతు వ్యతిరేక చర్య అని, దీన్ని వెంటనే ఉపసంహరించుకుని పూర్తి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులకు రెట్టింపు లాభం చేకూర్చేలా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తున్నారని, వీటిని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను విస్మరించి మిల్లర్లను ప్రోత్సహిస్తూ, దళారులను పెంచడం సరికాదన్నారు. -
‘గవర్నర్‌గా వెళ్లను.. మళ్లీ పోటీ చేస్తా’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీకి ప్రత్యామ్నాయం అని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ దత్తాత్రేయ అన్నారు. తెలంగాణకు 24గంటల విద్యుత్ ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నాగం జనార్దన్ రెడ్డి పార్టీ నుంచి మారుతున్నారనే విషయంపై తాను మాట్లాడబోనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అత్యధిక సాయం చేసిందని రెండేళ్లలో మిషన్ భగీరథకు రూ.3,900కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 677 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టుల వేగవంతానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. తాను గవర్నర్‌గా వెళ్లబోనని, ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేస్తూ 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని తెలిపారు. -
'చంద్రబాబును అహ్వానించడానికి వచ్చా'
విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఆలయ పరిసరాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని చాలా బాగా పాటిస్తున్నారని అనిపిస్తోంది. ప్రతి ఏడాది దసరా అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించి అలయ్-బలయ్ కార్యక్రమానికి చంద్రబాబునాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి విజయవాడకు వచ్చినట్టు తెలిపారు. ఈ రోజు సాయంత్రం సీఎంతో భేటీ అవుతన్నానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర స్నేహ భావంతో ముందెకెళ్లాలని కోరుకుంటున్నానని అన్నారు. -
బీసీల వ్యతిరేకి కేంద్ర సర్కార్
దత్తాత్రేయను తొలగించడంపై బీసీ సంక్షేమ సంఘం మండిపాటు సాక్షి, హైదరాబాద్: బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించడంపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు బీసీ మంత్రి తొలగింపుతో పాటు రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం బీసీలకు వ్యతిరేకిగా మారుతోందని ఆరోపించారు. ఆదివారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించడం, కొత్త మంత్రివర్గంలో రాష్ట్రానికి అవకాశం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 7న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులు పాల్గొనాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలన్నారు. సమావేశంలో బీసీ సంఘం ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, సి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
భారత పారా సైక్లింగ్ జట్టు కోచ్‌గా దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సైక్లింగ్ సంఘం కార్యదర్శి కె. దత్తాత్రేయ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయన పారా సైక్లింగ్ రోడ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. దత్తాత్రేయతో పాటు ఆదిత్య మెహతా ఫౌండేషన్‌కు ఆదిత్య మెహతా అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ వరల్డ్ చాంపియన్‌షిప్ ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. -
సింగరేణిలో ప్రసూతి సెలవు పెంపు
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల అమలు సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో పనిచేస్తున్న మహిళా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం తీపికబురు అందించింది. మెటర్నిటీ (ప్రసూతి) సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాలను అమలు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత కార్మికుల పక్షాన మెటర్నిటీ లీవ్‌లను పెంచాలని, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని ఇటీవల సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. కవిత విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యాజమాన్యం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో 14,921 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు లబ్ధి పొందుతారు. యాజమాన్యంపై నెలకు సుమారు రూ.2.07 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ సందర్భంగా సింగరేణి మహిళా ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికులకు కనీస వేతనాలు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ వెల్లడి సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్‌లో పని చేస్తున్న నైపు ణ్యేతర, నైపుణ్య కార్మికులకు కనీస వేతనాలు వర్తించేలా కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కేంద్ర నిర్ణయంతో సింగరేణిలోని ఈ కేటగిరీకి చెందిన 1,200 మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నైపుణ్యేతర కార్మికుల వేతనం రోజుకు రూ.48కి పెరిగిందని, ఓ స్థాయి నిపుణులకు రూ.420, నిపుణులైన కార్మికులకు రూ.506, పూర్తి స్థాయి నిపుణులకు రూ.596 చొప్పున చెల్లిస్తారని తెలిపారు. 2017 జనవరి 19 నుంచి ఈ పెంపు వర్తిస్తుందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైందన్నారు. -
వంద కేజ్ కల్చర్ సెంటర్లు
- చేపల పెంపకానికి ఎన్ఎఫ్డీబీ అధునాతన పరిజ్ఞానమిది -కేంద్రం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తెస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈమేరకు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ) సరికొత్తగా కేజ్ కల్చర్‌ను పరిచయం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వంద కేజ్ కల్చర్ సెంటర్లను తెరిచేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని, త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సోమవారం దిల్కుషా అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఎఫ్డీబీ రూపొందించిన కొత్త టెక్నాలజీతో దిగుబడి బాగుంటుందని వివరించారు. ‘రాష్ట్రంలో చేపల పెంపకం ఆశించినంతగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.70కోట్లతో చేప పిల్లలను చెరువుల్లో వేసింది. కానీ పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేశాయి’ అని అన్నారు.. చేపల మార్కెట్ల ఏర్పాటుకు కేంద్రం రాష్ట్రానికి రూ.9.65 కోట్లు కేటాయించి, రూ.4.45 కోట్లు విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్రానికి కొత్త యూనివర్సిటీ... రాష్ట్రంలో కొత్తగా ‘ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్’ ఏర్పాటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు రెండొందల ఎకరాల భూమి కావాలని, రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులు జరిపిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ఇఫ్లూ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్, స్పోకెన్ హిందీ కోర్సులను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులు పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలో ఇఫ్లూ యంత్రాంగం ఐదు గ్రామాలను దత్తత తీసుకోనుందన్నారు. ఐటీఐ మల్లెపల్లిలో కొత్తగా పది ట్రేడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇప్పటికే మారుతి–సుజుకీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. -
సిరిసిల్లలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి..
సిరిసిల్ల: నియోజకవర్గంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ సోమవారం దత్తాత్రేయను ఆయన కార్యాలయంలో కలుసుకొని చర్చించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంత మంది కార్మికులు బీమా పరిధిలోకి వస్తారో నివేదిక పంపాలని స్థానిక కార్మిక శాఖ అధికారులను ఆదేశించినట్టు దత్తాత్రేయ తెలిపారు. బీడీ, నిర్మాణ రంగ కార్మికులు, అసంఘటిత కార్మికులు బీమా పరిధిలోకి వచ్చేలా చూడాలని సూచించానన్నారు. నివేదిక అందిన వెంటనే ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో బీడీ కార్మికులకు కేంద్ర కార్మిక శాఖ తరఫున ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. దీనిపై స్పందించిన దత్తాత్రేయ మొదటి దశలో ఐదు వేల ఇళ్లకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాటాను విడుదల చేస్తే 2018–19 నాటికి పరిశ్రమను ప్రారంభిస్తామని దత్తాత్రేయ తెలిపారు. పేదలకు పక్కా ఇళ్లు మంజూరుకు ఉద్ధేశించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి హైదరాబాద్‌లో అవసరమైన 45 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కృషి చేయాలని దత్తాత్రేయను కేటీఆర్ కోరారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణాల పథకం అమలు వేగంగా జరుగుతుండడంపై కేటీఆర్‌ను దత్తాత్రేయ అభినందించి సత్కరించారు. -
నగదు కొరత వేధిస్తోంది..!
♦ రైతులకు రుణాలు అందడం లేదు ♦ జైట్లీకి దత్తాత్రేయ ఫిర్యాదు ♦ తక్షణం రూ. 8 వేల కోట్ల విడుదలకు జైట్లీ హామీ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో నగదు కొరత వేధిస్తోందని, నగదు నిల్వ లేక బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు, తెలంగాణ బీజేపీ నేత శ్రీరాం వెదిరెతో పాటు జైట్లీని కలిశారు. రైతులకు ఖరీఫ్ సీజన్లో రావాల్సిన రుణాలు అందడం లేదని, నగదు కొరతే దీనికి కారణమని వివరించారు. బ్యాంకులకు నగదు విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు దాదాపు రూ. 23 వేల కోట్ల మేర నగదు అవసరమని వివరించినట్టు దత్తాత్రేయ మీడియాకు తెలిపారు. అరుణ్‌జైట్లీ తన విన్నపానికి స్పందిస్తూ రూ. 8 వేల కోట్ల మేర నగదును తక్షణం విడుదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. జీఎస్టీ కారణంగా జౌళీ రంగం, బీడి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు వచ్చిన విన్నపాలను జైట్లీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు దీనికి జైట్లీ స్పందిస్తూ జీఎస్టీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు దత్తాత్రేయ వివరించారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్కోవింద్ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటిస్తారని, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుస్తారన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. -
మీ కృషి అభినందనీయం
దత్తాత్రేయకు కైలాశ్ సత్యార్థి ప్రశంస సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక, ఉపాథి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి భేటీ అయ్యారు. మంగళవారం ఢిల్లీలోని కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు విచ్చేసిన కైలాశ్.. దేశంలో బాల కార్మికుల నిషేధ చట్టం, ప్రమాదకర పరిశ్రమల్లో 14–18 ఏళ్లలోపు బాలలను నియమించుకోవడంపై నిషేధం విధి స్తూ చట్టాలు రూపొందించడంపై ఆయన కేంద్ర మంత్రి దత్తాత్రేయను అభినందించారు. ఈ చట్టాలను రూపొందించి పార్లమెంటులో ఆమోదింపచేయడంలో కార్మికశాఖ కీలక పాత్ర పోషించిందని సత్యార్థి కొనియాడారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. బాలల హక్కుల కోసం ఉద్యమాలు చేసిన కైలాశ్ సత్యార్థి కృషి అభినందనీయమన్నారు. ఈ నెల 12 నుంచి జెనీవాలో అంతర్జాతీయ కార్మిక శాఖ మంత్రుల సమావేశాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. సమావేశంలో ఐఎల్వో డైరెక్టర్ పిన్ బిన్పాల్, కార్మిక శాఖ కార్యదర్శి సత్యవతి పాల్గొన్నారు. -
కేంద్రమంత్రి వ్యాఖ్యలు దురదృష్టకరం: టీఆర్ఎస్
హైదరాబాద్: కేంద్రమంత్రి దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అధికార పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. దత్తాత్రేయ నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దాహం వేసినపుడే బావి తవ్వుకుందామనే రీతిలో బీజేపీ వైఖరి ఉందన్నారు. దత్తాత్రేయ లాంటి పెద్ద మనిషి కూడా అబద్దాలాడుతుండటం శోచనీయమని మిర్చి రైతుల విషయంలో చాలా ఆలస్యంగా స్పష్టత లేని విధంగా కేంద్రం స్పందించిందని దుయ్యబట్టారు. మిర్చి సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముద్దాయి చేసే ప్రయత్నం బీజేపీ నేతలు మానుకోవాలని సూచించారు. కాషాయ జెండాను విస్తరించుకునే క్రమంలోనే బీజేపీ నేతలు రైతులను రెచ్చ గొడుతున్నారని విమర్శించారు. బ్యాంకులను వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా మీద ఉన్న ప్రేమ రైతుల మీద కేంద్రానికి లేక పోవడం విచారకరమన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉండి సహచర మంత్రి రాధామోహన్ సింగ్, ప్రధాని మోదీలతో మాట్లాడి తెలంగాణా రైతుల కు న్యాయం చేయాలని దత్తాత్రేయ భావించడం లేదని ప్రభాకర్ మండి పడ్డారు. -
దిగ్విజయ్‌పై కఠినంగా వ్యవహరించాలి
► పోలీసుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు: వెంకయ్యనాయుడు ► రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకోవాలని కార్యకర్తలకు పిలుపు సాక్షి, హైదరాబాద్: ఐసిస్‌కు ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్నా రంటూ తెలంగాణ పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యా ఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్‌పై పెట్టిన కేసులో కఠి నంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు మతో న్మాదాన్ని, తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. నక్సల్స్ హింసను అణచివేసి, ఇతర రాష్ట్రాలతో రక్షణ విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తున్నారని ప్రశం సించారు. శనివారం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం కార్యకర్తల సమ్మేళనంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ బలం పెంచుకుందాం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దక్షిణా దిలోనూ ప్రతి మండలం, తాలుకా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పుంజుకు నేలా కృషి చేయాలన్నారు. కేంద్రం చేపట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అవి సరిగా అమలయ్యేలా జిల్లా, రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తేవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తే పేదల ఇళ్లను మరిన్ని మంజూరు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వమున్నా అభివృద్ధిలో కలసి పనిచేస్తా మన్నారు. తుపాకీ గొట్టంతో అధికారం తప్పు డు ఆలోచన అని, మావోయిస్టులపై సాను భూతి చూపడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణలో పాగా వేస్తాం.. దేశంలో బీజేపీ గాలి వీస్తోందని, తెలంగాణలో 50% కన్నా ఎక్కువ అసెంబ్లీ సీట్లను, అత్యధికంగా లోక్‌సభ సీట్లను గెలుచుకునే దిశలో ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కార్యకర్తలు కాషాయం వైపే వస్తారన్నారు. దక్షిణ భారతదేశంలోనూ బీజేపీ పాగా వేస్తుందని, తెలంగాణలో అధికారంతో అది ప్రారంభమవుతుందని మరో కేంద్ర మంత్రి అర్జున రాం మేఘవాల్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మభ్యపెడుతోందని.. బర్రెలు, గొర్రెల పేరుతో బలహీన వర్గాలను అపహాస్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలుచేశారా అన్నది కేసీఆర్ చెప్పాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు, ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. -
విమర్శిస్తే ఊరుకునేది లేదు: దత్తన్న
హైదరాబాద్: మిర్చి రైతుల ఇబ్బందులు తీర్చలేక కేంద్రాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. పత్తి వద్దు మిర్చి ముద్దు అని స్వయంగా సీఎం కేసీఆరే ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన ప్రచారం కారణంగా మిర్చి సాగు పెరిగి దిగుబడి ఎక్కువ వచ్చిందని అన్నారు. మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్లాన్ చేయక పోవడం వల్ల రైతులు వ్యాపారుల చేతుల్లో నలిగి పోయారని ధర దక్కక మిర్చిని తగుల బెడుతున్నారని మంత్రి తెలిపారు. అందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని నిందిస్తే ఊరుకునేది లేదన్నారు. వాణిజ్య పంటల ధరలతో కేంద్రానికి సంబంధం ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసిన మొదటి నివేదికలో స్పష్టత లేదు..ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని విమర్శించారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సరి కాదని తెలిపారు. ఇంతగా గొడవలు జరుగుతున్నా రాష్ట్ర సర్కారు ఎవరిపై అయినా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. అయినా మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ కింద మిర్చి పంటను కొనాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని వివరించారు. -
మరో 2,500 మెగావాట్లు అవసరం
- రాష్ట్ర విద్యుత్ సమస్యలపై సమీక్షలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ - కేంద్ర విద్యుత్ మంత్రి గోయల్‌తో చర్చిస్తామని వెల్లడి - రైతులకు కనీసం 12 గంటల విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్య లకు త్వరలో పరిష్కారం లభించేలా కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చలు జరుపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. తెలంగాణలో విద్యుత్ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మంగళ వారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రా నికి మరో 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని, రైతులకు కనీసం 12 గంటలు విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దేశమంతటా 24 గంటల విద్యుత్ అందించాలన్నది ప్రధాని మోదీ సంక ల్పమని తెలిపారు. హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ కేబుల్ లైన్లు నిర్మించాలని దత్తాత్రేయ చెప్పగా.. అందుకు రూ.350 కోట్లు అవసరమ వుతాయని అధికారులు తెలిపారు. వ్యవసా యానికి, వ్యవసాయేతర అవసరాలకు విడి విడిగా విద్యుత్ సరఫరా ఉండాలని దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్రంలో ప్రతిఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో 9,150 గ్రామాల్లో 5.65 లక్షల ఇళ్లలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి రూ.3 వేల చొప్పున సబ్సిడీ కల్పించడానికి కేంద్రం రూ.1,107 కోట్లు కేటాయించిందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌కు సహాయం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజ నలో భాగంగా నాణ్యమైన విద్యుత్ అందించ డానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు. గ్రామీణ విద్యుత్ సంస్థ ద్వారా మూడేళ్లలో రూ.30 వేల కోట్లను రాష్ట్రానికి కేటాయించామన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర అవసరాలకు ప్రత్యేక లైన్లకు రూ.2,300 కోట్లు అవసరమని, స్మార్ట్ మీటర్ల కోసం రూ.788 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర విద్యుత్ అధికారులు వివరించారని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్ల ద్వారా శక్తిని పొదుపు చేసేందుకు టీఎస్ఎన్పీడీసీఎల్కు రూ.1,543 కోట్లు మం జూరు చేశామన్నారు. సూర్యాపేటలో 400/ 200 కేవీ సబ్ స్టేషన్ స్థాపన పనుల కోసం, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 400/200 కేవీ సబ్ స్టేషన్ స్థాపన పనులకు రూ.1,107 కోట్లు టీఎస్ ట్రాన్స్‌కోకు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ కల్లోలం సృష్టించాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ అశాంతితో కొట్టుమిట్టాడుతూ అభివృద్ధి ఎజెండాను కాదని.. మతకల్లోలాలు సృష్టించాలని ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ ఆరోపించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ఆరోపణలు చేయడం సముచితం కాదని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పోలీసులను అప్రతిష్టపాలు చేయడం సరైనది కాదని, జాతికి సంబంధించిన అంశంపై సంయమనంతో మాట్లాడాలన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత లెందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దిగ్విజయ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘మోదీ చరిష్మా మరింత పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా రోజు రోజుకూ పెరుగుతోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక ల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్ తన వైఖరి మార్చుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. -
ఉద్దేశపూర్వకంగానే పేరు తొలగింపు: రామచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్ర మాలకు స్థానిక ఎంపీని, ఎమ్మెల్సీని ఆహ్వానించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సికింద్రాబాద్‌లో నిర్వహించబోయే మేడే కార్యక్రమానికి స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి దత్తాత్రేయ పేరును ఉద్దేశపూర్వకంగానే తొలగించారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు లేకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీజేపీ వ్యతిరేకి స్తుందన్నారు. ఇదే వైఖరి కొనసాగితే ప్రభుత్వ కార్యక్ర మాలను ప్రజాస్వామికంగా అడ్డుకుంటామన్నారు. -
నోట్ల రద్దుతో సంక్షేమానికి మరిన్ని నిధులు
తెలంగాణకు ఉపాధి కింద రూ.3 వేల కోట్లు: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: పాత నోట్ల రద్దుతో పేదల సంక్షేమానికి అధిక నిధులు సమకూరాయని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) శుక్రవారం ‘డిజిటల్ పేమెంట్ల’పై నిర్వహించిన సదస్సులో ఆయన మా ట్లాడారు. పాత నోట్ల రద్దు తర్వాత బడ్జెట్లో ఉపాధి హామీకి రూ.48 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని, అందులో తెలంగాణకు రూ.3వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ‘స్టాండప్ ఇండియా’ కింద ఒక్కో బ్యాంకు శాఖ నుంచి ఇద్దరు చొప్పున 2.04లక్షల మందికి రూ.కోటి వరకు రుణం ఇచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లలో డిజీధన్ మేళాలు నిర్వహించామన్నారు. ‘లక్కీ గ్రాహక్ యో జన’ ద్వారా 15.79లక్షల మంది వినియోగదారులు, డిజీధన్ వ్యాపార్ యోజన ద్వారా 91వేల మంది వ్యాపారులు విజేతలుగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్‌లో భీమ్–ఆధార్ యాప్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. శాస్త్రీయ పన్ను విధానమే ఆమోదయోగ్యం శాస్త్రీయ పన్ను విధానమే పన్ను చెల్లింపుదారునికి, ప్రభుత్వానికి ఉభయ తారకంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరగాలంటే శాస్త్రీయ పన్ను విధానమే మార్గమన్నారు. జీఎస్టీ అమలుతో పన్నుల విధానంలో ఆశించిన మార్పు వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ లావాదేవీలు పెరగాలంటే... వాటిపై చార్జీలు తగ్గించాల్సిన అవస రముందన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. -
చందాదారులకు 50 వేల లాయల్టీ
ఈపీఎఫ్ఓ కొత్త కానుక ► కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో సిఫార్సు న్యూఢిల్లీ: ఈపీఎఫ్ చందాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కొత్త కానుకను అందివ్వనుంది. ఉద్యోగ విరమణ సమయానికి 20 ఏళ్లకంటే ఎక్కువ కాలం చందా చెల్లించిన వారికి లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద రూ.50,000 చెల్లించాలని ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయించింది. శాశ్వత అంగవైకల్యం ఉన్న వ్యక్తులు 20 ఏళ్లు చెల్లించకపోయినా వారు ఈ ప్రయోజనం పొందొచ్చు. ప్రతిపాదిత ప్రథకం ప్రకారం.. మూలవేతనం రూ.5 వేల వరకూ ఉన్న వారు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద రూ.30,000, మూలవేతనం రూ.5,001–10,000 మధ్య ఉన్న వారు రూ.40,000 పొందవచ్చు. రూ.10 వేలకంటే ఎక్కువ మూలవేతనం పొందే వారు రూ.50 వేల ప్రయోజనం పొందుతారు. కేంద్ర ట్రస్టీల బోర్డు(సీబీటీ) బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చందాదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.2.5 లక్షల కనీస బీమా అందజేయాలని సిఫార్సు చేసింది. కేంద్రం ఆమోదిస్తేఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. పైలట్ ప్రాజెక్టుగా రెండేళ్ల పాటు దీనిని కొనసాగిస్తామని, ఆ తర్వాత సమీక్షించి కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. 8.65% వడ్డీ అందిస్తాం: దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: 2016–17కు గాను గత డిసెంబర్లో నిర్ణయించిన విధంగానే పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందిస్తామని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ చెప్పారు. అవసరమైతే ఆర్ధిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని, ఇప్పటికే 8.65 శాతం వడ్డీ రేటును ఆమోదించాలని ఆర్ధిక శాఖను కోరానని, కార్మికులకు డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందించాల్సిందేనని దత్తాత్రేయ అన్నారు. ఈపీఎఫ్ ప్రయోజనాలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆధార్ సీడింగ్ అప్లికేషన్‌ను ఆయన ప్రారంభించారు. పీఎఫ్ సభ్యుడు లేదా పెన్షనర్ స్వయంగా ఏదైనా ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసుకు లేదా కమాండ్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)కు వెళ్లి ఈ అప్లికేషన్ ద్వారా ఆధార్‌ను తన పీఎఫ్ ఖాతాకు అనుసంధానించుకోవచ్చు. -
మూతపడిన పరిశ్రమలు తెరిపించండి
వేతనాల్లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని టీఆర్ఎస్ తుంగలో తొక్కిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. మంగళవారం కాచిగూడలోని టూరిస్ట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణను తెస్తామన్న నాయకులు, గత మూడేళ్లుగా నిజాం షుగర్స్, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్, ఏపీ రేయాన్స్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టీరీలను ఎందుకు పునరుద్ధరించలేదో చెప్పాలన్నారు. ఏళ్ల తరబడి వేతనాలు అందకపోతుండడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆవేదనను దృష్టిలో ఉంచుకొని ఆ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌ను కోరానన్నారు. రాష్ట్రంలో యువతకు కొత్త ఉద్యోగాలు రావాలే గానీ, ఉన్న ఉద్యోగాలు పోకూడదన్నారు. అదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్మికుల విజ్ఞప్తి మేరకు, ఫ్యాక్టరీని తెరిపించే విషయమై తాను ఇప్పటికే కేంద్ర రవాణ శాఖ మంత్రితో చర్చించానన్నారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు అయ్యే వ్యయం, వేతనాల ఖర్చు.. తదితర అంశాలపై త్వరలోనే పలు శాఖల ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సింగరేణి ఎన్నికల విషయంలో యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులను పిలిపించి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. బీజేపీకి అనుకూల వాతావరణం... ఈ నెల 6 నుంచి 11 వరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీని పటిష్ట పరిచేందుకు జెండా ఆవిష్కరణలతో పాటు ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిపై విశేష ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, అధికార ప్రతినిధి పుష్పలీల పాల్గొన్నారు. -
స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులు
⇒ రూ.18,000 కోట్లు ⇒ ఈటీఎఫ్‌ల్లోనే ఇన్వెస్ట్మెంట్స్.. షేర్లలో కాదు ⇒ ఈ నెల 31 వరకూ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ ⇒ వెల్లడించిన కార్మిక మంత్రి దత్తాత్రేయ న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకూ ఈటీఎఫ్‌లలో (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్) రూ.18,609 కోట్లు పెట్టుబడులు పెట్టింది. నిఫ్టీ 50, సెన్సెక్స్, సీపీఎస్ఈ ఆధారిత ఈటీఎఫ్‌ల్లోనే ఈపీఎఫ్ఓ పెట్టుబడులు పెట్టిందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అంతేకానీ కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయలేదని రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు. గత నెల 18 వరకూ నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీ ఆధారిత ఈటీఎఫ్‌ల్లో రూ.17,105 కోట్లు, సీపీఎస్ఈలో (సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్) రూ.1,504 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ పరిధిలోకి మరింతమంది సభ్యులను చేర్చుకునే ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమైందని, ఈ నెల 31 వరకూ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ సంస్థ/కంపెనీ అయినా ఒక డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా తమ ఉద్యోగులను ఈపీఎఫ్ఓలో చేర్చవచ్చని సూచించారు. -
'జాత్యహంకార దాడులు సహించరానివి'
హైదరాబాద్: అమెరికాలో జాత్యహంకార దాడులు, తెలుగు విద్యార్థి హత్య సహించరానివని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. జాతి వివక్ష దాడులను అక్కడి ప్రభుత్వం అరికట్టాలని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ.. అహంకార దాడుల విషయంలో కేంద్రం అమెరికాతో మాట్లాడుతుందని, ఈ విషయంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఈఎస్ఐ సేవల విస్తరణకు సిద్ధంగా ఉన్నామని దత్తాత్రేయ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటికి కావాల్సిన భూములు ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం మూలంగా ఈఎస్ఐ సేవల విస్తరణలో కాలయాపన జరుగుతోందని, గోషామహల్లో వంద పడకల ఆస్పత్రి కోసం శంకుస్థాపన చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చెయ్యకపోవడంతో ఆలస్యం అవుతోందని తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు నిధులు ఇవ్వవడానికి సిద్ధంగా ఉన్నామని, కనీసం అద్దె భవనాలు ఇచ్చినా ఆస్పత్రులు ప్రారంభిస్తామని అన్నారు. ప్రతీ కార్మికునికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. -
ఉద్యమకారులతో చర్చలు జరపాలి
ఉద్యోగాలు కల్పిస్తామన్న టీఆర్ఎస్ మాట నిలబెట్టుకోవాలి: దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: నిరుద్యోగ యువత కు ఉద్యోగాలు కల్పిస్తా మని ఇచ్చిన మాటను టీఆర్ఎస్ నిలబెట్టుకోవా లని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఉద్యమ కారులతో ప్రభుత్వం సంప్రదింపు లు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం ప్రస్తుత యూపీ ఎన్నికల్లోనూ, తెలంగాణలో రాను న్న ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకందారులకు జాతీయ సహకారాభి వృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రుణాలు అందించేందుకు వీలుగా సంస్థ సీఎండీ వసు ధా మిశ్రాతో చర్చించినట్లు దత్తాత్రేయ తెలి పారు. పదవీ విరమణ పొందిన ఈఎస్ఐ లబ్ధిదారులకూ కుటుంబానికి రూ.15 లక్ష లకు మించకుండా వైద్య సదు పాయాలు కల్పించనున్నట్టు తెలి పారు. తెలంగాణలో 15, ఏపీలో 26 ఈఎస్ఐ డిస్పెన్సరీలు నిర్మిం చనున్నట్టు తెలిపారు. ఏపీలో కంచికచర్ల, చిల్లకూరు, తోడండి, తుని, హనుమంతవాక, శ్రీకాకుళం, రాజాం, అనకాపల్లి, గాడిమొగ, ఒంగోలు, కావలి, సత్యవేడు, కుప్పం, పీలేరు, జమ్మలమడుగు, పర్వాడ, తిరుమల, పుట్టపర్తి, గంగవరం, పలమనేరు, పూతలపట్టు, తావనపాలెం, మద్దిపాడు, మంగళగిరి ప్రాంతాల్లో డిస్పె న్సరీలు ఏర్పాటుచేయ నున్నట్టు తెలిపారు. తెలంగాణలో కేటీటీపీ చెల్పూరు, తాండూ రు, కరీంనగర్, దేవాపూర్, దౌల్తాబాద్, మల్లెల చెర్వు, ఖమ్మం, సూర్యాపేట, మహే శ్వరం, ఘట్కేసర్, కోదాడ, సిద్దిపేట, ఆమన గల్లు, కల్వకుర్తి, ధర్మసాగర్ ప్రాంతాల్లో ఏర్పాటుచేయనున్నట్టు వివరించారు. -
ఆసియా సైక్లింగ్ పోటీలకు దత్తాత్రేయ, ఆదిత్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన కె.దత్తాత్రేయ, ఆదిత్య మెహతాలిద్దరూ ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బహ్రెయిన్ బయల్దేరనున్నారు. దత్తా త్రేయ ట్రాక్ సైక్లింగ్ పోటీల్లో, ఆదిత్య ఆసియా పారా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు బహ్రెయిన్‌లో ఈ పోటీలు జరుగుతాయి. దత్తాత్రేయ దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగి కాగా, ఆదిత్య మెహతా గతంలో అంతర్జాతీయ సైక్లింగ్ పోటీల్లో రెండు రజత పతకాలు గెలిచాడు. -
నిర్మల్‌లో ఈఎస్ఐ ఏర్పాటు చేయండి
దత్తాత్రేయను కోరిన ఇంద్రకరణ్ సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్‌లో భారీగా ఉన్న బీడీ కార్మికుల్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. బుధవారం ఉదయం కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలసిన ఇంద్రకరణ్‌రెడ్డి ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు కు వినతిపత్రాన్ని సమర్పించారు. నిర్మల్ లో ఏరియా ఆస్పత్రి భవనం ఖాళీగా ఉందని లేబర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకొని అక్కడ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పా టుకు చర్యలు తీసుకోవాలని దత్తా త్రేయను కోరారు. అలాగే నిర్మల్‌లో పీఎఫ్ రీజినల్ ఆఫీసు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సానుకూలంగా స్పందించి నిర్మల్‌లో ఆస్పత్రి, పీఎఫ్ రీజినల్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రామగుండంలో 100 పడకల ఆస్పత్రిని, రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో కూడా ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్టు దత్తాత్రేయ తెలిపారు. -
తెలంగాణకు భారీగా నిధులు
• పలు కార్యక్రమాల కోసం రూ.5,921 కోట్లు: దత్తాత్రేయ • కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మరో 29 వేల కోట్లు అందుతాయి • రైల్వే బడ్జెట్లో రూ.1,729 కోట్లు కేటాయించామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘నోట్ల రద్దు ద్వారా ఆదాయ పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం 34.85 శాతం పెరిగింది. నోట్ల రద్దు ప్రభావంతో నల్లధనం తగ్గడంతో పాటు ప్రభుత్వానికి రాబడి పెరిగింది. ఈ నిధులను ప్రజల సంక్షేమానికి విరివిగా ఖర్చు చేస్తాం..’’అని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాలను చక్క దిద్దేందుకే తమకు రెండున్నరేళ్లు పట్టిందని, పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిలోకి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నాయ కత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి విప్లవాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. గ్రామీ ణ ప్రజలు, వ్యవసాయా భివృద్ధే లక్ష్యంగా ఇది రూపొందిందని దత్తా త్రేయ చెప్పారు. విద్య, వైద్యం, సంక్షేమా నికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, తొలిసారిగా ఒకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అరుణ్ జైట్లీ చరిత్రలో నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రయోజనం తాజా బడ్జెట్లో రాష్ట్రానికి రూ.5,921 కోట్లు ఇచ్చామని దత్తాత్రేయ తెలిపారు. ‘‘అందులో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లోని 25 లక్షల మందికి ప్రయోజనం కలిగేలా, 25 వేల గ్రామాల్లో పలు కార్యక్రమాల నిమిత్తం రూ.1,600 కోట్లు కేటాయించాం. ఉపాధి కల్పన, శిక్షణ కోసం రూ.2,145 కోట్లు, పరిశోధనా కేంద్రంగా పేరొందిన హైదరాబాద్‌కు రూ.284 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు 162 కోట్లు కేటాయించాం. ఇవేకాకుండా 30 కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల కింద రూ.29 వేల కోట్లు వస్తాయి. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి రూ.1,729 కోట్లు ఇచ్చాం..’’అని వెల్లడించారు. తెలంగాణలో 5 లక్షల మంది నిర్మాణ కార్మికులకు శిక్షణ ఇస్తామని, దాంతో వారికి మంచి వేతనాలు వస్తాయని, గల్ఫ్ దేశాల్లోనూ ఉపాధి అవకా శాలు కల్పిస్తామని దత్తాత్రేయ చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నా యని.. బడ్జెట్‌ను కనీసం చదవకుండా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. బడ్జెట్‌పై ఏ వర్గం నుంచి కూడా వ్యతిరేకత రాలేదని, మీడియాలో సైతం అనుకూల కథనాలే వచ్చాయని స్పష్టం చేశారు. -
‘ఇక ప్రతినెలా జాబ్ మేళా’
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నగరంలో ఇక ప్రతినెలా ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిట్స్ పాఠశాలలో రెండో రోజు జరిగిన ఉద్యోగ మేళాకు ఆయన హాజరై ఉద్యోగాలకు ఎంపికైన పలువురు అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ జాబ్ మేళాలో నాలుగువేల మంది ఉద్యోగాలు పొందారు. ప్రతినెలా నిర్వహించనున్న ఉద్యోగమేళా అవకాశాన్ని నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
జీతాల ‘ఈ–చెల్లింపు’ కోసం ఆర్డినెన్స్
• కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన దత్తాత్రేయ • చెక్కులు, ఎలక్ట్రానిక్ విధానంలో వేతనాలు జీతాల చెల్లింపునకు కేంద్రం నగదు రహిత మార్గం ఎంచుకుంది. వేతన చెల్లింపుల చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల ఉద్యోగులకు జీతాలను చెక్కులు, ఎలక్ట్రానిక్ పద్ధతితో చెల్లించేందుకు ఆ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. న్యూఢిల్లీ: తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ కోసం జీతాల చెల్లింపునకు ప్రభుత్వం నగదు రహిత మార్గం ఎంచుకుంది. వేతన చెల్లింపుల చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల ఉద్యోగులకు జీతాలను చెక్కులు, ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు ఆ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతన చెల్లింపు చట్టం–1936లోని 6వ భాగాన్ని సవరించేందుకు ఇటీవల సవరణ బిల్లు–2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం తెలిసిందే. కేబినెట్ భేటీ తర్వాత కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘దీనికి సంబంధించి కేంద్రం, రాష్ట్రాలు పరిశ్రమలను నోటిఫై చేశాక యాజమాన్యాలు జీతాలను నగదుగా చెల్లించే అవకాశం కూడా ఉంటుంది’ అని చెప్పారు. అయితే బిల్లులో మాత్రం.. ఉద్యోగులకు జీతాలను చెక్కు లేదా వారి బ్యాంకు ఖాతాల్లో మాత్రమే జమ చేయాల్సిన పరిశ్రమలేమిటో వివరిస్తూ సంబంధిత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయొచ్చనడం గమనార్హం. నెల జీతం రూ. 18 వేలకు మించని కొన్ని సంస్థల ఉద్యోగులు ప్రస్తుతం వేతన చెల్లింపుల చట్టపరిధిలో ఉన్నారు. రైల్వే, విమానయాన రవాణ సంస్థలు, గను లు, చమురు క్షేత్రాలు తదితర సంస్థలకు సంబంధించి వేతనాల చెల్లింపు నిబంధనలను కేంద్రం, మిగతా సంస్థల విషయంలో రాష్ట్రాలు మార్చొచ్చు. ⇔ 20కిపైగా సామాజిక, ఆర్థిక సంస్థలకు రద్దు చేసిన భూకేటాయింపులను పునరుద్ధరించాలన్న ప్రతిపాదన కేబినెట్ అజెండాలో చోటుచేసుకుంది. ఈ సంస్థల్లో అత్యధికం ఆరెస్సెస్ అనుబంధ సంస్థలని తెలుస్తోంది. -
పిలిస్తే పలికే భక్తసులభుడు
అత్రి, అనసూయల తపస్సునకు మెచ్చి అత్రివరదుడిచ్చిన వరానికి అనుగుణంగా దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో రూపుదిద్దుకున్నాడు. అత్రి వరదునిది దైవ, గురు స్వరూపాల కలయిక. అందుకే దత్తాత్రేయుడు ఆదిగురువుగా వినుతికెక్కాడు. మాయా ప్రభావితులై దారి తప్పుతున్న మానవులకు జ్ఞానబోధనలకు, ఆచారవ్యవహారాల అనుసరణకు, ధర్మాధర్మ విచక్షణకు, శిష్ట రక్షణతోబాటు, మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే దత్తుడు పెద్దపీట వేశాడు. అందుకే ఆయన బోధగురువుగా మన్ననలను పొందారు. దత్తావతార ముఖ్యోద్దేశం భిన్నత్వంలో ఏకత్వసాధన. అన్ని సాధనలను ఏకంచేసి, తనలో కలుపుకోవడమే ఈ అవతార తత్త్వం. విష్ణువు ధరించిన అనేక అవతారాలలో ఎంతో సనాతన మైనది, విలక్షణమైనది దత్తావతారం. కర్మ, భక్తి, జ్ఞానాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క యోగంగా మలచి, వాటినన్నింటినీ జ్ఞానంతో సంలీనం చేసి, సాధకులను బ్రహ్మజ్ఞాన విధులుగా పరిగణింపజేస్తాడు. సాధనలో పరిపూర్ణ స్థితిని అందుకునేటట్లు అనుగ్రహిస్తాడు. దత్త సాంప్రదాయం సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని, ముక్తిని సాధించవచ్చని తెలుపుతుంది. దత్తునిది జ్ఞానతత్త్వం. ఆయన బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగ విద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు. దత్తుడు బ్రహ్మకు వేదవిద్య, మంత్రవిద్య, బ్రహ్మవిద్యలను ఉపదేశించాడు. అలాగే ప్రహ్లాదునికి ఆధ్యాత్మిక విద్య, వశిష్టునికి యోగవిద్య, పరÔ]æురామునికి శ్రీవిద్య, కార్తవీర్యునికి ఆత్మవిద్య, అలర్కునికి యోగవిద్య... ఇలా ఎంతో మంది మహానుభావులకు జ్ఞానామృతాన్ని పంచాడు. ఇందులో సంతులు, సాధువులు, అవధూతలెందరో ఉన్నారు. దత్త జయంతికి ఒక విశిష్టత ఉంది. ఆకాశంలోని నక్షత్ర మండలంలో దత్తుడు జన్మించిన మార్గశిర మాసంలో పూర్ణిమనాడు మానవులు నివసించే భూమి తిరుగుతూ, తిరుగుతూ, విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి సమీపంగా వస్తుంది. ఆ సమయానికి సూర్యచంద్రులతో బాటు, మానవులు కూడా ఒకే సరళరేఖలో దత్తునికి చేరువగా ఉంటారు. అందువల్ల దత్తజయంతి నాడు అసంకల్పితంగా మానవులలోనికి దత్తశక్తి ప్రవేశిస్తుంది. ఆ రోజు దత్తుని విశేషంగా పూజించినవారు వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. – దువ్వూరి భాస్కరరావు శ్రీపాద శ్రీవల్లభ కథాసుధ, దత్తగురుత్రయం గ్రంథాల రచయిత ఈ నెల13న ‘దత్త జయంతి’ -
వర్గీకరణ చట్టబద్ధతకు చొరవ చూపండి
దత్తాత్రేయను కోరిన మంద కృష్ణ సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిందనే శుభవార్త కోసం మాదిగ జాతి ఎదురు చూ స్తోందని, వర్గీకరణకు చట్టబద్ధత లభించే వరకు ప్రత్యేక చొరవ చూపాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. గురువారం ఢిల్లీలో దత్తాత్రేయతో భేటీ అయిన మంద కృష్ణ ’ధర్మయుద్ధం’ మహా సభకు విచ్చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డితోనూ మంద కృష్ణ సమావేశమై వర్గీకరణకు పార్టీల పరంగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్లు కల్పించి ఆదుకోండి: అన్ని రంగాల్లో వెనుకబడిన ఆరెకటిక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చి తమ అభివృద్ధికి తోడ్పడాలని కుల పోరాట సమితి నాయకుడు జి.సుధాకర్ కోరారు. ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని కోరు తూ ఆరెకటిక పోరాట సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన రెండు రోజుల ధర్నా గురువారం ముగిసింది. -
రైల్‌రోకో కేసు కొట్టివేత
రైల్వే కోర్టుకు దత్తాత్రేయ, కోదండరాం, కేటీఆర్, రాష్ట్ర మంత్రులు హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన రైల్‌రోకో కేసుకు సంబం ధించి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, జేఏసీ చైర్మన్ బుధవారం బోరుుగూడలోని రైల్వేకోర్టుకు హాజరయ్యారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నారుుని, పద్మారావు, కేటీఆర్, జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేత జి.కిషన్‌రెడ్డి తదితరులు రైల్వే రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. మౌలాలి రైల్వేస్టేషన్లో జరిగిన రైల్‌రోకో ఆందోళనలో పాల్గొన్నారని 2011లో రైల్వే పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. సుమారు 2 గంటలపాటు మంత్రులు, జేఏసీ చైర్మన్ కోర్టు ఆవరణలో గడిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజలపక్షాన ఉద్యమిస్తున్న కోదండరాం తెలంగాణ మంత్రులతో పిచ్చాపాటిగా, చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతూ కనిపించడం గమనార్హం. ఈ నెల 24న తన కుమార్తె విజయలక్ష్మి వివాహనికి ఆహ్వానిస్తూ కేటీఆర్ తదితరులకు దత్తాత్రేయ శుభలేఖలు అందజేశారు. కోర్టు కేసుపై స్పందించాలని మంత్రులను విలేకరులు కోరగా అందరి తరఫున కోదండరాం మాట్లాడతారని చెప్పి కార్లలో వెళ్లిపోయారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కేసులు నమోదయ్యాయని, పలు కేసులు ఇంకా ఆయా కోర్టుల్లో నడుస్తున్నాయని వివరించారు. రైల్‌రోకోకు సంబంధించి ఓ కేసును రైల్వే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోట్టి వేశారు. మళ్లీ ఎప్పుడైనా రైల్‌రోకోలు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెడితే జైలుకు పంపిస్తామని జడ్జి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. -
ఎక్సైజ్ విధానాన్ని పునస్సమీక్షించాలి
► కేంద్రమంత్రి దత్తాత్రేయ ► మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు ► శేషగిరిరావు దీక్ష ప్రభుత్వానికి కనువిప్పు కావాలని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, అందువల్ల ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని పునస్సమీక్షించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కన్నా బార్షాపులపైనే మక్కువ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కాస్తా బార్ల తెలంగాణగా మారకుండా చూడాలన్నారు. పట్టణాల్లో 11 వేల జనాభా, గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల జనాభా ఉంటే బార్‌షాప్ తెరవాలని ఎక్సైజ్ పాలసీలో పెట్టడం బాధాకరమన్నారు. దీన్ని కేవలం ఆదాయ వనరుగా చూడడం సరైంది కాదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ, మద్యంపై ప్రజలను చైతన్యవంతులను చేయడంలో మాత్రం వెనుకబడి ఉందన్నారు. ఈ విషయంలో కూడా నంబర్ వన్ స్థానానికి రావాలన్నారు. త్వరలోనే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించడంతో పాటు, ఆయా అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాస్తామన్నారు. కార్మికశాఖ ద్వారా మద్యం మహమ్మారి, దుష్పరిణా మాలపై సింగరేణి, ఇతర పరిశ్రమల్లో అవగాహన కార్యక్రమాలను చేపడతామ న్నారు. బడుగు, బలహీనవర్గాలు, పేదల్లో దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను చేపడతామన్నారు. శేషగరిరావు దీక్ష విరమణ.. నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సీనియర్ నేత ప్రొ.ఎస్వీ శేషగిరిరావు మద్యం సమస్యపై చేపట్టిన ఒకరోజు దీక్షను దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు శనివారం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. మద్యం సమస్యపై 81 ఏళ్ల వయసులో శేషగిరి రావు చేసిన దీక్ష టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ దీక్షను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మద్యం విధానంలో సమూల మార్పుల కోసం బీజేపీ ఉద్యమం చేస్తుందని, శేషగిరిరావు దీక్ష అందుకు అంకురార్పణ అని మురళీధర్‌రావు పేర్కొన్నారు. పెద్దనోట్లు రద్దు చేయడంతో కొందరి గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. డబ్బుతో నడుస్తున్న కుటుంపార్టీల జేబులకు ఇప్పుడు ప్రమాదం రావడంతో పుట్టల్లోంచి పాముల్లాగా నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయన్నారు. అంతకు ముందు టీజేఎసీ చైర్మన్ ప్రొ.కోదండరాం, తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు, ఎన్.రామచంద్రరావు, సోము వీర్రాజు, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎం.ధర్మారావు, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఆందోళన అర్థరహితం
- పెద్ద నోట్ల రద్దుతో కీలక రంగాలకు నష్టమేమీ ఉండదు - కేంద్ర నిర్ణయం వెలువడిన రెండ్రోజులకే ఆందోళన చెందితే ఎలా - గవర్నర్‌ను కలసి అనవసర ప్రచారం చేయడం బాధాకరం - విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రిదత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ‘‘పెద్దనోట్ల రద్దుతో రూ.కోట్లలో నల్లధనం బయటపడుతుంది. అభివృద్ధి ప్రక్రియలో ఇదొక శుభపరిణామం. కానీ రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం వల్ల కీలక రంగాలకు నష్టాలొస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందడం అర్థరహితం. కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో సామాన్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ వారంతా ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నారు’’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి నెలకు రూ. 2 వేల కోట్ల నష్టం వస్తుందంటూ సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు గవర్నర్‌ను కలసి చెప్పినట్లు వార్తలు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్రం నిర్ణయం తీసుకున్న రెండ్రోజులకే ఆందోళన చెందితే ఎలా అని ప్రశ్నించారు. ఈ వైఖరి కేంద్రం ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు. మీడియా వార్తల నేపథ్యంలో దత్తాత్రేయ శుక్రవారం గవర్నర్‌ను కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘సీఎం కేసీఆర్, ప్రభుత్వాధికారులు గవర్నర్‌తో జరిపిన చర్చకు సంబంధించిన సారాంశాన్ని నరసింహన్‌ను అడిగా. కేవలం బడ్జెట్ పునర్వ్యవస్థీకరణపైనే చర్చించినట్లు గవర్నర్ చెప్పారు. పత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన ఆంశాలేవీ ప్రస్తావనకు రాలేదన్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేస్తే సీఎం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయడం హాస్యస్పదంగా ఉంది. పైగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని మాట్లాడటం దారుణం’’ అన్నారు. త్వరలో విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని సైతం యుద్ధప్రాతిపదికన వెనక్కి తెస్తామన్నారు. నోట్ల రద్దు నిర్ణయంపై సూచనలు చేయాల్సిందిగా కేంద్రం కోరిందని... రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తానన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి నిధుల విడుదలలో రాష్ట్రానికి ఇబ్బందులు రానివ్వనన్నారు. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు తగ్గితే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని.. అతి త్వరలో ధరలు తగ్గడం ఖాయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తాం
-
చిన జీయర్ షష్ఠిస్ఫూర్తి
-
జై శ్రీమన్నారాయణ..
ఇది వ్యక్తి పేరు కాదు.. జీవన మార్గ మంత్రం: జీయర్ స్వామి - కుల మతాలున్నా పరస్పర సోదరభావం రావాలి - రామానుజులు చెప్పింది ఇదే - దాన్నే అంబేడ్కర్ గుర్తించారు.. మనకూ అదే స్ఫూర్తి కావాలి - ఎల్బీ స్టేడియంలో ఘనంగా షష్టిపూర్తి మహోత్సవాలు సాక్షి, హైదరాబాద్: ‘‘కులమతాలు అంతరించటం సాధ్యం కాదు. అసాధ్యమైన వాటి కోసం ప్రయత్నం వృథా. కానీ.. స్వీయ ఆరాధనతోపాటు సర్వ ఆదరణతత్వం రావాలి. ఒకరికొకరి మధ్య ప్రేమానురాగాలు, సోదర భావన పెంపొందాలి. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం బదులు.. సర్వప్రాణి సేవే మాధవసేవ అని రావాలి. దీనికి ఏకైక నినాదమే ‘జై శ్రీమన్నారాయణ’.. అది ఓ వ్యక్తి పేరు కాదు. మనిషి ఎలా ఉండాలో చాటిచెప్పే గొప్ప తత్వం. ఆ వాక్యంలో ఒక్కో పదం ఒక్కో అర్థాన్నిస్తూ మనిషిని పరిపూర్ణుడిగా చేస్తుంది. వెయ్యేళ్ల క్రితం రామానుజులు ఆచరించి చూపిన మార్గమది. అశాంతి లేని సమాజం కోసం మనం ఆ బాటపట్టాలి’’ అని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి అభిలషించారు. ఆదివారం సాయంత్రం తన షష్టిపూర్తి సందర్భంగా ‘షష్టిస్ఫూర్తి జనోత్సవ్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా గంటసేపు మనిషి నడవడిక, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రవచించారు. రామానుజుల మార్గదర్శనాన్ని ప్రస్తావించారు. కుల మతాల అసమానతలు సమాజానికి చేటు చేస్తాయని, అయితే వాటిని రూపుమాపటం సాధ్యం కాదని పరస్పర ప్రేమానురాగాలతో మనిషి మనిషిగా ఉండే మార్గాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. సమానత్వం కోసం పాటుపడ్డ మహనీయుడిగా అంబేడ్కర్ త రచూ రామానుజుల వారి బోధనలను ఉటంకించేవారన్నారు. అంబేడ్కర్ బాటలో మనమూ నడవాలని పిలుపునిచ్చారు. శంషాబాద్‌లో రామానుజుల వెయ్యేళ్ల జయంతి వేడుకలను పురస్కరించుకుని ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’ నిర్మాణం, ఆయన భారీ విగ్రహ ప్రతిష్ట ఆలోచన ఇందులో భాగమేనని చెప్పారు. ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరుతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉగ్రవాదంతోపాటు ఇతర సామాజిక రుగ్మతల నుంచి మనం బయటపడాలంటే ఆ మహనీయుడి బోధనలను అనుసరించాలని, ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే తాము ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. ‘కాలుకు ముల్లు గుచ్చుకుంటే కంటనీరొస్తుంది. అలా శరీరంలో అంగాలు వేరైనా అన్నీ కలిసి పనిచేస్తేనే ఆరోగ్యకర శరీరమవుతుంది. సమాజంలో మన తీరు కూడా అలాగే ఉండాలి. ఎవరి ఆచారాలు వారికున్నా అంతా కలిసి అన్యోన్యంగా సాగినప్పుడే ఆరోగ్యకర సమాజం ఉద్భవిస్తుంది. 36 సంవత్సరాల క్రితం సన్యాసాశ్రమం స్వీకరించినప్పటి నుంచి నేను రామానజుల బాటలో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాను. నా కార్యక్రమాలకు ప్రజలు సహకరించి విజయవంతం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు. మంచి స్వార్థం అవసరమని, చెడు స్వార్థం నశించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌పై ప్రశంసల వర్షం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై జీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇప్పటి వరకు జరగని విధంగా దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ నిధులు కేటాయించిన ఘనత ఆయనదేనన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరో ఏదో అనుకుంటారని, ఓట్లు దూరమవుతాయని వెరవకుండా ముందుకొచ్చి యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించటం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. 1995లోనే సిద్దిపేటలోని ఇంటింటికి మంచినీటి ప్రాజెక్టు వివరాలను అప్పట్లోనే తనకు పరిచయం చేశారని, ఆయన కార్యదీక్షకు ఆయన పనితీరే నిదర్శనమన్నారు. ‘సమతామూర్తి స్ఫూర్తి’ కేంద్రం ఏర్పాటులో కూడా ఆయన సహకారం ఉందని అభినందించారు. కార్యక్రమంలో ఆయన అతిథులందరినీ పవిత్ర మాలలు, శాలువాలతో సత్కరించారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం పట్ల తాను కొంత సిగ్గుపడ్డానని, అయితే రామానజుల బాటలో ముందుకు సాగేందుకు భక్తజనం పక్షాన తనకు ఇది స్ఫూర్తి పొందే సందర్భంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. తరలి వచ్చిన భక్తజనం షష్టిపూర్తి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ‘ఆరుపదుల నిండైన పండగ’ అక్షర నీరాజనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు జీయర్ స్వామికి పాదాభివందనం చేశారు. మై హోం అధినేత రామేశ్వరరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి దగ్గరుండి కార్యక్రమాన్ని ఆసాంతం పర్యవేక్షించారు. -
ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తాం
చిన జీయర్ స్వామి షష్టిపూర్తి వేడుకల్లో సీఎం కేసీఆర్ - స్వామి సంస్కారం అందరికీ ఆదర్శం - ఆయన ప్రసంగాలు ప్రజల్ని సన్మార్గం వైపు మళ్లిస్తున్నాయి - 22 ఏళ్ల కిందట స్వామితో కొద్దిరోజులు ఉండే భాగ్యం దక్కింది - నా కారులో నేను డ్రైవర్‌గా ఆయన్ను తిప్పడం గొప్ప అనుభూతి - రామానుజుల విగ్రహ ప్రతిష్టాపన సంకల్పం తెలంగాణకే గర్వకారణం - పాల్గొన్న గవర్నర్లు నరసింహన్, విద్యాసాగర్‌రావు, - కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ తదితరులు సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ వాటిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ప్రజలను సన్మార్గం వైపు మళ్లించేలా చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రసంగాలు దోహదం చేస్తున్నాయని, చాలా సరళమైన భాషలో ఆయన చేసే అనుగ్రహ భాషణాలు భక్తిప్రపత్తులతో కూడుకున్న విన్యాసాలని కొనియాడారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి షష్టిపూర్తి సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘షష్టిస్ఫూర్తి జనోత్సవ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... నగర శివారులోని శంషాబాద్‌లో రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న జీయర్ స్వామి సంకల్పం తెలంగాణకు గర్వకారణంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ నిర్ణయానికిగాను తన పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. జీయర్ స్వామి సాన్నిహిత్యంలో ఉండటం తనకు కొత్త కాదని, 22 సంవత్సరాల క్రితం తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండగా ఆయనతో కొద్దిరోజుల పాటు కలిసి ఉండే భాగ్యం దక్కిందని గుర్తు చేసుకున్నారు. ‘‘వికాసతరింగిణి ఆధ్వర్యంలో రెండు దశాబ్దాల క్రితం సిద్దిపేటలో బ్రహ్మయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా పట్టణానికి వచ్చిన జీయర్‌స్వామికి స్వాగతం పలికి అక్కడ ఉండే వారం రోజులు మా ఇంటి ఆతిథ్యం స్వీకరించాలని కోరాను. దానికి ఆయన మన్నించి మా ఇంటనే ఉన్నారు. ఆ సందర్భంలో నా కారులో నేను డ్రైవర్‌గా ఆయనను తిప్పటం గొప్ప అనుభూతి. అల్లకల్లోలంగా ఉన్న పంజాబ్, కశ్మీర్లో ఆయన పర్యటించి ప్రశాంతతకు కృషి చేశారు. ఈ విషయం గుర్తొచ్చి కొంత అశాంతి నెలకొన్న సిద్దిపేటలో పర్యటించాలని కోరినప్పుడు శాంతి శోభాయాత్ర నిర్వహించటం గొప్ప అనుభూతినిచ్చింది. భక్తిగా యజ్ఞం చేస్తే చివరిరోజు వాన కురుస్తుందని జీయర్ స్వామి చెప్తే ఏమో అనుకున్నా. కానీ అది ఏప్రిల్ నెల అయినప్పటికీ చివరి రోజు యజ్ఞవాటిక అస్తవ్యస్తమయ్యేలా వాన కురిసి ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో నాకున్న పరిమిత పరిజ్ఞానంతో ఎన్నో ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నా. నిత్యం కార్యక్రమం ప్రారంభ సమయంలో తన గురువైన గోపాలాచార్యులకు పాదాభివందనం చేసే జీయర్‌స్వామి సంస్కారం మనకందరికీ ఆదర్శమని అప్పుడే అనుకున్నా. ఈరోజు ఆయన షష్టిపూర్తి ఉత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉంది’’ అంటూ సీఎం తన పాత అనుభవనాలను గుర్తు చేసుకున్నారు. రామానుజుల మార్గం అనుసరణీయం: విద్యాసాగర్‌రావు వెయ్యేళ్ల క్రితం రామానుజ స్వామి చేసిన బోధనలు ఇప్పటికీ అనుసరణీయమని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. ఇప్పుడు తెలంగాణలో మిషన్ భగీరథ, సాగునీరిచ్చేం దుకు చేస్తున్న ప్రయత్నాలు గొప్పవేనని, కానీ ఈ ఆలోచనలను రామానుజస్వామి అప్పుడే చేసి చూపారన్నారు. ఇప్పుడు జీయర్‌స్వామి కూడా అదే దారిలో సాగుతూ సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారన్నారు. మంచి మార్గం వైపు సాగేందుకు చేయాల్సిన ప్రయత్నాలకు ఈ వేడుక ఓ వేదిక అని పేర్కొన్నారు. ఇక్కడ ఎంత పెద్ద కేక్ కట్ చేస్తారని తనను రాజ్‌భవన్ సిబ్బంది ప్రశ్నించార న్నారు. అయితే స్వామిని ఆశీర్వదించే శక్తి ఎవరికీ లేదని, ఆయన ఆశీర్వాదం కోసం కలిగిన అరుదైన అవకాశంగా తాను ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నట్టు చెప్పానన్నారు. మానవత్వాన్ని మించిన మతం లేదు: దత్తాత్రేయ ప్రపంచంలో మానవత్వాన్ని మించిన మతం లేదని, సేవాభావం కన్నా గొప్ప గుణం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మానవత్వం, సేవాగుణంతో మూర్తీభవించిన రూపం చిన జీయర్‌స్వామి అని కొనియాడారు. కుల వ్యవస్థ సిగ్గుచేటు: వెంకయ్య ‘‘ప్రపంచానికి గొప్ప సంస్కృతిని అందించిన మన భారతీయ సంప్రదాయానికి కుల వ్యవస్థ ఓ మచ్చలా మారింది. అది మనకు సిగ్గుచేటు. దాన్ని రూపుమాపాలి. వెయ్యేళ్ల క్రితమే రామానుజ స్వామి కులవ్యవస్థ వద్దని గట్టిగా చెప్పారు. ఆ స్ఫూర్తి మనకు అవసరం. ఇప్పుడు అసమానతలను రూపుమాపేందుకు జీయర్ స్వామి కృషి చేస్తున్నారు’’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కులానికి సాంఘిక పునాది లేదని, అది వృత్తులతో పుట్టి సామాజిక సమస్యగా మారిందన్నారు. ఇక కుల వ్యవస్థకు కాలం చెల్లిందని, సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మిక, సామాజిక ప్రగతి దిశగా బాటలు వేస్తున్న చిన జీయర్ స్వామి మాటలు అందరికీ అనుసరణీయమని శ్లాఘించారు. ‘మతం వ్యక్తిగతం, మన గతం ఒక్కటే’ అన్న మాటను నిజం చేస్తూ ధర్మపరిరక్షణ వైపు నడవాలన్నారు. శంషాబాద్‌లో శ్రీరామానుజస్వామి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న జీయర్ స్వామి నిర్ణయాన్ని ప్రధాని మోదీ కూడా స్వాగతించారన్నారు. మానవ రూపంలో వెలసిన అవతారం: గవర్నర్ కురుక్షేత్రంలో అర్జునుడికి అయోమయం నెలకొన్నప్పుడు సారథిగా శ్రీకృష్ణుడు దారిచూపినట్టు ఈ ప్రపంచమనే కురుక్షేత్రంలో మనం సరైన బాటలో పయనించేలా చిన జీయర్స్వామిలాంటి వారు కృషి చేస్తున్నారని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. మనుషులకే కాకుండా చెట్లు, పశుపక్ష్యాదుల కోసం జీయర్ స్వామి చేస్తున్న సేవలు గొప్పవన్నారు. రాముడు, కృష్ణుడు మానవ రూపంలో అవతరించినట్టుగానే జీయర్ కూడా ఓ అవతారమని తాను భావిస్తానన్నారు. -
వారం రోజుల్లో పీఎఫ్ మరణ క్లెయిమ్‌లకు పరిష్కారం
న్యూఢిల్లీ: చందాదారులు చనిపోయిన వారం రోజుల్లో వారి క్లెయిమ్‌లను పరిష్కరించేలా ప్రాంతీయ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీచేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. అలాగే ఉద్యోగి విరమణ పొందడానికి ముందు లేదా అదే రోజు అతని రిటైర్మెంట్ సెటిల్మెంట్ను పూర్తిచేయాలనీఆదేశించినట్లు పేర్కొంది. ప్రధాని ఆదేశాల మేరకు సంస్థ చేపట్టిన చర్యలను మంగళవారం కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సమీక్షించారు. మరణ, విరమణ సెటిల్మెంట్లపై విస్పష్ట ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సామాజిక మాధ్యమల్లో వెలిబుచ్చే సమస్యలపై సత్వరం స్పందించాలని కూడా నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉద్యోగుల భవిష్య నిధి చట్టం-1952 64వ దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ...సంస్థ సాధించిన విజయాలు, భవిష్యత్ మార్గసూచిపై అధికారులతో కలిసి సమీక్షించారు. -
కనీస వ్యవసాయ కూలీ 350
దత్తాత్రేయ వెల్లడి న్యూఢిల్లీ: కేంద్ర పరిధిలోని సి-క్లాస్ పట్టణాల్లో నైపుణ్యంలేని వ్యవసాయ కూలీకి రోజువారీ కనీస వేతనం రూ. 350 గా ఉండాలని కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది నవంబర్ 1వ నుంచి అమలులోకి తేవాలని సంకల్పించింది. ప్రస్తుతం కేంద్ర పరిధిలోని వ్యవసాయ కార్మికులకు జాతీయ కనీస కూలీ కింద రోజుకు రూ. 160 చెల్లిస్తున్నారు. కనీస వేతనాలను పెంచుతూ తమ మంత్రిత్వశాఖ నవంబర్ 1వ తేదీన నోటిఫై చేస్తుందని కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అలాగే.. దేశవ్యాప్తంగా కూడా ప్రామాణిక కనీస వేతనాన్ని నిర్ధారించేందుకు కనీస వేతనాల చట్టాన్ని సవరించనున్నట్లు చెప్పారు. దీనిని సార్వజనీన కనీస వేతనంగా పరిగణిస్తామన్నారు. ‘‘ఒకసారి సవరించిన తర్వాత అది చట్టమవుతుంది. అప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ వేతనాల ప్రమాణాలను వర్తింపజేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్తించే ప్రామాణిక కనీస వేతనం ఏదీ లేనందున.. రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ తరగతుల కార్మికులకు వేతనాలను నిర్ణయించే స్వేచ్ఛ ఉంది. కేంద్రం కనీస వేతనాల చట్టానికి సవరణ చేసి ప్రామాణిక కనీస వేతనాన్ని నిర్ణయించినట్లయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు దానిని అనుసరించాల్సి ఉంటుంది. ‘వేతనాల స్మృతి (కోడ్ ఆన్ వేజెస్)’, పారిశ్రామిక సంబంధాల స్మృతి (కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్) పై త్రైపాక్షిక సమావేశం ముగిసిందని, ఇప్పుడవి కేబినెట్ ఆమోదానికి వెళతాయని, ఆ తర్వాత వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు వస్తాయని దత్తాత్రేయ వెల్లడించారు. -
ఘనంగా దత్తాత్రేయ కుమార్తె నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిశ్చితార్థం ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.జనార్దన్‌రెడ్డి కుమారుడు డాక్టర్ జిగ్నేష్‌తో శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఘనంగా జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంలాల్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, నారుుని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, బి.నర్సయ్యగౌడ్, జేఏసీ చైర్మన్ కోదండరామ్, హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకు ఎదగలేకపోతున్నారు?
- రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం దూత శివప్రకాశ్ ప్రశ్న.. -13 ఎంపీ సీట్లపై దృష్టి సారించాలని కోర్ కమిటీ భేటీలో సూచన - 75 అసెంబ్లీ సీట్లలో గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదిగేందుకు అన్ని అవకాశాలున్నా ఆ దిశలో ఎందుకు ఎదగలేకపోతున్నారని రాష్ర్ట పార్టీ నేతలను బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కోర్‌కమిటీతో సమావేశమైన సందర్భంగా పార్టీ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఉద్యమ కార్యాచరణను రూపొం దించుకోవాలని శివప్రకాశ్ ఆదేశించారు. మరో రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండగా రాష్ట్ర పార్టీలో ఆ చురుకుదనం లోపించడం, పార్టీ కార్యక్రమాల్లో వేగం లేకపోవడంపై నిలదీసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను బీజేపీ పూరించేందుకు స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో 13 ఎంపీ సీట్లపై దృష్టి కేంద్రీకరించాలని, వాటిలో కొన్ని సీట్లనైనా కచ్చితంగా గెలిచేలా చూడాలని సూచించారు. రాష్ర్టంలో 75 అసెంబ్లీ సీట్లను గెలిచేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రపార్టీ 2019 ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కొన్ని తగ్గినా ఆ లోటును కొంతమేర తెలంగాణ నుంచి భర్తీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రం లో పార్టీని బూత్‌స్థాయి నుంచి పటిష్టం చేయాలని, రైతాంగ సమస్యలపై అధిక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్, ఎన్.రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ పాల్గొనగా, ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు హాజరుకాలేదు. జాతీయపార్టీ చెప్పినట్లు నడవకపోతే ముప్పే! తన మూడు రోజుల పర్యటనలో రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీకి సానుకూల పరిస్థితులున్న విషయాన్ని గమనించినట్లు శివప్రకాశ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని రాష్ట్ర నాయకులు తమకు అనుకూలంగా మలచుకునేందుకు కృషి చేయకపోతే ఎలా అని ప్రశ్నిం చారు. జాతీయ నాయకత్వం దిశానిర్దేశం ప్రకారం రాష్ట్ర నాయకులు వ్యవహరించకపోతే లోక్‌సభ నియోజకవర్గాలవారీగా జాతీయపార్టీ ఫుల్‌టైమర్లు రంగంలోకి దిగి పనిని చక్కబెట్టాల్సి ఉంటుందని ఆయన పరోక్ష హెచ్చరికలు జారీచేసినట్లు తెలుస్తోంది. తన పద్ధతిలో జాతీయ నాయకత్వం ఆదేశాలను, సూచనలను రాష్ట్ర నాయకులకు విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, ఇతర సెల్లు ఆయా సామాజిక వర్గాలకు చేరువ కావాలని సూచించారు. త్వరలో రాష్ర్ట కమిటీ ప్రకటన రైతుల సమస్యలపై జిల్లాస్థాయిలో కార్యక్రమాలను ఖరారు చేసుకోవాలని కోర్‌కమిటీ సమావేశం నిర్ణయించింది. పార్టీ పరిశీల కుడు శివప్రకాశ్ రాకకు ముందు జరిగిన ఈ సమావేశంలో ముందుగా రాష్ట్ర కమిటీని త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 10, 15 రోజుల్లో కొత్త జిల్లాల కమిటీలను ప్రకటించి పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని తీర్మానించారు. -
రైతులకు రూ.13 వేల కోట్ల పంట రుణాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని రైతులకు పంట రుణాల రూపంలో రూ.13వేల కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తాజా రబీ సీజన్లో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రైతులు పండించిన పంట దిగుబడులను మార్కెట్‌కు తరలించేందుకు సదుపాయాలు కల్పించడంతో పాటు కనీస మద్దతు ధరపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతుకు ప్రయోజనం కలిగించే ఫసల్ బీమా పథకం కింద రాష్ట్రంలో 25 లక్షల మందికిగాను 8 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ స్వస్థత కార్డులు 31 శాతం మందికే జారీ అయ్యాయని, ఈ ప్రక్రియపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నూనెగింజలు, పప్పుధాన్యాలు ఉత్పత్తిని పెంచాలని, ప్రస్తుతం రూ.40 వేల కోట్ల నూనె, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే శిశు కేటగిరీలో లక్ష్యాలను పెంచి ఎక్కువ మందికి లాభం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. -
ఘనంగా దత్తన్న అలయ్-బలయ్
• ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య • వేడుకలో పాల్గొన్న గవర్నర్, రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు • హాజరుకాని ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా దసరా పండగ మర్నాడు కేంద్ర మంత్రి దత్తాత్రేయ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ‘అలయ్-బలయ్’ కార్యక్రమం ఈ ఏడాదీ ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, కళలు, సాంస్కృతిక రూపాలు, వివిధ రాజకీయ పార్టీలు, వర్గాల ప్రజల మేలుకలయికగా సాగింది. బుధవారం ఇక్కడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు అలయ్ బలయ్‌కి హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పరస్పర మిత్రత్వం, సుహృద్భావం, అనురాగానికి ప్రతీకగా ఆలింగనం చేసుకుని (అలయ్-బలయ్) తమ స్నేహ, సౌభ్రాతృత్వాలను చాటారు. ఉడీ ఉగ్ర దాడిలో మరణించిన 19 మంది జవాన్లకు నివాళిగా కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో వివిధ పార్టీలు, సంఘాలు, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో దత్తన్న అలయ్-బలయ్ ఉపయోగపడిందని, ఈ కార్యక్రమాన్ని, దత్తాత్రేయను విడదీసి చూడలేమని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. హాజరైన ప్రముఖులు... కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు డా.కె.కేశవరావు, డా.బూర నర్సయ్యగౌడ్, సి.మల్లారెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఆ పార్టీ నేతలు మురళీధర్‌రావు, ఎన్. రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, జంగారెడ్డి, బద్ధం బాల్‌రెడ్డి, కె.దిలీప్‌కుమార్, కొండ్రు పుష్పలీల, కర్ణాటక మాజీ ఎంపీ విరూపాక్ష, లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి, జస్టిస్ చంద్రకుమార్, విద్యావేత్త చుక్కా రామయ్య, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి, మంద కృష్ణమాదిగ, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ప్రజా గాయకుడు అంద్శై చుక్కా సత్తయ్య, సినీనటులు శారద, ఆర్. నారాయణమూర్తి, వీసీలు రాజారత్నం, సునయనాసింగ్, మాజీ వీసీ ప్రొ. ఎన్.గోపి, బీఎస్ రాములు, కాళప్ప, ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పరిశ్రమల పునరుద్ధరణకు సహకారం: దత్తాత్రేయ రాష్ర్టంలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు తన వంతు సహకరిస్తానని కేంద్ర మంత్రి దత్తాత్రేయ చెప్పారు.360 వరకు ఫ్యాక్టరీల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కేంద్రం కూడా సహకారం అందించే అవకాశం ఉందన్నారు. బంగారు తెలంగాణ ద్వారా సమ్మిళిత అభివృద్ధికి, అట్టడుగున ఉన్న దళిత బలహీన, ఓబీసీ, మైనారిటీలకు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. పలువురికి సన్మానం వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన పద్మజారెడ్డి, అలేఖ్య పుంజల, కరుణాగోపాల్, రమ్య, జాహ్నవి, హలీంఖాన్, వీసీ రాజారత్నం, మాధవి, బెల్లం మాధవి, బుచ్చిరెడ్డి, అంతర్ముఖుల రమాదేవి తదితరులను ఈ సందర్భంగా జ్ఞాపిక, శాలువాలతో దత్తాత్రేయ సన్మానించారు. విభిన్న సంస్కృతుల సమాహారమే భారత్: వెంకయ్య వివిధ సంస్కృతుల సమాహారమే భారత, హిందూ సంస్కృతి సంప్రదాయాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ‘నీది, నీవు తింటే ప్రకృతి. ఎదుటివాడిది లాక్కుని తింటే వికృతి. పక్కనున్న వాడికే పెడితే సంస్కృతి’ అని చెప్పారు. అలయ్ బలయ్ అంటే అందరూ సుఖ, సంతోషాలతో ఉండటమేనంటూ జై తెలంగాణ, జైహింద్ అని ప్రసంగాన్ని ముగించారు. అలయ్-బలయ్ అంటే కలసిమెలసి, ప్రేమతో మెలగాలని, దాతృత్వ భావనతో ఉండాలని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. 39 రకాల వంటకాలు అలయ్-బలయ్‌లో 39 రకాల వంటకాలను వడ్డించారు. బగార అన్నం, వైట్రైస్తోపాటు మాంసాహారంలో లివర్, మటన్ ఫ్రై, మటన్ పులుసు, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై, రొయ్యలు, వట్టి చేపలు, బొమ్మిడాల పులుసు, శాకాహార విభాగంలో టమాటా కర్రీ, ఆలు ఫ్రై, పచ్చి పులుసు, జొన్న, సజ్జ రొట్టెలు, అంబలి, సకినాలు, గారెలు, మొక్కజొన్న గారెలు, సర్వపిండి, బచ్చాలు, అటుకులు, లడ్డూలు, మొరమొరాలు, చుడువ లాంటి ఎన్నో రకాల వంటకాలు విందులో ఏర్పాటు చేశారు. -
ఘనంగా ప్రారంభమైన అలయ్ బలయ్
-
బతుకమ్మ వేడుకల్లో వెంకయ్య,దత్తాత్రేయ
-
పేదల చెంతకు వైద్యవిద్య
అమీర్‌పేట: నిరుపేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందని కేంద్ర కార్మిక,ఉపాధి కల్పన శాఖమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యకళాశాలలో నూతన విద్యార్థులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐసీ వైద్య కళాశాల ద్వారా కార్మికుల పిల్లలకు తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదివే అవకాశం కల్పించిందన్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాలలోని 100 సీట్లలో కార్మిక కుటుంబాల వారికి 50 సీట్లు, అందులో తెలంగాణ రాష్ట్రంకు చెందిన విద్యార్థులకు కేటాయించామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మెడికల్ కౌన్సిల్ విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కళాశాలకు ప్రథమ బ్యాచ్‌లో చేరిన వైద్య విద్యార్థులు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగంలో టాపర్లుగా నిలిచే వారికి నరేంద్రదత్త వైద్య విద్య ట్రస్టు ద్వారా బంగారు పతకాలు, నగదు అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.త్వరలోప్రధాని వైద్య కళాశాలను సందర్శిస్తారన్నారు. అనంతరం వైద్య విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. -
స్వచ్ఛభారత్‌తో జాతిపితకు నివాళి
చిక్కడపల్లి: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాభారత్ కార్యక్రమయాన్ని జాతిపిత మహాత్మ గాంధీకి నిజమైన నివాళిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. ఆదివారం వివేక్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని శుభ్రంగా ఉంచినప్పుడే ఆరోగ్య సమాజం నిర్మాణమతుందన్నారు. ఇందులో యువత ప్రధాన భూమిక పోషించాలని కోరారు. లక్ష్మణ్ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ఉద్యమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో రఘు, వాణిశ్వర శాస్త్రి, బసవానందం, డాక్టర్ నరేష్‌గౌడ్, ఎంవీఆర్ శాస్త్రి, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మరువలేం
- ఢిల్లీ బతుకమ్మ ఉత్సవాల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ - హాజరైన కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటల సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎ న్నటికీ మర్చిపోలేమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా తొలుత తెలంగాణ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ సంప్రదాయం ప్రకారం.. గౌరమ్మను పూజించి, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను ఎత్తుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తానూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాననీ, ఆనాటి ఉద్యమ రూపాల్ని, ప్రజల స్పందనను గుర్తు చేసుకున్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పండుగలకు, సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రం నిలయమనీ, పంటలన్నీ చేతికొచ్చాక ప్రజలు సంతోషంగా జరుపుకొనే ప్రకృతి పండుగ.. బతుకమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, రాపోలు ఆనంద్ భాస్కర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎస్.వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రతకు త్వరలో చట్టం: దత్తాత్రేయ
- యజమాని మారిన ఉద్యోగ భద్రత లభించేలా చట్టం తీసుకొస్తాం - విశ్వకర్మ జయంతి సందర్భంగా వివిధ రంగ కార్మికులకు సన్మానం సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వరంగంలో మాదిరిగానే ప్రై వేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కంపెనీ యాజమాన్యం మారినా ఉద్యోగులను తొలగించకుండా కొనసాగించేలా నూతన చట్టం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అకస్మాత్తుగా కంపెనీ మూసేయాల్సి వస్తే కార్మికుడు పొందుతున్న వేతనాన్ని మూడురెట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పలు రంగాల్లోని కార్మికులను ఆదివారం ఆర్టీసీ కళాభవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... ఇక నుంచి ప్రతీ ఏటా విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. భారతదేశ మొట్ట మొదటి ఇంజనీరు విశ్వకర్మ జయంతిని.. జాతీయ కార్మికదినోత్సవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశ్వకర్మ తయారు చేసిన పనిముట్ల వల్లే దేశంలో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతోందన్నారు. అందుకే విశ్వకర్మ చేసిన సేవలను ప్రపంచానికి తెలియజేయాలని తమ ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ కార్మికదినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తాము ముఖ్యంగా కార్మికులకు సంబంధించి మూడు అంశాల మీద దృష్టిసారించినట్లు దత్తాత్రేయ వివరించారు. ఉద్యోగ, సామాజి, ఆర్థిక భద్రత కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే నైపుణ్యరహిత కార్మికుల దినసరి వేతనాన్ని రూ.160 నుంచి 350కి పెంచామన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులకు నెలకు రూ.22వేలు చెల్లించేలా చట్టం తీసుకొచ్చామన్నారు. ముద్రబ్యాంకు ద్వారా కార్మికులకు రుణాలు కల్పించి... యజమానిగా మారేందుకు దోహదం చేస్తున్నట్లు వివరించారు. ముద్ర బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు రూ.1.80లక్షల కోట్ల రుణాలు అందజేసినట్లు పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. 2022 నాటికి దేశంలోని కార్మికులందరికీ గృహవసతి కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదివేల బీడీ కార్మికులకు ఇళ్లు కట్టించడానికి కార్మికశాఖ సిద్ధంగా ఉందన్నారు. అలాగే కార్మికుల హక్కుల కోసం ప్రస్తుతం ఉన్న 44 చట్టాలను నాలుగు కోడ్స్‌గా విభజించనున్నట్లు తెలిపారు. దీని వల్ల కార్మికుల హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లదని దత్తాత్రేయ చెప్పారు. వేతనబోర్డు, ఇండస్ట్రియల్ రిలేషన్స్(ఐ.ఆర్), సామాజిక భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ అంశాల విభాగాల ఆధారంగా కార్మిక చట్టాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కార్మికశాఖ అధికారులు, నేతలు పాల్గొన్నారు. -
‘ఉక్కు మనిషి’ విగ్రహావిష్కరణ
ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రామంతాపూర్ ప్రధాన రహదారిలో కేంద్రమంత్రి దత్తాత్రేయ ఆవిష్కరిస్తారని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. శనివారం ఉదయం 6.30 గంటలకు విగ్రహావిష్కరణ అనంతరం 5000 మందితో తిరంగా యాత్రను మంత్రి ప్రారంభిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. -
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఆలేరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆలేరులో తిరంగయాత్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. నిజాం నాటి ఉద్యమకారుల త్యాగాలు, చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని ఎన్నికలకు ముందు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. తీరా పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 17న విమోచన దినోత్సవ వేడుకలకు హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు జాతీయ బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా హాజరవుతున్నందున నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. కాసం వెంకటేశ్వర్లు, తునికి దశరధ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఆలేరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆలేరులో తిరంగయాత్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. నిజాం నాటి ఉద్యమకారుల త్యాగాలు, చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని ఎన్నికలకు ముందు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. తీరా పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 17న విమోచన దినోత్సవ వేడుకలకు హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు జాతీయ బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా హాజరవుతున్నందున నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. కాసం వెంకటేశ్వర్లు, తునికి దశరధ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐ వేతన పరిమితి 21 వేలు
-
ఈఎస్ఐ వేతన పరిమితి 21 వేలు
కొత్తగా 50 లక్షల మంది కార్మికులకు చోటు: దత్తాత్రేయ - ఆరోగ్య బీమా ప్రవేశ పరిమితి రూ. 21 వేలకు పెంపు న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ (ఈఎస్ఐసీ) తన ఆరోగ్య బీమాను మరింత సంఘటితం చేసేందుకు.. బీమాలో చేరటానికి నెల వారీ వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 15,000 నుండి రూ. 21,000కు పెంచాలని నిర్ణయింది. ఈ విషయాన్ని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఢిల్లీలో ఈఎస్ఐసీ బోర్డు భేటీ అనంతరం పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈఎస్ఐసీ బోర్డుకు కార్మికమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బోర్డు భేటీలో ఈఎస్ఐసీ వేతన పరిమితిని రూ. 25,000 కు పెంచాలని సంస్థ ప్రతిపాదించినప్పటికీ.. రూ. 21,000 గా నిర్ణయించింది. ధరల పెరుగుదల, వేతనాల పెంపును దృష్టిలో పెట్టుకుని ఈ పెంపు చేపట్టామని.. ఇది 50 లక్షల మంది కార్మికులను ఈఎస్ఐసీకి కలిపేందుకు దోహదపడుతుందని దత్తాత్రేయ చెప్పారు. ఒక్కో ఉద్యోగి నలుగురు సభ్యుల కుటుంబమని భావించినట్లయితే.. రెండు కోట్ల మంది ప్రజలు కొత్తగా ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ సంస్థలో 2.6 కోట్ల మంది బీమా కార్మికులు ఉన్నారు. పది కోట్ల మందికి పైగా ప్రజలకు ఆరోగ్య బీమా కవరేజీ అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయేతర నైపుణ్యంలేని కార్మికుల కనీస వేతనాన్ని 42 శాతం మేర పెంచి రోజుకు రూ. 350 చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈఎస్ఐసీ వేతన పరిమితిని 40 శాతం పెంచింది. ఈఎస్ఐసీకి ఉద్యోగ సంస్థ కార్మికుని వేతనంలో 4.7 శాతాన్ని చందాగా అందించాల్సి ఉంటుంది. కార్మికుల వేతనం నుంచి 1.75 శాతం ఈఎస్ఐసీ చందా చెల్లించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయం ప్రకారం.. నెలకు రూ. 21,000 వరకూ వేతనం పొందుతున్న కార్మికులు అనారోగ్యం, ప్రసూతి, వైకల్యం, పనిలో గాయాల వల్ల మరణం వంటి కేసులకు చికిత్స పొందేందుకు అర్హులు. అలాగే పదవీ విరమణ నిధి సంస్థ అయిన ఈపీఎఫ్ఓ ఖాతాదారులకూ వేతన పరిమితిని పెంచాలన్న ప్రణాళిక ఉందని.. సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తదుపరి సమావేశంలో దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చునని దత్తాత్రేయ తెలిపారు. కాగా టెలీమెడిసిన్ తొలి దశను దత్తాత్రేయ మంగళవారం ప్రారంభించారు. -
తెలంగాణలో పోటెత్తిన భక్తజనం
-
పోటెత్తిన భక్తజనం
తొమ్మిదో రోజు.. 34 లక్షలు - ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 28 లక్షల మంది పుణ్యస్నానాలు - నల్లగొండ జిల్లాలో 6 లక్షల మంది.. - గొందిమళ్లలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి దత్తాత్రేయ స్నానాలు - మరో మూడ్రోజులే ఉండటంతో పెద్ద ఎత్తున వస్తున్న జనం సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్ /నల్లగొండ: వరుసగా తొమ్మిదో రోజూ పుష్కర ఘాట్లు భక్తజనంతో నిండిపోయాయి. పుష్కరాల ముగింపునకు మరో మూడ్రోజులే ఉండటంతో భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్కరోజే 34 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 28 లక్షలకుపైగా, నల్లగొండ జిల్లాలో సుమారు 6 లక్షల మంది స్నానాలు చేశారు. వీఐపీలు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు. పాలమూరు ఘాట్లు కిటకిట.. మహబూబ్‌నగర్ జిల్లాలోని సోమశిల, బీచుపల్లి, రంగాపూర్, గొందిమళ్ల, అలంపూర్, నంది అగ్రహారం, పస్పుల, కృష్ణ, పంచదేవ్పాడు, పాతాళగంగ ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. సోమశిలలో 7.3 లక్షలు, రంగాపూర్‌లో 6.4 లక్షలు, బీచుపల్లిలో రూ.4.4 లక్షలు, గొందిమళ్లలో 1.58 లక్షలు, నంది అగ్రహారంలో 1.44 లక్షలు, కృష్ణ పుష్కరఘాట్‌లో లక్షకుపైగా పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ఘాట్లలో శనివారం నీటిమట్టం తగ్గినా భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్-కర్నూలు ప్రధాన రహదారిపై భూత్పూర్ వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కొల్లాపూర్, సోమశిల మధ్యలో సైతం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో కర్నూలు, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. మొత్తంగా జిల్లాలో 28 లక్షల మందికి పైగా స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. సాగునీటి వనరుల పెంపు అభినందనీయం సాగునీటి వనరులను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని, అందరికీ ఆహార భద్రత కల్పించాలన్న మౌలిక లక్ష్యం ఇందులో దాగి ఉందని గవర్నర్ ఈఎల్ నరసింహన్ అన్నారు. గొందిమళ్లలో పుష్కరస్నానం అనంతరం ఆయన టూరిజం అతిథి గృహం లో విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రభుత్వాలైనా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తాయని, వారు చేసే సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల చేయూత అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. బాలికా శిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని రేపటి భవిష్యత్తంతా బాలబాలికలదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రజల ప్రయోజనానికే అన్న అంశాన్ని ప్రజలకు తెలియజేసే బాధ్యత మీడియాపై ఉందన్నారు. ప్రభుత్వ పథకాల్లో జరిగే లోపాలను ఎత్తిచూపడం సమంజసమే అయినా అవి సహేతుకంగా, సలహాపూరితంగా ఉంటే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాలను రెండు తెలుగు రాష్ట్రాలు సమర్థంగా నిర్వహించాయని, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అత్యద్భుత దేవాలయాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయని వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తాను సీఎంకు జోగుళాంబ టెంపుల్ టూరిజం ఆవశ్యకతను వివరిస్తానన్నారు. నల్లగొండలో జనజాతర నల్లగొండ జిల్లాలో వరుసగా రెండోరోజు పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం పర్వదినం రోజున జిల్లాలో ఆరు లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా.. శనివారం కూడా అదే సంఖ్యలో భక్తులు స్నానాలు చేశారు. జిల్లాలోని మట్టపల్లి క్షేత్రం భక్తులతో కళకళలాడింది. శనివారం ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య లక్ష దాటింది. నాగార్జునసాగర్ అయితే భక్తులతో పోటెత్తింది. సాగర్‌తో పాటు పక్కనే ఉన్న ఊట్లపల్లి ఘాట్‌లో కలిపి మొత్తం 2 లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు చేశారు. వాడపల్లిలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య లక్ష దాటింది. జిల్లాలోని ఇతర ఘాట్లలో కనగల్ మండలం దర్వేశిపురానికి 60 వేల మంది భక్తులు రాగా.. పానగల్, కాచరాజుపల్లి, మహంకాళిగూడెం, అడవిదేవులపల్లి ఘాట్లలో పదివేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మొత్తంమీద జిల్లాలోని 28 ఘాట్లు కలిపి ఆరు లక్షల మంది దాటి ఉంటారని అంచనా. గవర్నర్ స్వీయ సంకల్పం గవర్నర్ నరసింహన్ శనివారం మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్‌లో సతీసమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయలుదేరిన గవర్నర్ ఉదయం 10 గంటలకు గొందిమళ్లకు చేరుకున్నారు. అనంతరం అక్కడి వీఐపీ ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించి, కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర పెట్టారు. స్నాన సంకల్పంలో భాగంగా అర్చక స్వామి సంకల్పం చెబుతుండగా ‘కృష్ణా నదీ ఉత్తరాయనే..’ అని పఠించారు. వెంటనే గవర్నర్ కలుగజేసుకొని ‘కాదు..’ అంటూ ‘దక్షిణాయనే వర్షరుతౌ.. శ్రావణ మాసే..’ అంటూ తమ గోత్రనామాలు చెబుతూ సంకల్పాన్ని పూర్తి చేశారు. స్నానానంతరం శ్రీ బాలబ్రహ్మేశ్వరుడి ఆలయంలో సైతం తానే స్వయంగా పురుష సూక్తం చెబుతూ అభిషేకం చేశారు. ఒకవైపు సమయం పడుతుండటంతో భద్రతాధికారులు త్వరగా ముగించమంటూ అర్చక స్వాములకు సంకేతం ఇచ్చారు. దీంతో అర్చక స్వాములు పురుష సూక్తాన్ని సూక్ష్మంగా ముగించే ప్రయత్నం చేయగా.. గవర్నర్ పురుష సూక్తాన్ని గడగడా పఠిస్తుండటంతో చేసేది లేక అర్చకులు మంత్రాలు పూర్తిగా పఠించాల్సి వచ్చింది. అత్యంత నిష్ఠగా పూజలో ఎక్కడా లోపం లేకుండా గవర్నర్ మంత్రాలు చెప్పడంతో అక్కడున్న అర్చక స్వాములు ఆశ్చర్యపోయారు. అనంతరం గవర్నర్ హెలికాప్టర్ ద్వారా అలంపూర్‌లోని మాంటిస్సోరి పాఠశాల హెలిపాడ్‌కు చేరుకున్నారు. హరిత విశ్రాంతి భవనంలో కొద్దిసేపు ఆగి తర్వాత అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించుకుని హైదరాబాద్‌కు వెళ్లారు. పెరిగిన వీఐపీల తాకిడి కేంద్రమంత్రి దత్తాత్రేయ గొందిమళ్ల పుష్కరఘాట్‌లో పుణ్యస్నానమాచరించి, అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించి ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం రంగాపూర్ పుష్కరఘాట్‌ను సందర్శించారు. క్యాతూర్లోని పుష్కరఘాట్‌లో సినీ నటుడు, ఎమ్మెల్యే బాబు మోహన్ పుణ్యస్నానం చేశారు. మాజీ మంత్రి మా దాల జానకిరాం ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ గొందిమళ్లలో స్నానాలు చేశారు. సినీ నటుడు చం ద్రమోహన్ సోమశిల పుష్కరఘాట్‌ను దర్శించారు. అయితే అక్కడ నీటిమట్టం తక్కువగా ఉండడంతో సమీపంలోని మంచాలకట్ట ఘాట్‌కు వెళ్లి పుణ్యస్నానం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మంచాలకట్టలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి, వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు సోమశిల ఘాట్‌ను సందర్శించి పుణ్యస్నానం ఆచరించారు. రంగాపూర్ ఘాట్‌లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి ముత్యంరెడ్డి తదితరులు పుణ్యస్నానం ఆచరించారు. నల్లగొండ జిల్లా వాడపల్లిలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే బాపూరావ్ రాథోడ్, గుంటూరు రైల్వే రీజినల్ మేనేజర్ విజయవర్మ, ఇర్కిగూడెంలో రిటైర్డ్ ఎస్పీ వెంకట్‌రెడి, మట్టపల్లి ప్రహ్లాద ఘాట్‌లో తమిళనాడులోని మదురై కోర్టు జడ్జి రామ్మోహన్రావు పుష్కర స్నానాలు ఆచరించారు. కేసీఆర్ గురువు మృత్యుంజయశర్మ వాడపల్లి శివాలయంలో పూజలు నిర్వహించారు. అడవిదేవులపల్లి ఘాట్‌లో ఎమ్మెల్యే భాస్కర్‌రావు కుటుంబ సభ్యులతో స్నానాలు చేశారు. -
భావోద్వేగానికి గురైన మంద కృష్ణ
న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్ వద్ద జరిగిన మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడికి పాదాభివందనం చేసిన మంద కృష్ణ ధర్నాలో భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమంలోని ఆటుపోట్లను, కుట్రలను ఆయన వివరించారు. ‘తినడానికి తిండిలేని జాతి. ప్రయాణానికి ఖర్చులు లేని జాతి. ఎన్ని త్యాగాలు చేస్తే ఎన్ని బాధలు భరిస్తే ఈరోజు ఢిల్లీకి వేలాదిగా తరలిరాగలిగిందో అర్థం చేసుకోవాలి. మాదిగ జాతి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీదే.. మీరు వర్గీకరణకు సహకరించి మాకు మరో అంబేడ్కర్‌గా నిలవాలి..’ అంటూ వెంకయ్య నాయుడికి విన్నవించారు. వర్గీకరణపై ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తా: వెంకయ్య షెడ్యూలు కులాల వర్గీకరణ దిశగా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. మహాధర్నాకు హాజరైన వెంకయ్య నాయుడు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాన మంత్రికి వివరించినట్టు తెలిపారు. ‘మీ కోరిక అసాధారణమైనది కాదు. అన్యాయమైనదీ కాదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాల్సిందే. వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలతో ఈ అంశం మాట్లాడాను. అందరూ ఈ డిమాండ్ సహేతుకమని అన్నారు. వర్గీకరణపై అధ్యయనం జరుగుతోంది. ఒకసారి అడుగు ముందుకు పడితే మళ్లీ వెనక్కి రావడం ఉండదు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. దళితులపై దాడులు, ఇతర సమస్యలను రాజకీయ కోణంలో చూడకండి. ఇది సామాజిక రుగ్మత. కులాలను ఓటు బ్యాంకుగా చూడరాదు. సమాజంలో వెనకబడి, ఆఖరి వరుసలో ఉన్న వారిని ముందు పైకి తేవాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టడం సాధ్యం కాదు. నేను ఉత్తుత్తి హామీలు ఇవ్వను. ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని పార్టీలతో చర్చిస్తున్నాం. రాజకీయాలకతీతంగా వర్గీకరణ జరిగి తీరుతుందని నాకు నమ్మకం ఉంది..’ అని పేర్కొన్నారు. వర్గీకరణ వల్ల దళితుల్లోని 59 కులాలకు మేలు జరుగుతుందని, దీన్ని గ్రహించి మాలలు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. మావంతు ప్రయత్నం చేస్తాం... కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ‘ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. ఎస్సీ వర్గీకరణ కోసం మావంతు ప్రయత్నం చేస్తాం. ఈ విషయమై ప్రధానితో మాట్లాడుతాను. యూపీఏ హయాంలో వర్గీకరణకు అనుకూలంగా ఉషామెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చినా వర్గీకరించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది. ఢిల్లీ గడ్డపై ఎవరూ సాహసించని, ఎవరూ చేయని దీక్షలు ఎమ్మార్పీఎస్ చేయగలిగింది.. ఈ దీక్షలు ఫలితాన్ని ఇస్తాయి..’ అని పేర్కొన్నారు. మాదిగలకు మంద కృష్ణ మాదిగ దేవుడిచ్చిన వరమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కొనియాడారు. వర్గీకరణ చేస్తే బీజేపీ వెంట నిలబడతామని హర్యానా వర్గీకరణ ఉద్యమ నేత స్వదేశ్ కబీర్ పేర్కొన్నారు. వర్గీకరణతోనే మాదిగలకు స్వాతంత్య్రం లభిస్తుందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ మహాధర్నాకు ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగాటి సత్యం సభాధ్యక్షత వహించగా జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు, నేతలు మందకుమార్, నాగయ్య, బ్రహ్మయ్య, బి.ఎన్.రమేశ్, కోళ్ల వెంకటేశ్, తీగల ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'నాయకులు వస్తారు.. పోతారు'
మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ పథకం ప్రారంభం సందర్భంగా కోమటిబండలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో దత్తాత్రేయ ప్రారంభ ఉపన్యాసం చేశారు. మొదటిసారి తెలంగాణకు ప్రధాని మోదీ రావడం చాలా సంతోషంగా ఉందని దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రజలకు కష్టపడే పనిచేసే సత్తా ఉంటుందని, కల్లా కపటం తెలియన వారని చెప్పారు. రాష్ట్రాలు భాగాలు అయితే, కేంద్రం అనేది తలకాయలాంటిదనే ఇవి రెండు సమన్వయంతోనే పనిచేస్తేనే మనుగడ సాధ్యం అని అన్నారు. ఒక చాయ్ అమ్మిన వ్యక్తి ప్రధానిగా మారాడంటే అది భారత దేశ, భారత ప్రజల గొప్పతనమే అని దత్తాత్రేయ చెప్పారు. నాయకులు వస్తుంటారు పోతుంటారని, కానీ ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉంటారని, వారి శ్రేయస్సే ముఖ్యం అని దత్తాత్రేయ చెప్పారు. అలా ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా నమ్మి పనిచేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. -
మోదీ అంటే సంతోషాన్ని ఇచ్చేవారు
-
ప్రధాని పర్యటన రాష్ట్రానికి వరం
రాష్ట్రానికి రూ.17,011 కోట్ల ‘కేంద్ర’ ప్రాజెక్టులు: దత్తాత్రేయ హైదరాబాద్: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ నెల 7న తెలంగాణలో నిర్వహించనున్న తొలి పర్యటనలో రాష్ట్రాభివృద్ధి కోసం రూ.17,011 కోట్ల విలువ చేసే వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పనులకు శంకుస్థాపన చేస్తారని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి వరం అని, రాష్ట్రాభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని అన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం ఇక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.5,250 కోట్ల వ్యయంతో రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. 12.7 మెట్రిక్ టన్నుల వార్షిక యూరియా ఉత్పత్తి చేయనున్న ఈ కర్మాగారం 2018-19లోగా నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. గ్యాస్ ఆధారంగా నడిచే ఈ కర్మాగారం కోసం విజయవాడలోని మల్లవరం నుంచి రామగుండం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని 2018లోగా పూర్తి చేస్తామన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ల నుంచి ఈ పరిశ్రమకు గ్యాస్ కేటాయింపులను కేంద్రం జరిపిందన్నారు. అదే విధంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 1,600(2‘800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.10,599 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2020 నాటికి పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 85 శాతం విద్యుత్‌ను కేంద్రం తెలంగాణకు కేటాయించిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.1,161 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు రైల్వే రవాణా పరంగా అనుసంధానం అవుతాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 1,275 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉందన్నారు. వరంగల్‌కు మంజూరు చేసిన టెక్స్టైల్స్ పార్కు పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. కేంద్రంలోని ఏ ప్రభుత్వం వల్లా జరగని ప్రయోజనం ప్రధాని మోదీ పర్యటన వల్ల రాష్ట్రానికి జరగబోతోందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, తాము మాత్రం ఈ ప్రాజెక్టులన్నింటినీ కట్టి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్టులు సత్వరంగా పూర్తికావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భూసేకరణ, కేంద్ర నిధుల వినియోగం తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. మహా సమ్మేళనంపై మోదీ ఆరా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనం వివరాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలసి పర్యటన వివరాలను తెలియజేయగా... పార్టీ కార్యకర్తల సమావేశంపై ప్రధాని ఆసక్తి చూపారన్నారు. ఈ పర్యటనతో రాష్ట్రంలో బీజేపీకి నూతనోత్సాహం వస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
కనీస వేతనం 10 వేల కన్నా ఎక్కువే
♦ హోం, కార్మిక మంత్రి నాయిని ♦ కేంద్రం ప్రకటించిన దానికంటే ఎక్కువ ఉండేలా చూస్తాం ♦ ఘనంగా మేడే వేడుకలు,పలువురికి అవార్డుల ప్రదానం సాక్షి, హైదరాబాద్: ‘‘దేశ వ్యాప్తంగా కనీస వేతనం రూ.10 వేలు ఉండేలా చట్టం చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. కానీ తెలంగాణలో కేంద్రం నిర్దేశించిన దాని కంటే అదనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కనీస వేతనం రూ.10 వేల కంటే ఎక్కువగనే ఉంటది. మేడే సందర్భంగానే దీనిని ప్రకటించాలనుకున్నాం. కానీ అధికారుల బదిలీల కారణంగా సాధ్యం కాలేదు. ఈ నెలాఖరులోగా తీపి కబురు వింటరు’’ అని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. మేడే వేడుకలను పురస్కరించుకుని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాయిని ప్రసంగించారు. దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రంలోనే కనీస వేతనం మెరుగ్గా ఉండేలా చూస్తున్నామని, ఇప్పటికే కంపెనీ యాజమాన్యాలు, ట్రేడ్ యూనియన్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, ఈ నెలాఖరు లోగా తుది నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతిని, సంక్షేమ రంగం మీదనే రూ.35 వేల కోట్లు ఖర్చుపెడుతోంద న్నారు. కార్మికుల ప్రమాద బీమాను మేడే సందర్భంగా రూ.5 లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచినట్లు చెప్పారు. కార్మికుల ఆరోగ్యం, భద్రత, నైపుణ్యం పెంపొందించేందుకు రూ.10 కోట్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన పేపర్ మిల్లును తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అలాగే వరంగల్‌లో మూతపడిన పేపర్‌మిల్లును కూడా తెరిపిస్తామన్నారు. మేడే సందర్భంగా కార్మికులు దీక్షాదివస్‌కు పూనుకోవాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కాంట్రాక్టు ఎబాలిషన్ బోర్డును రద్దు చేసి కార్మికుల హక్కులను కాలరాశారని ఎమ్మెల్సీ రాములు నాయక్ దుయ్యబట్టారు. కాంట్రాక్టు ఎబాలిషన్ బోర్డును తీసుకొచ్చి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కాగా, మేడే వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్, శ్రమశక్తి అవార్డులను అందజేసింది. శ్రమశక్తి అవార్డు గ్రహీతలు.. కె.శ్రీనివాస్(సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూరు), బి.వెంకటేశం(ఎస్సీసీఎల్), మిరియాల రాజు రెడ్డి, ఇ.ఆగయ్య, కనకం శాంసన్, ఎం.శ్రీనివాసరావు, ఎండీ ప్యారేమియా(తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం), ఎం.రాజయ్య(హెచ్ఎంఎస్), ఇ.శ్రీధర్(టీఎస్ఈఈ), జె.జగన్నాథరావు(ఎస్పీపీ ఎంప్లాయిస్), వి.వరప్రసాదరెడ్డి(టీఆర్టీయూసీ), పి.జీవన్‌రావు (తెలంగాణ ఎన్టీపీసీ ఎంప్లాయిస్), వి.దానకర్ణాచారి (భారత్ డైనమిక్ తెలంగాణ ఎంప్లాయిస్), బీజే థామ్సన్(వీఎస్టీ వర్కర్), కె.ఐలయ్య(భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం), ఎస్.పద్మశ్రీ(హెచ్ఎంఎస్), పి.రాములు(ఎంఆర్ఎఫ్ వర్కర్), జి.రాంబాబు, బి.విజయలక్ష్మీ, వేముల మరయ్య(టీఆర్ఎస్ కేవీ), బీఆర్ సుబ్రమణ్యరావు(టీఎన్టీయూసీ), ఎన్.మహేశ్వర్‌రెడ్డి(డా.రెడ్డీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎంప్లాయి), రూప్‌చంద్(తెలంగాణ షాపు ఎంప్లాయిస్ ఫెడరేషన్), ఐ.శ్రీనివాసరావు, కొండా మనోహర్ (హెచ్ఎంఎస్), ఎంఏ వజీర్ (తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయి), వి.శ్రీనివాస్(తెలంగాణ బీడీ వర్కర్స్) జె.అశోక్(తెలంగాణ ఫుడ్స్ అండ్ ఎంప్లాయిస్ స్టాఫ్), సీహెచ్ శంకర్(టీ-ఎలక్ట్రిసిటి ఎంప్లాయి) సింగరేణికి బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 60.04 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 15 శాతం వృద్ధిరేటుతో జాతీయ బొగ్గు రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది. బొగ్గు రవాణాలోనూ అగ్రస్థానంలో నిలిచి రికార్డులను తిరగరాసింది. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాల అమలు, పారిశ్రామిక సంబంధాల విషయంలో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ చూపిన చొరవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డునిచ్చింది. మంత్రి నాయిని చేతుల మీదుగా శ్రీధర్ అవార్డు అందుకున్నారు. సింగరేణీయుల సహకారంవల్లే సంస్థ అభివృద్ధి సాధ్యమైందని ఈ సందర్భంగా ఆయనన్నారు. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్స్.. 1.సింగరేణి కాలరీస్ కో-లిమిటెడ్(ఎన్.శ్రీధర్, ఐఏఎస్), 2. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్(ఎన్.నారాయణరెడ్డి),3.మై హోం ఇండ్రస్ట్రీస్ ప్రై లిమిటెడ్(జె.రంజీత్ రావ్), 4.మిహీంద్రా అండ్ మహీద్రా(వీఎస్ రమణ, కేబీఎన్ రావు), 5.ఎంఆర్ఎఫ్(మైఖేల్ రబేరో), 6.పెన్నార్ (జె.నిరుపేందర్ రావు), 7.వీఎస్టీ ఇండస్ట్రీస్(ఎన్.సాయిశంకర్), 8.కిర్బీ బిల్డింగ్ సిస్టం (బి.సదానంద్, డి.రాజు) 9. టీజీఎన్ ఇండస్ట్రీస్(ఎంకే పటౌడియా), 10.హెచ్‌ఎస్‌ఐఎస్ లిమిటెడ్(డి.అరుణ్ కుమార్), 11.వసుధ ఫార్మా(ఎం.ఆనంద్), 12. ఐటీసీ లిమిటెడ్(ఎం.మురళీధర్) -
కార్మిక శాఖలో సంస్కరణలు: దత్తాత్రేయ
హైదరాబాద్: కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రెండు రోజులపాటు సాగే ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్(ఏఐఎస్బీఐఎస్ఎఫ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్(ఎస్‌బీఐఎస్‌యూ) ైెహ దరాబాద్ సర్కిల్ సర్వసభ్య సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. 1925, 1948, 1949లో రూపొందించిన కార్మిక చట్టాలే ఇప్పటికీ అమలులో ఉన్నాయని, వాటిని మార్చాలని కేంద్రం భావిస్తోందన్నారు. ప్రధానంగా ప్రజల, దేశ సంక్షేమం కోరే సంస్థల్లో పనిచేసే కార్మికులందరినీ ఒక కుటుంబంగా పరిగణిస్తూ ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్నామన్నారు. ఉద్యోగినుల మెటర్నిటీ సెలవులు 12 వారాల నుంచి 28 వారాలకు పెంచాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ సీసీ ముంబై డీఎండీ, సీడీవో అశ్వినీ మెహ్రా, యూఎన్ఐ గ్లోబల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఫిలిప్ జెన్నింగ్స్, ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ హరిదయాళ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దత్తాత్రేయకు ఏం తెలుసు...?
- కేంద్రం నుంచి కరువు నిధులు పూర్తి స్థాయిలో రాలేదన్న నాయిని హైదరాబాద్ కేంద్ర నుంచి కరవు నిధులు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రాలేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. కరవు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో దత్తాత్రేయకు ఎలా తెలుస్తుందని, ఆయన ఢిల్లీ, హైదరాబాద్ మధ్య తిరుగుతుంటాడని ఎద్దేవా చేశారు. సోమవారం మంత్రి నాయిని హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. తాను రాజ్యసభలో రేసులో లేనని స్పష్టం చేశారు. మంత్రి పదవిలో కొనసాగించినంత కాలం ఉంటానని, అధినేత ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధమన్నారు. ఈ నెల 27న ఖమ్మం పట్టణంలో జరగనున్న టీఆర్ఎస్ 15న ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి 500 మందికి పైగా ప్రజాప్రతినిధులు వెళ్లనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రానున్నారని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లీనరీలో చర్చిస్తామని వివరించారు. సీఎం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లోకి వస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు కార్మికులకు స్థిర వేతనం కల్పించేందుకు చట్టం చేయబోతున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఇకపై వారి కనీస వేతనం పదివేల రూపాయలు గా ఉండేందుకు చట్టం రూపొందించామని చెప్పారు. దేశం మొత్తం కార్మికులకు ఒకే రకమైన వేతనం ఉండేలా చూసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. ఇందుకోసం కాంట్రాక్టు కార్మికుల చట్టంలో 25 మార్పులను చేయబోతున్నట్టు చెప్పారు. ఈ చట్టం రూపొందించే విషయంలో ప్రతిపక్షాలు సహకరించడం లేదని విమర్శించారు. పార్లమెంటు సరిగా పని చేయని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక చట్టమే మార్గమన్నారు. కేంద్ర న్యాయశాఖకు పరిశీలనకు ఫైలును పంపినట్టు తెలిపారు. ప్రతి కాంట్రాక్టర్ కార్మిక శాఖ దగ్గర తప్పకుండా రిజిష్ట్రేన్ చేయించుకోవాలని మంత్రి చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల ఆధారంగా వేతనం, కరువు భత్యం(డీఏ) ఉండాలని సుప్రీ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈచట్టం అమల్లోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నలక్ష మంది పారిశుధ్య కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. దేశ వ్యాప్తంగా కోట్లమంది కార్మికులు లబ్ధి పొందుతారు. -
కేంద్ర మంత్రులతో దత్తాత్రేయ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, బీరేంద్ర సింగ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం దత్తాత్రేయ.. వీరిద్దరినీ కలసి తెలంగాణలో కరువు పరిశీలనకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని కోరారు. తాగునీరు, పశుగ్రాసానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని దత్తాత్రేయ కోరారు. కేంద్ర ప్రభుత్వం కరువు నిధులు మంజూరు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయలేదని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. 319 కోట్ల రూపాయల కరువు నిధులు ఖర్చు చేయలేదని వివరించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను కరువు ప్రాంతాల్లో యుద్ధప్రతిపాదకన నిధులు ఖర్చు చేయాలని, తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. -
కష్టపడి గెలవడం నరేంద్ర నుంచి నేర్చుకోవాలి
కేంద్ర మాజీ మంత్రి వర్ధంతి కార్యక్రమంలో దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కష్టపడి ఎలా గెలవాలో ఆలె నరేంద్రను చూసి నేర్చుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర వర్థంతి కార్యక్రమం శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఆలె నరేంద్ర కుటుంబసభ్యులు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్తో, బీజేపీతో నరేంద్రకు ఉన్న అనుబంధం, పార్టీ కార్యకర్తల కోసం ఆయన చేసిన కృషిని నేతలు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరగడానికి ఆలె నరేంద్ర ఆద్యుడని దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కొనియాడారు. సహజంగానే బీజేపీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉంటాయని... ఈ పరిస్థితిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలంటే కష్టపడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా లక్ష్మణ్
పార్టీ నాయకత్వం ప్రకటన సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కె.లక్ష్మణ్‌ను నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం శుక్రవారం ప్రకటన చేసింది. ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్షానికి నాయకత్వం వహిస్తున్న లక్ష్మణ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది. పార్టీ అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్యనేతలు పోటీ పడినా సీనియారిటీ, అంకితభావాన్ని ప్రాతిపదికగా చేసుకుని లక్ష్మణ్ వైపు జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది. ఇప్పటిదాకా పార్టీకి రాష్ట్ర సారథులుగా రాజధాని హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువకాలం పనిచేశారు. ఈసారైనా గ్రామీణ ప్రాంతానికి చెందిన నాయకులకు అవకాశం ఇవ్వాలని జిల్లాల నేతలు పట్టుబట్టారు. 2019 ఎన్నికలను నడిపించాల్సిన ముఖ్యమైన బాధ్యతను దృష్టిలో పెట్టుకుని, పార్టీని తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బలోపేతం చేసే బాధ్యతను లక్ష్మణ్‌పై జాతీయ నాయకత్వం పెట్టింది. దీనితో జిల్లాలకు చెందిన కొందరు నేతలు నిరాశకు గురయ్యారు. లక్ష్మణ్ నేపథ్యం ఇదీ.. డాక్టర్ కె.లక్ష్మణ్ హైదరాబాద్ నగరానికి చెందిన ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీ సైన్స్ కాలేజీ విద్యార్థి యూనియన్‌కు 1978-80 మధ్యకాలంలో ఎన్నికయ్యారు. 1982-86 మధ్యకాలంలో రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జియాలజీలో డాక్టరేట్ తీసుకున్నారు. 1980లో బీజేపీలో చేరిన లక్ష్మణ్ పార్టీ హైదరాబాద్ శాఖకు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశారు. రాష్ట్ర పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగానూ సేవలందించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా 2010-2013 మధ్యకాలంలో పనిచేశారు. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 1994 నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా పోటీ చేస్తున్నారు. 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. పార్టీలో సీనియర్‌గా, ప్రజాప్రతినిధిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన నాయకునిగా లక్ష్మణ్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది. దత్తాత్రేయ హర్షం డాక్టర్ కె.లక్ష్మణ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం సంతోషదాయకమని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. లక్ష్మణ్ నాయకత్వంలో పార్టీ బలంగా ఎదుగుతుందనే విశ్వాసముందన్నారు. అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణులు లక్ష్మణ్‌కు సహకరించాలని దత్తాత్రేయ కోరారు. -
'టీఆర్ఎస్కు మేమే ప్రత్యామ్నాయం'
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. 2019లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా విభజన హామీలు నెరవేరుస్తుందని చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని అన్నారు. కరువు చర్యల్లో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. -
వాడుకలో లేని పీఎఫ్లకూ వడ్డీ
- కార్మికులు మూడు రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు: దత్తాత్రేయ - కనీస వేతన సవరణ బిల్లుకు విపక్షాలే అడ్డు సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వాడుకలో లేని భవిష్యనిధి ఖాతాల నిధులకు వడ్డీ చెల్లింపులు ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. 9.23 కోట్ల మంది కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాడుకలో లేని ఖాతాలంటూ యూపీఏ ప్రభుత్వం 2011 నుంచి వడ్డీ చెల్లింపులు నిలిపేసిందని, కానీ వాటన్నింటికీ వడ్డీని తిరిగి వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వివరించారు. అలాగే కార్మికులు తమ పీఎఫ్ క్లెయిమ్స్ విషయంలో ఎవరి మీద ఆధారపడకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబర్)ను ఆధార్‌తో బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయడం ద్వారా కేవలం మూడు రోజుల్లోనే పీఎఫ్ నిధులు సెటిల్మెంట్ చేసుకోవచ్చన్నారు. యూఏఎన్ అనుసంధానం జరగని ఖాతాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా ఇకపై పది మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలనూ ఈపీఎఫ్ చట్ట పరిధిలోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. అయితే దీనిపై పార్లమెంట్లో చట్ట సవరణ జరగకుండా వామపక్షాలు, కాంగ్రెస్ అడ్డుపడుతున్నాయన్నారు. హెచ్‌సీఎల్ కంపెనీని ఆదుకోండి: కోదండరామ్ హిందుస్థాన్ కేబుల్ కంపెనీ(హెచ్‌సీఎల్)ని మూతపడకుండా ఆదుకోవాలని దత్తాత్రేయను జేఏసీ చైర్మన్ కోదండరామ్ కోరారు. ఇటీవల హెచ్సీఎల్ను ఖాయిలాపడిన పరిశ్రమల జాబితాతో కేంద్ర పరిశ్రమల శాఖ చేర్చిందన్నారు. దీంతో ఈ కంపెనీలో పనిచేస్తున్న 600 మంది రోడ్డున పడే ప్రమాదం తలెత్తిందన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. దీనికి మంత్రి దత్తాత్రేయ స్పందిస్తూ.. డిజిటల్ ఇండియాలో భాగంగా అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అవసరమని, ఈ నేపథ్యంలో పరిశ్రమలశాఖ, రక్షణశాఖ మంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీడీ కట్టలపై పుర్రెగుర్తు సైజును తగ్గించాలని బీజేపీ రాష్ట్రశాఖ, బీఎంఎస్(భారతీయ మజ్దూరు యూనియన్)లు వేరు వేరుగా వినతి పత్రాలు అందజేశారు. -
తెలంగాణలో సీఎన్జీ స్టేషన్లు నెలకొల్పండి
పెట్రోలియం మంత్రికి దత్తాత్రేయ వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు గ్యాస్ కనెక్షన్లు పెంచాలని, సీఎన్జీ స్టేషన్లు ఏర్పా టు చేయాలని పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం తన కార్యాలయానికి వచ్చి భేటీ అయిన సందర్భంలో దత్తాత్రేయ ఈ విషయాలను చర్చించారు. హైదరాబాద్ నగరంలో సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ ఔట్లెట్లు ఏర్పాటు చేయాలని, నేదునూరు, శంకరపల్లిల్లో ప్రతిపాదిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు గ్యాస్ కేటాయించాలని కోరారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ, ‘భాగ్యనగర్ గ్యాస్’ పేరుతో హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న సీఎన్జీ స్టేషన్లకు గ్యాస్ పెంపు, స్టేషన్ల పెంపుపై అధికారులతో చర్చిస్తామన్నారు. -
'రాజకీయ వ్యూహంతోనే రాద్దాంతం'
హైదరాబాద్: ప్రతిపక్షాలు రాజకీయ వ్యూహంతోనే జేఎన్‌యూ ఘటనపై రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందుకోసం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే వారిని ప్రతిపక్షాలు వెనుకేసుకొస్తున్నాయని ఆయన విమర్శించారు. జీఎస్టీ బిల్లు వల్ల కార్మికులకు లబ్ది చేకూరుతుందని ఆయన వెల్లడించారు. కేంద్ర మంత్రి వర్గంలో టీఆర్ఎస్ చేరే అంశంపై మాట్లాడుతూ.. ఆ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి చెప్పాలని అన్నారు. -
ద.మ.రైల్వేకు 2,500 కోట్లివ్వండి
- రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కోరిన దత్తాత్రేయ - ఎంఎంటీఎస్ ఫేజ్-2తోపాటు సూపర్ ఫాస్ట్ రైళ్లకోసం విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ మధ్య రైల్వేకు వచ్చే బడ్జెట్లో రూ. 2,500 కోట్ల మేర నిధులు మంజూరు చేయాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఇక్కడ రైల్వే మంత్రి కార్యాలయంలో సురేశ్ ప్రభుతో ఆయన భేటీ అయ్యారు. ‘కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టిన మెదక్ -అక్కన్నపేట్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం తన వాటాను ఇప్పటికే కేటాయించింది. ఇక కేంద్రం కూడా 50% వాటాను ఇవ్వాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా రైల్వే బడ్జెట్లో ప్రకటనే చేయాలి. అలాగే మీర్జాపల్లి నుంచి మెదక్‌కు కొత్త రైల్వే లైను ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలి. అజంతా ఎక్స్‌ప్రెస్‌కు అక్కన్నపేట్ రైల్వే స్టేషన్లో హాల్ట్ కల్పించాలి’ అని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎంఎంటీఎస్ ఫేజ్-2ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. ఇందుకోసం తాజా బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మణుగూరు-రామగుండం లైనుకు 100 కోట్లు, అక్కన్నపేట్-మెదక్‌కు రూ.40 కోట్లు, భద్రాచలం రోడ్-కొవ్వూరుకు రూ. 100 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్లకు రూ. 40 కోట్లు, కడప-బెంగళూరు లైనుకు రూ. 100 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి లైనుకు రూ.309 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్-ఖాజీపేట మూడో లైనుకు, హైదరాబాద్-నిజాంపేట, హైదరాబాద్-మహబూబ్‌నగర్-కర్నూలు లైనుకు, హైదరాబాద్-బీబీనగర్-నడికుడి లైన్లకు విద్యుదీకరణ పనులు చేపట్టాలని విన్నవించారు. కొత్త రైళ్లు వేయండి.. హైదరాబాద్ నుంచి తిరుపతి, కోయంబత్తూరు మీదుగా మధురైకి కొత్తగా సూపర్ ఫాస్ట్ రైలు నడపాలని దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. అలాగే సికింద్రాబాద్-బెంగళూరు మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలన్నారు. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-నల్లగొండ మధ్య ఇంటర్సిటీ రైళ్లను నడపాలని కోరారు. హైదరాబాద్ లో రాత్రి బయలుదేరి తెల్లవారే సరికి ముంబై చేరేలా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని కోరారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుల్లెట్ రైలు నడపాలని విన్నవించారు. కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని.. మౌలాలీ, శేరిలింగపల్లిలో కొత్త టెర్మినళ్లు ఏర్పాటుచేయాలన్నారు. -
ఎంఐఎంతో టీఆర్ఎస్ కుమ్మక్కు
♦ రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎం: కిషన్ రెడ్డి ♦ హైదరాబాద్‌ను పంచుకుంటున్న ఒవైసీ, కేసీఆర్ కుటుంబాలు ♦ టీఆర్ఎస్వి ఓటు బ్యాంకు రాజకీయాలు: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ కనుసన్నల్లోనే టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మజ్లిస్ పార్టీకి మేయర్ పదవి ఇవ్వడానికి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తున్నదన్నారు. మజ్లిస్, టీఆర్ఎస్ కలసి పనిచేస్తున్నాయని తాము చెబుతున్నట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. టీఆర్ఎస్, మజ్లిస్ హైదరాబాద్‌ను పంచుకున్నాయన్నారు. ఒవైసీ సోదరులు పాతబస్తీని, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కూతురు కవిత కొత్త పట్నాన్ని పంచుకున్నారని ఆరోపించారు. ఎంఐఎంతో సంబంధం లేదని, మతతత్వ పార్టీ అని ఇప్పటిదాకా మాట్లాడిన కేసీఆర్ కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ధికోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎంఐఎంకి టీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని విమర్శించారు. మతోన్మాద పార్టీ, రజాకార్ల వారసత్వ పార్టీ అయిన ఎంఐఎం మతోన్మాదాన్ని టీఆర్ఎస్ సమర్థిస్తుందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉగ్రవాదులకు అండగా ఉన్న మజ్లిస్‌పార్టీకి టీఆర్ఎస్ ఎలా మద్దతిస్తుందని, ఈ ఎన్నికల్లో ఎలా కలసి పనిచేస్తున్నదని అడిగారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే హైదరాబాద్ పన్నుల భారం పెంచుతారని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రజలపై అన్ని పన్నులను పెంచి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తారని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మొన్న వందసీట్లు గెలుస్తామని కేటీఆర్ అంటే కేసీఆర్ ఇప్పుడేమో 60 సీట్లు గెలుస్తామని చెప్పారని వివరించారు. రేపు 20 సీట్లే గెలుస్తామని చెప్పినా ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. అలాంటి పార్టీకి చెందిన నేతల సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్, ఎంఐఎంలను ఓడించండి ఓటుబ్యాంకు రాజకీయాలకోసం ఉగ్రవాదులకు అండగా ఉన్న ఎంఐఎంతో టీఆర్ఎస్ కలసి పనిచేస్తున్నదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎం గెలిస్తే శాంతిభద్రతలకు ప్రమాదమని హెచ్చరించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలను ఓడించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటిదాకా రూ. 6,630 కోట్లను హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిందని వివరించారు. హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీగా చేయడానికి కేంద్రం ప్రతిపాదిస్తే కేసీఆర్ అడ్డుకుని కరీంనగర్‌ను చేయాలని ప్రతిపాదించినట్టుగా దత్తాత్రేయ వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్న కేసీఆర్‌కు హైదరాబాద్‌లో ఓట్లడిగే అర్హత లేదన్నారు. -
బీజేపీ శ్రేణులు గ్రేటర్లో ప్రతీ ఓటరును కలవాలి: దత్తాత్రేయ
బీజేపీ అభ్యర్థులకు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతీ ఓటరును కలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రేటర్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉందని, అధికార టీఆర్ఎస్కు బలం లేక ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులను డివిజన్ల బాధ్యతలు అప్పగించి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రచారం చేయాలని అభ్యర్థులకు దత్తాత్రేయ సూచించారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్ప ఆచరణలో అభివృద్ధిని, అమలును చూపించడం లేదని టీఆర్ఎస్ను కిషన్‌రెడ్డి విమర్శించారు. -
'నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారింది'
హైదారాబాద్: హైదరాబాద్ భిన్న సంస్కృతులతో కూడిన మినీ ఇండియా అని కేంద్రమంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. శాంతికి నిలయంగా ఉన్న నగరం ఇప్పుడు ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని తెలిపారు. టీడీపీ, బీజేపీ గ్రేటర్ ఉమ్మడి మేనిఫెస్టోను ఆదివారం దత్తాత్రేయ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న మజ్లీస్‌తో టీఆర్ఎస్ అంటకాగుతోందని విమర్శించారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సైతం టీఆర్ఎస్ నీరుగార్చిందని దత్తాత్రేయ ఆరోపించారు. -
స్మృతి ఇరానీ, దత్తాత్రేయలను బర్తరఫ్ చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దోమలగూడ: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి బాధ్యులైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అప్పారావులను సస్పెండ్ చేయాలని, రోహిత్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోహిత్ సాలిడాఆరిటీ అండ్ స్ట్రగుల్డ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, గోవర్ధన్ (న్యూడెమాక్రసీ, చంద్రన్న), వేములపల్లి వెంకట్రామయ్య (న్యూడెమాక్రసీ, రాయల), ఆమ్ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి పిఎల్ విశ్వేశ్వర్రావు, జానకిరాములు (ఆర్ఎస్పి), పీఓడబ్ల్యూ సంధ్య, ప్రొఫెసర్ కంచ అయిలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ రోహిత్ మరణాన్ని ఆపలేకపోవడం అధ్యాపకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎంపీ అసదుద్దీన్, ప్రొఫెసర్ హరగోపాల్, సూరేపల్లి సుజాత యూనివర్సిటీలో రెచ్చగొట్టారని ఆరోపిస్తున్న ఏబీవీపీ నాయకులు రోహిత్ ఎందుకు చనిపోయాడన్నదానిపై ఆలోచించకపోవడం దారుణమన్నారు అంతర్జాతీయ వాణిజ్య సంస్థ సూచనల మేరకు భవిష్యత్తులో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో నిధులు తగ్గించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తుందని, కాషాయీకరణే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు, దేశంలో 290 మంది ప్రొఫెసర్ల లిస్టును తయారు చేసిన ఆర్ఎస్ఎస్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ద్వారా వివిధ పోస్టుల్లో భర్తీ చేయించాలని చూస్తోందని ఆరోపించారు. ఫాసిజాన్ని ఆపకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమని, దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంధ్రమంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పారావులను శిక్షించాలని కోరితే బీసీలు దత్తాత్రేయకు, కమ్మలు అప్పారావుకు మద్దతుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మార్కిస్టు రాజకీయాలను విమర్శించిన రోహిత్‌కు సీపీఎం మద్దతు ఇవ్వడంపై కొందరు ప్రశ్నిస్తున్నారని, తమను విమర్శించినంత మాత్రాన రోహిత్ ఘటనపై తప్పును తప్పునుగానే చూస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసు, వెంకట్‌రెడ్డి, నంద్యాల నర్సింహ్మరెడ్డి, శారదాగౌడ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
దత్తాత్రేయ ఇంటిని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్ఐ
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై బుధవారం రాంనగర్‌లోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ యూనివర్సిటీకి లేఖ ఇవ్వడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు యూనివర్సిటీ, ఉన్నత అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఐదుగురి సస్పెన్షన్ చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ బండారు దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, నాయకులు శివరామకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
దోషులను కచ్చితంగా శిక్షించాల్సిందే: నఖ్వీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. హైదరాబాద్ వర్శిటీలో ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దోషులను కచ్చితంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని విమర్శించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయను లక్ష్యం చేసుకోవడం సరికాదన్నారు. -
'దత్తాత్రేయను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలి'
న్యూఢిల్లీ: దళిత పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. హెచ్‌సీయూలో రోహిత్ మరణం అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు ఆర్పీఎన్ సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి దత్తాత్రేయను వెంటనే కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా హెచ్‌సీయూ వీసీని, ఈ వ్యవహారంలో ప్రమేయమున్న వ్యక్తులను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి దత్తాత్రేయ రాసిన లేఖ వల్లే వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో గచిబౌలి పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
'హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే'
హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది తానేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తొమ్మిదేళ్లలో సైబరాబాద్ నగరాన్ని నిర్మించామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం బీజేపీ-టీడీపీ ఘనతే అని ఆయన చెప్పారు. మంగళవారం సాయంత్రం నిజాం కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ, టీడీపీ సంయుక్తంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్రం సాయంతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని అన్నారు. కేంద్రం నిధులిస్తున్నా టీఆరెఎస్ చెప్పడం లేదని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కు వంద సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. -
'బిచ్చమెత్తుకునే పరిస్థితి పోవాలి'
హైదరాబాద్: నగరంలో బడుగు జీవులు బిచ్చమెత్తుకుని జీవించే పరిస్థితి అంతం కావాలని, దీని కోసం తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం చిక్కడపల్లిలో జంట నగరాల వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో 610 మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పేదలను చేరదీసి వారికి సాయం చేయటం అభినందనీయం అన్నారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ పేదల కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసన సబాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. -
'కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు స్వాగతించాయి'
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ పర్యటనను ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ స్వాగతించాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మోదీ పర్యటనను ఐక్యరాజ్యసమితి కూడా స్వాగతించిందని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓట్ల భయం పట్టుకోవడం వలనే ఈ పర్యటనను తప్పుపడుతున్నారని ఆయన విమర్శించారు. పాక్ ప్రధానితో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని దత్తాత్రేయ తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందన్న ఆయన తెలంగాణలో ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం సహాయం చేస్తుందని అన్నారు. -
ప్రభుత్వ గ్యారంటీ లేదు
స్టాక్ మార్కెట్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులపై దత్తాత్రేయ వివరణ న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ(ఎంప్లాయూ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) స్టాక్ మార్కెట్లో పెడుతున్న పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్కెట్ ఒడిదుడుకుల ఆధారంగా ఈ రాబడులు ఉంటాయని, అందుకే ప్రభుత్వం ఈ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వదని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవని కొన్ని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఆయన రాజ్యసభకు వివరించారు. ఈపీఎఫ్ఓ ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)ల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన ఇంక్రిమెంటల్ డిపాజిట్లలో 5 శాతం వరకూ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌తో కూడుకున్నదేనని భావించినప్పటికీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ-ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణాయక విభాగం) స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు పచ్చజెండా ఊపిందని దత్తాత్రేయ వెల్లడించారు. కాగా ఈపీఎఫ్ఓ ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి నవంబర్ 30 వరకూ ఈటీఎఫ్‌ల్లో రూ.3,174 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా మంగళవారం పార్లమెంట్‌కు నివేదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓకు రూ.1.2 లక్షల కోట్ల ఇంక్రిమెంటల్ డిపాజిట్లు వస్తాయని అంచనా. ఈ లెక్క ప్రకారం ఈపీఎఫ్ఓ ఈ ఆర్థిక సంవత్సరంలో ఈటీఎఫ్‌ల్లో రూ.6,000 కోట్ల ఇన్వెస్ట్ చేయనున్నది. -
'అసహనంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధం'
హైదరాబాద్: అసహనంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించడం సరికాదన్న ఆయన అడిగిన దానికన్నా ఎక్కువ నిధులను కేంద్రం ఇస్తుందని స్పష్టం చేశారు. అమృత్ పథకం కింద తెలంగాణకు కెటాయించిన నిధులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారంలో వామపక్షాలకు చిత్తశుద్ధి లోపించిందని దత్తాత్రేయ విమర్శించారు. -
సోమేశ్‌కుమార్‌ను బలిపశువును చేశారు
ఓట్ల తొలగింపు వ్యవహారంపై దత్తాత్రేయ హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ బదిలీకి కారణం ఓట్ల తొలగింపు వ్యవహారమేనని, ఆయన్ని ఇష్టానుసారంగా వాడుకొని చివరకు బలిపశువును చేశారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నగరంలోని అడిక్‌మెట్ డివిజన్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ...‘సోమేశ్‌కుమార్‌తో పాటు నవీన్ మిట్టల్‌ను బలిపశువులను చేశారు. రాజకీయ నాయకులు, మంత్రులు చెప్పినట్లు అధికారులు నడుచుకోవద్దు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. తొలగించిన ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టడం దేశంలోనే ఇది రెండోసారి. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికిది సిగ్గుచేటు. 20 నెలల బీజేపీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు అన్నానికి బదులు బొగ్గు తిన్నారు’ అన్నారు. బాగ్‌లింగంపల్లి లంబాడ బస్తీలో త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అలాగే కార్మికులు అధిక సంఖ్యలో నివసించే ముషీరాబాద్ నియోజకవర్గంలో 6 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
'కౌన్సెలింగ్ కేంద్రాలుగా ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్‌లు'
కోల్‌కతా: ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్‌లను త్వరలో కెరీర్ కౌన్పిలింగ్ సెంటర్లుగా మార్చనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్చేంజ్ విధానంలో సమూలమైన మార్పుల ద్వారా జాతీయ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లుగా మార్చనున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించడం, ఉద్యోగవకాశాలు కల్పించే సంస్థలకు నిరుద్యోగుల సమాచారాన్నిచేరవేయడం ద్వారా ఉద్యోగవకాశాలు కల్పించడంలో ఈ కౌన్సెలింగ్ సెంటర్లు కీలక పాత్ర పోషించేలా చూస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 978 ఎంప్లాయ్మెంట్ సెంటర్లు ఉన్నాయని వీటిని త్వరలోనే కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లుగా మార్చే ప్ర్రక్రియ ప్రారంభమౌతుందన్నారు. తొలుత 100 మోడల్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెరీర్ సర్వీస్ అనే మరో కార్యక్రమాన్నిన్ని కూడా ప్రారంభిస్తుందనీ, ఈ రెండు పథకాలకు కలిపి 800 కోట్ల రూపాయలు కెటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నూతన కా పథకాల ద్వారా ఈ ఆర్థీక సంవత్పరం చివరి నాటికి కోటి ఉద్యోగాలను కల్పించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. 'మేక్ ఇన్ ఇండియా', 'స్కిల్ ఇండియా' కేంద్రం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశాలుగా దత్తాత్రేయ తెలిపారు. -
వచ్చే ఏడాది కూడా హుస్సేన్ సాగర్‌లోనే..
హైదరాబాద్: వచ్చే ఏడాది కూడా హుస్సేన్ సాగర్‌లోనే వినాయకుడి ప్రతిమల నిమజ్జన కార్యక్రమం ఉంటుందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. వచ్చే ఏడాది ఎవరు అధికారంలో ఉన్నా సంబంధం లేదని, హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను తాము వ్యతిరేకించడం లేదని దత్తాత్రేయ అన్నారు. -
వాళ్లు కొట్టుకున్నా..తిట్టుకున్నా ప్రేమే
హైదరాబాద్: అన్నా చెల్లె అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ పండుగను కుల మతాలకతీతంగా శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు బీజేపీ మహిళా కార్యకర్తలు రాఖీ కట్టారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లు కొట్టుకున్నా.. తిట్టుకున్నా అందులో ప్రేమ ఉంటుందన్నారు. మరో వైపు రాజభవన్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు, విద్యార్థులు గవర్నర్ కు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ ఆయన రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. -
గడువు ముగిసినా.. వీడని చెర
ట్రిపోలిలో ఉగ్రవాదుల చెరలోనే తెలుగు ప్రొఫెసర్లు * ఆదివారం విడుదల చేస్తారని ఆశగా చూసిన బంధువులు * ప్రాణాలు కాపాడమంటూ దత్తాత్రేయకు వేడుకోలు సాక్షి, హైదరాబాద్: లిబియా దేశంలో కిడ్నాప్‌నకు గురైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లు తీవ్రవాదుల చెర వీడలేదు. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. వీరితోపాటే కిడ్నాప్‌నకు గురై విడుదలైన కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్లు లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు విదేశాంగ శాఖ అధికారులతో చెప్పిన మాటల ప్రకారం ఆదివారం సాయంత్రానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు విడుదల కావాల్సి ఉంది. దీంతో గోపీకృష్ణ, బలరాం కిషన్ల కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి వరకు ఎప్పుడు తీపి కబురు వస్తుందోనని ఎదురుచూస్తూ కాలం గడిపారు. తీరా సాయంత్రానికి సైతం ఎలాంటి సమాచారం లేకపోవటంతో బలరాం కిషన్ భార్య శ్రీదేవి ఇతర కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని దిల్కుష అతిథి గృహంలో కేంద్రమంత్రి దత్తాత్రేయను కలుసుకుని తమ వారి ప్రాణాలు ఎలాగైనా కాపాడమంటూ ప్రాధేయపడ్డారు. ఈ విషయమై దత్తాత్రేయ ప్రతిస్పందిస్తూ ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, సోమవారం మరోసారి తానే స్వయంగా విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతానని హామీ ఇచ్చారు. ఆ ఇద్దరినీ వదిలేస్తారు..: తీవ్రవాదుల చెరలో ఉన్న ఇద్దరు తెలుగువారిని తప్పకుండా విడుదల చేస్తారంటూ కిడ్నాప్ చెర నుండి విడుదలైన కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు గోపీకృష్ణ, బలరాం కిషన్ల కుటుంబసభ్యులకు బరోసానిచ్చారు. వారిద్దరు లిబియా నుండి ఆదివారం స్వస్థలాలకు బయలుదేరే ముందు గోపీకృష్ణ, బలరాంకిషన్ల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తమ వద్ద ఉన్న ధృవపత్రాలన్నీ తీవ్రవాదులు క్షుణ్ణంగా పరిశీలించారని, గోపీకృష్ణ, బలరాంకిషన్‌లకు సంబంధించిన మరిన్ని ధృవపత్రాలను ట్రిపోలి యూనివర్సిటీ ప్రతినిధులు ఉగ్రవాదులకు పంపారని చెప్పారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయంలోగా ఖచ్చితంగా విడుదలవుతారని, ఇదే విషయమై ఆదివారం కూడా తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపిన యూనివర్సిటీ ప్రతినిధులు తమతో చెప్పారని లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్‌లు పేర్కొన్నారు. -
చేనేత కార్మికులకు యూవిన్ కార్డులు: దత్తాత్రేయ
మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు సెప్టెంబర్ 2న కార్మికులు చేపట్టే సమ్మెపై ప్రధానితో చర్చిస్తాం దత్తాత్రేయతో అసెంబ్లీ స్పీకర్ భేటీ న్యూఢిల్లీ: అసంఘటిత కార్మిక గుర్తింపు సంఖ్య (యూవిన్) కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను చేనేత కార్మికులకు వర్తింపచేసేందుకు కేంద్ర కార్మిక శాఖ ద్వారా కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం మంగళవారం దత్తాత్రేయను కలసి చేనేత కార్మికుల డిమాండ్లపై వినతిపత్రాన్ని అందజేసింది. చేనేతకారుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు మరిన్ని విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణలో టెక్స్టైల్, హ్యాండ్లూం పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌ను కోరుతామని మంత్రి చెప్పారు. ఆగస్టు 7న జాతీయ చేనేత కార్మిక దినోత్సవంగా జరిపేందుకు నిర్ణయించడం సంతోషకరమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు జరపతలపెట్టిన సమ్మె విషయంలో ప్రధాని మోదీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. రాజమండ్రి దుర్ఘటనపై విచారం.. రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనపై మంత్రి దత్తాత్రేయ విచారం వ్యక్తం చేశారు. పవిత్ర దైవ సన్నిధిలో ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకోవడం మనస్తాపానికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే కలసినట్లు దత్తాత్రేయ వెల్లడించారు. -
రైతుభరోసాయాత్రకాదు...కాంగ్రేస్ భరోసాయాత్ర
-
దత్తాత్రేయకు కోపం వచ్చిన వేళ!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైన కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. రాహుల్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. ఇది రాహుల్ భరోసా యాత్రకాదని, కాంగ్రెస్ భరోసా యాత్ర అని దత్తాత్రేయ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలపై సమాధానం చెప్పాలని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి రైతులు ఆత్మహత్యలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. అవినీతికి పుట్టినిట్లు కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే ఆజ్యం పోసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. విమర్శలను వదిలి ఆ పార్టీ ఇతర అంశాలను రాజకీయం చేస్తుందన్నారు. నరేంద్ర మోదీ పాలన పారదర్శకంగా ఉందని కితాబిచ్చారు. ఈఎస్ఐ కార్పోరేషన్ ద్వారా 7 కోట్ల 50 లక్షల మందికి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. సనత్ నగర్ మెడికల కాలేజీని నడపలేనని తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లు దత్తాత్రేయ తెలిపారు. -
సినీ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తాం
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని, కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం చట్టాలను సవరిస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సినీ కార్మికులకు ఈ.ఎస్.ఐ భవిష్యనిధి (పీఎఫ్) సదుపాయాలు కల్పించాలని కోరుతూ నేషనల్ జాయింట్ కన్వీనర్ ఫర్ ఫిలిమ్స్, కల్చర్ త్రిపురనేని వరప్రసాద్ నేతృత్వంలో చిత్రరంగంలోని 24 కళల ప్రతినిధులు మంగళవారం కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయను కలిశారు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 2 లక్షల మంది కార్మికులు చాలా పేదరికంలో బతుకుతున్నారని, వారందరికీ ప్రభుత్వం భరోసా కల్పించాలని మంత్రిని కోరారు. చట్టాలు సవరించైనా సరే సినీ రంగంలోని శ్రామికులకు మేలు చేస్తామని మంత్రి దత్తాత్రేయ హామీ ఇచ్చారు. సినీ కార్మికుడు మరణిస్తే రూ. 15 వేలు ఆపద్ధర్మంగా అందజేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు త్రిపురనేని తెలిపారు. -
'ఏపీ తెలంగాణ రైతులను ఆదుకుంటాం'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అకాల వర్షాల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. వర్షాల వల్ల ఏపీ, తెలంగాణలో అపారనష్టం జరిగిందని చెప్పారు. గురువారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ.. రాధామోహన్‌ను కలిసి రైతులను ఆదుకోవాలని విన్నవించారు. తొలుత రాష్ట్రాల విపత్తుల నిధుల నుంచి రైతులకు సాయం చేయాలని, ఆ తర్వాత కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేశాక పూర్తి సాయం చేస్తామని రాధామోహన్ సింగ్ అన్నారు. -
రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం
కరీంనగర్: అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేంద్రం ప్రభుత్వ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రైతులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ కొత్త నిబంధనల విధానాల ద్వారా పంటనష్టం అంచనా వేయాల్సినవసరం ఉందని చెప్పారు. వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.18వేలు, ఆహార పంటలకు ఎకరానికి రూ.13 వేలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారమే రాష్ట్ర సర్కార్ పంట నష్టం అందించాలని చెప్పారు. -
'పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఉగ్రవాదం అంతం'
న్యూఢిల్లీ: పోలీసులకు స్వేచ్ఛనిస్తే ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. ఆయన మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కాల్పుల ఘటన, ఆలేరు ఎన్కౌంటర్ ఘటన ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రాంతం ఉగ్రవాదులకు స్ధావరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు కొన్ని రాజకీయ పార్టీలే సహకారమందిస్తున్నాయని ఆరోపించారు. -
తెలంగాణలో మరిన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరిన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పా టు చేయనున్నట్టు కేంద్రమంత్రి దత్తాత్రేయ తెలిపారు. నిర్మల్‌లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించారు. బీడీ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న ట్టు చెప్పారు. గురువారం ఆయనను దిల్‌కుశ అతిథి గృహంలో గృహనిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో పేదలకు అధి కంగా గృహాలు నిర్మించేందుకు, గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.900 కోట్లు కేటాయించేలా సహకరించాలని కోరారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధాని వచ్చేలా చూడాలని కోరారు. -
బీజేపీ మొబైల్ మెంబర్ షిప్ ప్రారంభం
హైదరాబాద్ : గ్రేటర్ లో బీజేపీ మొబైల్ మెంబర్ షిప్ ను సోమవారం కేంద్ర కార్మిక శాఖమంత్రి దత్తాత్రేయ , రాష్ట్ర అధ్యక్షుడుకిషన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... అన్నిరాష్ట్రాల్లోను బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని తెలపారు. మోదీ సర్కార్ వల్ల ప్రపంచంలో భారత్ కు గుర్తింపు వస్తోందన్నారు. 100 మంది సభ్యులను చేర్పిస్తే క్రియాశీలక సభ్యత్వం ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 35 లక్షలకు పైగా సభ్యలను చేర్చడమే బీజేపీ లక్ష్యమన్నారు. మార్చి 31 దాకా పార్టీ సభ్యత్వం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. -
వేధింపులు ఉండవు: దత్తాత్రేయ
హైదరాబాద్: అంసఘటిత కార్మికుల కోసం పారదర్శకమైన విధానాలు తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. అయితే యాజమాన్యాలపై వేధింపులు ఉండవని ఆయన భరోసా ఇచ్చారు. కార్మికుల శ్రేయస్సు కోసమే నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. కార్మికులకు నాణ్యమైన సేవలు అందించడం కోసం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐపీలను ఆధునీకరిస్తామని దత్తాత్రేయ చెప్పారు. -
నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు
నాలుగేళ్ల ‘శిక్షణ’లో జపాన్‌తో దీటుగా భారత్ కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసి ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 90వ జన్మదినం సందర్భంగా కేంద్ర కార్మికుల బీమా సంస్థ(ఈఎస్ఐసీ) గురువారం నగరంలోని ఒక హోటల్లో ‘సుపరిపాలన’ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడారు. నైపుణ్యం పెంపుదల శిక్షణ విషయంలో ఇతర దేశాలతో పోల్చుకోలేని స్థితిలో భారతదేశం ఉందని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలిందన్నారు. దేశంలో 11 వేల పారిశ్రామిక శిక్షణ సంస్థల ద్వారా 2.8లక్షల మందికి శిక్షణ లభిస్తుండగా, జర్మనీలో 30 లక్షల మందికి, జపాన్‌లో కోటి మందికి, చైనాలో రెండు కోట్ల మందికి శిక్షణ ఇస్తున్నారన్నారు. శిక్షణా సామర్థ్యం విషయంలో రానున్న నాలుగేళ్లలో జపాన్‌కు దీటుగా దేశాన్ని తీర్చిదిద్దుతామని దత్తాత్రేయ స్పష్టం చేశారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసమే ఇటీవల పార్లమెంటులో అప్రెంటీస్ చట్టాన్ని సవరించామని తెలిపారు. 2042 నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి మొత్తం 5.45 కోట్ల మానవ వనరుల కొరత ఏర్పడనుందని చెప్పారు. అప్పటి లోగా దేశంలో 4.90 కోట్ల మందికి శిక్షణ ఇచ్చి నైపుణ్యం గల కార్మికులుగా తీర్చిదిద్దుతామన్నారు. నైపుణ్యాల పెంపుదల కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేశామని ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అవినీతి లేని పారదర్శక పాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని హైదరాబాద్ నగరాన్ని స్మార్టు, సేఫ్ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పోలీసు శాఖ డీజీ అనురాగ్ శర్మ తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులతో వచ్చే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోలీసు శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్, ఇన్ఫోటెక్ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఎస్ఐ మెడికల్ కమిషనర్ ఎస్ఆర్ చౌహాన్, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కంటోన్మెంట్ దారుల మూసివేతను వాయిదా వేయండి
కేంద్ర రక్షణ మంత్రి పారికర్‌కు కార్మిక మంత్రి దత్తాత్రేయ వినతి సాక్షి, న్యూఢిల్లీ : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తో అనుసంధానమై ఉన్న 9 రహదారులను మూసివేయాలని ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయకుండా.. తాత్కాలికంగా వాయిదా వేయాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరారు. మంగళవారం ఆయన రక్షణ మంత్రిని కలిశారు. కంటోన్మెంట్ రహదారులను మూసివేస్తే ఈ ప్రాంతంలో నివసిస్తున్న 16 లక్షల మంది ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయని ప్రత్యామ్నాయ మార్గాలు వెతికేవరకు యథాతథ స్థితిని అమలు చేయాలని కోరారు. ఇదే విషయమై టీఆర్ఎస్ ఎంపీలు బి.వినోద్, బీబీ పాటిల్, టీడీపీ ఎంపీ సీహెచ్. మల్లారెడ్డి మంగళవారం మధ్యాహ్నం మంత్రి పారికర్‌ను కలిశారు. సమస్యను వివరించారు. ప్రత్యామ్నాయంగా రోడ్లను నిర్మించేవరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. దీనికి మంత్రి స్పందించి డిసెంబర్ 31 లోపే ఈ మేరకు రక్షణ శాఖ నుంచి ఉత్తర్వులు వస్తాయన్నారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. -
పోర్టులతో తెలంగాణను అనుసంధానించండి
ఈస్ట్-వెస్ట్ సీ పోర్టు కారిడార్ ఏర్పాటు చేయండి దత్తాత్రేయ నేతృత్వంలో కేంద్రమంత్రి గడ్కరీని కోరిన బీజేపీ నేతలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను నౌకాశ్రయాలతో అనుసంధానం చేసేందుకు ‘ఈస్ట్-వెస్ట్ సీ పోర్టు కారిడార్’ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం దత్తాత్రేయ నేతృత్వంలో తెలంగాణ బీజేపీ నేతల బృందం గడ్కరీని కలిసింది. ఈ బృందంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సలహాదారు శ్రీరాం వెదిరె, రఘునందన్‌రావు తదితరులున్నారు. తెలంగాణలో మరిన్ని జాతీయ రహదారుల ఏర్పాటు ఆవశ్యకత గురించి వీరు గడ్కరీకి వివరించారు. ముంబై-గోపాల్పూర్ పోర్టు మధ్య ఎన్‌హెచ్-222, ఎన్‌హెచ్-16, ఎన్‌హెచ్-43, ఎన్‌హెచ్-326, ఎన్‌హెచ్-17 ఉన్నాయి. ఒడిశాలోని బరంపూర్ నుంచి దిగపహండి మధ్య, మరికొన్ని చోట్ల జాతీయ రహదారి లేదు. అందువల్ల ఈ మొత్తం కారిడార్‌ను ఈస్ట్-వెస్ట్ సీపోర్టు కారిడార్‌గా ప్రకటించి రహదారులను అభివృద్ధి పరచాలని బీజేపీ నేతల బృందం కోరింది. భేటీ అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. ‘‘ముంబై నుంచి ఒడిశాలో ఉన్న గోపాల్పూర్ పోర్టుకు నాలుగు లేన్లు లేదా ఆరు లేన్ల రహదారిని ఏర్పాటు చేయాలని కోరాం. దీంతో తెలంగాణ నుంచి సీపోర్టుకు అనుసంధానం ఏర్పడే అవకాశం ఉంది. దీనిపై గడ్కరీ తన శాఖ అధికారులను పిలిచి రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు’’ అని వివరించారు. సంగారెడ్డి-మెదక్-ముంబై నేషనల్ హైవే, శ్రీశైలం హైవేను, సూర్యాపేట-సిద్దిపేట, హన్మకొండ-అశ్వారావుపేట రహదారులను 4 లేన్ల రహదారులుగా విస్తరించాలని కోరినట్లు వివరించారు. బీసీ డిమాండ్లను మోదీకి నివేదిస్తా: దత్తాత్రేయ బీసీ డిమాండ్లను ప్రధాని మోదీకి నివేదిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. కేంద్ర కేబినెట్లోనూ ఈ డిమాండ్లను చర్చకు పెడతానని భరోసా ఇచ్చారు. బీసీల బిల్లును పార్లమెంటులో పెట్టాలని ప్రధాని మోదీని కలసి విన్నవిస్తానన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్విన్ రాజు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘాల నేతల ప్రతి నిధి బృందం ఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో గురువారం మంత్రిని కలసి బీసీల 15 డిమాండ్లపై వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల అనంతరం కేంద్ర సామాజిక, న్యాయ మంత్రిత్వశాఖ, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్, ఉన్నతస్థాయి అధికారులతో అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా తమ డిమాండ్లపై ప్రధానిని శుక్రవారం కలవనున్నట్టు ఆర్.కృష్ణయ్య చెప్పారు. -
భిన్నత్వంలో ఏకత్వసాధన దత్తారాధన
పరమ దయామూర్తి, మహా యోగీశ్వరుడు, భక్తవత్సలుడు, నోరారా పిలిస్తేనే పలికే దైవం దత్తాత్రేయుడు. మార్గశిర పూర్ణిమనాడు త్రిమూర్తుల అంశతో అత్రి, అనసూయ దంపతులకు దత్తాత్రేయుడు పుత్రుడుగా పుట్టాడు. ఈ పర్వదినాన్నే దత్తజయంతిగా జరుపుకోవడం అనాదిగా వ స్తున్న ఆచారం. గురు సంప్రదాయంలో దత్తాత్రేయుడిది ప్రత్యేక స్థానం. దత్తోపాసన అన్ని ఉపాసనల కంటె తేలికైనదని, శీఘ్రంగా ఫలితాన్ని ప్రసాదించేదనీ ప్రతీతి. ధర్మస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అయిన దత్తాత్రేయుడు సద్గురువులందరిలోనూ అంతర్లీనంగా ఉండి, వారి చేత శిష్యులకు జ్ఞానబోధ చేయిస్తుంటాడని, వారిని మంచి మార్గంలో పెట్టేలా చేస్తాడని దత్తసంప్రదాయం చెబుతోంది. అన్ని సాధనలను ఏకం చేసి, తనలో కలుపుకోవడమే ఈ అవతార పరమార్థమని దత్త చరిత్ర చెబుతోంది. కృతయుగంలో ప్రహ్లాదుడు, త్రేతాయుగంలో అలర్కుడు, ద్వాపరయుగంలో పరశురాముడు, కార్తవీర్యార్జునుడు తదితరులు, కలియుగంలో అసంఖ్యాకమైన వారు దత్తుడిని ఆరాధించి, ఆయన నుంచి యోగవిద్యను, ఆధ్యాత్మిక విద్యను పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. భక్తుల పాలిట కామధేనువైన దత్తాత్రేయుడు కేవలం స్మరిస్తే చాలు ప్రసన్నుడవుతాడని శాస్త్రవచనం. దత్తజయంతి రోజున దత్తారాధన, దత్తస్మరణ, గురుచరిత్ర పారాయణ, గురుగీత పారాయణ చేయడం, శునకాలకు, ఇతర జీవులకు రొట్టెలు తినిపించడం, గురువులను పూజించడం, సన్మానించడం సత్ఫలితాలనిస్తుందని దత్తసంప్రదాయం చెబుతోంది. మాణిక్ ప్రభు, గజానన్ మహరాజ్, శ్రీపాద శ్రీవల్లభులవారు, శిరిడీ సాయి బాబా, సత్యసాయిబాబా దత్తుని అంశావతారాలేనని భక్తుల విశ్వాసం. దత్తజయంతి సందర్భంగా దత్తక్షేత్రాలైన పిఠాపురంలోనూ, గానుగాపురంలోనూ విశేష పూజలు జరుగుతాయి. స్వామిని నోరారా శ్రీగురుదత్త- జయగురుదత్త అని కానీ, శ్రీ దత్త శ్శరణం మమ అని కానీ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని కానీ స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిది. నియమ నిష్ఠలతో రోజుకు తొమ్మిదిమార్ల చొప్పున 21 రోజుల పాటు దత్తస్తవాన్ని దీక్షగా పఠిస్తూ, తీపిపదార్థాలను నివేదిస్తూ, సాధు సన్యాసులకు భిక్షపెడుతూ ఉంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని ప్రతీతి. (డిసెంబర్ 6, శనివారం దత్తజయంతి) -
అసంఘటిత కార్మికుల సంక్షేమానికి చర్యలు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణలోని యు వతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతకు కొత్త పథకాలను రూపొందించే క్రమంలో కేంద్రం ఉందని వెల్లడించారు. దిల్‌కుశా అతిథి గృహంలో అసంఘటిత కార్మికుల అంశంపై రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కార్మిక, ఈఎస్ఐ,తదితర శాఖల అధికారులతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ, నాయిని ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రీయ స్వాస్థ్ బీమా యోజన, ఇందిరాగాంధీ వృద్ధాప్య పెన్షన్లు, ఆమ్ ఆద్మీ బీమా యోజనలను కలిపి స్మార్ట్‌కార్డును రూపొం దించి ఒకే పథకంగా అమలుచేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐ కేంద్రాన్ని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిపై పరిశీలన జరిపి రాష్ట్ర పునర్విభ జన చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. వృత్తివిద్యలో నైపుణ్యాలను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 20 పెలైట్ ప్రాజెక్టులను అమలుచేస్తుండగా, జాబితా తెలంగాణను కూడా చేర్చామని హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఈ ప్రాజెక్టులు పనిచేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. బీడీకార్మికుల కోసం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. -
పత్తి కొనుగోళ్ళు పెంచుతున్నాం!
-
కార్మికుల సామాజిక భద్రతే లక్ష్యం
ఆ దిశగా చట్టాల్లో మార్పులు తెస్తాం: కేంద్రమంత్రి దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చట్టాల్లో మార్పులు తెస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ (స్వతంత్ర) మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ‘శ్రమయేవ జయతే’ పథకం ద్వారా ప్రతి కార్మికుడికీ న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కార్మిక, ఉపాధి కల్పన మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదలు, కార్మికులు, శ్రామికులు, నిరుద్యోగులకు సేవ చేసే అవకాశం కల్పించారంటూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామన్నారు. అసంఘటిత రంగాల కార్మికుల పీఎఫ్‌ను ఎగవేయడానికి ప్రయత్నిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ముంబైలో మంగళవారం జరగనున్న కార్మిక సదస్సుకు హాజరవుతున్నట్టు దత్తాత్రేయ చెప్పారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా కార్మిక మంత్రి కూడా హాజరవుతున్నారని, కార్మిక సంక్షేమంపై ఆయనతో చర్చించనున్నట్టు తెలిపారు. -
మోదీ కేబినెట్లోకి మరో 21 మంది
దత్తన్నకు కార్మిక శాఖ.. స్వతంత్ర హోదాతో పదవి శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రిగా సుజనాచౌదరి నలుగురికే కేబినెట్ హోదా.. ముగ్గురు స్వతంత్రుల 14 మంది సహాయ మంత్రులు మొత్తం 66కు పెరిగిన కేంద్ర మంత్రుల సంఖ్య ఐదుకు చేరిన తెలుగు వారి సంఖ్య శివసేన నేత సురేశ్‌ప్రభుకు బీజేపీ తీర్థ కేబినెట్ హోదా మంత్రిగా ప్రమాణ స్వీకారం పారికర్‌కు రక్షణ శాఖ, సురేశ్ ప్రభుకు రైల్వే శాఖ రైల్వే నుంచి న్యాయ శాఖకు సదానంద గౌడ ప్రమాణ స్వీకారానికి శివసేన దూరం సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మంత్రివర్గ విస్తరణలో బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ నుంచి ఆ పార్టీ ఏకైక ఎంపీ బండారు దత్తాత్రేయకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వతంత్ర సహాయ మంత్రి పదవి కేటాయించారు. తెలంగాణ నుంచి ఒకరికి కేబినెట్ హోదా దక్కుతుందని, పార్టీ ఉపాధ్యక్షుడిగా, సీనియర్ నేతగా ఉన్న తనకు కేబినెట్ హోదా కల్పిస్తారని ఆశించిన దత్తాత్రేయ చివరికి స్వతంత్ర హోదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకు కార్మికశాఖను కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబునాయుడు సన్నిహితుడు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.సత్యనారాయణచౌదరి (సుజనాచౌదరి)కి సహాయ మంత్రి పదవి దక్కింది. ఆయనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్ శాఖలు కేటాయించారు. వీరిద్దరితో సహా మొత్తం 21 మంది కొత్త వారితో మోదీ మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్త మంత్రులంతా ఆదివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం వరకు కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని సహా మొత్తం 45 మంది ఉండగా.. తాజా విస్తరణతో మొత్తం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 66 కు పెరిగింది. మోదీ కేబినెట్లో తెలుగువారి సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే ఎం.వెంకయ్యనాయుడు (కర్ణాటక నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు), పూసపాటి అశోకగజపతిరాజు (టీడీపీ), నిర్మలాసీతారామన్ (బీజేపీ)లు కేంద్ర మంత్రివర్గంలో ఉండగా.. తాజాగా ఈ జాబితాలో దత్తాత్రేయ, సుజనాచౌదరిలు చేరారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన 21 మంది కొత్త మంత్రుల్లో నలుగురికి కేబినెట్ హోదా, ముగ్గురికి స్వతంత్ర సహాయ మంత్రి హోదా, 14 మందికి సహాయ మంత్రి హోదా లభించింది. దీంతో ప్రస్తుతం ప్రధాని కాకుండా కేబినెట్ ర్యాంకులో 26 మంది, 13 మంది స్వతంత్ర హోదా, 26 మంది సహాయ మంత్రి పదవిలో ఉన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఆదివారం రాత్రికి శాఖలు ఖరారు చేశారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న పలువురి శాఖల్లో మార్పులు చేస్తూ కొత్త వారికి శాఖలు కేటాయించారు. సదానందగౌడ వద్ద ఉన్న రైల్వే శాఖను సురేశ్‌ప్రభుకు అప్పగించారు. సదానందకు న్యాయశాఖను కేటాయించారు. ఇప్పటివరకూ న్యాయశాఖ రవిశంకర్‌ప్రసాద్ వద్ద అదనంగా ఉంది. అరుణ్‌జైట్లీ వద్ద అదనంగా ఉన్న రక్షణశాఖను మనోహర్పారికర్కు అప్పగించారు. కొత్తగా కేబినెట్లో చేరిన జె.పి.నడ్డాకు ఆరోగ్యశాఖను కేటాయించారు. ఇప్పటివరకూ ఈ శాఖను చూసిన హర్షవర్ధన్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను అప్పగించారు. కొత్తగా ప్రమాణం చేసిన చౌదరీ వీరేంద్రసింగ్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుధ్యం శాఖలు కేటాయించారు. విస్తరణలో యూపీ నుంచి నలుగురికి చోటు మంత్రివర్గ తాజా విస్తరణలో ఉత్తరప్రదేశ్‌కు ప్రాధాన్యం లభించింది. ఆ రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలకు చోటు దక్కింది. అలాగే బీహార్ నుంచి ముగ్గురికి మహారాష్ట్ర నుంచి ఇద్దరికి, గుజరాత్ నుంచి ఇద్దరికి, రాజస్థాన్ నుంచి ఇద్దరికి చోటు కల్పించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు రాష్ట్రపతిభవన్‌లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఇప్పటివరకు గోవా సీఎంగా పనిచేసిన మనోహర్‌పారికర్, తరువాత వరుసగా సురేశ్ప్రభాకర్ప్రభు, జె.పి.నడ్డా, చౌదరి బీరేంద్రసింగ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులుగా బండారు దత్తాత్రేయ, రాజీవ్‌ప్రతాప్ రూడీ, మహేశ్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రులుగా ముక్తార్ అబ్బాస్‌నక్వీ, రాంకృపాల్ యాదవ్, హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి, సన్వర్‌లాల్‌జాట్, మోహన్ కుందారియా, గిరిరాజ్‌సింగ్, హన్స్‌రాజ్ అహిర్, ప్రొఫెసర్ రాంశంకర్ కతీరియా, వై.ఎస్.చౌదరి, జయంత్‌సిన్హా, కల్నల్ రాజ్వర్ధన్సింగ్ రాథోడ్, బాబుల్ సుప్రియో, సాధ్వీ నిరంజన్ జ్యోతి, విజయ్సాంప్ల వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 2.15కు ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యింది. అంతకుముందు ఉదయం పది గంటలకు ప్రధాని మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు. విస్తరణను బహిష్కరించిన శివసేన... కేంద్ర మంత్రివర్గ విస్తరణకు బీజేపీ మిత్రపక్షమైన శివసేన దూరంగా ఉంది. తమ పార్టీకి రెండు కేబినెట్ పదవులు ఇవ్వాలని శివసేన డిమాండ్ చేయగా.. ఆ పార్టీకి కేవలం ఒక సహాయ మంత్రి పదవి మాత్రమే ఇవ్వగలమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తేల్చిచెప్పినట్లు సమాచారం. పైగా శివసేన ప్రతిపాదించిన అనిల్దేశాయ్ను సహాయ మంత్రి పదవిగా తీసుకోవాలని.. ఆ పార్టీ ప్రతిపాదించని సురేశ్ప్రభాకర్ప్రభును కేబినెట్ హోదాలోకి తీసుకోవాలని ప్రధాని మోదీ భావించినట్లు తెలిసింది. ఆ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపిన జాబితాలో అనిల్‌దేశాయ్ పేరు కూడా ఉంది. అయితే ఈ ప్రతిపాదనను శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే వ్యతిరేకించారు. అయితే శివసేన నేత సురేశ్‌ప్రభు ఆదివారం ఉదయం బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి కేబినెట్ మంత్రిగా పదవి చేపట్టటంతో ఇప్పటికే దెబ్బతిన్న రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ చేరుకున్న అనిల్దేశాయ్ను విమానాశ్రయం నుంచే వెనుదిరగాల్సిందిగా ఆదేశించిన శివసేన అధినాయకత్వం.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా బహిష్కరించింది. ఈ పరిణామంతో కేంద్రంలో ఎన్డీఏ కూటమికి శివసేన ఇక దూరమైనట్టేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మోదీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తన పార్టీ నేత అనంత్గీతెను కూడా రాజీనామా చేయించి, మహారాష్ట్ర శాసనసభలో సైతం ప్రతిపక్షంలో కూర్చోవాలని శివసేన యోచిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి హమీద్అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, పూసపాటి అశోక్‌గజపతిరాజు, నిర్మలాసీతారామన్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు హాజరయ్యారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసిన దత్తాత్రేయ, సుజనాచౌదరిల కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త మంత్రులు వీరే... కేబినెట్ మంత్రులు మనోహర్ పారికర్ (గోవా, బీజేపీ) - రక్షణ సురేశ్ప్రభాకర్ ప్రభు (మహారాష్ట్ర, కొత్తగా బీజేపీలో చేరిక) - రైల్వే జగత్‌ప్రకాశ్ (జేపీ) నడ్డా (హిమాచల్‌ప్రదేశ్, బీజేపీ)- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం చౌదరి బీరేందర్‌సింగ్ (హర్యానా, బీజేపీ, జాట్ నేత) - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు-పారిశుధ్ధ్యం స్వతంత్ర సహాయ మంత్రులు: బండారు దత్తాత్రేయ (తెలంగాణ, బీజేపీ) - కార్మిక, ఉపాధి కల్పన రాజీవ్‌ప్రతాప్ రూడీ (బీహార్, బీజేపీ) - నైపుణ్యాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు డాక్టర్ మహేశ్‌శర్మ (యూపీ, బీజేపీ) - సాంస్కృతిక- పర్యాటకం, పౌర విమానయానం సహాయ మంత్రులు ముక్తార్ అబ్బాస్ నక్వీ (యూపీ, బీజేపీ) - మైనారిటీ, పార్లమెంటరీ వ్యవహారాలు రాంకృపాల్ యాదవ్ (బీహార్, బీజేపీ) - తాగునీరు, పారిశుద్ధ్యం హరిభాయ్ చౌధురి (గుజరాత్, బీజేపీ) - హోం సన్వర్‌లాల్ జాట్ (రాజస్థాన్, బీజేపీ) - జలవనరులు, గంగా పారిశుద్ధ్యం మోహన్‌భాయ్ కుందారియా (గుజరాత్, బీజేపీ) - వ్యవసాయం గిరిరాజ్‌సింగ్ (బీహార్, బీజేపీ) - సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు హన్స్‌రాజ్ గంగారాం అహిర్ (మహారాష్ట్ర, బీజేపీ) - రసాయనాలు, ఎరువులు రాంశంకర్ కతీరియా (యూపీ, బీజేపీ) - మానవ వనరుల అభివృద్ధి వై.ఎస్.చౌదరి (ఏపీ, టీడీపీ) - శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞానం జయంత్‌సిన్హా (జార్ఖండ్, బీజేపీ)- ఆర్థికం రాజ్వర్ధన్సింగ్ రాథోడ్ (రాజస్థాన్, బీజేపీ) - సమాచార, ప్రసారం బాబుల్ సుప్రియో (పశ్చిమబెంగాల్, బీజేపీ) - పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం సాధ్వీ నిరంజన్ జ్యోతి (యూపీ, బీజేపీ)- ఆహారశుద్ధి పరిశ్రమ విజయ్ సాంప్లా(పంజాబ్, బీజేపీ) - సామాజిక న్యాయం, సాధికారత మార్పులు చేర్పుల తర్వాత 1. అరుణ్ జైట్లీ- ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు, అదనంగా సమాచార, ప్రసార శాఖ 2. సదానంద గౌడ- న్యాయశాఖ 3. హర్షవర్ధన్- శాస్త్ర, సాంకేతికం, భూవిజ్ఞానం 4. రవిశంకర్ ప్రసాద్- కమ్యూనికేషన్లు, ఐటీ 5. నిర్మలా సీతారామన్- వాణిజ్యం 6. నితిన్ గడ్కారీ - రోడ్డు రవాణా 7. ప్రకాశ్ జవదేకర్ - పర్యావరణం, అడవులు 8. నరేంద్రసింగ్ తోమర్ - ఉక్కు, గనులు -
తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా
-
ఢిల్లీ బయలుదేరనున్న దత్తన్న
హైదరాబాద్: నరేంద్ర మోడీ కేబినెట్లో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు బర్త్ ఖరారైందని సమాచారం. ఆదివారం న్యూఢిల్లీలో ఉండాలని ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఉదయం దత్తాత్రేయకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం దత్తత్రేయ న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఆదివారం మోడీ తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎంపీ సీటును బీజేపీ కేవసం చేసుకుంది. అది సికింద్రాబాద్ నుంచి బండారు దత్తత్రేయ గెలుపొందిన విషయం విదితమే. అలాగే బీజేపీ పొత్తులో బరిలో దిగిన టీడీపీ అభ్యర్థుల్లో కూడా ఒక్కరే అది సీహెచ్ మల్లారెడ్డి మల్కాజ్గిరి నుంచి గెలుపొందారు. మల్లారెడ్డికి మోడీ కేబినెట్ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయిన మీడియాలో ఇటీవల కథనాలు వెల్లువడ్డాయి. అయితే మోడీ మాత్రం బండారు దత్తాత్రేయ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. అదికాక బండారు దత్తాత్రేయకు గతంలో కేంద్ర సహాయమంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉన్న సంగతి తెలిసిందే. -
కేబినెట్లోకి దత్తాత్రేయ
రేపు రాష్ర్టపతిభవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యక్రమం ఢిల్లీ రావాలని దత్తన్నకు పిలుపు శివసేనకు రెండు బెర్తులు టీడీపీ నుంచి సుజనా, రామ్మోహన్ నాయుడుల్లో ఒకరికి చాన్స్ కొత్తగా పది మందికి అవకాశమివ్వనున్న ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణకు బెర్త్ దాదాపు ఖాయమైంది. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు శుక్రవారం రాత్రి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి పిలుపు వచ్చినట్లు తెలిసింది. కేబినెట్ విస్తరణలో సీటు ఖరారైందని, విస్తరణ సందర్భంగా ఆదివారం పీఎంఓలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే తేనీటి విందుకు రావాల్సిందిగా ఆ కార్యాలయ వర్గాలు దత్తన్నను ఆహ్వానించాయని సమాచారం. విస్తరణ సమాచారం బయటకు వచ్చినప్పటి నుంచి ఉత్కంఠగా గడిపిన కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ గురువారం ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెనుదిరిగి వస్తుండగా ఆయనకు పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ చేరుకున్న ఆయన పీఎంఓ ఆహ్వానంపై శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళుతున్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా కేంద్ర కేబినెట్లో స్థానం కావాలని ఇక్కడి బీజేపీ నేతలు పట్టుబట్టడం, ఈ ప్రాంతంలో ఆపార్టీకి ఉన్న ఏకైక ఎంపీ దత్తాత్రేయ ఒక్కరే కావడం ఆయన కు కలిసొచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. దత్తాత్రేయ 1998-2002 మధ్య కేంద్రంలో పట్టణాభివృద్ధి సహాయ మంత్రిగా, 2002-2004 మధ్య రైల్వే శాఖసహాయ మంత్రిగా పనిచేశారు. శివసేనకు రెండు బెర్తులు: కేంద్ర కేబినెట్ తొలి విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. బీజేపీ నుంచి పలువురు కొత్త ముఖాలతో పాటు మిత్రపక్షాలైన శివసేన, టీడీపీకి కూడా కేబినెట్లో చోటు దక్కనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ర్టపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోవా సీఎం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ బాధ్యతలతో పాటు కొత్తగా పది మందికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున పంజాబ్ నుంచి తొలిసారి నెగ్గిన విజయ్ సాంప్లా, సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా, హర్యానా నుంచి జాట్ నేత బీరేందర్‌సింగ్, బీహార్ నుంచి గిరిరాజ్‌సింగ్ లేదా భోలా సింగ్, రాజ్‌స్థాన్ నుంచి కల్నల్ సోనారామ్ చౌదరీ, గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ర్ట నుంచి హన్స్‌రాజ్ అహిర్‌తో పాటు సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీకి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డాకు కూడా బెర్తు దక్కొచ్చని తెలుస్తోంది. తొలి వంద రోజుల పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రుల శాఖలను మార్చి, కొంతమందిని కేబినెట్‌నుంచి తప్పించే అవకాశముంది. కొత్తగా కేబినెట్లో చేరనున్న వారికి.. మోదీ ఇచ్చే టీవిందుకు రావాలని పీఎంఓ ఫోన్లు చేసింది. వీరిలో గిరిరాజ్రాజ్, అహిర్, సాంప్లా తదితరులు ఉన్నట్లు సమాచారం. కాగా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తాను అదనంగా నిర్వహిస్తున్న రక్షణ శాఖను వదులుకోనున్నానన్నారు. శివసేన మెత్తబడినట్లే!:శివసేనకు కేబినెట్లో రెండు బెర్తులు ఖాయం చేయడంతో ఆ పార్టీ మెత్తబడింది. బీజేపీ తమకిచ్చిన హామీని నిలబెట్టుకుంటోందని, అయితే దీనిపై పార్టీలో విస్తృత చర్చ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని శివసేనకు చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. మహారాష్ర్టలో మైనారిటీ బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో శివసేన తర్జనభర్జన పడుతుతుండడం తెలిసిందే. ఈ నెల 12న అసెంబ్లీలో జరిగే విశ్వాసపరీక్షలో బీజేపీకి శివసేన మద్దతు అవసరం. అయితే అందుకు ఆ పార్టీ డిమాండ్లపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు దగ్గరయ్యే అవకాశముంది. శివసేన నేతలు, సురేశ్ ప్రభు, అనిల్ దేశాయ్‌లకు బెర్తులు ఖరారయ్యాయని సమాచారం. రైల్వే మంత్రి సదానంద గౌడను తప్పించి, దాన్ని ప్రభుకు అప్పగించే అవకాశముంది. మరోవైపు ఏపీ నుంచి రమరో మిత్రపక్షం టీడీపీ నుంచి సుజనాచౌదరికి గానీ, కేంద్ర మాజీ మంత్రి ఎర్రంనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకు గానీ అవకాశం రానుంది. పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవ్దేకర్కు కేబినెట్ హోదా కట్టబెట్టనున్నారని సమాచారం. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వాణిజ్యశాఖను స్వతంత్ర హోదాలో నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌కు కేబినెట్ హోదా దక్కే అవకాశాలున్నాయి. -
బడ్జెట్‌పై ప్రముకుల విమర్శలు
బీసీల అభివృద్ధిని గాలికొదిలేసింది: దత్తాత్రేయ బడ్జెట్లో బీసీలకు రూ.2,022 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదు. బీసీల సమగ్ర అభివృద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఈ బడ్జెట్ కేటాయింపులను చూస్తే అర్థమవుతోంది. రూ.25 వేల కోట్లతో బీసీల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్న టీఆర్ఎస్ తన ఎన్నికల హామీని నిలబెట్టుకోలేదు. ప్రతి ఏటా వెయ్యికోట్లతో బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూత అందిస్తామన్న హామీని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ మాత్రం స్పష్టత లేదు : జానారెడ్డి తెలంగాణ మొదటి బడ్జెట్ నిస్సారంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు. చాలా అంశాలపై స్పష్టత లేదు. రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, కరెంటు, కరువు మండలాల ప్రకటన ఇవేవీ బడ్జెట్లో లేవు. ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్య శ్రీ, ఎస్టీలకు, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్, డబుల్ బెడ్రూంల ఇళ్ల నిర్మాణం, నిలిచిపోయిన 5 లక్షల ఇళ్ల బిల్లుల చెల్లింపులు వంటి అంశాలను విస్మరించారు. అన్ని వర్గాలనూ మోసం చేసే బడ్జెట్ తెలంగాణ తొలి బడ్జెట్ అన్నివర్గాలను మోసం చేసే విధంగా ఉంది. కమీషన్ల బడ్జెట్‌గానే కనిపిస్తోంది తప్ప ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందేలా లేదు. కొడుకు, అల్లుడిని సంతృప్తి పరిచేలా వారి శాఖలకే భారీగా కేటాయింపులు జరిగాయి. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కేటాయింపులున్నాయి. ప్రాధాన్యతా రంగాలను పూర్తిగా విస్మరించారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. - ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల హామీలకు బడ్జెట్‌కు పొంతన లేదు టీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు, వాగ్దానాలకు భిన్నంగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ మొత్తం అంకెల గారడీగా, కొత్త సీసాలో పాత సారాలా ఉంది. ఏ రంగం పైనా స్పష్టత లేదు. రైతు ఆత్మహత్యలు, కరువు నివారణ చర్యల్ని ప్రస్తావించలేదు. గొప్పలకు పోయి రూ. లక్ష కోట్ల బడ్జెట్ ప్రకటించారే తప్ప ఆదాయ వన రులు సమకూర్చడంపై స్పష్టత ఇవ్వలేదు. - డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే కేటాయింపులు ఘనం.. రాబడి శూన్యం బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయింపులు ఘనంగా కనిపిస్తున్నా.. ఆదాయ రాబడి మాత్రం శూన్యంగా ఉంది. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా..రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. క నీసం నివారణ చర్యల ప్రస్తావన లేకపోవడం సరికాదు.ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణను విస్మరించారు. -సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే ప్రచారం ఆకాశమంత, ఆచరణ అణువంత ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వాగ్దానాల అమలు, అధికారంలోకి వచ్చాక చేసిన వాగ్దానాల అమలు ఊహాలోకంలో ఉంటుందేమో. తొలి బడ్జెట్లో ప్రచారానికి, ఆచరణకు పొంతన లేదు. ప్రచారం ఆకాశమంత, ఆచరణ అణువంతగా ఉంది. రంగాల వారీగా కేటాయింపులు ప్రాధాన్యతకు నోచుకోకపోవడం దురదృష్టకరం. - చాడ వెంకటరెడ్డి, సీపీఐ తెలంగాణ కార్యదర్శి బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం. టీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా మంత్రి ఈటెల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లుంది. ఈ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత లభించింది. మైనార్టీలకు భారీగా కేటాయించడం అభినందనీయం. - అక్బరుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ శాసనసభా పక్ష నేత మహిళలకు నిరాశ మిగిల్చిన బడ్జెట్ ‘‘బడ్జెట్ మహిళలకు నిరాశే మిగిల్చింది. లక్షకోట్లకు పైగా కేటాయింపులతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళా,శిశుసంక్షేమశాఖకు కేటాయించింది నామమాత్రం రూ. 221 కోట్లు మాత్రమే. ప్రభుత్వం స్త్రీ,పురుష జనాభా నిష్పత్తి ఆధారంగా బడ్జెట్‌ను అమలుచేయాలి. మహిళల సమగ్రాభివృద్ధి చెందేలా కేటాయింపులుండాలి.’’ - ఐద్వా నేతలు ఆశాలత, టి.జ్యోతి, హైమావతి తొలి బడ్జెట్ నిరుత్సాహ పర్చింది తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ నిరుత్సాహపర్చింది. బడ్జెట్లో రైతు ఆత్మహత్యల నివారణ చర్యల ప్రస్తావన లేకపోవడం శోచనీయం. రైతాంగ సమస్యలపై స్పష్టత, విద్యుత్ సమస్యపై తగిన ప్రతిపాదనలు లేవు. భవిష్యత్‌లో విద్యుత్ కష్టాలు కొనసాగుతాయన్న సంకేతాలిచ్చారు. గృహ నిర్మాణం, పెన్షన్లకు నిధులు తగ్గించడం చూస్తే.. భారీ కోత తప్పదని స్పష్టమవుతోంది. - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరికీ నిరాశే మిగిల్చింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, కొలువులు, ఇళ్లు అందుబాటులోకి వస్తాయని ఆశించిన వారందరికీ బడ్జెట్ నిరాశే మిగిల్చింది. ఆర్థికవ్యవస్థకే సవాల్ విసురుతున్న విద్యుత్‌కు వెయ్యికోట్లే కేటాయిస్తే ప్రస్తుత సంక్షోభం తీరేదెలా? కొలువుల ప్రస్తావనే లేదు, ఒక్క కొత్త నోటిఫికేషన్ ప్రకటించలేదు. ఫాస్ట్ పథకం ఊసే లేదు, స్కాలర్షిప్లు, సంక్షేమ హాస్టళ్లలో వసతులు, కేజీ టు పీజీ ఉచిత విద్యకు అత్యల్పంగా కేటాయించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కార్యాలయంలో ఛేజింగ్ సెల్ ఏర్పాటుచేస్తే ప్రజలు ఆశలు కొంతైనా తీరే అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం సిద్ధపడాలి. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం కార్యదర్శి తగిన నిధుల కేటాయింపుల్లేవ్ తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్లో పలు రంగాలకు తగిన స్థాయిలో నిధుల కేటాయింపు జరగలేదు. బడ్జెట్ ఆహ్వానించదగినదే అయినప్పటికీ నీటిపారుదల, రక్షిత మంచి పథకాలు, గిరిజనాభివృద్ధి తదితర రంగాలకు నిధుల కేటాయింపులు సరిగ్గా జరగలేదు. కరువు, రైతుల ఆత్మహత్యల నివారణపై స్పష్టత లేదు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ ప్రకారం ప్రాధాన్యత రంగాలకు నిధుల కేటాయింపులు జరగాలి. ప్రస్తుతం కేటాయించిన నిధులు సైతం పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. -రవీంద్రకుమార్, సీపీఐ ఎమ్మెల్యే 22 ఏళ్ల తరువాత తెలంగాణ ఆర్థిక మంత్రి బడ్జెట్ సాక్షి, హైదరాబాద్: శాసనసభలో 22 సంవత్సరాల తరువాత తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1992లో శనిగరం సంతోష్‌రెడ్డి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో తొలి బడ్జెట్‌ను ఈటెల రాజేందర్ సభ లో ప్రవేశపెట్టడం విశేషం. 1956 తరువాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ మంత్రుల్లో మర్రి చెన్నారెడ్డి(1965-67), నూకల రామచంద్రారెడ్డి(1974), జి. రాజారామ్ (78-81), పి. మహేంద్రనాథ్(85-88), కె.రాజయ్య(1989), సంతోష్‌రెడ్డి(91-92)లు ఉన్నారు. టీఆర్ఎస్ కరపత్రంలా ఉంది బడ్జెట్ పుస్తకం కేవలం టీఆర్ఎస్ కరపత్రంలా ఉంది. కాగితాల మీద లెక్కలేగానీ.. ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. వనరులు కల్పించాలన్న చిత్తశుద్ధితో కాకుండా.. కరపత్రం మాదిరిగా ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్ ఉంది. టీఆర్ఎస్ నేతల లక్షణాలు, మాటలు, లెక్కలు అన్నీ అంకెల గారడీయే. వాళ్లు ప్రస్తావించిన వాటినే మేం సభలో లేవనెత్తుతాం. - డి. శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత కేటాయింపులు బాగున్నాయి ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్లో కేటాయింపులు బాగానే ఉన్నాయి. ఈ రెండు ఉప ప్రణాళికల్లో నిధుల కేటాయింపు కూడా సరిగానే ఉంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్ పథకాలకు నిధుల కేటాయింపు, దళిత పారి శ్రామికవేత్తలకు రూ.వంద కోట్లు కేటాయించడం బాగుంది. అయితే వీటిని సక్రమంగా ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలి. - మల్లేపల్లి లక్ష్మయ్య, ఫౌండర్ ప్రెసిడెంట్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బీసీలకు న్యాయం జరగలేదు బడ్జెట్లో బీసీలకు తగిన ప్రాధాన్యత లభించలేదు. బీసీ,ఎస్సీ,ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధుల కేటాయింపులు జరగలేదు. బడ్జెట్ అన్ని వర్గాలనూ నిరాశపర్చింది. ఉపాధి, ఉద్యోగ అవకాశా లపై స్పష్టమైన హామీ లభించలేదు. విద్యుత్ సంక్షోభంపై వాస్తవ పరిస్థితిని ప్రతిపక్షాలతో చర్చించకుండా దాట వేసే ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. - ఆర్.కృష్ణయ్య, టీడీపీ ఎమ్మెల్యే -
త్వరలో రాష్ట్రానికి కేంద్ర కమిటీ
న్యూఢిల్లీ: బీజేపి ఎంపి బండారు దత్తాత్రేయ ఈరోజు ఇక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్‌ను కలిశారు. తెలంగాణలో రైతుల పరిస్థితిని, వారి ఆత్మహత్యల సంఘటనలను మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతుల ఆత్మహత్యల అధ్యయనానికి త్వరలో కేంద్ర కమిటీని పంపుతామని మంత్రి చెప్పినట్లు తెలిపారు. కేంద్ర కమిటీ ఆత్మహత్యలపై అధ్యయనం చేసి, కేంద్రానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తి రైతులను దళారులు మోసం చేస్తున్నారని చెప్పారు. దీనిని అరికట్టాలన్నారు. బేగంపేట విమానాశ్రయాన్ని వైమానిక శిక్షణాకేంద్రంగా మార్చాలని దత్తాత్రేయ కోరారు. ** -
టీ అమ్మిన వ్యక్తి ప్రధాని
హైదరాబాద్: పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితోనే టీ అమ్మిన వ్యక్తి ప్రధాని అయ్యారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ మాటలు అన్నారు. దీనదయాళ్ 98వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు భవిష్యత్ లేదన్నారు. మతం గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినట్లు నిరుపిస్తారా? అని ప్రశ్నించారు. అమలుకు సాధ్యంకాని హామీలను టిఆర్ఎస్ ఇచ్చిందని విమర్శించారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ దీనదయాళ్ స్ఫూర్తితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎంపి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ 2019లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. టిఆర్ఎస్పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ** -
విమోచనం.. రణరంగం
గోల్కొండపై జెండా ఎగురవేసేందుకు బీజేపీ యత్నం.. అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత, తోపులాట... లాఠీలు ఝుళిపించిన ఖాకీలు లంగర్‌హౌస్‌లో రోడ్డుపైనే బైఠాయించిన నేతలు కిషన్‌రెడ్డితో పాటు కీలక నేతల అరెస్టు ఉద్యవూలను అణచడానికి ప్రభుత్వం కుట్ర : కిషన్‌రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారు : ఎంపీ దత్తాత్రేయు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం బీజేపీ శాంతియుతంగా తలపెట్టిన ర్యాలీ మార్గమధ్యలో రణరంగంగా మారింది. లంగర్‌హౌస్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో తోపులాట, వాగ్వివాదాల నడుమ పోలీసులు లాఠీలు ఝుళి పించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు బాపూఘాట్ వద్ద రాంలీలా మైదానం నుంచి బీజేపీ శ్రేణులు పెద్దెత్తున అగ్రనాయకుల ఆధ్వర్యంలో దండుగా బయలుదేరారు. లంగర్‌హౌస్ రాంలీలా మైదానంలో సభ నిర్వహించిన అనంతరం 11 గంటలకు ర్యాలీ కదిలింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ముందు నడువగా వాహనంపై నుంచి బండారు దత్తాత్రేయ, నాగం జనార్ధన్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, డాక్టర్ లక్ష్మణ్‌లు మైక్‌లో పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ముందుకుసాగారు. ర్యాలీ లంగర్‌హౌస్ ఫై ్లఓవర్ చౌరస్తా వద్దకు రాగానే గోల్కొండ కోట వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పురావస్తు శాఖ నుంచి అనుమతి లేద ని చెప్పడంతో కార్యకర్తలు పోలీసులను తోసేసి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో డీసీపీ సత్యనారాయణతో పాటు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. లాఠీచార్జి, తోపులాటలో ఆర్కెపురానికి చెందిన శేఖర్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోగా, ప్రమోద్ అనే యువకుని చెయ్యి విరిగింది. దీంతో ఆగ్రహించిన బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇతర నాయకులతో కలసి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు వినిపించకుండా జనరేటర్‌ను ఆఫ్ చేసి మైక్ పనిచేయకుండా చేశారు పోలీసులు. అనంతరం ధర్నాలో కూర్చున్నవారిని బలవంతంగా అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు. ‘కోట’ వద్ద హడావుడి.... తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగరవేస్తామని బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. కోటలోకి వెళ్లే దారులన్నింటినీ మూసివేసి ఆ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తలు పోలీసుల దృష్టి మళ్లించేందుకు రకరకాల ఎత్తులు వేశారు. అయితే... పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి కార్యకర్తలను అడ్డుకొని అదుపులోకి తీసుకొన్నారు. కొందరు యువకులు జట్లు జట్లుగా గల్లీల్లోంచి దూసుకువచ్చి భారత్ మాతాకీ జై... అంటూ నినదిస్తూ కోట ముందు ప్రత్యక్షమవ్వడంతో పోలీసులు ఖంగుతిన్నారు. అప్రమత్తమై అడ్డుకునేందుకు ప్రయత్నించగా కొందరు తప్పించుకొని కోటలోకి ప్రవేశించారు. పోలీసులు వారిని వెంటాడి అరెస్ట్ చేశారు. సత్తా చాటాం... దిగ్భందాలను ఛేదిస్తూ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో బీజేపీ తన సత్తాచాటిందని ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, టోలీచౌకి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పోలీసుల వలయూన్ని దాటుకొని కోటలోకి ప్రవేశించి జెండా ఎగురవేశారు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్ జెండా ఎగురవేసిన చోటే వీరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌లో వీరున్న విషయాన్ని తెలుసుకున్న ఎంపీ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు నాయకులు అక్కడికి చేరుకొని శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణలను అభినందించారు. ఉద్యమాలను అణచడానికి కుట్ర : కిషన్‌రెడ్డి ఉద్యమ పార్టీగా పోరాటాలు చేసి విద్యార్థుల బలిదానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసేందుకు యత్నిస్తోందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసేందుకు వెళ్తున్న కిషన్‌రెడ్డి, ఇతర వుుఖ్య నాయుకులతోపాటు సుమారు 400 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేసి గోషామహల్ పోలీస్స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, విద్యార్థులపై లాఠీచార్జిలు చేసి ప్రభుత్వం ఉద్యమాలను నియంత్రించేందుకు యత్నిస్తోందన్నారు. ప్రభుత్వం ఎంత అణిచివేయాలని చూస్తే అంతకు రెట్టింపు ఎగిసిపడుతుందన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించే వరకు బీజేపీ దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు. విమోచన దినోత్సవ వేడుకలను ఊరూరా తీసుకువెళ్లి నిజాంల పాలనలో జరిగిన దురాగతాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. శాసన సభాపక్ష నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత దాన్ని ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరె స్టుచేయడం శోఛనీయమన్నారు. మతోన్మాద మజ్లీస్ వత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అనంతరం పోలీసులు సొంత పూచీకత్తుపై బీజేపీ నాయకులు, కార్యకర్తలను వదిలిపెట్టారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కార్పొరేటర్లు దిడ్డిరాంబాబు, జి.శంకర్‌యాదవ్, మెట్టు వైకుంఠం, ఆలె జితేంద్ర, కన్నె ఉమాదేవి, సహదేవ్‌యాదవ్, రంజనాగోయల్, మాజీ కార్పొరేటర్ ఎన్.సాంబశివగౌడ్, ఎల్బినగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆకుల రమేష్‌గౌడ్, బీజేపీ నాయకులు జి.ఆనంద్‌గౌడ్, జిగ్నేష్జోషి, కన్నె రమేష్‌యాదవ్, గోపాల్జీ, అచ్చిని రమేష్, బాల్‌రాజ్,కె.శ్రీనివాస్,బ్రహ్మచారి, అరుణజ్యోతి, విజి తారెడ్డి, ఉప్పల శారదలతోపాటు పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: ఎంపీ దత్తాత్రేయు బాపూఘాట్ వద్ద రాంలీలా మైదానంలో ర్యాలీని ప్రారంభించే వుుందు జరిగిన సభలో ఎంపీ దత్తాత్రేయు వూట్లాడుతూ టీఆర్ఎస్ తీరుపై వుండిపడ్డారు. ‘చరిత్రను అపహాస్యం చేసేవారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. చరిత్రకు మతానికి సంబంధం లేదు. భారతదేశంలో జరి గిన పోరాటాన్ని మీరు గౌరవించరా..? రజాకార్ల మనస్తత్వం కలిగిన ఎంఐఎంతో టీఆర్ఎస్ జత కట్టింది. అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించేందుకు ముఖ్యమంత్రి నిరాకరించారు’ అని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించట్లేదని కేసీఆర్‌ను తాము అడిగితే... ఆయ న నుంచి సమాధానమే లేదని తెలిపారు. తెలంగాణ అచ్చమైన, స్వచ్ఛమైన ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తుందం టే సీఎం నిజ స్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి రాగానే స్వార్థంతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతతత్వ శక్తుల వత్తిడికి లోబడి వేడుకల పట్ల పక్షపాతం వహించారని, దీన్ని తిప్పికొట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చరిత్రను విస్మరించే వీల్లేదు : చంద్రబాబు సెప్టెంబర్ 17భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ విలీ నం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, చరిత్రను విస్మరించేందుకు వీల్లేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించి విలీన దినోత్సావాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బిడ్డా... రేపు మాదే ‘గోల్కొండ కోటపై జెండా ఎగరేసేందుకు వెళుతున్న బీజేపీ శ్రేణులను అరెస్టు చేస్తే బిడ్డా... రేపు మా ప్రభుత్వం వస్తది, అప్పుడు మీపై చర్యలుంటయ్’ అంటూ బీజేపీ నాయకుడు నాగం జనార్థనరెడ్డి వేదికపై నుంచి కేసీఆర్‌కు హెచ్చరికలు చేశారు. 2010లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని, లేదంటే ఎంతకైనా తెగిస్తా.. పోరాడుతా ? అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘నీ శరీరంలో చీము నెత్తురు ఉందా... లేక మొత్తం దేంతోనైనా నిండిపోయిందా..? ఆరోజేమో తెగి స్తానన్నావ్. ఈ రోజు కాళ్లు బార్లా తెరుచుకొని పడుకొన్నవ్. మహారాష్ట్ర , కర్ణాటకల్లో ఈ రోజు పండుగ చేసుకొంటుంటే... ఇక్కడేమో అడ్డుకున్నవ్. చరిత్ర నిన్ను క్షమించదు’ అని నాగం ఘాటుగా విమర్శించారు. జిల్లాల్లో విమోచనం నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో బుధవారం విమోచనదినోత్సవాన్ని ఘనం గా జరుపుకున్నారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నిం చగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిజామాబాద్‌లో ఏబీ వీపీ, టీజీవీపీ, బీజేవైఎం నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), టీఆర్ఎస్, ఏబీవీపీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో పోలీసులు బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. జాతీయ జెండాలను పట్టుకొని బీజేపీ నాయకులు కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వరంగల్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. కరీంనగర్ జిల్లాలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలపై బీజేపీ ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు. -
ఘనంగా రన్ ఫర్ ఇండియా రన్ ఫర్ యూనిటీ
-
ఎన్జీ రంగాకు భారతరత్న ఇవ్వాలి: దత్తాత్రేయ
హైదరాబాద్, న్యూస్‌లైన్: నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి రైతు పక్షాన నిలబడిన ఎన్జీ రంగాకు భారతరత్న ఇవ్వాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్ చేశారు. స్థానిక బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆచార్య ఎన్ జీ రంగా 114వ జయంతి జరిగింది. సభలో దత్తాత్రేయ మాట్లాడుతూ, 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం సాధించడంలో రంగా పాత్ర మరువలేనిదన్నారు. వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎందరో ప్రముఖులను రాజకీయాల్లో తీర్చి దిద్దిన ఘనత రంగాకే దక్కిందన్నారు. మాజీ ఎమ్మెల్యే శివరాంరెడ్డి, భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పెద్దిరెడ్డి చెంగలరెడ్డి, ఎన్జీ రంగా అభిమానులు పాల్గొన్నారు. -
ఐక్యతతోనే రాజ్యాధికారం: డి.శ్రీనివాస్
బీసీల రాష్ట్ర స్థాయి సదస్సులో పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ పార్టీలకతీతంగా సంఘటితం కావాలి యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలి: దేవేందర్‌గౌడ్ జాతీయ పార్టీలతోనే సామాజిక న్యాయం: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల్లో పూర్తిస్థాయి ఐక్యత వచ్చినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఇందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ వ్యక్తి పార్టీలకతీతంగా సంఘటితం కావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం జూబ్లీహాల్లో రాష్ట్రస్థాయి బీసీల సదస్సు జరిగింది. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సులో డీఎస్ మాట్లాడుతూ.. బీసీలలో చైతన్యం బాగా పెరిగిందని, హక్కుల సాధన కోసం సీఎంలను కూడా నిలదీసే స్థాయికి ఎదిగారని అన్నారు. ఇదే స్ఫూర్తితో అందరూ ఏకమై రాజ్యాధికారం దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు సబ్‌ప్లాన్ తప్పక సాధించి తీరుతామని, కృష్ణయ్య చేస్తున్న పోరాటం ఫలించే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. బీసీలు సాధించాల్సింది చాలా ఉందని, ఇందుకు ప్రతి బీసీ వ్యక్తి సైనికుడిలా పనిచేయాలని కోరారు. మరో మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బీసీలు ఏ వర్గానికీ తీసిపోరని, ఎవరికంటే బలహీనులు కారని చెప్పారు. త్వరలోనే బీసీల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. బీసీలకు సబ్‌ప్లాన్ కాకుండా స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్ కింద లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. బీసీలకు రాయితీలివ్వాలని ప్రభుత్వాలను అడగడం సిగ్గుగా ఉందని, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలని టీడీపీ ఎంపీ దేవేందర్‌గౌడ్ అన్నారు. ఈ దేశం ఎవరి జాగీరు కాదని, ఉత్పత్తిని సృష్టించే కులాలు రాజ్యాధికారాన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. సదస్సులో ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం దక్కాలని, దశాబ్దాలుగా అధికార స్థానాలపై తిష్టవేసిన వారిని సాగనంపాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా బీసీల కోసం ఉద్యమిస్తున్న కృష్ణయ్యను పార్లమెంటుకు పంపాలన్నారు. జాతీయ పార్టీలతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీలు లేని పార్టీలు దేశంలో లేవని, 2014 ఎన్నికలను బీసీలే శాసించాలని ఆకాంక్షించారు. తమ పార్టీ తరఫున బీసీ అయిన మోడీని ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించామని చెప్పారు. ఈ సదస్సులో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్, ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, పలు బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయ శక్తిగా బీసీ ఉద్యమం: ఆర్.కృష్ణయ్య దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రూపుదిద్దుకున్న బీసీ ఉద్యమాన్ని త్వరలోనే రాజకీయ శక్తిగా మారుస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీల రాష్ట్రస్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా మార్చేందుకు డిసెంబర్ 15న హైదరాబాద్‌లోని నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభనే వేదికగా చేసుకుంటామని చెప్పారు. దొరల రాజ్యం కూలిపోయి బడుగుల రాజ్యం వచ్చేరోజు తొందర్లోనే ఉందన్నారు. వచ్చేది బీసీల రాజ్యమేనని, ఆ దిశలో తగిన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించని రాజకీయ పార్టీలను రాబోయే ఎన్నికల్లో పాతరేస్తామని చెప్పారు. అన్ని బిల్లులు తెస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీల బిల్లు ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల తర్వాత బీసీని ముఖ్యమంత్రిని చేయకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సదస్సు తీర్మానాలివే.. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో యూపీఏ ప్రభుత్వం బీసీల కోసం బిల్లు తేవాలి. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలి. జనాభా ప్రాతిపదికన 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయిస్తూ విధాన నిర్ణయం తీసుకోవాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణచేయాలి. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు కూడా అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు బీసీల బడ్జెట్‌ను రూ.20వేల కోట్లకు పెంచాలి. -
తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటించాలి: జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు, రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం వెంటనే రోడ్‌మ్యాప్ ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేబినేట్ నోట్ తయారీకే నెల రోజులు పడితే బిల్లు తయారీకి ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించారు. ఢిల్లీలో పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు జేఏసీ నేతలు కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య మంగళవారం బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, దత్తాత్రేయ, రాజేశ్వరరావు, అశోక్‌కుమార్ యాదవ్ తదితరులతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం లక్ష్మయ్యతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు ఎలా న్యాయం చేయబోతున్నారో కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా ప్రకటించి అక్కడి నేతల నోళ్లకు తాళం వేయించాలని డిమాండ్ చేశారు. సీమాం ధ్ర రాజధానికి ఎంత ఖర్చయినా వెనకాడబోమని కేంద్రం చెప్పాలన్నారు. సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను లక్ష్మయ్య ఖండించారు. విభేదాలను పక్కనబెట్టి జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాలకు హాజరుకావాలన్న కోదండరాం వినతి మేరకు బీజేపీ నేతలు మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. విభేదాలను పరిష్కరించుకునేందుకు బుధవారం సాయంత్రం మరోసారి సమావేశం కావాలని వారు నిర్ణయించారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. -
'దేశభవిష్యత్‌ను మార్చే డైనమిక్ లీడర్ మోడీ'
హైదరాబాద్: దేశభవిష్యత్‌ను మార్చే డైనమిక్ లీడర్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఎల్ బి స్టేడియంలో ఏర్పాటు చేసిన 'నవభారత యువభేరీ' బహిరంగ సభలో మోడీని నగర బిజెపి కమిటీ సత్కరించింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ ఆయన మాట్లాడారు. బుల్లెట్ కంటే శక్తివంతమైన బ్యాలెట్ ద్వారా మోడీ నాయకత్వంలో మార్పు తీసుకువద్దామని పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వంలేదు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు ప్రాంతాలవారీగా రెండుగా విడిపోయారు. రాజకీయ సంక్షోభం నెలకొంది. నేతలు రెండుగా విడిపోయారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని దత్తాత్రేయ అన్నారు.